Posts

Showing posts from December, 2024

సమ

  జనవరి 01, 2025 సమ  ( sama )     అర్థము    ( విశేష్యము/విశేషణము ) : సంవత్సరము; సమానము; సమస్తము; మంచి వాడు      Meaning    (noun/adj) : a year; equal; all encompassing; good person    వాడుక / Usage    అమర గాయకుడు రఫీ శత సమ జయంతోత్సవాలు ఘనంగా జరిగాయి .    Legendary singer Rafi's birth centenary was celebrated grandly.    మెదడుకు మేత / Food for thought       నాయమాత్మా ప్రవచనేన లభ్యో న మేధయా న బహునా శ్రుతేన ।     యమేవైష వృణుతే తేన లభ్యస్తస్యైష ఆత్మా వివృణుతే తనూంస్వామ్ ॥      (ప్రసంగాల వలనో పాండిత్యం వలనో అనేక విషయాలు వినడం వలనో ఈ ఆత్మను పొందలేము. ఎవరు దానిని పొందడానికి వ్యాకులత చెందుతారో వారే దానిని పొందుతారు. ఆ ఆత్మ వారికి తన స్వకీయ నైజాన్ని వెల్లడిస్తుంది. )     --  కఠోపనిషత్, ద్వితీయా వల్లి, 23వ మంత్రం

ఎల్లి

  డిసెంబర్ 31, 2024 ఎల్లి  ( elli )     అర్థము    ( విశేష్యము ) : రేపు; ముందు వచ్చే కాలం; మరణాంతరం; గొడుగు      Meaning    (noun) : tomorrow; time to come; after death; umbrella    వాడుక / Usage     పిల్లాపాపలు, ప్రజల మేలుకోరి సంధి చేస్తావో లేక  ఎల్లి  యుద్ధమే చేస్తావో చెప్పు .    Will you make peace for everyone's welfare or go to war tomorrow?    మెదడుకు మేత / Food for thought      న జాయతే మ్రియతే వా విపశ్చిన్నాయం కుతశ్చిన్న బభూవ కశ్చిత్ ।    అజో నిత్యః శాశ్వతోఽయం పురాణో న హన్యతే హన్యమానే శరీరే ॥      (ఆత్మ జన్మించడంలేదు,  మరణించడంలేదు. ఇది దేనినుంచీ రూపొందినది కాదు, ఏదీ దీనినుంచి రూపొందడం లేదు. ఇది జన్మ రహితమైనది,  ఎన్నటికీ ఉండేది. శాశ్వతమైనది,  సనాతమైనది. శరీరం నశించినా నశించనిది. )     --  కఠోపనిషత్, ద్వితీయా వల్లి, 18వ మంత్రం

వ్యవధి

  డిసెంబర్ 30, 2024 వ్యవధి  ( vyavadhi )     అర్థము    ( విశేష్యము ) : మేర; అవకాశం; గడువు; సమయం      Meaning    (noun) : limit; boundary; (available) time; duration    వాడుక / Usage     ప్రకాశం జిల్లాలో మరోసారి భూకంపం - అయిదు నిమిషాల వ్యవధిలో మూడు సార్లు .    Earthquake rocks Prakasam district again - three times in a duration of 5 minutes.    మెదడుకు మేత / Food for thought     యేయం ప్రేతే విచికిత్సా మనుష్యే అస్తీత్యేకే నాయమస్తీతి చైకే ।    ఎతద్విద్యామనుశిష్టస్త్వయాహం వరాణామేష వరస్తృతీయః ॥     ( మనుష్యుని మరణానంతరము కొందరు ఉన్నాడు అని కొందరు లేడు అని అంటారు. ఇది సందేహము. దీనిని నీనుంచి తెలుసుకుంటాను అదే నామూడవ వరము అన్నాడు నచికేతుడు యమధర్మ రాజుతో)     --  కఠోపనిషత్, ప్రథమా వల్లి, 20వ మంత్రం

ఆపసోపాలు

  డిసెంబర్ 27, 2024 ఆపసోపాలు  ( aapa-sopaa-lu )     అర్థము    ( విశేష్యము ) : జ్వరం వల్ల బాధ; దుఃఖం; తక్కువ శ్రమకి కూడా అలసినట్లు చేయడం; భుక్తాయాసం     Meaning    (noun) : feverish aches; (act) tired on little effort; struggle after heavy meal    వాడుక / Usage    ఎన్నికల ఫలితాలతో ఆపసోపాలు పడుతున్న పార్టీకి ఈ వివాదం క్రొత్త ఊపిరి ఇచ్చింది .    The controversy gave a fresh lease of life to the party suffering from defeat.    మెదడుకు మేత / Food for thought     అన్ని చెప్పగల భాష    అక్కడే ఆగిపోయింది.    వేసుకుందామంటే ఏచొక్కా    నచ్చని ఐదేళ్ళ నా కొడుకు    పెంకితనమే నా భాష కొచ్చింది.    ఎంత దువ్వినా వంగని రింగుల జుట్టు    ఎంత కట్టినా కుదరని ఆర్గండీ చీర    తెగిన చెప్పుతో నడిచే కాలి నడక    అక్కడే కూలబడింది.    పోనీ మరోమాటేదైనా    వెతుకుదామంటే    కర్ఫ్యూలో పాత బస్తీలో  ...

ఆబ

  డిసెంబర్ 26, 2024 ఆబ  ( aaba )     అర్థము    ( విశేష్యము ) : కంటి పాప (నల్ల గ్రుడ్డు); అత్యాశ; ఆత్రము (తిండి పై)     Meaning    (noun) : pupil of the eye; greediness (esp with food)    వాడుక / Usage    పైసలమీద ఆబని తెలుగు గౌరవానికి కోసమే అని రంగు పూయడం హాస్యాస్పదం .    Giving a colour of Telugu pride to one's greediness for money is laughable.    మెదడుకు మేత / Food for thought      నగరం జడలో దీపాల మాలల్ని అలంకరించుకుంది…    ఏ హరిణనయన చేతి అమృతభాండం నుండి తొణికిన వెన్నెలో    సముద్రం మీద చెల్లాచెదురైన ముత్యాలసరంలా పరచుకుంది    అలిసిన కన్నుల్లో స్వాప్నిక చంద్రికలని నింపుకుని..    నిద్రని మేలి ముసుగులా తన ముఖం మీదికి కప్పుకుంది      రాత్రి వానలో రాలిన స్వప్నాలను నెమరువేస్తూ    ధ్యానముద్రలో మునిగిన యోగుల్లా    పూర్తిగా తడి ఆరని జటాజూటాలతో    చెట్లు ఒంటికాలిపై నిశ్చలంగా నిలబడతాయి    ...

ఆటుపోటు

  డిసెంబర్ 25, 2024 ఆటుపోటు  ( aatupotu )     అర్థము    ( విశేష్యము ) : బాధలు; హెచ్చుతగ్గులు; సముద్రపు కుంగు పొంగు    Meaning    (noun) : troubles; vagaries of life; ebb and flow of tides    వాడుక / Usage    గతవారం సూచీలు తీవ్ర ఆటుపోట్లకు గురయ్యాయి .    Scrips took a battering last week.    మెదడుకు మేత / Food for thought     మధ్యాహ్నపు ఎండ,సాయంత్రపు గాలి,    రాత్రి చుక్కలు ఎప్పుడూ ఏదో ఒకటి    గుర్తుకు తెస్తూనే వుంటాయి    మనసు మెచ్చే క్షణాలెన్నెదురైనా,    అడుగు ఆగిపోయిన గతాలే ఎక్కువ!    ఒక్క మబ్బు పట్టిన క్షణం చాలు    గతంలోనూ, వర్తమానంలోనూ    నిశ్శబ్దాన్ని నింపడానికి    అయినా    నిర్లిప్తత దూసుకెళ్ళినంత లోతుకు    సందడి తోసుకెళ్ళ లేదెందుకో     -- రామినేని లక్ష్మి తులసి, 2012 ఇస్మాయిల్ అవార్డు గ్రహీత

అయిపు

  డిసెంబర్ 24, 2024 అయిపు  ( ayipu )     అర్థము    ( విశేష్యము ) : జాడ; సూచన; చిరునామ; తప్పు; దోషం    Meaning    (noun) : sign; address; indication; defect; mistake    వాడుక / Usage    సామాన్యుల విషయంలో అయిపు లేని న్యాయవ్యవస్థ సెలెబ్రిటీల విషయంలో త్వరగా పనిచేస్తుంది .    Justice system which is nowhere to be seen for commoners works overtime for celebrities.    మెదడుకు మేత / Food for thought      ..కూడదీసుకో దేహచలనమా,      కూడదీసుకో నీ సమస్త ప్రాణకణాల సంస్పందనలను!      వ్యక్తావ్యక్త పదపరిభ్రమణాల్లోంచే      కొనవూపిరి జీవితపు కొట్టుకులాటలోంచే      రాలిపడిన బతుకు పూరెక్కల కుప్పలోంచే      కూడదీసుకో నీ సమస్త నాడీగత పురాశ్వాసనలను      గబ్బిలాలు ముసిరిన వైరాగ్యపు భీతిలోంచే      విచ్చిపోయే కలల కుండల చప్పుడులోంచే      నీ వంతుకు నీవే      నీ వంతకు నీవే ...

ఆద

  డిసెంబర్ 23, 2024 ఆద  ( āda )     అర్థము    ( విశేష్యము ) : విచారము; దుఃఖము; మనస్సు; ఆరాటం    Meaning    (noun) : sorrow; grief; anxiety    వాడుక / Usage     పాదం విడిచి ఎటు పోయెను భువనం ఆద మరిచి ఎటు వెళ్ళెను గగనం .    Leaving feet behind, where has the world gone? Bereft of anxiety, where did the sky go?    మెదడుకు మేత / Food for thought      రాయిగామారిన అహల్య ఏ రాముడికోసమో ఎదురుచూస్తున్నది.     రాతిలో ప్రాణం ఎక్కడ? ప్రాణం లేకుండా     ఎదురుచూడటం ఎలా సాధ్యం, చెప్పు, ఓ వాల్మీకీ! ఓయీ విశ్వామిత్రా!     హే విజ్ఞానీ! ఇదేమిటో విశదంగా చెప్పు! నిరుడు నేను చూశాను,     స్టెనో అనుపమా దాస్ నాకోసం ఎంతో ఎదురు చూసింది.     ఎంత ప్రయత్నించినా తన ఉసురు నేను గుర్తించలేకపోయాను     టైప్ మెషీన్ టప్ టప్ టప్ టప్ అన్నట్టు, ఆమె గొంతులోనుంచి     మాట వెనుక మాట, మాట వెనుక మాట ఇప్పటికీ నా చెవుల్లో రింగ...

తర్జని

  డిసెంబర్ 20, 2024 తర్జని  ( tarjani )     అర్థము    ( విశేష్యము ) : చూపుడు వేలు    Meaning    (noun) : index finger    వాడుక / Usage     అతని  తర్జని  ఒక శాసనం అతని పిడికిలి ఒక ఉద్యమం.    His index finger is an order, his fist is a movement.    మెదడుకు మేత / Food for thought      సమాజం పరిణామం పొందిన తర్వాత కుటుంబాలు ఏర్పడి, ఆస్థి కుటుంబపరమైనప్పుడు సంప్రదాయం తల్లకిందులయింది. కుటుంబాలేర్పడినప్పుడు స్త్రీ ప్రాధాన్యం తగ్గి, పురుష ప్రాధాన్యం పెరిగింది. అప్పుడు ఆస్థి తండ్రి నుండి కొడుక్కు సంక్రమించటం ఆరంభమయింది. దాంతో సంతానానికి తల్లికన్నా తండ్రిని లెక్కపెట్టే సంప్రదాయమొచ్చింది.  అంతవరకు శబ్దప్రమాణంగా వున్న పితృత్వానికి ప్రత్యక్ష ప్రమాణ ప్రతిపత్తి కల్పించడానికి మార్గాన్వేషణ ఆరంభమయింది.       -- ఇనుప కచ్చడాలు, తాపీ ధర్మారావు (సెప్టెంబర్ 19, 1887 - 1973)  

బేల

  డిసెంబర్ 19, 2024 బేల  ( bēla )     అర్థము    ( విశేషణము ) : మూఢుడు/ మూఢురాలు;  అమాయకుడు/అమాయకురాలు; పిరికి    Meaning    (noun/adj) : simpleton; naivety    వాడుక / Usage     హృదయమా ఓ బేల హృదయమా ఒకేసారిగ నీకింత సంతోషమా .    O dear heart, naive heart; why this sudden happiness!    మెదడుకు మేత / Food for thought      వెనుక కాలంలో ఆడవారిలో స్నేహితులు అంత సన్నిహితంగా ఉండేవారు కాదట. స్త్రీ తన రహస్యాలన్నీ ఎవరితోనూ చెప్పదనే అంటారు.అందులో నిజం లేకపోలేదు. మా హృదయాంతరాలలో ఉన్న రహస్యాలు సర్వాంతర్యామియైన భగవంతునికే తెలియనియ్యము. కాని చిన్నతనంలో విద్యాదినాల్లో నెచ్చెలులకు కాస్త మా రహస్యాలు చెప్పుకుంటున్నాము.  పురుషులు రహస్యాలు దాచుకోలేరు. ఏ స్నేహితురానితోనో ఎంత నిగూఢ రహస్యాన్నైనా చెప్పేస్తారు. స్త్రీ పురుష సంబంధాలైన రహస్యాలేవన్నా బయటపడ్డాయంటే పురుషుని వల్లనే. ఇంతకూ నాకు  ఉండే రహస్యాలేమిటి?       -- తుపాన్, అడవి బాపి రాజు (అక్టోబర్ 08, 1895 - 1952)  ...

ప్రసూనము

  డిసెంబర్ 18, 2024 ప్రసూనము  ( pra-sūnamu )     అర్థము    ( విశేష్యము ) : పుట్టినది; పుష్పము; ఫలము; మొగ్గ    Meaning    (noun) : flower blossom; bud; fruit; born    వాడుక / Usage     మల్లెల ప్రసూనాల తల్పంపై సఖుని రాకకై ఆమె విరహవేదనతో ఎదురు చూసింది .    She spent many a lonely night, on a bed of flowers, waiting for her love .    మెదడుకు మేత / Food for thought      భగవంతుడు సృష్టించిన పవిత్రమైన పులినోట్లో ఒకసారి కాదు పదిసార్లు తలదూరుస్తానన్నాడు. పది దఫాలు అనవసరం. రోజుకి రెండు మార్లయితే చాలునన్నాడు బఫూన్. ఆ విధంగా మా పెదనాయన చైనాదేశంలో ఫ్రెంచి సర్కస్ లో చేరి పెద్దపులి నోట్లో తలదూర్చడం ప్రారంభించాడు. పెదనాన్నా, పులీ మంచి స్నేహితులుగా ఉంటూ వచ్చారు. కానీ, టెహరాన్ నగరంలో, ఆ ప్రాచీనమైన పాపపుచోట పెద్దపులిలో పెద్దమనిషి తరహా నశించింది. ఆరోజు ఎండ మండిపోతుంది. అందరూ తహతాహలాడుతున్నారు. నగరంలో మా పెదనాయన ఆవులించిన పెద్దపులినోట తలదూర్చాడు. ఇక తల తీద్దామనుకునేసరికి ప్రపంచంలోని అన్యాయాలన్నిటిక...

పిశంగము

  డిసెంబర్ 17, 2024 పిశంగము  ( piṣangamu )     అర్థము    ( విశేష్యము ) : రాగి రంగు గలది; కపిల వర్ణము;     Meaning    (noun) : reddish brown; copper colour; tawny    వాడుక / Usage     వర్షాకాలంలో గ్రామ వీధులు పిశంగంగా చేలు ఆకుపచ్చగా అలరాడాయి .     The paths of the village turned tawny and fields green during rainy season.    మెదడుకు మేత / Food for thought     అస్తిత్వం (బీయింగ్ ) చైతన్యం (కాంషస్న్స్) వీటికి గల సంబంధం ఏమిటి అన్నది తత్వశాస్త్ర మౌలిక ప్రశ్న. అస్తిత్వం అగ్రిమం (ప్రైమరీ ) చైతన్యం అనగ్రిమం (సెకండరీ ) అని జవాబిచ్చిన వారు భౌతికవాదులుగాను ,  దానికి విరుద్ధంగా ఉన్నవారు భావవాదులుగాను విడిపడ్డారు. ప్రాయిడ్ ప్రకారం చైతన్యం అస్తిత్వం కన్నా విశిష్టమైనది.     -- ముక్తానుషంగం, అంపశయ్య నవీన్ 

సిత

  డిసెంబర్ 16, 2024 సిత  ( sita )     అర్థము    ( విశేష్యము ) : చక్కర; తెల్లనిది; ఆకర్షించునది; కట్టబడినది; ముగిసినది    Meaning    (noun) : sugar; something white; attractive; bound; completed    వాడుక / Usage   శరద్కాల చంద్రుడు సిత ప్రకాశుడై ఆకశాన కనువిందు చేసాడు .     The autumn moon graced the sky with white radiance .    మెదడుకు మేత / Food for thought     హిందువులైనను సరే, మహమ్మదీయులైనను సరే, క్రైస్తవులైనను సరే; లోకములో దౌష్ట్య మాచరించుచు, దేవుడు దేవుడని దొంగవేషములు వేయువాని కెప్పుడును ఆత్మచ్యుతి యున్నది . వాని మతము వానికి దుర్వ్యవసాయము లెక్కువ చేయుటకు పనికివచ్చును కాని, వాని యాధ్యాత్మిక ప్రవృత్తిని వృద్ధి నొందించుటకు పనికిరాదు. సద్విషయమని తనకు తెలిసిన దాని నెవడాచరించాడో వాడు పాము వంటివాడు. పామునకు రెండు నాలుకలు, వీనికి రెండు పద్ధతులు.      -- వేయి పడగలు, విశ్వనాథ సత్యనారాయణ (సెప్టెంబర్ 10, 1895 - 1976)

ఊహాజనిత బుడగ

  డిసెంబర్ 13, 2024 ఊహాజనిత బుడగ  ( oohajanitha budaga )     అర్థము    ( విశేష్యము ) :  స్టాక్‌లు, రియల్ ఎస్టేట్ లేదా క్రిప్టోకరెన్సీల వంటి నిర్దిష్ట ఆస్తుల ధరలు వాటి అంతర్గత విలువను మించి గణనీయంగా పెరగడం    Meaning   (noun) : speculative bubble    వాడుక / Usage   క్రిప్టో రుణదాతలు చివరి ఊహాజనిత బుడగ  యొక్క బూడిద నుండి ఉద్భవించారు .     Crypto lenders emerge from the ashes of last speculative bubble .   మెదడుకు మేత / Food for thought      ఆర్థికవేత్తలకు వదిలివేయడానికి ఆర్థికశాస్త్రం చాలా ముఖ్యమైనది.      -- గుడ్ ఎకనామిక్స్ ఫర్ హార్డ్ టైమ్స్, అభిజిత్ బెనర్జీ

క్షీణోపాంత ప్రయోజనం

  డిసెంబర్ 12, 2024 క్షీణోపాంత ప్రయోజనం  ( kshinopantha prayojanam )     అర్థము      ( విశేష్యము ) : ప్రయోజనం క్రమంగా తగ్గడం;  ఒక ఉత్పత్తికి దోహదపడే వాటిలో ఒక్కటి తప్ప మిగతావన్నీ స్థిరంగా ఉండి, ఆ ఒక్కటి మాత్రమే పెరిగినపుడు, దానివలన ఏర్పడే ఉత్పత్తి తగ్గడం    Meaning     (noun) : (law of) diminishing returns    వాడుక / Usage       20-30 పదార్థాలు వడ్డించాలి అనే ఆరాటంలో ఫంక్షన్ చేసే వాళ్ళు వచ్చి తినేవాళ్లు క్షీణోపాంత ప్రయోజన   సూత్రం మర్చిపోతున్నారు .       In the race to serve more dishes both party organisers and diners are forgetting the law of diminishing returns .     మెదడుకు మేత / Food for thought పోటీ సమాజంలో మన ఎంపికా స్వేచ్ఛ వల్ల ఒక వ్యక్తి మన కోరికలను తీర్చడానికి నిరాకరిస్తే, మనం మరొకరి వైపు మొగ్గు చూపవచ్చు. కానీ మనం గుత్తాధిపత్యాములో ఉంటే మనం అతని సంపూర్ణ దయపై ఉంటాము. అలాగే దేశం యొక్క మొత్తం ఆర్థిక వ్యవస్థను నిర్దేశించేది   ఒక్క  అధికారం అయితే అద...

ద్రవ్య పరపతి విధానం

  డిసెంబర్ 10, 2024 ద్రవ్య పరపతి విధానం  ( dravya parapathi vidhanam )     అర్థము      ( విశేష్యము ) :  ఆర్థిక వ్యవస్థలో ద్రవ్యం సరఫరా పెంచేందుకు, తగ్గించేందుకు అనుసరించే విధానం    Meaning     (noun) : monetary policy    వాడుక / Usage       భారత రిజర్వ్ బ్యాంక్ తాను చేపట్టనున్న ద్రవ్యపరపతి విధాన సమీక్షలో కీలక వడ్డీ రేట్లను మరోసారి పెంచనున్నట్లు బలమైన సంకేతాలనిచ్చింది .       RBI gave a strong indication about interest rate hikes when it reviews monetary policy .     మెదడుకు మేత / Food for thought ఫాసిస్ట్ ఇటలీ మరియు ఫాసిస్ట్ స్పెయిన్, జర్మనీ వివిధ సమయాల్లో... మొదటి ప్రపంచ యుద్ధానికి ముందు జపాన్-అన్ని సమాజాలు రాజకీయంగా స్వేచ్ఛగా వర్ణించబడని సమాజాలు. అయినప్పటికీ, ప్రతిదానిలో, ప్రైవేట్ సంస్థ ఆర్థిక రంగం యొక్క ప్రధాన రూపం. దీనితో విదితం అయ్యేది ఏమిటంటే - ఆర్థిక వ్యవస్థ ప్రాథమికంగా పెట్టుబడిదారీ వ్యవస్థ గా ఉండి, రాజకీయ వ్యవస్థ స్వేచ్ఛలు లేనిదిగా ఉండటం స్పష్టంగా సాధ్యమవుతుంది. -...

సరఫరా గిరాకీ

  డిసెంబర్ 11, 2024 సరఫరా గిరాకీ  ( saraphara giraakee )     అర్థము      ( విశేష్యము ) : సరఫరా=అందచేయుట, గిరాకీ=అధికమైన;  మార్కెట్లో ధర నిర్ణయం యొక్క ఒక ఆర్థిక పద్ధతి. పోటీ మార్కెటులో యూనిట్ ధర సరఫరా పరిమాణం, గిరాకీ పరిమాణం సమానంగా ఉన్న చోట స్థిరపడుతుంది.    Meaning     (noun) : (law of) supply and demand    వాడుక / Usage       ఉల్లి యొక్క సరఫరా గిరాకీ అసమతౌల్యం ఆగష్టు చివరినాటికి ప్రతిబింబించవచ్చు .       Onion's supply demand imbalance might affect by end of August .     మెదడుకు మేత / Food for thought స్వేచ్ఛ యొక్క లోపభూయిష్ట నిర్వచనాన్ని ఉపయోగించి,  ఎక్కువగా నియంత్రించబడని మార్కెట్‌కి పెద్ద పీఠ వేసి  మిగతా సామజిక శ్రేయస్సులను విస్మరించే నూతన ఉదారవాద పెట్టుబడిదారీ విధానం - లేదా "శృంఖలలు లేని పెట్టుబడిదారీ విధానం" - వల్ల "డెబ్భై అయిదు ఏళ్లలో అతిపెద్ద ఆర్థిక సంక్షోభం,  వాణిజ్యా పెంపుకై పారిశ్రామికీకరణ బుగ్గిపాలు అవ్వడం; కార్పొరేషన్‌లకు నిరవధిక స్వే...

కోశ విధానం

  డిసెంబర్ 09, 2024 కోశ విధానం  ( kosha vidhanam )     అర్థము      ( విశేష్యము ) : ప్రభుత్వం పన్నులు విధించడం (రాబడి), ఖర్చులు చేయడం (వ్యయం), అప్పులు చేయడం (రుణం) ద్వారా చేసే ఆర్థిక విధానం    Meaning     (noun) : fiscal policy    వాడుక / Usage       భారత కోశ విధానం లక్షాలు - ఆర్థిక వృద్ధి, సాంఘిక న్యాయం .       The aim of India's fiscal policy is - economic growth and social justice .     మెదడుకు మేత / Food for thought పెట్టుబడిదారీ విధానం ఒక మతం. అన్ని మతాల మాదిరిగానే, ఇది అనుచరులను ఉంచుకోడానికి మరియు క్రొత్త వారిని గెలవడానికి మారుతున్న కాలానికి అనుగుణంగా ఉండాలి. మహా మాంద్యం తరువాత, జాన్ మేనార్డ్ కీన్స్ ప్రభుత్వ జోక్యాన్ని అంగీకరించిన కొత్త రూపాన్ని బోధించడం ద్వారా పెట్టుబడిదారీ విధానాన్ని రక్షించాడు. దశాబ్దాల తరువాత, మిల్టన్ ఫ్రైడ్‌మాన్ "నియోక్లాసికల్" సంస్కరణను బోధించాడు, అది క్రైస్తవ మతం కంటే ప్రపంచవ్యాప్తంగా విజయవంతమైంది. -- fairobserver.com, స్కాట్ బెన్నెట్

అర్ణవము

  డిసెంబర్ 06, 2024 అర్ణవము  ( arṇavamu )     అర్థము      ( విశేష్యము ) : సముద్రము; కడలి; అల    Meaning     (noun) : sea; ocean; wave    వాడుక / Usage       విశ్వేశ్వరాయ నరకార్ణవ తారణాయ కర్ణామృతాయ శశిశేఖర ధారణాయ .       Lord of the Universe who helps one cross the ocean of hell; whose name is nectar to ears and who is adorned on the head by moon .     మెదడుకు మేత / Food for thought విశ్వనాథ, శ్రీశ్రీ వంటి మహాకవులు సైతం అబ్బూరిబారిన పడ్డవారే. ఒకసారి హైదరాబాద్‌లోని ఆంధ్ర సారస్వత పరిషత్తు హాలులో సభ జరుగు తోంది. విశ్వనాథ సత్యనారాయణ, అబ్బూరి సభలో పాల్గొన్నారు. విశ్వనాథ మొదట  ప్రసంగిస్తూ, తెలుగు భాషను వేనోళ్ళ కొనియాడారు. అందులో భాగంగా తన పద్యం ఒకటి పాడి వినిపించి, పద్యంలోని కొన్ని అక్షరాలకు వున్న గొప్ప శక్తిని ఊద్గాటించారు. తర్వాత అబ్బూరి వారు ప్రసంగించడానికి లేచారు ఆయన ఒక వారా పత్రికను తీసుకొని, అందులో సంపాదకీయాన్ని రాగయుక్తంగా చదివి, “నన్నయ, విశ్వనాథవారే కాకుండా ఎవరైనా ఇలా రాయ...

అంకుశము

  డిసెంబర్ 05, 2024 అంకుశము  ( ankuṣamu )     అర్థము      ( విశేష్యము ) : ఏనుగుని నడపటానికి కుంభస్థలంపై పొడిచే ఆయుధం    Meaning     (noun) : an elephant goad    వాడుక / Usage       పంచాననాయ ఫణిరాజ విభూషణాయ హేమాంకుశాయ భువనత్రయ మండితాయ .      One with five faces and adorned by the king of serpents; has a golden trident and embodies the three worlds .     మెదడుకు మేత / Food for thought భారతదేశంలో ఎంత కవి సామ్రాట్టయినా, బ్యూరోక్రసీ ముందు తలదించుకోవలసిందే. విశ్వనాథ వారు ఒక వని కోసం సచివాలయం చుట్టూ ప్రదక్షిణలు చేశారు. పనికాలేదు. ఇలా లాభం లేదని, టంగుటూరి ప్రకాశం పంతులు గారి వద్దకు వచ్చి, తన పని ఎంతవరకు వచ్చిందో కనుక్కోమని అడిగారు. ప్రకాశంగారు కొంత అయిష్టంగా, “ఆ సచివాలయం పెద్ద ఆడివి, దానిలో పనులు అలాగే ఉంటాయి” ఆని తప్పించుకోజూశారు, విశ్వనాథా వదిలి పెళ్ళేది? వెంటనే, “అందుకే కదండీ మీకు మనవి చేసుకున్నది. మీరు ఆంధ్ర కేసరి కదా! ఆ అడవి మీకో లెక్కా?” అన్నారు. ఇహ ఆ పని నెత్తిన వేసుకోక తప్పలేదు...

ఫాలాక్షము

  డిసెంబర్ 04, 2024 ఫాలాక్షము  ( phāl ā kshamu )     అర్థము      ( విశేష్యము ) : ఫాలము=నుదురు, అక్షము=కన్ను; నుదురుపైన ఉన్న కన్ను; శివుని మూడవ కన్ను    Meaning     (noun) : eye on the forehead; Shiva's third eye    వాడుక / Usage       చర్మాంబరాయ శవభస్మ విలేపనాయ ఫాలేక్షణాయ మణికుండల మండితాయ .      One who wears tiger skin and is embalmed in ashes; has a third eye and is adorned with a diamond ear ring .     మెదడుకు మేత / Food for thought త్రిపురనేని రామస్వామిగారిలో తక్కిన గుణాల మాటెలావున్నా, ఆయన నాస్తి కత్వం సమకాలీనులకు కొరుకుడు పడేదికాదు. అలాంటి కవిరాజు ఆర్యసమాజంలో చేరగానే, “అమ్మయ్యా! దొరికింది రామస్వామి పిలక' అనుకున్నారు ప్రత్యర్థులు. ఓ సభలో ఒక ఆస్తికుడు “నాస్తికుడినని చెప్పుకునే మీరు ఆస్తికులైన ఆర్యసమాజంలో ఎలా చేరారు?” అని అడిగారు, దానికి చౌదరిగారి సమాధానం, “ఆయ్యా! తక్కినవాళ్లు ముప్పైమూడు కోట్ట దేవతలున్నారంటున్నారు. ఆర్యసమాజంవారు చక్కగా ఒకే దేవుడున్నాడంటారు. ఆ ముప్పైమూడు కోట్ల...