Posts

Showing posts from August, 2023

ధారాదత్తము

  సెప్టెంబరు 01, 2023 ధారాదత్తము     ( dhārā-dattamu )       అర్థము      (విశేష్యము ):   నీరు ధారగా పోస్తూ దానం చేయడం     Meaning     (noun) : solemn donation given ritually    వాడుక / Usage మారు మాట్లాడకుండా తన సంస్థానాన్ని అతడికి ధారాదత్తము చేయవలసి ఉంటుంది. He would have to unquestioningly give away the dominion.     మెదడుకు మేత / Food for thought ఒక విషయం పెదవి గడప దాకా వచ్చి ఆపై దాటలేదు కళ్లలోంచే తొంగి చూసింది అపుడపుడు నీ నుంచి, ఇంకొకపుడు నా నుంచి మాటలు కొన్ని అది వేడుకొంది వాటిని తొడుక్కుని అధరాలు దాటి వద్దామని గొంతుతో శృతి కలిపి కదులుదామని కానీ ఈ విషయం ఉందే అది అనుభవమైన ఒక అనుభవమే గాలిలో తేలియాడే పరిమళంలాగా గొంతులేని ఓ సువాసన లాగా దాని ఉనికి నీకూ తెలుసు  దాని కబురు నాకూ తెలుసు లోకం నుంచీ అది దాగనిది ఇది ఎలాంటి రహస్యమో --ఏ జానే కైసా రాజ్ హై (జిందగీ నా మిలేగి దోబారా), జావేద్ అఖ్తర్

త్రుళ్ళు

  ఆగష్టు 31, 2023 త్రుళ్ళు     ( trullu )       అర్థము      (క్రియ ):  గంతు; ఎగిరిపడు; గర్వించు; ఉప్పొంగు     Meaning     (verb) : to jump/leap/spring; to be arrogant/conceited    వాడుక / Usage ఆ జవాబుకు విష్ణుమిత్రుడు తృళ్ళి పడ్డాడు. Vishnumitra jumped off his seat on hearing the response.     మెదడుకు మేత / Food for thought కరిగిన ఇంద్రనీలం జాలువారే ఈ అనుభూతి నీలి నీలి సంద్రంవంటి ఈ నిశ్శబ్దం ఇచట నేల లేదు  ఈ కడ నింగి లేదు రెపరెపలాడే కొమ్మలూ రెమ్మలూ గుసగుసలమని చెడుబుతున్నాయి నువ్వొక్కడివే ఉన్నావు ఇక్కడా అని   నేను మాత్రమే ఉన్నాను, నేనూ నా ఉఛ్వాసనిశ్వాసాలు నా గుండె సడులు ఈ గహనం ఈ ఒంటరితనం మరియు నేను కేవలం నేను నేను నేనుగా అవుతానని నాకు నమ్మకం కుదిరింది --అప్నే హోనే పర్ ముజ్కో యకీన్ ఆగయా (జిందగీ నా మిలేగి దోబారా), జావేద్ అఖ్తర్

గతుక్కుమను

  ఆగష్టు 30, 2023 గతుక్కుమను     ( gathukkumanu )       అర్థము      (క్రియ ):  భయంతో గుండె జారడం; మరణించు     Meaning     (verb) : loosing heart with fear; dying    వాడుక / Usage అగ్నిపాలుడు అవజ్ఞవర్మ ముఖభంగిమల్ని చూసి గతుక్కుమన్నాడు . Agnipala's heart skipped a beat on seeing Avagnavarma's expressions.     మెదడుకు మేత / Food for thought గుండెలో ఆరాటాన్ని నింపుకుని కదుల్తుంటే అయితే నువ్వు బ్రతికే ఉన్నావు కళ్ళలో స్వప్నాల జిలుగులు పులుముకుని కదుల్తుంటే అయితే నువ్వు బ్రతికే ఉన్నావు వీచే గాలి లాగా స్వేచ్ఛగా ఉండడం నేర్చుకో  నువ్వొక నదిలాగా అలలలో పారడం నేర్చుకో ప్రతీ క్షణాన్నీ చేతులు చాచి నువ్వు హత్తుకుని ఆస్వాదించు ప్రతీ నిమిషం ఒక కొత్త అనుభూతి కనుగొనని నీ వీక్షణలు చూపులలో ఏవైతే ఆవేదనలు అలుముకొని నువ్వు  కదుల్తుంటే అయితే నువ్వు బ్రతికే ఉన్నావు గుండెలో ఆరాటాన్ని నింపుకుని నువ్వు కదుల్తుంటే అయితే నువ్వు బ్రతికే ఉన్నావు --తో జిందా హో తుమ్ (జిందగీ నా మిలేగి దోబారా), జావేద్ అఖ్తర్

మథనము

  ఆగష్టు 29, 2023 మథనము     ( mathanamu )       అర్థము      (విశేష్యము ):  మంథనము; చిలకటము; క్షోభ     Meaning     (noun) : churning; stirring; agitation     వాడుక / Usage అగ్నిపాలుడు ఇలా మథన పడుతున్నంతలో ప్రసేనుడు తలుపు తెరుచుకుని బయటకు వచ్చాడు. As Agnipala was getting agitated, Prasena opened the door and walked in.     మెదడుకు మేత / Food for thought హృదయమా అసలు నువ్వెందుకు ఏడుస్తావు బాధ కారుమబ్బులా క్రమ్ముకున్నప్పుడల్లా దుఃఖం నల్లని నీడలా రెపరెపలాడినప్పుడల్లా కన్నీరు బుగ్గలపై జాలువ్రాలినప్పుడల్లా ఒంటరి మనసు భయపడినప్పుడల్లా నేను మనసుని అనునయించాను హృదయమా అసలు నువ్వెందుకు ఏడుస్తావు ప్రపంచంలో ఇలాగే అవుతుంది ఈ ఘాడమైన నిశ్శబ్దం ఏదైతో ఉందో కాలం అది అందరికీ పంచింది పిడికెడు బాధ అందరి వంతూ చిటికెడు సూర్యోదయం అందరి వంతూ కళ్ళు నీవి వృధాగా చెమర్చాయి ప్రతీ క్షణం సరికొత్త ప్రకాశం ఎందుకు నువ్వు అలాంటి క్షణాల్ని కోల్పోతావ్ హృదయమా అసలు నువ్వెందుకు ఏడుస్తావు --దిల్ ఆఖిర్ తు క్యో రోతా హై (జిందగ...

ఎల్ల

  ఆగష్టు 28, 2023 ఎల్ల     ( ella )       అర్థము      (విశేష్యము ): పొలిమేర; హద్దు; సమస్తము; వెల్ల; సున్నం; కూర కొనడానికి వేసే పిడికెడు బియ్యం     Meaning     (noun) : boundary; all; white wash; fistful of rice given in lieu of vegetables     వాడుక / Usage కాలభోజుడు చంద్రగిరి రాజ్యపు ఎల్లలు దాటాడు. Kalabhoja crossed the borders of the kingdom of Chandragiri.     మెదడుకు మేత / Food for thought అది ఎప్పటికీ నా మాతృదేశమే కానీ అది ఇంక నా దేశం కాదు అక్కడికి వెళ్లాలంటే రెండు ప్రభుత్వాల ఎన్నెన్నో దఫ్తర్లు తిరగాలి మొహానికి ముద్ర వేయించుకోవాలి కలలకి రుజువులు చూపించాలి... కళ్ళకు వీసా అవసరం లేదు కలలకు ఎల్లలు లేవు మూసిన కళ్ళతో నే రోజూ సరిహద్దు దాటి పోతా మెహ్ది హసన్ ని కలిసి వస్తా -- గుల్జార్

విరూపము

  ఆగష్టు 24, 2023 విరూపము      ( viroopamu )       అర్థము      (విశేష్యము ): వంకరైనది; అసమానమైనది; బేసి సంఖ్య;      Meaning     (noun) : irregular; unbalanced; odd    వాడుక / Usage రక్షాధర శిక్షాదీక్ష ద్రక్షా విరూపా క్ష నీ కృపావీక్షనాపేక్షిత ప్రతీక్షనుపేక్ష చేయక పరీక్ష చేయక రక్ష రక్షయను ప్రార్ధన వినరా. O one smeared in ashes! O three - enforcement, dedication, protection - eyed! don't ignore my yearning wait for your merciful glance! Heed my prayers for salvation.     మెదడుకు మేత / Food for thought ద ర్పి త తారాధిప పరి స ర్పి త కిరణౌఘమిళిత  స కలదిశంబై యే ర్ప డి కమలభవాండము క ర్పూ రపు క్రోవి భంగిఁ  గ నుపట్టె నృపా. (ఓరాజా! విజృంభిస్తున్న నక్షత్ర విభుడైన చంద్రుడి కిరణాల సమూహం నాలుగుప్రక్కలా వ్యాపించగా బ్రహ్మండం ఒక కర్పూర మూసలా కనిపిస్తోంది) --ఆంధ్ర మహాభాగవతం, పోతన (1450 - 1510)

ఆన

  ఆగష్టు 25, 2023 ఆన      ( āna )       అర్థము      (విశేష్యము ): ఆజ్ఞ; ప్రమాణము; ఒట్టు; గుర్తు; జాడ     Meaning     (noun) : command; order; oath; sign; mark    వాడుక / Usage నీ ఆన లేనిదే రచింపజాలునా వేదాల వాణితో విరించి విశ్వనాటకం. Can Brahma pen, set to the tune of Vedas, the play of Universe; without your command?     మెదడుకు మేత / Food for thought అక్కయ్యకు రెండో కానుపు తమ్ముడికి మోకాలి వాపు చింతపండు ధర హెచ్చింది చిన్నాన్నకు మతి భ్రమించింది లేచిన మరుక్షణం ఎన్నో ప్రశ్నలు గోరుచుట్టలా సలిపే లక్షల సమస్యలు... గతమంతా తోలు బొమ్మలాడిన ఒక తెర వర్తమానం నీ కన్నులగప్పిన ఒక పొర -- అమృతం కురిసిన రాత్రి, దేవరకొండ బాలగంగాధర్ తిలక్(ఆగష్టు 01, 1921 - 1966)

అచల

  ఆగష్టు 23, 2023 అచల      ( a-chala )       అర్థము      (విశేష్యము ): కదలనిది; నేల; కొండ; భూమి     Meaning     (noun) : stationary; mountain; earth    వాడుక / Usage ఆనతినీయరా హరా అచల నాధ అర్చింతునురా ఆనతినీయరా. Permit me O Hara! lord of the Earth, I will worship you, allow me.     మెదడుకు మేత / Food for thought ఇట నస్పృశ్యత సంచరించుటకు దావేలేదు; విశ్వంభరా నటనంబున్‌ గబళించి గర్భమున విన్యస్తంబు గావించి, యు త్కటపుం బెబ్బులితోడ మేకఁ నొకప్రక్కన్‌జేర్చి జోకొట్టి యూ ఱట గల్పించు నభేదభావమును, ధర్మం బిందుఁగారాడెడిన్‌ -- శ్మశానవాటిక, జాషువ (సెప్టెంబర్ 28, 1895 - 1971)

కడగంటి

  ఆగష్టు 22, 2023 కడగంటి      ( kadaganti )       అర్థము      (విశేష్యము ): కడ=(ఓర) ప్రక్క, (క)గంటి=కన్ను; ఓర చూపు     Meaning     (noun) : side glance; passing allusion    వాడుక / Usage యే వంకలేని నా వంకనొక్క కడగంటి చూపు పడనీయవేమి. Alas why don't your eyes cast a passing glance towards an unblemished me!     మెదడుకు మేత / Food for thought సిరాబుడ్లు తాగి కాగితాలు నమిలితే కవిత్వం పుట్టదు పెన్నుతో సమాజాన్ని సిజేరియన్ చెయ్యాలి... కడుపుమీద తడిసిన అగ్గిపుల్లతో గీసినా భగ్గున మండితే అదేరా ఆకలి -- అలిశెట్టి ప్రభాకర్ (జనవరి 12, 1954 - 1993)

వసుమతి

  ఆగష్టు 21, 2023 వసుమతి      ( vasumathi )       అర్థము      (విశేష్యము ): భూమి; నేల     Meaning     (noun) : Earth    వాడుక / Usage వసుమతిలో ప్రతి క్షణం పశుపతి నీ అధీనమై కదులునుగా సదా సదాశివా. Every moment on Earth, moves the Lord of all creatures, always ruled by you O Shiva!.     మెదడుకు మేత / Food for thought ఒరులేయవి యొనరించిన   నరవరయప్రియము తన మనంబునకగుదా నొరులకునవి సేయకునికి పరాయణము పరమధర్మపధములకెల్లన్    (ఎవరు ఏమి చేస్తే నీకు అప్రియం అనిపిస్తుందో అదే పని నీవు ఇతరుల విషయంలో చేయకు) -- ఆంధ్ర మహాభారతం, తిక్కన (1205 - 1288)

ఆర్తి

  ఆగష్టు 18, 2023 ఆర్తి      ( ārti )       అర్థము      (విశేష్యము ): దుఃఖము; పీడ; హారతి     Meaning     (noun) : distress; pain; (wave) offering    వాడుక / Usage "ఇప్పటికే తెలుగు చచ్చిపోతోందన్న ఆర్తి ప్రబలుతున్నప్పుడు నిజానికి భాషను పరిరక్షించవలసిన కర్తవ్యం సాహిత్యకారుల మీద ఉంది." As the pain mounts of the deterioration of Telugu, it is the responsibility of literary figures to replenish it.     మెదడుకు మేత / Food for thought కులం అనేది గోడ లాగా లేక ముళ్ల కంచెలాగా హిందువులను ఒకరితో ఒకరు కలవకుండా ఉంచే ఒక భౌతికమైన వస్తువు కాదు.  కిందకి పడవేసి అడ్డు తొలగంచడానికి అది వస్తువు కాదు. అది ఒక భావన. ఒక ఆలోచనా విధానం. -- భీంరావు అంబేద్కర్ (ఏప్రిల్ 14, 1891 - 1956)

బడుగు

  ఆగష్టు 17, 2023 బడుగు      ( baḍugu )       అర్థము      (విశేష్యము/విశేషణము ): శవము; అశక్తమైన; కృశించిన; అశక్తుడు     Meaning     (noun/adj) : corpse; weak; poor; wretched    వాడుక / Usage "అక్షరానికి అందెకట్టి భాషతో బడుగు వర్గాల ఘోషను ప్రపంచానికి వినిపించిన ప్రజా గాయకుడు గద్దర్." Lilting the letters, Gaddar was a peoples singer who took the voice of the wretched to the world.     మెదడుకు మేత / Food for thought మత ప్రవక్తలు మరియు అధికారంలో ఉన్న నాయకుల మధ్య ఉన్న మకిలమైన మైత్రి మానవాళికి ఇచ్చిన వరం - చెరసాలలు, కొరడాలు, ఉరి కంబాలు, అన్నిటికన్నా మించి (ఫాసిజం) అటువంటి సిద్ధాంతాలు. -- భగత్ సింగ్ (సెప్టెంబర్ 28, 1907 - 1931)

లగాయతు

  ఆగష్టు 16, 2023 లగాయతు      ( lagāyatu )       అర్థము      (విశేషణము ): ఆరంభము; మొదలు     Meaning     (noun) : beginning; commencement    వాడుక / Usage చేతిలో సెల్‌ఫోన్ లేకుండా, రాత్రి నిద్రించే వరకు, పొద్దున లేచింది లగాయతు సోషల్ మీడియాలో నిమగ్నం కాని వారు ఉంటారా అన్నది సందేహాత్మకమే. It is doubtful if there is anyone who is with a mobile and not on social media from the time they wake up till they sleep at night.     మెదడుకు మేత / Food for thought అహింస ఆలోచనలో, మాటలో, చేతలలో పాటించాలి. మనం ఎంత సఫలం అయ్యాము అనేదాని కొలమానం మన అహింసా మార్గం యొక్క పటుత్వం పైన ఆధార పడి ఉంటుంది. మనది అహింసా యుద్ధం. ధర్మ యుద్ధం. -- వల్లభాయ్ పటేల్ (అక్టోబర్ 31, 1875 - 1950)

ద్యోతకము

  ఆగష్టు 15, 2023 ద్యోతకము      ( dyōtakamu )       అర్థము      (విశేషణము ): ప్రకాశించునది; ప్రకాశింపచేయునది     Meaning     (adj) : illuminating; explaining; shining or make to shine    వాడుక / Usage బ్రిటిష్ పరిపాలనలో నలుగుతున్న దేశాలకు భారత స్వాతంత్ర్యం ద్యోతకమై మార్గదర్శి అయ్యింది. Indian Independence shone as a beacon to other countries under British rule.     మెదడుకు మేత / Food for thought మానవకోటి మీద నమ్మకం కోల్పో వద్దు. అది ఒక మహాసాగరం లాంటిది. సముద్రంలో కొన్ని చుక్కలు కలుషితం అయితే సాగరమంతా మకిలి పట్టదు. -- మహాత్మా గాంధీ (అక్టోబర్ 02, 1869 - 1948)

మిష

  ఆగష్టు 14, 2023 మిష      ( misha )       అర్థము      (విశేష్యము ): కపటము; నెపము; వంక; సాకు     Meaning     (noun) : deception; pretext; excuse    వాడుక / Usage పాత్రోచిత సంభాషణలు అనే మిష మీదనయినా ఆంగ్ల పద ప్రయోగం కొంత అర్థం చేసుకోవచ్చు గానీ, రచయతే కథాసంవిధానంలో ఆంగ్ల పద ప్రయోగాల మోజులో పడకుండా ఉండడం అవసరం. One can understand usage of English words if there is a pretext of the character's context, but it is important that the writer doesn't fall in love with gratuitous usage of English.     మెదడుకు మేత / Food for thought యథార్థమైన విషయం యథార్థమైన విషయమే. మన ఇష్టా అయిష్టాల వల్ల మారిపోవు మాయమై పోవు....దుష్కర్మని ఆపకపోతే అది యింకా పెరిగిపోతూ ఉంటుంది. చెడుని ఎదిరించకుండా సహించినట్లయితే అది సంఘం మొత్తాన్ని విషపూరితం చేస్తుంది. -- జవహర్లాల్ నెహ్రు (నవంబర్ 14, 1889 - 1964)

బుగ్గి

  ఆగష్టు 11, 2023 బుగ్గి      ( buggi )       అర్థము      (విశేష్యము ): బూడిది; భస్మము     Meaning     (noun) : ashes; dust    వాడుక / Usage 'అగ్గికి అడవి కావొద్దు బుగ్గి .. అగ్ని ప్రమాదాల నివారణకు ప్రత్యేక బృందాలు'. Let not the forest burn to ashes.. special teams to prevent forest fires.     మెదడుకు మేత / Food for thought ప్రేమ ఒట్టిగా దానంతట అదే రాయిలాగా నిలవదు. రొట్టె చేసినట్లు దానినీ చేయాలి. నిరంతరం చేస్తూ ఉండాలి క్రొత్తగా సరి కొత్తగా. --ది లేత్ అఫ్ హెవెన్, ఉర్సులా లే గుఇన్ (అక్టోబర్ 21, 1929 - 2018)

పుడమి

  ఆగష్టు 10, 2023 పుడమి      ( puḍami )       అర్థము      (విశేష్యము ): నేల; భూమి; దేశము     Meaning     (noun) : the earth; country    వాడుక / Usage 'నేను తాను రెప్ప కన్ను వేరైపోని పుడమి మన్ను'. She and I are eye and eyelid, she and I are the inseparable earth and soil.     మెదడుకు మేత / Food for thought జీవిత ప్రయాణంలో ఒక సమయాన సృష్టి యొక్క అందం తప్ప ఇంక దేని అవసరం ఉండదు. దానిని ఫోటో తీయక్కరలేదు, చిత్రం గీయక్కరలేదు, గుర్తుంచుకోవక్కరలేదు. ఆ అందం  పరిపూర్ణం. -- బిలవుడ్, టోనీ మోరిసన్ (ఫిబ్రవరి 18, 1931 - 2019)

తావి

  ఆగష్టు 09, 2023 తావి      ( tāvi )       అర్థము      (విశేష్యము ): పరిమళము; సుగంధము     Meaning     (noun) : perfume; fragrance    వాడుక / Usage 'శశి తానైతే నిశినే నేనూ కుసుమం తావి తానూ నేను'. If she is the moon I am the night; if she is a flower I am it's fragrance.     మెదడుకు మేత / Food for thought ఉదయం పది గంటలకల్లా ఆ రోజు పనిలో సగం పని పూర్తిచెయ్యనివారు ఆ మిగతా సగం కూడా అసంపూర్తిగా వదిలేసే అవకాశం ఉంది. -- ఉథరింగ్ హైట్స్, ఎమిలీ బ్రోన్ట్ (జులై 30, 1818 - 1848)