Posts

Showing posts from May, 2025

హంసపాదము

  మే 30, 2025 హంసపాదము  ( hamsa-pādamu )     అర్థము    (విశేష్యము)  : వ్రాతలో తప్పిపోయినచోట పెట్టే గుర్తు; ఇక్కడ తప్పినది వేరే చోట ఉందని గుర్తు;        Meaning    (noun) : a caret or an asterisk; symbolises a mistake      వాడుక / Usage       'మన ఊరు- మన బడి'కి ఆదిలోనే హంసపాదం .      Missteps plague launch of "Mana Ooru - Mana Badi".    మెదడుకు మేత / Food for thought       నీడలు! నీడలు! ఊళ్ళూ, ఇళ్ళూ      పేదలగూళ్ళూ, కుబేరులమేడలు!      ఆకాశంలో మబ్బులనీడలు!      భూమిపైన ప్రారబ్ధపునీడలు!      కునుకుకనులలో నిద్దురనీడలు!      అచేతనంలో అద్దపునీడలు!      ప్రేమలనీడలు! ద్వేషపునీడలు!      శాంతపునీడలు! రోషపునీడలు!      కదిలేనీడలు! కదలనినీడలు!      తెలిసేజాడలు! తెలియనిజాడలు!      రంగులనీడలు! తావులనీడలు! ...

కుందేటికొమ్ము

  మే 29, 2025 కుందేటికొమ్ము  ( kundetikommu )     అర్థము    (విశేష్యము/విశేషణము)  : కుందేలు/చెవుల పిల్లి కొమ్ము; అసంభవము(కుందేలు కి కొమ్ములు లేనట్లే); శూన్యము        Meaning    (noun) : a hare's horn; an impossibility/absurdity; that which doesn't exist      వాడుక / Usage      ప్రస్తుత నాయకుల్లో నిజాయతీ కుందేటికొమ్ము మాత్రమే .     Honesty in current crop of leaders is an absurdity.    మెదడుకు మేత / Food for thought       పువ్వటే నీ సొగసు - వేలుపుల - బువ్వటే నీ నవ్వు      ఈ వెలుగు లేమంటు - ఏను తడబడుటలే      ఎటుచూచినా వెలుగు - ఎదురు కొన్నది నన్ను      కళవళము పడుతూనె - కనులు మూసితి నేను      పువ్వటే నీ సొగసు - బువ్వటే నీ నవ్వు      కనులు మూసితినేమి - కాంతులాపుట ఎట్లు      నాలోన నాపైన - నానార్ధముల కాంతి      పువ్వటే నీ సొగసు - వేలుపుల - బువ్వటే...

సునాయాసము

  మే 28, 2025 సునాయాసము  ( sunāyāsamu )     అర్థము    (విశేషణము)  : సులువు; తేలిక; శ్రమ లేకుండా; యస్=ప్రయత్నము;    సు + న + ఆ + యసము=మిక్కిలి/అసలు  శ్రమ  లేకుండా చేసిన ప్రయత్నము    Meaning    (adj) : easy; effortless      వాడుక / Usage      సెమిస్ కు దక్షిణాఫ్రికా.. ఇంగ్లాండు పై సునాయాస విజయం.     South Africa in semis with easy win over England.    మెదడుకు మేత / Food for thought       యువ కవి లోక ప్రతి నిధి నవభావామృత రసధుని కవితాసతి నొసట నిత్య రసగంగాధర తిలకం సమకాలిక సమస్యలకు స్వచ్చ స్ఫటికా ఫలకం      గాలి మూగదయి పోయింది      పాట బూడిదయి పోయింది      వయస్సు సగం తీరకముందే      అంతరించిన ప్రజాకవి      వయస్సు సగం చేరకముందే      అస్తమించిన ప్రభారవి     -- దేవరకొండ బాలగంగాధర్ తిలక్ గురించి శ్రీశ్రీ

ఆకస్మికము

  మే 27, 2025 ఆకస్మికము  ( ā-kasmikamu )     అర్థము    (విశేషణము)  : హఠాత్తుగా/అనుకోకుండా/ఉన్నట్లుండి/తటాలున జరిగినది; కస్మాత్=ఎందుకు/ఎవరి కారణంగా; అకస్మాత్=కారణం లేకుండా/తెలియకుండా    Meaning    (adv) : suddenly; unexpected; causeless      వాడుక / Usage      హిమాచల్ ప్రదేశ్ లో ఆకస్మిక వరదలు, విరిగిపడిన కొండచరియలు.     Sudden floods in Himachal Pradesh trigger landslides.    మెదడుకు మేత / Food for thought      భూకంపం వచ్చిందన్నా      మరో యుద్ధం రేగిందన్నా      తన భార్య కవలల్ని కన్నదన్నా      కంగారుపడక కోటు తొడుక్కొని      కోటీశ్వరరావు ఆఫీసు కెళతాడు, వస్తాడు     – గొంగళి పురుగులు, దేవరకొండ బాల గంగాధర తిలక్ (1921 - 1966)

కాకతాళీయము

  మే 26, 2025 కాకతాళీయము  ( kāka-tāḷīyamu )     అర్థము    (విశేషణము)  : కాక=కాకి, తాళ=తాడి చెట్టు; తాళీ=తాడి పండు; కాకి తాటి చెట్టుపై వ్రాలిన క్షణాన తాటి పండు పడడం; సంబంధం లేని రెండు ఘటనలు ఏక కాలంలో జరగడం    Meaning    (noun) : chance; coincidence;  as a palm fruit falling just when a crow has landed      వాడుక / Usage       ఋగ్వేదంలో ఆకాశానికి అధిపతి అయిన ద్యౌస్ పేరుకి, జూస్‌కి మధ్య ఉన్న పోలిక కేవలం కాకతాళీయం కాదు .     The similarity between Dyaus, the Rig vedic God of heavens, and Zeus, the Greek God of heavens, is not a mere coincidence.    మెదడుకు మేత / Food for thought       ఎన్నో యేండ్లు గతించిపోయినవి గానీ,యీ శ్మశానస్ధలిన్     గన్నుల్ మోడ్చిన మందభాగ్యుడొకఁడైనన్ లేచిరాఁ,డక్కటా!     యెన్నాళ్ళీచలనంబులేని శయనం? బేతల్లు లల్లాడిరో!     కన్నీటంబడి క్రాఁగిపోయినవి నిక్కంబిందు పాషాణముల్     -- శ్మశాన వ...

తెరువరి

  మే 23, 2025 తెరువరి  ( teruvari )     అర్థము    (విశేషణము)  : దారిన నడచు వాడు; బాటసారి    Meaning    (noun) : a wayfarer; traveller      వాడుక / Usage      ఎండ నుంచి ఉపశమనం.. తెరువరులకు మజ్జిగ పంపిణి .     Respite from the heat.. buttermilk for travellers.    మెదడుకు మేత / Food for thought       ధనము కూడబెట్టి  ధర్మంబు చేయక      తాను తినక లెస్స దాచుగాక      తేనెటీగ గూర్చి తెరువరి కియ్యదా      విశ్వదాభిరామ వినురవేమ.     ( తేనెటీగ ఎంతో కష్టపడి సంపాదించి దాచుకున్న తేనెను ఎవడో దారిన పోయేవాడు తన్నుకు పోయినట్లు, కూడ బెట్టిన ధనాన్ని తినక పోయినా, ధర్మం చేయక పోయినా, ఆ ధనాన్ని ఎవడో ఒకడు దోచుకుంటాడు)     -- వేమన (1367 - 1478)

భాండము

  మే 22, 2025 భాండము  ( bhānḍaṁu )     అర్థము    (విశేష్యము)  : వంట పాత్ర; కుండ; పెట్టె; కోశాగారంలోని ధనం    Meaning    (noun) : an earthen pot or vessel; money in the treasury      వాడుక / Usage       భారత ఖండం ఒక అమృత భాండం .     Indian sub continent is a   treasure chest of cornucopia.    మెదడుకు మేత / Food for thought       ఆత్మ శుద్దిలేని యాచార మదియేల      భాండ సుద్దిలేని పాకమేల      చిత్తశుద్దిలేని శివపూజ లేలరా      విశ్వదాభి రామ వినుర వేమ     ( మనసు నిర్మలంగా లేకుండా దుర్బుద్దితో చేసే ఆచారం ఎందుకు ? వంట పాత్ర శుభ్రంగా లేని వంట ఎందుకు ? అపనమ్మకంతో దురాలోచనతో చేసే శివ పూజ ఎందుకు ? ఇవన్నీ వ్యర్ధమే)     -- వేమన (1367 - 1478)

కుత్సితము

  మే 21, 2025 కుత్సితము  ( kutsitamu )     అర్థము    (విశేషణము)  : నీచము; నికృష్టము; కుటిలము    Meaning    (adj) : vile; low; contemptible      వాడుక / Usage      అధికారం కోసం మతంతో కుత్సిత రాజకీయం .     Contemptible politics using religion for the sake of power .     మెదడుకు మేత / Food for thought       వేరుపురుగు చేరి వృక్షంబు జెఱచును      చీడపురుగు చేరి చెట్టు చెఱచు      కుత్సితుండు చేరి గుణవంతు చెఱచురా      విశ్వదాభిరామ! వినుర వేమ!      (వేరుకి పట్టిన పురుగు వృక్షాన్ని పాడు చేస్తుంది. చీడపురుగు చెట్టుని పట్టి పాడు  చేసినట్లే దుర్మార్గుడు గుణవంతుణ్ణి చేరి అతన్ని పాడు చేస్తుంటాడు)     -- వేమన (1367 - 1478)

తండోపతండములు

  మే 20, 2025 తండోపతండములు  ( tanḍōpa-tanḍamulu )     అర్థము    (విశేషణము)  : తండమలు+ఉపతండములు; తండము=గుంపు; అపరిమితమైన సందోహం    Meaning    (adj/noun) : crowds upon crowds; multitude      వాడుక / Usage      శ్రీశైలంలో వింత- తండోపతండాలుగా తరలిన భక్తజనం .     Miracle in SriSailam - crowds of devotees congregate .     మెదడుకు మేత / Food for thought       తప్పులెన్నువారు తండోప తండంబు       లుర్విజనులకెల్ల నుండు తప్పు       తప్పులెన్నువారు తమతప్పు లెరుగరు      విశ్వదాభిరామ వినురవేమా!     ( ఎదుటివారిలో తప్పులు వెతికేవారు కోకొల్లలు. కానీ వారు తమ తప్పును మాత్రం గ్రహించలేరు)     -- వేమన (1367 - 1478)

ఇను

  మే 19, 2025 ఇను  ( inu )     అర్థము    (విశేషణము)  : రెండు; రెట్టింపు    Meaning    (adj) : two; double      వాడుక / Usage      ఇంగువతో పోపు పెట్టిన వంట సువాసన ఇనుమడిస్తుంది .     Food seasoned with asafoetida has an enhanced aroma .     మెదడుకు మేత / Food for thought       ఇనుము విరిగెనేని యిను మారు ముమ్మారు      కాచి యతుకనేర్చు గమ్మరీడు      మనసు విరిగినేని మరియంట నేర్చునా?      విశ్వదాభిరామ వినురవేమ !     ( ఇనుము విరిగితే దానిని రెండు మూడు సార్లు కాల్చి అతికించగలడు కమ్మరి. కానీ అదే మనిషి మనసు ఒక సారి విరిగితే(నొచ్చుకుంటే) దానిని తిరిగి అతికించటం ఎవరికీ సాధ్యం కాదు)     -- వేమన (1367 - 1478)

భవదీయుడు

  మే 16, 2025 భవదీయుడు  ( bhavadeeyudu )     అర్థము    (సర్వనామం)  : మీది; మీకు సంబంధించిన; ఉత్తరం చివరిలో సంతకం ముందు వ్రాసేది    Meaning    (pronoun) : yours; yours truly - as in signing off a letter      వాడుక / Usage      ....మీ ఆరోగ్యం జాగ్రత్త. భవదీయుడు పవన్ .     Take care of your health. Yours truly, పవన్.     మెదడుకు మేత / Food for thought       కర్మసిద్ధాంతమున నోరు కట్టివేసి      స్వార్థలోలురు నా భుక్తి ననుభవింత్రు      కర్మమననేమొ దానికీ కక్ష యేమొ      యీశ్వరుని చేత ఋజువు చేయింపవమ్మ      ఆలయంబున నీవు వ్రేలాడువేళ      శివుని చెవి నీకు కొంత చేరువుగ నుండు      మౌని ఖగరాజ్ఞి పూజారి లేనివేళ      విన్నపింపుము నాదు జీవితచరిత్ర     -- గబ్బిలం,  గుర్రం జాషువా (1895 - 1971)

చిత్తగించవలెను

  మే 15, 2025 చిత్తగించవలెను  ( chittaginchavalenu )     అర్థము    (క్రియ)  : సావధానముగా విను; దయచేసి విను; ఆలోచించు    Meaning    (verb) : to listen; grant attention; consider; used at the end of a letter      వాడుక / Usage       నేనిక్కడ నువ్వక్కడ కనులిక్కడ కలలక్కడ మన ఇద్దరి కలలు తీరేదెపుడు. ఇంతే సంగతులు చిత్తగించవలెను .     I am here and you there, eyes are here but dream there, when will our dreams come true. I remain. Do consider this.     మెదడుకు మేత / Food for thought       నేనొక పూల మొక్క కడ నిల్చి చివాలున కొమ్మవంచిగో      రానెడు నంతలోన విరులన్నియు జాలిగనోళ్ళు విప్పి మా      ప్రాణము తీతువాయనుచు బావురుమన్నవి కృంగిపోతి నా     మానసమందేదో తళుకు మన్నది పుష్పవిలాప కావ్యమై     -- పుష్పవిలాపం, జంధ్యాల పాపయ్య శాస్త్రి (1912 - 1992)

పిన్న

  మే 14, 2025 పిన్న  ( pinna )     అర్థము    (విశేషణము)  : చిన్న    Meaning    (adj) : young; little      వాడుక / Usage       పెద్దలకు నమస్సులు, పిన్నలకు ఆశీస్సులు .     Respects to elders and blessings to the little ones.     మెదడుకు మేత / Food for thought       అలుగుటయే   యెరుంగని   మహామహితాత్ముడు   అజాతసెత్రుడే      అలిగిననాడు   సాగరముల్లన్ని   ఏకముగాకపోవు   క      ర్ణులు   పది   వేవురైనను   నొత్తురు   సత్తురు   రాజరాజా   నా      పలుకులు   విశ్వసింపుము   విపన్నుల   లోకులగావు   మెల్లరన్     -- తిరుపతి వేంకట కవులు (1870-1950, 1872-1920)

క్షేమము

  మే 13, 2025 క్షేమము  ( kshēmamu )     అర్థము    (విశేష్యము)  : కుశలం; భద్రం; శుభమైన    Meaning    (noun/adj) : happy; safe; good health      వాడుక / Usage       ఇచ్చట అంతా క్షేమం , మీరు అంతా క్షేమం అని తలుస్తాను.     We are doing well. Hope you are fine.     మెదడుకు మేత / Food for thought       అంతము లెని ఈ భువనమంతా పురాతన పాఠశాల     ( నో నో పాఠశాల కాదు.. పానశాల)      ప : విశ్రాంతి గృహమ్ము, అందు ఇరు సంజెలు రంగులు వాకిళుళ్...      ధరాక్రాంతులు, పాదుషాలు బహరాం      జమిషీడులు వేనవేలుగా కొంత     సుఖించి పొయిరెటకొ...     -- కవికోకిల దువ్వూరి రామిరెడ్డి (1895 - 1947)

ఉభయకుశలోపరి

  మే 12, 2025 ఉభయకుశలోపరి  ( ubhayakusalopari )     అర్థము    (పదబంధం)  : ఉభయ=ఇద్దరు, కుశల=క్షేమం, ఉపరి=పైన/తర్వాత; ఉత్తరంలో అసలు విషయంలోకి వచ్చే ముందు రాసే వాక్యం; ఇద్దరి క్షేమ సమాచారాలు తర్వాత అనే ఉద్దేశంతో    Meaning    (phrase) : used in letters before getting into the topic of discussion; moving on after exchanging pleasantries       వాడుక / Usage       అమ్మానాన్నలకు నమస్మరించి వ్రాయునది. ఉభయకుశలోపరి . నా పరీక్షలు...     Respects to mum and dad. I am well and hope same with you. My exams....     మెదడుకు మేత / Food for thought       ఏ మహనీయ సాధ్వి జగదేక పవిత్రత బ్రహ్మరుద్ర సు      త్రాములు, హవ్య వాహనుడు ప్రస్తుతి చేసిరో, అట్టి తల్లి సీ      తా మహిళా శిరోమణిని, దారుణ కానన వీధి కంపగా      నీ మది యెట్టులొప్పె! నెట...

చిమ్మిరి

  మే 09, 2025 చిమ్మిరి  ( chimmiri )     అర్థము    (విశేష్యము)  : నువ్వులు బెల్లము చేర్చి దంచినది    Meaning    (noun) : sweet made of sesame and jaggery       వాడుక / Usage       చిమ్మిరి లడ్డులో ఎన్నో పోషక విలువలు ఉన్నాయి.     Sesame & jaggery balls have a lot nutritional value.    మెదడుకు మేత / Food for thought       शाम से आँख में नमी सी है     आज फिर आप की कमी सी है     సాయంత్రం నుంచి చెక్కిలి కన్నీటితో తడిసింది     ఈ రోజు మళ్ళీ నువ్వు లేని లోటు ముసిరింది     -- గుల్జార్

ఉప్పిడి

  మే 08, 2025 ఉప్పిడి  ( uppiḍi )     అర్థము    (విశేష్యము)  : ఉప్పు లేనిది; చప్పనిది; ఉడకబెట్టిన వడ్ల బియ్యం    Meaning    (noun) : without salt; boiled rice flour      వాడుక / Usage      మంచి ఆరోగ్యానికి రాగితో ఉప్పిడి పిండి.     Boiled millet flour is a healthy food.    మెదడుకు మేత / Food for thought       तब हम दोनों वक़्त चुरा कर लाते थे      अब मिलते हैं जब भी फ़ुर्सत होती है     అప్పుడు ఇద్దరం లేని సమయాన్ని కల్పించి వచ్చే వాళ్ళం     ఇప్పుడు అయితే కలుస్తాం వీలు దొరికినప్పుడు మాత్రమే     -- జావేద్ అఖ్తర్

పిట్టు

  మే 07, 2025 పిట్టు  ( piṭṭu )     అర్థము    (విశేష్యము)  : ఆవిరికి ఉడకపెట్టిన పిండి    Meaning    (noun) : flour boiled in steam      వాడుక / Usage      రుచికరమైన, ఆరోగ్యమైన  "రాగి పిట్టు " - ఈ బలమైన ఆహారం ఎవరైనా తినొచ్చు!     Tasty and healthy steamed millet flour - a nutritious diet for everyone.    మెదడుకు మేత / Food for thought       और भी दुख हैं ज़माने में मोहब्बत के सिवा      राहतें और भी हैं वस्ल की राहत के सिवा     ఉన్నాయి బాధలు ప్రపంచంలో, ప్రేమ కాకుండా     ఊరటలూ ఎన్నో ఉన్నాయి, ప్రేయసిని కలిసిన మధురం తప్పా     -- ఫైజ్  (1911 - 1984)

పాఠోళీ

  మే 06, 2025 పాఠోళీ  ( paaToLi )     అర్థము    (విశేష్యము)  : పప్పులతో చేసిన కూర    Meaning    (noun) : a dry dish made out of lentils      వాడుక / Usage      కొంకన్ లో పసుపు ఆకులలో ఉడికించిన తీపి కుడుములను  పాఠోళీ అంటారు .     Sweet dumplings steamed in turmeric leaves are called Paatoli in Konkani cuisine.    మెదడుకు మేత / Food for thought       उन के देखे से जो आ जाती है मुँह पर रौनक़      वो समझते हैं कि बीमार का हाल अच्छा है     తనని చూస్తే వస్తుంది ఎంతో మోహంలో వెలుగు     అనుకుంటుంది తను రోగి పరిస్థితి అయ్యిందని బాగు      -- మీర్జా గాలిబ్ (1797 - 1869)