శమనము
మే 01, 2023 శమనము ( ṣamanam u ) అర్థము (విశేష్యము ): శాంతి; నొప్పి తగ్గటం; అనునయనము; ఊరట; జంతు బలి Meaning (noun) : peace; calmness; soothing; animal sacrifice వాడుక / Usage ప్రేయసీ! నా హృదయ పరితాపం శమింప జేయ నీ నగుమోము చూపరాదే? Darling! Can you not show me your beautiful face and soothe the pangs of my heart? మెదడుకు మేత / Food for thought వరుస దప్పని కారణావళులతోడఁ గీలు కొల్పినఁ గారణమాలయగును నీతిచే సిరి సిరి చేత దాతృతయును దాతృతను భూరియశమన్నరీతి శర్వ (కారణం కార్యం ఒకదానికొకటిగా చెప్పుకుంటూ పోతే అది కారణమాలాలంకారము. కారణం అంటే cause, కార్యం అంటే effect. ఒక కారణానికి కార్యం మఱొక కార్యానికి కారణంగా ఉంటే అది కారణమాల. ఉదాహరణకు - నీతి చేత సంపద, సంపద చేత దానగుణం, దానగుణం వలన గొప్ప కీర్తి వస్తాయి) -- చంద్రాలోకం, ఆడిదము సూరకవి (18 వ శతాబ్దము)