Posts

Showing posts from December, 2020

హాయనము

  డిసెంబర్ 31, 2020 ఈ అనంత కాల ప్రవాహాన్ని ఎలా కొలిచేది? హాయనము  ( hāyanamu )       అర్థము        (విశేష్యము): సంవత్సరము, రెండు ఆయనములు; కిరణము          Meaning        (noun) : a year; ray of light        వాడుక / Usage     రవి హాయనము తో నూతన సంవత్సరం శుభారంభమైనది.      The new year kicked off to a good start with Suns first rays.      మెదడుకు మేత / Food for thought       ‘‘స్థలం, సమయం గతులు తప్పాయి. విశ్వమే కదిలిపోతున్నట్లుంది. ఎక్కడికో ఇంకా ఇంకా దగ్గరగా కలిసి ఒకరై,         అన్ని రహస్యాలన్నీ భేదించి, అన్ని లోతుల్నీ శోధించి, అన్ని శిఖరాలనీ సాధించి, ఒంటి జీవంగా కొట్టుకుని,       విశ్వరహస్యానికి ప్రాణం పోశారు. ఆలోచనా, విమర్శనా, తర్కం, చైతన్యం...అన్నీ ఉద్రేకాల ప్రవాహంలో కెరటంపై       నురుగు కొట్టుకుపోతున్నాయి. దేనికోసమో, రెండు ప్రాణులు సృష్టి శక్తులన...

ఝాము

  డిసెంబర్ 30, 2020 ఈ అనంత కాల ప్రవాహాన్ని ఎలా కొలిచేది? ఝాము  ( ḍzāmu )       అర్థము        (విశేష్యము): ఏడున్నర ఘడియలు అనగా మూడు గంటలు; ప్రహర; రోజులో ఎనిమిదవ భాగం          Meaning        (noun) : eighth part of a day; 3 hours        వాడుక / Usage     తెల్లవారు ఝామున లేచి ప్రయాణం కొనసాగించెను.      She woke up early in the morning and resumed her journey.      మెదడుకు మేత / Food for thought       ‘‘ న పుణ్యం న పాపం న సౌఖ్యం న దు:ఖం      న మంత్రో న తీర్థం న వేదా న యజ్ఞా:      అహం భోజనం నైవ భోజ్యం న భోక్తా      చిదానంద రూప: శివోహం శివోహం      అర్ధం–పుణ్యపాపాలు, సుఖదుఖాలు నాకు లేనే లేవు.      మంత్రం లేదు, క్షేత్రములు లేవు. వేదాలు,యజ్ఞాలు అసలు లేనే లేవు.      నేను భోజనాన్ని కాను, భోజ్యమూ కాను, భోక్తను కా...

లిప్త

  డిసెంబర్ 29, 2020 ఈ అనంత కాల ప్రవాహాన్ని ఎలా కొలిచేది? లిప్త  ( liptha )       అర్థము        (విశేష్యము): 0.4 సెకన్లు;  ఘడియలో అరవయ్యో భాగం విఘడియ(24 సెకన్లు), విఘడియలో అరవయ్యో భాగం                                 లిప్త; అతి చిన్న సమయం          Meaning        (noun) : 60*60*60 part of a day ie 0.4 seconds ; very short time        వాడుక / Usage     లిప్త కాలంలో ఆమె కల చెదిరిపోయింది.      Her dreams were shattered in a fraction of a second.      మెదడుకు మేత / Food for thought       ‘‘ నశించే జీవరాశులు ఇంకో జీవాన్ని స్పృశిస్తాయి         వంతులవారీగా ఊపిరి పోసుకుని, వదులుతాయి         సంద్రంపై బుడగలవోలె భౌతిక సాగరంలో పుడుతున్నాయి         పైక...

ఘడియ

     డిసెంబర్ 28, 2020 ఈ అనంత కాల ప్రవాహాన్ని ఎలా కొలిచేది? ఘడియ  ( ghaḍiya )       అర్థము        (విశేష్యము): ఒక రోజులో అరవయ్యో భాగం అనగా ఇరవై నాలుగు నిముషాల కాలం;ప్రకృతి - ఘటిక; వికృతి -                                    ఘడియ, గడియ          Meaning        (noun) : sixtieth part of a day ie 24 minutes        వాడుక / Usage     కరోనా లేని శుభ ఘడియ ల కోసం ప్రపంచం ఎదురు చూస్తోంది.      The world is waiting for the good times, free of corona.      మెదడుకు మేత / Food for thought       ‘‘ కాలం చెప్పినట్లు ఎవరైనా నడవాల్సిందే గాని హుంకరిస్తే వినాశనమే మిగిలేది.కాలం చెప్పేది ఒక్కటే. ఎలాంటి విపత్కర పరిస్థితులు ఎదురైనా నాలాగా ప్రశాంత చిత్తంతో ఉండు. ప్రశాంతంగా నీపని నువ్వు చేసుకుంటూ వెళ్ళు. ఎన్నో ప్రళయాల...

పాలపుంత

    డిసెంబర్ 25, 2020 పైకి చూడండి... పాలపుంత  ( p āl apuntha )       అర్థము        (విశేష్యము):  పుంత అనగా దారి; ఆకాశంలో నక్షత్రాల సమూహం వలన కాంతివంతంగా కనిపించే దారి;                                 ఆకాశగంగ, పాలవెల్లి          Meaning        (noun) : Milky Way galaxy        వాడుక / Usage      మన పాలపుంత లో దాదాపు 40,000 కోట్ల నక్షత్రాలు ఉన్నాయి.      There are around 400 billion stars in our Milky Way.      మెదడుకు మేత / Food for thought      ‘‘ఓ దేవుడా!         సామాన్యుడి స్వరం వినలేనంత స్థాయికి నన్ను ఎదగనివ్వకు...         ఆ స్థితికి నన్ను దిగజారనివ్వకు.....        మనిషి గుండెలో అగ్ని చల్లారిపోతే ఇక ఆ మనిషి ఎందుకు? ’’     -- అటల్ బ...

గురుత్వాకర్షణ

   డిసెంబర్ 24, 2020 పైకి చూడండి... గురుత్వాకర్షణ  ( gurutv ā karsha ṇ a )       అర్థము        (విశేష్యము): గురుత్వము - బరువు, గొప్పతనము, గురుభావము; ఆకర్షణ - లాగడం, సమ్మోహనం        అంటే బరువు ఉన్న వస్తువులు ఒక దానిని ఒకటి ఆకర్షించుకోవటం           Meaning        (adjective) : gravitational pull/attraction        వాడుక / Usage      ఖగోళంలో గ్రహాల పరస్పర  గురుత్వాకర్షణ   వల్ల తమకు తామే అలా నిలిచియున్నాయని భాస్కరాచార్యుడు                లీలావతి అనే గ్రంధంలో చెప్పాడు.      In the book Lilavathi, Bhaskaracharya states that planets in space hold their position because of         gravitational attraction.      మెదడుకు మేత / Food for thought     "ఒక సిద్ధాంతం శాస్త్రపరమైనది అనడానికి అది విషయాలను రెండుగా విభజించాలి - ఒక సమూహం...

విషువత్తు

  డిసెంబర్ 23, 2020 పైకి చూడండి... విషువత్తు  ( vishuvattu )       అర్థము        (విశేష్యము):  రాత్రింబవళ్ళు సమానంగా ఉండే రోజులు (మార్చి 21, సెప్టెంబర్‌ 23 తేదీలు);  విషు అనగా సమానము;           Meaning        (noun) : equinox; when daytime and  nighttime are approximately equal        వాడుక / Usage     మార్చ్ లో వచ్చే విషువత్తుని వసంత విషువత్తు అంటారు.        The equinox in spring is called vernal equinox.      మెదడుకు మేత / Food for thought      " పోనీ, పోనీ,         పోతే పోనీ!         సతుల్‌, సుతుల్‌, హితుల్‌ పోనీ      పోతే పోనీ!      రానీ, రానీ,      వస్తే రానీ!      కష్టాల్‌, నష్టాల్‌,      కోపాల్‌, తాపాల్‌, శాపాల్‌, రానీ!      వస్తే రానీ!    ...

గ్రహశకలం

  డిసెంబర్ 22, 2020 పైకి చూడండి... గ్రహశకలం  ( grahasakalam )       అర్థము        (విశేష్యము):  స్వల్ప గ్రహాలు, అంగారక(Mars) మరియు బృహస్పతి(Jupiter) మధ్య ఉండి సుర్యుని                   చుట్టూ తిరిగే చిన్న గ్రహాలు.           Meaning        (noun) : asteroids, typically found in the asteroid belt between Mars and Jupiter        వాడుక / Usage      గ్రహశకలం లో చిన్న శకలం భూమి యొక్క వాతావరణంలో ప్రవేశించి, మండిపోయి కాంతి పుంజం అవ్వడాన్ని      ఉల్క అంటారు.          When a small piece of an asteroid burns up on entering earth's atmosphere, creating a streak of           light, it's called a meteor.      మెదడుకు మేత / Food for thought      " చరిత్ర తారసపడినప్పుడు మన బుద్ధి "అస్పష్ట త్రయం" అనే రుగ్మతకు లోన...

ఉల్క

  డిసెంబర్ 21, 2020 పైకి చూడండి... ఉల్క  ( ulka )       అర్థము        (విశేష్యము): అంగారము, కొరివి కట్టె; దీపావళిలో లక్ష్మీ పూజకి వెలిగించే దీపం; ఆకాశం నుంచి పడే కాంతి          పుంజం;           Meaning        (noun) : embers, firebrand; lamp lit after Lakshmi puja on Deepavali; meteor         వాడుక / Usage        డిసెంబర్ 13-14, ఉల్కాపాతంలో గంటకు 150 ఉల్కలు పడ్డాయి.        Around 150 meteors fell  in a meteor shower on December 13-14 .      మెదడుకు మేత / Food for thought      " మౌనమే నీ భాష ఓ మూగ మనసా        ఓ మూగ మనసా      చీకటి గుహ నీవు చింతల చెలి నీవు      నాటక రంగానివే మనసా తెగిన పతంగానివే      ఎందుకు వలచేవో ఎందుకు వగచేవో      ఎందుకు రగిలేవో ఏమై మిగిలేవో      ఎంద...

కరుణ

     డిసెంబర్ 18, 2020 నవరసాలలో కొన్ని.... కరుణ  ( karuṇa )       అర్థము        (విశేష్యము):  కనికరము,  కటాక్షము,  అనుగ్రహము; కండ్ర (రాయలసీమలో)           Meaning        (adjective) : mercy, grace, compassion; bitter (in Rayalaseema)        వాడుక / Usage        కరుణ రసాత్మాక గీతాలలో భావానికి తగినట్లు పాడటం ఘంటసాల తనకు తానే సాటి.       Ghantasala is in a league of his own when it comes to singing devotional songs.      మెదడుకు మేత / Food for thought      " సంస్కృతంలో వంకాయని "వతింగన" అంటారు. ఇది పారశీక భాషలో "బదింగన్" అయింది. పారశీకం నుండి        అరబ్బీలోకి  వెళ్ళి అక్కడ "ఆల్ బదైన్‌జన్" అయింది.  అరబ్బీ నుండి కేటలీనా వెళ్ళి అక్కడ "ఆల్బర్జీనా"               అయింది. అక్కడనుండి ఫ్రెంచి భా షలోకి వెళ్ళి "ఔబర్‌జీన్| అయి...

అద్భుతము

    డిసెంబర్ 17, 2020 నవరసాలలో కొన్ని.... అద్భుతము  ( adbhu̇tamu )       అర్థము        (విశేష్యము): ఆశ్చర్యము, విస్మయము, వింత, అపూర్వము           Meaning        (adjective) : wonder, marvel, surprising, amazing, miracle        వాడుక / Usage        ఆ దుర్ఘటనలో అతను బ్రతకడం ఒక అద్భుతం .        It is a miracle that he survived that accident.      మెదడుకు మేత / Food for thought      "1.  లబ్దప్రతిష్ఠుడైన శాస్త్రవేత్త ఇది సాధ్యం అంటే వాళ్ళు అనేది నిజమే. కాని ఇది అసాధ్యం అంటే మాత్రం బహుశా                 అది తప్పే.       2.  సాధ్యానికి అవధులు తెలుసుకునే ఓకే ఒక్క మార్గం, దానిని దాటుకుంటూ అసాధ్యంలోకి చొచ్చుకు పోవడమే.        3.   అభివృద్ధిచెందిన సాంకేతిక పరిజ్ఞానాన్ని, ఇంద్రజాలాన్ని వేరుచేసి గుర్...

శృంగారము

   డిసెంబర్ 16, 2020 నవరసాలలో కొన్ని.... శృంగారము  ( ṣṛingāramu )       అర్థము        (విశేష్యము): గంధపు పొడి, లవంగం పువ్వు, సింధూరం; అలంకారము, అందము, సంభోగము           Meaning        (adjective) : sandalwood powder, clove flower,  vermilion; adornment, beauty, passion, coitus        వాడుక / Usage        ‘హర్షనైషధం’ లో ఉన్న  శృంగారం పాలు శ్రీనాథుని 'శృంగార నైషధంలో' లేదు.        The extent of eroticism in Harsha Naishadam, is not seen in Srinadha's Sringara Naishadam.      మెదడుకు మేత / Food for thought        "సిరి గల వానికి చెల్లును,        తరుణులు పదియారు వేలు తగ పెండ్లాడన్,         తిరిపెమునకిద్దరాండ్రా,         పరమేశా గంగ విడుము పార్వతి చాలున్.."          --- శ్రీనాధుడు (1365 - 1441) పల్న...

బీభత్సము

  డిసెంబర్ 15, 2020 నవరసాలలో కొన్ని.... బీభత్సము  ( bībhatsamu )       అర్థము        (విశేష్యము): వికారము, జుగుప్స, రోత, అసహ్యం, ఇబ్బంది           Meaning        (adjective) : horror, disgust, loathing, harassment        వాడుక / Usage         రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వర్షం బీభత్సం సృష్టించింది.        Rains caused a lot of harassment in several districts of the state.      మెదడుకు మేత / Food for thought     " ఎంతమంది సతీమతల్లుల కన్నీటి ధారలు నింపుకున్నదో కదా ఈ రుద్రభూమి         ఇచ్చోటనే....ఇచ్చోటనే....!!         సత్కవీంద్రుని కమ్మని కలము        నిప్పులలోన కరిగిపోయే         ఇచ్చోటనే భూములేలు రాజన్యుల         అధికార ముద్రికల్ అంతరించే         ఇచ్చోటనే...!! ...

రౌద్రము

   డిసెంబర్ 14, 2020 నవరసాలలో కొన్ని.... రౌద్రము  ( raudramu )       అర్థము        (విశేష్యము): ఎండ; దినభాగములు(15)లో మొదటిది; రుద్రునిది; నవరసాలలో ఒకటి      (విశేషణము): భయంకరమైన, తీక్షణమైన     Meaning        (noun) : heat; one of nine emotions; wrath, rage        వాడుక / Usage         బొబ్బిలి యుద్ధం  చిత్రంలో ఎస్ వి రంగారావు తాండ్ర పాపారాయుడి పాత్ర రౌద్రానికి  పరాకాష్ఠ.        SV Ranga Rao's role as Tandra Paparayudu in Bobbili Yuddham movie is the epitome of rage.      మెదడుకు మేత / Food for thought     "పులి పులి బెబ్బులి పులి! నీ పొడుపులకు హడలి పారిపోడానికి ఇది అడవి పులి కాదు విజయరామ, ఇది బెబ్బులి పులి. నీ అంతిమ యాత్రకు ఇదే తగిన సమయము. మా బెబ్బులి కోటను స్మశానవాటిక చేసిన కఠినాత్ముడవు. నువ్వు రెచ్చగొట్టిన ఆ రణ పిశాచికి నిన్నే ఆహుతి చేస్తాను. నీ పేరాశకు ఇదే బహుమానం...మీరా నన్ను బంధి...

హైమనము

  డిసెంబర్ 11, 2020 చలిపులి మాటువేసింది. రజాయిలో దూరండి.... హైమనము  ( haimanamu )       అర్థము        (విశేష్యము):  మార్గశీర్షమాసము; (విశేషణము): చలియైన; బంగారపు (మృగశీర - బంగారపు జింక వలే      చిత్రించబడుతుంది)     Meaning        (noun) : MargaSira - ninth month in the Hindu calendar; (adjective): cold, wintry, golden        వాడుక / Usage        ప్రభాత కాలంలో సూర్యకిరణాలు  హైమనముగా ఉండెను.        The rising Sun's rays were golden.      మెదడుకు మేత / Food for thought     "'నా పాటె  పా'  టంట          'నా మాటె  మా'  టంట          నలుగురమ్మలు సేరి నను మెచ్చుతావుంటె ,                సూడాలి నా యెంకి సూపు లా యేళ                సూడాలి నా యెం...

అయనము

  డిసెంబర్ 10, 2020 చలిపులి మాటువేసింది. రజాయిలో దూరండి.... అయనము  ( ayanamu )       అర్థము        (విశేష్యము) : మార్గము; అర్ధ సంవత్సరము; సూర్యుని దక్షిణోత్తర గతి     Meaning        (noun) : path; half year; sun's course across northern and southern constellations        వాడుక / Usage         రామాయణం అనగా రామ అయనము  అంటే రాముడే గమ్యం.        Ramayanam means Rama is the path.      మెదడుకు మేత / Food for thought     " రాజు మరణించె నొక తార రాలిపోయె      కవియు మరణించె నొక తార గగనమెక్కె         రాజు జీవించె రాతి విగ్రహములందు      సుకవి జీవించె ప్రజల నాలుకలయందు "          --- గుర్రం జాషువ (సెప్టెంబర్ 28 1895 - 1971)

శీతకన్ను

  డిసెంబర్ 09, 2020 చలిపులి మాటువేసింది. రజాయిలో దూరండి.... శీతకన్ను  ( ṣī takannu )       అర్థము        (విశేష్యము) : నిర్లక్ష్య ధోరణి; ఉదాసీన వైఖరి చూపడం; శీత అంటే చల్లదనం - ఆంగ్లం వాడుక కోల్డ్ ఐ నుంచి వచ్చి ఉండవచ్చు     Meaning        (adjective) : unfriendly; cold eye; cold reception        వాడుక / Usage         రాజమహేంద్రవరంలో తెలుగు విశ్వవిద్యాలయం ఏర్పాటు హామీపై ప్రభుత్వం శీతకన్ను చూపింది.         The government cast a cold eye on its promise of establishing Telugu university          at Rajamahendravaram.      మెదడుకు మేత / Food for thought     " ఒకడు కష్టపడి పనిచేసి చికెన్ బిర్యానీ తెచ్చుకుంటాడు, వాడి దగ్గర చికెన్ ముక్క లాక్కున్నాం అనుకో,      అన్నంలో పప్పు కలుపుకుని తింటాడు.పప్పు లాక్కున్నాం అనుకో, చారు కలుపుకుని తింటాడు.      అన్నమే లాక్కున్నాం అను...