అదుపు
సెప్టెంబర్ 18, 2026
అదుపు (adupu)
అర్థము
(విశేష్యము) : హద్దు; కట్టుబాటు; నియమము; నిర్బంధము
Meaning
(noun) : control; limits; rule; custody
వాడుక / Usage
మువ్వల బొమ్మా ముద్దుల గుమ్మా గడపా దాటీ నడిచేవేళ, అదుపే విడిచీ ఎగిరే వేళ.
Beautiful lass, dolled with anklets, crossed the threshold breaking shackles ready to fly.
మెదడుకు మేత / Food for thought
అరిషడ్వర్గము తెగనరికె హరి ఖడ్గమ్మిది నందకము
బ్రహ్మ లోకమున బ్రహ్మాభారతి నాదాశీస్సులు పొందినదై
శివలోకమ్మున చిద్విలాసమున డమరుధ్వనిలో గమకితమై
దివ్యసభలలో నవ్యలాస్యముగ పూబంతిల చేబంతిగ ఎగసి
నీరదమండల నారద తుంబుర మహతీదాసుల మహిమలు తెలిసి
శితహిమ గంధర యతిరాజస్సభలో తపః ఫలమ్ముగ తలుకుమని
తల్లితనముకై తల్లడిల్లు ఆ లక్కమాంబ గర్భాశయమ్ములో
ప్రవేశించె ఆ నందకము నందనానంద తారకము
అన్నమయ్య జననం ఇది అన్నమయ్య జననం ఇది అన్నమయ్య జననం

-- అన్నమయ్య, వేటూరి
Comments
Post a Comment