Posts

Showing posts from November, 2025

ప్రొద్దు

  డిసెంబర్ 02, 2025 ప్రొద్దు   ( proddu )     అర్థము      (విశేష్యము)  : సూర్యుడు; కాలము; వేకువ జాము; దినము    Meaning     (noun) : Sun; time; dawn; day      వాడుక / Usage      పల్లెల్లో తమ ఇమేజ్ చెక్ చేసుకుంటున్న అభ్యర్థులు.. ప్రొద్దు పొద్దున్నే ప్రజల ఇంటికి వెళ్లి .     Candidates check their standing in villages.. visit voters at the break of daylight.      మెదడుకు మేత / Food for thought       కంచి నెల్లూరు మఱి యోరుగల్లయోధ్య      యను పురంబులపై గంగ కరుగుమనిన      పగిది నొకత్రోవఁ జూపెద బహుపథంబు      లాంధ్ర భాషకు గలవని యరసికొనుఁడు     ( కంచి, నెల్లూరు, ఓరుగల్లు, అయోధ్యల మీదుగా వెళితే గంగ వస్తుంది అని దారిచెప్పినట్టుగ తెలుగు వ్యాకరణానికి ఒక దారి మాత్రమే చెబుతున్నాను. తెలుగుకు చాలా దారులు ఉన్నాయి)     -- కేతన (13వ శతాబ్దము), ఆంధ్ర భాషా భూషణము

ఇరులు

  డిసెంబర్ 01, 2025 ఇరులు   ( irulu )     అర్థము      (విశేష్యము)  : చీకటి; నలుపు; అంధకారం; నీడలు    Meaning     (noun) : darkness; shadows      వాడుక / Usage     గ్రహణంపట్టులో సూర్యడు సంపూర్తిగా ఉన్నంత కాలం ఆకాశం ఇరులు పడింది .        Whilst the Sun was under full eclipse darkness encompassed the skies.      మెదడుకు మేత / Food for thought       పాణిని రాసిన  వ్యాకరణ గ్రంథం  అష్టాధ్యాయి  మానవ మేధస్సు సృష్టించిన మహాద్భుతాలలో ఒకటి (one of the greatest monuments of human intelligence).     -- లియోనార్డ్ బ్లూమ్ఫీల్డ్, అమెరికన్ భాషావేత్త

వంత

  నవంబర్ 28, 2025 వంత   ( vantha )     అర్థము      (విశేష్యము)  : ఏడ్పు; దుఃఖము; బాధ; సంతాపము; చిన్న ఏఱు    Meaning     (noun) : grief; sorrow; pain; weeping; rivulet      వాడుక / Usage     గందనగు పైత్యమును వియోగంపు వంత     యెంతకలదో లెక్కగ వచియింపనగునె.        Insurmountable delirium and pangs of separation      To comprehend, count is it possible or to give description?      మెదడుకు మేత / Food for thought       థాయి రామాయణంలో సీత పుట్టుకకు సంబంధించిన కథనం వాల్మీకి కథనం కంటే భిన్నంగా ఉంటుంది. దశరథుడు పుత్రకామేష్టి జరిపినప్పుడు పాయసం కాకుండా లడ్డు వంటి ప్రసాదం లభిస్తుంది. అందులో కొంత భాగాన్ని ఒక కాకి నోట కరుచుకొని రావణుని భార్యకు చేరవేస్తుంది. అది తిన్న మండోదరి సీతకు జన్మనిస్తుంది. తన కూతురే తన మృత్యువుకు కారణమౌతుందని తెలిసి రావణుడు ఆ బిడ్డను సముద్రంలో పడవేస్తాడు. సముద్రుడు సీతను రక్షించి జనకునికి అందజేస్తాడు. ఇదే రకమైన కథ జై...

తడలు

  నవంబర్ 27, 2025 తడలు   ( tadalu )     అర్థము      (విశేష్యము)  : తళ్లు; చిన్న అలలు; కెరటాలు    Meaning     (noun) : wave; ripple      వాడుక / Usage     చిలుకంబడు దధికై వడి, గలత నొంది,     యెడను తడల బడు ప్రాణంబులింద్రియంబులు       Like butter milk that is churned, agitated      In place and time rocked hither thither like waves, are the Senses.      మెదడుకు మేత / Food for thought       జైనరామాయణంలోనూ, తెలుగు, కన్నడ జానపదుల గేయాల్లోనే కాక, ఈ రకమైన కథ ఆగ్నేయాసియాలోని కొన్ని రామాయణాలలో కూడా కనిపిస్తుంది. ఇంతేకాక, కొన్ని రామాయణాలలో కామాంధుడైన రావణుడు, ఒక పుణ్యవతి అయిన స్త్రీని బలాత్కరించగా ఆ స్త్రీ అతని కూతురుగా పుట్టి అతని వినాశనానికి కారకురాలౌతానని ప్రతిన బూని మరణిస్తుంది. ఈ విధంగా వాల్మీకి కథలో కనిపించని కథలు, కథనాలు, స్వభావాలు, లక్షణాలు ఎన్నో మౌఖిక సంప్రదాయంలో కనిపిస్తాయి.     -- మూడు వందల రామాయణాలు,  https:/...

కలత

  నవంబర్ 26, 2025 కలత   ( kalata )     అర్థము      (విశేష్యము)  : ఆందోళన; చీకాకు; మనస్పర్థ; క్షోభ     Meaning     (noun) : disquiet; strife; misunderstanding; agitation; turbidity      వాడుక / Usage      మనసు కాస్త కలత పడితే మందు ఇమ్మని మరణాన్ని అడగకు      కనుల నీరు తుడుచువారు ఎవరూ లేరని చితి ఒడికి చేరకు      ఊపిరిని పోసే ఆడదానివమ్మ     బేలవై నువ్వు కూలితే – నేలపై ప్రాణముండదమ్మ     When the heart is stricken, pray not for death     When there is none to wipe your tears, pyre don't make your hearth     You are the one who breathes and moulds life essence     If you lose heart and turn to cinders, world will be bereft of life presence    మెదడుకు మేత / Food for thought       జైన కథనాల ప్రపంచంలోకి ప్రవేశిస్తే, రామకథలలో తరచుగా కనిపించే హిందూ విలువలు కనిపించవు. నిజానికి, జైన రామాయణాల్లో...

కైవడి

  నవంబర్ 25, 2025 కైవడి   ( kai-vaḍi )     అర్థము      (విశేష్యము)  : ప్రకారం; పోలిక; విధము; వలె    Meaning     (noun) : likeness; same manner; similar to; like      వాడుక / Usage      మేఘం ప్రక్కన మెరుపు కైవడి ఆయన ప్రక్కన ఒక స్త్రీమూర్తి ఉంది .     Like a lightning next to a cloud, there she appeared next to him.    మెదడుకు మేత / Food for thought       వాల్మీకి రామాయణంలోని రాముడు సంపూర్ణ మానవుడు. మానవరూపంలో కష్టసుఖాలనుభవిస్తూ, ఎలా ధర్మబద్ధమైన జీవితం గడపాలో రాముడి ద్వారా లోకానికి చెప్పబడింది. బాలకాండలోనూ, రావణుని సంహరించే సమయంలో రాముడిని పరమాత్మ స్వరూపంగా, అవతారపురుషుడిగా వర్ణించే సంఘటనలు, తరువాత జత చేసిన ప్రక్షిప్తాలని పండితుల వాదన. కంబరామాయణంలో మాత్రం రాముడు కథలో ఆసాంతం భగవత్ స్వరూపమే. కాబట్టి అహల్య కథ వంటి సంఘటనలలో భక్తి, ఆరాధనా ప్రకటనలు గాఢంగా కనిపిస్తాయి. కంబరామాయణం పన్నెండవ శతాబ్దంలో భక్తి ఉద్యమ ప్రభావంలో రాసినది.     -- మూడు వందల రామాయణాలు,...

చిలుకుడు

  నవంబర్ 24, 2025 చిలుకుడు   ( chilukuḍu )     అర్థము      (విశేష్యము)  : గిలకొట్టు; తరచు; మధించు; చల్ల చేయడం    Meaning     (noun) : churn; sprinkle; whisk      వాడుక / Usage      చిలికి చిలికి చిలిపి వయసు వలపు వాన అవుతుంది; వలచి వలచి చెలియ మనసు పూల పల్లకి అవుతుంది .     Naughty age whips up a storm of love; head over heels the damsel's heart becomes a bedecked palanquin.    మెదడుకు మేత / Food for thought       వాల్మీకి కథలో ఇంద్రుని విషయం అహల్యకు ముందుగానే తెలుసు. కంబరామాయణంలో వచ్చింది భర్త కాదని       అహల్య మధ్యలో గ్రహించినా, ఆ నిషిద్ధ సుఖాన్ని వదలలేకపోతుంది. అదికాక కంబరామాయణంలో అహల్య భర్త      పూర్తిగా జపతపాదులలో మునిగినట్లు మనకు ముందుగా సూచించడం కూడా కథకు సంక్లిష్టతను జోడిస్తుంది.      గౌతముడు ఇంద్రునికి ఒళ్ళంతా సహస్రయోనులు కలగాలని శాపమిచ్చి, తరువాత దాన్ని సహస్రనయనాలుగా      మారుస్తాడు; అహ...

గోచరము

  నవంబర్ 21, 2025 గోచరము   ( gōcharamu )     అర్థము      (విశేష్యము/విశేషణము)  : గో=ఇంద్రియం, చర=వెళ్లడం; ఇంద్రియాలతో తెలుసుకోగలిగే విషయం    Meaning     (noun/adj) : cognisable by senses; perceptible; manifest      వాడుక / Usage     తాత్కాలిక ఉద్యోగస్తుల భవిష్యత్తు  అగమ్య గోచరం .     Contract workers future unrecognisable and uncertain.    మెదడుకు మేత / Food for thought       నా పర్ణశాలలో అభయంగా నేను ఉన్నప్పుడు ,      సామ్రాజ్యాల దురహంకారం పై విహారం చేస్తానెపుడూ;     వటవృక్షాల కింద హాయిగా విశ్రమిస్తూ,     ధృవ తార గగన పథంలో ఉండే వేళ మెరుస్తూ,      నవ్వుకుంటాను చరిత్ర గాథలను తలచి, మనిషి గర్వం కొలిచి,     కుతర్క వాదులను చూసి, పండిత పలుకులు తూచి;     ఎందుకు వారందరు, ఇంకెందుకు వారి అహంభావం,     ప్రకృతి పురుషుడు ఒకటైన తరుణం, వెలసిన దైవం?        --  గుడ్ బై ...

గమ్యము

  నవంబర్ 20, 2025 గమ్యము   ( gamyamu )     అర్థము      (విశేష్యము/విశేషణము)  : పొంద తగినది; తెలుసుకోదగినది; కదిలి చేరుకోదగ్గ ప్రదేశం/స్థితి; లక్ష్యం    Meaning     (noun/adj) : worthy of attaining/reaching; destination      వాడుక / Usage     గమ్య నగరం.. పెట్టుబడుల స్వర్గధామం!     Destination city.. haven for investments!    మెదడుకు మేత / Food for thought       వెళ్తున్నాను -  వెచ్చని వేడి, చల్లని నీడ, పొట్టకు కూడు, మేనుకు నిదుర ఇచ్చే - నా గూటికి,      ఆకుపచ్చని తివాచి పరిచిన కొండల ఒడిలోని నా ఇంటికి, --     ఆహ్లాదకరమైన వాతావరణంలో ఓ మూల ఇమిడివున్న నా నివాసం     చెట్లు చేమలు స్వయాన ఆ వనదేవతలే పదిలపరిచిన ఆ ప్రదేశం;      పచ్చని పొదలు ప్రాకే తీగలు అలరారే లతలు దినమంతా,     కోయిల కుహూ కుహూ స్వరాల పులకింత,     మంచి పొసగని పాదాలు తాకని భువి     ఆలోచనలు పవిత్రం మనసులు దివ్యం ఈ దివి.  ...

గుహ్యము

  నవంబర్ 19, 2025 గుహ్యము   ( guhyamu )     అర్థము    (విశేష్యము)  : ఏకాంతం; దాచ తగినది; తాబేలు     Meaning    (noun) : solitary; secret; mysterious; tortoise      వాడుక / Usage     గుహ్యం గా ఉండాల్సిన ఇంటి విషయాలు రచ్చకీడిస్తే వచ్చేది కీడే.     Private family matters in public domain cause more harm than good.    మెదడుకు మేత / Food for thought       వీడ్కోలు నీకు, పొగడ్తల ఓ జిత్తుల ముఖం:     తెలివైన వెక్కిరింపుల నీకు, ఓ ఐశ్వర్యం;     నడ మంత్రపు సిరికి, తలకెక్కిన కళ్ళకి;     ఊడిపోయే పెద్ద పదవులకి, మారిపోయే తల రాతలకి;     కిక్కిరిసిన దర్బారులకు, నిలువెత్తు భవనాలకు, బరువెక్కిన ఆ రహదారి;     కరడుగట్టిన హృదయాలకి, వడి వడి తడబడి అడుగుల ఈ ఆవిరి;     వదిలి వెళ్లేవారికి, కదిలి వచ్చే వారికి;     వీడ్కోలు మిడిసిపడే ప్రపంచమా ! నేనేగుతున్నాను నా ఇంటికి.        --  గుడ్ బై  ( రాల...

గర్హ్యము

  నవంబర్ 18, 2025 గర్హ్యము   ( garhyamu )     అర్థము    (విశేషణము)  : నిందింపతగినది;     Meaning    (adj) : contemptible; deserving censure      వాడుక / Usage      గోభక్తి పేరుతో దాడులు గర్హనీయం : ప్రధాని (2017).     Lynchings on the pretext of Cow worship are contemptible : PM (2017).    మెదడుకు మేత / Food for thought       వీడ్కోలు, ఎగిసిపడుతున్న ప్రపంచమా! నేను వెళ్తున్నాను ఇంటికి తిరిగి:     నువ్వు కాదు నాకు స్నేహితుడు, కాదు నేను నీ నేస్తం.     వేసారిన నీ జన సందోహంలో, తిరిగాను ఎన్నాళ్ళో విసిగి;     చిన్న నావలో ఎదురోడి మహాలవనార్ణవం,     బ్రతుకంతా నురగల తరగల తడిసి అలసి సొలిసి తరిగి;     కానీ ఇపుడు, మిడిసిపడుతున్న ప్రపంచమా!  నేను వెళ్తున్నాను ఇంటికి తిరిగి.       -- గుడ్ బై  ( రాల్ఫ్ వాల్డో ఎమర్సన్),  కి స్వేచ్ఛనువాదం

గమనము

  నవంబర్ 17, 2025 గమనము   ( gamanamu )     అర్థము    (విశేష్యము)  : ప్రయాణము; తలపు; గురి; జ్ఞాపకం     Meaning    (noun) : movement; motion; attention; memory      వాడుక / Usage      హృదయాన విరహ భారం దేహాన అలస గమనం !     Heart heavy with longing, body weary in motion!    మెదడుకు మేత / Food for thought       ఘడియలు చెప్పే గడియారంలో గంటలు గణించినపుడు,      గండ్రగొడ్డలి వంటి పగలు కళ్లు కప్పి మాయమయ్యె కరాళ రాత్రియై;      సువాసనలు విరిసే మల్లెతీగలు వడిలి హొయలు బాసినపుడు,      కాలనాగు వంటి నల్లటి కురులు మెరవగా ముగ్గువలె ధవళమై;      మహోన్నత వృక్షాలు ఆకులు రాలి మోడుగా అగుపడిన కారులో      అవేకాదా నిరుడు మండుటెండలో మందలకి గొడుగుగా నీడనిచ్చాయి,       వసంతాల సరివన్నెల పచ్చిక ముడుచుకుని మూటైనపుడు పైరులో      గడ్డ మంచు కౌగిలిలో కటుకపై తెల్లని ముసుగై మరీ నిల్చాయి, ...

కుంట

  నవంబర్ 14, 2025 కుంట   ( kunṭa )     అర్థము    (విశేష్యము)  : చెరువు; గుంట; అర ఎకరం; పాతిక సెంట్లు భూమి     Meaning    (noun) : pond; pit; quarter acre; square measure of land      వాడుక / Usage      శంభుని కుంట ను పరిరక్షించాలని సంతకాల సేకరణ .     Signature campaign to protect Lake Shambu from encroachments.    మెదడుకు మేత / Food for thought       కాలపు కఠిన శిలల్లోంచి      కాంతి జ్వాల త్రవ్వి తీస్తా !      ఎదిరించే శతాబ్దాల నిదురకు నిప్పంటిస్తా!”      నా శరీరం ఒక శాశ్వత హౌమం అది సూర్యుడి స్వగహం      కవిత్వం ఒక మెస్మరిజం కవి కన్ను ఒక ప్రిజం      నేను సృష్టించిన అలంకారం నీ అంధకారానికి దీపం      అస్తమించే నక్షత్ర లోకాన్ని ఆవలిస్తూ చూసింది కాలం      నాగలి భుజాన వేసుకుని వస్తున్నాడు సూర్యుడు కొండ శిఖరాలెక్కి      అడవిలో అగ్నిజ్వాలలు కాషాయ వస్...

కూకటి

  నవంబర్ 13, 2025 కూకటి   ( kūkaṭi )     అర్థము    (విశేష్యము/విశేషణము)  : జుట్టు; ప్రధానము; తల్లి వేరు     Meaning    (noun/adj) : lock of hair; curls; chief/principal; taproot      వాడుక / Usage     సీమ చింత కాయలు కనిపించగానే తినాల్సిందే.. ఆ రోగాలని కూకటి వేళ్ళతో తొలగిస్తుంది .     Eat jungle jalebi whenever they are available... uproots diseases comprehensively.    మెదడుకు మేత / Food for thought       దీనికి కురవడం రాదు      పేదల్ని కరవడం ఒకటే వచ్చు      నేల మీద ప్రభువుల వాగ్దానాల      పాటకు పల్లవిగా      ఇది ఆకాశం తొడుక్కున్న      అబద్ధాల ముసుగేమో!      ఈ వీస్తున్న గాలికి ఇది ఇంకా      ఎంతసేపుంటుందిలే      ఆవిరితో కట్టిన ఈ గూడు ఏమంత గట్టిగా నిలుస్తుందిలే     -- మేఘాలు, వచన కవితా పితామహులు కుందుర్తి ఆంజనేయులు

కల్మషము

  నవంబర్ 12, 2025 కల్మషము   ( kalmashamu )     అర్థము    (విశేష్యము)  : మురికి; దోషం; పాపం; నల్లనిది     Meaning    (noun/adj) : dirt; foul; sin; taint; blackness      వాడుక / Usage     క ల్మషం లేని వ్యక్తిత్వం.... ప్రజల మేలుకోరు మనస్తత్వం.     Blemish-less character...people's well being close to heart.    మెదడుకు మేత / Food for thought       కమ్మరి కొలిమీ, కుమ్మరి చక్రం,      జాలరి పగ్గం,      సాలె లల మగ్గం,      శరీరకష్టం స్ఫురింపజేసే      గొడ్డలి, రంపం, కొడవలి, నాగలి,      సహస్ర వృత్తుల సమస్త చిహ్నాలు-      నా వినుతించే,      నా విరుతించే,      నా వినిపించే నవీన గీతికి,      నా విరచించే నవీన రీతికి,      భావం!      భాగ్యం!      ప్రాణం!      ప్రణవం.     -- ప్...

కూలంకషము

  నవంబర్ 11, 2025 కూలంకషము   ( koolamkashamu )     అర్థము    (విశేషణం)  : కూలము=దరి, ఒడ్డు; కషము=ఒరుసుకునేది, రాసుకునేది; ఒడ్డుకి రాసుకునేది; సముద్రం; సమగ్రం; పూర్తిగా    Meaning    (noun/adj) : ocean; completely; thoroughly      వాడుక / Usage      సదరు భూములు విషయంలో కూలంకష తనిఖీలను తప్పనిసరి చేయనుంది .     A thorough investigation into said land records is to be mandated.    మెదడుకు మేత / Food for thought       మానవజీవిత కాళరాత్రిలో      ప్రేమచితాగ్నుల ఎర్రనినీడలు!      నైరాశ్యపు చిక్కని చీకటిలో      అక అస్పష్టపు కదలిక జాడలు!      రివ్వున దూసుకపోయే నీడలు!      నీడలనే వెన్నాడే నీడలు!      చీకటి మూలల ఏకాంతంలో      ఎందులకో వెదుకాడే నీడలు!      గాలిలోన మృతకాత్మల నీడలు!      నేలపైన కృతకాత్మల నీడలు!      ఆశయాల ఆకాశపు నీ...

క్లుప్తము

  నవంబర్ 10, 2025 క్లుప్తము   ( kluptamu )     అర్థము    (విశేషణం)  : టూకీ; సంక్షేపం; తగ్గింపబడినది    Meaning    (adj) : concise; abridged      వాడుక / Usage      వృద్ధిలో దాని స‌హ‌కారాన్ని వివ‌రించే ఒక క్లుప్త డాక్యుమెంట‌రీని విభాగం ప్రారంభించింది .     The department produced a short documentary showing its contribution to growth.    మెదడుకు మేత / Food for thought       మృత్యువనే మైదానం, శత్రువనే అజ్ఞానం     ఈర్షలోని ఒక దాహం, సంధ్యలాంటి సందేహం     పిలిచికొన్న ఒక సైన్యం, తిరిగిరాని ఒక దైన్యం     ఇది యుద్ధం అబ్బీ - యిపు     డింట యింట ఆక్రోశం     వీరికి మిగిలే దొక బాష్పం     -- అమృతం కురిసిన రాత్రి, దేవరకొండ బాలగంగాధర్ తిలక్