Posts

Showing posts from October, 2021

ఉద్దీపనము

  అక్టోబర్ 29, 2021 ఉద్దీపనము  ( ud-dīpanamu )       అర్థము      (విశేష్యము ):  వెలగడం; ప్రకాశించుట లేక ప్రకాశింపచేయుట; ఉద్రేకపరచుట; ప్రేరేపించు     Meaning     (noun) : burning; illuminating; inflaming; stimulus            వాడుక / Usage   ఆర్ధిక ఉద్దీపన ప్యాకేజీల కారణంగా దేశం అప్పుల ఊబిలో చిక్కుపడింది.   Financial stimulus packages have pushed the country into a debt trap.     మెదడుకు మేత / Food for thought “జీవితం సైకిల్ తొక్కడం లాంటిది.  సమతుల్యం ఉండాలంటే నిరంతరం కదులుతూ ఉండాలి. అన్నిటికన్నా అద్భుతమైన అనుభూతి నిగూఢమైన ఆశ్చర్యజనకమైన విషయాలోకనమే. విస్మయం చెందడం తెలియనివారు, ఇకపై విస్మయం పడనివారు, అబ్బురపడనివారు, కుతూహలపడనివారు నిర్జీవులు అయినట్టే."   -- పుత్రుడుకి రాసిన ఉత్తరంలో, ఆల్బర్ట్  ఐన్‌స్టీన్ (మార్చ్ 14, 1879 - 1955)

ఉల్లేఖనము

  అక్టోబర్ 28, 2021 ఉల్లేఖనము  ( ullekhaṇamu )       అర్థము      (విశేష్యము ):  వ్రాయడం; ఉచ్చరించడం; చెప్పుట;      Meaning     (noun) : writing; mention; allude           వాడుక / Usage   మొదట అణు విస్ఫోటనం చూసి ఓపెంహైమర్ భగవద్గీతలోని శ్లోకం ఉల్లేఖించాడు .   Witnessing the first atomic bomb test Oppenheimer quoted a Bhagavat Geeta sloka.     మెదడుకు మేత / Food for thought “అది సరైనది కాదు. కనీసం తప్పైనా కాదు! మనలో అత్యధికులు సాధించగలిగేది భౌతిక శాస్త్రంలో  వాస్తవం గురించి నిగూఢమైన స్థాయిలో ఇంకొంచం తప్పుగా అర్ధం చేసుకోవడమే. సంయమనంతో వేచి ఉండడం తెలిసినవారికి అన్నీ అర్థం అవుతాయి. "   --వోల్ఫ్ గ్యాంగ్  పౌలి  (ఏప్రిల్ 25, 1900 - 1958),  "రైటింగ్స్ ఆన్ ఫిజిక్స్ అండ్  ఫిలాసఫీ"

ఉగ్రాణము

  అక్టోబర్ 27, 2021 ఉగ్రాణము  ( ugrāṇamu )       అర్థము      (విశేష్యము ):  ధనము దాచే చోటు; కోశాగారం; సామాగ్రి ఉంచే చోటు; కొట్టు; వంటసాల; బొక్కసం     Meaning     (noun) : store house; treasury; pantry           వాడుక / Usage   పంచినకొలది తరిగేది ఉగ్రాణంలోని ధనం, పంచినకొలది పెరిగేది  హృదయకోశంలోని విద్య.   Wealth in the treasury depletes when shared but knowledge increases with sharing.     మెదడుకు మేత / Food for thought “మనిషిగా మనం ఆధారపడేది దేనిమీద? మన పదాల మీద...ఇంకొకరికి మన అనుభవాలు మన ఆలోచనలు తెలియచేయడం మన విధి. నిరంతరం మానవాళికి తెలిసిన జ్ఞాన పొలిమేరలను పెంపొందించడం మన కర్తవ్యం. కానీ మనం చెప్పేవి నిష్పాక్షికమై అసందిగ్ధం లేకుండా ఉండాలి. వాస్తవికత అనేది కూడా పదమే. ఆ పదాన్ని సరైన రీతిలో వాడడం నేర్చుకోవాలి."   -- నీల్స్ బోర్ (అక్టోబర్ 7, 1885 - 1962),  "ఫిలాసఫీ ఆఫ్ సైన్స్"

ఉత్పాదనము

  అక్టోబర్ 26, 2021 ఉత్పాదనము  ( uthpadanamu )       అర్థము      (విశేష్యము ):  కలిగించుట; పుట్టుంచుట; తయారుచేయుట; ఉత్పత్తి     Meaning     (noun) : producing; creating; beget            వాడుక / Usage   సరైన బొగ్గు నిల్వలు లేక ఇబ్రహీంపట్నంలో విద్యుత్తు ఉత్పాదనం పడిపోయింది.   Shortage of coal caused electricity production shortfall in Ibrahimpatnam.     మెదడుకు మేత / Food for thought “మనం పరిశీలించేది జగత్తును కాదు, మన శోధనా శైలికి విదితమయ్యే జగత్తు మాత్రమే. మాటలలో  వ్యక్తీకరించగలిగే వాస్తవికత, ఎన్నటికీ పరిపూర్ణ వాస్తవికత కాదు."   --వెర్నర్ హెయిసెంబెర్గ్ (డిసెంబర్ 5, 1901 - 1976),  "ఫిజిక్స్ అండ్ ఫిలాసఫీ - ది రెవల్యూషన్ ఇన్ మోడరన్ సైన్స్"

ఉద్ధరణము

  అక్టోబర్ 25, 2021 ఉద్ధరణము  ( uddharanamu )       అర్థము      (విశేష్యము ):  పైకి లేవదీయడం; పెకలించడం; ముక్తి; వాంతి     Meaning     (noun) : lifting up; emancipation; vomit           వాడుక / Usage   ఏనుగు శ్రీనివాసుల రెడ్డి దక్షిణాఫ్రికాలో నల్ల జాతీయుల ఉద్ధరణకి పాటుపడ్డారు.   E.Srinivasula Reddy pushed for the uplifting of blacks in South Africa.      మెదడుకు మేత / Food for thought “ఒక అంశం చర్చలేకుండా నిశ్చయించడం కన్నా చర్చించి నిశ్చయించకపోవడమే మేలు."   --జాన్ గ్రిబ్బిన్   "ఇన్ సెర్చ్ ఆఫ్ స్క్రాడింగేర్స్ క్యాట్ - క్వాంటమ్ ఫిజిక్స్ అండ్ రియాలిటీ"

గతజలసేతుబంధనం

  అక్టోబర్ 22, 2021 గతజలసేతుబంధనం  ( gatha-jala-sethu-bandhanam )       అర్థము      (విశేష్యము ):  అయిపోయిన దాని గురించి విచారించుట; ప్రయోజనం లేని యత్నం; నీరు పోయాక ఆనకట్ట కట్టుట     Meaning     (noun) : dwelling on past events; locking the stable door after the horses have bolted           వాడుక / Usage   అయోగ్యులకు పట్టంకట్టి ఇప్పుడు చింతించడం  గతజలసేతుబంధనమే .   It is pointless to regret now after handing over the reins to the unworthy.     మెదడుకు మేత / Food for thought “రాతిగుండెల మనుషుల మధ్య ఎన్నో దేశాలు తిరిగాను. ఎటు చూసినా రాతిగోడలు లేవడం చూశాను. ఎవరూ కూల్చలేని గొప్ప గొప్ప రాతిగోడలు. మనుషులకూ మనుషులకూ మధ్య రాతి గోడలు. కొట్టుకు చావడంలో కొందరు, డబ్బు సంపాయించడంలో కొందరు మునిగి తేలుతున్నారు. ప్రకృతిని ప్రేమించలేనివాళ్ల మధ్య నాకూ, నా మురళికీ చోటు లేదు. అందుకే ఇక్కడికి వచ్చేశాను. ఇదే నా చోటు. ఇంకెప్పుడూ నేను మళ్ళీ అక్కడికి రాను. కలకాలం ఇక్కడే మురళి పాట పాడుకుంట...

చరమాంకం

  అక్టోబర్ 21, 2021 చరమాంకం  ( charam -ā nkam )       అర్థము      (విశేష్యము ):  అంతిమ దశ ; చరమ = ఆఖరి / తుది, అంకం = నాటకంలో  భాగము     Meaning     (noun) : death knell; final stage           వాడుక / Usage    సమాచార హక్కు చట్టానికి ఇదే చరమాంకం .    It is the death knell for the Right to Information Act.     మెదడుకు మేత / Food for thought ముల్లు వెళ్లి అరిటాకు మీద పడితే? అరిటాకు వెళ్లి ముల్లు మీద పడితే? ఇదో పెద్ద భయం మనకు. ఏమవుతుంది? చిరిగితే ఒక ఆకు చిరుగుతుంది. అంత మాత్రాన చెట్టు మొత్తానికి ఉనికి లేకుండా పోతుందా? చెట్టున చిగురించిన ఇతర ఆకులకు అర్థం లేకుండా పోతుందా? చెట్టు యవ్వనం చెట్టు ఆయుష్షు చెట్టు దిగవిడువబోయే మధుర ఫలాల గెల...ఇవేవి లేకుండా పోతాయా? ముల్లు పడితే ముల్లును చూడాలి, తీసిపారేయాలి. తర్వాత ఆకును కూడా పక్కన పెట్టి ఆ తర్వాత కథ చూడాలి. అదీ కథ. జీవితం అదే కదా.   -- వాడ్రేవు చిన వీరభద్రుడు రాసిన సుజాత కథకి, మహమ్మద్ ఖదీర్ బాబు రీటెల్లింగ్

భవితవ్యం

  అక్టోబర్ 20, 2021 భవితవ్యం  ( bhavitavyam )       అర్థము      (విశేష్యము ): మంగళము; శుభము; (విశేషణము): జరుగదగునది; కాబోయేది     Meaning     (noun) : good tidings; (adj): that which is likely to happen           వాడుక / Usage     పొట్టి శ్రీరాములు ప్రాణాలొడ్డి సాధించిన రాష్ట్ర భవితవ్యం నేడు కుక్కలు చింపిన విస్తరిలా ఉంది.    The future of the state that Potti Sri Ramulu sacrificed his life for looks bleak.     మెదడుకు మేత / Food for thought దేవుడు బాల్యంలో ఉండగా చెట్లు మొక్కలు వృక్షాలు నదీనదాలు సముద్రాలూ సృష్టించి ఉంటాడు - ఆడుకోవడానికి. యవ్వనంలోకి వచ్చాక సాహసాలు పరాక్రమాలు విజయాలు విపరీతాలు సృష్టించి ఉంటాడు - ఎదురుకోడానికి. నడివయసులోకి వచ్చాక సమస్యలు సుడిగుండాలు బాదరబందీలు భయానకాలు సృష్టించి ఉంటాడు - వేగడానికి. వయసు ముదిరాక రోగాలు రొష్టులు ప్రమాదాలు ఉత్పాతాలు సృష్టించి ఉంటాడు - మరణించడానికి.....బాల్యానికి బాల్యం ప్రసాదించమని వేడుకునే కథ.   -- బాల్యం బుగ్గన ఒ...

కాలాతీతం

  అక్టోబర్ 19, 2021 కాలాతీతం  ( kal-ātītam )       అర్థము      (విశేష్యము ): సమయం (అతీతం=) దాటిపోవుట; ఆలస్యం     Meaning     (noun/adj) : late; delayed           వాడుక / Usage    రాష్ట్రాన్ని కులచిచ్చులోంచి కాపాడుకోవడానికి ఇప్పటికే కాలాతీతం అయ్యింది.    It is already too late to save the state from the boiling caste cauldron.     మెదడుకు మేత / Food for thought "నువ్వెందుకు పెండ్లి చేసుకోలేదో నాకు తెలుసు. నాకోసం" అంటూ మళ్లా కళ్ళు మూసింది. నా గుండె స్థూలత్వాన్ని పోగొట్టుకుని ద్రవంగా విడిపోయి, దోవ తెలియక తిరుగుతున్న రక్తనాళాలగుండా, వుజ్వల వేగంతో ప్రవహిస్తుంది. కన్నీటిని నా వేళ్ళతో తొలగించుకొన్నాను. ఆమె నిశ్చల శరీరంపై నా కన్నీరు పడి మలినం చెయ్యడం పాపం అనిపించింది. మొహాన్ని పక్కకు తిప్పేసుకున్నాను. కిటికీ అద్దంలోనుంచి నిశీధి నల్లత్రాచులా లోకాన్ని అల్లుకుంటోంది. "నీ స్థితి చూస్తే నాకెంతో బాధగా వుంది" అన్నా కన్నీరు దిగమింగుకుని. "నాకు నిర్విచారం.. ఈ ప్రపంచం నాదైతేగా విచ...

వర్తమానం

  అక్టోబర్ 18, 2021 వర్తమానం  ( vartamanam )       అర్థము      (విశేష్యము ): సమాచారం (ఇతరులకు పంపేది); జరుగుతున్న కాలం; వృత్తాంతం     Meaning     (noun) :information/news (sent to someone); present tense;            వాడుక / Usage    మార్పునకు ఆతిథ్యం ఇచ్చే వర్తమానం ఎల్లప్పుడూ నిత్య నూతనం.    A present that is open to change is forever new.     మెదడుకు మేత / Food for thought ఎంతో కాలంగా నిద్రకు దూరమైన ఆమెకు ఈరోజు నిద్ర మీద విపరీతమైన కోరిక కలిగింది. హాయిగా శవంలాగా నిద్రపోవాలనిపించింది. ఎన్నాళ్లగానో తీరని కోరిక అది....ఇలా ఇంకా ఎంత కాలం నిద్రలేకుండా ఉండాలి. ఆమెకు జీవితం మీదే విరక్తి కలిగింది. మరో నిద్రమాత్ర వేసుకుందామని సీసాను చేతిలో ఒంపుకుంది. సీసాలోని మాత్రలన్ని చేతిలో పడ్డాయి! ఆ మాత్రలు తమని తీసుకోమని ఆమెను ఆహ్వానిస్తున్నాయి. ప్రతీ మాత్రలో నిద్ర ఉంది. అన్నీ మాత్రల్లో ఉన్న నిద్ర ఆమెకు కావాలి. భర్తకు ఒక చిన్న చీటీ రాసి పెట్టింది - "ఏమండీ ఆత్మహత్య చేసుకున్నాన...

బింబము

  అక్టోబర్ 15, 2021 బింబము  ( bimbamu )       అర్థము      (విశేష్యము ): ప్రతిమ; చంద్ర/సూర్య మండలం; దొండపండు;      Meaning     (noun) : image; reflection; round disc like sun/moon; fruit of  Coccinia indica           వాడుక / Usage    చంద్ర బింబం వంటి ముఖంతో ఆ బింబా ధరి అత్యంత రమణీయంగా ఉంది.    Her radiant face and red lips were enamouring.     మెదడుకు మేత / Food for thought జుట్టు ఆరబెట్టుకుంటూ ఆకాశంలోకి చూపులెగరేసిన ఒక తడి తడి జ్ఞాపకపు బొమ్మ. ప్రమిదల కాంతి రథమ్మీద కూర్చొని స్వారికి వెడలిన కాలనాళిక కొన్ని అవశేష అస్థికల జీవితాన్ని మోక్షం మార్గాన రేవుకు చేర్చే పడవ, కాశీ రాజు కోటకు వీపునాన్చి నీళ్ళల్లో పాదాలు ఆడిస్తున్న పసిపాప. పాప ప్రక్షాళన కోసం పరుగులెత్తున్న కాలానికీ ఎదురుగా వచ్చి చేయందించే మనిషి   -- గంగా నది గురించి 'తీగల చింత' లో , కవి యాకుబ్

ఉర్వి

  అక్టోబర్ 14, 2021 ఉర్వి  ( urvi )       అర్థము      (విశేష్యము ): భూమి; నేల; నది; విశ్వము; వెడల్పు గలది     Meaning     (noun) : earth; land; river; world; that which is wide           వాడుక / Usage    ఓరిమితో మనలను కాసే ఉర్విని మనమే భ్రష్టు పట్టిస్తున్నాము.    We are destroying the very earth which protects us.     మెదడుకు మేత / Food for thought అక్షరాలు ఒళ్లో పోసుకొని ఎవరూ కూర్చోరు. ఆ మాట కొస్తే అక్షరాలు ఊరికే రావు. ఊకనే పోవు. ఎర్రటి ఎండల కాగుతున్న పరుబ్బండ మీద పాదం మోపి చూడు. కర్రుమొన గుచ్చిన కరియావు కాలి గిట్టల సందుల స్రవించిన రక్తం పదను నంటి చూడు. బిగబట్టిన ఊపిరితో ఒక్కసారిగ పైకెగరేసుకుపోతున్న వలలోని పక్షుల గుండెల ఆరాట ధ్వనిని చెవియొగ్గి చూడు. కత్తుల వంతెన, నిప్పుల వాగు, దినదిన గండం బతుకులకు పర్యాయ పదాలైన సందర్భాల నొలిచి చూడు. అక్షరం  అవసరమేంటో,అది చేయాల్సిన పనేంటో అవగతమయితది.  కలలు కనాలంటే జీవితం కావాలి. విజయం దక్కాలంటే యుద్దం చేయాలి.విలువలు కావ...

కపాటము

  అక్టోబర్ 13, 2021 కపాటము  ( kapāṭamu )       అర్థము      (విశేష్యము ):  కవాటము, తలుపు; ఒక వైపునకు పోవు పదార్థమును వెనుకకు రాకుండా ఒక వైపే తెరుచుకునే తలుపు     Meaning     (noun) : door; valve           వాడుక / Usage    కపటంతో ఆమె హృదయ  కపాటం తట్టలేడని అర్థం అయ్యింది.    It became apparent that deceit cannot knock on the doors of her heart.     మెదడుకు మేత / Food for thought     అమ్మలఁ గన్నయమ్మ, ముగురమ్మలమూలపుటమ్మ, చాలఁ బె    ద్దమ్మ, సురారులమ్మ కడు పాఱడి వుచ్చిన యమ్మ, తన్ను లో    నమ్మిన వేల్పుటమ్మల మనమ్ముల నుండెడి యమ్మ, దుర్గ, మా    యమ్మ, కృపాబ్ధి యిచ్చుత మహత్త్వకవిత్వ పటుత్వ సంపదల్    ( దుర్గాదేవి తల్లు లందరికి తల్లి సప్తమాతృకలను కన్నతల్లి, ముల్లోకాలకు మూల మైన లక్ష్మి సరస్వతి పార్వతులకే మూలమైన తల్లి, అందరు అమ్మల కన్నా అధికురా లైన మహాతల్లి, రక్కసి మూకలను అడగించిన యమ్మ, నమ్ముకున్న దేవతామతల్లుల నిండు మనసు...

అనలము

  అక్టోబర్ 12, 2021 అనలము  ( analamu )       అర్థము      (విశేష్యము ): అగ్ని; అన్నము ఆరగించు జఠరాగ్ని; కోపము; పరమాత్మ     Meaning     (noun) : fire; gastric fire; digestive power; fury           వాడుక / Usage    వాతావరణ మార్పు వల్ల అరణ్య అనలాల తీవ్రత హెచ్చుతోంది.    Climate change is increasing the severity of forest fires.     మెదడుకు మేత / Food for thought    భూతాన్ని, యజ్ఞోపవీతాన్ని   వైప్లవ్యగీతాన్ని నేను!   స్మరిస్తే పద్యం,   అరిస్తే వాద్యం,   అనల వేదికముందు అస్రనైవేద్యం!   లోకాలు, భవభూతి శ్లోకాలు,   పరమేష్ఠి జూకాలు నా మహోద్రేకాలు!   నా ఊహ చాంపేయమాల!   రస రాజ్యడోల!   నా ఊళ కేదారగౌళ!   గిరులు, సాగరులు, కం కేళికా మంజరులు,   ఝరులు నా సోదరులు!   నే నొక దుర్గం! నాదొక స్వర్గం!   అనర్గళం, అనితరసాధ్యం, నా మార్గం;   -- మహాప్రస్థానం, శ్రీశ్రీ (ఏప్రిల్ 30, 1910 - 1983)

రిపువు

  అక్టోబర్ 11, 2021 రిపువు  ( ripuvu )       అర్థము      (విశేష్యము ): శత్రువు; పగవాడు; వైరి     Meaning     (noun) : enemy, foe, opponent           వాడుక / Usage ధనమార్జించిన కొలది అతని రిపువులు హెచ్చారు. As he acquired more wealth his enemies multiplied.     మెదడుకు మేత / Food for thought రాజు చేతి కత్తి రక్తంబు వర్ణించు సుకవి చేతి కలము సుధలు కురియు ఆత డేల గలుగు యావత్ప్రపంచంబు నీత డేల గలుగు ఇహము పరము -- ఎనిమిదవ తరగతి తెలుగు వాచకం 

ఉటంకి

  అక్టోబర్ 08, 2021 ఉటంకి  ( uṭanki )       అర్థము      (విశేష్యము ): బియ్యం, పాలు, పంచదార కలిపిన పిండితో తీగలు లాగా వేయించిన శ్రీకాకుళం జిల్లా వంటకం     Meaning     (noun) : stringed sweet made, in Srikakulam, of rice, milk and sugar           వాడుక / Usage సోంపేట వాస్తవ్యులైన కింతలి దంపతులు తయారుచేసే ఉటంకులు ప్రపంచ ప్రసిద్ధం. Sompeta is renowned for the sweet Utanki made by Kinthali family.     మెదడుకు మేత / Food for thought గొంతుకలు వస్తున్న నూతిలో నీళ్ళు లేవు..అదొక  పాడు నుయ్యి.మనిషి పతనానికీ ,మరణానికీ సంకేతం.  అందులో జీవనం వుండదు.అందులో పడి వున్న వారికి  వెలుగు గోచరించదు.పైకి ప్రాకటానికి ఆధారం కనిపించదు.  వారు కేకలు వేస్తారు.కాని వారి గొంతులు బయటకు  స్పష్టంగా వినిపించవు..భూగర్భపు లోతులు వారిని బాహ్య  ప్రపంచాన్నుంచి వేరు పరుస్తోంది.వారు యాత్రికులు కూడా  కాదు.వారికొక గమ్యం లేదు.చీకటి తప్ప వారికెవ్వరూ  తోడు లేరు. రాత్రి అయింది.  శబ్దం ల...

దప్పళం

  అక్టోబర్ 07, 2021 దప్పళం  ( dappaḷamụ )       అర్థము      (విశేష్యము ): కూరలు వేసి పలచగా కాచిన (కంది పప్పు) పులుసు; సాంబారు; ముక్కల పులుసు     Meaning     (noun) : sour soup made with lentils and vegetables; Sambar           వాడుక / Usage "వేడి వేడి అన్నంలో కమ్మని పప్పు కాచిన నెయ్యి, పప్పు దప్పళం కలిపి కొట్టడం" (పెళ్లి పుస్తకం)  Hot rice with ghee, dal and Sambar!     మెదడుకు మేత / Food for thought అపాయమ్ము దాటడానికుపాయమ్ము కావాలి అంధకారమలమినపుడు వెలుతురుకై వెదకాలి ముందు చూపు లేనివాడు ఎందునకు కొరగాడు సోమరియై కునుకువాడు సూక్ష్మమ్ము  గ్రహించలేడు మత్తు వదలరా నిద్దుర మత్తు వదలరా మత్తు వదలరా నిద్దుర మత్తు వదలరా ఆ మత్తులోన పడితే గమ్మత్తుగ చిత్తవుదువురా మత్తు వదలరా నిద్దుర మత్తు వదలరా జీవితమున సగ భాగం నిద్దురకే సరిపోవు జీవితమున సగ భాగం నిద్దురకే సరిపోవు మిగిలిన ఆ సగ భాగం చిత్తశుద్ధి లేకపోవు అతినిద్రా లోలుడు తెలివి లేని మూర్ఖుడు అతినిద్రా లోలుడు తెలివి లేని మూర్ఖుడు పరమార్ధం గాన...