Posts

Showing posts from May, 2021

కొట్టం

  మే 31, 2021 కొట్టం  ( kottam )       అర్థము      (విశేష్యము): పశువుల పాక, పెరడు, వసారా; కోట; శ్రీకాకుళం, విజయనగరంలో రెండు ఊరులు;      Meaning     (noun) : cattle shed; villages in Srikakulam, Vijayanagaram        వాడుక / Usage       పశువుల కొట్టం నుంచి అంతరిక్ష పరిశోధన దాకా సాగిన మయిల్‌స్వామి అన్నాదురై .   Mayilswamy Annadurai progressed from a cattle shed to space research.      మెదడుకు మేత / Food for thought “ మాయామేయ జగంబె నిత్యమని సంభావించి మోహంబునన్ నా యిల్లాలని నా కుమారుడని ప్రాణంబుండు నందాక నెం తో యల్లాడిన యీ శరీర మిపుడిందున్ గట్టెలన్ గాలుచో నా యిల్లాలును రాదు పుత్రుడును తోడై రాడు తప్పింపగన్.! ” (ప్రాణాలు ఉన్నంతవరకు జగము ఎప్పుడూ ఉంటుందని భార్య పిల్లలకోసం అల్లాడినా, కట్టెలలో కాలేవేళ ఎవ్వరూ తప్పించలేరు) -- సత్య హరిశ్చంద్ర, బలిజేపల్లి లక్ష్మీకాంతం  (డిసెంబర్ 23, 1881 - 1953)

తరళము

  మే 28, 2021 తరళము  ( taraḷamu )       అర్థము      (విశేషణము): చలించునది; చంచలమైనది; అనురాగము కలది; ప్రకాశించునది; (విశేష్యము) : హారమధ్య  రత్నం; ఒక ఛందస్సు     Meaning     (adjective) : trembling; tremulous; unsteady; shy glance; bright; (noun) : pendant        వాడుక / Usage      " రాగరత్న మాలికా తరళము శంకరాభరణమూ.. "   In the garland of Ragas, Sankarabharam is the brightest gem.      మెదడుకు మేత / Food for thought " “ నిరంతరం నేర్చుకుంటూ ఉండని  గురువు, తన విద్యార్ధులకి సుసంపన్నంగా బోధించాలేడు. దీపం ఇంకో దీపాన్ని వెలిగించాలంటే తను స్వయంగా వెలుగుతూ ఉండాలి. తన విద్య అయిపోయిందని, దానితో ప్రతిదినం సహచర్యం చేయని గురువు, రోజూ విద్యార్థులకి వల్లెవేసి మెదడు నింపుతాడేగానీ బుద్ధి పెంపొందించలేడు. సత్యం ఒక్క సమాచారం కోసమే కాదు, మనల్ని ఉత్తేజితం కూడా చేయాలి. స్ఫూర్తి నశించిపోయి, కేవలం పరిజ్ఞానం పేరుకుపోతే సత్యం తన అనంతత్వాన్ని కోల్పోతుంది. ” -- గురుదేవ్ రబింద్రనాథ్ ఠాగూర...

విలసనము

  మే 27, 2021 విలసనము  ( vilasanamu )       అర్థము      (విశేష్యము): క్రీడ, ఆట, కేళి; ప్రకాశము     Meaning     (noun) : sport, dallying, dalliance; shining        వాడుక / Usage      " ఏలా యలసగమనమ్ము, ఏలా నవ విలసనమ్ము !"   Why this lazy saunter, why this new dallying?      మెదడుకు మేత / Food for thought " “ చాలా సంవత్సరాల క్రితం మనము విధిని కలవడానికి పూనుకున్నాం, ఇప్పుడు ఆ ప్రతిజ్ఞ నెరవేర్చుకొనే సమయం వచ్చినది.  అర్ధరాత్రి  సమయంలో,  ప్రపంచమంతా  నిద్రిస్తున్న వేళ, భారతదేశం తన స్వతంత్ర జీవనానికై మేల్కొంది.మనం పాత నుండి క్రొత్తకి అడుగు వేసేటపుడు, ఒక యుగం అంతమైనపుడు, చాలా కాలం అణగ ద్రొక్క బడిన ఒక దేశం తనను తాను బహిర్గత పరచుకొనే ఒక క్షణం -  చరిత్రలో అరుదుగా వస్తుంది. భారత దేశం కొరకు , దాని ప్రజల కొరకు ఇంకా ముఖ్యంగా మానవ జాతి సేవకు అంకిత మవుతామనే ప్రతిజ్ఞకు ఈ పవిత్ర క్షణం యుక్తమైనది ” -- "ట్రిస్ట్ విత్ డెస్టినీ" ఉపన్యాసం, పండిట్ జవహర్లాల్ నెహ్రు  ...

రోచిస్సు

  మే 26, 2021 రోచిస్సు  ( rōchissu )       అర్థము      (విశేష్యము): సూర్యకిరణము; వెలుగు; కాంతి;     Meaning     (noun) : a ray of light; splendour; brilliance        వాడుక / Usage       కరోనా గ్రహణంలో ఉన్న మన దేశానికి సౌఖ్య రోచిస్సు వచ్చే కాలం దగ్గరలోనే ఉంది.   Soon we will emerge from the shadow of corona into the splendour of light.      మెదడుకు మేత / Food for thought " “బ్రతుకులో ప్రతి ఒక్క విషజ్వాలను మింగేసాను. ఎందుకంటే అందులో నీ ప్రేమ తాలూకా ఒక్క బిందువు దొరుకుతుందని... మేలు మేలు నువ్వు ఇంకొకళ్ళ సొత్తు అయిపోయావు. ఇంక నిన్ను నా సొంతం చేసుకోవాలని తపన పడక్కర్లేదు...ఎప్పుడు, ఎలా? అది తెలియదు. నీ ఊహల కల్పన అయిపోతానేమో. ఆ కట్టుకథై గూఢమైన గీతగా విప్పారి నీ కాన్వాస్ మీద చేరతానేమో. చేరి నిన్నే తదైక్యంగా చూస్తాను.” -- జ్ఞాన పీఠ్ గ్రహీత  అమ్రితా ప్రీతమ్   (ఆగష్టు 31, 1919 - 2005) పంజాబీ పలుకుల యొక్క స్వేచ్ఛానువాదం

చేలము

  మే 25, 2021 చేలము  ( chēlamu )       అర్థము      (విశేష్యము): కప్పేది; వస్త్రము; చీర; దుప్పటి; (కుచేలుడు - చిరిగిన బట్టలు వేసుకునేవాడు)     Meaning     (noun) : a covering; garment; vestment; sari        వాడుక / Usage       నీ చంచల చేలాం చల   స్వప్న సీమలలో నా హృదయం బంధింప పడింది.   My heart is a prisoner of the dreamy world at the ends of your fluttering sari.      మెదడుకు మేత / Food for thought " “విసిగి వేసారి పోయాను నిరంతర జీవన సందిగ్ధంతో. దిక్కరిస్తున్నాను సమాజాన్ని ముక్కలైన మనసుతో. త్రొళ్ళుతున్న దుఃఖం నాది, ఎక్కడనుంచి తేను ఆనంద గీతాల్ని? జీవితంలో నాకు దొరికిందే కదా నేను తవ్వి ఇవ్వగలిగేది! కానీ లేస్తుంది ఉవ్వెత్తున నా ఊపిరి మరొకసారి. ఇప్పటిదాకా బ్రతుకు బండరాళ్ల కింద ఓటమితో ఒరిగిపోయాను. ఇదిగో ఈ రోజుతో  తెంపేస్తున్నాను ఆశాబంధం. ఈపై మొరపెట్టను ఎవ్వరికీ, ఈపై ఆక్షేపించను ఎవ్వరినీ.” -- ప్యాసా, సాహిర్ లూధియాన్వీ (మార్చ్ 8, 1921 - 1980) ఘజల్ యొక్క స్వేచ్ఛానువాద...

విభావరి

  మే 24, 2021 విభావరి  ( vibhavari )       అర్థము      (విశేష్యము): విభ - కాంతి, ఆవరి - కప్పడం; కాంతిని కప్పేది చీకటి, రేయి, రాత్రి; వేశ్య స్త్రీ; పసుపు;      Meaning     (noun) : that which covers the light; night; female prostitute; turmeric        వాడుక / Usage      ఘంటసాల సంగీత విభావరి అందరిని రసడోలికలలో ఊపింది.    Ghantasala music night was an ecstatic trip for everyone.      మెదడుకు మేత / Food for thought " “ఏ పాపమూ ఆమెను తాకదు. వేశ్యల కుటుంబంలో పుట్టి, కట్టుబడులన్నిటికీ అతీతమైంది. నిత్య మంగళమై, ప్రతీ దినం వైవాహితయై, వైధవ్యం లేనిది. ప్రవహించే నదిని ఏ కళంకం మైల పరుస్తుంది? దప్పికతో ఉన్న మనిషి సేద తీరేది అక్కడే, మకిలపట్టిన మానవుడు మలిన ప్రక్షాళన చేసుకునేది దానిలోనే, మసిబారిన దేవతా విగ్రహాలు తళుకులాడినా అందులోనే. అన్నిటికీ అంగీకారమేగానీ దేనికీ అసమ్మతి చెప్పదు. ఆమె లాగా. ఎండి పోదు, అలసి పోదు. తుంగ - ఎన్నటికీ ఆవిరవ్వని, సొలసిపోని మహా నది.” -- సంస్కార , కన్న...

ఎముకలేని చెయ్యి

మే 21, 2021 ఎముకలేని చెయ్యి  ( yemuka-leni cheyyi )       అర్థము      (జాతీయం): గొప్ప దాత; ఏదైనా ఇవ్వడానికి సంకోచించని వారు; ఇవ్వడానికి ఆటంకంగా ఎముకైనా లేదు     Meaning     (idiom) : great donor; ready to give away anything        వాడుక / Usage      నిత్యాన్నదాత అయిన డొక్కా సీతమ్మది చిన్నప్పటి నుంచీ  ఎముకలేని చెయ్యే.     Dokka Seetamma had a giving nature right from childhood.       మెదడుకు మేత / Food for thought " “ఆశ ఉత్తరధ్రువం, విధి దక్షిణ ధ్రువం మనిషి రెండీటీ మధ్యా బంతిలా ఎగిసిపడే ప్రహసనం ఇజంలో ఇంప్రిజన్ అయితే ఇంగితజ్ణానం నశిస్తుంది ప్రిజం లాంటీది జీవితం, వేర్వేరు కోణాలు ప్రదర్శిస్తుంది... కాలానికి ఒక రూపం లేదు దానికిపాపం కుడా లేదు కాలం అద్దం లాంటిది అంధయుగమైనా, స్వర్ణయుగమైనా,  అది మన ప్రతిబింబమ్” -- అమృతం కురిసిన రాత్రి, దేవరకొండ బాలగంగాధర్ తిలక్ (ఆగష్టు 1, 1921 - 1966)

భగీరథ ప్రయత్నం

   మే 20, 2021 భగీరథ ప్రయత్నం  ( bhagiratha prayatnam )       అర్థము      (జాతీయం):  కష్టమైన పనిని సాధించటానికి విసుగు, విరామం లేకుండా ప్రయత్నించడం; భగీరథుడు గంగని భూమికి తెచ్చినట్లు     Meaning     (idiom) : tireless effort; indefatigable        వాడుక / Usage      మిత్రుడి కోసం భగీరథ ప్రయత్నం - ఝార్ఖండ్ నుంచి నొయిడాకి ఆక్సిజన్ తెచ్చిన దేవేంద్ర.   Untiring effort for friend - Devendra gets oxygen from Jharkhand to Noida.       మెదడుకు మేత / Food for thought " "రసవాహినీ స్వాగతం, జీవ రసధునీ స్వాగతం... సకలజగతి దాహతప్త సంక్షోభితమైననాడు దివివారిని భువిసీమకు తరలించగ తలచినట్టి భగీరథుని నిరీక్షణకు దీర్ఘ తపస్సమీక్షణకు విరూపాక్ష కరుణా సంప్రోక్షణ మీ రసవాహిని.... పినాకపాణి వేణి భరమే  కరమై గ్రహించే సురగంగను తన నాయికగా ఉరుకుల పరుగుల ఉరుముతో వచ్చిన కన్నియ ఒదిగెను తలలో నాలుకగా ఆ సురగంగా ప్రళయహేల అది విషకంధరునకు ప్రణయాలీలగా విలయము తన విలాసలీలగా.... ఔదల దాల్చెను శంక...

త్రిశంకుస్వర్గం

  మే 19, 2021 త్రిశంకుస్వర్గం  ( trisanku swargam )       అర్థము      (జాతీయం): ఎటూ కాని పరిస్థితి; ఎటూ తేల్చుకోలేకుండా మధ్యలో ఊగిసలాడడం; ఇక్ష్వాక రాజు త్రిశంకుడిని శరీరంతో స్వర్గానికి పంపడంకోసం విశ్వామిత్రుడు స్వర్గానికి భూమికి మధ్యలో చేసిన మరో స్వర్గం     Meaning     (idiom) : uncomfortably stuck in between situations; mid-way heaven created for King Trisanku        వాడుక / Usage      అస్సాం  ఎన్ఆర్‌సీ జాబితా: త్రిశంకు స్వర్గం లో జార్ఖండ్, ఛత్తీస్‌గఢ్ వలసదారులు.   Assam NRC list: Jharkhand, Chattisgarh migrants  caught in the middle.      మెదడుకు మేత / Food for thought " " ప్రేయసీ ప్రేయసీ ప్రియుడనే ప్రేయసీ ! వేయి కన్నులు దాల్చి వెదుకుచున్నానే ! నల్ల మేఘాలలో నాయమా దాగంగ ? తల్లడిలవో నన్ను తలచి రావో ! మెరుపువై యోయ్యారి యెరపు వై యరసి నంతనే మబ్బు తెరల దాగితివా ! తళుకు మని కనిపించి వలపు వెల్లువ ముంచి వలపించి మాయమై వనట గూర్చితివా !" -- కృష్ణపక్షము, దేవులపల్లి కృష్...

గోముఖ వ్యాఘ్రం

  మే 18, 2021 గోముఖ వ్యాఘ్రం  ( gomukha vyaghram )       అర్థము      (జాతీయం): గోవు - ఆవు; ముఖము - మొగము; వ్యాఘ్రం  - పులి ;  పైకి మెత్తగా కనబడుతూ, తడిగుడ్డతో గొంతులు కోసేవాళ్లు     Meaning     (idiom) : those hiding their evil intentions under a friendly mask;  wolf in sheep's clothing        వాడుక / Usage       అతను  గోముఖ వ్యాఘ్రం అని పసికట్టలేక పదవి కట్టబెట్టారు.    Unaware of his true intentions, he was given a prominent position.        మెదడుకు మేత / Food for thought " " చీకటిలో వాకిట నిలిచి... దోసిట సిరిమల్లెలు కొలిచి    నిదుర కాచి నీకై వేచి... నిలువెల్లా కవితలు చేసి    కదలి కదలి నీవొస్తుంటే...  కడలి పొంగులనిపిస్తుంటే    వెన్నెలనై.. నీలో అలనై.. నీ వెల్లువకే వేణువునై   పొరలిపొంగు నీ అందాలే పరవశించి పాడనా.. ఆహాహా    పొరలిపొంగు నీ అందాలే పరవశించి పాడనా... పాడనా... పాడనా    ఓహ...

కరతలామలకం

  మే 17, 2021 కరతలామలకం  ( karatalamalakam )       అర్థము      (జాతీయం):  కరము - హస్తము/చెయ్య; తల - ముందు భాగం; అమలకం - ఉసిరికాయ; చేతిలో ఉసిరికాయ స్పష్టంగా తెలిసినట్లు ఏదైనా విషయం సులభంగా స్పష్టంగా తెలియడం     Meaning     (idiom) : as clear as a fruit in hand; knowing like the back of your hand; easy        వాడుక / Usage        కోనేరు హంపికి చిన్నతనంలోనే చదరంగం కరతలామలకం అయ్యింది.    Koneru Hampi knew chess like the back of her hand from childhood.        మెదడుకు మేత / Food for thought " " నీకంఠార్పిత కాలపాశము శిరోనిర్ఘాంత పాతంబు లం కోకస్సంచయ కాళరాత్రి గళ బద్ధోదగ్ర కాలాహి క న్యాకారాగత మృత్యువున్ జనక కన్యన్ వేగ యొప్పించి లో కైక త్రాణుని రామునిం గనుము నీకీ బుద్ధి గాకుండినన్ " ( నీ కంఠానికి బిగుసుకున్న యమపాశం ఆమె. నీ తల మీద పడబోతున్న పిడుగు. నీ లంకా నగరం పాలిట కాళ రాత్రి. నీ కుతికెకు చుట్టుకును వున్న భయంకర కాల సర్పం. నీ ముంగిట్లోకి స్త్రీ ఆకారంతో ప్రవే...

తృణీకరించు

  మే 14, 2021 తృణీకరించు  ( truni-karinchu )       అర్థము      (క్రియ):  తృణము(grass)గా చూడు; నిర్లక్షము చేయడం; తక్కువగా చూడడం; పెడచెవిని పెట్టడం     Meaning     (verb) : look down upon (as grass); slight; scorn; disregard        వాడుక / Usage       ఎల్లప్పుడూ విమర్శకుల మాట  తృణీకరిస్తే ప్రభుత్వం తప్పులు దిద్దుకోలేదు.    If critics are always scorned at, government cannot correct itself.      మెదడుకు మేత / Food for thought " "జ్ఞానాన్ని పెంచే  సరైన విద్య, మనుషుల్ని ఆలోచించేలా చేస్తుంది. కానీ దానితో వచ్చే సందేహం మరియు ప్రశ్నించడం మూఢ నమ్మకంతో సహవాసం చేయలేవు. శోధించడం, విమర్శించడం శాస్త్రీయ పద్ధతి. అవి మూఢ నమ్మకాలలో లేవు. " -- గ్లింప్సెస్ ఆఫ్ వర్ల్ద్ హిస్టరీ, పండిట్ జవహర్లాల్ నెహ్రు (నవంబర్ 14, 1889 - 1964)

టిప్పణము

  మే 13, 2021 టిప్పణము  ( ṭippaṇamu )       అర్థము      (విశేష్యము):  టీక; తాత్పర్యం; టీకకి టీక; టీక అనగా అర్థ వివరణ      Meaning     (noun) : glossary; commentary on a commentary; explanatory notes or annotation        వాడుక / Usage        ఆరుద్ర రచన 'తెలంగాణ' కి శ్రీశ్రీ  టిప్పణము వ్రాస్తూ 'త్వమేహం' అని పేరు సూచించారు.     Sri Sri suggested the name 'Tvameham' while writing commentary on Arudra's book 'Telangana'.      మెదడుకు మేత / Food for thought " " వెతికే మజిలీ దొరికే దాకా కష్టాలు నష్టాలు ఎన్నొచ్చినా క్షణమైన నిన్నాపునా కట్టాలి నీలోని అన్వేషణా కన్నీటి పై వంతెనా బెదురంటు లేని మది ఎదురు తిరిగి అడిగేన బదులంటు లేని ప్రశ్న లేదు లోకాన నీ శొకమే శ్లోకమై పలికించరా మనిషీ తికమక మకతిక పరుగులు ఎటుకేసీ నడవరా నరవరా నలుగురితో కలిసీ" -- సిరివెన్నెల సీతారామ శాస్త్రి

ఆక్షేపణ

  మే 12, 2021 ఆక్షేపణ  ( ākshēpana )       అర్థము      (విశేష్యము):  అభ్యంతరము ;అసమ్మతి; ఇతరులు చేసిన పనిని విమర్శించడం     Meaning     (noun) : censure; criticism; raise objection        వాడుక / Usage        కో విడ్  టీకా ప్రతిపాదనలపై న్యాయస్థానాల జోక్యం పట్ల కేంద్ర ప్రభుత్వం ఆక్షేపణ తెలిపింది.     The central government raised objections over judicial interference in Covid vaccination policy.      మెదడుకు మేత / Food for thought " "ప్రచారం ప్రజలని మోసం చెయ్యదు. అది కేవలం వారిని వారు మోసం చేసుకోడానికి తోడ్పడుతుంది.  " -- అమెరికన్ తత్వవేత్త,  ఎరిక్ హోఫర్  (జులై 15, 1902 - 1983)

వశీకరణము

  మే 11, 2021 వశీకరణము  ( va ṣī-karanamu )       అర్థము      (విశేష్యము): మందు ఇచ్చి స్వాధీన పరుచుకోవడం; లోపరుచుకోవడం     Meaning     (noun) :  subduing; obtaining control over a person using charms or incantations        వాడుక / Usage         గతంలో ఇంతగా ఉపన్యాస వశీకరణ విద్య ప్రయోగించిన ప్రధానులెవరూ లేరు.     No PM in the past had cast such an overpowering charm with their oratory.      మెదడుకు మేత / Food for thought " "వరదొచ్చి మనుషుల మనసులు కడిగేసిందనుకుందామా? అబ్బే! నాకు నమ్మకం లేదు. స్నానం చేసిన వొంటికి తెల్లారేప్పటికి మళ్ళీ మట్టి పట్టినట్లు మనసుల్లో మళ్ళీ మలినం పేరుకుంటోంది. ఎన్ని వరదొలొచ్చినా మనిషి మనసు కడగలేకపోతోంది. " -- వరద, అమరావతి కథలు - సత్యం శంకరమంచి  (మార్చ్ 3, 1937 - 1987)

శీకరం

  మే 10, 2021 శీకరం  ( ṣī-karamu )       అర్థము      (విశేష్యము): తుంపర; చినుకు; ఏనుగు తొండం చివర పుట్టే మదం     Meaning     (noun) :  drizzle; spray; a drop of water; secretions of male elephants in musth        వాడుక / Usage         ఆమె విరహాగ్నిని ఆ శీకర పవనాలు కవ్వించాయి.     The spraying mist teased her pangs of separation from her lover.      మెదడుకు మేత / Food for thought " " ఓ తల్లీ! నేల తల్లీ! నువ్వెంత గొప్పదానివమ్మా? ఏడుపెరగనివాణ్ణి, ఈ బుడ్డాడి కోసం ఏడుస్తానేమోనని ఆణ్ణి ముందే తీసుకెళ్ళావా అమ్మా! లేకపోతే ఓరి  బుడ్డాడా, నీ అయ్య పోతే నువ్వేడుస్తావేమోరా! బతుకంతా ఏడుపెరక్కుండా  బతికిన ఏసోబుగాడు పోయాక ఎనక ఎవరూ ఏడవకూడదని ఆణ్ణిప్పుడే లాక్కెళ్ళావా తల్లీ! కానమ్మ! నాకేం దిగులు లేదు. కాన్తల్లీ! నే పోయాక మట్టి చేసేందుకు మడిసి లేకుండా పోయాడు. కొంచం ఆ సమయ మొచ్చినప్పుడు ..కొంచం ముందు చెప్తివా...నేనే గొయ్యి తీసుకు అందులో పడుంటాను. ఆ పైన నువ్వే మట్టి ...

ఔపోసన

  మే 07, 2021 ఔపోసన  ( auposana )       అర్థము      (క్రియ):  ఎదైన విషయం మీద సమగ్రమైన పట్టు ఉండడం; ఉపాసనలా ఒక విషయం మీద ఏకాగ్రత పెట్టడం      Meaning     (verb) :  having consummate understanding on a topic        వాడుక / Usage         ప్రేమ మనసులతో ఎలా ఆడుకుంటుందో ఆత్రేయ ఔపోసన పట్టారు.     Atreya had a virtuoso understanding of love and it's effects on heart.      మెదడుకు మేత / Food for thought " " మౌనమె నీ భాష ఓ మూగ మనసా తలపులు ఎన్నెన్నో కలలుగా కంటావు కల్లలు కాగానె కన్నీరౌతావు ఓ మూగ మనసా చీకటి గుహ నీవు చింతల చెలి నీవు నాటక రంగానివే మనసా తెగిన పతంగానివే ఎందుకు వలచేవో ఎందుకు వగచేవో ఎందుకు రగిలేవో ఏమై మిగిలేవో మౌనమే నీ భాష ఓ మూగ మనసా కోర్కెల సెల నీవు కూరిమి వల నీవు ఊహల ఉయ్యాలవే మనసా మాయల దెయ్యానివే లేనిది కోరేవు ఉన్నది వదిలేవు ఒక పొరపాటుకు యుగములు పొగిలేవు ఒక పొరపాటుకు యుగములు పొగిలేవు " -- ఆచార్య ఆత్రేయ  (మే 7, 1921 - 1989)

ఔపగ్రస్తికుడు

  మే 06, 2021 ఔపగ్రస్తికుడు  ( aupagrasthikudu )       అర్థము      (విశేష్యము): గ్రహణకాలంలో సూర్యుడు లేక చంద్రుడు; గ్రస్త అనగా తినబడినది     Meaning     (noun) :  sun or moon during an eclipse        వాడుక / Usage        చీకటి అలుముకొనడంతో  ఔపగ్రస్తికుడు అస్తమించాడనుకుని జయధ్రదుడు తల ఎత్తాడు.     Mistaking the darkness of eclipse to the sun setting Jayadratha raised his head.      మెదడుకు మేత / Food for thought " "ఆకలి ప్రాణాలని తీసేముందు ధైర్యాన్ని తినిపిస్తుంది. శాంతి సమృద్ధి పిరికి మనుషులని పుట్టిస్తాయి. ఆపద, ఓటమి, కష్టాలు మనిషికి మహత్తర బలాన్ని  ఇస్తాయి. " -- సిమ్బెలిన్ యాక్ట్ 3, సీన్ 6, షేక్స్పియర్  (ఏప్రిల్ 26, 1564 - 1616)

ఔర్వము

  మే 05, 2021 ఔర్వము  ( aurvamu )       అర్థము      (విశేష్యము): బడబాగ్ని; ఔర్వ మహర్షి తపస్సుచే పుట్టిన మహాగ్ని  - సముద్రంలో విడిచాడు      Meaning     (noun) :  devouring flame that burns under water; submarine fire        వాడుక / Usage         గుండెలో ఔర్వము  ఉన్నా దానిని సున్నితంగా అభినయించడం మంచి నటుల లక్షణం.     Expressing the burning torment of the heart subtly is the mark of a good actor.      మెదడుకు మేత / Food for thought " "దట్టమైన చీకటి ఎంత అలుముకున్నా   వెలుగు రేఖలపై కోటి తెరలున్నా    ఉదయించాలి సప్తాశ్వ రూఢుడు   వికసించాలి భ్రమర కుసుమాలు   ఘడియల భారం దుర్భరమైనా    కోల్పోలేదు నేను నా విశ్వాసాన్ని   బాధ మొగ్గాలి తల మొగ్గాలి తల   వ్యధ ఆగిపోవాలి కదా సమసిపోవాలి అలా   డస్సిపోయారు అందరూ, ఒంటరయ్యారు ఎందరో   కానీ, కానీ వస్తాయి మళ్ళీ తిరనాళ్ళు, మంచినాళ్ళు   సమిష్టిగా పోరాడాలి కలి...