Posts

Showing posts from November, 2021

సాలప్రాంశుడు

  నవంబర్ 30, 2021 సాలప్రాంశుడు  ( saalapraamsudu )       అర్థము      (విశేష్యము ):  సాల = వృక్షము, ప్రకారము, మద్ది చెట్టు; ప్రాంశు = ఎత్తైన, ఉన్నతమైన; వృక్షమంత ఎత్తైనవాడు, మహోన్నతుడు     Meaning     (noun) : very tall person; colossus           వాడుక / Usage      తెలుగు సాహితీ జగత్తులో సిరివెన్నెల సీతారామ శాస్త్రి అజరామర  సాలప్రాంశుడు .     Sirivennela will stride the Telugu literary world forever as a colossus.     మెదడుకు మేత / Food for thought నువ్వెవరైనా నేనెవరైనా నీ నా నవ్వుల రంగొకటే ఊరేదైనా పేరేదైనా మన ఊపిరి గీతం ఒకటే అలలన్నిటికీ కడలొకటే, నదులన్నిటికీ నీరొకటే మనసు తడిస్తే నీ నా చెంపలు నిమిరే వెచ్చని కన్నీరొకటే ఏ దేశం వారికి అయినా ఇల ఒకటే గగనం ఒకటే ఏ భాషలు పలికిస్తున్నా గొంతులు స్వరతంత్రులు ఒకటే ఆహారం వేరే అయినా అందరి ఆకలి ఒకటే ఆకారం వేరే అయినా ఆధారం బ్రతుకొకటే నిన్ను నన్ను కన్నప్పుడు మన తల్లుల నొప్పుల తీరొకటే ఎన్నో రంగుల తెల్ల కిరణమై వెలుగుతున...

పంకము

  నవంబర్ 29, 2021 పంకము  ( pankamu )       అర్థము      (విశేష్యము ):  పాలు; సంస్కృత మూలం నుండి - బురద; పాపము     Meaning     (noun) : milk; mud; sin           వాడుక / Usage ప్రజా సమస్యలు మరచిపోయి ఒకరిపై ఒకరు పంకము జల్లుకుంటున్నారు నాయకలు. Ignoring the problems of people leaders are busy in mud slinging.     మెదడుకు మేత / Food for thought ఏమనెనే... ఏమనెనే...  చిన్నారి ఏమనెనే... ఏమనెనే.. వన్నెల సిగపూవ...  కనుసన్నలలో భావమేమే... ఏమనెనే... ఏమనెనే...  ఆమని కోయిల పాటల  గోములు చిలికించు వలపు కిన్నెర తానేమని రవళించెనే....  వనరుగా చనువైన నెనరుగా పలుకె బంగారమై... కులుకె సింగారమై... మావాడ రాచిలుక మౌనమౌనముగా -- షావుకారు (1950), సముద్రాల రాఘవాచార్య (జులై 19, 1902 - 1968)

ఉన్మాదము

  నవంబర్ 26, 2021 ఉన్మాదము  ( unmādamu )       అర్థము      (విశేష్యము ):  వెర్రి; పిచ్చి; తిక్క; చిత్త చంచల్యం     Meaning     (noun) : madness; insanity; mania           వాడుక / Usage చరిత్రలో యుద్ధాలకి మతోన్మాదం అతిపెద్ద కారణం. Religious madness is the biggest reason for wars in history.     మెదడుకు మేత / Food for thought భారత ప్రజలమైన మేము , భారతదేశాన్ని  సర్వసత్తాక సామ్యవాద లౌకిక ప్రజాస్వామ్య గణతంత్ర  రాజ్యంగా నిర్మించుకోవడానికి, పౌరులందరికీ: సాంఘిక, ఆర్థిక, రాజకీయ న్యాయాన్ని; ఆలోచన, భావప్రకటన, విశ్వాసం, ధర్మం, ఆరాధనల స్వాతంత్ర్యాన్ని ; అంతస్తుల్లోనూ, అవకాశాల్లోనూ, సమానత్వాన్ని చేకూర్చడానికి;, వారందరిలో వ్యక్తిత్వ గౌరవాన్ని, జాతీయ సమైక్యతను సంరక్షిస్తూ సౌభ్రాతృత్వాన్ని పెంపొందించడానికి; మన ఈ రాజ్యాంగ పరిషత్ లో 1949, నవంబర్ 26వ తేదీన ఎంపిక చేసుకొని, శాసనంగా రూపొందించుకున్న ఈ రాజ్యాంగాన్ని మాకు మేము సమర్పించుకుంటున్నాము...

సెల

  నవంబర్ 25, 2021 సెల  ( sela )       అర్థము      (విశేష్యము ):  ప్రవహించునది; కారునది; యేఱు; బాణము; బాణాపుములుకి; ఏదుపంది ముల్లు     Meaning     (noun) : fountainhead; stream; arrow(or it's tip); porcupine's quill           వాడుక / Usage వెన్నెల సెల యేరులలో కన్యాసమీపంలో ముంగురుల మధుపంలో నన్ను నేను కోల్పోయాను. I lost myself in the moonlit company of the damsel's curls.     మెదడుకు మేత / Food for thought కాళిదాసు, భవభూతి ఒక ప్రక్కన..యమునా చార్యులు. వేదాంత దేశికులు ఒక ప్రక్కన..తిక్కన, పెద్దనలు అటు ప్రక్కన...కబీరు, సూరదాసులు ఇటు ప్రక్కన...షెల్లీ, బైరన్లు మరొక ప్రక్కన నిల్చుంటే..కృష్ణ శాస్త్రి గారు ఎవ్వరి ప్రక్కనైనా నిల్చోగలిగిన 'సత్తా' ఉన్న వారని ''దమ్మున్న' పెద్దల ఉవాచ!  'కృష్ణ శాస్త్రి బాధ ప్రపంచమంతటికీ బాధ..ప్రపంచం బాధలన్నీ శ్రీ శ్రీ బాధలే' అనిపించారు! '' ఆ తరం కవులు అందరూ ఒక ఎత్తు,కృష్ణ శాస్త్రి గారు ఒక ఎత్తు, వారిలో కృష్ణ  శాస్త్రి  గారే కొంచెం ఎత్తు''అనిపించార...

నీరదము

  నవంబర్ 24, 2021 నీరదము  ( nīradamu )       అర్థము      (విశేష్యము ):  నీరు ఇచ్చునది; మబ్బు; మేఘము;      Meaning     (noun) : cloud           వాడుక / Usage ఆర్చుకుపోయిన భుమమ్మ తొలకరి చినుకులు తెచ్చే నీరదం కోసం ఎదురు చూసింది. The parched land awaited the cloud bringing the first showers.     మెదడుకు మేత / Food for thought అం దాలు అలలైన మందాకిని మందార మకరంద రసవాహిని ఆమె చరణాలు అరుణ కిరణాలు ఆమె నయనాలు నీల గగనాలు ఆ జవ్వనాలు నా జన్మకు దొరికిన నైరుతి ఋతుపవనాలు ఆ చిరునవ్వు లేత నెలవంక దిగివచ్చెనేమో ఇలవంక శృంగార రసరాజ కల్లోలిని కార్తీక పూర్ణేందు కలహారిని ఆమె అధరాలు ప్రణయ మధురాలు ఆమె చలనాలు శిల్ప గమనాలు ఆ దర్శనాలు నా జన్మకు మిగిలిన సుందర సుఖ తరుణాలు ఆ కనుచూపు నాకు కడదాక పిలుపైనా లేని ప్రియలేఖ   --  వేటూరి (జనవరి 29, 1936 - 2010)

నెత్తావి

  నవంబర్ 23, 2021 నెత్తావి  ( net-tāvi )       అర్థము      (విశేష్యము ):   నెర=నిండైన + తావి= పరిమళము ; సువాసన; సుగంధము; అత్తరు     Meaning     (noun) : odour; fragrance; perfume; sweet smell           వాడుక / Usage "నీ చెలిమిలోనున్న  నెత్తావి  మాధురులు నా హృదయ భారమునే మరపింపజేయు" The sweet smell of your companionship warms the cockles of my heart.     మెదడుకు మేత / Food for thought శంకరమంచి అమరావతి కథలు పరమశివునికి అక్షరాభిషేకం,  మహానివేదన ఆ భాషాపాణికి కరకంకణం. దశదిశలూ కళ్ళకద్దుకోవలసిన ఈ కథా నీరాజనంలో నరుడే శివుడనుకుంటే, ఆ నరుడి సగభాగమైన పార్వతి నెత్తికెక్కించుకున్న గంగ, చూసే మూడోకన్ను, చేసే ప్రళయ తాండవం, విరిసిన వెన్నెల, కురిసిన చీకటి, వరించిన గరళం, ధరించిన కంకాళం, సరళం, పరుషం, వానా, వరదా అన్నిటి విశ్వరూప సాక్షాత్కారం అమరావతి కథలు. శంకరమంచి చెప్పాడు, కృష్ణమ్మ వింది, కడుపులో దాచుకుంది, తరతరాలకు చెబుతుంది.   --  ఎమ్వీఎల్

సుతరాము

  నవంబర్ 22, 2021 సుతరాము  ( sutarām )       అర్థము      (విశేషణము ):  బొత్తిగా; ససేమిరా; ఏమాత్రము; కొంచంగా కూడా     Meaning     (adverb) : in the least; absolutely; utterly; not at all           వాడుక / Usage అమరావతికి సుతరామూ ఒప్పుకోని ప్రభుత్వం అకస్మాత్తుగా ప్లేటు ఫిరాయించింది. Government reversed its stance of utterly opposing Amaravathi.     మెదడుకు మేత / Food for thought మాయామేయజగంబె నిత్యమని సంభావించి మోహంబునన్‌ నా యిల్లాలని నా కుమారుఁడని ప్రాణంబుండునందాఁక నెం తో యల్లాడిన యీ శరీర మిపుడిందుం గట్టెలం గాలుచో నా యిల్లాలును రాదు పుత్రుఁడును దోఁడైరాఁడు తప్పింపగన్‌   -- సత్యహరిశ్చంద్రీయం, బలిజేపల్లి లక్ష్మీకాంత కవి (డిసెంబర్ 23, 1881 - 1953)

దుకూలము

  నవంబర్ 19, 2021 దుకూలము  ( dukūlamu )       అర్థము      (విశేష్యము ):  తెల్ల వస్త్రం; వలువ; చేలము; (సంస్కృతంలో కుల్ = కప్పునది)     Meaning     (noun) : fine cloth; robe; vestment           వాడుక / Usage హేమంత ఋతువులో పొగ మంచు  దుకూలం వలే ఆ పల్లెని కప్పేసింది.   The autumn fog covered the hamlet like a fine raiment.     మెదడుకు మేత / Food for thought స్వదేశాభిమానం మన తుది ఆధ్యాత్మిక ఆశ్రయం కాజాలదు. నా శరణు మానవత్వము. రత్నాల మూల్యం చెల్లించి గాజు కొనం అలాగే నేను బ్రతికి ఉన్నంతవరకు మానవత్వం పైన స్వదేశాభిమానాన్ని గెలువనివ్వను.    -- రవీంద్రనాథ్ ఠాగూర్ (మే 7, 1861 - 1941)

సైకతము

  నవంబర్ 18, 2021 సైకతము  ( saikatamu )       అర్థము      (విశేష్యము ):  ఇసుక (సికత)  కలది; ఇసుక నేల లేక దిబ్బ     Meaning     (noun) : sandy land or dune; graveled area           వాడుక / Usage కార్తీక సోమవారం నాడు మహిళలు సైకత లింగాలు చేసారు. Women made Lingas made of sand on the Monday of Karthika.     మెదడుకు మేత / Food for thought "ఒక విషయం గుప్తంగా ఉంచాలంటే దానిని నీ నుంచి నువ్వే దాచుకోవాలి" - జార్జ్ ఆర్వెల్, 1984 అనే పుస్తకంలో ఈ రిట్ దాఖలలు ఆర్వెల్లియన్ పోకడలు అనగా -  నూతన సాంకేతిక నైపుణ్యంతో మీరు వినేది విని, మీరు చూసేది చూసి, మీరు చేసేది తెలుసుకోవడం -  గురించి ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.    -- పెగసస్ అంశంపై తీర్పులో సుప్రీమ్ కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి. రమణ

శాద్వలము

  నవంబర్ 17, 2021 శాద్వలము  ( Sadvalamu )       అర్థము      (విశేషణము ):  లేత పచ్చిక (శాద)  కలది; పచ్చిక బైలు     Meaning     (noun) : meadow           వాడుక / Usage వర్షాకాలంలో ఆ శాద్వలామంతా ప్రకృతి కాంత తన ఆకుపచ్చని చీర పరిచినట్లు ఉంది. In rainy season the meadow looked as if nature draped its green vestments on it.     మెదడుకు మేత / Food for thought జాతీయ తత్వం ఒక బుద్ధిహీనమైన వ్యాధి. అది మానవాళికి మసూచికం వంటిది.   -- ఆల్బర్ట్ ఐన్‌స్టీన్  (మార్చ్ 14, 1879 - 1955)

అనశ్వరము

  నవంబర్ 16, 2021 అనశ్వరము  ( a-naṣvaramu )       అర్థము      (విశేషణము ):  నశ్వరం (నాశనం) కానిది; నిత్యమైనది; శాశ్వతమైనది     Meaning     (adj) : imperishable; eternal           వాడుక / Usage వేదాలు ఆత్మ అనిశ్వరమని ఘోషిస్తున్నాయి. Vedas proclaim that the Self is imperishable and eternal.     మెదడుకు మేత / Food for thought భారతీయులు ఈనాడు రెండు విభిన్న సిద్ధాంతాలకు అధీనులై ఉన్నారు. రాజ్యాంగ పీఠికలో ఉన్న రాజకీయ ఆదర్శం అందరికీ స్వేచ్ఛ,  సౌభ్రాతృత్వం, సమానత్వం నిర్వచిస్తోంది. కానీ సాంఘిక ఆదర్శం మతంలో నిగూఢమై వాటికి వ్యతిరేకంగా ఉంది.   -- రాజ్యాంగ శిల్పి, డా. బి. ఆర్. అంబేద్కర్ (ఏప్రిల్ 14, 1891 - 1956)

స్నిగ్ధము

  నవంబర్ 15, 2021 స్నిగ్ధము  ( snigdhamu )       అర్థము      (విశేషణము ):  స్నేహము ఉన్నది; చిక్కనైనది; నున్నగా ఉన్నది; నూనెగా ఉన్నది; మృదువైనది;      Meaning     (adj) : friendly; thick; oily; smooth; soft; wet           వాడుక / Usage ఆమె వదనం స్నిగ్ధ కుసుమం, ఆమె వచనం స్నిగ్ధ సుకుమారం. Her face is a soft blossom, her words gentle and amiable.     మెదడుకు మేత / Food for thought మన ప్రభుత్వాలు ఈరోజు చేసేవి మున్ముందు వచ్చే ప్రభుత్వాల నిబద్ధత, పనితీరు, నిర్ణయాల పైన ప్రభావం చూపుతాయి. ఇది మనం గుర్తు ఉంచుకోవడం అవసరం. ఈరోజు మనం వాడే అధికారాలు, చట్టాలు న్యాయమైన కావలసిన కారణాలకే కావచ్చు. కానీ మున్ముందు అవే చట్టాలు అన్యాయమైన అనుచితమైన కారణాలకు వాడవచ్చు. అందుకనే సిద్ధాంతాలకు స్వేచ్ఛలకు విరుద్ధంగా చట్టాలను చేయడం రాబోయే ప్రమాదానికి హేతువు.   -- తొలి ప్రధాని  పండిట్ జవహర్ లాల్ నెహ్రు (నవంబర్ 14, 1889 - 1964)

అమేయము

  నవంబర్ 12, 2021 అమేయము  ( amēyamu )       అర్థము      (విశేషణము ):  అధికము; మితము లేనిది; లెక్కకు మించినది; తెలుసుకోరానిది     Meaning     (adj) : immeasurable; boundless; vast           వాడుక / Usage  పద్మశ్రీ పురస్కార గ్రహీత తులసి గౌడకు  అరణ్యాల గురించి అమేయమైన విజ్ఞానం ఉంది.   Padma awardee Tulasi Gowda has a vast knowledge of the forests.     మెదడుకు మేత / Food for thought రమ్మంటె చాలు గాని రాజ్యాలు విడిచిరానా  నీ చిన్ని నవ్వుకోసం స్వర్గాలు గడిచిరానా ఏడేడు సాగరాలు ఎన్నెన్ని పర్వతాలు ఎంతెంత దూరమైన బ్రతుకంత నడిచిరానా కనులందు మంచులాగ కలలన్ని కరగిపోగా కావేరి వోలె పొంగి కన్నీరు తుడిచి రానా నీవున్న మేడ గదికి నను జేర నీయరేమో జలతారు చీరగట్టి సిగపూలు ముడిచిరానా పగబూని కరకు వారు బంధించి ఉంచినారు ఏనాటికైన గానీ ఈ గోడ పొడిచి రానా   -- తొలి తెలుగు గజల్ కవి దాశరథి (జులై 22, 1925 - 1987)

గ్లాని

  నవంబర్ 11, 2021 గ్లాని  ( glāni )       అర్థము      (విశేష్యము ):  బడలిక; పని చేయడం వల్ల అలుపు; రోగము; చేటు; నష్టం; క్షిణించుట     Meaning     (noun) : fatigue; decay; decline           వాడుక / Usage   కండర గ్లానికి కారణం కండరాలకు అవసరమైనంత ఆక్సిజన్ అందకపోవడమే.   Muscle fatigue is caused by lack of adequate oxygen to muscles.     మెదడుకు మేత / Food for thought   కమ్ము కున్న ఈ ప్రగాఢమైన  నిశ్శబ్దం వినబడుతోంది   కదులుతున్న కాలం దానిని అందరికీ పంచింది    కొంచం కొంచం బాధ అవును అదే మనందరి కథ    మబ్బు చాటున పొంచి ఉన్న వెలుగూ అదీ అందరి వాట   కనులలో  ఎందుకు నీకా వ్యర్ధమైన భాష్పం   దొర్లే ప్రతి నిమిషం కాదా నీకు సరికొత్త ఋతు వరం   క్షణాలను  ఎందుకీ  కాలగర్భంలో కోల్పోతావు   హృదయమా అసలెందుకు నువ్వు ఏడుస్తావు   -- జావేద్ అక్తర్ (షాయరీ యొక్క స్వేఛ్చనువాదం)

అఘము

  నవంబర్ 10, 2021 అఘము  ( aghamu )       అర్థము      (విశేష్యము ):  పాపం; తప్పు; వ్యసనం; దోషం     Meaning     (noun) : sin; crime; mistake           వాడుక / Usage   చరవాణి నేటి తరానికి పెద్ద  అఘము .   Mobile phones are the biggest addiction of this generation.     మెదడుకు మేత / Food for thought   మరణం నను వరించి వస్తే ఏమంటాను నేనేమంటాను   పాలు పట్టి జోలపాడి పడుకోమంటాను   లంచం నను భజించి వస్తే ఏమంటాను నేనేమంటాను   తిరుమలగిరి హుండీలో చొరబడమంటాను   కామం నను కలవరపెడితే ఏమంటాను నేనేమంటాను   అలిగి ఉన్న పడుచు జంటతో కలబడమంటాను   క్రోధం నను కవ్విస్తుంటే  ఏమంటాను నేనేమంటాను   పస చచ్చిన పేడి జాతిలో గుసబడమంటాను   లోభం నను బులిపిస్తుంటే  ఏమంటాను నేనేమంటాను   తెగ ఒలికే కవి పలుకుల్లో దిగబడమంటాను   అహంకారం ఎదురై వస్తే  ఏమంటాను నేనేమంటాను   నరుని వదిలి కొండా నెత్తిలో స్థిరపడమంటాను   కాలం పులిలా గాండ్రి...

సంఘాతము

  నవంబర్ 09, 2021 సంఘాతము  ( ṣan-ghātamu )       అర్థము      (విశేష్యము ):  సమూహం; దండు; తాడనము; గట్టి దెబ్బ     Meaning     (noun) : crowd; multitude; hard blow           వాడుక / Usage   తన ఎడమ చేతి మెరుపువంటి సంఘాతముతో ప్రత్యర్థిని మట్టికరిపించాడు.   He landed a hard blow with his left hand and his opponent reeled.     మెదడుకు మేత / Food for thought పరులకోసం పాటుపడని  నరుని బ్రతుకు దేనికని మూగ నేలకు  నీరందివ్వని వాగు పరుగు దేనికని  తాతలు తాగిన నేతుల సంగతి నీతులుగా పలికెను మన సంస్కృతి జల్లుకు నిలవని ఎండకు ఆగని చిల్లుల గొడుగు దేనికని  ఆదర్శాలకు నోళ్లు చాలవు ఆశయాలకు ఫైళ్లు చాలవు  పద పదమంటూ పలుకులే గాని కదలని అడుగు దేనికని  జలవిద్యుత్తుకు కరువేలేదు జన సంపత్తికి కోరవే లేదు  అవసరానికి మీట నొక్కితే అందని వెలుగు దేనికని  శిశుహృదయానికి కల్లలు లేవు రసరాజ్యానికి ఎల్లలు లేవు  లోపలి నలుపు సినారెకి తెలుసు పైపై తొడుగు దేనికని   -- ...

చెలియలికట్ట

  నవంబర్ 08, 2021 చెలియలికట్ట  ( cheliyali-kaṭṭa )       అర్థము      (విశేష్యము ):  సముద్రపు అంచు/గట్టు/ఒడ్డు; తటము; చెల్లు(అయిపోవు)+అల+కట్ట; అలలు ఆగిపోవు ప్రదేశం     Meaning     (noun) : sea shore; bank where wave stops           వాడుక / Usage    చెలియలికట్ట  దాటనంతవరకు సముద్రంతో ప్రమాదం లేదు. మనసూ అంతే.   As long as the sea doesn't cross the shore it is harmless. Same with mind.     మెదడుకు మేత / Food for thought సమస్తం పొందాను ప్రేమించి నిన్నే. మిగిలింది ఏమన్నా ఉంటే అది కేవలం నువ్వే. నువ్వు వెళ్ళిపోడంతో ఏమీ మారలేదు. రాత్రీ వచ్చింది. నెలవంక పొడిచింది. కానీ నిద్రే దరి చేరలేదు. -- గుల్జార్ షాయరీ (స్వేచ్చానువాదం)

నితాంతము

  నవంబర్ 05, 2021 నితాంతము  ( nitāntamu )       అర్థము      (విశేషణము ):  అధికము; అత్యంతము; పెల్లు; అమితము     Meaning     (adv) : extremely; great; immeasurably           వాడుక / Usage   నితాంతమైన ప్రేమతో యుద్ధభూమికేగిన మగనికొరకు ఆమె ఎదురు చూసింది.   She waited with undying love for her lover to return from the battlefield.       మెదడుకు మేత / Food for thought స్వతంత్ర భారతజననీ, నీ కిదె నితాంత నవనీరాజనము అశేష పూజాశిరీషములతో అగణిత నర నారీజనము - స్వతంత్ర భారతజననీ వదలెను చిరదాస్యపుశృంఖలములు చెదరెను దైన్య తమః పటమ్ములు అసేతుహిమనగ మ్మొకపొంగై అలముకొన్న దానందతరంగము - స్వతంత్ర భారతజననీ బలిమికి జేగురు , తాల్మికి తెల్లన కలిమికి పచ్చన, కర్మచక్రము, వాడ వాడ నీ హృదిలో మేడల నేడు త్రివర్ణపతాకములే - స్వతంత్ర భారతజననీ పచ్చనితోటల నే యెడ వినినా స్వేచ్ఛాపికములు నిండుగళమ్ముల హాయి హాయిగా రెక్కల విద్రిచే తీయని గీతీహారతులే ...