ఆపసోపాలు

 

డిసెంబర్ 27, 2024

ఆపసోపాలు (aapa-sopaa-lu)

   అర్థము

  (విశేష్యము) : జ్వరం వల్ల బాధ; దుఃఖం; తక్కువ శ్రమకి కూడా అలసినట్లు చేయడం; భుక్తాయాసం 

  Meaning

  (noun) : feverish aches; (act) tired on little effort; struggle after heavy meal

   వాడుక / Usage

   ఎన్నికల ఫలితాలతో ఆపసోపాలు పడుతున్న పార్టీకి ఈ వివాదం క్రొత్త ఊపిరి ఇచ్చింది.
   The controversy gave a fresh lease of life to the party suffering from defeat.

  మెదడుకు మేత / Food for thought

   అన్ని చెప్పగల భాష
   అక్కడే ఆగిపోయింది.
   వేసుకుందామంటే ఏచొక్కా
   నచ్చని ఐదేళ్ళ నా కొడుకు
   పెంకితనమే నా భాష కొచ్చింది.
   ఎంత దువ్వినా వంగని రింగుల జుట్టు
   ఎంత కట్టినా కుదరని ఆర్గండీ చీర
   తెగిన చెప్పుతో నడిచే కాలి నడక
   అక్కడే కూలబడింది.
   పోనీ మరోమాటేదైనా
   వెతుకుదామంటే
   కర్ఫ్యూలో పాత బస్తీలో
   తెరచిన దుకాణంలా
   తిరణాళ్ళలో పడిపోయిన
   పదిపైసల బిళ్ళలా
   చెప్ప పెట్ట కుండా
   రాత్రికి రాత్రే రైలెక్కేసి
   కాశీకి పారిపోయిన సంసారిలా
   నాకు దొరక్కుండా పోయింది.

    -- పద్మలత అయలసోమయాజుల, 2011 ఇస్మాయిల్ అవార్డు గ్రహీత

Comments

Post a Comment