Posts

Showing posts from February, 2021

కనుమ

  ఫిబ్రవరి 26, 2021 కనుమ  ( kanuma )       అర్థము     (విశేష్యము): కొండల మధ్య త్రోవ; కొండల వరుస; సందు; సంక్రాంతి మూడో రోజు     Meaning        (noun) : narrow opening between hills; hill range; third day of Sankranthi        వాడుక / Usage     తిరుమల కొండలు తూర్పు కనుమ ల్లో శేషాచలం - వెలికొండ శ్రేణిలో ఉన్నాయి.    Tirumala hills are part of the Seshachalam-Velikonda range in Eastern Ghats.      మెదడుకు మేత / Food for thought " సినిమా తెర అనే కాన్వాస్ మీద భారతీయత అనే కుంచెలో ముంచి దానికి సంగీతం సాహిత్యం అనే బ్రష్ తో కనక పెయింటింగ్ వేస్తే అది కే విశ్వనాథ్. ఆయన్ని సింబలైజ్ చేయాలంటే ఒక సాయంకాలం నీరెండ, ఒక సంక్రాంతి గొబ్బెమ్మ, ఒక ఆడపిల్ల జడలో మొగలి పువ్వు, గోధూళి వేళ ఇంటికి పరిగెత్తుకొచ్చే లేగ దూడ మేడలో గంట సౌండు, వర్షం వచ్చే ముందు మట్టిలోంచి వచ్చే వాసన, అమ్మ వేసవికాలంలో మండువాలో మనకి మట్టిగిన్నెలో కలిపి పెట్టే గోంగూర అన్నం, మన అహం పక్కన పెట్టి ఆత్మతో గడిపే సందర్భంలో...

పోరంబోకు

  ఫిబ్రవరి 25, 2021 పోరంబోకు  ( porambōku )       అర్థము     (విశేష్యము): సాగుబడికి రాని నేల; ప్రభుత్వం భూమి; పనికి రాని వాడు     Meaning        (noun) : waste land, unfit for cultivation; government lands; useless person        వాడుక / Usage     వందల ఎకరాల  పోరంబోకు భూములు కబ్జా చేయపడ్డాయి.    Hundreds of acres of unused government lands have been occupied.      మెదడుకు మేత / Food for thought   " సున్ని పిండిని నలిచి చిన్నారిగా మలిచి సంతసాన మునిగింది సంతులేని పార్వతి సుతుడన్న మతిమరచి శూలాన మెడవిరిచి పెద్దరికం చూపె చిచ్చుకంటి పెనిమిటి ప్రాణపతి నంటుందా బిడ్డగతి కంటుందా ఆ రెండు కళ్ళల్లో అది కన్నీటి చితి కాలకూటంకన్న ఘాటైన గరళమిది గొంతునులిమే గురుతై వెంటనే వుంటుంది " -- శాస్త్రిగారే అనాలి శివుడిని 'చిచ్చుకంటి' అని, విశ్వంగారే కల్పించాలి అలంటి పాత్రల్ని 

మడ అడవులు

  ఫిబ్రవరి 24, 2021 మడ అడవులు  ( mada-adavulu )       అర్థము     (విశేష్యము):  నదులు సముద్రంలో కలిసేచోట పెరిగే అడవులు; మడ చెట్లు  ఉప్పునీటి లో కూడా పెరుగుతాయి     Meaning        (noun) : mangrove forests        వాడుక / Usage     తూ.గో జిల్లా కోరంగి మడ అడవులు అంతరించిపోవడం వల్ల సహజ సిద్ధమైన రక్షణ కవచం కోల్పోతున్నాము.    The decimation of Korangi mangroves in E.G district is depriving us of a natural protection.      మెదడుకు మేత / Food for thought   " మృతిలోన ముగిసినా చితిలోన రగిలినా కడతేరి పోనీదీ మధురానుబంధము, ఎద వీడిపోనిదీ మమతాను రాగము...     పంచేంద్రియాలనే కాదు ప్రపంచాన్ని రాయిలా నిలిపేవాడు ఋషి, రాయిలా పడి ఉన్న ప్రపంచాన్ని అహల్యలా  మలిచేవాడు                   మనిషి " -- సాగరాన్ని మధించి విశ్వనాథ సృజించిన సంగమంలో జంధ్యాల నేసిన  కవిత

పచ్చికబయలు

   ఫిబ్రవరి 23, 2021 పచ్చికబయలు  ( pacchika-bayalu )       అర్థము     (విశేష్యము):  సహజముగా గడ్డి పెరుగు ప్రాంతము,  గడ్డి మైదానము, హరిత ప్రాంతం     Meaning        (noun) : meadow, grassland        వాడుక / Usage     వన్యప్రాణుల రక్షిత ప్రాంతమైన  రోళ్లపాడు పచ్చికబయలు లో పక్షుల సంఖ్య నానాటికి తగ్గిపోతోంది.    The bird population is declining in the grasslands of Rollapadu wildlife sanctuary.      మెదడుకు మేత / Food for thought   " ఎవరి రాకతో గళమున పాటల ఏరువాక సాగేనో    ఆ వసంత మాసపు కులగోత్రాలను ఎల కోయిల అడిగేనా    ఎవరి పిలుపుతో పులకరించి పురి విప్పి తనువు ఊగేనో    ఆ తొలకరి మేఘపు గుణగణాలకై నెమలి వెదుకులాడేనా....    ప్రాణం పుట్టుక ప్రాణికి తెలియాలా    గానం పుట్టుక గాత్రం చూడాలా    ప్రాణం పుట్టుక ప్రాణికి తెలియాలా    గానం పుట్టుక గాత్రం చూడాలా    వెదురును మురళిగ...

పీఠభూమి

  ఫిబ్రవరి 22, 2021 పీఠభూమి  ( peeta-bhumi )       అర్థము     (విశేష్యము): ఎత్తైన మైదానం, చదునుగా ఉన్న ఎత్తైన ప్రదేశం, లోయల మధ్య ఉన్న విశాలమైన ప్రదేశం      Meaning        (noun) : plateau        వాడుక / Usage     డెక్కన్  పీఠభూమి 6.6 కోట్ల సంవత్సరాల క్రితం అగ్నిపర్వత ప్రేలుడు వల్ల ఏర్పడింది.    The Deccan plateau was formed 66 million years ago due to a volcanic eruption.      మెదడుకు మేత / Food for thought   " సంగీత సామ్రాట్టువి శంకరాభరణంలో దిట్ఠవి, గండపెండేరం తొడిగించుకున్నవాడివి, ఈ వేళ ఎవరైనా కచేరీకి పిలిచి ఒక్క రూపాయి ఇస్తున్నార్రా?..ఇంకా నీకెందుకురా ఈ కంచిగరుడ సేవ?ఒరేయ్! రసికులు కాని వాళ్ళకు కవిత్వాన్ని వినిపించే దౌర్భాగ్యాన్ని  తన నుదుట రాయద్దని ఏడుస్తూ వేడుకున్నాడురా కాళిదాసు." -- విశ్వనాధుని అమర సృష్టి శంకరాభరణం - జంధ్యాల కలం, అల్లూరి రామలింగయ్య అద్భుత నటన

ఉవ్వెత్తు

   ఫిబ్రవరి 19, 2021 ఉవ్వెత్తు  ( uvv-eṭṭu )       అర్థము     (అవ్యయము): యావత్తు, పూర్తిగా, సమూహంగా, ఒక్కసారిగా, అవలీలగా     Meaning        (adverb) : entirely, without leaving any remnant, all at once, easily        వాడుక / Usage     తెన్నేటి విశ్వనాథం యొక్క  ‘విశాఖ ఉక్కు, ఆంధ్రుల హక్కు’ అనే నినాదంతో  ఉవ్వెత్తు న పోరాటం ప్రారంభం అయ్యింది .    With Tenneti Viswanadham's slogan 'Visakha steel, Andhra's right' the agitation took off.      మెదడుకు మేత / Food for thought   " సిరికిం జెప్పఁడు; శంఖ చక్ర యుగముం జేదోయి సంధింపఁ; డే    పరివారంబునుఁ జీరఁ డభ్రగపతిం బన్నింపఁ డాకర్ణికాం    తర ధమ్మిల్లముఁ జక్క నొత్తఁడు; వివాద ప్రోత్థిత శ్రీ కుచో    పరిచేలాంచలమైన వీడఁడు గజప్రాణావనోత్సాహియై " ( గజేంద్రుని ప్రాణాలు కాపాడలనే ఉత్సాహంతో ఉన్న విష్ణుమూర్తి లక్ష్మీదేవికీ చెప్పలేదు; శంఖచక్రాలను రెండు చేతుల్లోకీ తీసుకోలేదు; స...

ఉత్పాతం

  ఫిబ్రవరి 18, 2021 ఉత్పాతం  ( ut-pātamu )       అర్థము     (విశేష్యము): అపశకునము; భూకంపము వగైరా ఉపద్రవాలు; ఎగురుట; పొగరు     Meaning        (noun) : portent; natural calamities like earth quake; to fly; arrogance         వాడుక / Usage     ఉత్తరాఖండ్‌లో సరికొత్త  ఉత్పాతం  చోటు చేసుకుంది.    A new calamity befell the state of Uttarakhand.      మెదడుకు మేత / Food for thought   " భారతదేశం పసితనం యొక్క అమాయకత్వం, బాల్యం యొక్క ఉదాసీనత చూసింది; యవ్వనం యొక్క ఉద్రేకం, స్వేచ్ఛ కనబర్చింది. కష్ట సుఖాలతో సుదీర్ఘ ప్రయాణం చేసి విజ్ఞతతో కూడిన పరిపక్వత సంపాదించింది. ఎన్నిసార్లు కింద పడిన పలుమార్లు ఈ బాల్య, యవ్వన పరిపక్వ దశలను అన్ని సార్లు నవీకరించింది. " -- జవహర్ లాల్ నెహ్రు (నవంబర్ 14, 1889 - 1964)

ఉబలాటం

  ఫిబ్రవరి 17, 2021 ఉబలాటం  ( ubalaatam )       అర్థము     (విశేష్యము): ఉత్సాహం, మిక్కిలి ఆసక్తి, కుతూహలం, తహతహ, ఒక పని చేయాలని తొందర లేక కోరిక     Meaning        (noun) : to be eager, curious, desire, pleasure        వాడుక / Usage     తన గుండెలో ఉన్న విషయాలు వెలికితీసి ప్రపంచానికి చెప్పాలని ఆమె ఉబలాటం .    She was eager to harness and tell the world the feelings welling in her heart.      మెదడుకు మేత / Food for thought   " అంతర్జాలం ముందు, వార్తలు పాత్రికేయుల పరిధిలో ఉండేవి. దానికి శక్తిగల సంపాదకులు, ప్రచురణకర్తలు ద్వారపాలకులుగా కాపు కాసేవారు. ఇది నవాభ్యుదయ భావాలు ప్రసార మాధ్యమాలలోకి అంత తొందరగా రాకుండా చేసి ఉండవచ్చు. కానీ అదే విధంగా విపరీతమైన ప్రజాస్వామ్య వ్యతిరేక పోకడలకు కూడా అడ్డు కట్ట వేసింది. వార్తలలో నాణ్యత కాపాడింది. అంతర్జాలం ఈ చెలియలి కట్టను నిర్ములించివేసింది. దానితో ఏది నిజమో ఏది కల్పితమో తెలియకుండాపోయింది. " -- జాషువు టక్కర్ (https://ww...

ఉద్వేగం

  ఫిబ్రవరి 16, 2021 ఉద్వేగం  ( ud-vēgamu )       అర్థము     (విశేష్యము): కలత చెందిన మనసు, భయము, విరహ బాధ, వ్యాకులత     Meaning        (noun) : anxiety, agitation, fear, excitement        వాడుక / Usage     వరదలలో చిక్కుకున్న కార్మికుల కుటుంబాలు  ఉద్వేగానికి గురయ్యారు.    The families of the workers caught in the floods were overcome with anxiety.      మెదడుకు మేత / Food for thought   " చరిత్ర నేర్పే పాఠాలు నేర్చుకోవడం జ్ఞానోదయానికి ప్రతీక అయితే, చరిత్ర శృంఖలాల నుంచి తెంచుకుని విముక్తి పొందడం కూడా జ్ఞానోదయమే. " -- ఎస్ ఎల్ బైరప్ప, కన్నడ రచయిత, సాహిత్య అకాడెమీ పురస్కార గ్రహీత 

ఉషస్సు

  ఫిబ్రవరి 15, 2021 ఉషస్సు  ( ushassu )       అర్థము     (విశేష్యము): తెల్లవారే ముందు నాలుగు ఘడియల కాలం, వేకువ, ప్రాతః కాలం, ప్రొద్దు     Meaning        (noun) : the dawn        వాడుక / Usage     హేతువాదం అజ్ఞాన తిమిరాన్ని పారద్రోలే ఉషస్సు .    Rationalism is the dawn that drives away the darkness of ignorance.      మెదడుకు మేత / Food for thought   " ప్రకృతి రహస్యాలను వివరించలేనిది శాస్త్రం కాదు; జీవితంలోని కష్టాల్ని తీర్చలేనిది ఆవిష్కరణా కాదు; జీవితంలోని ప్రతీ కోణాన్ని చూపించలేనిది సాహిత్యమే కాదు " --  కొడవటిగంటి కుటుం బరావు   ( 1909   అక్టోబర్ 28  -  1980), రచయిత, 'చందమామ' వెన్నెముక, హేతువాది

కృత్రిమ మేధస్సు

  ఫిబ్రవరి 12, 2021 కృత్రిమ మేధస్సు  ( kruthrima medhassu )       అర్థము     (విశేష్యము): ఒక యంత్రం లేక సంగణకం ప్రదర్శించే మేధస్సు. మానవులవలే పర్యావరణం అవగతం చేసుకుని, శిక్షణ పొంది సమస్య పరిష్కరించే శక్తిగల యంత్రం     Meaning        (noun) : Artificial Intelligence        వాడుక / Usage     ట్యూరింగ్ టెస్ట్ ఒక యంత్రానికి  కృత్రిమ_మేధస్సు ఉందా అని నిర్ధారించడానికి అలాన్ ట్యూరింగ్ అనే బ్రిటీష్ శాస్త్రవేత్త ప్రతిపాదించిన పరీక్ష.    Turing test was proposed by British mathematician Alan Turing to test if a machine exhibits human like intelligence.      మెదడుకు మేత / Food for thought   " తాగుచుండే బుడ్డి తరుగుచుండే కొద్ది మెదడు మేయును గడ్డి ఓ కూనలమ్మా మనసు తెలుపని భాష మంచి పెంచని భాష ఉత్త సంద్రపు ఘోష ఓ కూనలమ్మా పుణ్య గాథల బూతు బూజు పట్టిన ట్రూతు అంతు చిక్కదు లోతు ఓ కూనలమ్మా!" -- ఆరుద్ర ( ఆగస్టు 31, 1925 - 1998 ), కూనలమ్మ పదాలు

గోప్యతా విధానం

   ఫిబ్రవరి 11, 2021 గోప్యతా విధానం  ( gopyatha vidhanam )       అర్థము     (విశేష్యము): అంతర్జాలంలో వివిధ గవాక్షాలలో (portals) లేక సామజిక మాధ్యమాలలో (social media) వ్యక్తిగత సమాచారాన్ని పరిరక్షించే, నియంత్రించే, వాడే విధానం     Meaning        (noun) : privacy policy        వాడుక / Usage     వాట్సాప్ గోప్యతా విధానం మార్పుపై ప్రపంచవ్యాప్తంగా ధుమారం రేగింది.    The change to WhatsApp's privacy policy triggered a global backlash.      మెదడుకు మేత / Food for thought   "నా దగ్గర దాచేందుకు ఏమీ లేవు,  గోప్యత గురించి నేను ఖాతరు చేయను అనడం, నాకు చెప్పేందుకు ఏమీ లేవు కాబట్టి వాక్ స్వాతంత్రం గురించి పట్టించుకోను అన్నట్టే " -- ఎడ్వర్డ్ స్నోడెన్, అమెరికా యొక్క గుప్త నిఘా గురించి చాటి చెప్పిన వ్యక్తి

బ్లాగోతం

  ఫిబ్రవరి 10, 2021 బ్లాగోతం  ( blagotham )       అర్థము     (విశేష్యము): ఆంగ్ల "బ్లాగ్" కి తెలుగీకరణ ->  బ్లాగు -  అంతర్జాలంలో  మన అభిప్రాయాలను అంతరంగాలను                                వ్రాయడం. అక్కడ ప్రచురించేదే బ్లాగోతం     Meaning        (noun) : blog, content on the blog        వాడుక / Usage     తెలుగు బ్లాగోతాల జాబితా చూడాలంటే http://telugubloggers.blogspot.com/ సందర్శించండి.    Visit  http://telugubloggers.blogspot.com/ to find a list of telugu blogs.      మెదడుకు మేత / Food for thought   " ఆంగ్ల విద్య అభ్యసించినవాళ్లు మాతృభాషని ఇప్పటిదాకా నిర్లక్ష్యం చేసినట్లు మునుముందు కూడా చేస్తే, భాషలు శుష్కించుకు పోయి నశించడం తథ్యం. " -- జాతి పిత మహాత్మ గాంధి (అక్టోబర్ 2 1869 - 1948)

అంతర్జాలం

   ఫిబ్రవరి 09, 2021 అంతర్జాలం  ( antarj ā lam )       అర్థము     (విశేష్యము):  ప్రపంచవ్యాప్తంగా ఉన్న సంగణకాలని ( కంప్యూటర్లను)  కలిపే ఒక వ్యవస్థ; ఒక దానికి ఒకటి అల్లుకుని వల లాంటిది కాబట్టి అంతర్జాలం     Meaning        (noun) : internet         వాడుక / Usage     పోయిన నాలుగు సంవత్సరాలలో భారతదేశం వివిధ ప్రదేశాలలో 400 సార్లు అంతర్జాలం నిలిపివేసింది.    In the last 4 years India suspended Internet 400 times in different places.      మెదడుకు మేత / Food for thought   " గానమాలింపక కన్నుమూయని రాజు    అమ్మ కౌగిటి పంజరంపు చిలక      కొదమ కండలు పేరుకొను పిల్ల వస్తాదు,      ఊయేల దిగని భాగ్యోన్నతుండు      ఉ ఊ లు నేర్చిన యొక వింత చదువరి,      సతిని ముట్టని నాటి సాంబమూర్తి      ప్రసవాబ్ధి తరియించ వచ్చిన పరదేశి,     తన ఇంటి క్రొత్త పెత్తనపుదారి " -- ...

సంగణకం

  ఫిబ్రవరి 08, 2021 సంగణకం  ( samga ṇ akam )       అర్థము     (విశేష్యము):  ముందుగా నిర్ధారించబడిన ఆదేశాల అనుసారం సమాచారాన్ని నిక్షేపించి, విశ్లేషించగల, గణించగల యంత్రం; కలన యంత్రం     Meaning        (noun) : computer         వాడుక / Usage     సంగణకాల  తయారీలో లెనోవో సంస్థ ఇప్పుడు అందరికన్నా ముందు ఉంది.    Lenovo is the leading manufacturer of computers in the world.      మెదడుకు మేత / Food for thought   "చందమామ రావే, జాబిల్లి రావే     రైలెక్కి రావే, రష్యా కథలు తేవే     ఇంజనెక్కి రావే, ఇంగ్లీషు కథలు తేవే     బస్సెక్కి రావే, బాంగ్లా కథలు తేవే     ఒలిచినా చోకలెట్లు ఒళ్ళో పెట్టుకుని     కరిగిన ఐస్ క్రీం చేత్తో పట్టుకుని     అలా  అలా  అలా వచ్చి, మా     తెలుగు పిల్లల తీపి నోట్లో పోసి పోవే " -- జులై 1947, చక్రపాణి గారి సంచలనలో, చందమామ మొదటి సంచికలో ఆహ్వానము

వాణిజ్యం

  ఫిబ్రవరి 05, 2021 వాణిజ్యం  ( vaṇijyam )       అర్థము     (విశేష్యము): వ్యాపారం, వర్తకం; వణిజ - వ్యాపారి, త్రాసు     Meaning        (noun) : trade, commerce          వాడుక / Usage     ప్రపంచీకరణ, స్వేచ్ఛా వాణిజ్యం ఈ దశకంలో వెనుకంజ వేసాయి.    Globalisation and free trade have taken a step back in the last decade.      మెదడుకు మేత / Food for thought   "పేదరికం డబ్బులు లేకపోవడమే మాత్రమే కాదు.  మనిషిగా మన సార్థక్యత పూర్తిగా పొందే అవకాశాలు లేకపోవడం కూడా...నిబంధనలు అంత ముఖ్యం అయినప్పుడు అవి ఎవరు నిర్మిస్తారు అనేది అతి ముఖ్యం. " -- అభిజిత్ బెనర్జీ, ఆర్థిక శాస్త్రవేత్త, 2019 నోబెల్ బహుమతి గ్రహీత

శిస్తు

  ఫిబ్రవరి 04, 2021 శిస్తు  ( ṣistu )       అర్థము     (విశేష్యము): పన్ను, సుంకం, కప్పం     Meaning        (noun) : tax, charge         వాడుక / Usage     భూమి శిస్తు కట్టకపోతే ఆక్రమణ కింద లెక్క.    Not paying land tax is considered encroachment.      మెదడుకు మేత / Food for thought   " ఎలాగైతే నీటిలో ఈదే చేప నీళ్లు ఎప్పుడు తాగుతుందో చెప్పలేమో, అలాగే ప్రభుత్వోద్యోగి ఎప్పుడు ఎలా ప్రభుత్వ ధనం దోచుకుంటాడో చెప్పలేము." -- చాణక్యుడు (క్రీస్తుపూర్వం నాలుగవ శతాబ్దం), అర్థశాస్త్రం

మాంద్యం

  ఫిబ్రవరి 03, 2021 మాంద్యం  ( māndyamu )       అర్థము     (విశేష్యము): జాడ్యము, జడత్వము, మందకొడి; ఆర్థిక / వ్యాపార సంక్షోభం; జీడీపీ క్షిణించడం     Meaning        (noun) : recession         వాడుక / Usage     మాంద్యం లో నిరుద్యోగుల సంఖ్య బాగా పెరిగింది.    Unemployment numbers rose in the recession.      మెదడుకు మేత / Food for thought   " స్వేచ్ఛ కన్నా సమతకి ఎక్కువ విలువ ఇచ్చే సమాజానికి ఆ రెండూ దక్కవు. సమత కన్నా స్వేచ్ఛకి ఎక్కువ విలువ ఇచ్చే సమాజానికి ఆ రెండూ ఎక్కువ మోతాదులో ఉంటాయి." -- మిల్టన్ ఫ్రిడ్మాన్, అమెరికాకు చెందిన ఆర్థిక శాస్త్రవేత్త

మదుపరులు

  ఫిబ్రవరి 02, 2021 మదుపరులు  ( maduparulu )       అర్థము     (విశేష్యము): పెట్టుబడిదార్లు; షేర్ల కొనుగోలుదార్లు; మదుపు - మూలధనం, పెట్టుబడి     Meaning        (noun) : investors, especially in stock markets        వాడుక / Usage     రెడ్దిట్ ద్వారా సమాచారం పంచుకుని చిన్న చిన్న మదుపరులు గేమ్ స్టాప్ విలువ పెంచేశారు.     Retail investors, sharing information via Reddit,skyrocketed Gamestop's price.      మెదడుకు మేత / Food for thought   " 1991 ఆర్థిక సంక్షోభంలో పూట గడవడానికి బంగారం తాకట్టు పెట్టి అప్పు చేసిన దేశం ఇపుడు మిగిలిన దేశాలని తలదన్ని అమాంతంగా 200 టన్నుల బంగారం కొనడం భారతదేశం ఆర్థికంగా ఎంత ఎదిగిందనడానికి, ఆ దేశ ఆత్మవిశ్వాసానికి నిదర్శనమని అంతర్జాతయంగా చాలామంది నిపుణులు ప్రశంసించారు. " --దువ్వూరి సుబ్బారావు (భారతీయ రిజర్వ్ బ్యాంక్ 22వ గవర్నర్), 2009లో ఐఎంఎఫ్ దగ్గర బంగారం కొనడం గురించి 

ద్రవ్యోల్బణం

  ఫిబ్రవరి 01, 2021 ద్రవ్యోల్బణం  ( dravyo lbaṇamu )       అర్థము     (విశేష్యము): డబ్బుకు ఉన్న కొనుగోలు శక్తీ పడిపోవడం; వస్తువుల ధరలు పెరిగిపోవడం;       ద్రవ్యం  - డబ్బు,  ఉల్బణం - పొంగు, పెరుగు     Meaning        (noun) : inflation         వాడుక / Usage     ద్రవ్యోల్బణం అదుపులో పెట్టడం రిజర్వు బ్యాంకు ముఖ్య ఉద్దేశం.   Controlling inflation is an important objective of RBI.      మెదడుకు మేత / Food for thought   "నా దగ్గర ఉన్న సమాచారం మారినప్పుడు, నా అభిప్రాయాలు మార్చుకుంటాను. మరి మీరో?" --జాన్ మేనార్డ్ కీన్స్ (5 జూన్, 1883 - 1946) ఆర్థిక శాస్త్రవేత్త