Posts

Showing posts from January, 2022

అంకణం

  జనవరి 31, 2022 అంకణం  ( ankaṇamu )       అర్థము      (విశేష్యము ):  72 చదరపు అడుగుల ప్రదేశం; రెండు స్తంభాల మధ్య భాగం; ప్రాంగణం; పెరడు; మండువా; ముద్ర వేయడం     Meaning     (noun) : 72 sq feet; space between two beams; branding; courtyard    వాడుక / Usage   "ఓబ్బీ! మీ కొట్టాం ఎన్ని అంకణాలు ఉంటుంది? "    O Mister! How many square feet is your granary?     మెదడుకు మేత / Food for thought     అశ్నీమహి వయం భిక్షామాశావాసో వసీమహి ।    శయీమహి మహీపృష్ఠే కుర్వీమహి కి మీశ్వరైః ॥ (భిక్షమెత్తుకున్న భోజనం తిందాం. ఆకాశం(దిక్కులు) మన అంబరాలు(బట్టలు) అవ్వని. నేల తల్లి మీదే పడుకుందాం. మనకీ ధనంతో పనేమిటి?)     -- భర్తృహరి (~అయిదవ శతాబ్ధం) వైరాగ్య శతకం

మదన

  జనవరి 28, 2022 మదన  ( madana )       అర్థము      (విశేష్యము ):  మత్తెక్కించు వాడు; సంతోషము కలగచేసేవాడు;  మన్మథుడు ; వసంతం; ఉమ్మెత్త చెట్టు; తుమ్మెద మైనము; కల్లు     Meaning     (noun) : Cupid; spring; bee wax; intoxicating person/drink; Dattura tree    వాడుక / Usage   " ఇందువదన కుందరదన మందగమన భామా..  ఇందువలనా ఇందువదనా.. ఇంత మదనా ?? ప్రేమా? "    O' damsel who strides gently, with a face like moon and teeth that are blossoms...is it for this, all this intoxicating love?     మెదడుకు మేత / Food for thought      లతికలలో తనూల్లత…  విస్మయ మృగనయనాలలో వీక్షణ      నిండు జాబిల్లిలో మనోజ్ఞవదనం…  పురి విప్పిన నెమలి పింఛాలలో వేణి      కన్నాను సఖీ! ఓలలాడే నదీ తరంగాలలో నీ…  కనుబొమ్మలా కేళి      హతవిధీ! కలబోసిన నీ మదోన్మత్త రూపం భువిలోన లేదే వేరోక్కటి     -- శ్యామాస్వంగం చకితహరిణీం (ఉత్తరమేఘ, 44...

నలినము

  జనవరి 27, 2022 నలినము  ( nalinamu )       అర్థము      (విశేష్యము ):  నీరు; తామర/కమలము/నళిని; కొంగ     Meaning     (noun) : water; lily/lotus; crane    వాడుక / Usage    " నీలగగన ఘనవిచలన ధరణిజ శ్రీరమణ...  మధురవదన నళిన నయన మనవి వినరా రామా "     Dark as the sky, O' Sita Rama - sweet face and lotus eyed - I beseech you!     మెదడుకు మేత / Food for thought అడిగిన జీతంబియ్యని మిడిమేలపు దొరను గొల్చి మిడుకుట కంటెన్‌ వడిగల యెద్దుల గట్టుక మడి దున్నుకు బ్రతుక వచ్చు మహిలో సుమతీ ( అడిగినప్పుడు జీతము ఈయని గర్వియైన ప్రభువును సేవించి జీవించుటకంటే, నాగలికి వేగముగా పోగల యెద్దులను కట్టుకొని పొలమును దున్నుకొని వ్యవసాయముచే జీవించుట మంచిది) -- సుమతీ శతకం, బద్దెన (~ 1260)

నిగమము

  జనవరి 26, 2022 నిగమము  ( nigamamu )       అర్థము      (విశేష్యము ):  వేదము;  ఆదే శించబడినది ; మార్గము; పట్టణము; అంగడి     Meaning     (noun) : Veda; writ; written rules (~ constitution); way; city (trading place); market    వాడుక / Usage   " షడ్యమాం భవతి వేదం,  పంచమాం భవతి నాదం,  శ్రుతిశిఖరే నిగమఝరే స్వరలహరే "    The first Svara (is invariant) is Veda, the fifth (is invariant) is the life/breath, from the peaks of Sruthi (Vedas) and the stream of Vedas come the waves of Svaras (notes).     మెదడుకు మేత / Food for thought      భారత ప్రజలమైన మేము, భారత్‌ను సర్వసత్తాక, సామ్యవాద , లౌకిక , ప్రజాస్వామ్య, గణతంత్ర రాజ్యంగా ఏర్పరచాలని, దేశ పౌరులందరికీ కింది అంశాలు అందుబాటులో ఉంచాలని సంకల్పించాము: న్యాయం - సామాజిక, ఆర్థిక, రాజకీయ న్యాయం; స్వేచ్ఛ - ఆలోచనా స్వేచ్ఛ, భావప్రకటన స్వేచ్ఛ, మతావలంబన స్వేచ్ఛ; సమానత్వం - హోదాలోను, అవకాశాలలోను సమానత్వం; సౌభ్రాతృత్వం - ...

వెత

  జనవరి 25, 2022 వెత  ( vetha )       అర్థము      (విశేష్యము ):  వ్యథ; శోకము; బాధ; విచారము; దుఃఖము     Meaning     (noun) : pain; sorrow; distress    వాడుక / Usage   " వెతలు  తీర్చు మా దేవేరి, వేదమంటి మా గోదారి "   Godavari is our Veda; and is our Queen with a healing touch.     మెదడుకు మేత / Food for thought      ఆబాల గోపాలాన్ని అలరించే చిత్రకళాకేళిలో భాగమైన సినిమా పాటలో భాష అతి సరళంగా, జనబాహుళ్యం నిత్యం వినియోగించే వ్యావహారికంలా సులువుగా, తేలిగ్గా ఉండాలి అనే నిబంధన తప్పు అనలేం, అనకూడదు కూడా. కాని, వేటూరిగారు తెలిసి తెలిసి సినిమా నియమావళిని అతిక్రమించి, ‘శంకరాభరణం’, ‘సప్తపది’, ‘సాగర సంగమం’, ‘పార్వతీ పరమేశ్వరులు’ ఇంకా ఇలా ఎన్నో చిత్రాల్లో, అతి ప్రౌఢమైన భాషని వినియోగించడం ద్వారా తెలుగుభాషకి,సంస్కృతికి,ఎలాంటి మేలు జరిగిందో ఒకసారి ఆగి ఆలోచించాలి. మంచి ‘పలుకుబడిని’ కొందరికే పరిమితం చేయకుండా సమాజంలో అందరికీ పంచిపెట్ట గలిగిన, పంచి పెట్టవలసిన ‘వేదిక’ ...

కలికి

  జనవరి 24, 2022 కలికి  ( kaliki )       అర్థము      (విశేష్యము ):  అందమైన స్త్రీ; అతివ; (విశేషణము) మనోజ్ఞము     Meaning     (noun) : beautiful woman; damsel; (adj) pleasing    వాడుక / Usage   " కలికి  చిలకనాయే కలత నిదురలాయే"   Beautiful parrot am I, sleepless nights have I.     మెదడుకు మేత / Food for thought     అయినా వయ్యారం వల్ల మధురవాణికి పేరు వచ్చిందా, మధురవాణి వల్ల వయ్యారం ఫేమస్ అయ్యిందో చెప్పడం కష్టం! అలాగే డబ్బు మదం వల్ల ఎడ్యుకేషన్ చెడిందో ఎడ్యుకేషన్ చెడిందని డబ్బుకు మదం వచ్చిందో, అంతా పదహారణాల కన్ఫ్యూషన్ లాగా ఉంది. అందుకే ఈ రోజుల్లో వీరవెంకటేశం లాంటి విద్యార్థి చుట్టలో హషిష్ దాచి, ఒకసారి పొగ పీల్చి, గోల్డెన్ బీచ్లో శ్రీదేవితో విహరించి, తెలివొచ్చేసరికి వీధి పక్క కుళ్లు కాలవలో పొర్లుతున్నాడు. ఈ ట్వంటీ ఫస్ట్ సెంచరీలో చదువు చెప్తామంటూ వచ్చే గాడిద కొడుకులకు అసలు స్టాండర్డ్ ఉందటోయ్? అందుకే ప్రభుత్వం రోజుకో విద్యావిధానం పూటకో భోజన సదుపాయం పెడుతోంది. నన్నడిగితే విద్యా...

ఆస్యము

  జనవరి 21, 2022 ఆస్యము  ( āsyamu )       అర్థము      (విశేష్యము ):  ముఖము; వదనము; నోరు; మాట      Meaning     (noun) : face; mouth; words/speech    వాడుక / Usage    హరి పాంచజన్యమును పూరించినంతనే ఆస్యము నుంచి వచ్చిన ధ్వనితోనే రాక్షసుల ప్రాణములు హరీయన్నవి.    As Sri Hari blew Panchajanya, just the sound that came from his mouth killed the demons.     మెదడుకు మేత / Food for thought      తెలుగ దేలయన్న దేశంబు తెలుగేను      తెలుగు వల్లభుండ తెలుగొకండ      ఎల్ల నృపులు గొలువ ఎరుగవే బాసాడి      దేశ భాషలందు తెలుగు లెస్స     (తెలుగులోనే ఎందుకంటే ఇది తెలుగు దేశం కనుక, తెలుగు రాజువు కనుక, తెలుగు తీయనిది కనుక. రాజులందరూ నిన్ను పొగుడుతుంటే తెలుగులోని మాధుర్యం నువ్వు తెలుసుకున్నావు కదా! దేశంలోని భాషలలో తెలుగు శ్రేష్టము) -- శ్రీకాకుళాంధ్ర మహావిష్ణువు నోట - ఆముక్తమాల్యదలో శ్రీ కృష్ణదేవరాయలు (జనవరి 17, 1471 - 1529)

రాక

  జనవరి 20, 2022 రాక  ( rāka )       అర్థము      (విశేష్యము ):  వచ్చుట, ఆగమనం; నిండు పున్నమి; కొత్తగా రజస్వల అయిన స్త్రీ; ఒక యేరు/నది     Meaning     (noun) : coming, arrival; full moon; pubescent girl; a river    వాడుక / Usage   విజయావారి చిత్రాలలో మార్కస్ బార్ట్లీ తెరకెక్కించిన రాక జాబిలి అమోఘం.     Marcus Bartley's full moon in Vijaya movies is phenomenal.     మెదడుకు మేత / Food for thought పది మాసాలు మోశావు పిల్లలను బ్రతుకంతా మోశావు బాధలను ఇన్ని మోసిన నిన్ను మోసే వాళ్ళు లేక వెళుతున్నావు కడుపుచించుకు పుట్టిందొకరు కాటికి నిన్ను మోసేదొకరు తలకు కొరివి పెట్టేదొకరు ఆపై నీతో వచ్చేదెవరు ఆపై నీతో వచ్చేదెవరు మమతే మనిషికి బందిఖానా భయపడి తెంచుకు పారిపోయినా తెలియని పాశం వెంటపడి రుణం తీర్చుకోమంటుందీ నీ భుజం మార్చుకోమంటుంది! తాళి కట్టిన మగడు లేడని తరలించుకుపోయే మృత్యువాగదు ఈకట్టెను కట్టెలు కాల్చక మానవు ఆ కన్నీళ్ళకు చితి మంటలారవు ఈ మంటలు ఆ గుండెను అంటక మానవు! ఈ జీవన తరంగాలలో ఆ దేవుని చదరంగ...

ద్యుతి

  జనవరి 19, 2022 ద్యుతి  ( dyuti )       అర్థము      (విశేష్యము ):  ప్రకాశించునది; కాంతి; కిరణము; వెలుగు     Meaning     (noun) : light; ray; lustre; splendor; majestic        వాడుక / Usage   చైనా  సూర్యునికంటే అయిదు రెట్లు  ద్యుతి " కృత్రిమ భాస్కర" ప్రయోగంలో సాధించింది.   China achieved 5 times more lustre in it's "artificial Sun" experiment.     మెదడుకు మేత / Food for thought "రెండు నెలల క్రితం యీ ఇంట్లో అడుగు పెట్టిన మీరిద్దరూ దేవతామూర్తుల్లాగా కనిపించారు. ఒకరి పట్ల ఒకరు మనస్ఫూర్తిగా చేసుకున్న త్యాగాలు మీకా శక్తినిచ్చాయి. కానీ నా మీద అనుమానం రాగానే మీ మనస్సు ఇరుకయిపోయింది. మీరు మనిషిగా అంతకంటే కిందకి మానసికంగా దిగజారిపోయారు. కెప్టెన్ సాబ్! త్యాగం మనిషిని దేముడిని చేస్తుంది. స్వార్ధం అతడిని రాక్షసుడిని చేస్తుంది. ఆ రెండింటి పరాకాష్టని ఒకే సాయంకాలం ఒక చిన్న అనుమానానికి లొంగిపోయి చూపించారు మీరు. చావుకి ఈడిగలబడుతున్న నాలాంటి నిర్భాగ్యుడికి..ఈ చిన్న బ్రతుకులో అమరత్...

మిళిందము

  జనవరి 18, 2022 మిళిందము  ( miḷindamu )       అర్థము      (విశేష్యము ):  తుమ్మెద; భ్రమరము     Meaning     (noun) : (honey) bee            వాడుక / Usage   ఎరువుల వాడకం వల్ల పంటలకు అత్యవసరమైన మిళిందములు నశిస్తున్నాయి.   Fertilizers and pesticides are destroying bee colonies.     మెదడుకు మేత / Food for thought పొద్దున్నే మా వూళ్ళో బొట్టెట్టుకుంటాది గోదారి పొద్దూకి జాబిల్లి పువ్వెట్టుకుంటాది భూదేవి మాగాణి చీరల్లో మాపైరు పచ్చల్లో మాలక్ష్మిలాఉంది మా సీమ ఆ సీమ పేరే కోనసీమ అరుగులున్న ఇళ్ళు అయోధ్యలు కడుపు పండినోళ్లు కౌసల్యలు జాణలంతా జానకమ్మలు అంటుకుంటే అగ్గిబొమ్మలు రాజ్యాలు లేకున్నా రతనాల గుణముంది మనవాళ్ళు మా ఊళ్ళో రామయ్యలు ఆ ఏటి లంకల్లో ఈ పాటి దిబ్బల్లో ఏడుంటె మాకేంటి లంకేశులు -- కోనసీమ కుర్రోడు, వేటూరి (జనవరి 29, 1936 - 2010)

క్రోడము

  జనవరి 17, 2022 క్రోడము  ( krōḍamu )       అర్థము      (విశేష్యము ):  ఆలింగనము; ఒక చోటకు చేర్చడం; ఒడి; రొమ్ము; చెట్టు లోపల/మధ్య భాగము; (అడవి) పంది     Meaning     (noun) : lap; embrace; breast; chest; hollow of tree trunk; boar            వాడుక / Usage   సమాచారం అంతా క్రోడీకరించి వీర గున్నమ్మ చరిత్రను పుస్తకరూపంలో ప్రచురించారు.   Information was brought together to publish freedom fighter Gunnamma's story.     మెదడుకు మేత / Food for thought అంధేందూదయముల్ మహాబధిరశంఖారావముల్ మూకస ద్గ్రంథాఖ్యాపనముల్ నపుంసకవధూకాంక్షల్ కృతఘ్నావళీ బంధుత్వంబులు భస్మహవ్యములు లుబ్ధద్రవ్యముల్ క్రోడస ద్గంధంబుల్ హరిభక్తి వర్జితుల రిక్తవ్యర్థసంసారముల్ (లోకంలో గుడ్డివాడికి వెన్నెల నిరుపయోగం ;  చెవిటివాడికి శంఖ ధ్వని వినబడదు ;  మూగవాడికి గ్రంథపఠనం సాధ్యపడదు ;  నపుంసకుడికి కాంత మీద కోరికలు ఫలించదు ;  కృతఘ్నుడికి బంధుత్వం కుదరదు ;  బూడిదలో పోసిన హోమద్రవ్యాలు నిరుపయో...

కరణీయ

Image
  జనవరి 14, 2022 కరణీయ  ( karaneeya )       అర్థము      (విశేష్యము ):  చేయదగినది;  సహజ సంఖ్యలచే గణ్యము కాని లేదా రెండు పూర్ణాంకముల భాగహార ఫలముగా కచ్చితముగా చూపుటకు వీలులేని సంఖ్య     Meaning     (noun) : worth doing; irrational number           వాడుక / Usage      బాబిలోనియా లోని మట్టి పలకల మీద  లెక్కలో  కరణీయ సంఖ్య    విలువ 14 దశాంశ స్థానాల వరకు ఉంది.     Babylonian clay tablets show irrational    value up to 14 decimal places.     మెదడుకు మేత / Food for thought "అన్నీ సాధారణీకరణలు (generalizations), ఇది కాకుండా, తప్పిదాలే!...భాష గురించి ఆలోచించినకొద్దీ అసలు మనుషులు ఒకర్ని ఒకరు అర్థం చేసుకోవడమే ఆశ్చర్యకరం....గణితం మన మేధస్సుకు అందనిది అయినా అయి ఉండాలి లేక మన మెదడు యంత్రంకన్నా ఎక్కువన్నా అవ్వాలి...అరిస్టాటిల్ తర్వాత తర్కంలో కొత్తగా వచ్చినదేమీ లేదు."       -- ఆస్ట్రియన్  తార్కికుడు,  కర్ట్ గ...

వ్యవకలనము

  జనవరి 13, 2022 వ్యవకలనము  ( vyavakalanamu )       అర్థము      (విశేష్యము ):  వ్యవ=విడతీయడం, వేరు; కలన = చేయడం; ఒక సంఖ్యలోనుంచి ఇంకోటి తీసివేయడం     Meaning     (noun) : subtraction; deduction; separation           వాడుక / Usage     ప్రభుత్వ పనుల్లో దళారీల వ్యవకలనాలతో ప్రజలకు తడిసి మోపెడవుతోంది.     The cuts to middlemen in government works inflates the bill to people.     మెదడుకు మేత / Food for thought "గతించిన కాలపు బగ్గీలో మనం ఎక్కడికీ వెళ్లలేము... కేవలం మాతృ మూర్తులే భవిష్యత్తు గురించి ఆలోచించగలరు. ఎందుకంటే భవిష్యత్తుని వాళ్ళ పిల్లలలో జన్మనిస్తారుగనుక... ఆనందం అనేది చేతిలో ఉన్నప్పుడు చిన్నగానే కనపడుతుంది. కానీ ఒక్కసారి దాన్ని విడిచావో అప్పుడు తెలుస్తుంది అది ఎంత పెద్దదో ఎంత అమూల్యమైనదో."       --రష్యన్  రచయత,  మాక్సిం గోర్కీ   (మార్చ్ 28, 1868 - 1936)

అభిముఖము

  జనవరి 12, 2022 అభిముఖము  ( abhi-mukhamu )       అర్థము      (విశేషణము ):  ముఖానికి ఎదురుగా; ఎదురు; సమక్షంలో; అనుకూలంగా     Meaning     (adj) : facing towards; opposite; favourable           వాడుక / Usage     విద్యార్థులు పాఠశాలలో అభిముఖ బోధన లేక చాలా నష్టపోతున్నారు.     Students are at a great loss due to lack of face to face teaching.     మెదడుకు మేత / Food for thought "మనిషి స్వేచ్ఛగా ఉండడానికి ఖండించబడ్డాడు. ఎందుకంటే ఒకసారి ఈ ప్రపంచంలోకి విసిరివేయబడ్డ తర్వాత, తను చేసే పనులకు తీసుకునే నిర్ణయాలకు తనే బాధ్యుడు. మృత్యువు ఎప్పుడూ మరీ తొందరగా అన్నా వస్తుంది లేక మరీ ఆలస్యంగా అన్నా వస్తుంది. ఎప్పుడు వచ్చినా జీవితం సమాప్తి అనే ఒక గీత గీస్తుంది. ఆ క్షణంలో ఆ జీవితం యొక్క సారాంశం కూడాల్సిందే. అది తప్ప నువ్వంటూ వేరే ఏమీ లేదు."       -- ఫ్రెంచ్   రచయత, తత్వవేత్త,  జీన్ పాల్ సార్ట్రే   (జూన్ 21, 1905 - 1980)

విచలనము

  జనవరి 11, 2022 విచలనము  ( vichalanamu )       అర్థము      (విశేష్యము ):  మార్గం తప్పి కదులుట; కాంతి కిరణం గాలినుండి స్ఫటికంలోకి వెళ్లునప్పుడు వంగడం; సిద్ధ రాశి నుంచి దూరంగా పోవడం    Meaning     (noun) : moving about; unsteadiness; diffraction; standard deviation           వాడుక / Usage     ఆర్థిక నిపుణులు  విచలనం గురించి ఎంత మాట్లాడతారో నష్టాలను అంత తక్కువ భేరీజు వేస్తారు.     Experts who harp on standard deviation etc tend to underestimate risk of losses.     మెదడుకు మేత / Food for thought "మరణాంతర జీవితం గురించి ప్రధమ ప్రశ్న, అది నిజమా కాదా అన్నది కాదు. అది నిజమే అయితే ఏ సమస్యని అది పరిష్కరిస్తోంది అనేది అసలు ప్రశ్న. అన్నిటి కన్నా కష్టమైనది మనను మనం వంచించుకోకుండా ఉండడమే. తత్వం అంటే మన జ్ఞానాన్ని భాష మసిపూసి కప్పెట్టకుండా వెలికితీయడమే."       -- ఆస్ట్రియన్  తర్కవేత్త, తత్వవేత్త,  లుడ్విగ్ విట్గెన్‌స్టీన్   (ఏప్రిల్ 26, ...

అనుపాతము

  జనవరి 10, 2022 అనుపాతము  ( anupathamu )       అర్థము      (విశేష్యము ):  ఒకదాని వెంట ఒకటి వ్రాలుట/పడుట; రెండు నిష్పత్తుల సమానత్వం     Meaning     (noun) : one following the other; equality of ratios; proportion           వాడుక / Usage          ఎంత   సంపాదన అయినా ఒకే శాతం శిస్తులు వసూలు చేయడాన్ని అనుపాత పన్నులు అంటారు.      Levying the same percent of tax irrespective of income is proportional taxation.     మెదడుకు మేత / Food for thought "మనల్ని పొడిచి గాయపరిచే పుస్తకాలనే చదవాలి. మనం చదివే పుస్తకం మన తల మీద సమ్మెట పోటులా తగిలి మనల్ని లేపకపోతే ఇంకెందుకు చదవడం? మనల్ని సంతోషపెట్టే పుస్తకాలు అవసరమైతే మనమే రాసుకోవచ్చు. కానీ మనకి ఉత్పాతంలాగా కలచివేసే పుస్తకాలు కావాలి. మిక్కిలి బాధ పెట్టేవి - ఎంతగా అంటే మనకన్నా మనం ఎక్కువ ప్రేమించిన వాళ్ళు చచ్చిపోతే కలిగే బాధ అంత, ఎక్కడో దూరంగా అందరినుంచి దూరంగా అడవిలోకి బహిష్కరించినట్లుగా, ఒక ఆత్మహత్య కలి...

పక్షము

  జనవరి 07, 2022 పక్షము  ( pakshamu )       అర్థము      (విశేష్యము ):  పదిహేను రోజులు; ప్రక్క; రెక్క; చేదోడు; సమూహము; తర్క విషయము     Meaning     (noun) : fortnight; side, flank, wing; helper; group, tribe; argument, position           వాడుక / Usage          ప్రజాస్వామ్య మనుగడకు బలమైన ప్రతి పక్షం అవసరం.     A strong opposition is needed for a vibrant democracy.     మెదడుకు మేత / Food for thought చిరంజీవి గోదావరి పడమటింట పుట్టింది సౌభాగ్యవతి తాను తెలుగునాట మెట్టింది దక్షిణాది గంగగా దయతో ఉప్పొంగుతూ... కల్యాణిగా తాను కడలిలో కలిసింది నాసికా త్రియంబకాన గోముఖాన పుట్టి మహారాష్ట్ర లావణీల  మంజీరం కట్టి సీతమ్మ సిగలోనా మందారం చుట్టి... శబరి తల్లి ఫలహారం రామయ్యకు పెట్టి భవభూతి  శ్లోకమై... శ్రీనాథుడి సీసమై చాళుక్యుల వైభవాలు జగమంతా చాటి నన్నయ్యకు తెలుగు కవిత ఉగ్గుపాలు పట్టి కోనసీమ పచ్చదనం కోకలుగా చుట్టి సప్త ఋషులు సాగనంప సాగరాన మెట్టి రామదాసు కీర్...

తృటి

  జనవరి 06, 2022 తృటి  ( truTi )       అర్థము      (విశేష్యము ):  క్షణకాలం; రెప్పపాటు కాలం; ముప్పై అల్పకాలాలు (సూది ఒక ఆకులోంచి వెళ్లే సమయం); కొద్దిలో     Meaning     (noun) : very small amount of time; narrow (as in escape)           వాడుక / Usage          తృటిలో అంతమైపోయే దానికోసం జీవితాంతం ప్రాకులాడడం దేనికి?     That which ends in a fleeting second, why hanker?     మెదడుకు మేత / Food for thought ఒకటిగొని, రెంటి నిశ్చలయుక్తి చేర్చి మూటి నాల్గింటి కడువశ్యములగ చేసి ఏనిటిని గెల్చి, ఆఱింటి నెఱిగి యేడు విడిచి వర్తించువాడు వివేకధనుడు   (ఒకటి – అంటే ఏకాగ్రబుద్ధి గొని, రెండు – మంచి చెడ్డల్ని నిర్ణయించి, మూడు – అంటే మిత్ర శత్రు ఉదాసీనుల్ని వశీకరించి, నాలుగు – అంటే సామదానబేధ దండోపాయాల చేత వశ్యం చేసుకుని, ఐదు – అంటే పంచేంద్రియాల్ని  గెల్చి, ఆరు – అంటే సంధి విగ్రహం, యానం, ఆసనం, ద్వైధీభావం, సమానాశ్రయాల్ని ఎరిగి, ఏడు – సప్తవ్యసనాల్ని విడిచినవాడ...

ఆవర్తనము

  జనవరి 05, 2022 ఆవర్తనము  ( āvartanamu )       అర్థము      (విశేష్యము ):  చుట్టూ తిరుగుట; గిరగిరా తిరగడం; చిలుకుట; పాఠం వల్లె వేయడం; మధ్యాహ్నం     Meaning     (noun) : revolution; gyration; repeating; periodic; noon           వాడుక / Usage           ఉపరితల ఆవర్తనము ప్రభావం వలన అదే ప్రాంతం లో అల్పపీడనం ఏర్పడింది.     Cyclonic winds result in a low pressure area.     మెదడుకు మేత / Food for thought కంచరేగి తీపి వోలె లచ్చువమ్మో..... నీ కంఠమెంత మధురమే లచ్చువమ్మ... కంచరేగి తీపి వోలె లచ్చువమ్మో..... నీ కంఠమెంత మధురమే లచ్చువమ్మ...నీ కంఠమెంత మధురమే లచ్చువమ్మ... పారే యేరు అలలమీద పండు వెన్నెల రాలినట్టు... ఊరే  ఊట సేలిమే లోన తేటనీరు లోలికినట్టు... వెండి మెరుపుల నవ్వునీదే..... వెండి మెరుపుల నవ్వునీదే లచ్చు వ మ్మో..... నీది ఎంతసక్కని రూపమే లచ్చు వ మ్మ.....             // కంచరేగ...