వైరుధ్యం
సెప్టెంబర్ 30, 2026
వైరుధ్యం (vairudyam)
అర్థము
(విశేష్యము) : అనుకూలత/పొంతన లేకపోవడం; వ్యతిరేకం
Meaning
(noun) : contradiction; inconsistency
వాడుక / Usage
అయితే ఇక్కడే కథలో ఒక ఆసక్తికరమైన వైరుధ్యం కనిపిస్తుంది.
But there is an interesting contradiction in the story.
మెదడుకు మేత / Food for thought
రాణిని ఒక వస్తువుగా చూసే కథానాయకుడి చూపును విమర్శించాలనుకుంటూనే, రాణి పాత్రను కూడా చివరికి అతని చూపుకే పరిమితం చేస్తుంది కథ. రాణి ఒక సంపూర్ణ వ్యక్తిగా కాకుండా కథానాయకుడి ఆత్మపరిశీలనకు అవసరమైన సంకేతాల సమాహారంగా మిగిలిపోతుంది. ఆమె గురించి మనకు తెలిసేదంతా దాదాపు అతని ఊహల ద్వారానే. ఆమె నిజంగా ఏం అనుకుంది? ఆమె జీవితం ఏమిటి? ఆమె ఎందుకు ఆ వీధిలోకొచ్చింది? జర్నలిస్టుపై ఆమెకు నిజంగా ప్రేమా, ఆకర్షణా, లేక సరదాగానే మాట్లాడడమేనా? వీటిలో దేన్నీ కథ నిర్ధారితంగా చెప్పదు.
-- బాలాజీ పోతుల, eemata
Comments
Post a Comment