మూర్ధజ
జులై 21, 2023 మూర్ధజ ( mūrdhaja ) అర్థము (విశేష్యము ): తలనుంచి పుట్టునది; తల వెట్రుక; కేశము Meaning (noun) : hair వాడుక / Usage రాజకీయాలలో మూర్ధజాలు పండిపోయిన నేతలు మతంపేరుతో మనల్ని వేరు చేయడానికి వస్తున్నారు. Politically savvy and ripe (in hair) leaders are coming to divide us in the name of religion. మెదడుకు మేత / Food for thought అసమ్భవం హేమమృగస్య జన్మ తథాపి రామో లులుభే మృగాయ । ప్రాయః సమాపన్నవిపత్తికాలే ధియోఽపి పుంసాం మలినా భవన్తి॥ ( సృష్టిలో బంగారు జింకయొక్క పుట్టుక అనునది సంభవము కానిది. అయినప్పటికి సకలసద్గుణసంపన్నుడైన రాముడు కూడా ఆ బంగారు జింక కొరకు ఆశ పడ్డాడు. ఆపదలు సంభవించాలని ఉన్నప్పుడు, మేధావులయొక్క, అనగా సదసద్వివేకము కలవారియొక్క బుద్ధులు కూడా వివేకరహితములై, మలినమవుతాయి. ఎప్పుడైనా, ...