Posts

Showing posts from April, 2025

శ్లాఘనము

  మే 01, 2025 శ్లాఘనము  ( ṣlāghan amu )     అర్థము    (విశేషణము)  : ప్రశంస; స్తుతి; పొగడ్త; స్తోత్రము    Meaning    (adj/noun) : praise; applause; flattery      వాడుక / Usage       నటుడిగా, దర్శకునిగా, రచయితగా గిరీష్ కర్నాడ్ సేవలు శ్లాఘనీయమని ఆయన కొనియాడారు .     He praised Girish Karnad's laudable contributions as an actor, director and writer.    మెదడుకు మేత / Food for thought      ఏం దురభిమాన దుర్యోధనా! ఆ భీముని భీషణ వాక్కులు నీకు ప్రళయకాలపరివృథ గర్జనములై ఛిద్రములైనవి కదూ! ఆ యుధిష్టిరుని ఉపశమనబోధలు నీ వెడదహృదయమును తుత్తునియలుచేయు మరణాఘాతములైనవి కదూ! చతుస్సముద్రవేలావలయుత ధరణీపట్టభద్రుడవు, కౌరవసామ్రాజ్య సింహాసనాధీశ్వరుడవు, సుయోధన సార్వభౌముడవు! ఏమైనది నీ అఖండ సామ్రాజ్య వైభవము? ఎక్కడ నీ హంసతూలికాతల్పము...

శూన్యము

  ఏప్రిల్ 30, 2025 శూన్యము  ( ṣūnyamu )     అర్థము    (విశేషణము)  : లేమి; సున్న; పాడు పడినది; ఏమీ లేకపోవడం; బిందువు    Meaning    (adj/noun) : empty; void; vacuum; zero; dot; non-existent      వాడుక / Usage      గ్రామ  సచివాలయాల్లో పౌర సేవలు శూన్యం .     Village secretariats are offering no civil services.    మెదడుకు మేత / Food for thought       పాంచాలీ ..  పంచభర్త్రుక ..  ఏమే ..  ఏమేమే ..  నీ   ఉన్మత్త వికటాట్టహాసము  ?  ఎంత   మరువ యత్నించినను   మరపునకురాక  హృదయ   శల్యాయమానములైన   నీ   పరిహాసారవములే   నాకర్ణపుటములను   వ్రయ్యలు   చేయుచున్నవే .  అహో  !  పాంచాలీ   కృతావమాన   మానసుడనై ,  మానాభిమానవర్జితుడనై  - మర్యాదాతిక్రమణముగా   మనుటయా …  పరిహాసపాత్రమైన   ఈ   బ్రతుకోపలేక  - మరణించుటయా ..  ఇస్సీ ..  ఆడుదానిపై ...

శిథిలము

  ఏప్రిల్ 29, 2025 శిథిలము  ( ṣithilamu )     అర్థము    (విశేషణము)  : దృఢము కాని; పట్లు సడలిన; నాశనము    Meaning    (adj) : weak; loosened; dilapidated      వాడుక / Usage       శిథిలమైన భవనాల్లోనే ప్రభుత్వ పాఠశాలల నిర్వహణ.     Government schools being run out of dilapidated buildings.    మెదడుకు మేత / Food for thought      అబ్బా సెగట్రీ! ఎప్పుడు పనులూ బిసినెస్ యేనా?ఆహ్ పరగడుపునే కాస్త పచ్చిగాలి పీల్చి ఆ ప్రత్యక్ష నారాయణుడి సేవ చేసుకోవద్దు? ఎస్ సార్ కాదు కళ్ళెట్టుకు చూడు, పైన ఎదో మర్డర్ జరిగినట్లు లేదు ఆకాశంలో? సూర్యుడు నెత్తురుగడ్డలా లేడూ? ఆ మనిసన్నాకా కూసంత కళాపోషణ ఉండాలయ్యా. ఉత్తినే తిని తొంగుంటే మనిషికి గొడ్డుకి తేడా ఏముంటది?    -- కాంట్రాక్టర్ (రావు గోపాలరావు) - ముత్యాల ముగ్గు, మాటలు - ముళ్ళపూడి వెంకట రమణ

శకలము

  ఏప్రిల్ 28, 2025 శకలము  ( ṣakalamu )     అర్థము    (విశేష్యము)  : తునక; ముక్క; ఖండం; నార    Meaning    (noun) : a piece; fragment; part; bark of a tree      వాడుక / Usage       భూమి మీద దాడి జరుగుతోందా అన్నట్లు ఆకాశం నుంచి దూసుకొచ్చిన రాకెట్ శకలాలు ఎక్కడివి?     Where did the rocket fragments, that fell as if earth was under attack, come from?    మెదడుకు మేత / Food for thought      ఈ స్మశానాల్లనీ నా బ్యాంకులు. ఇద్గిద్గిద్... ఈ గోరీలన్నీ నా లంకెల బిందెలు. అడ్డెడ్డెడే ఈడు మా బ్యాంకు మేనేజర్ లా ఉన్నాడేంటి? ఈడీ తాలూకూ మనుషులెవ్వరు లేరేంటి? ఓఓఓ..అందరూ ఎలిపోయినారు. కలికాలం అండి, ధరలు పెరిగి పోయినాయి. శవాన్ని పూడ్చిపెట్టడం మానేసి ఒగ్గేసి వెళ్లిపోతున్నారు. థాంక్సు బ్రదరు! క్షమించు బామ్మరిది నీకు నేనున్నాను బామ్మరిది. ఒరేరే నువ్వు కూడా శవం అయిపోయినావు ఏంటి బామ్మరిది. కథ అడ్డంగా తిప్పేసినావెంటి? నన్ను లాస్ లో పెట్టి ఎలిపోయినావేంటి? నా కళ్ళు మసకలు కమ్మినాయా లేక శవం కళ్ళు ...

మెలత

  ఏప్రిల్ 25, 2025 మెలత  ( melata )     అర్థము    (విశేష్యము)  : స్త్రీ    Meaning    (noun) : a woman      వాడుక / Usage       మెలత మొగిలు పిఱిఁది మెఱుఁగుఁదీవయుఁ బోలె జలదవర్ణు వెనుకఁ జనెడునపుడు .     Like a lightning bolt that follows a cloud, Lakshmi followed Vishnu the cloud hued one.    మెదడుకు మేత / Food for thought       మనసున పేరుకున్న పుట్టెడంత చింతలు      కరిగి కన్నీళ్ళై చేతిన వర్షించగా      అశృతుషారాలతో బిక్కు బిక్కు నున్న      ప్రతి రోమము రొమ్ము విప్పి నవ్వేనే      మనసా నందమా నంద మాయే      మానస సరోవరం కల్లోల మగ్నం      నవదర్పణం తొంగి చూడగా      పాశం నాశం లేనిదై  అర్థనిమీలిత నేత్రాలతో      ప్రాణ హంస తరలి వచ్చెనే      మనసా నందమా నంద మాయే     --  https://manatelugumaata.blogspot.com/2024/03/blog-post.ht...

శంప

  ఏప్రిల్ 24, 2025 శంప  ( ṣampa )     అర్థము    (విశేష్యము)  : మెరుపు; శంఖనాదం    Meaning    (noun) : lightning; sound of a conch      వాడుక / Usage       మీన పంక్తుల దాఁట మెయిదీఁగతో రాయ- శంపా లతలు మింట సరణిఁ గట్టు .     As she evaded the fishes, lightning bolts lined up in the sky to feel her creeper-like body.    మెదడుకు మేత / Food for thought       ప్రతీ రాత్రి నిన్న నుంచి రేపటికి!     రాత్రి అల సొలసిన మేనులకు సల్లని నిదురుల రేయి!     ప్రతి ఉదయం నిజమైన నూతన సంవత్సరోదయం,     నిఖిలమైన పండగల ఆర్ణవం.     ప్రతి రేత్రి చేయాలి పవిత్ర ధాత్రి     అహము బాసి దీక్షబూని భక్తి శ్రద్ధలతో;     ప్రతి దినం మహోన్నత ముహూర్తమే కన్ను తెరిచి కదిలి పోడానికి     సరికొత్త ఆహ్లాదం ఈ వెచ్చని గాలిలో ఆ పచ్చికపైరులో.     కేవలం ఒక రాత్రి పాత నుంచి కొత్తకి;     కేవలం ఒకే నిద్దర నెలరాజు నుండి సూరీడుకు. ...

పాఠీనము

  ఏప్రిల్ 23, 2025 పాఠీనము  ( pāṭhīnamu )     అర్థము    (విశేష్యము)  : వేయి కోరల చేప; ఒక రకమైన చేప;     Meaning    (noun) : a fish with numerous teeth; kind of catfish      వాడుక / Usage       శుకములఁ దోలఁ జక్షుర్మీనములకు మం- దాకినీ పాఠీన లోక మెసఁగు .     As she scared the parrots away, giant fishes from celestial Ganga zoomed in to her fish-like eyes.    మెదడుకు మేత / Food for thought       ఘడియలు చెప్పే గడియారంలో గంటలు గణించినపుడు,      గండ్రగొడ్డలి వంటి పగలు కళ్లు కప్పి మాయమయ్యె కరాళ రాత్రియై;      సువాసనలు విరిసే మల్లెతీగలు వడిలి హొయలు బాసినపుడు,      కాలనాగు వంటి నల్లటి కురులు మెరవగా ముగ్గువలె ధవళమై;      అప్పుడు స్ఫురించింది ఈ ప్రశ్న అహో నీ అందం      కాలం చేసే లయవిన్యాసంలో అంతం అవ్వక తప్పదు కదా,      ప్రేయసీ ప్రియులు తమను తాము త్యాగం చేసే అనుబంధం    ...

బింబ

  ఏప్రిల్ 22, 2025 బింబ  ( bimba )     అర్థము    (విశేష్యము)  : దొండ పండు; ప్రతిమ; అద్దము    Meaning    (noun) : scarlet coloured fruit; mirror      వాడుక / Usage       నళులఁ జోపఁగఁ జిల్క లల్ల నల్లన చేరి- యోష్ఠ బింబ ద్యుతు లొడియ నుఱుకు .     As she waved the bees away, parrots swooped in mistaking her lips for a ripe fruit.    మెదడుకు మేత / Food for thought      దూరమైనది కనుమరుగైనది నాకు దగ్గరే;     నీడ మరి రవి కిరణం ఒక్కటే;     అంతర్ధానమైన దేవుళ్ళు కనుల ముందు ప్రత్యక్షమవుతారు;     ఒక్కటే నాకు కీర్తి లేక అపకీర్తి.      నన్ను వదిలి వేదనతో తపిస్తారు;     నన్ను గగనానికి ఎగరవేస్తే, రెక్కలు నేనవుతాను;     సంశయించేవాడిని నేనే, సంశయాన్నీ నేనే;     బ్రహ్మవిదులు వల్లించే వేదాన్ని నేనే.          -- బ్రహ్మ ,  రాల్ఫ్ వాల్డో ఎమర్సన్ (1803 - 1882) అమెరికన్ కవి  

అలకము

  ఏప్రిల్ 21, 2025 అలకము  ( alakamu )     అర్థము    (విశేష్యము)  : ముంగురులు; కేశములు; జుట్టు    Meaning    (noun) : curls      వాడుక / Usage       నిటల(ల+అ=లా) అలకము లంట నివుర జుంజుమ్మని ముఖసరోజము నిండ ముసురుఁ దేంట్లు .     As she cleared the hair falling on her forehead, bees swarmed her lotus-like face.    మెదడుకు మేత / Food for thought      నాగరికత పెనవేసుకు పోయింది, లోబడి     ఒక శాసనానికి, శాంతి అనే ఓ ఆకృతికి,     వన్నె వన్నెగా భిన్న భిన్నంగా అల్లుకుపోయిన మాయకి; తలపుల వడి     మనిషి జీవితం, భయంతో భీతిల్లినా మనిషి ఆపలేడు     మారణహోమం, యేళ్లు శతాబ్దాలు అయినా  శతాబ్దాలు యుగాలైనా     శమించని ఆకలితో ప్రళయ తాండవం చేస్తో, సర్వ విధ్వంసం కావిస్తో వచ్చేది     ఎడారి వంటి వినాశనమైన వాస్తవంలోకే:     ఈజిప్టు మరియు గ్రీకు రాజ్యాలకు వీడ్కోలు, వీడ్కోలు రోమ్ మహాసామ్రాజ్యానికి.     ఋషులు మేరు ప...

తాలూకా

  ఏప్రిల్ 18, 2025 తాలూకా  ( tālūkā )     అర్థము    (విశేష్యము)  : జిల్లాలో ఒక భాగం; సంబంధించిన    Meaning    (noun/adj) : sub division of a district; belonging to; related to      వాడుక / Usage      నిఖార్సైన అసలు సిసలు తెలుగు పదాలతోనే తాలూకా ఉండాలని ముక్తసరిగా చెప్పిన ఆ భాషా ఛాందసుడుని చూసి నవ్వు ఆగలేదు.     It was amusing to hear the language fanatic quip that only immaculate words belonging to Telugu should be used.    మెదడుకు మేత / Food for thought       అనంత విశ్వంలో ఆణువణువూ జీవించే అవధి లేని కుటీరం నువ్వు       కానీ సుదీర్ఘ యానంలో      జిలుగు వెలుగుల వేటలో వెతికాను నీ లేమి కోసం      సర్వ జీవాజీవ కోటిని కదిలించే శక్తివి నువ్వు      కానీ సుదీర్ఘ యానంలో      భౌతిక ప్రపంచంలో అందుకోలేనంతగా నిగూఢమయ్యావు      ఈ సుదీర్ఘ యానంలో,ఇదిగో ఇక్కడే ఉన్నాను అంటూ    ...

అసలు

  ఏప్రిల్ 17, 2025 అసలు  ( asalu )     అర్థము    (విశేష్యము)  : బురద; మొదటిది; కల్తీ లేనిది; నిజమైనది; మూలధనం    Meaning    (noun/adj) : mud; original; legitimate; capital or principal      వాడుక / Usage      వడ్డీ మాట దేవుడెరుగు అసలు కూడా కట్టలేని స్థితిలో మధ్యతరగతీకులు.     Forget about interest, middle class is struggling to repay even the principal.    మెదడుకు మేత / Food for thought       తల కొంతగా వంచితే రాయి కూడా దేవతై పోతుంది      తన నంతగా ప్రేమించకు తను వంచకై పోతుంది      నేనూ నదినే నా గతి శృతి నాకు తెలుసు      ఏ వైపుకు వెళితే అదే తుళ్ళి తుళ్ళి దారై పోతుంది      ఎంతో నిజాయతీతో జీవితం నాతో అంది      నువ్వు నాకు కాకపోతే మరొకరితో  నాకు  ముడై పోతుంది      పై వాడి మీద భారం వేసి తాగుతున్నాను మిత్రమా      హాలాహలం ఉన్నా ఇందులో ఔషధమై పోతుంది  ...

సిసలు

ఏప్రిల్ 16, 2025 సిసలు  ( sisalu )     అర్థము    (విశేషణము)  : మేలైన; సరియైన; నిర్ధారణ అయిన    Meaning    (adj) : of good quality/source; confirmed; settled; exact      వాడుక / Usage       ఓటీటీ రిలీజ్: సూక్ష్మ‌ద‌ర్శిని.. సిస‌లైన థ్రిల్ల‌ర్!     OTT release: Sukshma Darshini is a real good thriller.    మెదడుకు మేత / Food for thought       రాకాసి యవ్వనం తీసుకుపోయింది ఆటల ఆస్తులని      రంగు రంగుల బొమ్మలు నావి కాజేసుకు వెళ్లింది      నీ గారాల పట్టీ నేను కదా నాన్నా      మరెందుకు అయ్యాను ఇప్పుడు పరాయి నేను      కాలాలు గడిసిపోయాయి జాబులు మాత్రం రావు      రాలేదు ఎదురు చూసినా నావారు ఎవరూ      ఈ ఏడాది పంపవా తమ్ముడిని నాన్నా      శ్రావణం పిలుస్తోంది తీపిగా నన్ను      వెనుకకి వచ్చినప్పుడు నా చిన్ననాటి స్నేహితులు      పంపవా చల్లని కబురు నాకు ...

ముక్తసరి

  ఏప్రిల్ 15, 2025 ముక్తసరి  ( mukthasari )     అర్థము    (విశేషణము)  : సంగ్రహంగా, క్లుప్తంగా, టూకీగా    Meaning    (adv) : brief; succinct; concise; summary      వాడుక / Usage      " సినిమా ప‌రంగా నా వ‌య‌సు ప‌ద‌హారేళ్లు ద‌ట్సాల్‌“ అని ముక్త‌స‌రి స‌మాధానం ఇచ్చారు.     "I was 16 in the movie", she gave a brief response.    మెదడుకు మేత / Food for thought       "విషాన్ని విషంగా  గుర్తించడానికి ఇష్టపడని వాళ్ళకి అది విషం అని చెప్పడం వృధా."  నార్వేకి చెందిన నాటకాల రచయిత హెన్రిక్ ఇబ్సెన్ 1882 లో రచించిన నాటిక "యాన్ ఎనిమి అఫ్ ది పీపుల్ " ని పంతొమ్మిది వందల అరవైల్లో గొల్లపూడి మారుతీ రావుగారు తెలుగు రంగస్థలం కోసం "సత్యంగారిల్లెక్కడ" గా అనువర్తించారు. సత్యజిత్ రాయ్ ఇబ్సెన్ నాటికని ఘనశత్రు పేరుతో 1990 లో సినిమాగా తీశారు. ఈ నాటిక ఈనాటికి ఏనాటికి అయినా అద్దం పడుతుంది. కుట్రలు కుతంత్రాలు తో మకిల పడిన సమాజం , దానిని తమ స్వప్రయోజనాల కోసం వంచించే రాజకీయ నాయకులు, అజ్...

నిఖార్సయిన

  ఏప్రిల్ 14, 2025 నిఖార్సయిన  ( nikharsaina )     అర్థము    (విశేషణము)  : నిజాయితీ; నిఖార్(ఉర్దూ)=నిర్మలం, శుభ్రం    Meaning    (adv) : sincere; straightforward;       వాడుక / Usage      అయన  ఓ నిఖార్సయిన 'ప్రభుత్వ ఉపాధ్యాయుడు' .     He is a very sincere government teacher.    మెదడుకు మేత / Food for thought      ఓ ఓడమాలి, తీరం కానదేమోయి      సెలయేరు కలిసింది కృష్ణమ్మలో, కృష్ణమ్మ కలిసింది ఆ కడలిలో      కడలి కడకి కలిసేది ఏ నీటిలో ఏ నీటిలో, తెలియలేదే ఎవ్వరికీ      సూరీడు కోసం భూమమ్మ ఎదురు సూస్తాది      నేల తల్లికోసం సెందురూడు కాపు కాస్తాడు      సెందురూడు కాపు కాస్తాడు      నీటనున్న నత్తగుల్ల వలే ఆ…. నీటనున్న నత్త వలే      ప్రతి హుదయానికి దప్పికే ఆ… దప్పికే      ఓ నేస్తమా ఓ…      నీటనున్న నత్తగుల్ల వలే ప్రతి హుదయానికి దప్పి...