Posts

Showing posts from May, 2023

స్తబ్ధము

  జూన్ 01, 2023 స్తబ్ధము      ( stabdhamu )       అర్థము      (విశేషణము ): స్తంభించి; నిస్చేష్టితమై; బిగుసుకుపోయి; కదలికలేనిది     Meaning     (adj) : paralysed; motionless; stiff    వాడుక / Usage అందరూ ఆ మాటలకి స్తబ్ధులై పోయారు. మొదట కమలే మాట్లాడింది .    Everyone were taken aback by those words. It was Kamala who spoke first.     మెదడుకు మేత / Food for thought వేంకటేశ్వరుండు ,  బీబి నాంచారమ్మ బెండ్లియాడి మతమభేదమనియె హరి ,  ప్రమాణమైన వ్యర్థవాదాలేల ? పాపసాబు మాట పైడిమూట -- ' పాపసాబు ' శతకం, తక్కలపల్లి పాపాసాహెబ్‌

ప్రయోక్త

  మే 31, 2023 ప్రయోక్త      ( prayoktha )       అర్థము      (విశేషణము ): ప్రయోగించువాడు; ప్రేరకుడు; చోదకుడు     Meaning     (noun) : one who does/discharges/prompts/instigates;     వాడుక / Usage ఏం? ఒక ఆడదానితో నటుడికి, పది నాటకాల ప్రయోక్తకీ పరిచయముంటే తప్పా? .    Why?What is wrong if an actor, the producer of ten plays, is close to a woman?     మెదడుకు మేత / Food for thought ఇంగిలీసు బాస ఎంతగ నేర్చిన పాండితీ ప్రకర్ష పట్టుబడదు పరులభాష గాన భాధను గూర్చును గురుని మాట యశము గూర్చు బాట దేశ భాషలెల్ల దీక్ష వహించి నీ వభ్యసించ వలయు నర్భకుండ మాతృ భాష నేర్చి మర్యాదలందుమా గురుని మాట యశము గూర్చు బాట -- 'గురుని మాట' శతకం, షేక్‌ అలీ

దస్కం

  మే 30, 2023 దస్కం      ( daskam )       అర్థము      (విశేష్యము ): డబ్బు; పది రూపాయిలు; దశ=పది నుండి     Meaning     (noun) : money; ten rupees    వాడుక / Usage పరువు ప్రతిష్టలని ఆధారం చేసుకుని బ్రతికేవాళ్ళం మనం. మనకు డబ్బు దస్కం చివరకు మిగలవు .    We live for/on honour and prestige. Money and wealth don't matter at the end.     మెదడుకు మేత / Food for thought ఆశచేత మనుజులాయువు గలనాళ్ళు తిరుగుచుందురు భ్రమ తిప్పుదాక మురికి భాండమందు ముసురు నీగల భంగి విశ్వదాభిరామ వినురవేమ! ( మురికి కుండపైన ఈగలు ముసురునట్లుగా మనిషి భౌతిక సుఖాల చుట్టూ జీవితాంతం తిరుగుతూనే ఉంటాడు. ఎన్నాళ్లు తిరుగుతాడు? ఎన్నాళ్లంటే భ్రమ తొలిగేదాక. భ్రమ తొలిగేది లేదు ఆశ చచ్చేది లేదు అని సారాంశం. బతకడానికి ఆశ అవసరమే కాని ఇది నిరంతర అత్యాశ. అందుకే ఆశాపాశం, ఆశాబంధం అనే మాటలు పుట్టాయి. ఆశలో చిక్కుబడిపోతే అంతే సంగతులు అంటున్నాడు వేమన. ఆశను వదులుకుందామన్నా భ్రమ వదలనివ్వదు. ఆశ అంటే కోరికే. తెలియని సుఖాలపైన ఆసక్తే ఆశ. భ్రమ ...

రివట

  మే 29, 2023 రివట      ( rivaṭa )       అర్థము      (విశేష్యము ): రెమ్మ; (చెట్టుకి) ఉపశాఖ; సన్నం (పుల్ల లాగా); కొంచెము; పెద్ద     Meaning     (noun) : branch; twig; thin; little; big    వాడుక / Usage ఊసలాగా శ్రీనివాసులు దూసుకువచ్చాడు. సన్నగా రివటలా ఉన్నాడు. తయారీలో ఉన్న నటుడు.    Srinivasulu swept in like an arrow. He was thin as a stick. An actor in making.     మెదడుకు మేత / Food for thought సరసము విరసము కొఱకే పరిపూర్ణ సుఖంబు లదిక భాదల కొఱకే  పెరుగుట విరుగుట కొఱకే ధర తగ్గుట హెచ్చు కొఱకే తథ్యము సుమతీ! -- సుమతీ శతకం, బద్దెన (~ 1260)

ఆడుగోలు

  మే 26, 2023 ఆడుగోలు      ( aadugolu )       అర్థము      (విశేష్యము ): ఒప్పంద ము     Meaning     (noun) : agreement    వాడుక / Usage చైనా రష్యా మధ్య పరస్పర రక్షణ ఆడుగోలు అమలులో ఉంది.    China and Russia have inked a mutual security pact.     మెదడుకు మేత / Food for thought మరణం అంటే ఏమిటి? లేకపోవడమేగా? మనం ఉండం. అంతా ఉంటుంది. మందాకినీ గలగలలు, నీహారికా బిందు సందోహాలు, దూకే జలపాతాలు, గుడి ప్రాంగణంలో పెరిగే గడ్డిపూలు, మలయ మారుతాలూ, మయూర నృత్యాలూ...అన్నీ ఉంటాయి. -- యండమూరి వీరేంద్రనాథ్

సిద్దాయము

  మే 25, 2023 సిద్దాయము      ( siddāyamu )       అర్థము      (విశేష్యము ): ఖర్చుపోగా మిగిలినది; అపహరించిన  సొమ్ము ; రుసుము     Meaning     (noun) : saving in expenditure; economy; embezzlement; tax; fee    వాడుక / Usage విజయనగర సామ్రాజ్యంలో మగ్గం పని మీద పింజ సిద్దాయము ఉండేది.    Weavers were levied a cotton fee in Vijayanagara empire.     మెదడుకు మేత / Food for thought మనిషి దేనినైనా వెతికితే, వారి కళ్ళకి ఆ వెతికేదే కనబడుతుంది.వారు ఏమీ కనుగొనలేరు, యేమీ అంతర్గతం చేసుకోలేరు ఎందుకంటే వాళ్ల ఆలోచన ఎప్పుడూ ఆ వెతికే దానిమీదే ఉంటుంది కనుక. వాళ్ళకి అదొక్కటే ఆశయం, ఆ ఆశయం వారిని పట్టి పీడిస్తోవుంటుంది. వెదకడం అంటే ఒక లక్ష్యం ఉండటం. కానీ కనుగొనడం అంటే స్వేచ్ఛగా ఉండటం, నిష్కపటంగా ఉండడం, లక్ష్యంతో పరిమితి కాకపోవడం. -- సిద్ధార్థ, హెర్మాన్ హెస్సే (జులై 2, 1877 - 1962)

అప్పనము

  మే 24, 2023 అప్పనము      ( appanamu )       అర్థము      (విశేష్యము ): అర్పణము; కానుక; రాజుకు అర్పించే కట్నము/పన్ను; ఉచితము       Meaning     (noun) : tribute; tax; offering; gift; free    వాడుక / Usage ట్విట్టర్ డేటాను మరో టెక్ దిగ్గజమైన మైక్రోసాఫ్ట్ అప్పనంగా వాడేస్తామంటే మస్క్ ఊరుకుంటాడా?    Will Musk allow Microsoft to appropriate Twitter data for free?!     మెదడుకు మేత / Food for thought కళ్ళు మూసుకోవడం వల్ల ఏమీ మారదు. నువ్వు చూడకపోవడం వల్ల జరిగేవి మాయం అయిపోవు. పైగా నువ్వు కళ్ళు తెరిచేటప్పటికి ఇంకా విషమంగా తయారు అవుతాయి. మనం ఉన్న ప్రపంచం అలాంటిది. అందుకే కళ్ళు బార్లా తెరిచి ఉంచు. పిరికివాడే వాటిని మూస్తాడు. కళ్ళు చెవులు మూసుకుంటే సమయం ఆగిపోదు. -- కాఫ్కా ఆన్ ది షోర్, హరుకి మురకామి

పుల్లరి

  మే 23, 2023 పుల్లరి      ( pull-ari )       అర్థము      (విశేష్యము ): పశువులు మేత మీద వేసిన పన్ను; పుల్లు (గడ్డి) + అరి (కప్పము)     Meaning     (noun) : tax on pasture lands; grazing tax    వాడుక / Usage పుల్లరి కట్టేందుకు నిరాకరించి, పలనాటి ప్రజలు కన్నెగంటి హనుమంతు నాయకత్వాన బ్రిటిషు ప్రభుత్వాన్ని ఎదిరించారు .    Kanneganti Hanumantu led a Satyagraha of Palnati people to protest the grazing tax levied by the British.     మెదడుకు మేత / Food for thought మనిషి తన తల్లి జన్మనిచ్చిన రోజున ఒక్కసారే పుట్టడు; జీవితం  అతన్ని  ప్రతీరోజు మళ్ళీ మళ్ళీ తనని తానే పుట్టించుకునేలా చేస్తుంది. మనుషులు ముసలితనం వల్ల కలలు కనడం మానరు. కలలు కనడం మానడం వల్లనే ముసలితనం పైన వేసుకుంటారు. -- గాబ్రియెల్ గార్షియా మార్కెజ్ (మార్చ్ 6, 1927 - 2014)

ఉంబళి

  మే 22, 2023 ఉంబళి      ( umbaḷi )       అర్థము      (విశేషణము ): పన్ను లేకుండా భూమి వగైరా అనుభవించుట; ఈనాము; జాగీరు     Meaning     (adj/noun) : free from taxation/rent    వాడుక / Usage రాజాస్థానంలోని ఉద్యోగులకు, మంత్రులకు, పండితులకు పోషణగా ఉంబళి గ్రామాలూ ఇచ్చేవారు.    Jageers were given to employees of the court as tax free estates.     మెదడుకు మేత / Food for thought చందమామను చూచి వద్దామా సదానందా తల్లడించే తామసులను వెళ్ళవేసి వేవేగ పంచబాణుని పారద్రోలి కుంజరమ్ముల కూలవేసి శత్రులార్గురి చెంతచేరక ఇంద్రియాదుల వెంటబోక మట్టు తెలిసి మేలుకోట పట్టణంబున చేరి ఇపుడు... చదువులన్నీ చదివిచదివీ చచ్చిపోయేదింతె గానీ గుట్టు తెలిపే గురుడు గల్గితే చూడవచ్చును సులభమున్నదీ... ఒళ్ళుమరచి తారకమున తెల్లవారేదనక మనము... మంటి మింటి రెంటి నడుమ ఒంటి స్తంభపు మేడ మీద... అమర నారేయణ స్వామి ఆదిగురుని బోధచేత తలచినప్పుడె తనువులోన తప్పకుండా చూడవచ్చును... -- కైవారం అమర నరేయణ (1762 - 1837)

కూళ

  మే 19, 2023 కూళ      ( kūḷa )       అర్థము      (విశేషణము ): క్రూరము; క్రూరుడు; దుర్మార్గుడు     Meaning     (adj/noun) : cruel; wicked person    వాడుక / Usage మేలు పొంది మరీ మరచిన కూళులకు నరకంలో ప్రత్యేక స్థానం ఉంది.    There is special place in hell for the wicked who forget a favour.     మెదడుకు మేత / Food for thought ఓ చెలీ! ఓ చెలీ! నీవు నా నిదురలో మూర్తించి నీవు నా ఎదలలో నర్తించి పూవులో తేనెవై తావిలో మత్తువై పాటలో ఫణితివై మాటలో తేటవై అమృత బిందువులోని అమరత్వమైతివే! ఓ చెలీ! ఓ చెలీ! --శశికళ, అడవి బాపిరాజు (అక్టోబర్ 8, 1895 - 1952)

పైకొను

  మే 18, 2023 పైకొను      ( pai-konu )       అర్థము      (క్రియ ): ఎ దుర్కొను, కలియబడు, మించిపోవు, ప్రయత్నించు; కలుగు     Meaning     (verb) : to exceed; attack; attempt; to happen    వాడుక / Usage దుండగులను పైకొని ఆమె చూపిన ధైర్య సహాసాలు అమోఘం.    Her bravery in standing up to the miscreants was extraordinary.     మెదడుకు మేత / Food for thought ఏ గంటకు రమ్మంటవె కన్నెలేడి?  నువ్వేడ కాచుకోనుంటవె వన్నెలాడి? పుగతోటకు నీళ్లుపెట్టి, బుగతగారి నేమరించి, కోరుకొన్న మొగలిపొత్తి కొండకోన వెతికితెచ్చి, అలసట తీరేతలికే అద్దరేత్తి రవుతాది- ఏ గంటకు రమ్మంటవె కన్నెలేడి? చీకట్లో నీ అందము చిక్కువిడదు నా కంటికి; వెన్నెలలో నీ రూపము కన్ను చెదరగొడతాది; చీకటి వెలుగుల సందున చేరరావె చిన్నారీ --బంగారిమామ పాటలు, కొనికళ్ళ వెంకటరత్నం (1909 - 1971)

కొసరు

  మే 17, 2023 కొసరు      ( kosaru )       అర్థము      (విశేష్యము/క్రియ ):  విజృంభించు, సంకోచించు, ప్రార్థించు, కోరిక, ఒక వస్తువును కొన్నదానికిచ్చే పెచ్చు     Meaning     (noun/verb) : to ask for little extra; greedy; desire; hesitate    వాడుక / Usage "‘తొక్క’లో బంగాళదుంపకు ఇంతుందా.. ఇన్నాళ్లు అసలొదిలేసి కొసరు పట్టుకున్నాంగా..!!"    Potato peels are the real deal.. we got the wrong end of the stick so far!!     మెదడుకు మేత / Food for thought ఏమి వెదుకుతున్నావూ? ఈ జీవిత శిథిలాల్లోనీవూ? చెదిరిన నీ సుఖస్వప్నాలే అవి రంగుల రంగుల గాజుపెంకులూ బ్రతుకు పంటలో తాలుకంకులూ పెంటపోగులో విశ్రమించినయ్‌ దాగని బ్రతుకుల రంగుల బొంకులు చివికిన ఖాళీసిగరెట్‌ పెట్టెలు మంటిని గలసిన సిగరెట్‌పీకలు గాలి అలలలో తేలియాడుతూ నేలనువాలే కోడియీకలూ తళుకు కాగితం, మెరిసే తగరం, తుప్పుతినేసిన యినుపరేకులూ మందుల పొట్లాలకు పనికొచ్చిన చిరిగిన మాసిన ప్రేమలేఖలూ నల్లని యెర్రని గుడ్డపీలికలు పూర్వపుటందము చెడినపోలికలు గుప...

వీసర

  మే 16, 2023 వీసర      ( veesara )       అర్థము      (విశేష్యము ): అర వీసము; కొరత; వెలితి; లోపము; తగ్గు     Meaning     (noun) : deficiency; deficit    వాడుక / Usage మతోన్మాద మత్తులో మానవ విలువలు వీసర బోయింది సమాజం .    There is a deficit of human values in the society filled with religious tolerance.     మెదడుకు మేత / Food for thought సింధువునుజేరి బిందువు సింధువగును; ధ్యేయమునుబట్టి ప్రతిపని దివ్యమగును.... చక్రవర్తిచేతి స్వర్ణపాత్రికకన్న నాదు మట్టిచిప్ప నయము లెమ్ము.... గ్రీష్మమున వాన కురిసిన నూష్మమెసగు, అట్లె కన్నీటితో గుండె నగ్గి పెరిగె.... -- గాలిబ్ గీతాలు, దాశరథి (జులై 22, 1925 - 1987)

కొంకు

  మే 15, 2023 కొంకు      ( konku )       అర్థము      (విశేష్యము/క్రియ ): భయపడు; సంకోచించు; భయము; సంకోచము; జంకు; సిగ్గుపడు     Meaning     (noun/verb) : to fear; timidity; hesitation    వాడుక / Usage బ్రిటిష్ వారి తుపాకీ గుండ్లకు కొంకు బడక తన ఛాతి చూపిన ధీశాలి టంగుటూరి ప్రకాశం .    Tanguturi Prakasam opposed the British fearless of their bullets.     మెదడుకు మేత / Food for thought తిలలలో తైలం ఉన్నట్లే,  జిలుగు వెలుగులో నిప్పు ఉన్నట్లే దైవత్వం ఎక్కడో లేదు నీలోనే ఉంది,  తెలుసుకోగలిగితే మేలుకో తెలుసుకో ( जैसे तिल में तेल है ज्यों चकमक में आग तेरा साईं तुझमें है , तू जाग सके तो जाग ) -- కబీర్ దాస్ (1398 - 1518)

అంతరాంతరము

  మే 12, 2023 అంతరాంతరము      ( anta-rāntaramu )       అర్థము      (విశేష్యము ): తారతమ్యం; వ్యత్యాసం; అన్నిటికన్నా లోపల ఉన్న భాగము     Meaning     (noun) : difference; distinction of rank; innermost    వాడుక / Usage ఎంత మాత్రమున యెవ్వరు తలచిన అంత మాత్రమేనీవు అంతరాంతరము లెంచి చూడ బిండంతె నిప్పటి అన్నట్టు.    To each what they think so you are, just as one get's as much pancake as there is dough.     మెదడుకు మేత / Food for thought నేను యువతీయువకులతో మాట్లాడుతున్నప్పుడు వేచి ఉండటాన్ని గురించి వివరంగా చెబుతుంటాను. ఒక రకమైన చైనా వెదురుబొంగు చెట్టు ఉంది. దాని విత్తనాన్ని భూమిలో నాటి ఒక సంవత్సరం పాటు నీళ్లు పోసి పరామర్శించినప్పటికీ మొలక నేలపై రాదు. ఐదు ఏళ్ళ తర్వాత మొలకెత్తుతుంది. ఆపై ఆరువారాల్లో 90 అడుగులు ఎత్తుకు ఎదుగుతుంది. మరి ఆ అయిదు ఏళ్ళు ఏమి చేసింది. వేరులను పెంచుకుంది. తర్వాత పెరగడానికి సంసిద్ధం చేసుకుంది. వేచి ఉండటం కూడా అభివృద్ధే. ఆ సమయంలో నిరాశావాదం తగదు. -- బిట్స్ పిలానీ...

చర్చితము

  మే 11, 2023 చర్చితము      ( charchitamu )       అర్థము      (విశేష్యము/విశేషణము ): (చందనం వగైరా) లేపనంతో పూయబడిన;     Meaning     (noun/adj) : smeared with sandalwood; anointed    వాడుక / Usage చందన చర్చిత నీల కళేబర పీత వసన వనమాలీ!    O dark skinned, sandal anointed, yellow clothed, garlanded Krishna!     మెదడుకు మేత / Food for thought మీ జీవితం చాలా చిన్నది. కాబట్టి వేరొకరిలా జీవించాలనుకుంటూ మీ జీవితాన్ని వ్యర్థం చేసుకోవద్దు. మీ మనస్సులోని భావాలలో ఎదుటివారి భావనాలను మోసుకొచ్చి కుక్కెయ్యకుండా జాగ్రత్త వహించండి. మీ అంతరాత్మ, మనస్సు ఏం చేయాలని సూచిస్తున్నాయో ధైర్యంగా ఆ మార్గంలో ముందుకు సాగండి. ఎందుకంటే మీరు ఏమి సాధించాలని అనుకుంటున్నారనే విషయం వాటికి మాత్రమే తెలుసు. ఆ తరువాతే మిగతా విషయాలను పట్టించుకోవాలి. (సాధించాలనే) ఆకలితో ఉండండి...( నేర్చుకోవాలనే)  అమాయకత్వంతో ఉండండి. -- స్టాన్ఫోర్డ్ విశ్వవిద్యాలయంలో స్టీవ్ జాబ్స్  (ఫిబ్రవరి 24, 1955 - 2011)

అరకొర

  మే 10, 2023 అరకొర      ( arakora )       అర్థము      (విశేష్యము ): అనుమానము; సందేహము; కపటం; అసంపూర్ణం     Meaning     (noun) : doubtful; hesitation; incomplete    వాడుక / Usage అరకొర నిధులతో నాణ్యమైన విద్య, వైద్యం సాధ్యమా?    Can quality education be provided with incomplete and insufficient funds?     మెదడుకు మేత / Food for thought ఈ ప్రపంచంలో అందరికీ చోటు ఉంది. అందరికీ చెందిన అవసరాలను ఈ భూమి తీర్చగలదు. పేరాశ మనుషుల ఆత్మను విషతుల్యం చేసింది. అందువలన ఈ భూమిని ద్వేషంతో నింపేస్తున్నాము. యంత్రాలకంటే మానవత్వమే మనకు కావలసింది. ఏ లోకంలో తెలివితేటలు పురోగతి మనిషి యొక్క సంతోషానికి తగిన మార్గం సుగమం చేస్తాయో ఆ లోకం కోసం పోరాడదాము. -- ది గ్రేట్  డిక్టేటర్, చార్లీ చాప్లెన్  (ఏప్రిల్ 16, 1889 - 1977)

సతతహరితారణ్యము

  మే 09, 2023 సతతహరితారణ్యము      ( satataharitharanyamu )       అర్థము      (విశేష్యము ): సతత=ఎల్లప్పుడూ, హరిత=ఆకుపచ్చ, అరణ్యము=అడవి; ఆకులు రాల్చని వృక్షాలు గల వనం     Meaning     (noun) : evergreen forest    వాడుక / Usage ప్రపంచ భూభాగంలో యాభై ఏళ్ళ కిందట సతతహరితారణ్యాలు 14 శాతం విస్తరించి ఉండగా, ప్రస్త్రుతం ఆరు శాతానికి క్షీణించాయి .    Evergreen forests which covered 14% of Earth 50 years back have now fallen below 6%.     మెదడుకు మేత / Food for thought నా దేశ ప్రజలతో అన్యదేశ భాషలో మాట్లాడాల్సిన దుస్థితిని చూసి సిగ్గు పడుతున్నాను. ఆంగ్లంలో చదువుకుంటున్నవారు అభివృద్ధి చెందుతున్నారంటూ, ఆంగ్లేయులు మనకి మంచిని చేస్తున్నారని కొందరు అంటున్నారు. అయితే విద్య పేరిట ఇక్కడ ఆంగ్లమే బోధిస్తున్నారు కదా. గత యాభై సంవత్సరాలుగా మన మాతృ భాషలో శిక్షణ పొంది ఉన్నట్లయితే నేడు మనకి ఇంకా ఎంత ఫలితం లభించి ఉండేదో ఆలోచించండి. భారత దేశం స్వాతంత్ర్యాన్ని పొంది ఉండేది. ఇక్కడ మన దేశీయ విద్యను అభ్యసించిన ...

చర్వితచర్వణము

  మే 08, 2023 చర్వితచర్వణము      ( charvitacharvanamu )       అర్థము      (విశేషణము ): చర్విత=నమలబడినది; నమిలినదానిని తిరిగి నములుట; నెమరువేసుకొనడం; చెప్పిందే మళ్ళీ చెప్పడం     Meaning     (noun/adj) : chewing on the cud; ruminate; repeat oneself    వాడుక / Usage మన పెద్దల చర్వితచర్వణం మౌఖిక చరిత్రగా భద్రపరుచుకోవటం మన కర్తవ్యం.    It is our duty to record as oral history the ruminations of our elders.     మెదడుకు మేత / Food for thought ఈ ప్రపంచంలో పుట్టినవారందరికీ చరిత్రపుటలలో ఒక పుట కేటాయించబడింది. అయితే ఆ పుటను ఈ ప్రపంచమంతటిచే చదివింపజేయడమనేది మీ చేతులలోనే ఉంది. మీరందరూ  ప్రత్యేకతను కలిగినవారే! అయితే ఈ ప్రపంచం రేయింబవళ్లు కఠోర శ్రమను చేస్తూనే ఉంది. ఎందుకో మీకు తెలుసా? మిమ్మల్ని ఇతరులవలె తీర్చిదిద్దేటందుకు. 'ఆ మాయ వలలో నేను చిక్కుకోను, నేను నేను గానే ఉంటాను' అని మీరు ఆలోచించిన మరుక్షణమే చరిత్రలో మీ గురించిన పుటలను లిఖించేందుకు సమాయత్తం అయ్యారని అర్థం. చెప్పాలంటే 'నువ్వ...