Posts

Showing posts from January, 2021

నడమంత్రపు

  జనవరి 29, 2021 ఈ మాటలు ఏ సినిమాలోని పాటలనుంచి? నడమంత్రపు  ( nadamantrapu )       అర్థము     (విశేష్యము): ఈ మధ్య కాలంలో, కొత్తగా, ఇటీవల;  నడమ - నడుము, మధ్య; అనంతరం - పిమ్మట, తర్వాత     Meaning        (adjective) : recently, not too far back, new        వాడుక / Usage     నడమంత్రపు  సిరికి నెత్తిమీద కండ్లు అని నానుడి.   It is said that recently acquired wealth makes one haughty.      మెదడుకు మేత / Food for thought   "పెళ్లనేది ఇద్దరి మనుషుల్ని కలపడానికి కాదు, రెండు మనసుల్ని కలపడానికి. త్రికరణ శుద్ధిగా ఆచరించని పని వ్యర్ధమని శాస్త్రం చెప్తోంది....పెళ్లంటే శోభనం ముందు జరిగే తంతు కాదు. ఒక పురుషుడిని ఒక స్త్రీని స్నేహితులుగా సన్నిహితులుగా చేసే ఘట్టం....పరమాత్ముని అర్చించుకోవటానికి ఆ నాలుగు గోడల మధ్యే కూర్చోవక్కర్లేదు...నిరాకారుడైన ఈశ్వరుడిని నా మనసులో చూసుకోగలను ధ్యానించుకోగలను. ఇది నాకు పునర్జన్మ. గాఢాంధకారం అలుముకున్న ఈ ఒడ్డు విడిచి వెలుగు రేఖలు నిండి ...

మోవి

జనవరి 28, 2021 ఈ మాటలు ఏ సినిమాలోని పాటలనుంచి? మోవి  ( mōvi )       అర్థము     (విశేష్యము): పెదవి, అధరము, ఓష్ఠము; ఒక రకమైన అడవి పండ్ల చెట్టు     Meaning        (noun) : lip; a kind of wild fruit tree        వాడుక / Usage     ప్రేయసి   మోవి మధుకలశం.   The lips of one's sweetheart  are as sweet as honey.      మెదడుకు మేత / Food for thought   "సన్నని సందులు! సావిళ్ళు! ఎద్దు బండ్లు!     కన్నుల విందు చేసే చిన్ని చిన్ని పూరిండ్లు!     పైరు పొలాలు! పంట కంకుల కళకళలు!     పడుచు లంగా కలంకారీ అలంకారాల తళతళలు!     సంధ్యారుణ కాంతుల్లో స్నానంచేస్తూ "అంబా" అని అరుస్తూ     కోడె దూడను నాకుతున్న గోమాత కన్నుల మిలమిలలు!"     -- కరుణశ్రీ జంధ్యాల పాపయ్య శాస్త్రి (ఆగష్టు 4, 1912 - 1992), "సైనికుని ఉత్తరం" 

సంధాత్రి

   జనవరి 27, 2021 ఈ మాటలు ఏ సినిమాలోని పాటలనుంచి? సంధాత్రి  ( sandhāthri )       అర్థము     (విశేష్యము): సంధానం - కూర్చుట, కలుపుట, సంధి చేయుట; సంధాత్రి - సంధానం చేయు స్త్రీ      Meaning        (noun) : one who unites or reconciles        వాడుక / Usage   రుద్రమదేవి అఖండ కాకతీయ సామ్రాజ్యానికి సంధాత్రి .   Rudrama Devi united the vast Kakatiya empire.      మెదడుకు మేత / Food for thought   " దేశమును ప్రేమించుమన్నా    మంచి అన్నది పెంచుమన్నా    వొట్టి మాటలు కట్టిపెట్టవోయ్    గట్టిమేల్‌ తలపెట్టవోయ్‌     దేశాభిమానం నాకు కద్దని    వొట్టి గొప్పలు చెప్పుకోకోయ్‌    పూని ఏదైనాను ఒక మేల్‌    కూర్చి జనులకు చూపవోయ్‌      సొంత లాభం కొంత మానుకు     పొరుగు వానికి తోడుపడవోయ్‌      దేశమంటే మట్టి కాదోయ్‌      దేశమంటే మనుషులోయ్ "     ...

మరులు

  జనవరి 26, 2021 ఈ మాటలు ఏ సినిమాలోని పాటలనుంచి? మరులు  ( marulu )       అర్థము     (విశేష్యము): మోహము, వలపు, తీరని ప్రేమ; అజ్ఞానము; పిశాచము      Meaning        (noun) : love, passion, desire, lust; ignorance; a demon        వాడుక / Usage   " మరులు గొలుపు నీ చూపులే సూర్యకాంతి కాదా"   The desire in your eyes dazzles like daylight.      మెదడుకు మేత / Food for thought   " సామజిక దౌర్జన్యం, రాజకీయ నిరంకుశత్వం కన్నా భరింపరానిది. సంఘానికి ఎదురు నిలిచి పోరాడే సంస్కర్త, ప్రభుత్వాన్ని ధిక్కరించే రాజకీయవేత్త కన్నా ఎన్నో రేట్లు ధైర్యవంతుడు. "     --  డా. బాబాసాహెబ్ అంబేడ్కర్ (ఏప్రిల్ 14, 1891 - 1956) రాజ్యాంగ శిల్పి

అచ్చెరువు

జనవరి 25, 2021 ఈ మాటలు ఏ సినిమాలోని పాటలనుంచి? అచ్చెరువు  ( accheruvu )       అర్థము     (విశేష్యము): ఆశ్చర్యం; అబ్బురం; వింత; అధ్బుతం     Meaning        (noun) : astonishment; wonder; surprise        వాడుక / Usage      సంపూర్ణ సూర్యగ్రహణాన్ని నగరవాసులు అందరూ అచ్చెరువు తో చూసారు.      The city watched the total solar eclipse in astonishment.      మెదడుకు మేత / Food for thought   " తివిరి యిసుమున తైలంబు దీయవచ్చు     దవిలి మృగతృష్ణలో నీరు ద్రావవచ్చు    తిరిగి కుందేటి కొమ్మ్ము సాధింపవచ్చు    చేరి మూర్ఖుల మనసు రంజింపరాదు "     --  భర్తృహరి సుభాషితం

కుందరదన

   జనవరి 22, 2021 ఆమె.... కుందరదన  ( kundaradana )       అర్థము     (విశేష్యము): మల్లెపువ్వు లాంటి తెల్ల పళ్ళు ఉన్న వనిత; కుంద - అడవిమల్లె, రదన - పళ్ళు      Meaning        (noun) : a woman who has teeth as white as a jasmine flower        వాడుక / Usage      " ఇందువదనే  కుందరదనే  వీణా పుస్తక ధారిణే." (వేటూరి, సప్తపదిలో)      "One who is moonfaced with teeth as white as jasmine and holding a book and Veena."      మెదడుకు మేత / Food for thought   "మనిషి  ఎంత మంచివాడు!    చనిపోయిన వాని చెడును    వెనువెంటనే మరుస్తాడు    కని మంచినె తలుస్తాడు    మనిషి ఎంత చెడ్డవాడు!    బ్రతికి ఉన్నవాని మంచి    గుర్తించడు కాని వాని    చెడును వెతికి కెలుకుతాడు" --ప్రజాకవి  కాళోజి నారాయణరావు (సెప్టెంబర్ 9, 1914 - 2002)

విరహోత్కంఠిత

  జనవరి 21, 2021 ఆమె.... విరహోత్కంఠిత  ( virahotkantitha )       అర్థము     (విశేష్యము): వేళకు ప్రియుడు రాకపోవడం వల్ల విరహంతో బాధపడే నాయిక; విరహం - ఎడబాటు, ఉత్కంఠం - తహతహ     Meaning        (noun) : a woman who pines for her absent lover        వాడుక / Usage       విరహోత్కంఠిత అయిన భార్యని మేఘదూతంలో కాళిదాసు అధ్బుతంగా వర్ణించాడు.      Kalidasa describes beautifully the pining wife in the poem Meghadootam.      మెదడుకు మేత / Food for thought   " వెయ్య బోవని తలుపు తియ్య మంటూ పిలుపు      రాధ కెందుకో నవ్వు గొలుపు      నీలోన నాలోన నిదుర పోయే వలపు      మేలుకొంటే లేదు తలుపు      విశ్వమంతా ప్రాణ విభుని మందిరమైతే      వీధి వాకిలి ఏది చెల్లెలా      విశ్వ విభుడే రాధ వెంట నంటి రాగ      తలుపేది పిలుపేది చెల్లెలా " -- దేవులపల్లి కృష్ణ శాస్త్రి...

అలివేణి

    జనవరి 20, 2021 ఆమె.... అలివేణి  ( ali-vēṇi )       అర్థము     (విశేష్యము): యువతి; తుమ్మెద వంటి నల్లని వెంట్రుకలు కల యువతి; అలి - తుమ్మెద, వేణి - అల్లిన జడ     Meaning        (noun) : a woman; a woman with tresses as black as a bee        వాడుక / Usage       " ఎంతకాలమైంది ఈ అలివేణి అంతఃపురంలో అడుగుపెట్టి? " (ఎస్వీఆర్ సైరంధ్రిని చూసి)      "How long has it been since this nymph entered the palace?"      మెదడుకు మేత / Food for thought   " మట్టి అంది కుమ్మరితో, తొక్కేది  ఏంటి  నువ్వు  నన్ను     వస్తుంది  ఒక రోజు  , తొక్కనా నే నిన్ను " --కబీర్ దాస్ (1399 - 1448)

నెచ్చెలి

   జనవరి 19, 2021 ఆమె.... నెచ్చెలి  ( nech-cheli )       అర్థము     (విశేష్యము): స్నేహితురాలు; ప్రియురాలు; నెర - నిండైన, గొప్ప : చెలి - స్నేహితురాలు     Meaning        (noun) : a close female friend; beloved; lover        వాడుక / Usage       " ఉరిమిన జడిసే  నెచ్చెలి  అడుకగ ఇచ్చెను కౌగిలి. "      "Thunder scared my beloved and she wrapped herself around me."      మెదడుకు మేత / Food for thought   " ఎవరన్నారు నేను అబద్ధాలాడానని..     నువ్వొకసారి నా కుశలం అడిగి అప్పుడు చూడు!..     దూరాల అనుభూతి అప్పుడే తెలిసింది      ఎప్పుడైతే  నేను బాగానే ఉన్నాను     అంటే,  తను నమ్మేసిందో..."     -- గుల్జార్

అభిసారిక

  జనవరి 18, 2021 ఆమె.... అభిసారిక  ( abhisarika )       అర్థము     (విశేష్యము): ప్రియుడి కోసం సంకేత స్థలమునకు వెళ్లే నాయిక; రహస్యంగా ప్రియుడిని కలవడం కోసం వెళ్లే స్త్రీ     Meaning        (noun) : a lady who goes to meet her lover at an appointed place        వాడుక / Usage       " విరహ వేదనతో ప్రియుని కోసం అభిసారిక ఆలపించే కరుణ రసాత్మక రాగం 'భాగేశ్వరి'. "      "Raag Bhageswari is the tender longing  of a woman  going to meet her lover."      మెదడుకు మేత / Food for thought   " నా గది స్వప్నాలతో నిండిపోయింది    నా మది స్వగతాలతో కుంగిపోతోంది    ఇంక రావెందుకు ప్రభూ    శంకాకులమై ఈ రాత్రి సడలిపోతోంది     నా వొంటి నిగనిగలవంటి శయ్యను సజ్జితం చేశాను     నా కంటి మిలమిలవంటి మధువు పాత్రల నింపాను     త్వరమాణమై ప్రభూ, నా     తనువు స్వీయ యౌవన భారన తడబడి పోతూన్...

శాస్త్రం

       జనవరి 15, 2021 అంత్యప్రాస... శాస్త్రం  ( ṣāstramu )       అర్థము     (విశేష్యము):  సామెత;  నియమములు ఉన్న గ్రంధం - ఇవి ఆరు:  తర్కము, వ్యాకరణము, ధర్మము, మీమాంస, వైద్యము, జ్యోతిషము     Meaning        (noun) : science; precept; sacred book        వాడుక / Usage       " సున్నాను క‌నిపెట్టిన భార‌తీయులు ప్ర‌పంచ గ‌ణిత శాస్త్రానికి అద్భుత‌మైన కానుక అందించారు. "      "The use of 0 was a great gift by ancient Indians to mathematics."      మెదడుకు మేత / Food for thought   " ధూపాన్ని నేను, వెలుగుతాను నీ కోవెలలో     కలబోసాను నీ రాగాన్ని నా శరీరపు మన్నులో     ఈ దేహం మసై, ధూమం పైకెగిసి, ఆకాశంలో      చలించే వేళ ఆ పొగల సొగసుల గొంతులో -      'సాగిపోయే సమీరాలు నీ శ్వాసను తాకే ఘడియలో     ఒకటైపోనా ఆ పిల్ల గాలుల్లో '  " --  అమ్రితా ప్రీతం   (ఆగష్టు ...

దస్త్రం

      జనవరి 14, 2021 అంత్యప్రాస... దస్త్రం  ( d a stramu )       అర్థము     (విశేష్యము): పద్దులు   రాసే పుస్తకం; ఖాతా పుస్తకం; కాగితాల కట్ట     Meaning        (noun) : accounting book; bundle of papers        వాడుక / Usage       " ఎన్టీఆర్ సబ్ రిజిస్ట్రార్ గా ఉన్నపుడు వ్రాసిన దస్త్రం ఈ మధ్య బయట పడింది. "      "A document written by NTR, when he was a sub-registrar has recently come to light."      మెదడుకు మేత / Food for thought   " జీవిత సారం కనుగొనడం కోసం,  సోమర్సెట్ మామ్, పుస్తకం పట్టుకుని ప్రపంచం అంతా తిరిగాడని, కాఫ్కా గదిలో కూచుని అదే ప్రయత్నం చేసాడని అంటారు. కానీ ఎట్టకేలకు కాఫ్కానే మెరుగైన ప్రపంచ ధృక్పదం  వ్యక్తపరిచాడు. " --   యు.ఆర్.అనంతమూర్తి   ( డిసెంబరు 21,  1932  –  2014 ) జ్ఞానపీఠ పురస్కార గ్రహీత, కన్నడ రచయత

వస్త్రం

     జనవరి 13, 2021 అంత్యప్రాస... వస్త్రం  ( va stramu )       అర్థము     (విశేష్యము):  బట్ట, వలువ, దుస్తులు, అంబరము, చీర     Meaning        (noun) : cloth, garments, dress, saree        వాడుక / Usage     " ప్రకాశం జిల్లాకి చెందిన కృష్ణమూర్తి,  గడ్డిపోచలతో వస్త్రాలు నేయడంలో నేర్పరి. "      "Krishnamurthi, from Prakasam district, is skilled in weaving clothes from grass."      మెదడుకు మేత / Food for thought   " విరియ గాచిన వెన్నెల రాత్రిలో    చేరదేశపు చెలులు వెంట రా    సుందరాంధ్ర పదమ్ము పాడుచున్    సింధునదిని పడవనడుపుచు నాడుదాం---     వానలేకున్న జీవిత వైభవమ్ము    మాసి పోజాలదే, పెక్కు మాటలేల?    మమత గొల్పెడి స్వాతంత్య్ర మమర కున్న    దేని కీ జన్మ దీనులమైన మనకు? " --   సుబ్రహ్మణ్య భారతి  ( డిసెంబరు 11,  1882  –  1921 ) తమిళ కవి  స్వాత...

శస్త్రం

    జనవరి 12, 2021 అంత్యప్రాస... శస్త్రం  ( ṣastramu )       అర్థము     (విశేష్యము): ఇనుము; ఆయుధము (కత్తి, గద), మంత్రం అక్కరలేని బాణం; చికిత్సకి వాడే కత్తి      Meaning        (noun) : iron; weapons(knife, mace), surgical knife        వాడుక / Usage     " అగ్గలయ్య అనే వైద్యుడు  చాళుక్యుల కాలంలో   శస్త్ర చికిత్సలు చేసినట్టు తాజాగా రుజువైంది."      "A surgeon by name Aggalayya during Chalukya period is known to have performed surgeries."      మెదడుకు మేత / Food for thought   " ఎక్కడ మనసు నిర్భయంగా వుంటుందో,      ఎక్కడ మనుషులు తలలెత్తి తిరుగుతారో,      ఎక్కడ జ్ఞానం విరివిగా వెలుస్తుందో,      ఎక్కడ నిర్జీవమైన ఆచారపుటెడారిలో స్వచ్ఛమైన బుద్ధి ప్రవాహం      ఇంకిపోకుండా వుంటుందో,      ఆ స్వేచ్ఛా స్వర్గానికి, తండ్రీ, నా దేశాన్ని మేల్కొలుపు. " -- రవీంద్రనాథ్ టాగోర్ (...

అస్త్రం

   జనవరి 11, 2021 అంత్యప్రాస... అస్త్రం  ( astramu )       అర్థము     (విశేష్యము): బాణము, విల్లు, ఆయుధము, మంత్రించి ప్రయోగించే ఆయుధము      Meaning        (noun) : arrow, bow, weapon, missile, arms         వాడుక / Usage     అశ్వత్థామ మరణించిన వార్త విని ద్రోణాచార్యుడు అస్త్రాలు త్యజించాడు.      On hearing that Aswatthama is dead, Dronacharya gave up his arms.      మెదడుకు మేత / Food for thought   " ఆలయంబున నీవు వ్రేలాడువేళ శివుని చెవి నీకు కొంత చేరువుగ నుండు మౌని ఖగరాజ్ఞి పూజారి లేనివేళ విన్నపింపుము నాదు జీవితచరిత్ర" -- గుర్రం జాషువా (సెప్టెంబర్ 28, 1895 - 1971) 'గబ్బిలం'

కర్కోటకుడు

  జనవరి 08, 2021 మనుషులు అనేక రకాలు! కర్కోటకుడు  ( karkōṭakuḍu )       అర్థము     (విశేషణము): అతి క్రూరుడు; దయ చూపని వాడు; కశ్యపకద్రువుల నాగ సంతానం;      Meaning        (noun) :  wicked and cruel person; name of a snake in Mahabharata        వాడుక / Usage     చెంఘీజ్ ఖాన్ మహా  కర్కోటకుడు.      Chengiz Khan was a very cruel man.      మెదడుకు మేత / Food for thought   "గుర్తుంచుకోండి, ప్రజాస్వామ్యం ఎక్కువ కాలం ఉండదు. కృశించిపోయి, అలిసిపోయి త్వరలోనే తనను తాను హత్య చేసుకుంటుంది. చరిత్రలో ఇప్పటిదాకా ఆత్మహత్య చేసుకోని ప్రజాస్వామ్యం లేదు. " -- జాన్ ఆడమ్స్ (అక్టోబర్ 30 1735 - 1826),  అమెరికా రెండవ దేశాధ్యక్షుడు

స్వయంమోహితుడు

  జనవరి 07, 2021 మనుషులు అనేక రకాలు! స్వయంమోహితుడు  ( svayam- mōhituḍu )       అర్థము     (విశేషణము): అందరికన్నా  తనకు తననే మిక్కిలిగా ప్రేమించేవాడు     Meaning        (noun) : n arcissist; one who is in love with oneself        వాడుక / Usage      స్వయంమోహితుడు అయిన నాయకుడు దేశానికి అరిష్టం.      A narcissist leader is catastrophic for a nation.      మెదడుకు మేత / Food for thought   "మంద ఎక్కువ అయ్యేకొద్దీ  ప్రజాస్వామ్యం పరీక్ష కష్టతరమవుతుంది. వక్రబుద్ధి మందబుద్ధి అయినవాళ్లు రాష్ట్రపతి అవుతారు.  ఒక దివ్యదినాన, సాధారణ ప్రజలు వారి అభిరుచికి చేరువయ్యే తరుణంలో పరమమూర్ఖుడు, బుద్ధిహీనుడూ శ్వేతభవనం హస్తగతం చేసుకుంటాడు. " (H. L. Mencken, July 26, 1920 – The Baltimore Evening Sun)

హఠవాది

  జనవరి 06, 2021 మనుషులు అనేక రకాలు! హఠవాది  ( haṭha-vādi )       అర్థము     (విశేషణము):  పట్టిన పట్టు విడువనివాడు;  మొండిగా వాదించేవాడు          Meaning        (noun) : obstinate and argumentative person        వాడుక / Usage      హఠవాది ని రంజింప జాలము.      It is hard to please an obstinate person.      మెదడుకు మేత / Food for thought      "మానవ స్వభావం గురించి కొందరు ఈ విధంగా భయపడతారు.             1. మనుషులలో జన్మసిద్ధంగా భేదాలు ఉంటే, సమాజ వ్యత్యాసాలు, జులుం సమర్ధించబడతాయి.              2. మనుషులు జన్మసిద్ధంగా నీతివిహీనులయితే, మానవ సమాజాన్ని మెరుగుపరిచే ప్రయత్నం వృధా.            3. మనుషులు జీవశాస్త్రం చెప్పినట్టు చీము నెత్తురు యొక్క ముద్దలే అయితే,  స్వచ్చందవృత్తి (free will) ...

ఆషాఢభూతి

  జనవరి 05, 2021 మనుషులు అనేక రకాలు! ఆషాఢభూతి  ( āshāḍha-bhuti )       అర్థము     (విశేష్యము): మోసగాడు,  ధూర్తుడు, వంచకుడు; పంచతంత్రములో ఒక కపట పాత్ర          Meaning        (noun) : cheat, dishonest/violent man, villain        వాడుక / Usage     విరాళాల పేరుతో జనాలను దోచుకునే ఆషాఢభూతులు కోకొల్లలు.      Cheats, who swindle in the name of charity, abound.      మెదడుకు మేత / Food for thought     "అతను జయించిన పరదేశాలన్నీ మహా రాజ్యాలయ్యాయి, అతని స్వదేశం స్మశానమైనది. అతన్ని ప్రేమించిన స్త్రీలందరూ రాణులయ్యారు; అతను ప్రేమించింది అడుక్కు తింటోంది. గడ్డిపోచ బంగారు కణికయింది; శరీరాన్ని ఎందరెందరో పంచుకున్నారు; కీర్తిని కాజేశారు. ప్రేమని విషం పోసి హత్యచేశారు. సౌందర్యం జుట్టు విప్పుకుని యవ్వనాన్ని కౌగలించుకుని ఏడ్చింది. శాంతం అహానికేసి తల పగలగొట్టుకుంది. దయని పగ పొడిచింది. మతాన్ని విజ్ఞానశాస్త్రం పూడ్చేసింది. దైవాన్ని దేవాలయంల...

స్థితప్రజ్ఞుడు

  జనవరి 04, 2021 మనుషులు అనేక రకాలు! స్థిత ప్రజ్ఞుడు  ( sthitha-pragnyudu )       అర్థము    (విశేష్యము): స్థిత - నిలుచున్నది; స్థిరముగా ఉన్నది: ప్రజ్ఞుడు - పండితుడు; బుద్ధిమంతుడు;     దుఃఖము కలిగినపుడు దిగులు చెందనివాడు, సుఖములు కలిగినపుడు స్పృహ లేనివాడు, రాగము, ద్వేషము,     భయము లేనివాడు, ఆత్మ స్వరూపం తెలిసినవాడు స్థితప్రజ్ఞుడని  భగవద్గీత సాంఖ్య యోగం 55, 56 శ్లోకాలు        చెప్తున్నాయి          Meaning        (noun) :  one who is liberated while still living an earthly life;  man of steady wisdom        వాడుక / Usage     మాజీ ప్రధాని శ్రీ పి వి నరసింహరావుగారు   స్థితప్రజ్ఞుడిగా  ప్రసిద్ధి చెందారు.      Former Prime Minister Sri PV Narasimha Rao is renowned as a SthithaPragnya.      మెదడుకు మేత / Food for thought       ‘‘ పాములాటి రాతిరి పడగదించి పోయి...

మన్వంతరం

   జనవరి 01, 2021 ఈ అనంత కాల ప్రవాహాన్ని ఎలా కొలిచేది? మన్వంతరం  ( manv-antaramu )       అర్థము        (విశేష్యము): డెబ్బైఒకటి చతుర్యుగములు - 306, 720, 000 సంవత్సరాలు; హయాము, పాలన          Meaning        (noun) : 71 * total of (Kritha, Tretha, Dwapara, Kali) yugas = 306, 720, 000 years; reign, rule        వాడుక / Usage      పురాణాల ప్రకారం ఒక మనువు యొక్క పాలనా కాలాన్ని  మన్వంతరము  అంటారు.       According to the Puranas, the reign of one Manu is called Manvantaram.      మెదడుకు మేత / Food for thought       ‘‘అవలోకించగలిగిన విశ్వము యొక్క వయసు 1,380 కోట్ల సంవత్సరాలు. దానిని ఒక సంవత్సరంలోకి కుదిస్తే మహా విస్ఫోటనం (Big Bang) జనవరి 1 అర్ధరాత్రి (01/01 00:00) అయినట్టు. మానవుడు (Homo Sapiens) మొదట కనపడేది డిసెంబర్ 31 పది గంటల ఇరవై నాలుగు నిమిషాలకు(31/12 22:24). ఇప్పుడు సమయం 23:59:59. సుమారు 44...