Posts

Showing posts from January, 2026

రుధిరము

  జనవరి 30, 2025 రుధిరము   ( rudhiramu )     అర్థము      (విశేష్యము)  : రక్తము; నెత్తురు; ఎర్రనిది; సింధూరం    Meaning     (noun)  : blood; red      వాడుక / Usage      కవోష్ణ రుధిర జ్వాలల తోటి స్వతంత్ర సమరం నెరపండి; ఎంతకాలమిటు సహించియున్న దోపిడి మూకకు దయ రాదన్న.     Fight for independence with warm blood; endure not, the looters shall not become saints.     మెదడుకు మేత / Food for thought      వాస్తవికత పట్ల ఉదాసీనత - జాతీయవాదులకు వాస్తవాల మధ్య సారూప్యతలను చూడలేని శక్తి ఉంటుంది. ఒక బ్రిటిష్ టోరీ ఐరోపాలో స్వీయ-నిర్ణయాధికారాన్ని సమర్థిస్తారు, కానీ ఇంకో ఆలోచన లేకుండా భారతదేశానికి దానిని వ్యతిరేకిస్తారు. చర్యలు మంచివి లేదా చెడ్డవిగా పరిగణించబడతాయి, వారి స్వంత అర్హతలపై కాదు, వాటిని ఎవరు చేసారో దాని ప్రకారం. దాదాపు ఏ విధమైన ఆగ్రహం ఉండదు మనం చేస్తే - హింస, బందీలను చేయడం, బానిసత్వం, సామూహిక బహిష్కరణలు, విచారణ లేకుండా జైలు శిక్ష, ఫోర్జరీ, హత్య, పౌరులపై బాంబు...

ఉట్టి

  జనవరి 29, 2025 ఉట్టి   ( uṭṭi )     అర్థము      (విశేష్యము)  : పాత్రలు పెట్టడానికి వేళ్ళాడేసిన చిక్కం; దారంతో అల్లిని చిన్న సంచి    Meaning     (noun)  : a suspended sling in which pots are kept      వాడుక / Usage      వంట ఇంటిలోన ఉట్టి మీదుంచిన సున్నుండలేమాయే కోడలా మినప సున్నుండలేమాయే కోడలా ?     In the kitchen, sweets in the sling pot, 'wife of my son' where have they gone?     మెదడుకు మేత / Food for thought      'దేశభక్తి' అంటే నా ఉద్దేశ్యం ఒక నిర్దిష్ట ప్రదేశం మరియు ఒక నిర్దిష్ట జీవన విధానం పట్ల భక్తి, ఆ ప్రదేశం ప్రపంచంలోనే అత్యుత్తమమైనదిగా వారు నమ్ముతారు కానీ ఇతరులపై దానిని రుద్దాలనే కోరిక ఉండదు. సైనికపరంగా మరియు సాంస్కృతికంగా  దేశభక్తి  స్వభావం రక్షణాత్మకమైనది. మరోవైపు, జాతీయవాదం అధికార కోరిక నుండి విడదీయరానిది. ప్రతి జాతీయవాది యొక్క శాశ్వత ఉద్దేశ్యం దేశం కోసం మరింత అధికారాన్ని మరియు మరింత ప్రతిష్టను పొందడం.      By ...

ఆరడి

  జనవరి 28, 2025 ఆరడి   ( āraḍi )     అర్థము      (విశేష్యము/విశేషణము)  : నింద; వ్యర్థం    Meaning     (noun/adj)  : allegation/censure; useless      వాడుక / Usage      అత్తమ్మ నీ చేత ఆరడే గానీ ఓలేమ్మా పచ్చిపాలమీద మీగడుంటుందా? వేడిపాలల్లోన వెన్న ఉంటుందా?     Mother-in-law just an allegation you make; will there be cream on raw milk? Or butter in hot milk?    మెదడుకు మేత / Food for thought      జాతీయవాదం అంటే తనను తాను మోసం చేసుకుంటూ మనిషి అణచివేసుకునే అధికార దాహం. ప్రతి జాతీయవాది పచ్చి  మోసం చేయగలడు/చేస్తాడు, కానీ అతను - తనకన్నా గొప్పదానికి సేవ చేయాలనే స్పృహ కలిగి ఉన్నందున - తాను ఎల్లప్పుడూ ఒప్పేనని ధృడంగా నమ్ముతాడు.      Nationalism is power hunger tempered by self-deception. Every nationalist is capable of the most flagrant dishonesty, but he is also – since he is conscious of serving something bigger than himself – unshakably cert...

సరంగు

  జనవరి 27, 2025 సరంగు   ( sarangu )     అర్థము      (విశేష్యము)  : ఓడ నడుపువాడు; కలాసి; నావికుడు    Meaning     (noun)  : boatswain; head sailor      వాడుక / Usage      ఏటి పడవ సరంగు పాట గిరికీలలో చెలికాడ మనసొదల్‌ కలబోసుకుందాము .     In the boatswain's undulating song, partner let's confluence our lamentations.    మెదడుకు మేత / Food for thought      జాతీయవాద ఆలోచన యొక్క ప్రధాన లక్షణం స్థిర భావం. సాధ్యమైనంతవరకు, ఏ జాతీయవాది కూడా తన సొంత వర్గం యొక్క ఆధిపత్యం గురించి తప్ప మరేమీ ఆలోచించడు, మాట్లాడడు లేదా వ్రాయడు.      Obsession is a  principal characteristic of nationalist thought . As nearly as possible, no nationalist ever thinks, talks, or writes about anything except the superiority of his own power unit.     -- నోట్స్ ఆన్ నేషనలిజం, జార్జ్ ఆర్వెల్

తుండు

  జనవరి 26, 2025 తుండు   ( tunḍu )     అర్థము      (విశేష్యము)  : తునక; (తుంచబడిన) ముక్క    Meaning     (noun)  : a bit/piece; something plucked/cut      వాడుక / Usage      అవిశి పువ్వులు రెండు అందకున్నయ్ నాకు తుండి నా సిగలోన తురిమి పోదువుగాని .     Beautiful blue bells, out of my grasp, come pluck and adorn my hair!    మెదడుకు మేత / Food for thought     మనలోని  జాతీయవాదం అనే నరాన్ని తాకితే చాలు, మేథస్సుతో ఆలోచించే చర్య అదృశ్యమవుతుంది, గతాన్ని మార్చేయవచ్చు, మరియు తేటతెల్లంగా ఎదుర ఉన్న వాస్తవాలను తిరస్కరించవచ్చు.      One prod to the nerve of nationalism and the intellectual decencies can vanish, the past can be altered, and the plainest facts can be denied.     -- నోట్స్ ఆన్ నేషనలిజం, జార్జ్ ఆర్వెల్

భీమా

  జనవరి 23, 2025 భీమా   ( bīmā )     అర్థము      (విశేష్యము)  :  ఆకస్మికమ ఆపదల నుండి ఆర్థికముగా తేరుకోడానికి ఒక పూచీదారు విధానము    Meaning     (noun)  : insurance      వాడుక / Usage      నా వలపు భీమా నా సోకు నాజూకు పువ్వంత లేతరో.     My love is the insurance (as) my beauty is delicate and tender  as a  flower.    మెదడుకు మేత / Food for thought      తక్షశిలా, పాటలీ పుత్రం,      హారప్పా, మొహంజొదారో,      క్రో-మాన్యాన్‌ గుహముఖాల్లో      చారిత్రక విభాత సంధ్యల      మానవకథ వికాసమెట్టిది?      ఏ దేశం ఏ కాలంలో      సాధించిన దే పరమార్థం?      ఏ శిల్పం? ఏ సాహిత్యం?      ఏ శాస్త్రం?ఏ గాంధర్వం?      ఏ వెల్గుల కీ ప్రస్థానం?     ఏ స్వప్నం? ఏ దిగ్విజయం?     --  మహాప్రస్థానం/దేశ చరిత్రలు, శ్...

మాపటివేళ

  జనవరి 22, 2025 మాపటివేళ   ( mapati-vela )     అర్థము      (విశేష్యము)  : సాయంత్రం; రాత్రి వేళ    Meaning     (noun)  : evening; night time      వాడుక / Usage      మాపటేల దీపమేలా చందమామలాంటి పిల్ల చందనాలు చల్లిపోతే .     A damsel beautiful as moon, fragrant as sandalwood; what is the need, in the night, for a light when she is near?!    మెదడుకు మేత / Food for thought      ఏ యుద్ధం ఎందుకు జరిగినొ?      ఏ రాజ్యం ఎన్నాళ్లుందో?      తారాఖులు, దస్తావేజులు      ఇవి కావోయ్‌ చరిత్రకర్థం      ఈ రాణీ ప్రేమపురాణం,      ఆ ముట్టడికైన ఖర్చులూ,      మతలబులూ, కైఫీయతులూ      ఇవి కవోయ్‌ చరిత్రసారం      ఇతిహాసపు చీకటి కోణం      అట్టడుగున పడి కాన్పించని     కథలన్నీ కావాలిప్పడు!     --  మహాప్రస్థానం/దేశ చరిత్రల...

చిత్తు

  జనవరి 21, 2025 చిత్తు   ( chittu )     అర్థము      (విశేష్యము)  : జ్ఞానము; మొదటి వ్రాసి పక్కకు పెట్టేసిన వ్రాత/లెక్క; ఓడిపోవడం    Meaning     (noun)  : Knowledge; Consciousness; rough copy; defeated      వాడుక / Usage      శ్రీరాగం చిందులు వేసే నా పాటకు నీ పైట జారిందిలే శ్రీవారే చిత్తై పోయే సయ్యాటకు సంకెళ్ళు కోరిందిలే .     Sonata sashays to my song fluttering your mantle; shackles desire a dalliance that spends the lover.     మెదడుకు మేత / Food for thought      అజ్ఞానపు టంధయుగంలో      ఆకలిలో, ఆవేశంలో-      తెలియని ఏ తీవ్రశక్తులో      నడిపిస్తే నడిచి మనుష్యులు      అంతా తమ ప్రయోజకత్వం      తామే భువి కధినాధులమని,      స్థాపించిన సామ్యాజ్యాలూ,      నిర్మించిన కృత్రిమచట్టాల్‌      ఇతరేతర శక్తులు లేస్తే      పడిపోయెను...

పురి

  జనవరి 20, 2025 పురి   ( puri )     అర్థము      (విశేష్యము)  : పట్టణం; మెలి; క్రమ్ముట; బలం; మదం; గర్వం    Meaning     (noun)  : city; twist; spread/occupy; strength; pride      వాడుక / Usage      కలే కలై కలయికే సెగై చలి ఇలా ఇలా ముగిసే, సరే సరే గడుసరే జతై మగసిరి పురి తెలిసే .     Dreams harmonious, union steamy so ends the wintry cold; yes the virile partner's strength beckons.     మెదడుకు మేత / Food for thought      జెంఘిజ్‌ఖాన్‌, తామర్లేనూ,      నాదిర్షా, ఘజ్నీ, ఘోరీ,      సికిందరో ఎవడైతేనేం?      ఒక్కొక్కడూ మహాహాంతకుడు      వైకింగులు, శ్వేత హుణులూ      సిధియన్లు, పారశీకులూ,      పిండారులు, థగ్గులు కట్టిరి     కాలానికి కత్తుల వంతెన     --  మహాప్రస్థానం/దేశ చరిత్రలు, శ్రీరంగం శ్రీనివాసరావు (1910 - 1983)

అల్లాడు

  జనవరి 19, 2025 అల్లాడు   ( allāḍu )     అర్థము      (క్రియ)  : చలించు; తహతహలాడు; తిరుగు; బాధపడు    Meaning     (verb)  : to shake/move/toss about/agitate      వాడుక / Usage      అమ్మ సంపంగి రేకు అల్లాడె పిల్ల సోకు అబ్బ కొట్టింది షాకు అందాలు అంటుకోకు .     Fragrant as a champak petal, the damsel's beauty quivers; oh! this is electrifying, touch me not.     మెదడుకు మేత / Food for thought      ఏ దేశచరిత్ర చూచినా      ఏమున్నది గర్వకారణం      నరజాతి చరిత్ర సమస్తం      పరపీడన పరాయణత్వం      నరజాతి చరిత్ర సమస్తం      పరస్పరాహరణోద్యోగం:      రణరక్త ప్రవాహసిక్తం      బీభత్సరస ప్రధానం.      పిశాచగణ సమవాకారం:     --  మహాప్రస్థానం/దేశ చరిత్రలు, శ్రీరంగం శ్రీనివాసరావు (1910 - 1983)

వెక్కసపాటు

  జనవరి 16, 2025 వెక్కసపాటు   ( vekkasapāṭu )     అర్థము      (విశేష్యము)  : సహింపలేక పోవటం; మొహం మొత్తటం; అసూయ    Meaning     (noun)  : disgust; glut; envy; cloy      వాడుక / Usage     పాండవుల నిర్మించిన మయసభ దుర్యోధనుడికి వెక్కసపాటైంది .     Pandava's Maya palace was a source of envy for Duryodhana.     మెదడుకు మేత / Food for thought      క్షమ కవచంబు, క్రోధమది శత్రువు, జ్ఞాతి హుతాశనుండు, మి      త్రము దగుమందు, దుర్జనులు దారుణ పన్నగముల్, సువిద్య వి      త్త, ముచిత లజ్జ భూషణ, ముదాత్త కవిత్వము రాజ్య మీక్షమా      ప్రముఖ పదార్థముల్ గలుగు పట్టునఁ దత్కవచాదులేటికిన్?     --  భర్తృహరి నీతి శతకం - ఏనుగు లక్ష్మణ కవి

చిడిముడిపాటు

  జనవరి 15, 2025 చిడిముడిపాటు   ( chiḍi-muḍi pāṭu )     అర్థము      (విశేష్యము)  : తొందరపాటు; తొట్రుపాటు; కలత; కోపం    Meaning     (noun)  : anger; irritation; anxiety      వాడుక / Usage     గజేంద్ర మోక్ష ఘట్టంలో లక్ష్మీదేవి చిడిముడిపాటు పోతన బహుచక్కగా చిత్రీకరించారు .     Pothana paints a beautiful picture of Lakshmi Devi's anxiety in Gajendra Mokshana episode.     మెదడుకు మేత / Food for thought     ఆరంభింపరు నీచమానవులు విఘ్నాయాస సంత్రస్తులై      యారంభించి పరిత్యజింతురురు విఘ్నాయత్తులై మధ్యముల్      ధీరుల్ విఘ్ననిహన్య మానులగుచున్ ధృత్యున్నతోత్సాహులై      ప్రారబ్ధార్థము లుజ్జగింపరు సుమీ ప్రజ్ఞానిధుల్ గావునన్     --  భర్తృహరి నీతి శతకం - ఏనుగు లక్ష్మణ కవి

అడిచిపాటు

  జనవరి 14, 2025 అడిచిపాటు   ( aḍichi-pāṭu )     అర్థము      (విశేష్యము)  : తొందరపాటు; గర్వం; ఎగిరిపడుట    Meaning     (noun)  : haste; impatience; arrogance      వాడుక / Usage     అమెరికా అడిచిపాటు ధోరణి రాబోయే వినాశానికి చిహ్నం .     Americas arrogance is sign of the decline to come.     మెదడుకు మేత / Food for thought       ఒకచో నేలను బవ్వళించు, నొకచో నొప్పారుఁ బూసెజ్జపై,      నొకచోశాకము లారగించు, నొకచో నుత్కృష్ట శాల్యోదనం,      బొక్కచో బొంత ధరించు, నొక్కొక తఱిన్ యోగ్యాంబర శ్రేణి, లె      క్కకు రానీయడు కార్యసాధకుడు దుఃఖంబున్ సుఖంబున్ మదిన్     --  భర్తృహరి నీతి శతకం - ఏనుగు లక్ష్మణ కవి

కొందలపాటు

  జనవరి 13, 2025 కొందలపాటు   ( kondalapaatu )     అర్థము      (విశేష్యము)  : కలత/క్షోభ పడుట; విచారం; కలవరం    Meaning     (noun)  : anxiety; sorrow      వాడుక / Usage     ఇప్పుడే చదువు ముగించుకుంటున్న విద్యార్థులు భవిష్యత్తు గురించి కొందలపాటు లో ఉన్నారు .     Freshly graduating students are anxious about the future.     మెదడుకు మేత / Food for thought      విద్య నిగూఢగుప్తమగు విత్తము, రూపము పురుషాళికిన్      విద్య యశస్సు, భోగకరి, విద్య గురుండు, విదేశబంధుడున్,      విద్య విశిష్ట దైవతము, విద్యకు సాటి ధనంబు లేదిలన్,     విద్య నృపాలపూజితము, విద్య నెఱుంగనివాడు మర్త్యుడే?     --  భర్తృహరి నీతి శతకం - ఏనుగు లక్ష్మణ కవి

అగపాటు

  జనవరి 12, 2025 అగపాటు   ( agapaatu )     అర్థము      (విశేష్యము)  : కనపడుట; తెలియుట; లొంగుట; చిక్కుట; ఇబ్బంది    Meaning     (noun)  : to become visible/known/captive; difficulty      వాడుక / Usage     ప్రభుత్వ విమర్శకుడిగా అగపాటు , కళాకారులకు చరమ గీతంగా మారుతోంది .     Becoming a visible critic of government, is ringing the death knell for artists.     మెదడుకు మేత / Food for thought        తెలివి యొకింత లేని యెడ దృప్తుడనై కరి భంగి సర్వముం      దెలిసితి నంచు గర్వితమతిన్ విహరించితిఁదొల్లి, యిప్పుడు      జ్వల మతులైన పండితుల సన్నిధి నించుక బోధశాలినై      తెలియనివాడనై మెలంగితిం, గతమయ్యె నితాంత గర్వమున్!     --  భర్తృహరి నీతి శతకం - ఏనుగు లక్ష్మణ కవి

సురతము

  జనవరి 09, 2025 సురతము   ( su-ratamu )     అర్థము      (విశేష్యము)  : స్త్రీపురుషుల కలయిక; సంభోగము    Meaning     (noun)  : copulation; union      వాడుక / Usage      గద్దరి తిరువేంకటపతి - కౌగిటి అధరామృతముల అద్దిన సురతపు చెమటల - అందము కాదుకదా !     The eagle rider, Sri Venkatesha, in a tight embrace kisses her during union - are the pearls of sweat on her cheeks a remnant of that!    మెదడుకు మేత / Food for thought       9-11 తర్వాత అమెరికాపై ప్రపంచవ్యాప్తంగా ఎగిసిన సానుభూతి తరంగం, అమెరికా యొక్క దురహంకారం మరియు సైనికవాదం కారణంగా ద్వేషపూరిత ఉప్పెనగా మారింది.      The global wave of sympathy that engulfed the United States after 9-11 has given way to a global wave of hatred of American arrogance and militarism.      -- హేజిమోనీ ఆర్ సర్వైవల్ - అమెరికాస్ క్వెస్ట్ ఫర్ గ్లోబల్ డామినెన్స్, నోయం చోమ్స్కీ   

కెలకు

  జనవరి 08, 2025 కెలకు   ( kelaku )     అర్థము      (విశేష్యము/క్రియ)  : దిక్కు; కలపెట్టు; పెల్లగించు    Meaning     (noun/verb)  : side; quarter/region; to stir/mix      వాడుక / Usage      ముద్దియ చెక్కుల కెలకు ల - ముత్యపు జల్లుల చేర్పులు ఒద్దిక బాగు లివేమో - ఊహింపరే చెలులు !     The pearls of sweat down the side of her lovely cheeks; are they the exertions of union with her Lord - imagine that besties!    మెదడుకు మేత / Food for thought       అమెరికన్ అధికారులు స్వేచ్ఛ, ప్రజాస్వామ్యం మరియు అటువంటి విలువల గురించి మాట్లాడటం మనం విన్నప్పుడు, ఆ పదాలు అసభ్యకరంగా మారిపోతాయి.      When we hear American officials speaking of freedom, democracy and such values, they make terms like these sound obscene.      -- హేజిమోనీ ఆర్ సర్వైవల్ - అమెరికాస్ క్వెస్ట్ ఫర్ గ్లోబల్ డామినెన్స్, నోయం చోమ్స్కీ   

మెరుగు

  జనవరి 07, 2025 మెరుగు   ( merugu )     అర్థము      (విశేష్యము)  : మెరుపు; తళ తళ కాంతి; మేలు; మరింత నాణ్యత    Meaning     (noun)  : lustre; glitter; better; superior      వాడుక / Usage      పడతికి చనుగవ మెరుగు లు - పైపై పయ్యెద వెలుపల కడుమించిన విధమేమో - కనుగొనరే చెలులు !     The damsel's breasts lustrous -  more through the garment that ensnares them - is it so friends?    మెదడుకు మేత / Food for thought       మధ్య అమెరికా వాసుల రక్త తర్పణంతో ఆజ్టెక్ దేవతలను అమెరికా అధ్యక్షులు కొలుస్తారని నమ్మక తప్పదు .     O ne is tempted to believe that some people in the White House worship Aztec gods—with the offering of Central American blood.      -- హేజిమోనీ ఆర్ సర్వైవల్ - అమెరికాస్ క్వెస్ట్ ఫర్ గ్లోబల్ డామినెన్స్, నోయం చోమ్స్కీ   

నలువు

  జనవరి 06, 2025 నలువు   ( naluvu )     అర్థము      (విశేష్యము)  : అందము; సౌందర్యం; సామర్థ్యం    Meaning     (noun)  : beauty; ability      వాడుక / Usage      నలువు న ప్రాణేశ్వరుపై - నాటిన ఆ కొనచూపులు నిలువుగపెరుకగనంటిన - నెత్తురు కాదుకదా !     The beautiful side glances - planted on her Lord - she turns away in a jiffy; her eyes crimson with bashfulness; it isn't blood right?!    మెదడుకు మేత / Food for thought      అమెరికా  దాడి చేయడానికి ఎంచుకుంటే చాలు -  ఎవరినైనా  శత్రు పోరాట యోధుడుగా ముద్ర వేయచ్చు, విశ్వసనీయ ఆధారాలు లేకుండానే.      An enemy combatant can be anyone that the US chooses to attack, with no credible evidence.      -- హేజిమోనీ ఆర్ సర్వైవల్ - అమెరికాస్ క్వెస్ట్ ఫర్ గ్లోబల్ డామినెన్స్, నోయం చోమ్స్కీ   

ఎడనెడ

  జనవరి 05, 2025 ఎడనెడ   ( eḍa-neḍa )     అర్థము      (క్రియావిశేషణం)  : అప్పుడప్పుడు; అక్కడక్కడ; మధ్యమధ్య    Meaning     (adverb)  : here and there; now and then      వాడుక / Usage      ఏముకో చిగురు టధరమున - ఎడనెడ కస్తూరి నిండెను భామిని విభునకు రాసిన పత్రిక కాదు కదా!     Wonder what it is - the traces of musk dot her tender lips - is it the love letter written by Sridevi to her Lord.    మెదడుకు మేత / Food for thought      ఉగ్రవాదం యొక్క అధికారిక నిర్వచనంతో మరొక సమస్య ఏమిటంటే, దాని ప్రకారం అమెరికా ఒక ప్రముఖ ఉగ్రవాద దేశం అని తెలుస్తుంది!     -- హేజిమోనీ ఆర్ సర్వైవల్ - అమెరికాస్ క్వెస్ట్ ఫర్ గ్లోబల్ డామినెన్స్, నోయం చోమ్స్కీ   

తడుము

  జనవరి 02, 2025 తడుము   ( taḍumu )     అర్థము      (క్రియ)  : నిమురు; దువ్వు; ఆలోచించు    Meaning     (verb)  : to pat; grope; think or consider      వాడుక / Usage     అందులో గుండెలు తడి చేసి, ఆలోచనలను తడిమే కథలన్నీ ఒక దరికి చేరిస్తే ఎలా ఉంటుందన్న ఆలోచనే ఈ పుస్తకం .     This book is an attempt to compile all such stories that melt the heart and touch the soul.    మెదడుకు మేత / Food for thought     ఆమె నిద్ర సవ్వడి వింటూ అచేతనంగా కూర్చున్నాడు. బయట తుఫాన్ హోరు కంటే గదిలోని ఆమె నిద్ర సవ్వడి ఎక్కువగా అలజడి కలిగిస్తోంది. అతను తలుపు తీసుకొని బయటకు వచ్చాడు. తుఫాన్ మేఘం నిర్లక్ష్యంగా కురుస్తూనే ఉంది. పొదున్న తుఫాన్ భయపెట్టింది. ఆ తుఫాన్ ప్రశాంతంగా ఉంది అతని లోపల తుఫాన్ కన్నా!     -- గోడ, కుప్పిలి పద్మ