Posts

Showing posts from April, 2022

విలోమము

  ఏప్రిల్ 29, 2022 విలోమము  ( vilomamu )       అర్థము      (విశేష్యము/విశేషణము ): క్రమమునకు తలక్రిందైనది; అవరోహణ; కుక్క; పాము;      Meaning     (noun/adj) :  reverse; inversely; dog; snake    వాడుక / Usage       రెండు శరీరాల మధ్య గురుత్వాకర్షణ శక్తిని వాటి దూరం యొక్క విలోమ చతురస్రంగా మారుతుంది.     The gravitational force between two objects varies inversely to the square of their distance.     మెదడుకు మేత / Food for thought       క మనీయ భూమి భా గములు లేకున్నవే ;   ప డియుండుటకు దూది  ప ణుపు లేల ?     స హజంబులగు కరాం జ లులు లేకున్నవే ;   భో జనభాజన  పుం జ మేల ?      వ ల్కలాజినకుశా వ ళులు లేకున్నవే ;   క ట్ట దుకూల సం ఘం బు లేల ?      కొ నకొని వసియింప  గు హలు లేకున్నవే ;   ప్రా సాదసౌధాది  ప టల మేల ?     ( పడుకోడానికి  చక్కటి నేల ఉండగా, దూది పరుపు లెందుకు ? పు...

ప్రమేయము

  ఏప్రిల్ 28, 2022 ప్రమేయము  ( pra-mēyamu )       అర్థము      (విశేష్యము ): సంబంధము; జోక్యం; యథార్థముగా తెలుసుకోదగినది; నిరూపించడానికి వీలయినది; రాసుల మధ్య సంబంధం     Meaning     (noun) :  that which can be known; subject; theorem; proposition; function (math)    వాడుక / Usage      పైథాగరస్ ప్రమేయం పైథాగరస్ కన్నా ముందు ఇతర ప్రాచీన సంస్కృతులకు తెలిసిన ఆధారాలు ఉన్నాయి.      There is evidence that Pythagoras theorem was known by other ancient cultures.     మెదడుకు మేత / Food for thought          కడగి వట్టి యాస కడతేరనివ్వదు     యిడుములందు బెట్టి యీడ్చుగాని     పుడమి జనుల భక్తి పొడమంగనియ్యదు     విశ్వదాభిరామ వినురవేమ     ( అతిశయించిన ఆశ వల్ల ఎటువంటి ప్రయోజనం లేదు. పైగా అది నువ్వనుకున్న దానిని నెరవేరనివ్వదు. అంతేకాదు నిన్ను కష్టాలపాలు చేస్తుంది. అట్లా కష్టాల్లో ఉన్నప్పుడు నిన్ను అటు లా...

కలన

  ఏప్రిల్ 27, 2022 కలన  ( kalana )       అర్థము      (విశేష్యము ): తెలుసుకోవడం; పొందడం; జ్ఞానము; లెక్క పెట్టడం; చేయడం     Meaning     (noun) :  comprehension; doing; making; counting; knowing    వాడుక / Usage      ష్రెక్ సినిమాలో కలన గణితం ఆధారంగా అతి సహజమైన కవళికలు సృష్టించారు.      The highly natural expressions in Shrek were produced using calculus.     మెదడుకు మేత / Food for thought       అప్పు చేసి పప్పు కూడు తినరా ఓ నరుడా      గొప్ప నీతి వాక్యమిది వినరా పామరుడా      దొంగతనము తప్పురా దోపిడీలు ముప్పురా      అందినంత అప్పు చేసి మీసం మెలి తిప్పరా      ఉన్నవారు లేనివారు రెండే రెండు జాతులురా      ఉన్నచోట తెచ్చుకొనుట లేనివారి హక్కురా      వేలిముద్ర వేయరా సంతకాలు చేయరా      అంతగాను కోర్టుకెళితే ఐపీ బాంబుందిరా      రూపాయే దైవమురా రూపా...

అవధి

  ఏప్రిల్ 26, 2022 అవధి  ( avadhi )       అర్థము      (విశేష్యము ): మేర; హద్దు; కొన; గడువు; కాలము; అవధానం; రంధ్రము; శ్రమ; కష్టం     Meaning     (noun) :  boundary; limit; period; time; hole; calamity    వాడుక / Usage       ఆమె బాల్యం అనేక అవధుల పాలయ్యింది.      Her childhood was riddled with hardships.     మెదడుకు మేత / Food for thought      ధనలక్ష్మిని అదుపులోన పెట్టినవాడే        గుణవంతుడు బలవంతుడు భగవంతుడురా      ధనమేరా అన్నిటికి మూలం..      ఉన్ననాడు తెలివికలిగి పొదుపుచేయరా లేనినాడు ఒడలు వంచి కూడబెట్టరా      కొండలైన కరిగిపోవు కూర్చుని తింటే      హయ్యో కూలి పోవు కాపురాలు ఇది తెలియకుంటే..     -- లక్ష్మీనివాసం, ఆరుద్ర (ఆగష్టు 31, 1925 - 1998)

ఊర్ధ్వము

  ఏప్రిల్ 25, 2022 ఊర్ధ్వము  ( ūrdhvamu )       అర్థము      (విశేషణము ): మీద ఉన్నది; ఎత్తబడినది; పొడవైనది; ఆకాశము;  దిక్చక్రమునకు లంబముగా పై నున్నది     Meaning     (adj) :  above; high; elevation; erect    వాడుక / Usage       160కిమీ దూరం నుంచి త్రికోణమితిలోని ఊర్ధ్వ కోణం వాడి ఎవరెస్ట్ యొక్క ఎత్తు కనుగొన్నారు.      From a distance of 160 km, using angle of elevation, Everest's height was calculated.     మెదడుకు మేత / Food for thought    మాతా నిందతి నాభినందతి పితా భ్రాతా న సంభాషతే!      భృత్యః కుప్యతి నానుగచ్ఛతి సుతాః కాంతాపి నాలింగ్యతే!      అర్థప్రార్థనశంకయా న కురుతే సల్లాపమాత్రం సుహృత్!     తస్మాదర్థముపార్జయ  శ్రుణు సఖే హ్యర్థేన సర్వే వశాః!!     ( ధన సంపాధన లేనివాడిని   తల్లి తిడుతుంది. తండ్రి కూడా సంతోషించడు. అన్నదమ్ములు మాట్లాడరు. నౌకర్లు కూడా కోపగించుకుంటారు. కొడుకు వెంటరాడ...

పరితోషము

  ఏప్రిల్ 22, 2022 పరితోషము  ( pari-tōshamu )       అర్థము      (విశేష్యము ): మిక్కిలి సంతోషము; తృప్తి; హర్షము; వేడుక      Meaning     (noun) :  pleasure; satisfaction; great joy    వాడుక / Usage       ' జయ దిశాంత గత శకుంత దివ్య గాన పరితోషణ .'      Hail! the joyfully divine song of birds in all directions.     మెదడుకు మేత / Food for thought   నేలమ్మ నేలమ్మ నేలమ్మ       నీకు వేల వేల వందనాలమ్మా      సాలేటి వానకి తుల్లింతా       ఇంకా సాలు సాలుకి నువ్వు బాలింతా      గాలినే  ఉయ్యాలగా       నీళ్లనే  చనుబాలుగా       పక్కల్ల బొక్కల్ల రెక్కల్ల నువ్వు      సక్కంగా మోసేవు మొక్కల్లా      పరువమోచ్చి సేను వంగే       పైరు కాపు మేను  పొంగే         పంట బి...

సౌరభము

  ఏప్రిల్ 21, 2022 సౌరభము  ( saurabhamu )       అర్థము      (విశేష్యము ): వాసన; పరిమళము; తావి; కుంకుమ; స్నేహము; ఎద్దు     Meaning     (noun) :  odour; fragrance; saffron; friendship; bull    వాడుక / Usage       ' సంగీత సౌరభము ' శ్రీపాద పినాకపాణి రచించిన విశిష్టమైన సంగీతరచన.      The great musicologist Sripada Pinakapani authored 'Fragrance of Music'.     మెదడుకు మేత / Food for thought    అతనెప్పుడూ అంతే      ఒంటరిగా రమ్మంటే వసంతాన్ని వెంటతెస్తాడు.      ఆరుబయట ఆకుల నిశ్శబ్దంలో      చెట్లు కవాతు చేస్తున్నాయి      ఆ సెలయేటి నీళ్ళలో      ఆకాశచిత్రం ఘనీభవించింది      చుక్కలు కరిగి రాలుతున్న దృశ్యం      లీలగా గుర్తుంది.      వద్దు..     నాకు వెన్నెలా వద్దు ,పున్నమీ వద్దు      సూర్యుడొక్కడే చాలు      అతన...

దోనె

  ఏప్రిల్ 20, 2022 దోనె  ( dōne )       అర్థము      (విశేష్యము ): చిన్న పడవ; కాలువ తూము; ఆకులతో (తాటి మాను) కుట్టిన దొప్ప; నీటి తొట్టె     Meaning     (noun) :  small boat; hollowed out palm trunk as trough; a sluice    వాడుక / Usage       ఆ ఊరు చేరాలంటే వడిగా వెళ్లే కాలవని దోనె మీద దాటాలి.      The only way to reach the village was to cross the swirling waters on a small boat.     మెదడుకు మేత / Food for thought    తను శవమై      ఒకరికి వశమై      తనువు పుండై      ఒకడికి పండై      ఎప్పుడూ ఎడారై     ఎందరికో ఒయాసిస్సై     -- వేశ్య, ఆలిశెట్టి ప్రభాకర్ (జనవరి 12, 1956 - 1993)

వెరపు

  ఏప్రిల్ 19, 2022 వెరపు  ( verapu )       అర్థము      (విశేష్యము ):  వెఱపు;  భయము; ఆశ్చర్యము; ప్రకటించు; వెల్లడించు     Meaning     (noun) :  fear; dread; surprise; announce; reveal    వాడుక / Usage       ప్రభుత్వాన్ని విమర్శించడానికి వెఱపు పడి పత్రికలు స్వాతంత్ర్యాన్ని కోల్పోయాయి.      Afraid of criticising the government, newspapers have lost their independence.     మెదడుకు మేత / Food for thought    ఈ నా ధరిత్రీ వదనాన్ని వికృతం చేసే      భరతజాతి మనుగడను కకావిలు చేసే      అవివేకులు స్వార్థపరులు అసంతృప్తి మతపిచ్చితో      తమని తాము బంధించుకొన్న సూత్రాలలోంచి      మూఢ నమ్మకాల లోంచి     బయటపడలేని నిస్సహాయ జీవులు     -- ఎల్లోరా (పత్రికా సంపాదకులు, పరిశోధకులు, అభ్యుదయవాది)

కాహళి

  ఏప్రిల్ 18, 2022 కాహళి  ( kāhaḷi )       అర్థము      (విశేష్యము ): ఒక వాద్యము; బూరకొమ్ము; సింగినాదం; యువతి;      Meaning     (noun) :  clarion, bugle, horn, trumpet; young lady    వాడుక / Usage       ప్రతీ సంఘానికి  కాలానికి అనుగుణంగా నవయుగ కాహళి పూరించే సంస్కర్తలు కావాలి.      Every society needs the bugle of a reformer for the new era.     మెదడుకు మేత / Food for thought    మతమన్నది నా కంటికి మసకైతే      మతమన్నది నీ మనసుకు మచ్చైతే      మతం వద్దు గితం వద్దు      మాయా మర్మం వద్దు      ద్వేషాలు, రోషాలు తెచ్చేదే మతమైతే      కలహాలు కక్షలు కలిగించేదే మతమైతే      మతం వద్దు గతం వద్దు     మారణహోమం వద్దు      -- దేవులపల్లి కృష్ణ శాస్త్రి (నవంబర్ 01, 1897 - 1980)

కుతర్కము

  ఏప్రిల్ 15, 2022 కుతర్కము  ( ku-tarkamu )       అర్థము      (విశేష్యము ): తర్కము=వాదము/ఊహ/కారణము/హేతువు; కు=చెడు;  సహేతుకం కాని వాదం     Meaning     (noun) :  false logic; doubtful/incorrect reasoning; fallacy    వాడుక / Usage       వాట్సాప్ సమూహాలలో ఎన్నో  కుతర్కమైన టపాలు, వాదనలు.     WhatsApp groups have many posts and debates based on false logic/reasoning.     మెదడుకు మేత / Food for thought    నా కవితావధూటి వదనంబు నెగాదిగ జూచి రూప రే      ఖా కమనీయ వైఖరులు గాంచి 'భళిభళి'! యన్నవాడె మీ      దే కులమన్న ప్రశ్న వెలయించి చివాలున లేచిపోవుచో      బాకున గ్రుమ్మినట్లగును పార్థివచంద్ర! వచింప సిగ్గగున్     ( 1933-34 సం ల ప్రాంతంలో ఒకనాడు జాషువా వెంకటగిరి రాజైన యాచేంద్రభూపతిని సందర్శించటానికి రైల్లో వెళ్తున్నాడు. రైల్లో పరిచయమైన వ్యక్తి జాషువా కవి అని తెలుసుకొని అయన కవితలు విని ఎంతో సంతోషించాడు. జాషువా...

క్షుద్రుడు

  ఏప్రిల్ 14, 2022 క్షుద్రుడు  ( kshudruḍu )       అర్థము      (విశేష్యము/విశేషణము ): అధముడు; లోభి; హింస చేసేవాడు; పనికిరాని వాడు; నీచుడు     Meaning     (noun/adj) :  mean/vile person; cruel    వాడుక / Usage       తన క్షుద్ర శక్తితో మాయల మరాఠి బాలనాగమ్మను కుక్కగా మార్చాడు.      With his vile powers the wizard turned Bala Nagamma into a dog.     మెదడుకు మేత / Food for thought    ఒకనాడీ భువి సకలము స్వర్గము సుకముల సొగసుల సునారామము      వికచ విభాత శుభముల దామము ప్రకట యశోవిలసితము స్వతంత్రము      కులముల మతముల కూడని ఈసుల అలసత కృపణత అలమిన మనసుల     ఖల పరపన్నగ గాడ విషానలా విలమై, ఖలమై అలమెను దాస్యము     --దేవులపల్లి కృష్ణ శాస్త్రి (నవంబర్ 01, 1897 - 1980)

నిండారు

  ఏప్రిల్ 13, 2022 నిండారు  ( ninḍ-āru )       అర్థము      (విశేష్యము/క్రియ ): నిండు; వ్యాపించు; పరిపూర్ణం; అతిశయించు     Meaning     (noun/verb) :  to be full; fill; completion; complete    వాడుక / Usage       మన మదిలో గడియ గడియకి మత దుర్మదాంధం నిండారు తోంది.      Our minds are being filled with religious bigotry every moment.     మెదడుకు మేత / Food for thought    నిజంగానే నిజంగానే      నిండుహర్షం వహిస్త్తుందా!     మానవాళికి నిజంగానే     మంచికాలం రహిస్తుందా!      లేదు సుఖం లేదు సుఖం      లేదు సుఖం జగత్తులో      బ్రతుకు వృధా! చదువు వృధా!      కవిత వృధా! వృధా! వృధా!     -- శ్రీశ్రీ  (ఏప్రిల్ 30, 1910 - 1983)

పరితాపము

  ఏప్రిల్ 12, 2022 పరితాపము  ( pari-tāpamu )       అర్థము      (విశేష్యము ): సంతాపం; భయం; కంపనం; జ్వరము     Meaning     (noun) :  pain; sorrow; affliction; fever; trembling    వాడుక / Usage       ప్రియురాలి ఎడబాటుతో  పరితపించి  యక్షుని శరీరం శుష్కించినది.      Afflicted by the separation from his lover he was enervated.     మెదడుకు మేత / Food for thought    అద్భుత చారిత్రక ఘట్టాల లోన      ఆస్థికులు నాస్తికులు మతాలు సిద్ధాంతాలు      మనష్యుల్ని మరచి పరమ సత్యాలను తరచి పైకి తీసే      ఆవేశపు మధ్యాన్నపు ఎండలలోన      నాలుగు రోడ్ల కూడలిలో నిలబడి      సౌఖ్య నగరానికి దారి తెలియక      సైను పోస్టు మీద మిధ్యాలిపి డిసైఫర్ చెయ్యలేక      జిగీషువుల జిజ్ఞాసవుల ముఖాలు వెల వెల బోతున్న సమయాన      అతగాడు ఒక్కడూ ఊపిరాడని గదిలో ఉరి పోసుకుని చని పోయాడ...

చిరుత

  ఏప్రిల్ 11, 2022 చిరుత  ( chiruta )       అర్థము      (విశేష్యము ): చిన్న; అల్పము; చిన్నది; శిశువు; చిన్న జాతి పులి     Meaning     (noun) :  small; trifling; child (hood); young; cheetah/leopard    వాడుక / Usage       చిరుత ప్రాయం నుండే కోనేరు హంపికి చదరంగం మీద మక్కువ కలిగింది.       From a young age Koneru Hampi had a keen interest in Chess.     మెదడుకు మేత / Food for thought    వేయి తోటలను నరికిన చేయి      పూయిస్తుందా ఒక్క పువ్వును      ఉర్వీతలాన్ని వణికించిన శక్తి      ఒక్క హృదయాన్ని జయిస్తుందా...      మనసుకు తొడుగు మనిషి      మనిషికి ఉడుపు జగతి      ఇదే విశ్వంభరా తత్వం     ఇదే అనంత జీవిత సత్యం....     -- విశ్వంభర, డా. సి. నారాయణ రెడ్డి (జులై 29, 1931 - 2017)

నీరాజనం

  ఏప్రిల్ 08, 2022 నీరాజనం  ( nīrājanamu )       అర్థము      (విశేష్యము ): హారతి; నివాళి; పూజ     Meaning     (noun) :  homage; lighting a lamp or camphor to an idol/person     వాడుక / Usage       తెలుగు భాషకు వేటూరి పాటలు నీరాజనం .      Veturi's songs are an offering to Telugu.     మెదడుకు మేత / Food for thought   మానవ జన్మ యొక్క మర్మం కేవలం జీవించడంలో లేదు. దేనికోసమైనా బ్రతకడంలో ఉంది. నరకం అంటే ఏమిటి? ప్రేమించ లేకపోవడమే. -- ఫ్యోడోర్  దస్తయేవస్కీ (నవంబర్ 11, 1821 - 1881)

కడిమి

  ఏప్రిల్ 07, 2022 కడిమి  ( kaḍimi )       అర్థము      (విశేష్యము ): అతిశయము; మిక్కిలి; ఆధిక్యం; బలము; పరాక్రమము; కదంబ వృక్షం     Meaning     (noun) :  excess; vast; great; bravery; a flowering tree     వాడుక / Usage       " ఈ ఎడారి దారులలో ఎడద నేను పరిచానని కడిమి వోలె నిలిచానని"      In these barren paths I bared my heart, and stood like the Kadamba tree.     మెదడుకు మేత / Food for thought   వాక్ స్వాతంత్రం అంటే ఏమిటి? ఖండించే, అవతల వాళ్ళు నొచ్చుకున్నా సరే, హక్కు లేనప్పుడు వాక్స్వాతంత్రానికి అర్ధం లేదు. నొచ్చుకోకుండా ఉండే హక్కు ఎవ్వరికీ లేదు. నువ్వు నొచ్చుకుంటే అది నీ సమస్య. 600 పేజీల పుస్తకం చదివి అది నన్ను గాయపరిచింది అన్నావంటే, నొచ్చుకోవడానికి చాలా కష్టపడ్డావు అన్నమాట. -- సల్మాన్  రష్దీ

లోగిలి

  ఏప్రిల్ 06, 2022 లోగిలి  ( logili )       అర్థము      (విశేష్యము ): ఇంటి లోపల భాగము; గృహము; ఇక్క; ఇల్లు     Meaning     (noun) :  interior of a house; home; dwelling    వాడుక / Usage       మన లోగిలిలో నీ కౌగిలిలో రసాడోలలలో తేలియాడనా!      In our house, locked in your embrace, wafting am I in Cupid's ambrosia!     మెదడుకు మేత / Food for thought     ముసలితనం వచ్చింది కాబట్టి  మనుషులు   కలలు సాకారం చేసుకునే ప్రయత్నం మానేస్తారు అనుకోడం తప్పు. కలల సాఫల్యం కోసం పరుగులు తీయడం మానడం వల్లే ముసలివాళ్ళు అవుతారు. --  గాబ్రియెల్ గార్షియా మార్కెజ్  (మార్చ్ 06, 1927 - 2014)

నెనరు

  ఏప్రిల్ 05, 2022 నెనరు  ( nenaru )       అర్థము      (విశేష్యము ): ప్రేమ; ఆప్యాయత; స్నేహము; అనురక్తి; కృతజ్ఞత      Meaning     (noun) :  affection; love; gratitude    వాడుక / Usage       ఎందరో మహానుభావులు అందరికీ నెనరులు .      To all those great souls much love and gratitude.     మెదడుకు మేత / Food for thought కొన్నిసార్లు మనుషులు నిజం వినడానికి ఇష్టపడరు. ఎందుకంటే వాళ్ళ భ్రమలు బద్దలవ్వడం ఎవ్వరికీ ఇష్టం ఉండదు గనుక. --  ఫ్రెడెరిక్ నీషె  (అక్టోబర్ 15, 1844 - 1900)