మొయిలు
జులై 29, 2022 మొయిలు ( moyilu ) అర్థము (విశేష్యము ): మేఘము; మబ్బు; మొగులు Meaning (noun) : cloud వాడుక / Usage గర్జించే మెయిళ్లు దాహతప్తమైన నేలను తాకగానే మట్టి వాసన సుగంధమై విరబూసింది. Rain from the thundering clouds quenched the thirst of earth blossoming the scents of soil. మెదడుకు మేత / Food for thought పిల్లల్లో భాష పట్ల ఉత్సాహం కలిగించడానికి కథల పుస్తకాలు చదవడం అనేది ఒక ముఖ్యమైన అంశం అని నేను అనుకుంటాను. మొదటగా చిన్న కథల పుస్తకాలు చదవడం, తర్వాత ఆసక్తి కలిగి ఇంకొంచెం పెద్ద పుస్తకాలు చదవడం, దాని తర్వాత ఇంకా పెద్ద పుస్తకాలు చదవాలనిపించడం, తర్వాత పాత పుస్తకాల్లో ఏముందో తెలుసుకోవాలన్న జిజ్ఞాస కలిగి వాటిని కూడా చదవడం — ఇదంతా ఓ పరిణామ క్రమంలో జరిగి అందరికీ, భాషకీ ఎంతో ప్రయోజనం జరుగుతుందని నేను అనుకుంటాను. మొదటి డైమన్షన్ పిల్లల చేత కథల పుస్తకాలు చదివించడం అయితే రెండవది ఈ సృజనలో వాళ్ళు పాలు పంచుకోవడం. ఈ రెండు డైమన్షన్లూ కొత్తపల్లి పత్రిక చూసిన వారికెవరికైన...