Posts

Showing posts from May, 2022

తిరుగలి

  మే 31, 2022 తిరుగలి  ( tirugali )       అర్థము      (విశేష్యము ): తిరుగు (భ్రమము) + కల్లు (రాయి) = పిండి విసరాడానికి గుండ్రంగా ఉండే/తిరిగే రాయి     Meaning     (noun) : hand mill    వాడుక / Usage      మరలో పట్టిన పిండిలో  వేడి వల్ల పోషక పదార్థాలు నశిస్తాయి, తిరగలిలో అలాగా కాదు.     Whilst the nutrients in the flour are lost to heat in a mill, the hand mill preserves them.     మెదడుకు మేత / Food for thought       నేను నీకు ఇచ్చే సలహా ఏమిటి అంటే పెళ్లి చేసుకో. మంచి భార్య దొరికిందా సంతోష పడతావు, లేదా వేదాంతి అవుతావు.    -- సోక్రటీస్ (469 BC - 399 BC)

సన్నికల్లు

  మే 30, 2022 సన్నికల్లు  ( sanni-kallu )       అర్థము      (విశేష్యము ): నూరుకునే రాయి; రుబ్బు రోలు; గుండ్రాయి     Meaning     (noun) : grinding stone    వాడుక / Usage      " సన్నికల్లు  తొక్కినా సప్తపదులు మెట్టినా మనసు మనసు కలపడమే మంత్రం పరమార్ధం"     Whatever the rituals, the essence of wedding mantras is to tie hearts together.     మెదడుకు మేత / Food for thought       జీవితం యొక్క పరమార్థం ప్రస్తుతతం అధికమైన అభిమతాల పక్షాన, మంద తరపున ఉండడం కాదు, వెఱ్ఱియెత్తిన భావాల మధ్య ఇరుకైన ఆలోచనల మధ్య బంధీ కాకపోవడమే!    -- మార్కస్ ఆరేలియస్ (ఏప్రిల్ 26, 121 - 180)

సుమరజం

  మే 27, 2022 సుమరజం  ( sumarajamu )       అర్థము      (విశేష్యము ): సుమ = పుష్పం; రజం = దుమ్ము, పుప్పొడి; కుసుమ పరాగం; పువ్వుల పొడి     Meaning     (noun) : pollen; flower dust    వాడుక / Usage      భరతమైన నాట్యం నటప్రకృతీ పాదజం  నర్తనమే శివకవచం  నటరాజ పాద సుమరజం .     Dance of Bharata (country or sage) born at the feet of nature is the protection accorded by Shiva; it is the offering of flowers at Nataraja's feet.     మెదడుకు మేత / Food for thought       భారత దేశంలో సెక్కులర్ రాష్ట్రం గురించి మాట్లాడతాము. దానికి మన భాషలలో సరైన పదం దొరకడం చాలా కష్టం. కొంతమంది అదంటే మతానికి వ్యతిరేకం అనుకుంటారు. అది ససేమిరా నిజం కాదు. దాని అర్థం ఏమిటి అంటే - రాష్ట్రం అన్ని ధర్మాలని/మతాలని సమానంగా గౌరవిస్తుంది, పరిగణిస్తుంది, సమానమైన అవకాశలు ఇస్తుంది. రాష్ట్ర పరంగా ఒక మతానికే అధీనమై ఉండదు. చరిత్రలో తరచుగా కనపడేది ఏమిటి అంటే - మనల్ని మంచి వారిగా తీర్చిదిద్ది ఔన్న...

తపనుడు

  మే 26, 2022 తపనుడు  ( tapanuḍu )       అర్థము      (విశేష్యము ): తపించువాడు; తప = మండు, కాలిపోవు, ఆలోచించు; నిత్యం మండేవాడు అనగా సూర్యుడు     Meaning     (noun) : one who burns; Sun    వాడుక / Usage     తపనుని కిరణం తామస హరణం శివుని నయన త్రయలాస్యం.     The rays of the burning Sun (knowledge) destroy darkness (ignorance). Dance of Shiva's third eye is this!     మెదడుకు మేత / Food for thought       రాతి బొమ్మలకేల రంగైన వలువలు?      గుళ్ళు గోపురములు కుంభములును,      కూడు గుడ్డ తాను కోరునా దేవుడు?     విశ్వదాభిరామ వినురవేమ!      నీళ్ళ మునుగనేల? నిధుల బెట్టగనేల?      మొనసి వేల్పులకును మ్రొక్కనేల?      కల్మషములెన్నొ కడుపులోనుండగా     విశ్వదాభిరామ వినురవేమ!    -- వేమన (ఆగష్టు 25, 1652 - 1730)

సుతగిరి

  మే 25, 2022 సుతగిరి  ( suthagiri )       అర్థము      (విశేష్యము ): సుత = కూతురు, గిరి = పర్వతం; పర్వతరాజ పుత్రి; పార్వతీ దేవి     Meaning     (noun) : daughter of the king of mountains; Goddess Parvathi    వాడుక / Usage      నవరస నటనం జతియుత గమనం  సుతగిరి చరణం సురనుతి పయనం.    Expressive dance of harmonious movement reaches as worship to the feet of Parvathi.     మెదడుకు మేత / Food for thought       అసలు దేవుడే లేడు. ఈ విశ్వాన్ని ఎవరూ సృష్టించలేదు. మన తలరాతను ఎవరూ నిర్ణయించరు. దీనివల్ల నాకు తెలిసిందేమంటే స్వర్గమనేది లేదు. మరణానంతరం జీవితం లేదు. కేవలం మనం కోరుకోవడం వల్లే మరణానంతరం కూడా జీవితం ఉంటుందని అనుకుంటున్నాం. వీటిని నిరూపించడానికి ఎలాంటి ఆధారాలు లేవు. సైన్స్‌ ముందు ఇలాంటివన్నీ తేలిపోతాయి.  ఆల్బర్ట్‌ ఐన్‌స్టీన్‌ మాదిరిగా   ‘దేవుడు’ అనే పదాన్ని ఓ వ్యక్తికి కాకుండా ప్రకృతి ధర్మాలకు ఆపాదిస్తాను.    -- బ్రీఫ్‌ ఆన్సర్స్‌ టు బి...

గమకము

  మే 24, 2022 గమకము  ( gamakamu )       అర్థము      (విశేష్యము/విశేషణము ): ప్రయత్నం; అధికము; మిక్కిలి; కౌశలం; మనోహరం;  తన స్థానాన్ని వదలక తనకు ముందు వెనుక ఉన్న స్వరస్థానాలతో మైత్రి చేసి కలిసి నడవడం     Meaning     (noun/adj) : endeavour; pleasant; increase; great; ornamented notes (music)    వాడుక / Usage     ప్రవరాఖ్యుని చూసి వరూధిని తమకం గమక మయ్యెను.    Varudhini's desire increased on seeing Pravarakhya.     మెదడుకు మేత / Food for thought       సందెకాడ బుట్టినట్టి చాయల పంట యెంత-      చందమాయ చూడరమ్మ చందమామ పంట॥      మునుప పాలవెల్లి మొలచి పండినపంట      నినుపై దేవతలకు నిచ్చపంట      గొనకొని హరికన్ను గొనచూపులపంట      వినువీధి నెగడిన వెన్నెలల పంట॥      వలరాజు పంపున వలపు విత్తిన పంట      చలువై పున్నమనాటి జాజరపంట      కలిమి కామిని తోడ కారుకమ్మినపం...

మహతి‌‌

  మే 23, 2022 మహతి‌‌  ( mahati )       అర్థము      (విశేష్యము/విశేషణము ): వంద తంత్రులు ఉన్న నారదుని వీణ; స్త్రీ వాచకం (వ్యాకరణం); గొప్పది      Meaning     (noun/adj) : Narada's veena; feminine nouns in Telugu; great    వాడుక / Usage     తెలుగు పాటకి మునుపులేని మహతి యైన  ప్రతిష్ఠ   వేటూరి మాటతో వచ్చింది.    Veturi's words bestowed a great prestige to Telugu songs.     మెదడుకు మేత / Food for thought       నెలవంక తలపాగ నెమలి యీకగ మారె,      తలపైని గంగమ్మ తలపులోనికి బారె,      నిప్పులుమిసే కన్ను నిదరోయి బొట్టాయె,      బూదిపూతకు మారు పులితోలు వలువాయె      ఎఱుక గల్గిన శివుడు ఎఱుకగా మాఱగా      తల్లి పార్వతి మారె తాను ఎఱుకతగా      ఓంకార ధనువుగా ఒదిగె త్రిశూలమ్ము     కైలాసమును వీడి కదలివచ్చెను శివుడు    -- కిరాతార్జునీయం ( భక్త కన్నప్ప) , వేటూరి...

కవాటము

  మే 20, 2022 కవాటము  ( kavāṭamu )       అర్థము      (విశేష్యము ): తలుపు; ఒక వైపుకే తెరుచుకునే తలుపు (వాయు/ద్రవ పధార్థాలు వెనక్కి రాకుండా)      Meaning     (noun) : door; valve    వాడుక / Usage     మయసభలో కవాటములు ఉన్నచోట లేనట్లుగా, లేని చోట ఉన్నట్లుగా నిర్మించాడు.    Mayasabha was designed with doors appearing where they weren't and vice versa.     మెదడుకు మేత / Food for thought       సత్యం ఏమిటో స్వప్నం ఏమిటో చెప్పేదెవరు ఏ కంటికైనా    రెప్పలదుప్పటి కప్పే చీకటి చూపించేనా ఏ కాంతినైనా    నిను నీవే సరిగా కనలేవే మనసా    నడిరాతిరి నడకా కడతేరదు తెలుసా    ఏవో జ్ఞాపకాల సుడిదాటి బైటపడలేవా    ఎన్నో తీపి సంగతుల రేపు పిలుపు వినలేవా    చంద్రుడి ఎదలో మంటని వెన్నెల అనుకుంటారని    నిజమైనా నమ్మేస్తామా భ్రమలో పడమా తెలిసీ    జాబిలిని వెలివేస్తామా తనతో చెలిమే విడిచీ    రూపం లేదు గనక సాక్ష...

క్రోడీకరణము

  మే 19, 2022 క్రోడీకరణము  ( krōḍi-karaṇamu )       అర్థము      (విశేషణము ): ఓకటిగా చేర్చడం; ఆలింగనం; సంగ్రహము     Meaning     (noun) : embracing; abridgment; codification; putting things together    వాడుక / Usage     మహాభారతంలో  క్రోడీకరించబడ్డ నీతులు తరతరాలకు నిలిచిపోయాయి.    The moral precepts codified in Mahabharatha stand for all times.     మెదడుకు మేత / Food for thought       తిరమై సంపదలెల్ల వెంటనొకరీతిన్ సాగిరావేరికే      సరికేపాటు విధించినో విధి యవశ్యప్రాప్తమద్దానినె      వ్వరు దప్పించెదరున్నవాడననిగర్వంబేరికిన్ గాదుకిం     కరుడే రాజగు రాజే కింకరుడగున్ గాలానుకూలంబుగన్      (సంపద స్థిరముగా మనతో రాదు. ఉన్నవాడిని అని గర్వం అనవసరం. విధికి అతీతంగా పోలేము. కాలం అనుకూలమైనప్పుడు సేవకుడే రాజవ్వును, ప్రతికూలమైనప్పుడు రాజే సేవకుడవ్వును)      -- సత్య హరిశ్చంద్ర, బలిజేపల్లి లక్ష్మీకాంతం (డి...

క్షంత

  మే 18, 2022 క్షంత  ( kshanta )       అర్థము      (విశేషణము ): ఓర్పుగలవాడు; సహనశీలి; క్షమావంతుడు     Meaning     (noun) : patient person; one who is forgiving    వాడుక / Usage     కురుసభలో ద్రౌపదికి చేసిన పరాభవానికి దుర్యోధనాధులు క్షంతవ్యులు కారు.    Duryodhana cannot be forgiven for the atrocity committed against Draupadi.     మెదడుకు మేత / Food for thought       అడిగిన జీతం బియ్యని    మిడిమేలపు దొరను గొల్చి మిడుకుట కంటెన్‌    వడి గల యెద్దులఁ గట్టుక    మడి దున్నుక బ్రతుక వచ్చు మహిలో సుమతీ!      (అడిగిన జీతమీయని ప్రభువుని సేవించి కష్టపడుటకన్న,చుఱుకైన యెద్దులను గట్టుకొని పొలము జీవించుటయే మేలు)      --బద్దెన (~ 1260)

కేతువు

  మే 17, 2022 కేతువు  ( kētuvu )       అర్థము      (విశేష్యము ): గురుతు; అగ్ని; కాంతి;  టెక్కెము; ధ్వజము; తోకచుక్క; నవగ్రహాలలో ఒకటి     Meaning     (noun) : symbol; fire; comet; flag; descending node of moon    వాడుక / Usage     మహాభారత యుద్ధంలో హనుమంతుడు అర్జుని రథంపై కేతువుగా ఉన్నాడు.    Hanuman stood as the standard on Arjuna's chariot in Mahabharata war.     మెదడుకు మేత / Food for thought       కవిత్వంలోనూ జీవితంలోనూ, Economy of words and thoughts లేకపోవటం దేశభక్తి కన్న హీనమైన పాపం, ఆత్మలోకంలో దివాలా.  తనకీ, ప్రపంచానికీ సామరస్యం కుదిరిందాకా కవి చేసే అంతర్‌, బహిర్‌ యుద్ధారావమే కవిత్వం. అందువల్లనే దిక్కుల్ని, దేవుల్ని, అధికారుల్ని వూగించి ప్రశ్నించే శ్రీ శ్రీ పద్యాలు అంత అభిమానం. నెత్తురూ, కన్నీళ్ళూ తడిపి కొత్త టానిక్ తయారు చేశాడు శ్రీ శ్రీ ఈ వృద్ధ ప్రపంచానికి.  హృదయం ఎల్లా కంపిస్తే ఆ కంపనకి మాటల రూపాన్ని ఇవ్వడం అతనికే తెలుసు, మాటల్ని కత్తులూ, యీ...

క్లేశము

  మే 16, 2022 క్లేశము  ( klēṣamu )       అర్థము      (విశేష్యము ): దుఃఖము; కోపము; బాధ; ఆపద; వ్యవసాయము     Meaning     (noun) : affliction; pain; suffering    వాడుక / Usage     పాండవులు అరణ్యవాసంలో అనేక  క్లేశాలు అనుభవించారు.    Pandavas endured a lot of suffering during their exile in the forest.     మెదడుకు మేత / Food for thought       శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా       హార తుషార ఫేన రజతాచల కాస ఫణీశ కుంద మం      దార సుధా పయోధి సిత తామర సామర వాహినీ శుభా     కారత నొప్పు నిన్ను మది గానగ నెన్నడు గల్గు భారతీ      ( భారతీదేవి! తెల్లని కాంతులు వెల్లివిరసే శరత్కాల మేఘాలు, శరదృతు చంద్రబింబం, పచ్చకర్పూరం, మంచిగంధం, రాజహంసలు, జాజిపూల దండలు, కురిసే మంచు, తెల్లని నురుగు, వెండికొండ, రెల్లుపూలు, ఆదిశేషుడు, మల్లెపూలు, కల్పవృక్షం, పాలసముద్రం, తెల్లతామరలు, ఆకాశగంగా నీ ఉజ్జ్వల శుభంకర ఆకారానికి ఉపమ...

ప్రోచు

  మే 13, 2022 ప్రోచు  ( prōchu )       అర్థము      (క్రియ ): బ్రోచు; ఆదుకోను; కాపాడు; పోషించు; రక్షించు     Meaning     (verb) : nourish; protect; save; preserve    వాడుక / Usage     దేశాన్ని బ్రోచే వారెవరు, కులమత రాజకీయ చిచ్చు నుండి?    Who will protect the country from the flames of caste, religion and politics?     మెదడుకు మేత / Food for thought       ఎవరిరాకతో గళమున పాటల ఏరువాక సాగేనో     ఆ వసంత మాసపు కులగోత్రాలను ఎల కోయిల అడిగేనా     ఎవరి పిలుపుతో పులకరించి పురి విప్పి తనువు ఊగేనో     ఆ తొలకరి మేఘపు గుణగణాలకై నెమలి వెదుకులాడేనా      నా కన్నులు చూడని రూపం      గుడిలో దేవత ప్రతిరూపం      నీ రూపం అపురూపం      ప్రాణం పుట్టుక ప్రాణికి తెలియాలా      గానం పుట్టుక గాత్రం చూడాలా     వెదురును మురళిగ మలచి     ఈ వెదురును ము...

నయగారము

  మే 12, 2022 నయగారము  ( nayag-āramu )       అర్థము      (విశేష్యము ): నయము+కారము; మృదుత్వము; మృదువైన మాటకారితనం; అనుకూలము; అలంకారం     Meaning     (noun) : smooth; softness; soft spoken; adorned; decoration    వాడుక / Usage     మేనక నయగారాలకు విశ్వామిత్రుని మనసు చలించింది.    Viswamitra was enamoured with Menaka's endearments.     మెదడుకు మేత / Food for thought       తెల్లావారక ముందే పల్లె లేచింది      తనవారినందరినీ తట్టీ లేపింది      ఆదమరచి నిద్ర పోతున్న తొలి కోడి      అదిరిపడి మేల్కోంది... అదే పనిగ కూసింది      వెలుగు దుస్తులేసుకొని సూరీడు      తూర్పు తలపు తోసుకొని వచ్చాడు      పాడు చీకటికి ఎంత భయమేసిందో      పక్కదులుపుకొని ఒకే పరుగుతీసింది      అది చూసి... లతలన్నీ... ఫక్కున నవ్వాయి      ఆ నవ్వులే ఇంటింట పువ్వులైనాయి  ...

క్రొక్కారు

  మే 11, 2022 క్రొక్కారు  ( krok-kāru )       అర్థము      (విశేష్యము ): క్రొత్త + కారు; క్రొత్త కాలం/ఋతువు; వానాకాలం     Meaning     (noun) : new season; especially rainy season    వాడుక / Usage      క్రొక్కారు మెరుపు మెరిసినంతనే నెమళ్ళు పురి విప్పి నాట్యం చేసాయి.    As soon as the rains started the peacocks danced.     మెదడుకు మేత / Food for thought       ఎట్టాగయ్యా శివ శివా.. నీవన్నీ వింత ఆటలే..      పుట్టుక చావు యాతన.. నువ్వు రాసే నుదిటి రాతలే..      నింగీ నేలా అందరికొకటే.. వందాలోచనలెందుకు..      బంధీయే ప్రతి మనిషి.. బంధాల్లోని బాధకు..      మోదమొకటే వేదనొకటే.. జనులకీ జగతిలో..      ఎట్టాగయ్యా శివ శివా.. నీవన్నీ వింత ఆటలే..      పుట్టుక చావు నడుమలో.. మావన్నీ ఎదురీతలే..      దయ చూడూ శివ శివలీల.. శివ శివ భోళాశంకరుడా..      నీవే శంభో శివ శివ....

పోకడ

  మే 10, 2022 పోకడ  ( pō-kaḍa )       అర్థము      (విశేష్యము ): గతి; నడత; రీతి; ప్రవర్తనము; వాలకం; నాశనము     Meaning     (noun) : going; departure; behaviour; conduct; ruin    వాడుక / Usage      వాన రాకడ , ప్రాణం  పోకడ  ఎవరు చెప్పగలరు!    Who can predict the coming of rain or the going of life!     మెదడుకు మేత / Food for thought       నీవెవరో నేనెవరో నీలో నాలో నిజమెవరో     నాలోని వేదనా నీ రూపు దాల్చెనా     నిను రూపుమాపగా విషమైన తాగనా     మంచిని చేసిన మానవుని వంచన చేసే లోకాన్ని     ఎదిరించి నిలవనా పోరాడి గెలవనా     వలపించు పూలతో మరిపించు మధువుతో     నా తనివి తీరగా నను నేనే మరువనా      -- నిండు మనసులు, దాశరథి (జులై 22, 1925 - 1987)

తేటి

  మే 09, 2022 తేటి  ( tēṭi )       అర్థము      (విశేష్యము ): తుమ్మెద; తేనెటీగ; భ్రమరము     Meaning     (noun) : black carpenter bee; honey bee    వాడుక / Usage     కీటకనాశన మందుల విచ్చలవిడి వాడకం వల్ల తేటుల సంఖ్య బాగా దెబ్బ తింది.    Indiscriminate use of pesticides has led to a precipitous fall of bee population.     మెదడుకు మేత / Food for thought       ఏ తీగ పువ్వునో  ఏ కొమ్మ తేటినో కలిపింది ఏ వింత అనుబంధమౌనో...      మనసు మూగది మాటలు రానిది  మమత ఒకటే అది నేర్చినది      బాషలేనిది బందమున్నది  మన ఇద్దరిని జత కూర్చినది...      వయసే వయసును పలకరించినది  వలదన్నా అది నిలువకున్నది      ఎల్లలు యేవి వొల్లలన్నది  నీదీ నాదోక లోకం అన్నది...      తొలి చూపే నను నిలవేసినది మరుమాపై అది కలవరించినది      మొదటి కలయికే  ముడివేసినది  తుది దాకా ఇది నిలకడైనది ...

స్థాణువు

  మే 06, 2022 స్థాణువు  ( sthāṇuvu )       అర్థము      (విశేష్యము/విశేషణము ): మేకు; మ్రోడైన చెట్టు; శివుడు; స్థిరమైనది; కదలనిది     Meaning     (noun/adj) : trunk of a tree; nail; stake; Siva; firmly fixed; not moving    వాడుక / Usage     "ముడుపు కట్టినట్టి వయసు ధార పోసె గంగ, స్థాణువైన శివుని మనసు కరుణతొ కరుగంగా" - తనికెళ్ళ భరణి    Bequeath all she had, did Ganga; melt it did, Siva's unflinching heart.     మెదడుకు మేత / Food for thought       వెన్నెలలో వెలుగుధార    వన్నెలలో స్నానమాడ    ధవళకాంత తరళమూర్తి - భువన సకల మోహమూర్తి    ప్రణయదేవి నా శశికళ - మృణాళాంగి నా శశికళ    పూర్ణనగ్నయై నిలిచెను - పూర్ణకుంతలా లాడగ.    తను భంగిమ హిమశృంగము - మినువాకలో తరంగము    వెన్నెలలో స్నానమాడ - క్రొన్ననల ప్రోవు ప్రోడ    స్వచ్ఛ దేహమై నిలిచెను - స్వప్న సుందరై పొలిచెను    మిరుమిట్లయె నా కన్నులు - ఉరవడించె నా...