కేళి
మార్చి 01, 2024 కేళి ( kēḷi ) అర్థము (విశేష్యము ): ఆట; ప్రియునితో నాయిక యొక్క క్రీడ; స్త్రీపురుషుల శృంగార చేష్ట; పరిహాసం Meaning (noun) : amusement; play; amorous sport వాడుక / Usage " నీలి మేఘాల కేళీ వినోదాలలో దేలు శ్రీశైల మల్లేశ్వరా! . ." - తోలేటి One who levitates on the blue cloud kissed peaks of Sri Sailam. మెదడుకు మేత / Food for thought కొత్తా దేవుడండీ కొంగొత్తా దేవుడండీ ఇతడే దిక్కని మొక్కని వాడికి దిక్కు మొక్కు లేదండండీ బాబు రాండీ రాండీ శిశువా నేలకు సొరగం దించాడండీ దించిన సొరగం పంచాడండీ నెత్తిన చేతులు పెడతాడండీ నెత్తినెట్టుకొని ఊరేగండీ అందరినీ రక్షించేస్తాం అందాలన్నీ రాసిచ్చేస్తాం శృంగారంలో ముంచీ తేల్చీ బంగారంలో పాతేయిస్తాం వీరే మీకు సమస్తా వీరికే మీ నమస్తా దుష్ట రక్షణం శిష్ట శిక్షణం చేసేయ్ చేసెయ్ మోసేయ్ మోసెయ్ అప్పులు గొప్పగ చెయ్యొచ్చండి అసలుకు ఎసరే పెట్టచ్చండి పీపాలెన్నో తాగొచ్చండి పాపాలెన్నో చేయొచ్చండి పాత దేవుడు పట్టిన తప్పులు ఒప్...