Posts

Showing posts from October, 2022

సింహావలోకనము

  అక్టోబర్ 31, 2022 సింహావలోకనము  ( simh-āva-lōkanamu )       అర్థము      (విశేష్యము ): సింహ+అవలోకనము(చూడడం); (సింహంలాగా) అంతా కలియచూడడం; పర్యవేక్షణ; గతంలో జరిగిన తప్పులను విశ్లేషించడం     Meaning     (noun) : Lion's look; careful inspection; retrospection    వాడుక / Usage కరోనా సమయంలో ప్రభుత్వ వైఫల్యం గురించి సింహావలోకనం చేయకపోతే తప్పులు దిద్దుకునేది ఎలా? How can lessons be learnt if there is no retrospection of the failures of Government during Corona?     మెదడుకు మేత / Food for thought అయిదు నెలలు పైగా భారత లోక్ పాల్ చైర్మన్ పదవి భర్తీ అవలేదు. కేవలం తాత్కాలిక చైర్మన్ ఉన్నారు. కమిటీలో మొత్తం ఎనిమిది మంది సభ్యులు కాగా వాటిలో రెండు స్థానాలు రెండు సంవత్సరాల పైగా భర్తీ చేయబడలేదు. లోక్ పాల్ వెబ్ సైట్ ప్రకారం 2020-2021 వార్షిక నివేదిక మార్చ్ 31, 2021 రాష్ట్రపతికి సమర్పించారు. కానీ 2021-2022 నివేదిక ఇప్పటి వరకు సమర్పించిన దాఖలాలు లేవు. సమాచార హక్కు చట్టం క్రింద ఒక విలేఖరి ప్రశ్నకు సమాధానంగా ఇది ఇచ్చారు...

అభిజ్ఞానము

  అక్టోబర్ 28, 2022 అభిజ్ఞానము  ( abhi-gnānamu )       అర్థము      (విశేష్యము ): గుఱుతు; చిహ్నము; ఆనవాలు; లక్షణము; తెలివి; గుర్తు పట్టడం; జ్ఞానము     Meaning     (noun) : a sign; token; recollection; intelligence; cognition    వాడుక / Usage అభిజ్ఞావాదం గమనించదగ్గ ప్రవర్తనకు మించి, అభ్యాసాన్ని అంతర్గత మానసిక ప్రక్రియలుగా చూస్తుంది. Cognitivism looks beyond observable behaviour, viewing learning as internal mental process.     మెదడుకు మేత / Food for thought ఎదను దోచి ఏదో చేసి హిహిహి కళ్లనిండా కలలే దాచి చెంతకీ.. ఎదను దోచి ఏదో చేసి కళ్లనిండ కలలే దాచి ఎదను దోచి ఏదో చేసి హిహిహి కళ్లనిండ కలలే దాచి చెంతకీ చేరకా ఊరింతువేలా.. ప్రాణమా... ప్రాణమా.. ఎదనే నిదురించవా ఎదురై మురిపించవా పాటే పలికించవా తోడై పులకించవా ఎదనే నిదురించవా ఎదురై మురిపించవా పాటే పలికించవా తోడై పులకించవా ప్రాణమా… ప్రాణమా… ప్రాణమా… ప్రాణమా… ఎదను దోచి ఏదో చేసి కళ్లనిండ కలలే దాచి ఎదను దోచి ఏదో చేసి కళ్లనిండ కలలే దాచి చెంతకీ చేరకా ఊరింతువేలా.. ప...

వాసన

  అక్టోబర్ 27, 2022 వాసన  ( vaasana )       అర్థము      (విశేష్యము ): గంధము; వస్త్రము; సంస్కారము; దురాశ;  అనుభూతార్థస్మృతి (అనుభూతి కారణంగా చేతనంలో ముద్రపడినవి)     Meaning     (noun) : fragrance(or stink); subconscious impressions which are stored up as a result of past actions    వాడుక / Usage అభినవగుప్తుడి ప్రకారం బాహిర జగత్తు అదివరకే మనిషిలో ఉన్న వాసనలకు తదనుగుణమైన వాటిని గుర్తు చేస్తుందే తప్ప ప్రత్యేకంగా కొత్త జ్ఞానాన్ని కల్పించదు. Abhinavagupta postulated that the external world only brings forth knowledge derived from memory. It does not create new knowledge.     మెదడుకు మేత / Food for thought ఏమని పాడెదనో ఈ వేళా ఏమని పాడెదనో ఈ వేళా మానస వీణ మౌనముగా నిదురించిన వేళ ఏమని పాడెదనో... జగమే మరచి హృదయ విపంచి గారడిగా వినువీధి చరించీ కలత నిదురలో కాంచిన కలలే గాలిమేడలై కూలిన వేళా యేమని పాడెదనో... వనసీమలలో హాయిగా ఆడే రాచిలుక నిను రాణిని చేసే పసిడి తీగలా పంజరమిదిగో పలుకవేమనీ పిలిచేవేళా --భార్యాభర్త...

సుప్తి

  అక్టోబర్ 26, 2022 సుప్తి  ( supti )       అర్థము      (విశేష్యము ): నిద్ర; తిమ్మిరి; సుషుప్తి;  మేల్కొన్న తరువాత కలలు సైతం జ్ఞాపకం రాని గాఢనిద్ర     Meaning     (noun) : sleep; deep sleep; unconscious    వాడుక / Usage ఫ్రాయిడ్ ప్రకారం మనస్సుకు సుప్త చేతన, ఉపచేతన, చేతన అను మూడు దశలు ఉంటాయి. Freud's psyche has three states - unconscious, sub conscious and conscious.     మెదడుకు మేత / Food for thought మౌనమెందుకు.. మాటాడవెందుకు దూరమెందుకు.. దరి చేరవెందుకు ఎద మారుమూల ఉన్న మాట దాచి ఉంచకు ఎదురైన వేళ అదుపు దాటి చేరవెందుకు అంత బిగువా.. మెట్టు దిగవా.. ఎంత ఇష్టం ఉన్నా పైకి చెప్పవా ఇంత తెగువా... మాట వినవా.... కొంత కష్టం అయినా కాస్త ఆగవా మది నాకు చెప్పకుండా నీ వెంట పడ్డది మన చేతిలోన ఉందా ఈ ప్రేమ పద్ధతి తప్పేమి ఉన్నది నిజమొప్పుకొందుకు దారేమి ఉన్నది నిను తప్పుకొందుకు రెచ్చగొట్టినా.. నవ్వుతున్నదే.. మత్తు కమ్మేసిందా కన్నె మనసుని ఎంత కుట్టినా.. కెవ్వుమనదే.. పువ్వు పొమ్మంటుందా తేనెటీగని నిను చూడకుంటే ప్రాణం ఇక...

చైతన్య స్రవంతి

  అక్టోబర్ 25, 2022 చైతన్య స్రవంతి  ( chaitanya  sravanti )       అర్థము      (విశేష్యము ): చైతన్య =తెలివి/ప్రాణము, స్రవంతి=నది/యేరు;  మనిషి మన: ప్రపంచంలో చెలరేగే విభిన్నమైన , విరుద్ధమైన భావాలను సాధ్య మైనంత యథార్థ రూపంగా అక్షరరూపం ఇవ్వడం     Meaning     (noun) : stream of consciousness -  method that attempts "to depict the multitudinous thoughts and feelings which pass through the mind" of a narrator    వాడుక / Usage బుచ్చిబాబు నవల 'చివరకు మిగిలేది'  చైతన్య స్రవంతి శిల్పానికి మార్గదర్శకమైనది. Bucchibabu's novel 'Chivaraku Migiledi' paved the narrative technique of Stream of Consciousness.     మెదడుకు మేత / Food for thought పరిమళించు వెన్నెల నీవే పలకరించు మల్లిక నీవే నా జీవన బృందావనిలో నడయాడే రాధిక నీవే కనుల ముందు నీవుంటేకవిత పోంగి పారదా తొలి చిగురుల చూడగానే ....కల కోకిల కూయదా అలనాటి జనకుని కోలువులో... తోలి సిగ్గుల మేలి ముసుగులో... అలనాటి జనకుని కోలువులో... తోలి సిగ్గుల మేలి ము...

ముక్తానుషంగం

  అక్టోబర్ 24, 2022 ముక్తానుషంగం  ( mukthanushangamu )       అర్థము      (విశేష్యము ): ముక్త=విడువబడినది, అనుషంగము=సంబంధము; మనిషి యొక్క  ఆంతరిక స్వగతాలు స్వేచ్ఛగా నిషేధం లేకుండా చెప్పడం (మనోవైజ్ఞాన శాస్త్రం)     Meaning     (noun) : free association (psychology) - expression of content of consciousness without censorship    వాడుక / Usage పాత్రల ముక్తానుషంగాల్ని చిత్రించడానికి చైతన్య స్రవంతి రచయితలు అనేక పద్ధతుల్ని సృష్టించుకొన్నారు. Writers of "stream of consciousness" employ various techniques to depict a character's unalloyed thoughts.     మెదడుకు మేత / Food for thought రేపు నేడు కనిపిస్తే నిజం నిజంగా వస్తే పొత్తిలిలో  పురిటిపాప పిడికిటాపి నినదిస్తే ఒకరిని పెనవేయు భయం ననలు తొడుగు ఒక హృదయం! -- అంపశయ్య నవీన్ రాసిన 'లైఫ్ ఇన్ ఎ కాలేజ్' కి ముందుమాట,  రాంభట్ల కృష్ణమూర్తి (మార్చ్ 24, 1920 - 2001)

పొద్దు

  అక్టోబర్ 21, 2022 పొద్దు  ( poddu )       అర్థము      (విశేష్యము ): ప్రొద్దు; సూర్యుడు; (ఉషా) కాలం; దినము; ప్రసవ దినములు     Meaning     (noun) : Sun; time; day; dawn; parturition (childbirth) days    వాడుక / Usage గాలినే పోయఁ గలకాలము తాలిమికిఁ గొంతయుఁ  పొ(బొ)ద్దు లేదు. Days, months, years - all time; frittered hither thither like wind; alas time there is none for endurance, fortitude and forgiveness.     మెదడుకు మేత / Food for thought ఎంత సేపూ తల దించుకుని కాలేజీకి వెళ్ళిరండి అని చెప్పే తల్లితండ్రులేగానీ కనీసం ఇంట్లోనైనా తలెత్తి అభిప్రాయం చెప్పే స్వేచ్ఛనిచ్చే వాళ్ళు ఎంత మంది. అందుకే కొడుకు సిగరెట్ కాలుస్తున్నాడని కిళ్ళీ కొట్టువాడు బాకీ అడిగేదాకా తండ్రికి తెలియదు. కూతురు ఎవరినో ప్రేమించిన విషయం వాడితో ఏ మార్నింగ్ షోలో కనిపించేంతవరకు తల్లికి తెలియదు. -- చిరు నవ్వుతో

గరిమ

  అక్టోబర్ 20, 2022 గరిమ  ( garima )       అర్థము      (విశేష్యము ): గొప్పతనం; గౌరవం; మహత్యం; బరువు; విధము     Meaning     (noun) : greatness; gravitas; weight; heaviness; worth; excellence    వాడుక / Usage శిరసు ముడువఁబట్టె చిక్కుదియ్యఁగఁ బట్టె గరిమలఁ గపటాలఁ గలకాలము. Knot the hair, untangle the knots; weighty mighty deceptions galore all our time.     మెదడుకు మేత / Food for thought గాలి దేవుడు, అది మనం పీల్చకపోతే చచ్చిపోతాము. నీరు దేవుడు, అది మనం తాగకపోతే బ్రతకలేము. భూమి దేవుడు, అది లేకపోతే మనకు అన్నం దొరకదు. అమ్మా నాన్న దేవుళ్ళు, వాళ్ళు లేకపోతే మనం అసలు లేము. చదువు నేర్పిన గురువు దేవుడు. కష్టంలో నష్టంలో దుఃఖంలో సుఖంలో దగ్గరుండే స్నేహితుడు; అంటే నువ్వే నాకు దేవుడివి. నీకు మొక్కుతున్నారా...అంతేకానీ ఆ నల్ల రాళ్లకు రప్పలకు కాదు! -- మూలం తెలియదు

కలచు

  అక్టోబర్ 19, 2022 కలచు  ( kalachu )       అర్థము      (క్రియ ): కలత/క్షోభ పెట్టు; నీటిని కలపడం; దంపతులు సంభోగం     Meaning     (verb) : perturb; agitate; mix; union of a couple    వాడుక / Usage కలచి చిందనే పట్టెఁ గడవ నించగఁ బట్టె కలుషదేహపుబాధఁ గలకాలము. Perturbed in anxiety we fill our time, afflictions of sinful body all our life.     మెదడుకు మేత / Food for thought పతివ్రతలకి మొగుడంటే భక్తే, కానీ ఓటు మాత్రం అపూజిషను పార్టీ వాడికే వేస్తారు. ఎనకటికి పురాణ కాలంలో కూడా రావణాసురుడు, మైరావణుడు, హిరణ్యకసుపుడు - ఆళ్ళ పెళ్ళాలు కూడా ఇంతే! పాద పూజలు మొగుడికి, పెసాదాలు ఎగస్పార్టీ వాడికీ!! -- యమగోల (1977), టి. రామారావు (1938 - 2022)

ఒడయడు

  అక్టోబర్ 18, 2022 ఒడయడు  ( oḍayaḍu )       అర్థము      (విశేష్యము ): ప్రభువు; స్వామి; భర్త; శ్రేష్ఠుడు; సేనాపతి     Meaning     (noun) : king; master; Army Chief; husband    వాడుక / Usage ఒడలికి జీవునికి ఒడయడై నహరిఁ దడవఁగాఁ గొంతయుఁ బొద్దు లేదు.  Master Hari is of life force of the body; alas find we no time to contemplate him.     మెదడుకు మేత / Food for thought మంచి చెడు అనేవి విడివిడిగా రాసులు పోసినట్లు ఉండవు. అవసరాన్ని బట్టి మంచి, అవకాశాన్ని బట్టి చెడు మనిషిలోంచి బయటపడుతుంటాయి. -- పెళ్లి పుస్తకం(1991), బాపు (డిసెంబర్ 15, 1933 - 2014)

చొర(వ)

  అక్టోబర్ 17, 2022 చొర(వ)  ( ṭsora )       అర్థము      (క్రియ ): ప్రవేశం; అక్రమంగా ప్రవేశించు; చొచ్చుకొని పోవు; నేర్పు     Meaning     (verb) : encroach; intrude; to enter    వాడుక / Usage   అడుసు చొర నే పట్టె నటునిటుఁ గాళ్ళు  గడుగుకొననే పట్టెఁ గలకాలము .  Quickly sticks to feet mud, prickly long to rid the intrude.     మెదడుకు మేత / Food for thought జల్లెడ మంచివాటిని జల్లించి పనికిరాని పొట్టుని, మట్టిని, రాళ్ళని, మాత్రమే తనలో నింపుకుంటుంది. కానీ చేట అలా కాదు. పొట్టు, మట్టి, రాళ్లు, చెత్త వగైరాలని నేల మీదకు నెట్టి వేసి పనికి వచ్చే ధాన్యాన్ని మటుకు తనలో నిలుపుకుంటుంది. మీరు ఏ రకానికి చెందుతారు? జల్లెడా లేక చేటా? -- మనసా రిలాక్స్ ప్లీజ్, స్వామి సుఖబోధానంద

లోలత్వము

  అక్టోబర్ 14, 2022 లోలత్వము  ( lolatvamu )       అర్థము      (విశేష్యము ): చాపల్యము; చంచలత్వము; ఆశ; తృష్ణ     Meaning     (noun) : fickleness; desire    వాడుక / Usage   చంచల చిత్తమైన మనస్సును, విషయ లోలత్వం నుంచి మరల్చాలని గీత బోధిస్తోంది .  Geeta teaches that the fickle mind be restrained by reining the Senses.     మెదడుకు మేత / Food for thought బంగారు కుదువఁబెట్టకు నంగడి వెచ్చము లాడకు, సంగరమునఁ బాఱిపోకు, సరసుడవైతే వెంగలితోఁ జెలిమివలదు వినురా సుమతీ! (బంగారము తాకట్టుపెట్టకు. యుద్ధమునందు పారిపోకు. దుకాణము నందు వెచ్చాలు అప్పు చేయకు. అవివేకితో స్నేహము చేయకు) -- బద్దెన (~ 1260)

ఒడలు

  అక్టోబర్ 13, 2022 ఒడలు  ( oḍalu )       అర్థము      (విశేష్యము ): శరీరము; దేహము; మేను; ఆధారం; నెలవు; భూమి     Meaning     (noun) : body; abode; earth    వాడుక / Usage  విదురుడు భక్తిపారవశ్యంతో ఒడలు మరచి పండు పారవేసి అరటిపండు తొక్కనే కృష్ణునికి తినిపించాడు.  Vidura lost himself in devotion and fed Krishna the peel of the banana.     మెదడుకు మేత / Food for thought పలుదోమి సేయు విడియము తలగడిగిన నాఁటి నిద్ర, తరుణులతోడన్ పొలయలుక నాఁటి కూటమి, వెల యింతని చెప్పరాదు వినురా సుమతీ! (దంతములు తోముకొనినవెంటవే వేసుకొను తాంబూలము, తలంటుకొని స్నానముచేసిననాటి నిద్ర, స్త్రీలతో ప్రణయకలహములు ఆడిన నాడు జరిగే పొందు - వీటి విలువ ఇంతయని చెప్పలేము సుమా) -- బద్దెన (~ 1260)

లుప్తము

  అక్టోబర్ 12, 2022 లుప్తము  ( luptamu )       అర్థము      (విశేషణము/విశేష్యము ): లోపించినది; కోయబడినది; దొంగసొమ్ము     Meaning     (adj/noun) : lost; cut off; plundered; stolen property    వాడుక / Usage  బ్రిటీష్ సంగ్రహాలయంలో పలు దేశాల్లోంచి లుప్తము చేయబడిన కళాకృతులు ఉన్నాయి.  British museum has many artifacts stolen from other countries.     మెదడుకు మేత / Food for thought ధనపతి సఖుఁడై యుండియు నెనయంగా శివుఁడు భిక్షమెత్తఁగవలసెన్ దనవారి కెంత గలిగిన తన భాగ్యమె తనఁకుగాక తధ్యము సుమతీ! (ధన వంతుడైన కుబేరుడు స్నేహితుడైనప్పటికినీ ఈశ్వరుడు బిచ్చమెత్తుట సంభవించెను. కాబట్టి, తన వారికెంత సంపద యున్నను, తనకుపయోగపడదు. తన భాగ్యమే తనకు ఉపయోగించును) -- బద్దెన (~ 1260)

ఉలిపికట్టె

  అక్టోబర్ 11, 2022 ఉలిపికట్టె  ( ulipikatte )       అర్థము      (విశేష్యము ):  నారుమడిలో గడ్డిని వేరుచేసే పనిముట్టు; పొగరుబోతు; చెడ్డవాడు; చిటపటలాడేవాడు; ఎవ్వరితోను పొసగనివాడు     Meaning     (noun) : farm implement; arrogant/bad or doesn't get along with anyone    వాడుక / Usage  ఉత్తరకొరియా వంటి ఉలిపికట్టె తప్ప ప్రపంచయుద్ధం తరువాత ఏ దేశం అణ్వాస్త్రాలు చూపి బెదిరించలేదు.  No country other than N.Korea has threatened with nuclear weapons since WW.     మెదడుకు మేత / Food for thought హా హా పుత్రక నాధీతం గతాస్వేతాసు రాత్రిషు తేన త్వం విదుషాం మధ్యే పఙ్కే గౌరివ సీదసి ( అయ్యయ్యో ! ఓ కుమారా! గడిచిన దినములలో శాస్త్రాదిసాహిత్యవిషయములను శ్రద్ధగా చదువకపోతివి, వృథాగా కాలం గడిపితివి. ఆ వృథాకాలక్షేపంచేత నీవు నేడు పండితుల మధ్యన బురదయందు చిక్కిన దున్నపోతు వలె దుఃఖించుచున్నావు ) -- హితోపదేశ, నారాయణ పండితుడు (~ తొమ్మిదవ శతాబ్ధము)

యాదృచ్ఛికము

Image
  అక్టోబర్ 10, 2022 యాదృచ్ఛికము  ( yādṛcchikamu )       అర్థము      (విశేషణము ):  కాకతాళీయము ; తనంతట తాను అయ్యేది; ఎదురు చుడనిది     Meaning     (adjective) : unexpected; spontaneous; accidental; coincidental    వాడుక / Usage   ఇంగ్లండ్‌తో తన అంతర్జాతీయ కెరీర్‌ను ఆరంభించిన  జులన్‌  ఇంగ్లండ్‌తో సిరీస్‌తోనే కెరీర్‌ను  ముగించడం యాదృచ్ఛికం.  It's coincidental that Julan started and ended her international career against England.     మెదడుకు మేత / Food for thought కావ్యశాస్త్ర వినోదేన కాలో గచ్ఛతి ధీమతామ్‌ వ్యసనేన చ మూర్ఖాణాం నిద్రయా కలహేన వా ( కావ్యపఠన,శాస్త్రావగాహనముల వలన కలిగిన ఆనందంతో, బుద్ధిమంతులైన వారి యొక్క సమయము గడుస్తుంది. ఇక మూర్ఖులయొక్క కాలము, దుర్వ్యసనముల చేత, అకాలనిద్ర చేత, మరియు కల్పిత వివాదముల చేత గడుస్తుంది. అనగా ఉత్తముల కాలము సద్విషయాలతో, అధముల సమయము దుర్విషయాచరణతో గడుస్తూ ఉంటుంది) -- హితోపదేశ, నారాయణ పండితుడు (~ తొమ్మిదవ శతాబ్ధము)

యాతం

   అక్టోబర్ 07, 2022 యాతం  ( yaatamu )       అర్థము      (విశేష్యము ): నీళ్లు తోడే ఏటవాలు కొయ్యబద్ద యంత్రము; ఏతము; రాటనము     Meaning     (noun) : water lift built using a seesaw mechanism; well pole    వాడుక / Usage  ఎండబడి వచ్చిన రైతుకు అతని బిడ్డడు యాతం తోడి దప్పిక తీర్చాడు.  The farmer returned weather beaten and his son drew water to quench his thirst.     మెదడుకు మేత / Food for thought వే: రాజయోగమా?! నాకెవ్వరు ఉపదేశిస్తారు స్వామీ? గు: ఆ సమయం వచ్చినప్పుడు పరమాత్మే సద్గురువై ఉపదేశిస్తాడు. వే: కారు చీకటిలో దారితెలియక తికమకపడుతున్న నాకు వెలుగు వలె మీరు లభించారు. మీరే నా గురువులు. నా దైవం. ఆ యోగ రహస్యం నాకు బోధించి సత్యస్వరూపం చూపించండి. గు: అతిగుప్తమైన ఆత్మ విద్యను నీకు బోధిస్తున్నాను. సావధానుడవై విను. రసాన్ని కట్టేస్తే కానీ స్వర్ణం కానట్లు మనస్సుని కట్టివేస్తేగాని సత్యం కనిపించదు. మనస్సే మన బంధానికి మోక్షానికి కారణం. దానిని స్వాధీనం చేసుకుంటే మనకు స్వాధీనం కానిది లేదు. ఆ సాధనే యో...

దిడ్డీ

  అక్టోబర్ 06, 2022 దిడ్డీ  ( dhiddi )       అర్థము      (విశేష్యము ): దొడ్డి; పెరడు; చిన్న కిటికీ లేక గూడు     Meaning     (noun) : backyard    వాడుక / Usage   గోధూళి వేళ  దిడ్డీలో నుంచుని ఆమె కర్రి ఆవు కోసం ఎదురు చూసింది .  At sunset she stood in the backyard waiting for the black cow.     మెదడుకు మేత / Food for thought గు: ఈ రహస్యం తెలుసుకోవటానికి దేవతలకే సాధ్యం కాలేదే, మానవులకు సాధ్యం అవుతుందా? వే: మీ వంటి మహానుభావులే సాధ్యం కాదంటే మాకు దిక్కు ఎవరు స్వామీ? నేనీ దుఃఖ భాజనమైన సంసారంలో  కృశించి జననమరణ ప్రవాహంలో కొట్టుకు పోవలసిందేనా?మానవునికి తరుణోపాయం లేదా స్వామీ! గు: లేకేం నాయనా! ఉంది. ఈ శరీరం విద్యావిద్యలు రెంటితోను పుట్టింది. సంసార యాత్రకు మోక్షయాత్రకు ఇదే సాధనం. అవిద్యచే మోహితుడవై కనిపించే ఈ జగత్తు సత్యము నిత్యము అనుకుని దుఃఖ భజనములమై చావు పుట్టుకుల కుమ్మరిసారిలో తిరుగుతున్నాము. ఇదంతా అనిత్యమని ఈ నాటకానికంతటికీ కారణమైన మహాచైతన్యం వేరే ఉందని అది నిత్యము సత్యము అని తెలుసుకున...

మేజువాణి

  అక్టోబర్ 05, 2022 మేజువాణి  ( mejuvani )       అర్థము      (విశేష్యము ): విందు; వేడుక; భోగంవారి మేళము     Meaning     (noun) : feast; celebration; dancing girl's dance/music    వాడుక / Usage   తెలుగు తొలి సైన్స్‌ ఫిక్షన్‌ కథ ‘పరమాణువులో మేజువాణి ’ హైదరాబాదుకు చెందిన సిరిగూరి జయరావు 1927 డిసెంబరు ‘సుజాత’ పత్రికలో రాశారు.  The first science fiction story in Telugu 'dance in atom" by Siriguri Jayarao was published in 1927 in the magazine Sujata.     మెదడుకు మేత / Food for thought గురువు: ఎవరు నాయన నువ్వు? ఎందుకింత ఆవేదన పడుతున్నావు? వేమన: జీవిత పరమార్థం తెలుసుకోలేక ఆర్తి పడుతున్న అంధుణ్ణి గు: జీవితానికి పరమార్థం అంటూ ఒకటి ఉందనుకుంటున్నావా? వే: లేదా స్వామి? వేద వేదాంగాలెరిగిన మహర్షులు, దేశ దేశాల్ని జయించిన చక్రవర్తులు, సీదా సాదా అంతా పుట్టి పెరిగి మరణిస్తున్నారే! వీరంతా మరణించిన తరువాత ఏమవుతున్నారు స్వామి? గు: పిచ్చివాడా లోకమంతా ఈ శరీరంతో జీవించి సుఖించాలని తాపత్రయ పడుతుంటే మరణించిన తరువాత ...

ఉడ్డోలం

  అక్టోబర్ 04, 2022 ఉడ్డోలం  ( uddolam )       అర్థము      (విశేష్యము ): సాటిలేని; పెద్దది; అత్యధికం; ఉప్పొంగే; ఆశ్చర్యం     Meaning     (noun) : huge; incomparable; surprise    వాడుక / Usage  ఉత్తరగోగ్రహణంలో కౌరవుల  ఉడ్డోలమైన సైన్యాన్ని అర్జునుడు ఒక్కడే ఓడించాడు.  Arjuna single-handedly defeated Kourava's mighty army.     మెదడుకు మేత / Food for thought చలం: ఏమిట్రా కేకలు? గీత : నాన్నా, అన్నయ్య ఎవరో అమ్మాయిని పెళ్లి చేసుకుని వెళ్ళిపోతున్నాడు. సత్యం: ఎవరో అమ్మాయి కాదు. నా అదృష్టవశాత్తు నన్ను ప్రేమించిన ఓ లక్షాధికారిణి. నేను చాలా అందంగా కనిపించానట ఆవిడకి. డ్రైవ్ చేయగలవా అని అడిగింది. నేర్చుకుంటాను అన్నాను. నెల రోజులు నేర్పింది. బూట్లు పాలిష్ చేయగలవా అంది. కొనిస్తే చేసుకుంటాను అన్నాను. ఇవి ఆవిడే కొంది. నా భర్తగా ఉండగలవా కొంతకాలం అంది. ప్రయత్నిస్తాను అన్నాను. అంతే. నన్ను లేవదీసుకుపోడానికే నిశ్చయించింది. ఆధునిక రుక్మిణీ కళ్యాణం. హౌ డు యూ లైక్ ఇట్? చలం: ఛీ నోర్ముయ్ సత్యం: అంత గౌరవం నాకెంద...

లొటారము

  అక్టోబర్ 03, 2022 లొటారము  ( loṭāramu )       అర్థము      (విశేష్యము ): బొక్క; శూన్యత; రంధ్రము; బీదరికం; నిస్సారము     Meaning     (noun) : hole; pit; empty; worthless; poverty    వాడుక / Usage  ప్రైవేట్ బడులలో విద్యాబోధన పైన పటారం లోన లొటారం చందంగా ఉంది .  The education in private schools is all style and no substance.     మెదడుకు మేత / Food for thought మధుర: చట్లకి చావ నలుపు, మనిషికి చావ తెలుపూ. అనగా చీకట్లో నక్షత్రాల్లాగ, అక్కడక్కడ తెల్ల వెంట్రుక తగిల్తేనే చమక్‌. రామ: స్వారస్యం మా చమత్కారంగా తీశావ్‌ ! యేదీ ముద్దు. మధుర: సత్తువుందనా మోటతనం? రామ: చాప చిరిగినా చదరంతని, నీప్రాణానికి యిప్పటి సత్తువే ఉడ్డోలంలా కన పడుతూంది... రామ: లౌక్యవఁంటే మరేవిఁటనుకున్నావు? అసాధ్యాలు సాధ్యం, సాధ్యాలు అసాధ్యం చెయ్యడవేఁ కదూ? మధుర: యేమ్మోసం! రామ: లౌక్యం, లౌక్యవఁను! మధుర: రెండింటికీ యేవిఁటో భేదం. రామ: నమ్మించోట చేస్తే మోసం, నమ్మంచోట చేస్తే లౌక్యవఁను. మధుర: తాను చేస్తే లౌక్యం, మరోడు చేస్తే మోసం అనరాదా? ...