Posts

Showing posts from June, 2021

పుంఖానుపుంఖము

  జూన్ 30, 2021 పుంఖానుపుంఖము  ( pumkha-nu-pumkhamu )       అర్థము      (విశేష్యము): వెనువెంట; ఒకదాని మీద ఒకటి; గుంపులు గుంపులుగా; ముమ్మరంగా     Meaning     (adjective) : in rapid succession         వాడుక / Usage     సామజిక మాధ్యమాలలో  పుంఖానుపుంఖాలుగా వచ్చే మతపరమైన సందేశాలు కారుచిచ్చు పెడుతున్నాయి.   The barrage of religious messages on social media are adding fuel to fire.      మెదడుకు మేత / Food for thought "ఈరోజుకీ నాకు ఆ ఇద్దరు ఇటాలియన్ అమ్మాయిలు ఏమి పాడారో దేనిగురించి పాడారో తెలియదు. నిజం చెప్పాలంటే అసలు తెలుసుకోవాలని కూడా లేదు. కొన్ని విషయాలు పదాల్లో పెట్టకపోవడమే మంచిది, అర్థం కాక పోవడమే ఉత్తమం. ఎంతో అందమైన వర్ణనాతీతమైన దానిగురించి వాళ్ళు పడుతున్నారని ఊహించుకోవడంలోనే ఆనందం ఉంది. ఆ అద్వితీయ సౌందర్యం మాటలలో చెప్పడానికి అలవి కాక హృదయానికి తీపి బాధ కలగచేసిందేమో. నేను చెప్తున్నాను, ఆ నాదాలు గగన సీమలలో విహంగ వీక్షణ చేసాయి. వెలుగు దూరని చీకటి మూలలో ఎవ్వరూ కలగనలేన...

పరివ్రాజకుడు

  జూన్ 29, 2021 పరివ్రాజకుడు  ( pari-vrājakuḍu )       అర్థము      (విశేష్యము): సన్యాసి; వ్రజ అనగా సంచరించడం; విషయ భోగాలని త్యజించి తిరిగేవారు.     Meaning     (noun) : mendicant; Sanyasi; monk        వాడుక / Usage     చిన్నపాటి  పరివ్రాజకుడు  కొండల్లో తిరుగుతాడు, సర్వ సంగపరిత్యాగి నగరంలో జీవిస్తాడు.   A new monk might roam the hills but an enlightened one lives in society.      మెదడుకు మేత / Food for thought "మన దేశంలో కవిత్వం కవితా పద్ధతులు కవితా శైలి రకరకాలుగా ప్రవహించింది. కానీ మన దగ్గర తెలుగులో భావంతో పాటు పాండిత్యం కూడా, పాండిత్యంతో పాటు శబ్ధాధిపత్యం కూడా లేకపోతే పూర్తిగా కవి ఎన్నడూ రాణించలేదు. కంప్యూటర్లు వచ్చిన తర్వాత జ్ఞాపక శక్తికి అంత ప్రాముఖ్యత లేదు. కానీ దానికి తనం లేదు. నో సెన్స్. అది మన దగ్గర ఉంది. మీరు ఎంత విజ్ఞానములో ముందుకు వెళ్ళిపోయినా మనిషిని మీరు రీప్లేస్ చేయలేరు. ఎంత యంత్రాలు లేక టెక్నాలజీ వచ్చిన దానికి జనకులు మనం. Technology is a very good se...

పరిణాహము

  జూన్ 28, 2021 పరిణాహము  ( pariṇāhamu )       అర్థము      (విశేష్యము): వెడలుపు; వైశాల్యం; విరివి; విస్తీర్ణం; ఒడ్డు     Meaning     (noun) : extent; width; breadth; circumference        వాడుక / Usage     ప్రపంచ పరిణాహాన్ని కాంతి కన్నా వేగంగా చుట్టి రాగలిగేది మనస్సు.   Mind traverses the breadth of the world faster than light.      మెదడుకు మేత / Food for thought " రణరంగం కాని చోటు భూ  స్థలమంతా వెదికిన దొరకదు; గతమంతా తడిసె రక్తమున, కాకుంటే కన్నీళ్లులతో. చల్లారిన సంసారాలూ, మరణించిన జన సందోహం, అసహాయుల హాహాకారం చరిత్రలో మూలుగుతున్నవి." -- మహాప్రస్థానం, శ్రీశ్రీ  (ఏప్రిల్ 13, 1910 - 1983)

కౌముది

  జూన్ 25, 2021 కౌముది  ( kaumudi )       అర్థము      (విశేష్యము): వెన్నెల; చంద్రిక;కార్తీక పౌర్ణమి; పండుగ; చల్లని కాంతి వెదజల్లునది     Meaning     (noun) : moonlight; anything producing coolness like moonlight; festival        వాడుక / Usage     గలగలా పారే కృష్ణమ్మ తీరాన  మిలమిలా మెరిసే కౌముదిలో అభిసారికై వేచింది.   She waited for her beloved on the moonlit banks of Krishna.      మెదడుకు మేత / Food for thought " అలసత యొప్పనల్లన రతాంతమునం బ్రియునొద్దఁ బాసి నె  చ్చెలికడ కేఁగుదెంచు సరసీరుహనేత్ర విలోచనంబులం  దలఁకెడు మందహాసము విధంబున సొంపున మీఱియున్న చెం  గలువలలోన నింపడరు కౌముది వేడ్కలొనర్చెఁ జూడ్కికిన్ " (రతి అనంతరం అలిసిపోయి పడుకున్న ప్రియుడిని వదిలి సఖుల దగ్గరకు వెళ్లే యువతి యొక్క కమలనయనాలలో చిందే చిలిపి చిరునవ్వు లాగా ముచ్చటగా ఉందట ఆ ఎర్ర కలువలలో మెరిసే నిండు వెన్నెల) -- నిర్వచనోత్తర రామాయణం, తిక్కన సోమయాజి (1205 - 1288)

విలోచనము

  జూన్ 24, 2021 విలోచనము  ( vi lōchanamu )       అర్థము      (విశేష్యము): నేత్రము; కన్ను; చక్షువు     Meaning     (noun) : eye        వాడుక / Usage      జలజముల వంటి ఆ విలోచనముల నిగూఢ సరస్సులో నన్ను నేను కోల్పోయాను.   I lost myself in the mysterious depths of her lotus eyes.      మెదడుకు మేత / Food for thought " తమ జీవితాలని దేశ సేవ కోసం ధార పోసిన వాళ్ళని గౌరవించి ఋణపడి ఉండడంలో తప్పు లేదు. కానీ దానికి   ఒక పరిమితి ఉండాలి. జాన్ స్టువర్ట్ మిల్ అన్నట్లు 'మన స్వాతంత్రం ఏ ఒక్క గొప్ప మనిషికి పాదాక్రాంతం చెయ్య  కూడదు. ఈ జాగురకత  మన దేశంలో ఇంకా అవసరం. ఎందుకంటే భారత దేశంలో వ్యక్తి పూజ, రాజకీయాలలో ఇంకే  దేశంలో లేనంతగా పూడుకు పోయింది. మతంలో భక్తి మోక్షానికి దారి అవ్వచ్చు. కానీ వ్యక్తి పూజ లేక భక్తి సామజిక  వ్యవస్థలో ఉంటే అది తప్పక భ్రష్టత్వానికి నిరంకుశత్వానికి నాంది పలుకుతుంది. " -- రాజ్యాంగ సభలో డా. బాబా సాహెబ్ అంబేద్కర్ (ఏప్రిల్ 14, 1891 - 1956)

చెంగలువ

  జూన్ 23, 2021 చెంగలువ  ( chen-galuva )       అర్థము      (విశేష్యము): ఎర్ర కలువ; చెన్ను - ఎరుపు; కలువ - జల పుష్పము     Meaning     (noun) : red water lily        వాడుక / Usage      వెన్నెల రాత్రులలో చెంగలువలలా మెరిసే ప్రియురాలి అధరాలకు ఓం నమః.  Glorious are the lips of the lover shining like the red water lilies on a moonlit night.      మెదడుకు మేత / Food for thought " నగవులే నగవులై, బిగువులే బిగువులై సొగసులే సొగసులై, జూడ్కులే జూడ్కులై దొలుకారు మెఱపుల్లు దోబూచులాడినటుఁ దొలిచూలికన్నె కోర్కులు విచ్చికొన్న యటుఁ దొలుసారి రతి వింతసొలపు గ్రమ్మినయట్లుఁ దొలిగట్లుపైజొత్తు బులకరించిన యట్లుఁ దొలుసంజలోఁ దెల్వి దూకివచ్చిన యట్లు మలుసంజలోఁ గాంతి మరలిపోయిన యట్లు గులుకునీలపుఁగండ్లఁ దళుకుజూపులు బూయ ఘలుఘల్లుమని గాళ్ళఁ జిలిపిగజ్జెలు మ్రోయ         ఆడెనమ్మా! శివుఁడు         పాడెనమ్మా! భవుఁడు " -- శివతాండవము, పుట్టపర్తి నారాయణాచా...

ఇంపు

  జూన్ 22, 2021 ఇంపు  ( impu )       అర్థము      (విశేష్యము): ఆనందము; ఇష్టము; విలాసము; కోరిక; శోభాయమానం     Meaning     (noun) : pleasing; sweetness; beauty; desire; pleasure        వాడుక / Usage      తొలి సంధ్య వేళలో పక్షుల కలకలారావం ఎంతో ఇంపుగా ఉంటుంది.   The chirping of birds at sunrise is highly pleasing.      మెదడుకు మేత / Food for thought " కన్నీరే పొంగి పొంగి తెరల చాటు నా చూపులు చూడలేని మంచు బొమ్మనై యవ్వనాలు అదిమి అదిమి పువ్వులన్ని చిదిమి చిదిమి వెన్నెలంత ఏటిపాలు చేసుకుంటినే నాకు లేదు మమకారం మనసు మీద అధికారం నాకు లేదు మమకారం మనసు మీద అధికారం ఆశలు మాసిన వేసవిలో ఆవేదనలో రేగిన ఆలాపన సాగే మదిలో కలలే నదిలో వెల్లువలై పొంగారే మనసు వయసు కరిగే మధించిన సరాగమే కలతను రేపిన వలపుల వడిలో తిరిగే సుడులై ఎగసే ముగిసే కథనేనా ఎగసే ముగిసే కథనేనా " -- వేటూరి (జనవరి 29, 1936 - 2010)

అలసత

  జూన్ 21, 2021 అలసత  ( alasata )       అర్థము      (విశేష్యము): ఆలస్యం; మాంద్యం; సోమరితనం; సోంబేరితనం     Meaning     (noun) : delay; laziness; inactivity; indolence        వాడుక / Usage      ఇప్పుడు అలసత చూపితే తర్వాత భారీ మూల్యం చెల్లించవలసి వస్తుంది.   We will pay a heavy price in the future for our present indolence.      మెదడుకు మేత / Food for thought " ఒరులేయవి యొనరించిన  నరవర యప్రియములవి మనంబునకు దా  నొరులకు నవి చేయకునికి  పరాయణము పరమ ధర్మ పథములకెల్లన్ " (ఇతరులు ఏ పని చేస్తే నీ మనసుకు కష్టం కలుగుతుందో  అటువంటి పని ఇతరుల పట్ల చేయకపోవడమే, అన్నీ ధర్మాల్లోకల్లా ఉత్తమ ధర్మం.) -- విదుర నీతి,  తిక్కన భారతం (1205 -1288)

గుగ్గిళ్ళు

  జూన్ 18, 2021 ఈ వారం పదాలు  నెయ్యములల్లో నేరేళ్ళో   అనే అన్నమయ్య కీర్తన నుండి. గుగ్గిళ్ళు  ( guggiḷḷu )       అర్థము      (విశేష్యము): ఉడక పెట్టిన శెనగలు లేక ఇతర పప్పులు; గుర్రాలకు పెట్టే ఉడకపెట్టిన ఉలవలు     Meaning     (noun) : boiled pulses; boiled gram for horses or cattle        వాడుక / Usage       గుర్రానికి  గుగ్గిళ్ళు  పెడితే ఆవు పాలిస్తుందా.   Don't expect the cow to give milk if you have fed the horse.      మెదడుకు మేత / Food for thought "అప్పుడు  శూన్యం లేదు, సృష్టి లేదు. ఆకాశం లేదు, రోదసి లేదు. ఈ జగత్తు దేనితో కప్పబడి ఉందో, ఎక్కడ ఉందో?  అప్పుడు  మృత్యువు లేదు. మరియు జీవం కూడా లేదు. పగలు, రాత్రి లేవు. సర్వత్రా చీకటి వ్యాపించి ఉండేది. తనకు తాను ఆవిర్భవించింది శక్తి.   సృష్టి యొక్క అనంత శక్తి విశ్వమంతా వ్యాపిస్తూ ఉంది.  అయినా ఈ సృష్టి ఎప్పుడు, ఎక్కడ ప్రారంభమైందో ఎవరికి నిజంగా తెలుసు. ఎవరు ఆ నిజం చెప్పగలరు? దేవతలు ...

చెలువము

  జూన్ 17, 2021 చెలువము  ( cheluvamu )       అర్థము      (విశేష్యము): అందము, సౌందర్యము; విధము, పద్ధతి     Meaning     (noun) : beauty, elegance; manner, way        వాడుక / Usage      జాబిల్లి రావే,  కలువ  చెలువ  కలలు విరియ కొండనెక్కి రావే.   Come O Moon! Rise over the hills, let the beautiful dreams of the lily blossom.      మెదడుకు మేత / Food for thought " కోరికలు మరియు నారీ సొగసుల కామం వల్ల మాయలో పడి మునిగిపోకు.  ఇవన్నీ మాంసంముద్ద పైన మెరుగులు మాత్రమే. ఇలా మళ్ళీ మళ్ళీ మననం చేసుకోవటం మరువకు.  తామరాకుపైన వానచినుకులు పడి దొర్లినట్లుగా మనిషియొక్క జీవితం అనిశ్చితం.  ప్రపంచం అహం, రోగ, శోకాలకు గురౌతూనే ఉంటుంది అని తెలుసుకో!  నీ భార్య ఎవరు? నీ పుత్రుడెవ్వడు? ఈ విచిత్ర  ప్రపంచము. నీవు ఎవ్వడవు ? నీవు ఎక్కడ నుండి వచ్చావు? సోదరా! ఈ సత్యాలని ఆలోచించు.  యవ్వనం లేనప్పుడు కామం ఎందుకు? నీరు లేని చెరువు వల్ల ఉపయోగమేమి? ధనం పోయినపుడు బంధువుల...

ఒయ్యన

  జూన్ 16, 2021 ఒయ్యన  ( oyyana )       అర్థము      (విశేష్యము): మెల్లన; నెమ్మదిగా; విలాసముగా; వయ్యారంగా     Meaning     (adverb) : with gentleness; softly; slowly        వాడుక / Usage      ఊపిరి బిగపట్టి అడుగులో అడుగు వేసుకుంటూ ఒయ్యన నడిచాడు.   He held his breath and tiptoed gently.      మెదడుకు మేత / Food for thought " అన్నిటికన్నా మించి మనిషి ఆలోచనకి భయపడతాడు - నాశనం అవడం కన్నా, మృత్యువు కన్నా కూడా. ఆలోచన విధ్వంసకం, విప్లవాత్మకం, భయంకరం. అది ఆధిక్యత మీద దయ చూపదు. వ్యవస్థలను గౌరవించదు. అలవాట్ల సౌఖ్యాన్ని గుర్తించదు. ఆలోచన అరాచకం, నియమ విరుద్ధం. అధికారాన్ని లెక్క చేయదు. తరతరాల కట్టుబాట్లని ఖాతరు పెట్టదు. నరక కూపంలోకి తొంగి చూస్తుందికాని భయపడదు...ఆలోచన గొప్పది, వడిగలది. అన్నింటికన్నా స్వంతంత్రమైనది. అది ప్రపంచానికి వెలుగు చూపే దివిటీ. మానవుని కీర్తి పతాకం. " --బ్రిటిష్ తత్వవేత్త, తార్కికుడు, నాస్తికవాది, బెర్ట్రాండ్ రస్సెల్ (మే 18, 1872 - 1970)

చెలమ

  జూన్ 15, 2021 చెలమ  ( chelama )       అర్థము      (విశేష్యము): నీళ్లు కోసం త్రవ్విన గుంట;  ఏరు ఎండిపోయిన తరువాత ఇసుకలో నీటికోసం త్రవ్విన గుంట; ఊట     Meaning     (noun) : pit dug for water in dry bed of a river; depression or hole; spring or fountain        వాడుక / Usage      పల్లెల్లోని మహిళలు చాలా దూరం నడిచి చెలమలు వెదికి నీరు తెచ్చుకుంటున్నారు.   Women in the villages walk long distances in search of water holes.      మెదడుకు మేత / Food for thought " కాల్పనిక సాహిత్యం, నిజం తెలియచెప్పే ఒక అబద్ధం. సభ్య సమాజం తనను తాను నాశనం చేసుకోకుండా కాపాడడమే రచయత పరమార్థం. ప్రపంచాన్ని అర్థం చేసుకోవాలంటే ఒకోసారి దానిని విస్మరించి ఒంటరవ్వాలి. ఎప్పుడూ ప్రపంచపు అంచులలో వెతుకు. ఎందుకంటే సత్యం అక్కడే దాగి ఉంటుంది. " -- ఫ్రెంచ్ తత్వవేత్త, రచయత ఆల్బర్ట్ కామూ (నవంబర్ 7, 1913 - 1960)

నెయ్యము

  జూన్ 14, 2021 నెయ్యము  ( neyyamu )       అర్థము      (విశేష్యము): స్నేహము; ఇంపు; కామము; ప్రేమ     Meaning     (noun) : friendship; affection; love        వాడుక / Usage      రాజకీయాలలో శాశ్వత నెయ్యము కయ్యము ఉండవు.   There is no permanent friendship or enmity in politics.      మెదడుకు మేత / Food for thought " కుబుసం విడువలేని సర్పం చావక తప్పదు. అదే విధంగా అభిప్రాయాలు మార్చుకోలేని మస్తిష్కం కూడా. అలాంటి బుద్ధి బుద్ధే కాదు. మనతో భేదాభిప్రాయాలు ఉన్నవారికన్నా మనతో ఏకీభవించే వారినే ఎక్కువగా గౌరవించాలి అని నేర్పిస్తే యువతని నాశనం చేయడం ఖాయం. " -- జర్మనీ తత్వవేత్త,  ఫ్రెడ్రిక్ నీషే (అక్టోబర్ 15, 1844 - 1900)

కటకము

  జూన్ 11, 2021 కటకము  ( kaṭakamu )       అర్థము      (విశేష్యము): కడియము; లోయ; రాజధాని; ఉప్పు; కాంతి కిరణములు త్రిప్పగల పారదర్శక ఘన పదార్థం     Meaning     (noun) : bracelet; mountain ridge; capital; sea salt; lens        వాడుక / Usage      గురుత్వాకర్షణ కటకాలు  సుదూర నక్షత్ర కూటములు గురించి తెలుసుకోడానికి సహకరిస్తాయి.   Gravitational lenses help in studying distant galaxies.      మెదడుకు మేత / Food for thought " అక్షరాల నీడలలో నీ జాడలు చూసుకుని ఆ పదాల అల్లికలో నీ పెదవులు అద్దుకుని నీ కంటికి పాపను నేనై నీ ఇంటికి వాకిలి నేనై గడప దాటలేక నన్నే గడియ వేసుకున్నాను గడియైనా నీవులేక గడపలేక ఉన్నాను బదులైన లేని లేఖ బ్రతుకైన ప్రేమలేఖ నీ కౌగిట బిగిసిన స్వాసలతో నీ కవితలు నేర్పిన ప్రాసలతో ఇలా ఇలా రాయనీ నా లేఖని ప్రణయ రేఖని లిపి లేని కంటి బాస తెలిపింది చిలిపి ఆశ " -- శ్రీవారికి ప్రేమలేఖ, వేటూరి 'సుందర' రామమూర్తి (జనవరి 29, 1936 - 2010)

సాపేక్ష

  జూన్ 10, 2021 సాపేక్ష  ( sapeksha )       అర్థము      (విశేషణం): మరియొక దానిపై ఆధారపడిన; సాన్వయమైన; పరస్పర; ఐన్స్టెయిన్ యొక్క సిద్ధాంతం      Meaning     (adjective) : relative; dependent; conditional; Einstein's theory of relativity        వాడుక / Usage       ఆస్తి ధరల సాపేక్ష స్థోమత  , బలమైన మౌలిక సదుపాయాలు హైదరాబాద్ ప్రత్యేకత.    Relative affordability of housing, good infrastructure make Hyderabad special.      మెదడుకు మేత / Food for thought "ఏది ఏమైనా మీకు స్వాగతం. భూమిని అభిషిక్తం చేసేటందుకు సువర్ణకలశంలో దివ్యకాంతిని నింపుకుని ప్రభావితం విచ్చేసినట్లు వచ్చే మీ రాకకై మౌనంగా వేచి ఉంటాను. రండి మిత్రమా - తొందరగా విచ్చేయండి. పచ్చిక బయళ్ళ మీద గోధూళి నేల జారకముందే గొల్లవాడు పిల్లనగ్రోవి సర్దుకోకముందే ఎర్రటి సూర్యడు నల్లకొండల వెనుకకు జారకముందే హేమవర్ణ కలశంలో పండు వెన్నెలని నింపుకుని వచ్చే మీ కోసం కలువలా వేచియుంటాను. ముకుళించుకున్నానేమని విచార పడకండి. ప్రొ...

జడత్వము

  జూన్ 09, 2021 జడత్వము  ( jaḍatvamu )       అర్థము      (విశేష్యము): తెలివి లేకుండుట;  విశ్రాంతిలో గాని స్థిర చలనంలో ఉన్న వస్తువు గాని దానిస్థితి మార్చుకొనకుండ ఉండు గుణము     Meaning     (noun) : stupidity; inertia        వాడుక / Usage       అజ్ఞానము, జడత్వము , నిర్లక్ష్యము, మరియు మోహము తమో గుణము యొక్క లక్షణములు.   I nertia, negligence, and delusion are the signs of ignorance.      మెదడుకు మేత / Food for thought " పసిడి మెఱుంగుల తళతళలు పసిమి వెలుంగుల మిలమిలలు గౌతమి కృష్ణల గలగలలు గుడి జేగంటల గణగణలు మొఱసి, మొరసి మించిన శుభసమయము తల్లీ! తరళ యశోవతి! అనుపమిత రాగవల్లీ! నీవరసంతతి చేమోడ్పులివె తెలుగుతల్లీ! కవిపికముల సల్లాపములు గాయక బర్హ్యాలాపములు లాస్యత్ఖగ విన్యాసములు భాస్వత్పటహ నినాదములు విరిసి, మ్రోగి, పఱచిన శుభసమయము తల్లీ సరళోక్తి మధురసవతీ! కోమలవల్లీ! నీవరసంతతి చేమౌడ్పు లివె తెలుగుతల్లీ! హాలికజన కలహాసములు శ్రామికజన మధుహాసములు దాస్యవిముక్త నివాసములు స్వతంత్రప్రభావ...

పీడనము

  జూన్ 08, 2021 పీడనము  ( peedanamu )       అర్థము      (విశేష్యము): ఇతరులు కలిగించే బాధ; ఒత్తిడి; ఒక చదరపు పరిమాణం (unit area) పైన ఉండే బలం (force)     Meaning     (noun) : suffering caused by others; pressure        వాడుక / Usage      " ఏ దేశ చరిత్ర  చూసిన  ఏమున్నది గర్వకారణం. నరజాతి చరిత్ర సమస్తం. పర పీడన పరాయణత‍్వం" - శ్రీశ్రీ   What's to take pride in any nation's history? All of human history is about repressing others.      మెదడుకు మేత / Food for thought " వ్యాయామాత్ లభతే స్వాస్థ్యం దీర్ఘాయుష్యం బలం సుఖం   ఆరోగ్యం పరమం భాగ్యం స్వాస్థ్యం సర్వార్థ సాధనం " ( వ్యాయామము వలన ఆరోగ్యము చేకూరును. దీర్ఘాయుష్షు ,  బలము ,  సుఖము కలుగును. ఆరోగ్యమే మహా భాగ్యం. స్వాస్థ్యము సర్వార్థాలకి సాధనము. ) -- నరసింహ సుభాషితం