Posts

Showing posts from December, 2021

అబ్దము

  డిసెంబర్ 31, 2021 అబ్దము  ( abdamu )       అర్థము      (విశేష్యము ):  సంవత్సరము; ; నీటిని ఇచ్చునది - మబ్బు, కొండ;   అద్దము;      Meaning     (noun) : year; water giving - cloud, mountain; mirror           వాడుక / Usage      కరోనా నీడలో ఇంకో   అబ్దము  దొర్లింది.      Another year has passed under the shadow of Corona.     మెదడుకు మేత / Food for thought పెట్టిన దినముల లోపల నట్టడవులకైన వచ్చు నానార్థములన్ బెట్టని దినములఁ గనకపు గట్టెక్కిన నేమిలేదు గదరా సుమతీ! ( పూర్వజన్మమున తాను దానమిచ్చిన ఫలం వలన అర ణ్యమధ్యనున్నప్పటికినీ సకలపదార్దములు కలుగును.పూర్వజన్మమున దానమీయకున్నచో తాను బంగారుకొండ నెక్కినను ఏమియు లభించదు. )     --బద్దెన  (1220-1280)

దోబూచులాడు

  డిసెంబర్ 30, 2021 దోబూచులాడు  ( doboochulaadu )       అర్థము      (క్రియ ):  దాగుడుమూతలు; కనపడీ కనపడకుండా ఆడే ఆట; కాలయాపన చేయడం; బూచి = భూతం;      Meaning     (verb) : hide and seek; peekaboo; delaying tactics           వాడుక / Usage      చందమామ మబ్బుల లోంచి దోబూచులాడింది .      The moon played hide and seek in the clouds.     మెదడుకు మేత / Food for thought నేర నన్నవాఁడు నెరజాణ మహిలోన నేర్తునన్న వాఁడు నింద జెందు ఊరుకున్న వాఁడె యుత్తమయోగిరా విశ్వదాభిరామ! వినురవేమ! (తనను ఏమీ రాదు అని చెప్పుకొనే వాడు నిజముగా తేలివైనవాడు. అన్నీ వచ్చుటకు   చెప్పువాడు గౌరవాన్ని పొందలేడు. మౌనముగానున్నవాడే ఉత్తమ యౌగి   అనిపించుకొంటాడు)     -- వేమన (1652-1730)

కార్ముకము

  డిసెంబర్ 29, 2021 కార్ముకము  ( karmukamu )       అర్థము      (విశేష్యము/విశేషణము ):  వెదురు; విల్లు; ఇంద్రధనస్సు; పని సంపూర్ణంగా పూర్తి చేయడం     Meaning     (noun/adj) : bamboo; bow; rainbow; finishing a work comprehensively           వాడుక / Usage      భువినుండి దివికి వారధిగా నిలిచింది ఆ కార్ముకం .      The mighty rainbow bridged the chasm between earth and heaven.     మెదడుకు మేత / Food for thought నువ్వు చెప్పకపోయినా నాకు తెలుసు ఇప్పటికే నీ అందచందాలను అంగాంగ సుందరంగా వర్ణిస్తూ చాలామంది ప్రేమలేఖలు రాసి ఉంటారని. అందమైన ఆడది కనపడగానే కలాలు స్ఖలిస్తాయి. యీ దేశ దౌర్భాగ్యం నాకు బాగా తెలుసు. ప్రేమకి కామానికి ఇనుప తెర ఉందని వాళ్ళు పైకి చెప్తారు. అదంతా ఫోజు. వాళ్ళ దృష్టిలొ ప్రేమంటే కామమే! ఆడదాన్ని చూడగానే వాళ్లకు గుర్తొచ్చేది నల్లులు తిరిగే పందిరి మంచం, పిడచలు గట్టిన పాత పరుపూ మాత్రమే. అందని ద్రాక్షా పళ్ళు పుల్లన. అందుకే మన దేశంలో శృంగార కవిత్వం కొండల...

స్తబ్ధత

  డిసెంబర్ 28, 2021 స్తబ్ధత  ( stabdhata )       అర్థము      (విశేషణము ):  అణిగి ఉండడం; నిశ్చేష్టం; ముడుచుకోవడం; కదలక పోవడం     Meaning     (adj) : firm; stiff; motionless           వాడుక / Usage      భారత్ చైనా  సంబంధాలలో  స్తబ్ధత చోటు చేసుకుంది.      Indo-Chinese relations are in a state of paralysis.     మెదడుకు మేత / Food for thought ఈ విశాల విశ్వంలో కొన్ని కోట్ల కాంతి సంవత్సరాల దూరంలో ఉన్న ఏ గాలక్సీలోని గ్రహవాసులో తమ ఇంధనం కొరతను తీర్చుకోవడానికి సూర్యుడిలాంటి నక్షత్రాలకోసం వేటాడుతుండగా వారి దృష్టి మన సూర్యుడిమీద పడింది. తమ అద్భుత సాంకేతిక శక్తితో మన సూర్యుడిని తమ గ్రహలోకానికి చెరువుగా తీసుకుపోవడానికి వారు ప్రయత్నిస్తున్నారు. ఈ పరిస్థితిని ఊహించి, దాని ఆధారంగా భూలోకంలోని శాస్త్రజ్ఞులు సుదూర గ్రహానికి రాయబారం పంపించారు. కాంతి వేగంతో వారి రోదసీ నౌక ఆ దూర గ్రహానికి వెళ్లి కాంతిని మించిన వేగంతో భూలోకానికి గతించిన కాలంలో తిరిగి వస్తుంది....

నిర్దిష్టము

  డిసెంబర్ 27, 2021 నిర్దిష్టము  ( nirdistamu )       అర్థము      (విశేషణము ):  ఉపదేశింపబడినది; ఆజ్ఞ; చూపబడినది; నిరూపించబడినది     Meaning     (adj) : defined; precept; proven/shown (path) rule           వాడుక / Usage       పార్లమెంట్ని నిర్దిష్ట గడువుకన్నా ఒక రోజు ముందే నిరవధిక వాయిదా వేశారు.       Parliament has been prorogued indefinitely a day ahead of defined time.     మెదడుకు మేత / Food for thought ప్రభో! నన్ను నేను సమర్పించుకుందామని వచ్చిన క్షణం నన్ను నేను పారేసుకుని వెతుక్కోవడంలో ఒక జీవితకాలం ఆలస్యమైంది. క్షమించు. గడిచిన కాలం గురుతులుగా మిగిల్చిన అనుభవం మచ్చల్ని చెరిపివేయలేమని తెలిసినా, ఆ విషాదమే ఆనందమై, వేదాంతమై, బ్రహ్మమై మిగులుతోంది. సముద్రం మీద నుంచి వచ్చే వేసవిగాడ్పు మామిడితోట చేరి వసంతమైనట్లు, గ్రీష్మకాలపు అనుభవం హేమంతపు తుషార కిరణమవనీ! అదీ నేను కోరుకునేది.      -- ఆనందోబ్రహ్మ, యండమూరి వీరేంద్రనాథ్  

పరాగము

  డిసెంబర్ 24, 2021 పరాగము  ( parāgamu )       అర్థము      (విశేష్యము ):  పుప్పొడి; చందనము; నలుగు పిండి; దుమ్ము; గ్రహణం; ప్రఖ్యాతి     Meaning     (noun) : pollen; sandalwood paste; dust; eclipse; fame           వాడుక / Usage       తోటలలోన తొలి పూతలలోన.. . కురిసిన అందం కుసుమ పరాగం.      The first blossom in the garden showering beauty as pollen.     మెదడుకు మేత / Food for thought వినదగు నెవ్వరు చెప్పిన  వినినంతనె వేగపడక వివరింపదగున్  కని కల్ల నిజము దెలిసిన  మనుజుడెపో నీతిపరుడు మహిలో సుమతీ! (ఎవరు ఏమి చెప్పినా వినాలి. విన్న వెంటనే తొందర పడకుండా బాగా ఆలోచించాలి. అలా ఆలోచించి నిజానిజాలను తెలుసుకున్నవాడే తెలివయినవాడు.)     -- బద్దెన (1220 - 1280)

కూలంకషం

  డిసెంబర్ 23, 2021 కూలంకషం  ( koolam-kashamu )       అర్థము      (విశేషణము ):  కూలం=గుంట, నది, సముద్రం; కషం=తీసినది, సారాంశం; సంపూర్ణంగా సమీక్షించటం      Meaning     (adj) : thoroughly; completely; extract           వాడుక / Usage     ఆర్థిక మంత్రి ద్రవ్యోల్భణం గురించి అధికారులతో కూలంకషంగా చర్చించారు.     The finance minister did an in depth review of inflation with officials.     మెదడుకు మేత / Food for thought నిద్రలో నాకు ఒక విచిత్రమైన అనుభూతి కలిగింది.  ఒక పలక మీద  ఎర్రటి రక్తంతో రాసినట్లుగా కనపడింది.   నేను చూస్తూ ఉండిపోయాను. ఒక అదృశ్య హస్తం ఎదో రాయడం మొదలు పెట్టింది. తదీక్షణంగా చూసాను.  ఆ చేయి చాలా దీర్ఘవృత్త (elliptic) పూర్ణంకాలు (integrals) రాసింది. అవి నా మదిలో నిలిచిపోయాయి.  ఉదయమే లేచి వాటిని పుస్తకంలోకి ఎక్కించాను. -- శ్రీనివాస రామానుజం (డిసెంబర్ 22, 1887 - 1920)

ముగ్ధ

  డిసెంబర్ 22, 2021 ముగ్ధ  ( mugdha )       అర్థము      (విశేష్యము/విశేషణము ):  చక్కనిది; క్రొత్తది; ఉదయించుచున్న అందము కల అమ్మాయి; మోహింపు చేయునది; మాయ/కపటం తెలియనిది     Meaning     (noun/adj) : blooming beautiful girl; lovely; simple or guileless           వాడుక / Usage      ముగ్ధ మనోహరమైన ఆమె వదనం అతని గుండెలో చెరగని ముద్ర వేసింది.     Her charming beautiful face left an indelible impression on his heart.     మెదడుకు మేత / Food for thought ఏమానందము భూమీతలమున! శివతాండవమట! శివలాస్యంబట! అలలై; బంగరు కలలై, పగడపుఁ బులుఁగులవలె మ బ్బులు విరిసినయవి శివతాండవమట! శివలాస్యంబట! వచ్చిరొయేమొ! వి యచ్చరకాంతలు జలదాంగనలై విలోకించుటకు శివలాస్యంబట!     -- శివతాండవం, పుట్టపర్తి నారాయణాచార్యులు (మార్చ్ 28, 1914 - 1990)

ప్రత్యూషము

  డిసెంబర్ 20, 2021 ప్రత్యూషము  ( pratyushamu )       అర్థము      (విశేషణము ):  ప్రభాతము; ప్రాతఃకాలం; వేకువ జాము; తెల్లవారే ముందు నాలుగు గడియల కాలం     Meaning     (adj) : dawn; day break           వాడుక / Usage     పక్షుల కలకలారావం ప్రత్యూష వేళ మనసును రంజింప చేసింది.     The chirping of birds at dawn filled the heart with joy.     మెదడుకు మేత / Food for thought ఓ చెలీ! ఓ చెలీ! నీవు నా నిదురలో మూర్తించి నీవు నా ఎదలలో నర్తించి పూవులో తేనెవై తావిలో మత్తువై పాటలో ఫణితివై మాటలో తేటవై అమృత బిందువులోని అమరత్వమైతివే! ఓ చెలీ! ఓ చెలీ!     -- శశికళ (కవితాసంపుటి), అడవి బాపిరాజు (అక్టోబర్ 8, 1895 - 1952)

సుషమ

  డిసెంబర్ 21, 2021 సుషమ  ( sushama )       అర్థము      (విశేష్యము/విశేషణము ):  శోభాయమానం; మనోహరమైనది; మనోజ్ఞమైన; బాగా అందం కలది     Meaning     (noun/adj) : exquisite beauty/splendour; pleasing           వాడుక / Usage     పండగకి వీధులన్నీ సుషమముగా ముస్తాబయ్యాయి.     The streets were beautifully decorated for the festival.     మెదడుకు మేత / Food for thought పోతన భాగవతుల భక్తిభావ పరంపరలకు శ్రుతులు కూర్చి కృతులు అల్లుకున్నాడు. ఆ భాగవతుల్లో ప్రహ్లాదునివంటి ఆజన్మజ్ఞానులు ఉన్నారు. గజేంద్రుని వంటి అర్ధజ్ఞాను లున్నారు. కుచేలునివంటి ఆర్థికదుర్దశాపీడితులున్నారు. ఈభక్తుల స్థితిగతులు వేరైనా, వారి వారి సంస్కారమతులు వేరైనా, అందరినీ కలిపికుట్టే మూలసూత్రం ఒకటుంది. అదే ఆర్తి. అది జీవాత్మలు పరమాత్మకు నివేదించుకునే అలౌకికమైన ఆర్తి. భక్తపరమైన ఈ ఆర్తిని సార్వకాలీన సామాన్య ప్రజల ఆర్తిగా చిత్రించడంవల్లనే భక్తకవియైన పోతన్న ప్రజాకవియైనాడు. "కలడు కలం డనెడువాడు కలడో లేడో" అంటూ ఆందోళి...

అతులితము

  డిసెంబర్ 17, 2021 అతులితము  ( a-tulitamu )       అర్థము      (విశేషణము ):  త్రాసు(తుల) వేయలేనిది; సాటిలేని; అసమానమైన;      Meaning     (adj) :  unparalleled; matchless           వాడుక / Usage     పోయిన ముప్పై ఏళ్లలో చైనా సాధించిన ఆర్థిక ప్రగతి అతులితమైనది .     The economic development China achieved in the last 30 years is unparalleled.     మెదడుకు మేత / Food for thought ఏమి వెతుకుతున్నానూ? యీ బ్రతుకుల బూడిదలో నేనూ! చావుల బ్రతుకుల సంజ వెలుగులో మసక చీకటుల నల్లని పొగలో అలముకొనే చిక్కని నీడలలో చెదిరిన కలల అడుగు జాడలలో నమ్మకాల ఆరిన రవ్వలకై ఆశయాల వాడిన పువ్వులకై కన్నీరుల యింకిన గురుతులకై బూడిదలో నెత్తురు మరకలకై నేను వెతుకుతున్నానా? గడచిన గొప్పదనపు ఒక కిరణం మరచిన పాటలోని ఒక చరణం యీ చీకటి క్షణాలు గడిపేందుకు కదలని కాలరథం నడిపేందుకు పూచికపుల్ల, చిన్న ఆధారం యీ హారపు తెగిపోయిన దారం ఇదా నేను అన్వేషిస్తున్నది? ఈ ధ్వంసంలో ఆశిస్తున్నది?     -- జీవితం,...

అనర్గళము

  డిసెంబర్ 16, 2021 అనర్గళము  ( an-argaḷamu )       అర్థము      (విశేషణము ):   అర్గళము (గడియ, అడ్డంకి, ప్రతిరోధము) లేనిది; అడ్డులేని; నిరంకుశమైన; ధారాళంగా     Meaning     (adj) : unimpeded; unrestrained; free flowing           వాడుక / Usage     మాజీ ప్రధాని పీవీ నరసింహా రావు గారు పదిహేడు భాషలలో అనర్గళంగా సంభాషించేవారు.     Former PM PV Narasimha Rao could converse fluently in 17 languages.     మెదడుకు మేత / Food for thought ఏమి   సేతురా   లింగా ,  ఏమీ   సేతురా... గంగ   ఉదకము   తెచ్చి   నీకు లింగ   పూజలు   సేదమంటె ... గంగనున్న   చేప   కప్ప   ఎంగిలంటున్నాది   లింగా మహానుభావ   మా ( హ ) దేవశంభో   మాలింగమూర్తి... అక్షయావుల   పాడి   తెచ్చి అరిపితము   చేదమంటె ... ఒహో అక్షయావుల   లేగదూడ   ఎంగిలంటున్నాది   లింగా మహానుభావ   మా ( హ ) దేవశంభో   మాలింగమ...

ఆహార్యము

  డిసెంబర్ 15, 2021 ఆహార్యము  ( āhāryamu )       అర్థము      (విశేష్యము/విశేషణము ):  అభినయము; వేష సామాగ్రి; స్వభావ సిద్ధము కానిది; ఆకర్షింప తగినది; తినదగినది     Meaning     (noun/adj) : a dance pose; accessories defining a character in a play; not natural; to be eaten           వాడుక / Usage     పుష్పాలో కథానాయకుడి ఆహార్యం సహజ సిద్ధంగా ఉంది.     The protagonist's character in Pushpa has been sculpted realistically.      మెదడుకు మేత / Food for thought కవుల కలాలు,గాయకుల కమ్మని కంఠము లీ సశ్మశానపుం గవనులఁ ద్రొక్కి చూచెడి;నొకానొకనాఁడల కాళిదాస భా రవుల శరీరముల్ ప్రకృతిరంగమునం దిపు డెంత లేసి రే ణువు లయి మృత్తికం కలిసెనో కద! కుమ్మరి వాని సారె పై     ( కవితా సుధలోలికించిన కవులకలాలు, శ్రవణాందకరమైన గాయకుల కమ్మని కంఠస్వరాలు ... ఇదిగో ఈ శ్మశాన పూవాటికలో విశ్రమించాయి. మట్టిలో ఖననము చెయ్యబడిన తనువు క్రమంగా కృషించి,నశించి,జీర్ణించి మట్టీలో మట్టిగా కలసిపోతుంద...

ఆకలనము

   డిసెంబర్ 14, 2021 ఆకలనము  ( ākalanamu )       అర్థము      (విశేష్యము ):  అవగాహన; జ్ఞానము; కోరిక; గుంపు; లెక్క పెట్టడం     Meaning     (noun) : comprehension; knowledge; desire; mob; counting/reckoning           వాడుక / Usage     పరిపాలనలోని కిటుకులు క్రొద్ది సమయంలోనే ఆకలనం చేసుకుంది.     She comprehended the intricacies of governance very soon.     మెదడుకు మేత / Food for thought కోపమునను ఘనత కొంచమైపోవును కోపమును మిగులఁగోడు గలుగుఁ గోపమడచెనేని గోర్కెలునీడేరు విశ్వదాభిరామ! వినురవేమ!      ( కోపము వలన గొప్పతనము నశించటమే గాక దుఃఖము కలుగుతుంది. కోపమును తగ్గించుకొన్న యెడల అన్ని కోరికలు ఫలిస్తాయి)

అయాచితము

  డిసెంబర్ 13, 2021 అయాచితము  ( a-yāchitamu )       అర్థము      (విశేషణము ):  అడగకుండా లభించేది; ఇతరులను యాచించకుండా ఉన్నదానితో బ్రతకడం     Meaning     (adj) : getting something that is unasked/unsolicited; living without asking for alms/support           వాడుక / Usage     అయాచితంగా ఆస్తి రావడం వల్ల అతనికి ధనము యొక్క విలువ తెలియలేదు.     Having got the property unasked, he did not realize the value of money.     మెదడుకు మేత / Food for thought సాహసం నా పథం రాజసం నా రథం సాగితే ఆపడం సాధ్యమా పౌరుషం ఆయుధం పోరులో జీవితం కైవసం కావడం కష్టమా... నిశ్చయం నిశ్చలం నిర్బయం నా హయాం హా కానిదేముంది నే కోరుకుంటే బూని సాధించుకోనా లాభమేముంది కలకాలముంటే కామితం తీరకుండా.. తప్పనీ ఒప్పనీ తర్కమే చెయ్యను కష్టమో నష్టమో లెక్కలే వెయ్యను.. ఊరుకుంటే కాలమంతా జారిపోదా ఊహ వెంట ఓడితే జాలి చూపేన కాలం..కాలరాసేసి పోదా అంతము సొంతము పంతమే వీడను మందలో పందిలా ఉండనే ఉండను భీరువల్లే పారిపోనూ..రేయ...

మిథునము

  డిసెంబర్ 10, 2021 మిథునము  ( mithunamu )       అర్థము      (విశేష్యము ):    మిథ్ = కలవడం ; సంభోగము; ఆలుమగల జంట;  ద్వయము; ఒక రాశి     Meaning     (noun) : union; intercourse; a married couple; the sign Gemini           వాడుక / Usage     రమణ రాసిన మిథునం కథ బాగా నచ్చి బాపు స్వదస్తూరితో దానిని వ్రాసి ఇచ్చారు.     Bapu liked Ramana's "Mithunam" (the couple) and wrote the story in his own hand.     మెదడుకు మేత / Food for thought      అంటుకోను ఆముదం లేదుకాని, మీసాలకు సంపెంగ నూనె