అనిశ్చితి
అక్టోబర్ 01, 2026
అనిశ్చితి (anischithi)
అర్థము
(విశేష్యము) : నిశ్చయము (నిర్ణయం, సిద్ధాంతం, ఖాయము) లేకపోవడం
Meaning
(noun) : lack of certainty, resolution or purpose
వాడుక / Usage
ఇది ఒకవైపు కథకు అనిశ్చితిని ఇస్తుంది.
That introduces uncertainty in the story.
మెదడుకు మేత / Food for thought
మరోవైపు కథ చివర్లో రచయిత ఆమెను గురించిన ఖచ్చితమైన నిర్ణయాలు చెప్పడం వల్ల ఆ అనిశ్చితి దెబ్బ తింటుంది. ఉదాహరణకు, ఆ పిల్లవాడు “అక్కా” అని పిలిచినప్పుడు ఆమె స్పందనను ఆధారంగా చేసుకుని ‘ఆమె ఎవరికో అక్క, ఎవరికో చెల్లి, ఎవరికో కూతురు, ఎవరికో ప్రియురాలు కావాలనుకుంటోంది’ అని కథకుడు తేల్చడం కొంత అతివ్యాఖ్యానంలా తోస్తుంది. ఒక చూపు అంతటి జీవిత చరిత్రకు సాక్ష్యం కాబోదు. కథానాయకుడి అపరాధభావనవల్ల పుట్టిన ఊహను రచయిత సత్యంగా చెప్పకపోతే కథ మరింత శక్తివంతంగా ఉండేది.
-- బాలాజీ పోతుల, eemata
Comments
Post a Comment