నెరవేరు
అక్టోబర్ 21, 2026
నెరవేరు (neraveru)
అర్థము
(క్రియ) : పొందు; సిద్ధించు;ముగియు; సమాప్తమవ్వు
Meaning
(verb) : to be fulfilled/done; accomplished
వాడుక / Usage
సృష్టి శక్తుల చేతుల్లో పురుషుడు ఒక కీలుబొమ్మ, ఒక పరికరం - తన కర్తవ్యం నెరవేరగానే?
Man is a puppet, an instrument of the forces of nature - once duty is done?
మెదడుకు మేత / Food for thought
అతను జయించిన పరదేశాలన్ని మహా రాజ్యాలయ్యాయి, అతని స్వదేశం శ్మశానమైనది. అతన్ని ప్రేమించిన స్త్రీలందరూ రాణులయ్యారు. అతను ప్రేమించింది అడుక్కు తింటోంది. గడ్డిపోచ బంగారు కణికయింది. పిచ్చి పుష్పం మణి, మట్టి వెన్నెలయింది; కణికలు, మణులు, వజ్రాలు, వెన్నెల మంట కలిశాయి. శరీరాన్ని ఎందరెందరో పంచుకున్నారు; కీర్తిని కాజేశారు. ప్రేమని విషం పోసి హత్య చేశారు. సౌందర్యం జుట్టు విప్పుకుని యవ్వనాన్ని కౌగలించుకుని యేడ్చింది. శాంతం అహానికేసి తల పగలగొట్టుకుంది. దయని పగ పొడిచింది. మతాన్ని విజ్ఞానశాస్త్రం పూడ్చేసింది. దైవాన్ని దేవాలయంలో బంధించారు. మంచితనం సింహాసనమెక్కి ప్రాణం విడిచింది. -- చివరకు మిగిలేది, బుచ్చి బాబు
Comments
Post a Comment