పేరడివి
ఆగష్టు 31, 2022 పేరడివి ( pēra divi ) అర్థము (సమాసము ): పేరు = ఘనీభవించిన, సాంద్రమైన, పెద్ద; అడవి = అరణ్యం; దట్టమైన అడవి Meaning (Compound) : dense forest వాడుక / Usage ద్వైత మరియు కామ్యక పేరడవుల్లో పాండవులు అష్టకష్టాలు అనుభవించినా ధర్మ మార్గం వీడలేదు. Pandavas suffered a lot in the dense jungles of Dvaitha & Kamyaka but never strayed from the path of Dharma. మెదడుకు మేత / Food for thought వస్తావట్టిది పోతావట్టిది ఆశలెందుకంటా పోయేనాడు వెంబడిరాదు పూచికపుల్లైనా చేతిలో బెల్లం ఉన్నవరకే చీమ బలగమంట చేతిలో బెల్లం చెల్లితే ఎవరు రారు వెంట వస్తావట్టిది పోతావట్టిది ఆశలెందుకంటా ప్రమిదలో నూనె ఉన్నవరకే దీపమెలుగునంట ప్రమిదలో నూనె నిండగా దీపమారునంట వస్తావట్టిది పోతావట్టిది ఆశలెందుకంటా పంచభూతముల తోలుబొమ్మతో ప్రపంచమాయెనంట మట్టికుండ ఇది నమ్మరాదు మర్మమెరుగమంట వస్తావట్టిది పోతావట్టిది ఆశలెందుకంటా