అభినయము
అక్టోబర్ 19, 2026
అభినయము (abhi-nayamu)
అర్థము
(విశేష్యము) : నటన; మనోభావాన్ని మాటలతో గాక చేతలతో చూపించడం
Meaning
(noun) : theatrical action; gesticulation
వాడుక / Usage
జగన్నాథం బాధపడుతున్న వాడల్లే అభినయం సాగించాడు.
Jagannatham continued to act like he was suffering.
మెదడుకు మేత / Food for thought
చివరికి మిగిలిందేది? మంచికి కావాల్సింది మూడు; ప్రేమ, ధనం, కీర్తి. మొదటిది యవ్వనంలో, చివరిది చివరిలో, రెండోది ఎప్పుడూ కావాల్సింది. రెండోది ఉంటే మొదటిది, చివరిదీ యిట్టే లభ్యమౌతాయి అనాలి. కానీ అతనికేం కావాలో అతనికి తెలీక, ఇప్పుడతనికి ఏమీ అక్కర్లేదు! ప్రేమా!
నీరసించిన నరాలు, కాలే నుదురు, ఎండిన నాలుకా....దానికోసం దగాలు, స్నేహాలు? మనస్సులు కలబోసుకోటం, గుండెలు విడిపోవటం, కుట్రలు, నాటకాలు.
మబ్బు, మేఘాలు, కెరటాల తుంపర, పువ్వు వికసించటం, సంధ్య మంచులో నదీ, మేక అరుపు, పిల్లల ఆట, కుక్క విశ్వాసం, పిల్లల కేకలు, వేసంగి వాన, మొక్క మొలిచిన వయ్యారం, ఎండిన ఆకు వైరాగ్యం; దాహమేస్తే మంచినీళ్లు త్రాగడం, ప్రియురాలి లేత పెదవులు - అదా ప్రేమ!
చివరకు మిగిలేది, బుచ్చి బాబు
Comments
Post a Comment