Posts

Showing posts from March, 2022

వెకలి

  ఏప్రిల్ 01, 2022 వెకలి  ( vekali )       అర్థము      (విశేష్యము/విశేషణము ): మూర్ఖుడు; వెఱ్ఱి వాడు; మందబుద్ధి వాడు     Meaning     (noun/adj) :  fool; foolish person; dim witted    వాడుక / Usage       ప్రజలను మరింత వెకలిగా అవ్వాలని ముఖ్యమంత్రి ఉద్బోధించారు.      The Chief Minister called on people to become more foolish.     మెదడుకు మేత / Food for thought ఎవరా ప్రభువు? చెప్పుకోండి చూద్దాం తండ్రికొడుకు లొక్క తరుణిని రమియింప పుత్రు లిద్ద రొంది పోరు గలుగ నొకని జంపి రాజ్య మొకని కిచ్చిన ప్రభు వాతఁ డిచ్చు మనకు నఖిల సిరులు. --  నానార్థ గాంభీర్య చమత్కారిక

సద్దు

  మార్చి  31, 2022 సద్దు  ( saddu )       అర్థము      (విశేష్యము ): చప్పుడు; శబ్దము; రవళి; అలికిడి; క్రమముగా ఉంచడం     Meaning     (noun) :  sound; noise; disturbance; to arrange in order    వాడుక / Usage       ఎన్నికలు ముగియడంతో వివాదాలు సద్దు మణిగాయి.      Elections are over and the clamour over controversies has dissipated.     మెదడుకు మేత / Food for thought పతిదేవుని కై పడతియు పితగేహమునే మఱచును; పేరున కయినన్ సతినెడ మరులనుఁ జూపని పతిఁ జూచిన పడతి గుండె భగ్గున మండెన్ ! --  పతి జూచిన పడతి, సమస్యా పూరణం ( https://kandishankaraiah.blogspot.com/2011/07/401.html)

ఆణిపోటు

  మార్చి  30, 2022 ఆణిపోటు  ( āṇi-pōṭu )       అర్థము      (విశేష్యము ): చావుదెబ్బ; ఆయువుపట్టు పై పొడిచిన పోటు; లోతైన గాయం     Meaning     (noun) :  blow/cut/stab to the vitals; deep wound    వాడుక / Usage       మత రాజకీయాలు ప్రజాతంత్ర మనుగడపై  ఆణిపోటు పొడిచాయి.      Religious politics have driven a stake through the very essence of democracy.     మెదడుకు మేత / Food for thought ఉడుముండదె నూరేండ్లును బడియుండదె పేర్మి బాము పది నూరేండ్లున్ మడువున గొక్కెర యుండదె కడు నిల బురుషార్థపరుడు కావలె సుమతీ! ( ఈ ప్రపంచంలో పుట్టిన తరువాత మనిషి పురుషార్థాలైన ధర్మార్థకామమోక్షాలు సాధించటానికి తమ వంతు కృషి చేయాలి. అలా కృషిచేయనివాని బతుకు నిరర్థకం. ఉడుము వంద సంవత్సరాలు, పాము వెయ్యి సంవత్సరాలు, చెరువులో కొంగ చాలా కాలంబతుకుతున్నాయి. కాని ఆ బతుకువల్ల వాటికి ఏమి ప్రయోజనం కలుగుతోంది? పురుషార్థాలను సాధించనివాని జీవితం కూడా ఇటువంటిదే అవుతుంది.) -- సుమతీ శతకం, బద్దెన (~ 1260)

సద్మము

  మార్చి  29, 2022 సద్మము  ( sadmamu )       అర్థము      (విశేష్యము ): సదనము; ఇల్లు; గృహము; నీళ్లు     Meaning     (noun) :  dwelling; abode; house; water    వాడుక / Usage       సుదీర్ఘ ప్రయాణం తరువాత తన సద్మములో సేద తీరాడు.      After his long travels he rested in his house.     మెదడుకు మేత / Food for thought రాజు చేతి కత్తి రక్తంబు వర్షించు సుకవి చేతి కలము సుధలు కురియు అతడేల గలుగు యావత్ ప్రపంచంబు నీతడేల గలుగు ఇహము పరము -- గుఱ్ఱం జాషువా (సెప్టెంబర్ 28, 1895 - 1971)

ఓలాకు

  మార్చి  15, 2022 ఓలాకు  ( olāku )       అర్థము      (విశేష్యము ): బడలిక; శ్రమ చేయడంవల్ల వచ్చిన బలహీనత; ఆశక్తి; కలత;విచారం     Meaning     (noun) : fatigue; exhaustion; perturbation    వాడుక / Usage      ఓసి మనసా  ఓలాకు పడకే, ప్రియురాలి ఒడిలో ఓలలాడుదువులే.     O heart, worry not, you shall rock in the bosom of your beloved.     మెదడుకు మేత / Food for thought      బయటకు వెళ్లి ఆడుకుంటే నాకు వెంటనే ఆనందం కలుగుతుంది. కొంచం దూరం అలోచించి చుస్తే చదివి బడిలో బాగా ఉత్తిర్ణుడైతే ఇంకా ఎక్కువ ఆనందం వస్తుంది. కానీ ఇంకా సుదూరంగా ఆలోచిస్తే, నాకు తెలిసు వీటిలో ఏది మంచి తీపి గుర్తులు ఇస్తుందో.     -- కెల్విన్ అండ్ హాబ్స్, బిల్ వాటర్సన్

అనృతము

  మార్చి  14, 2022 అనృతము  ( a-nritamu )       అర్థము      (విశేష్యము ): కృషి; వ్యవసాయము; వాణిజ్యము; (విశేషణము): అసత్యము; అబద్ధము     Meaning     (noun) : agriculture; commerce; falsehood; deception; lie    వాడుక / Usage      సామాజిక మాధ్యమాల్లో చెలరేగే అనృతాల వలన దేశం ఛిన్నాభిన్నం అవుతోంది.      The falsehoods propagated on Social Media are dividing the country at its seams.     మెదడుకు మేత / Food for thought      ప్రస్తుత సమయంలో సత్యం ఎంత అస్పష్టంగా, మసి పూసినట్లు కనబడకుండా ని గూఢమై ఉందో, అసత్యం అంత రూఢీగా ఉంది. సత్యాన్ని అమితంగా ప్రేమిస్తే తప్ప దానిని కనుగొనలేము.     -- ఫ్రెంచ్ గణిత శాస్త్రవేత్త, తత్వవేత్త   బ్లేజ్  పాస్కల్  (జూన్ 19, 1623 - 1662)

కాదంబరి

  మార్చి  18, 2022 కాదంబరి  ( kādambari )       అర్థము      (విశేష్యము ): మద్యము; ఆడ కోయిల; బాణుడు రాసిన సంస్కృత కావ్యం; సరస్వతి     Meaning     (noun) : wine; female cuckoo; Sanskrit poem by Bana; Saraswathi    వాడుక / Usage       కాదంబరి పానంలో డోలలాడుతున్న సుగ్రీవుడు రామునికిచ్చిన మాట మర్చిపోయాడు.     Inebriated in wine, Sugreeva forgot the word he had given to Rama.     మెదడుకు మేత / Food for thought      నది నుంచి, కాలం అనేది లేదు అనే మర్మం తెలుసుకున్నావా? నది ప్రతీ చోట ఓకే సారిగా ఉంటుంది - ఉద్భవించే శిఖరాల్లో, సంగమించే సముద్రంలో, జలపాతాల్లో, మెల్లగ పారే తీరాల్లో, పడవ కింద జారే ప్రవాహంలో, వడి వడిగా తిరిగే సుడి గుండాల్లో - అన్నీ ప్రదేశాల్లో ఒకే వర్తమానంలో ఒక్క వర్తమానంలోనే ఉంది. నదికి గతించిన కాలపు ఛాయలు గానీ రాబోయే కాలం నీడలుగానీ ఉండవు. కేవలం వర్తమానమే.     -- జర్మన్ పుస్తకం - సిద్ధార్థ,  హెర్మన్ హెస్సే (జులై 2, 1877 - 1962)

తాలిమి

  మార్చి  17, 2022 తాలిమి  ( tālimi )       అర్థము      (విశేష్యము ): క్షమ; ఓర్పు; సహనం; శాంతము; ధైర్యం;      Meaning     (noun) : patience; gentleness; endurance; fortitude    వాడుక / Usage      ఎన్ని ఎడుదుడుకులు వచ్చిన తాలిమితో కూడిన చిరునవ్వు ఆమె మోము వదలలేదు.     Whatever the obstacles a patient smile of fortitude never deserted her.      మెదడుకు మేత / Food for thought     ఝంఝామారుతము నుండి బయట పడినప్పుడు, లోపలికి నడిచిన నీవు, బయటకు వేరే మనిషిగా వస్తావు. గాలివానలో ప్రయాణం అంటే అదే.      -- జాపనీస్ రచయిత హరూకి మురకామి

గమము

  మార్చి  16, 2022 గమము  ( gamamu )       అర్థము      (విశేష్యము ): ప్రయాణము; వెళ్లడం; పోక; దోవ/త్రోవ;     Meaning     (noun) : journey; going; path    వాడుక / Usage      ప్రస్తుత దేశ గమము మతమనే విషనాగుల సంకెళ్లలో ఉంది.     The country's path is engulfed in the poison of religion.     మెదడుకు మేత / Food for thought     ఎగర లేకపోతే పరిగెత్తు,     పరిగెత్త లేకపోతే నడు,      నడవలేకపోతే పాకు,     కానీ ఎలాగైనా సరే సాగిపోతూ ఉండు.     -- డా. మార్టిన్ లూథర్ కింగ్ (జనవరి 15, 1929 - 1968)

జాయా

  మార్చి  25, 2022 జాయా  ( jāy ā )       అర్థము      (విశేష్యము ): మరో జన్మ ఇచ్చేది (సంతానం ద్వారా); భార్య;       Meaning     (noun) : one who gives progeny; wife    వాడుక / Usage      అతడు జాయా సహితుడై ప్రేమయాత్రలకు వెళ్ళాడు.     He went on honeymoon with his wife.     మెదడుకు మేత / Food for thought      మాతా నాస్తి, పితా నాస్తి,  నాస్తి బంధు సహోదర,      అర్ధం నాస్తి గృహం నాస్తి, తస్మాత్ జాగృత, జాగృత     కామ క్రోధంచ లోభంచ దేహే తిష్టంతి తస్కరాః     ఙ్ఞాన రత్నాపహారాయ తస్మాత్ జాగృత జాగృత      ఆశయాబధ్ధతే లోకా  కర్మణా బహుచింతయా       అయుక్షీణం నజానాతి తస్మాత్ జాగృత జాగృత      జన్మ దుఃఖం జరా దుఃఖం జాయా దుఃఖం పునహ్పునః      సంసార సాగరం దుఃఖం తస్మాత్ జాగృత జాగృత     ( తల్లి, తండ్రి , బంధువులూ సహోదరులూ, ధనమూ, గృహమూ అసత...

మాతుల

  మార్చి  24, 2022 మాతుల  ( mātula )       అర్థము      (విశేష్యము ): మేనమామ లేక అతని భార్య; అత్త; ఉమ్మెత్త, దుత్తూరం;      Meaning     (noun) : maternal uncle's wife; dattura flower    వాడుక / Usage      దశరథుడు రామ పట్టాభిషేకం తలపెట్టినప్పుడు భరతుడు మాతుల గృహంలో ఉన్నాడు.     When Dasaratha decided on Rama's coronation, Bharatha was at his maternal uncle's home.      మెదడుకు మేత / Food for thought      ఈనాటికీ మన చుట్టూ ఎంతోమంది తమ పేరు మరచిపోయిన శారదలు ఉన్నారు. భర్త  ,  పిల్లలు  ,  సంసారం తప్ప వేరే లోకం తెలిదు. అలాటి ఓ పేరు మరచిపోయిన శారదల్లో నేనూ ఒకదాన్నే మూడేళ్ల క్రిందవరకు.. పిల్లలకోసం నెట్ పరిచయం చేసుకుని సరదాకి బ్లాగు మొదలెట్టాను కాని కొంత కాలానికి అది కూడా బోర్ కొట్టింది. అప్పట్లో అసలు నాకు ఏమిష్టమో నాకే తెలిదు. సంపెంగలు ఇష్టం. రఫీ ,  ఘంటసాల పాటలు ఇష్టం. వారపత్రికల్లో సీరియళ్లు,తెలుగు కథలు చదవడం ఇష్టం.  పిల్...

దద్ద

  మార్చి  23, 2022 దద్ద  ( dadda )       అర్థము      (విశేష్యము ): చిన్నాన్న; చిన్నయ్య; బాబాయి; పినతండ్రి; కక్కయ్య; తండ్రి సమానమైన వ్యక్తి     Meaning     (noun) : father's brother; uncle    వాడుక / Usage      అతని దద్ద కరణీకం చేసేవాడు.     His uncle worked as a Karanam (village revenue officer).     మెదడుకు మేత / Food for thought      దూరమెంతొ ఉందని దిగులు పడకు నేస్తమా      దరికి చేర్చు దారులు కూడా ఉన్నాయిగా      భారమెంతొ ఉందని బాధపడకు నేస్తమా      బాధవెంట నవ్వుల పంట ఉంటుందిగా      సాగరమధనం మొదలవగానే విషమేవచ్చింది      విసుగే చెందక కృషి చేస్తేనే అమృతమొచ్చింది.      అవరోధాల దీవుల్లొ ఆనంద నిధి ఉన్నది      కష్టాల వారధి దాటినవారికి సొంతమవుతుంది.      తెలుసుకొంటే సత్యమిది      తలచుకుంటే సాధ్యమిది     -- నా ఆటోగ్రాఫ...

సంకుమదము

  మార్చి  11, 2022 సంకుమదము  ( sanku-madamu )       అర్థము      (విశేష్యము ): సంకు=జవ్వాజి/పునుగు పిల్లి; మదము=కస్తూరి, రేతస్సు; సుగంధ ద్రవ్యం     Meaning     (noun) : civet; musk    వాడుక / Usage      రాస కేళిలో కలిగిన చెమటల పరిమళానికి సంకుమద సుగంధం తోడయ్యింది.     The musk added to the scent of sweat from ardent love making.     మెదడుకు మేత / Food for thought      జగడపు చనువుల జాజర      సగినల మంచపు జాజర ||     మొల్లలు తురుముల ముడిచిన బరువున     మొల్లపు సరసపు మురిపెమున |     జల్లన పుప్పొడి జారగ పతిపై చల్లే పతిపై     చల్లే రతివలు జాజర ||     భారపు కుచముల పైపై కడు సిం-     గారము నెరపేటి గంధవొడి |     చేరువ పతిపై చిందగ పడతులు     సారెకు చల్లేరు జాజర ||      బింకపు కూటమి పెనగేటి చెమటల     ప...

జామాత

   మార్చి  22, 2022 జామాత  ( jāmāta )       అర్థము      (విశేష్యము ): అల్లుడు (సంబంధం అల్లు వాడు); కుమార్తె యొక్క భర్త;      Meaning     (noun) : son-in-law    వాడుక / Usage      వరవిక్రయం నాటకంలో జామాత అంటే మావగారికి తాళి కట్టని మొగుడు అని హేళన చేసారు.     Son-in-law has been described as the husband(oppressor) sans knot.     మెదడుకు మేత / Food for thought      చక్కర కలిపిన తియ్యని కమ్మని తోడు పెరుగు తెలుగు,      చక్కని పలుకుల సొబగుల నడకల హంస హోయల బెడగు      నన్నయ తిక్కన ఎర్రన పితికిన ఆవు పాల పొదుగు      చదువుల తల్లికి సుమధుర శైలికి పుట్టినిల్లు తెలుగు      మన అక్షరాల తీరు మల్లెపాదు కుదురు      మన భాష పాల కడలి భావం మధు మురళి      అజంత పదముల అలంకృతం మన భాష అమృత జనితం     భారత భాష భారతి నుదుట తెలుగు భాష తిలకం     -- జొన్నవిత్తుల రా...

బింకము

  మార్చి  10, 2022 బింకము  ( binkamu )       అర్థము      (విశేష్యము ): బిగువు; బెట్టు; గర్వము; నిక్కు     Meaning     (noun) : tight; tightness; stiffness; pride; arrogance    వాడుక / Usage      ప్రియ సఖుడిని గాలి కూడా దూరనంత   బింకపు కౌగిలింతలో బంధించింది.     She wrapped herself around her beloved tightly, so even air couldn't enter.      మెదడుకు మేత / Food for thought      ఏం? ఏం లేదని?      మనం చూడాలి గానీ      ఊపిరి లేదా ఊహలు లేవా?      నీకోసం నువ్వే లేవా?      చీకటికి రంగులేసే కలలెన్నో      నీ తోడై వస్తుండగా      ఒంటరిగా లేవని      ఆశకి కూడా ఆశని కలిగించేయ్!      ఆయువనేది ఉండేవరకూ      ఇంకేదో లేదని అనకు!      ఒక్కో క్షణమూ ఈ బ్రతుకూ కొత్తదే నీకు!      ఒక లైఫ్ ఒకటంటె ఒకటె ...

కుచము

  మార్చి  09, 2022 కుచము  ( kuchamu )       అర్థము      (విశేష్యము ):  వక్షోజము; పాలిండ్లు; స్తనము     Meaning     (noun) : woman's breast    వాడుక / Usage       పరమానందయ్యగారి శిష్యుల చిత్రంలో రాజనర్తకి కుచములలో రాజుకి శివలింగం కనపడింది.     The king visualized  Lord Shiva in the breasts of the courtesan.      మెదడుకు మేత / Food for thought     బ్రహ్మ సత్యం జగన్మిథ్య  ఆత్మ జ్ఞానం చిదానందం     కర్మ ఫలము చేదు విషము  కడగకుంటే జన్మ నిత్యం     అంతుచిక్కని బాధ తధ్యమయా  అంతుచిక్కని బాధ తధ్యమయా     విషయ వాసనలు ప్రమాదం  కీర్తి కండూతూ విషాదం     వ్యాపారమ్ములు అపాయమ్ములు ఉపాధి ఇడుములు     భిక్షేపమ్ములు ధనమే ధనమని భావాలేందుకట     మనము ఘనమను జీవాలెందుకుట      అంతుచిక్కని బాధ తధ్యమయా     వస్తూ తెచ్చేది ఏదీ లేదు పోతూ కొనిపోయేదేదీ లేదు     నడిమి...

తురుము

  మార్చి  08, 2022 తురుము  ( turumu )       అర్థము      (విశేష్యము ): కొప్పు; పొడుము; (క్రియ) : కొప్పులో పూలు పెట్టుకోవడం; చెక్కడం     Meaning     (noun) : coiffure; powder/dust; (verb) : grate/pound; deck flowers in hair    వాడుక / Usage       నువు పంపిన జాబుల పూలు నా సిగలో జాజులుగా తురమనా !     Your letters sweet as flowers, bedeck shall I in my hair!     మెదడుకు మేత / Food for thought      సిగలో అవి విరులో అగరు పొగలో అత్తరులో     మగువ సిగ్గు దొంతరలో మసలే వలపు తొలకరులో      ఎదుట నా ఎదుట ఏవో సోయగాల మాలికలు      మదిలోన గదిలోన మత్తిలిన కొత్త కోరికలు      నిలువనీవు నా తలపులు మరీ మరీ ప్రియా ప్రియా      నిలువనీవు నా తలపులు నీ కనుల ఆ పిలుపులు      జరిగి ఇటు ఒరిగి పరవశాన ఇటులే కరిగి      చిరునవ్వుల అరవిడిన చిగురాకు పెదవుల మరిగి      మరలి రాలేవు నా...

సకిన

  మార్చి  07, 2022 సకిన  ( sakina )       అర్థము      (విశేష్యము ): సగిన; కీచు బిళ్ళ; కీచుమనే ధ్వని; కృత్రిమ పక్షి/బొమ్మ     Meaning     (noun) :  squeak( of a toy); figure of a bird; chirping noise    వాడుక / Usage        వూగుతున్న సకిన మంచం ఊసులాటే సద్దు.      The creaking cot squeaked in chatter.     మెదడుకు మేత / Food for thought      ఓ…. మనసులోని మనసా…ఆ…ఆ      ఏమిటే నీ రభస      ఏమిటే నీ రభస నా మనసులోని మనసా      ఇల్లలికిన పండుగనటే ఒళ్ళు తెలిసి మెలగరటే      పాలు గాచి చేజేతుల ఒలకబోసుకుందురటే, ఏమిటే      హద్దు పద్దు లేకుండా పెద్దలతో ఆటలటే      శాణతనము చాలింపుము జాణవులే నెరజాణవులే, ఏమిటే     -- పెళ్లి చేసి చూడు, పింగళి నాగేంద్ర రావు (డిసెంబర్ 29, 1901 - 1971)

శ్యాలుడు

  మార్చి  21, 2022 శ్యాలుడు  ( syāluḍu )       అర్థము      (విశేష్యము ):  భార్యతోడబుట్టినవాడు ; కుంబిలుడు; బావ     Meaning     (noun) :  wife's brother    వాడుక / Usage       పాండవుల తమ శ్యాలుడైన   దృష్టద్యుమ్నుడిని సర్వసైన్యాధిపతి చేసారు.      Pandavas anointed their brother in law Dhrustadyumna as Commander in Chief.     మెదడుకు మేత / Food for thought నిధి చాల సుఖమా రాముని స న్నిధి సేవ సుఖమా నిజముగ బల్కు మనసా దధి నవనీత క్షీరములు రుచో దాశరథీ ధ్యానభజన సుధారసము రుచో శమ దమ మను గంగాస్నానము సుఖమో క ర్దమ దుర్విషయ కూపస్నానము సుఖమో మమత బంధనయుత నరస్తుతి సుఖమా సుమతి త్యాగరాజ నుతుని కీర్తన సుఖమో (ఓ మనసా! నిజాయితీగా చెప్పు. రాముని సన్నిధిలో పనిచేయుఘ సుఖము కానీ, భౌతిక సంపద లేదా ప్రభువు దర్శనం వలన వచ్చిన సంపద అసలు సుఖము కాదు. ఇది నిజము. దశరథ తనయుని ధ్యానించుట అమృత పానం వంటిది. పాలు, పెరుగు, నెయ్యి మొదలైన పదార్థాల సేవనం అసలు పనికిరావు. తన ఇంద్రియాలను నియంత్ర...

ఆణి

  మార్చి  28, 2022 ఆణి  ( āṇi )       అర్థము      (విశేష్యము ): ముత్యపు గుండ్రతనం; మర్మము; అంచు; ఎల్ల; చీల     Meaning     (noun) :  spherical (pearl); secret; vital part; linchpin; edge; border    వాడుక / Usage       బండి చక్రం యొక్క ఆణి పడిపోగా బండి పక్కకి దొర్లిపోయింది.      The linchpin of the cart wheel came off and it rolled over.     మెదడుకు మేత / Food for thought అలివెనీ ఆణిముత్యమా నీ కంట నీటిముత్యమా ఆవిరి చిగురో ఇది ఊపిరి కబురో స్వాతివాన లేత ఎండలో ఓ ఓ జాలి నవ్వూ ఊ ఊ జాజి దండాలు కుదురైన బొమ్మకీ కులుకు మల్లె రెమ్మకీ నుదుట ముద్దు పెట్టనా ఆ ఆ బొట్టుగ వద్దంటే ఒట్టుగ అందాల అమ్మకీ కుందనాల కొమ్మకీ అడుగు మాడుగులొత్తనా ఆ ఆ మెత్తగా అవునంటే తప్పుగ పొగరులేని ప్రేమకీ పొన్న చెట్టు నీడకీ పొగడ దండలల్లుకొనా ఆ ఆ పూజ గా పులకింతగల పూజ గా తొలిరెమ్మల నోముకీ దొర నవ్వుల సామికీ చెలి మై నేనుండి పోనా ఆ ఆ చల్లగా మరుమల్లెలు చల్లగా అలివెనీ ఆణిముత్యమా నీ కంట నీటిముత్యమా జాబిలి చలు...