Posts

Showing posts from August, 2024

అలతి

  ఆగష్టు 30, 2024 అలతి    ( alati )     అర్థము      (విశేషణము ) : స్వల్పము; చిన్న; అల్పము; పచ్చి కట్టెలు; కాలిన బొగ్గు      Meaning     (adj) : trifle; little; small thing    వాడుక / Usage       అలతి అలతి పదాలతో మహోన్నత భావాలను చెప్పిన కవి వేటూరి.     Veturi expressed grand ideas whilst using small and simple words.     మెదడుకు మేత / Food for thought      మానూ మాకును కాను _ రాయీ రప్పను కానే కాను      మామూలు మణిసిని నేను _ నీ మణిసిని నేను      నాకూ ఒక మనసున్నాదీ, నలుగురిలా ఆశున్నాదీ      కలలు కనే కళ్ళున్నాయి, అవి కలత పడితె నీళ్ళున్నాయి      పెమిదను తెచ్చీ వొత్తినియేసీ, సమురును పోసీ బెమసూపేవా      ఇంతా శేసి యెలిగించేందుకు, ఎనకముందు లాడేవా      మణిసి తోటి యేళాకోళం, ఆడుకుంటే బాగుంటాది      మనసు తోటి ఆడకు మావా,ఇరిగి పోతే అతకదుమల్లా     -- మూగ మనసులు...

అంతరాళము

  ఆగష్టు 29, 2024 అంతరాళము    ( antarāḷamu )     అర్థము      (విశేష్యము ) : అన్ని దిక్కులకు మధ్య చోటు; నడిమి భాగం      Meaning     (noun) : the middle space; interval between earth and space    వాడుక / Usage      నిండు జాబిల్లి దిశాంతరాళములలో వెన్నెల కాయగా గోపాలుడు రాస క్రీడలాడాడు.     As the full moon lit the earth and celestial space, Krishna danced Raasa.     మెదడుకు మేత / Food for thought      తేట తేట తెలుగులా... తెల్లవారి వెలుగులా      తేరులా.. సెలయేరులా.. కల కలా.. గల గలా      కదలి వచ్చింది.. కన్నె అప్సరా      వచ్చి నిలిచింది.. కనుల ముందరా..      తెలుగువారి ఆడపడుచు ఎంకిలా      ఎంకి కొప్పులోని.. ముద్దబంతి పువ్వులా      తెలుగువారి ఆడపడుచు ఎంకిలా      ఎంకి కొప్పులోని.. ముద్దబంతి పువ్వులా      రెక్కలొచ్చి ఊహలన్ని ఎగురుతున్నవి    ...

పులినము

  ఆగష్టు 28, 2024 పులినము    ( pulinamu )     అర్థము      (విశేష్యము ) : ఇసుక దిబ్బ / తిన్నె         Meaning     (noun) : sandbank; sandy beach    వాడుక / Usage      సాయంసంధ్యా సమయాన యమునా పులిన తీరాన నల్లనయ్య చెంత....     On the sandy banks of Yamuna with Krishna by the side...     మెదడుకు మేత / Food for thought      కళ్ళలో ఉన్నదేదో కన్నులకే తెలుసు     రాళ్ళలో ఉన్న నీరూ కళ్ళకెలా తెలుసు      తానే మంటై వెలుగిచ్చు దీపం     చెప్పదు తనలో చెలరేగు తాపం     నే వెళ్ళు దారీ ఓ ముళ్ళ దారీ     రాలేరు ఎవరూ నాతో చేరీ     వేసవిలోనూ వానలు రావా     కోవెల శిలకూ జీవం రాదా     జరిగే నాడే జరుగును అన్నీ     జరిగిన నాడే తెలియును కొన్నీ     నాలో ఉన్న మనసు నాకు గాక ఇంకెవరికి తెలుసూ     -- అంతులేని కథ (1976), ఆత్రేయ ...

రోహము

  ఆగష్టు 27, 2024 రోహము    ( rōhamu )     అర్థము      (విశేష్యము ) : మొగ్గ; మొలక; ఎక్కుట         Meaning     (noun) : bud; blossom; ascending    వాడుక / Usage      చల్లని వెన్నెలలో సంపంగి రోహములలో చెలి చెంత నుండగా ఏమి హాయి!     In the cool moonlight amidst Champak blossoms and close to beloved; oh that joy!     మెదడుకు మేత / Food for thought      పల్లెటూరి అబ్బాయిని పదునుపెట్టి వెన్నుతట్టి      పల్లెటూరి అబ్బాయిని పదునుపెట్టి వెన్ను తట్ట      మనిషిగ తీరిచి దిద్దిన మరువరాని దేవత కథ.. చెప్పాలని ఉంది     కోరనిదే వరాలిచ్చి.. కొండంత వెలుగు నిచ్చి      కోరనిదే వరాలిచ్చి.. కొండంత వెలుగు నిచ్చి      మట్టిని మణిగా చేసిన మమతెరిగిన దేవత కథ.. చెప్పాలని ఉంది     అంతటి దేవికి నా పై ఇంతటి దయ ఏలనో..      ఎన్ని జన్మలకు ఈ ఋణమెలా ఎలా తీరునో     -- ఉమ్మడి కుటుంబం (...

వల్లి

  ఆగష్టు 26, 2024 వల్లి    ( valli )     అర్థము      (విశేష్యము ) : తీగ; లత; భూమి      Meaning     (noun) : creeper; climbing plant; earth    వాడుక / Usage      ప్రేయసీ బాహు వల్లికల నడుమ స్వర్గపు అంచులు చవి చూడనా!     Entwined in the creeper like arms of the beloved; heavenly it is!     మెదడుకు మేత / Food for thought      అనుకున్నామని జరగవు అన్నీ అనుకోలేదని ఆగవు కొన్నీ      జరిగేవన్నీ మంచికని అనుకోవడమే మనిషి పని      పసిపాపవలె ఒడి జేర్చినాను కనుపాప వలె కాపాడినాను      గుండెను గుడిగా చేసాను నువ్వుండలేనని వెళ్ళావు      వలచుటా తెలిసిన నా మనసునకు మరచుట మాత్రము తెలియనిదా      మనసిచ్చినదే నిజమైతే మన్నించుటయే రుజువు కదా!     -- మురళీకృష్ణ (1964), ఆత్రేయ (మే 7, 1921 - 1989)

లలి

  ఆగష్టు 23, 2024 లలి    ( lali )     అర్థము      (విశేష్యము ) : క్రమము; ప్రేమ; సొగసు; ఉత్సాహం       Meaning     (noun) : order; love; joy; graceful    వాడుక / Usage       లలి నొకటొకటికి లంకెలు నివే  అలరుచు నేమని యందునయా .     What can I say when you have tied me in bonds one after the other?     మెదడుకు మేత / Food for thought     భూమి (ప్రకృతి) యొక్క కవిత ఎన్నటికీ అంతమవ్వదు. -- జాన్ కీట్స్ (అక్టోబర్ 31, 1795 - 1821)

అదను

  ఆగష్టు 22, 2024 అదను    ( adanu )     అర్థము      (విశేష్యము ) : తగిన సమయము; వేళ      Meaning     (noun) : an opportune time    వాడుక / Usage       పొడుగుచు మనమున బొడమిన యాసలు  అదన నెక్కడికి నరుగునయా.     The desires growing in the heart, will they ever leave at an opportune time?     మెదడుకు మేత / Food for thought     మనం అందరం ఈ ప్రపంచపు మరుభూమిలో ప్రయాణీకులమే, ఆ ప్రయాణంలో మనం చేయగలిగింది నిజాయితీ అయిన మిత్రుడిని కనుగొనడమే. -- రాబర్ట్ లూయిస్ స్టీవెన్సన్ (నవంబర్ 13, 1850 - 1894)

పెనగు

  ఆగష్టు 21, 2024 పెనగు    ( penagu )     అర్థము      (క్రియ ) : చుట్టుకొను; గుంజుకొను; పోరాడు      Meaning     (verb) : to be twisted/join; struggle    వాడుక / Usage       పెనగి తల్లికడ బిడ్డలు భువిలో యెనగొని యెక్కడి కేగుదురయ్యా .     Entwined are the offspring with mother, whence do they go?     మెదడుకు మేత / Food for thought     మధురం ఆ స్వచ్ఛమైన ప్రేమ, విఫలమైన కూడా. మధురం ఆ మృత్యువు బాధ నుంచి విముక్తి ఇచ్చేది. -- అల్ఫ్రెడ్ టెన్నిసన్ (ఆగష్టు 06, 1809 - 1892)

వేవేలు

  ఆగష్టు 20, 2024 వేవేలు    ( vevelu )     అర్థము      (విశేషణము ) : వేలు+వేలు; అనేక వెయ్యలు; లెక్కలేని      Meaning     (adj) : thousands upon thousands    వాడుక / Usage       దేవ యీ తగవు దీర్చవయ్యా  వేవేలకు నిది విన్నపమయ్యా .     O Lord resolve this problem, that's my countless requests to you.     మెదడుకు మేత / Food for thought     విద్య అంటే పాత్ర నింపడం కాదు, విద్య అంటే భగభగ మనే అగ్ని అంటించడమే. -- విలియం బట్లర్ యేట్స్ (జూన్ 13, 1865 - 1939)

తతి

  ఆగష్టు 19, 2024 తతి    ( tati )     అర్థము      (విశేష్యము ) : సమయము; సమూహము; గుంపు      Meaning     (noun) : season; proper time; crowd; a collection     వాడుక / Usage       తనువున బొడమిన తతి నింద్రియములు  పొనిగి యెక్కడికి బోవునయా.     The group of senses born in the body - where will they go?     మెదడుకు మేత / Food for thought      ఆనందం ఉంది దారి లేని అడవుల్లో     తన్మయం ఉంది ఒంటరి తీరాల్లో     తోడు ఉంది ఎవరూ రాని చోటల్లో     లోతైన సంద్రంలో రాగాలు వినబడ్డాయి హోరులో     మనిషి అంటే తక్కువ ప్రేమ కాదు, కానీ ప్రకృతి అంటే ఎక్కువ     ఆ క్షణాలలో మౌన సంభాషణలో, నేను దొంగలించాను కొన్ని     రాబోయే రేపులో లెక్కలేని మనుగడలను, గతించిన నిన్నలలో గుర్తులేని ఘటనలను     ఈ అనంత విశ్వంలో లీనమై పరవశించగా అనుభవించనా      మాటలలో ఎన్నటికీ చెప్పనలవి కానివీ, మనసు తెరల వెనుక గుట్టుగా దాచల...

నెర్రె

  ఆగష్టు 16, 2024 నెర్రె    ( nerre )     అర్థము      (విశేష్యము ) : నేల పగులు; చీలిక      Meaning     (noun) : a crack (in the ground); fissure     వాడుక / Usage      పొలాల్లో నెర్రెల మేట; పైరంతా పశువులకు మేత .     Farm lands cracking up in fissures; crops end up as cattle feed.     మెదడుకు మేత / Food for thought      స్వరాజ్యం నా జన్మహక్కు అని నినదించి, దాన్ని ఎప్పటికైనా సాధించి తీరుతానంటూ శపథం చేసిన ముందుకు సాగిన మహనీయుల్లో ప్రాతఃస్మరణీయుల్లో మొదటి వారు తిలక్‌. జాతీయవాదిగా, సామాజికవాదిగా, స్వాతంత్య్ర సమరయోధుడిగా, జాతీయోద్యమాన్ని కొత్తపుంతలు తొక్కించి, దేశవ్యాప్తంగా సామాన్యులు సైతం ఆ ఉద్యమంలో పాల్గొనే విధంగా చేయడంలో ఆయన పాత్ర అమోఘమైనది. అందుకే ఆయన్ను సంపూర్ణ స్వరాజ్యోద్యమానికి పితామహుడిగా చరిత్రకారులు చెబుతారు. -- బాల గంగాధర్ తిలక్ (జులై 23, 1856 - 1920) గురించి

ఫలకము

  ఆగష్టు 15, 2024 ఫలకము    ( phalakamu )     అర్థము      (విశేష్యము ) : పలక; చదునుగా ఉండే రాతి; అర చేయి; పిరుదు      Meaning     (noun) : slate; a flat stone/metal to write on; palm; hinder part     వాడుక / Usage      సౌర ఫలకాల సంద్రం - అన్నమయ్య జిల్లా గాలివీడు తూమకుంట దగ్గర .     Sea of solar panels - at Gaaliveedu in Annamayya district.     మెదడుకు మేత / Food for thought      ‘అమాయక పౌరుల మీద దాడులకు దిగే ప్రభుత్వానికి నాగరిక ప్రభుత్వమని చెప్పుకునే హక్కు లేదు. అలాంటి ప్రభుత్వాలు ఎక్కువ కాలం కొనసాగలేవు కూడా!’. స్వాతంత్య్ర పోరాట చరిత్రలో పంజాబ్‌ సింహమంటూ కీర్తి పొందిన లాలా లజపతిరాయ్‌ ఒక సందర్భంలో అన్నమాటలివి.  మత సంస్కరణలు, వాటి లోతుపాతుల గురించి లజపతి ముందు నుంచి బాగా ఆలోచించారు. అంటే సాంస్కృతిక పునరుజ్జీవనం కోణం నుంచి ఆయన భారతదేశాన్ని ఆకళింపు చేసుకునే ప్రయత్నం చేశారని అనుకోవచ్చు.  ‘భారతీయ పత్రికలని శాసించే అధికారమే నాకు ఉంటే, ఈ మూడు శీర్షికల...

చిత్తడి

  ఆగష్టు 14, 2024 చిత్తడి    ( chittaḍi )     అర్థము      (విశేష్యము ) : చిత్త తడి; మిక్కిలి తడి; బురదతో ఉన్న చోటు      Meaning     (noun) : gloomy weather; wetness; damp and moist    వాడుక / Usage       చిత్తడిగా రోడ్లు. రాకపోకలకు చింతలు .     Damp and muddy roads. Travel affected.     మెదడుకు మేత / Food for thought     "విప్లవ భావాలకు పితామహుడు, మహా శక్తిమంతుడైన జాతీయవాద ప్రవక్త" అని పాల్ ను అరబిందో కీర్తించారు. స్వరాజ్, స్వదేశీ, విదేశీ వస్తు బహిష్కరణ, జాతీయ విద్య వంటి అన్ని అంశాలను ప్రజలకు చేరువగా తీసుకువెళ్లారు. విదేశీ విద్య జ్ఞాపక శక్తిని ఇవ్వవచ్చుగాని నైతిక ప్రమాణాలను ఇవ్వడం లేదు అని చాటారు. లాల్ బాల్ పాల్ త్రయంలో ఒకరు. ఆయన రాజమండ్రిలో ఉపన్యాసం ఇచ్చిన చౌక్, పాల్ చౌక్ గా ఈనాటికీ పిలువబడుతోంది.  -- బిపిన్ చంద్ర పాల్ (నవంబర్ 7, 1858 - 1932) గురించి

గల్లంతు

  ఆగష్టు 13, 2024 గల్లంతు    ( gallantu )     అర్థము      (విశేష్యము ) : మాయము; అదృశ్యము; కోలాహలం; గోల      Meaning     (noun) : disappearance;  confusion; tumult    వాడుక / Usage      గేటు గల్లంతు - కొట్టుకుపోయిన తుంగభద్ర డ్యాం తలుపు .     Gate disappears - Tungabhadra dam sluice gate swept away.     మెదడుకు మేత / Food for thought      భారత దేశానికి లభించిన వజ్రం, మహారాష్ట్ర ఆణిముత్యం గోఖలే అన్న తిలక్ మాటలు అక్షర సత్యాలు. స్వాతంత్ర్య సమర యోధునిగా, నాయకునిగా, ఆర్థిక వేత్తగా పలువురిని ప్రభావితం చేసారు గోఖలే. 1905లో సర్వెంట్స్ అఫ్ ఇండియా సొసైటీ స్థాపించారు. నిర్బంధ ప్రాథమిక విద్య ప్రవేశ పెట్టాలి అని కోరిన మొదటి వ్యక్తి. -- గోపాల కృష్ణ గోఖలే (మే 9, 1866 - 1915) గురించి

వంగడము

  ఆగష్టు 12, 2024 వంగడము    ( vangadamu )     అర్థము      (విశేష్యము ) : వంగసము; వంశము; పంటలలో ప్రత్యేకంగా అభివృద్ధి చేసిన రకం      Meaning     (noun) :  family; lineage; breed     వాడుక / Usage      109 రకాల నూతన వంగడాలను ఆవిష్కరించిన ప్రధాని .     PM unveils 109 new breeds.     మెదడుకు మేత / Food for thought      బ్రిటిష్ పార్లమెంటుకు ఎన్నికైన తొలి భారతీయుడు. వారి పార్లమెంట్లో వారినే కడిగేసిన ధైర్యవంతుడు. స్వరాజ్య పదం వాడిన తొలి నాయకుడు. భారత జాతీయ కాంగ్రెస్ స్థాపకుల్లో ఒకరు. జాతీయోద్యమానికి రూపునిచ్చిన దార్శనీకుడు. గ్రాండ్ ఓల్డ్ మాన్ ఆఫ్ ఇండియా. -- స్వరాజ్య తాత  దాదాభాయ్ నౌరోజీ (సెప్టెంబర్ 4, 1825 - 1917)  గురించి ఈనాడు