Posts

Showing posts from June, 2023

గూడుపుఠాణి

  జూన్ 30, 2023 గూడుపుఠాణి      ( guduputani )       అర్థము      (విశేష్యము ): మోసము; కుట్ర; వంచన; రహస్య మంతనాలతో ఎత్తుగడ (గూఢ=రహస్య,  ఠాణి=స్థానం)     Meaning     (noun) : conspiracy; plot    వాడుక / Usage తెలుగు చిత్రాలలో థ్రిల్లర్ సినిమాలకు క్రిష్ణ నటించిన గూడుపుఠాణి మూస స్థాపించింది .    The thriller genre in Telugu movies follow the template of Krishna's move "The Conspiracy".     మెదడుకు మేత / Food for thought జరిగినవి రెండు సంఘటనలు. ఒక సైనికుని హత్య, అతని భార్య పై బలాత్కారం. ఈ సంఘటనలలోని ప్రత్యక్ష పాత్రల కథనం, ప్రత్యక్ష – పరోక్ష సాక్షుల కథనం ఒకరు చెప్పిన దానికి, మరొకరు చెప్పిన దానికి పొంతన లేదు. ఈ ప్రపంచంలో “పరమసత్యం” అన్నది లేదా? ఒకటి కన్నా మరొకటి నిజం. ఒకటి కన్నా మరొకటి అబద్ధం. ఇదేనా “జీవిత సత్యం”? 1950 సంవత్సరంలో, అప్పటికి ఎక్కువ మందికి తెలియక పోయినా ఆ తరవాత కాలంలో అంతర్జాతీయ సినిమా దర్శకుల్లో గొప్ప పేరు వచ్చిన జాపనీస్ సినిమా దర్శకుడు అకీరా కురొసోవా ( Akira Ku...

వేగుచుక్క

  జూన్ 29, 2023 వేగుచుక్క      ( veguchukka )       అర్థము      (విశేష్యము ): వేగు=వేకువ; వేకువ ఝామున కనిపించే నక్షత్రం/గ్రహం; శుక్రుడు     Meaning     (noun) : morning star; Venus    వాడుక / Usage అమెరికన్ పాత్ర జొర్రో ఆధారంగా తీయబడ్డ చిత్రం వేగుచుక్క .    The movie "Morning Star" is based on the adventure character Zorro.     మెదడుకు మేత / Food for thought శ్రీ కె. వి. మహాదేవన్‌ “సప్తపది” సినిమాలో స్వరం ఇచ్చిన రెండు సింధుభైరవి పాటలూ హిట్సే! ఈ పాటలకన్న ముందు గుర్తు పెట్టుకోవలసిన పాట మూగమనసులు సినిమాకోసం సింధుభైరవి రాగంలో స్వరం ఇచ్చిన “ముద్దబంతి పూవులో …” అన్న పాట. ఈ పాట వచ్చిన కొత్తల్లో ఎంత ప్రజాదరణ పొందిందో, ఇప్పటికీ తెలుగువాళ్లల్లో అంత పాప్యులర్‌అయిన పాట ఇది. రేడియో ద్వారా లలిత సంగీతాన్ని ప్రజలకు అందించిన సంగీత దర్శకులు, గాయకులు కూడా సింధుభైరవి రాగాన్ని చాలా ఎక్కువగా ఉపయోగించుకొన్నారన్న విషయాన్ని మనం మర్చిపోకూడదు. ఒకప్పటి విజయవాడ రేడియో ఆర్టిష్టులైన శ్రీ బాలాంత్రప...

అపేక్ష్య

  జూన్ 28, 2023 అపేక్ష్య      ( apēkshya )       అర్థము      (విశేష్యము ): అపేక్షించ తగినది; అపేక్ష=కోరిక, వాంఛ, ఆశ     Meaning     (noun) : worthy of desire/wish    వాడుక / Usage 1954 లో వచ్చిన  అచింత్య  అపేక్ష్య రత్నావళి  చిత్రం జానపద చిత్రాలకి తార్కాణం.    The movie "Unfathomably desire worthy diamond necklace" is the hallmark of folk movies.     మెదడుకు మేత / Food for thought “ఏమిటీ? పాసిపోయిన అన్నం తినేవాళ్ళా మీరు?” “పాసిపోకుండా ఉండడానికే నీళ్ళు పోయడం.” “ఛీ!  ఛీ!  అలా నీళ్ళోడుతున్న అన్నాన్ని ఎలా తింటారబ్బా!” “తినరు.  తాగుతారు.” “అన్నం తాగుతారా ఎక్కడైనా?” “అన్నం కాదు.  తరవాణి.” “ఏదో ఒక అన్నం.” ” నీకెందుకు?  నేను చేసి చూపిస్తాగా?  అప్పుడు నువ్వే దాన్ని జుర్రుకుంటూ తాగుతావు.” “ఛీ!  నేనెప్పుడూ జుర్రను.” మొత్తానికి ఎలాగైనా తరవాణిని చేసి ఆవిడ చేత తాగిస్తే గానీ దాని అద్భుతం తనకు బోధపడదనిపించింది .   -- తరవాణి కేంద్రం, మాచ...

వేసరు

  జులై 28, 2023 వేసరు      ( vesaru )       అర్థము      (క్రియ ): శ్రమ పడు; విసుగు చెందు; నొచ్చు; దుఃఖించు     Meaning     (verb) : to be troubled or fatigued;     వాడుక / Usage ఏకాగ్రత లేని పని ఎంత వేసరు పడినా సఫలము కాదు .    Working to fatigue, but without focus will not yield results .     మెదడుకు మేత / Food for thought వారిజాక్షులందు వైవాహికము లందుఁ బ్రాణవిత్తమానభంగమందుఁ జకిత గోకులాగ్ర జన్మరక్షణ మందు బొంకవచ్చు నఘము పొందఁ దధిప!  (ఓ బలిచక్రవర్తి! ఆడువారి విషయంలో కాని; పెళ్ళిళ్ల సందర్భంలో కాని; ప్రాణానికి, ధనానికి, గౌరవానికి భంగం కలిగేటప్పుడు కాని; భీతిల్లిన గోవులను, విప్రులను కాపాడే టప్పుడు కాని అవసరమైతే అబద్ధం చెప్పవచ్చు. దాని వల్ల ఏ పాపం రాదు.) --ఆంధ్ర మహాభాగవతం, పోతన (1450 - 1510)

సొరిది

  జులై 27, 2023 సొరిది      ( soridi )       అర్థము      (విశేష్యము ): వరుస; క్రమము; విస్తారముగా     Meaning     (noun) : order; regularity; regularly    వాడుక / Usage సొరిది సంసారంబు సుఖమా యిందరికి వెరవెఱంగక వగల వేగేరుగా.   The succession of Samsaras happy is not but fearsome for those who know not your Maya.     మెదడుకు మేత / Food for thought కరి దిగుచు మకరి సరసికి కరి దరికిని మకరి దిగుచు కరకరి బెరయన్ కరికి మకరి మకరికి కరి  భరమనుచును నతల కుతల భటులరుదు పడన్  ( ఏనుగు మీద కోపంతో ఉన్న మొసలి ఏనుగును సరసులోకి లాగుతోంది. ఏనుగు మొసలిని ఒడ్డుకు లాగుతోంది. రానురాను ఏనుగుకి మొసలి భారమైంది. మొసలికి ఏనుగు భారమైంది. అతల కుతల లోకాలలో అంటే భూలోకానికి కింద ఉన్న రెండు నివసిస్తున్నవీరులు ఈ రెండిటినీ చూసి ఇవి రెండూ ఒకదానిని మించినవి మరొకటి అని భయపడసాగారు ) --ఆంధ్ర మహాభాగవతం, పోతన (1450 - 1510)

బెరయు

  జులై 26, 2023 బెరయు      ( berayu )       అర్థము      (విశేష్యము ): కలుగు; పొందు; చేరు; వ్యాపించు; సంతోషించు     Meaning     (noun) : to be; exist; spread; unite; pleased    వాడుక / Usage ఋగ్వేదాదివేదములు నాలుగు కల్పాదులైన అంగాలు ఆరు, బెరసి విద్యలు పది .    The 4 Vedas Rig Veda etc and 6 Vedangas Kalpa etc, together make 10 essential learnings.     మెదడుకు మేత / Food for thought యదా కించిద్ జ్ఞో హం గజ ఇన మదాన్ధః సమభవం తదా సర్వజ్ఞో స్మీత్య భవదవలి ప్తం మమ మనః, యదా కిమ్చిత్కించిద్బుధజన సకాశాదవగతం తదా మూర్ఖో స్మితి జ్వర ఇవ మదో మే వ్యపగతః. (నేను స్వల్పంగా పాండిత్యం సంపాదించిన తరుణంలోనే, గొప్ప మదగజంలా సర్వం తెలిసిన వాడిలా విర్రవీగాను. ఆ తర్వాత మహామహా విద్వాంసులవల్ల కొద్దికొద్దిగా నేను ఇంకా తెలుసుకోవలసినది చాలా ఉన్నదని ఎప్పుడైతే గ్రహించానో, అప్పుడు నేను నిజంగానే మూర్ఖుడుననీ – నాకు తెలిసింది స్వల్పం అనీ స్వ- స్వరూపజ్ఞానం కలిగింది. జ్వరం వదిలాక ఎంత సుఖంగా ఉంటుందో – ఈ గర్వమనే రుగ్మత...

చూడామణి

  జూన్ 27, 2023 చూడామణి      ( chudamani )       అర్థము      (విశేష్యము ): అలంకారానికి తల మీద పెట్టుకునే రత్నము; తలమానికం     Meaning     (noun) : crest; jewel worn on top of head; best or excellent    వాడుక / Usage 1941 లో వచ్చిన చూడామణి చిత్రం సాంఘిక కథలకు ప్రోత్సాహం ఇచ్చింది.    The movie Chudamani released in 1941 gave a fillip to social stories.     మెదడుకు మేత / Food for thought సుమారు 1960 సంవత్సర ప్రాంతాల్లో మొదట ఆంధ్ర పత్రికలో పని మొదలు పెట్టాను. నెమ్మదిగా నన్ను ఆంధ్రపత్రిక వీక్లీకి సహాయ సంపాదకుడుగా వేసుకున్నారు. తరవాత కొంతకాలం ఆంధ్రప్రభ డైలీకి Chief Sub-editor గా ఉన్నాను. పత్రికల్లో పనిచేస్తున్నప్పుడే ప్రముఖ జర్నలిస్ట్‌శ్రీ నార్ల వెంకటేశ్వర రావు గారితో కలిసి పనిచేసే అవకాశం నాకు వచ్చింది. ఆయన దగ్గరనుంచి నేను ఎంతో నేర్చుకున్నాను. ఆంధ్ర కేసరి శ్రీ టంగుటూరి ప్రకాశం పంతులు గారు చనిపోయిన వార్తని పేపర్లో ఎలా రిపోర్ట్‌చెయ్యాలా అని ఆలోచించి “ప్రకాశహీనమైన ఆంధ్రప్రదేశ్‌” అన...

గులేబకావళి

  జూన్ 26, 2023 గులేబకావళి      ( gul-e-bakawali )       అర్థము      (విశేష్యము ): గుల్ (అరబిక్) = పువ్వు; బకావళి అనే పువ్వు; బ్రహ్మ కమలం; నిశాగంధి     Meaning     (noun) : orchid cactus; night blooming flower    వాడుక / Usage గులేబకావళి కథ చిత్రం అరేబియన్ జానపద కథ ఆధారంగా నిర్మించబడింది.    Gulebakavali movie is based on a story in Arabic folklore "One thousand and one nights".     మెదడుకు మేత / Food for thought కాని పాశ్చాత్య సంప్రదాయపు సుడిగాలికి వీళ్ళు కూడ ఒంగి, లొంగిపోయి, పాశ్చాత్య పద్ధతి ప్రకారం పెట్టిన పేరు మొదట, ఇంటిపేరు చివర రాయడం ఈ మధ్యే మొదలు పెట్టేరు. కాని కల్చరు పేరు మీద కొట్టుకుచచ్చే మన తెలుగు వాళ్ళు అంత సులభంగా లొంగుతారా? హరి మీద గిరి పడ్డా, గిరి మీద హరి పడ్డా మనం మాత్రం వి. వి. రావ్‌, పీ. కే. మూర్తి, యన్‌. టీ. రామారావు అనే రాస్తాం తప్ప, మిగిలిన ప్రపంచపు అడుగుజాడల్లో నడవడానికి ఇష్టపడం. అసలు యన్‌. టీ. రామారావుని “యన్టీయార్‌” అన్నప్పుడున్న మజా తల్లకిందులుగా రామా...

కవళము

  జూన్ 23, 2023 కవళము      ( kavalamu )       అర్థము      (విశేష్యము ):  యాచించి పెట్టించుకునే కూటి ముద్ద     Meaning     (noun) : morsel     వాడుక / Usage రాసి పెట్టి ఉంటే నువ్వు కొండ మీదుంటే గూడా నీ కవళం నిన్ను వెతుక్కుంటా వస్తాది.    If it is so destined your morsel will come searching for you even if you are on a hill.     మెదడుకు మేత / Food for thought You have one wish : to die. And one hope : to not die. నీకు ఒకటే కోరిక : చచ్చిపోవాలని. ఇంకా ఒకటే ఆశ : చావకూడదని. -- ఆర్జెంటినా ఆధునికవాద  కవయిత్రి,  అల్ఫోన్సినా స్టోర్నీ  (మే 29, 1892 - 1938)

బిత్తల

  జూన్ 22, 2023 బిత్తల      ( bittala )       అర్థము      (విశేష్యము ): నగ్నత్వము; దిసమొల; దిగంబరత్వము     Meaning     (noun) : nakedness; wrapped in nothing but all the directions     వాడుక / Usage ఇరవై ముప్పై సంవత్సరాలక్రితం యిదే గుహలో ఒక బిత్తల మొల సన్యాసి ఉండేవాడట.    Twenty to thirty years back there used to be a naked Sanyasi in this cave.     మెదడుకు మేత / Food for thought Memory is a mirror that scandalously lies. జ్ఞాపకాలు లజ్జాకరమైన అబద్దాలు చెప్పే అద్దం. -- అరౌండ్ ది డే ఇన్ ఎయిటీ వరల్డ్స్, ఆర్జెంటినా రచయత,  జూలియో ఫ్లోరెన్సియో కోర్టజార్  (మార్చ్ 06, 1927 - 2014)

సోపుదారి

  జూన్ 21, 2023 సోపుదారి      ( ṭsōpu-dāri )       అర్థము      (విశేష్యము ): గదాధారి; అధికార చిహ్నంగా గద లాంటి దానిని ధరించువాడు; అధికారి     Meaning     (noun) : mace bearer; official/ruler carrying a symbol of authority     వాడుక / Usage అటవపైన సోపుదారి మాదిరిగా జమ్మని కొలువు చేస్తావుండావుగా.    You are holding court from that attic like a King.     మెదడుకు మేత / Food for thought The problem with marriage is that it ends every night after making love, and it must be rebuilt every morning before breakfast. వివాహంతో వచ్చిన చిక్కేమిటంటే, ప్రతీ రాత్రి రతి తర్వాత ముగిసిపోతుంది కానీ ప్రతీ ఉదయం ఫలహారం ముందు పునర్నిర్మించాలి. -- లవ్ ఇన్ ది టైమ్స్ ఆఫ్ కలరా, కొలంబియన్  రచయత,  గాబ్రియల్ గార్సియా మార్క్వెజ్  (మార్చ్ 06, 1927 - 2014)

బుధాళి

  జులై 25, 2023 బుధాళి      ( budhali )       అర్థము      (విశేష్యము ): బుధ (విద్వాంసుడు)+ఆళి (సమూహము); పండితుల సమూహము      Meaning     (noun) : congress/gathering of experts    వాడుక / Usage కృత్రిమ మేధ అవధులు చర్చించడానికి శాన్ఫ్రాన్సిస్కో నగరంలో బుధాళి నిర్వహించారు.    A gathering of experts was organised in SF to discuss the boundaries of AI.     మెదడుకు మేత / Food for thought మకరముఖాంతరస్థ మగు మానికమున్ బెకలింపవచ్చుఁ బా యక చలదూర్మికానికరమైన మహోదధి దాఁటవచ్చు, మ స్తకమునఁ బూవుదండవోలె సర్పమునైన భరింప వచ్చు, మ చ్చిక ఘటియించి మూర్ఖజన చిత్తముఁ దెల్ప నసాధ్య మేరి కిన్ (మొసలి నోట్లో - దాని కోరల మధ్య ఇరుక్కొన్న రత్నాన్ని ఎంతో ప్రయత్నంచేత(దాన్ని చంపకుండా) బైటకు తీయవచ్చు పెను కెరటాలు క్షణం ఆగుండా ఒడ్డుకువిసిరే సముద్రాన్నయినా దాటవచ్చు మహాభీకరంగా బుసలు కొట్టే పామును సయితము మచ్చికతో పూలదండవలె తలమీద ధరించవచ్చు కానీ పట్టరాని క్రోధంతో మూర్ఖుడై వున్నవాడిని సమాధాన పరచడం మాత్రం నిజంగా అ...

ప్రోడ

  జులై 24, 2023 ప్రోడ      ( prōḍa )       అర్థము      (విశేష్యము ): నిపుణుడు; వివేకి; నేర్పరి; స్త్రీ     Meaning     (noun) : wise or skilful person    వాడుక / Usage అన్ని రకాలైన టెన్నిస్ తలాలలో జోకోవిచ్ బహు ప్రోడ .    Djokovic is an extremely skilful player on all surfaces.     మెదడుకు మేత / Food for thought ఉత్తుంగ మత్తమాతంగ మస్తకన్యస్తలోచనః ఆసన్నే నపి సారంగే కరోత్యాశాం మృగాధివః (మృగాలకు రాజు అయిన సింహం మదించిన ఏనుగు కుంభ స్థలాలను చీల్చడానికే సదా ఎదురు చూస్తూ ఉంటుంది. అంతేకాని, పక్కన్నే లేడిపిల్లలు తిరుగుతున్నా వాటికోసం ఆశపడదు. అలాగే గొప్పవారు ఎల్లపుడూ గొప్ప విషయాల గురించే ఆలోచిస్తారుకాని, అల్పవిషయాలపై మనసుపోనివ్వరు.) --భర్తృహరి (~అయిదవ శతాబ్దము)

గాటి

  జూన్ 20, 2023 గాటి      ( gāti )       అర్థము      (విశేష్యము ): పశువులు నీరు త్రాగడానికి తవ్విన గుంట లేక తొట్టె; గాడి దగ్గర పశువులను కట్టేసే గుంజ     Meaning     (noun) : water trough for cattle; post used to tether cattle     వాడుక / Usage పుస్తకాలన్నింటినీ ఒకే గాటిన కట్టి మాట్లాడ్డం కుదరదు.    All books cannot be tethered together and treated similarly.     మెదడుకు మేత / Food for thought When you want something all the universe conspires in helping you to achieve it. నీకేమన్నా దీక్షగా కావాలంటే విశ్వమంతా మూకుమ్ముడిగా నీ లక్ష్య సాధనకి సహాయ పడుతుంది. --బ్రెజిలియన్ రచయత, పాలో కొయెల్హో  (ఆగష్టు 24, 1947)

లాఘవము

  జూన్ 19, 2023 లాఘవము      ( lāghavamu )       అర్థము      (విశేష్యము ): లఘుత్వము; వడిగా ఉండడం; చురుకైన; తేలికైన; ఆరోగ్యం     Meaning     (noun) : lightness; dexterity; health    వాడుక / Usage మండూకంలాంటి శక్తిగలిగి అప్పుడప్పుడు దిగి, ఈది బయటపడే లాఘవమైనా ఉండాలి.    Or one should have the dexterity like a frog to swim or hop at will.     మెదడుకు మేత / Food for thought I have always imagined that Paradise will be a kind of Library. నేను ఎపుడూ దివ్యోద్యానాన్ని ఒక గ్రంథాలయంలాగా ఊహించుకుంటాను. -- ఆర్జెంటినా కవి కథకుడు,  హోర్హె లువీస్ బోర్హెస్  (ఆగష్టు 24, 1899 - 1986)

రూపణము

  జూన్ 16, 2023 రూపణము      ( rūpaṇamu )       అర్థము      (విశేష్యము ): తార్కాణము; చూపు; విచారణ; ప్రమాణముల చేత విషయము పరిశీలించుట     Meaning     (noun) : investigation for (dis)proving; examination; search    వాడుక / Usage విద్యాబోధనలో రూపణ నికష అత్యంత అవసరము.    An investigatory exam to identify weak students/topics is crucial.     మెదడుకు మేత / Food for thought పైని వేంచేసి యూపిరి పట్టుకొనుచు చిన్ని తాబేలు నన్ను వీక్షించి జలము త్రవ్వుకొనుచేగె కూపగర్భమున దాగ పై నలముకున్న సుళ్ళు నా పాల విసిరి.   నీకు లేదమ్మ యన్నది నీటిపాము పైకెగసి యొక్క కప్పను పట్టుకొనుచు. నాకు లేదమ్మ యన్నాను శోకవహ్ని తప్త హృదయుండనై యింటిదారి పట్టి.   (స్నానం చెయ్యడానికి బావి దగ్గరికి వెళ్తే, ఆ బావిలో గాలి పీల్చుకోడానికి నీళ్ళమీదకు తేలి ఉన్న తాబేలు నన్ను చూసి తొందరగా లోపలకి వెళ్ళిపోయింది. అది వెళ్ళిపోతూనే ఆ నీళ్ళు సుళ్ళు తిరిగి నీళ్ళ పైన సున్నాలు చుట్టుకుంటూ ఉన్నాయి. అంటే నాకు శూన్యమే మిగిలిందన్న...

మాపనము

  జూన్ 15, 2023 మాపనము      ( mapanamu )       అర్థము      (విశేష్యము ): కొలత; పరిమాణము; ఆది; కొలుచుట     Meaning     (noun) : measurement; measuring; size    వాడుక / Usage ఉపాధ్యాయులు ఆశించిన ప్రయోజనాలను, లక్ష్యాలను మాపనం చేయాలి.    Teachers need to measure outcomes and learning objectives.     మెదడుకు మేత / Food for thought ఆ గవాక్షమ్ము తానెంత యమృతరాశి ఎవ్వరును లేని సమయాన నేగి దాని స్పర్శసుఖమున పులకలుజాదుకొనగ ప్రణయమున ముగ్ధుడను పరవశుడనైతి   (ఆమె ఆ కిటికీ దగ్గర కనిపించేది. కాబట్టి ఆ కిటికీ ఎంత అమృతరాశిగానో మారిపోయింది. ఎవరూ లేనిసమయం చూసి అక్కడకు వెళ్ళి ఆ కిటికీని ముట్టుకోగానే ఒళ్ళంతా పులకలెత్తుతుంది. ఆ ప్రేమసంతోషంలో ముగ్ధుణ్ణీ, పరవశుణ్ణీ అయిపోతాను) --  సౌభద్రుని ప్రణయయాత్ర , నాయని సుబ్బారావు (అక్టోబర్ 29, 1899 - 1978)

మదింపు

   జూన్ 14, 2023 మదింపు      ( madimpu )       అర్థము      (విశేష్యము ): వెల నిర్ణయించుట; అంచనా     Meaning     (noun) : estimate; valuation; appraisal    వాడుక / Usage బోధనాభ్యాసన ప్రక్రియలో పిల్లలకు తెలియకుండానే వారి సామర్ధ్యాలను పరీక్షించడాన్ని మదింపు అంటారు.    Appraisal is the process of evaluating student abilities seamlessly as part of lesson and exercises.     మెదడుకు మేత / Food for thought చంద్ర సూర్యులు తారకా సముదయమ్ము పుడమియును నాకమును పెక్కు భువనములును ప్రేమ సూత్రమ్మునం గ్రుచ్చి విశ్వకర్మ గళమునందాల్చు ముత్యాలు గావె తలప ( సూర్యచంద్రులు, నక్షత్రాలు, భూమి, స్వర్గం, ఇతర సమస్త లోకాలు, ఇలా అన్నీ, సృష్టికర్త బ్రహ్మ అంశ అయిన విశ్వకర్మ (యూనివర్సల్ ఆర్కిటెక్ట్) ప్రేమ అనే తాడుకు గుచ్చి కూర్చి మెడన దాల్చిన ముత్యాలే కదా! ఆలోచిస్తే!!) --  సౌభద్రుని ప్రణయయాత్ర , నాయని సుబ్బారావు (అక్టోబర్ 29, 1899 - 1978)

నికష

  జూన్ 13, 2023 నికష      ( nikasha )       అర్థము      (విశేష్యము ): సాన; బంగారం వగైరా పరీక్షకు వాడే  గీటురాయి     Meaning     (noun) : touchstone    వాడుక / Usage ఒక అంశాన్ని బోధించిన వెంటనే పరీక్షించడానికి అనువైనది నికష .    Once a topic is taught, test is a good way to baseline understanding.     మెదడుకు మేత / Food for thought ఇదే ప్రకృతి, హోరున వర్షం కురుస్తుంటే, దట్టంగా మంచు రాలుతుంటే, పున్నమినాటి వెన్నెల రేకలు భూకాసారం మీద సహస్రదళ పద్మంలా పరుచుకుంటుంటే ఎలా ఉంటుంది? ఈ మంచు, ఈ కొండలు అన్ని వేళలా మనిషికి మెప్పుతెప్పించేవిగా ఉండగలవా? మనస్సంతా ఏదో చెప్పడానికి చేతగాని ఉదాత్త భావస్ఫురణలో గంభీరంగా పరిపూర్ణంగా ఉంది. ఇంతలో ఎదురుగ్గా కనిపిస్తోంది పెద్ద సొరంగ మార్గం. అడ్డువచ్చిన పర్వత శరీరాన్ని దొలుచుకుని ప్రకృతిని ఇలా జయిస్తున్నామనే గర్వరేఖ మనిషి తన ముఖం మీద వెలయించుకోడానికి అవకాశమిచ్చే మానవ సృష్టి అది. దాని పేరు జవహార్ టన్నెల్. పిర్‌పంజల్ పర్వత శ్రేణిని దూసుకుని దాన్ని దాటు...