Posts

Showing posts from September, 2023

ఎకాఎకీ

  అక్టోబర్ 04, 2023 ఎకాఎకీ     ( ekaeki )       అర్థము      (విశేషణము ):  ఆలస్యం లేకుండా; అకస్మాత్తుగా; ఉన్నట్లుండి     Meaning     (adj) : sudden; straightaway; speedy; all at once    వాడుక / Usage ఎకాఎకీ భీముడు నాగలోకం దాకా పోయాడు. Bheema straightaway went all the way to Nagaloka.     మెదడుకు మేత / Food for thought ఊరవతల సందులలో దుమ్ము కొట్టుకపోయిన పిల్లల కండ్లలో ఆరిపోతున్న వెలుగులో కాలవ వడ్డున ఒంకర దిరిగిన తుమ్మచెట్టు కొమ్మలోంచి కాలి మసైపోతున్న పశ్చిమ దిశాగగనంలో ఒక భయంకర సృష్టిక్రమాన్ని మానవయత్న వైఫల్యాన్ని ఊహించికొని వొణికిపోయేవాణ్ణి. -- దేవరకొండ బాలగంగాధర్ తిలక్

జఠరాగ్ని

  అక్టోబర్ 03, 2023 జఠరాగ్ని     ( jaṭhar-āgni )       అర్థము      (విశేష్యము ):  భోజనం జీర్ణించు అగ్ని     Meaning     (noun) : gastric juice    వాడుక / Usage భీముని దేహం వజ్రకఠినం కావడం వల్ల పాముల కోరలు విరిగాయి. జఠరాగ్ని బలం వల్ల విషం జీర్ణమయ్యింది. Snakes fangs broke as Bhima's body was hard as a diamond. His digestive power absorbed the poisons.     మెదడుకు మేత / Food for thought ఏ లేమ పులకింతవే వెన్నెలా! ఏ భామ మైపూతవే తెల్లని నీ వెలుగు వెల్లువల డోలికల ఉయ్యాల లూగేను వయ్యారి యమున ఏ సుదతి చిరునవ్వువే వెన్నెలా! ఏ మగువ సిగపువ్వువే తెల్లని నీ వెలుగు వెల్లువల పరుపుపై పవళించె నరమోడ్పు ముదిత బృందావని! ఏ కన్నె ఎద మంటవే వెన్నెలా! ఏ కాంత తమి పంటవే తెల్లని నీ వెలుగు వెల్లువల పడగలపై పిల్లన గ్రోవూదె నల్లని నా సామి! -- తఃతః 

సడలు

  అక్టోబర్ 02, 2023 సడలు     ( saḍalu )       అర్థము      (విశేష్యము ):  ఊడుట; జారుట; వదలుట     Meaning     (noun) : loosening; falling; slackness    వాడుక / Usage భూదేవికి యౌవనం సడలి వార్ధక్యం వస్తున్నది. Earth's youthfulness has slackened and old age is setting in.     మెదడుకు మేత / Food for thought అది రమణీయ పుష్పవన, మా వనమందొక మేడ, మేడపై నదియొక మారుమూల గది, ఆ గది తల్పులు తీసి మెల్లగా పదునయిదేండ్ల యీడుగల బాలిక పోలిక రాచపిల్ల జం కొదవెడి కాళ్ళతోడ దిగుచున్నది క్రిందికి మెట్లు మీదుగాన్‌ -- కుంతి కుమారి, కరుణశ్రీ జంధ్యాల పాపయ్య శాస్త్రి (ఆగష్టు 04, 1912 - 1992)

విపత్తు

  సెప్టెంబరు 29, 2023 విపత్తు     ( vipattu )       అర్థము      (విశేష్యము ):  ఆపద; కీడు; ప్రళయము     Meaning     (noun) : calamity; disaster    వాడుక / Usage వచ్చేవన్నీ చెడు రోజులే. భయంకరమైన విపత్తులు రాబోతున్నాయి. Bad tidings are coming. Fierce calamity is on its way.     మెదడుకు మేత / Food for thought ప్రేమ వాన తర్వత కాచే ఎండ లాగ వెచ్చబుచ్చుతుంది కానీ కామం వెలుగు తర్వాత వచ్చే తుఫాను లాగా భయపెడుతుంది ప్రేమ యొక్క వసంతం ఎప్పటికీ కళకళలాడుతూనే ఉంటుంది కామం యొక్క శీతలం గ్రీష్మం అవ్వకుండానే ముసురుకుంటుంది ప్రేమ వెగటుపుట్టదు; కామం మితిమీరి ముగుస్తుంది ప్రేమ అంతా సత్యమయం; కామం నిండా అబద్ధాల రజం -- విలియమ్ షేక్స్పియర్ (ఏప్రిల్ 26, 1564 - 1616)

శిబిక

  సెప్టెంబరు 28, 2023 శిబిక     ( ṣibika )       అర్థము      (విశేష్యము ):  పల్లకి; డోల; మేనా;      Meaning     (noun) : palanquin; litter; bier    వాడుక / Usage చందన పుష్పాలతో అలంకరించిన శిబిక మీద ఆస్థిభాండముంచి నదీతీరానికి బయలుదేరాడు. He placed the urn on the bier bedecked with sandal and flowers and headed to the river.     మెదడుకు మేత / Food for thought మనుషులు చేసిన చెడు వాళ్ళు చచ్చిపోయిన తర్వాత కూడా బ్రతికే ఉంటుంది. కానీ వాళ్ళు చేసిన మంచి వాళ్ళ అస్థికలతో పాటే కప్పేయబడుతుంది. --జూలియస్ సీసర్, విలియమ్ షేక్స్పియర్ (ఏప్రిల్ 26, 1564 - 1616)

మకరందము

  సెప్టెంబరు 27, 2023 మకరందము     ( makarandamu )       అర్థము      (విశేష్యము ):  పువ్వుల తేనె; మధువు     Meaning     (noun) : nectar; honey of flowers    వాడుక / Usage పూలలోని మకరందం త్రాగుతూ తుమ్మెదలు ఝంకారాలు చేస్తున్నాయి. The bees are humming after drinking the nectar of flowers.     మెదడుకు మేత / Food for thought వ్యధ వలదు, యువతి నిట్టూర్పు ఇక వలదు, మగవారు ఎప్పటికీ వంచకులే, ఒక పాదం నీటిలో, మరొకటి ఒడ్డున, ఒకదానితో స్థిరంగా ఉండరెన్నటికీ. ఇంక దుఃఖం ఎందుకు, పట్టి ఉంచకు వారిని, ఆపై నువ్వు ఉల్లాసంగా ఉండు, అందంగా ఆనందంగా ఉండు, మార్చు నీ బాధల పోకడిని, సంతోషాల గీతంలోకి సంగీతంలోకి --మచ్ ఏడో అబౌట్ నతింగ్, విలియమ్ షేక్స్పియర్ (ఏప్రిల్ 26, 1564 - 1616)

ఇష్టాగోష్టి

  సెప్టెంబరు 26, 2023 ఇష్టాగోష్టి     ( ishtagoshti )       అర్థము      (విశేష్యము ):  సరససల్లాపము; కబుర్లు; ముచ్చట్లు     Meaning     (noun) : chit chat; exchanging pleasantries    వాడుక / Usage పాండురాజు కుంతీదేవితో కూర్చుని ఇష్టాగోష్టి నడిపే వేళ పెద్దపులి ఆకలితో గాండ్రిస్తూ వారి మీదకి రాబోయింది. As Panduraja was chatting with Kunthi a hungry tiger attacked them.     మెదడుకు మేత / Food for thought మరణించడం, - పడుకోడం పడుకోవడం - కలలు కంటామేమో: అహో అదే కదా చిక్కు! ఆ చిక్కటి నిద్రలో ఏ కలలు వస్తాయో ఈ అశాశ్వతమైన బొందిలోంచి జారుకున్నాక అనేదే మనల్ని ఆపాలి: ఆ ఆలోచనే సుదీర్ఘ జీవిత సాగరాన్ని ఈదనిస్తుంది! -- హామ్లెట్, విలియమ్ షేక్స్పియర్ (ఏప్రిల్ 26, 1564 - 1616)

వాత్సల్యము

  సెప్టెంబరు 25, 2023 వాత్సల్యము     ( vaatsalyam )       అర్థము      (విశేష్యము ):  ప్రేమ; అభిమానం; పెద్దలకు పిల్లలయందు ఉండే అనురాగం     Meaning     (noun) : affection towards offspring; fondness    వాడుక / Usage పుత్ర వాత్సల్యం కల ధృతరాష్ట్రుడు వారి మాటలు వినలేదు. Blinded by love for his son Drutarashtra did not heed their advice.     మెదడుకు మేత / Food for thought పిరికివాళ్ళు పలుమార్లు చస్తారు మరణించే ముందు; ధైర్యవంతులు చావుని చవిచూడరు ఒక మారు తప్ప. నేను ఇప్పటిదాకా విన్న వింతలలో, అన్నిటికన్నా ఆశ్చర్యం మనుషులు భయపడడమే; మృత్యువు తప్పనిసరి అని తెలిసినా, ఎప్పుడు రావాలో అప్పుడు వస్తుందని తెలిసినా. -- జూలియస్ సీసర్, విలియమ్ షేక్స్పియర్ (ఏప్రిల్ 26, 1564 - 1616)

కీల

  సెప్టెంబరు 22, 2023 కీల     ( keela )       అర్థము      (విశేష్యము ):  మేకు; మంట; అగ్ని జ్వాల; మోచేయి     Meaning     (noun) : flame; elbow; nail    వాడుక / Usage " ఉదధి కడుపులో రగిలే బడబానలాన్ని సహస్ర కీల లతో బహిర్గతం చేసినా ". Even if the fire in the ocean expresses in a thousand flames.     మెదడుకు మేత / Food for thought “మహానుభావా! మీతో మేం చాల్లేం గానీ, బళ్ళో మంచి పాఠాలు నేర్పి, వీధిలో ఇలా కబ్బాడీ ఆడించి పిడిగుద్దులు గుద్దుతుంటే, మీరు మమ్మల్ని రాముడు మంచిబాలుడిగా తీర్చి దిద్దుతున్నారో, మాకు రాలుగాయి రౌడీల్లా తయారయే తర్ఫీదిస్తున్నారో మీకే తెలియాలి” అంటూ- ఆకాశాన్ని ఆక్రమించిన ఆయన భావనా పదానికి, భూగోళాన్ని ఆక్రమించిన ఆయన భాషా పదానికి భక్తితో అంజలి ఘటిస్తూ, ‘నా మూడో పదాన్ని నీ నెత్తిన పెడతా’ అంటున్న ఆయన తాండవ పదానికి భయంతో నమస్కరిస్తూ, ముమ్మారు మొక్కుతూ… -- వేటూరి గురించి సిరివెన్నెల 2002 హాసం పత్రికలో

ఔచితి

  సెప్టెంబరు 21, 2023 ఔచితి     ( ouchithi )       అర్థము      (విశేష్యము ):  యోగ్యత; ఉచితము; మంచి     Meaning     (noun) : aptness; propriety; suitability    వాడుక / Usage " ఆయా చిత్రాల్లోని కథ, సన్నివేశాలు, పాత్రల ఔచితి , వగైరా సహకరించడం కూడా కారణమని అర్థమవుతుంది ". The aptness of story, scenes, characters etc in the films are also a reason.     మెదడుకు మేత / Food for thought ‘అర్థం కావడం వేరు, అనుభూతికి అందడం వేరు’ అని తెలుసుకుంటే – ‘ఏవో కొన్ని మాటలతోనే నిత్యనైమిత్తిక వ్యవహారాలు నడిచి పోతున్నాయి కదా, ఇంకా అంత విశాలమైన భాషార్ణవం దేనికి? రండి, భాషా సాగరాన్ని ఎండగట్టి ఎడారి చేసేద్దాం’ అనుకునే విపరీత ధోరణి మానుకుంటే – మనకి అర్థం అయేలా మనకి అందుబాటులోకి వచ్చేలా విలువల శిఖరాల్ని తలవంచమనడం కన్నా – గొప్ప విషయాల్ని అర్థం చేసుకునే శక్తి మనకి వశమయ్యేలా అభ్యాసం చేద్దాం -- వేటూరి గురించి సిరివెన్నెల 2002 హాసం పత్రికలో

వినమ్రము

  సెప్టెంబరు 20, 2023 వినమ్రము     ( vinamramu )       అర్థము      (విశేష్యము ):  బాగా వంగినది; చాలా వినయము; తగరము     Meaning     (noun) : well bent; humble; bowed; tin    వాడుక / Usage " వారికి నా శుభాకాంక్షలను, వినమ్ర ప్రణామాలను అర్పించుకుంటున్నాను ". I offer my best wishes and humble salutations to him.     మెదడుకు మేత / Food for thought మంచి ‘పలుకుబడిని’ కొందరికే పరిమితం చేయకుండా సమాజంలో అందరికీ పంచిపెట్ట గలిగిన, పంచి పెట్టవలసిన ‘వేదిక’ ఏదీ ఎక్కడా ‘మాటవరసకి’ కూడా లేక, తెలుగుభాష నిరుపేదగా మారి, నడి వీధుల్లో పడుతున్న సమయంలో, వేటూరి గారిలోని ‘వాచస్పతి’ మనకి సంస్కృతసత్సంగంతో పరిపుష్ఠమై, గాంభీర్యంలోనూ గహనత్వంలోనూ విస్తృతిలోనూ సౌందర్యంలోనూ మరే ఇతర భాషకి అందనంత ఎత్తులో ఊన్న ఆంధ్రభాషతో పునః పరిచయం కలిగించే ప్రయత్నం చేసారు. అది కూడా ప్రజాబాహుళ్యానికి చేరువగా ఉన్న వెండితెర వేదిక ద్వారా.. -- వేటూరి గురించి సిరివెన్నెల 2002 హాసం పత్రికలో

సాకల్యము

  సెప్టెంబరు 19, 2023 సాకల్యము     ( sākalyamu )       అర్థము      (విశేష్యము ):  సమస్తము; యావత్తు; సంపూర్తి      Meaning     (noun) : the whole; the total; entirety    వాడుక / Usage " వేటూరి గారి బహుముఖ ప్రతిభను సాకల్యం గా సమీక్షించిన వారి హృదయం – నవరసాల్లోనూ మునిగి తేలి, ఎంత తుడుచుకుందామనుకున్నా ఆరని ‘అద్భుత రస’ స్పర్శతో చిరకాలం ‘స్నేహం’ చేస్తుంది ". The hearts of those who view Veturi's multifaceted talent will cherish its beauty forever.     మెదడుకు మేత / Food for thought యుగళగీతమైనా, భక్తిగీతమైనా, రక్తిగీతమైనా, విరక్తిగీతమైనా, ‘ఉత్తి’ గీతమైనా – పాట…అదే సినిమా పాట ఆయన కొనవేలు పట్టుకుని కొత్త మలుపుల్లోకి నడవడం మొదలెట్టింది. మొట్టమొదటసారిగా బాణీ కట్లుబాట్లని, ‘చిత్ర’ పరిధుల్ని దాటి, తనదైన స్వతంత్ర ప్రతిపత్తితో ఒక ‘కావ్యఖండిక’గా మనగలిగేలా పాటని నిలబెట్టి, ఎప్పటికీ వసివాడని దేవపారిజాతాల్లా, గీతాలు గుబాళించేటట్టు తన ‘భావ గంధాన్ని’ అద్ది, ఒక్కోపాట ఒక్కో ‘సంపూర్ణ కావ్యం’లా తీర్చిద...

పునరుక్తి

  సెప్టెంబరు 18, 2023 పునరుక్తి     ( punar-ukti )       అర్థము      (విశేష్యము ):  చెప్పినదే తిరిగి చెప్పడం; అలంటి వాక్య దోషం      Meaning     (noun) : repetition; tautology    వాడుక / Usage " ఇంకా ఎందరైనా, ఎన్నిసారులైనా, పునరుక్తి దోషం పట్టని పుస్తకాలెన్నయినా వేటూరి గారి గురించి రాయవచ్చు ". A lot more books can still be written on Veturi, by many people, without covering the same ground .     మెదడుకు మేత / Food for thought మన ఈ ‘సరదా’ కేరింతల్ని కాసేపు కట్టిపెట్టి ఆయన ఏటికెదురీది, కావ్యభాషా ప్రయోగం చేసే సాహసాన్ని ప్రదర్శించి, తన పాటల ద్వారా అందించిన చక్కని చిక్కని మాటల మాధుర్యాన్ని అందుకునే ప్రయత్నాన్ని చెయ్యాలి. తద్వారా మనం భాషా రసాస్వాదనలోని మాధుర్యాన్ని చవి చూడడంతో బాటు నన్నయ్య, తిక్కన, శ్రీనాధుడు, పెద్దన, పోతన, రామదాసు, త్యాగయ్య, అన్నమయ్య వంటి ఎందరో శారదాంశా సంభూతులకు వారసులమని సగర్వంగా మనని మనం పరిచయం చేసుకోగలుగుతాం. శ్రీ వేటూరి గారు ముందు తరాలకి దారి చూపించేలా అందించిన ఈ...

ఘూర్ణిల్లు

  సెప్టెంబరు 15, 2023 ఘూర్ణిల్లు     ( ghūrṇillu )       అర్థము      (క్రియ ):  పరిభ్రమించు; తిరుగు; తలకిందులు అగు; మ్రోగు;      Meaning     (verb) : to roll, whirl, sound, ring    వాడుక / Usage "అతనిలోని ప్రతి అణువు బాధతో  ఘూర్ణిల్లింది ". Every speck of his body resounded in pain.     మెదడుకు మేత / Food for thought అవమానం, ఆకలి, వేదన, నిస్సహాయత, దుఃఖం - ఇవన్ని సోపానాలు. దిగితే కిందకి వెళతాం. ఎక్కితే పైకి వెళతాం. ది డైరీ ఆఫ్ మిస్సెస్ శారద, యెండమూరి వీరేంద్రనాథ్

చనువు

  సెప్టెంబరు 14, 2023 చనువు     ( chanuvu )       అర్థము      (విశేష్యము ):  ప్రేమ; కోరిక; మచ్చిక; అధికారం     Meaning     (noun) : familiarity; affection; desire; authority    వాడుక / Usage "మొదట్లో నాతో కాస్త చనువుగా మాట్లాడిన వాళ్లిద్దరూ ఇప్పుడు నాతో అసలు మాట్లాడడమే మానేశారు". Though initially they spoke to me with affection, eventually they stopped altogether.     మెదడుకు మేత / Food for thought వస్తువు పగిలితే శబ్ధం వస్తుంది. మనసు పగిలితే నిశ్శబ్ధం మాత్రమే మిగులుతుంది. అతడు ఆమె ప్రియుడు, యెండమూరి వీరేంద్రనాథ్

జుగుప్స

  సెప్టెంబరు 13, 2023 జుగుప్స     ( jugupsa )       అర్థము      (విశేష్యము ):  రోత; ఏవగింపు; అవమానం     Meaning     (noun) : disgust; aversion; censure    వాడుక / Usage "సువర్చల మోహంలో ఎప్పుడూ మాములుగా కనిపించే ద్వేష భావం, అసహ్యం, జుగుప్స యిప్పుడు వెయ్యింతలై కన్పించాయి". The hatred and disgust on Suvarchala's face was written large.     మెదడుకు మేత / Food for thought ప్రతీ మనిషికి జీవితంలో కొన్ని మధుర ఘడియలు ఉంటాయి.మిగతా జీవితమంతా దానికి ఉపోద్ఘాతము, స్మృతి మాత్రమే.  లేడీస్ హాస్టల్, యెండమూరి వీరేంద్రనాథ్

అకస్మాత్తు

  సెప్టెంబరు 12, 2023 అకస్మాత్తు     ( akasmāttu )       అర్థము      (విశేషణము ):  హఠాత్తుగా; తటాలున; ఉన్నట్లుండి     Meaning     (adverb) : by chance; suddenly; unexpectedly    వాడుక / Usage "ఎందుకు వనజా! అతనిమీద అకస్మాత్తుగా అంత జాలి వొలకబోసావేం?". Vanaja why did you suddenly show so much pity on him?.     మెదడుకు మేత / Food for thought ఎండ...భయంకరమైన ఎండ...రోళ్లను రోకళ్ళను పగులు గొడ్తున్న రోహిణీ కార్తె ఎండ...ప్రపంచాన్నంతా నాపాం బాంబులా మాడ్చి మసిచేస్తున్న ఎండ...సమస్త ప్రాణకోటిని పెనం మీద వేయిస్తున్న ఎండ...కసిగా ఎండ ....క్రూరంగా ఎండ...కర్కశంగా ఎండ....ఎండ త్రాచుపాములా బుసకొడుతోంది. కొండ చిలువులా ఆవులిస్తోంది. పెద్ద పులిలా గర్జిస్తోంది. కార్చిచ్చులా వ్యాపిస్తోంది....ఆ ఎండలో కూచుని రంగమ్మ కంకరరాళ్ళుగా పగుల గొడ్తోంది. ఎండ, అంపశయ్య నవీన్

అడియాస

  సెప్టెంబరు 11, 2023 అడియాస     ( aḍiyāsa )       అర్థము      (విశేష్యము ):  అడి=అతి; అత్యాశ; అందని కోరిక     Meaning     (noun) : empty hope; vain or excessive desire    వాడుక / Usage "కానీ తన ఆశల్ని అడియాసలు చేసింది సావిత్రి". But Savitri turned his desires into empty hopes.     మెదడుకు మేత / Food for thought ఈ రోజు హెగెల్ స్టార్ట్ చేస్తానన్నాడు. "వచ్చేటప్పుడు బొగ్గులు తీసుకురాకపోతే రాత్రికి వంట సున్న". బొగ్గులు...బొగ్గులు బొగ్గులంటే తనకి చచ్చే అసహ్యం. ఎప్పుడూ బొగ్గులు తెమ్మనే చెప్పింది తనతో. ఒక్కసారైనా "వచ్చేటప్పుడు మల్లెపూలు తెమ్మనో, సన్నజాజులు తెమ్మనో...పారిజాతాలో తెమ్మనో" కోమలంగా గోముగా తన హృదయం మీద వాలి చెప్పిందా? బొగ్గులు తెమ్మందే గాని, జీవితం బొగ్గులైపోయింది. అప్పుడే పది పంక్తులు చదివాడు. ఒక్క అక్షరమైనా అర్థంకాలేదు...వెధవ అబ్ స్ట్రాక్ట్ ఫిలాసఫీ..ఇప్పుడు అర్థం అవుతుందా? ఏమిటో ఆలోచనలు.. తీరిని కోరిక, అంపశయ్య నవీన్

ఈడేరు

  సెప్టెంబరు 08, 2023 ఈడేరు     ( īḍēru )       అర్థము      (విశేష్యము ):  ఈడు+ఏరు; నెరవేరు; పెరుగు; వర్ధిల్లు; రజస్వలయగు     Meaning     (noun) : fulfilled; attained; come to maturity    వాడుక / Usage నీ మనోవాంఛ ఈడేరు సమయం దగ్గర పడింది. The time is ripe for your desire to be fulfilled.     మెదడుకు మేత / Food for thought కాయగూరలుతిని కాషాయవస్త్రముల్‌ బోడినెత్తి గలిగి పొరయుచుండ్రు తలలు బోడులైనఁ దలఁపులు బోడులా విశ్వదాభిరామ వినుర వేమ! (కాయకూరలు మాత్రమే తిని, కాషాయ గుడ్డలు వేసుకుని, బోడి గుండుతో ఉంటున్నారు. తల మీద జుట్టు లేకపోతే తలలోపల ఆలోచనలు/కోరికలు లేనట్లు కాదుగదా! ) -- యోగి వేమన (ఆగష్టు 25, 1652 - 1730)

కంపరము

  సెప్టెంబరు 07, 2023 కంపరము     ( kamparamu )       అర్థము      (విశేష్యము ):  పాడె; శవవాహనము; గగుర్పాటు; పాడె విసుగు     Meaning     (noun) : hearse; bier for carrying corpses; horripilation; disgust    వాడుక / Usage ఒక పూట స్నానం చేయకపోతేనే ఒళ్లంతా కంపరం పుడుతుంది. Even a single day without bath is disgusting.     మెదడుకు మేత / Food for thought కోపమునను నరక కూపముఁ జెందును కోపమునను గుణము కొంచె మగును కోపమునను బ్రతుకు కొంచెమై పోవును విశ్వదాభిరామ వినర వేమ! ( కోపము వలన మానసిక ప్రశాంతత పోయి జీవితం నరకమవుతుంది. కోపము వలన మనకున్న మంచి గుణము నశించిపోతుంది. అంతెందుకు కోపము వలన ఆయుష్షే తగ్గిపోతుంది. కాబట్టి కోపాన్ని వదిలించుకుని స్థిరమైన మనస్సుతో ఎల్లవేళలా ప్రశాంతంగా ఉండాలి. ) -- యోగి వేమన (ఆగష్టు 25, 1652 - 1730)