Posts

Showing posts from April, 2021

నిర్వీర్యం

  ఏప్రిల్ 30, 2021 నిర్వీర్యం  ( nir-viryamu )       అర్థము      (విశేషణము): చైతన్యం, ఉత్సాహం లేదా పరాక్రమం కోల్పోవడం; నిస్తేజం; వీర్యం లేకపోవడం     Meaning     (adjective) :  inactive, weak, powerless; impotent; lack of efficacy        వాడుక / Usage         కొవాగ్జిన్‌తో ‘డబుల్‌ మ్యుటెంట్‌’ నిర్వీర్యం .     Covaxin neutralizes the double mutant strain.      మెదడుకు మేత / Food for thought " " ప్రియమైన వాట్సన్! నేను ఘోరమైన తప్పుడు సిద్ధాంతం నిజమనుకున్నాను. సమాచారం (data) లేకుండా అభిప్రాయాలు, నిర్ణయాలు తీసుకుంటే ప్రమాదం అనడానికి ఇదే ఉదాహరణ. ” -- అడ్వెంచర్స్ ఆఫ్ షెర్లాక్ హోమ్స్, ఆర్థర్ కానన్ డోయల్  (మే 22, 1859 -  1930)

నిరహంకారము

  ఏప్రిల్ 29, 2021 నిరహంకారము  ( nir-ahankāramu )       అర్థము      (విశేష్యము): గర్వం మరియు అహంకారం లేక పోవడం     Meaning     (noun) :  humility, modesty; absence of ego, pride        వాడుక / Usage         పదవిలో ఉంటూ నిరహంకారముగా ఉండడం సాధ్యమేనా?     Is it possible to be humble when in power?      మెదడుకు మేత / Food for thought " " చీకటిలో కారు చీకటిలో కాలమనే కడలిలో శోకమనే పడవలో ఏ దరికో ఏ దెసకో జాలరి వలలో చేపవు నీవే గానుగ మరలో చేరుకువు నీవే జాలే లేని లోకంలోన దారిలేని మనిషివి నీవే లేరెవరూ  నీకెవరూ ” -- మనుషులు మారాలి, శ్రీశ్రీ  (ఏప్రిల్ 30, 1910 -  1983)

నిష్పక్షపాతం

  ఏప్రిల్ 28, 2021 నిష్పక్షపాతం  ( nish- paksha-pātamu )       అర్థము      (విశేష్యము):  పక్షపాతం లేకపోవడం; ఓకే వైపు ఒంగక పోవడం; న్యాయబద్ధంగా ఉండడం     Meaning     (noun) :  impartiality; just        వాడుక / Usage         లోక్ సభ సభాపతి  నిష్పక్షపాతంగా ఉండాలనేది వేరేగా చెప్పనక్కర్లేదు.     It goes without saying that the Speaker of the Lok Sabha should be impartial.      మెదడుకు మేత / Food for thought " "బ్రతికి ఉన్న వాళ్ళ యందు సానుభూతిపూర్వకంగా ఉండాలి. చనిపోయిన వాళ్ళ యందు  మాత్రం  మన బాధ్యత  కేవలం సత్యాన్వేషణే. ” -- వోల్టేయిర్ (నవంబర్ 21, 1694 -  1778)

నిష్కర్ష

  ఏప్రిల్ 27, 2021 నిష్కర్ష  ( nish-karsha )       అర్థము      (విశేష్యము): ఎలాంటి మొహమాటం, దాపరికం లేకపోవడం; నిజం; నిశ్చయం;     Meaning     (noun) :  frankness; determination; decision;  certainty        వాడుక / Usage         శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి గారి సహజ గుణం  నిష్కర్ష .     Sripada Subrahmanya Sastry's second nature was frankness.      మెదడుకు మేత / Food for thought " "పారదర్శకత (transparency) లోపిస్తే అపనమ్మకం మరియు భయం చోటు చేసుకుంటాయి. ” -- దలై లామా

నిగూఢము

  ఏప్రిల్ 26, 2021 నిగూఢము  ( ni-gūḍhamu )       అర్థము      (విశేషణము): మరుగు పుచ్చినది;  రహస్యమైనది; తెలియనిది     Meaning     (adjective) :  concealed; well hidden; secret        వాడుక / Usage          భూమిపైన మనకు తెలియని ఎన్నో నిగూఢ ప్రదేశాలు ఇంకా ఉన్నాయి.     There are still many undiscovered places on Earth.      మెదడుకు మేత / Food for thought " "లేదు, 1729 ఆసక్తికరమైన సంఖ్యే. రెండు ఘనముల(cubes) యొక్క మొత్తముగా (sum) రెండు వేర్వేరు రకాలుగా దానిని చూపవచ్చు.  ” -- శ్రీనివాస్ రామానుజన్  (డిసెంబర్ 22, 1887 - ఏప్రిల్ 26, 1920)

యథాజాతుడు

  ఏప్రిల్ 23, 2021 ఈ వారం, వ్యక్తిత్వాలు వర్ణించే పదాలు,  శ్రీలేఖ సంకలనం! ధన్యవాదాలు యథాజాతుడు  ( yathā-jātuḍu )       అర్థము      (విశేషణము): మూర్ఖుడు; జ్ఞానం లేని వాడు; అవివేకి; పుట్టినప్పుడు ఎలా ఉన్నాడో అలాగే ఉన్నవాడు     Meaning     (noun) :  fool; ignoramus        వాడుక / Usage     యథాజాతుడైన తెనాలి రామలింగడు దేవీ కటాక్షంతో వికటకవి అయ్యాడు.    Tenali Ramakrishna turned from a fool into a poet with Devi's grace.      మెదడుకు మేత / Food for thought " "ఈ ప్రపంచమంతా ఓ రంగస్థలం, యిందున్న స్త్రీ పురుషులు కేవలం వేషగాళ్ళు. ఎవరి రంగ ప్రవేశాలు వారివి ఎవరి నిష్క్రమణలు  వారివి. ఒకే మనిషి తన సమయంలో పలు ముసుగులు తొడుగుతాడు. ” -- 'యాస్ యు లైక్ ఇట్', షేక్స్పియర్ (ఏప్రిల్ 23, 1564 - 1616)

కృతకృత్యుడు

  ఏప్రిల్ 22, 2021 ఈ వారం, వ్యక్తిత్వాలు వర్ణించే పదాలు,  శ్రీలేఖ సంకలనం! ధన్యవాదాలు కృతకృత్యుడు  ( kruthakrutyudu )       అర్థము      (విశేషణము): పని నెరవేరిన వాడు; పని సాధించి ధన్యమైన వాడు; ధన్యజీవి     Meaning     (noun) :  one who is satisfied having accomplished a task         వాడుక / Usage    కే.విశ్వనాథ్ సంగీత సాహిత్య పరమైన చిత్రాలు సృజించి కృతకృత్యులైనారు .    With a filmography full of music and literature K.Viswanath is a triumphant director.      మెదడుకు మేత / Food for thought " "వేల సమాధానాల కన్నా మంచిది మౌనం నాది    లెక్కలేని ప్రశ్నల గౌరవాన్ని నిలబెట్టదా అది ” -- మాజీ ప్రధాని, మన్మోహన్ సింగ్

సంయతాత్ముడు

  ఏప్రిల్ 21, 2021 ఈ వారం, వ్యక్తిత్వాలు వర్ణించే పదాలు,  శ్రీలేఖ సంకలనం! ధన్యవాదాలు సంయతాత్ముడు  ( samyathatmudu )       అర్థము      (విశేష్యము): ఇంద్రియ నిగ్రహం కలవాడు; సంయతము అనగా కట్టబడినది     Meaning     (noun) :  person in control of his senses; man with restrained behaviour         వాడుక / Usage    కామానికి   లోనయ్యే విశ్వామిత్రుని వంటి ఋషులు  సంయతాత్ములు ఎలా అవుతారు?     How can the rishis(like Viswamitra) who are seduced by lust, said to control their senses?      మెదడుకు మేత / Food for thought " " ధర్మాదర్థశ్చకామశ్చ నాతిచరామి”అనే ధర్మ సూత్రాలను దృఢంగా బిగించినపుడు నడుమచిక్కి నలిగిపోయే కోటానుకోటి వ్యక్తులలో సీతమ్మ కూడా  ఒక్కతే” -- రాళ్లపల్లి అనంతకృష్ణశర్మగారు (జనవరి 23, 1893 - 1979)

నిషణ్ణుడు

ఏప్రిల్ 20, 2021 ఈ వారం, వ్యక్తిత్వాలు వర్ణించే పదాలు,  శ్రీలేఖ సంకలనం! ధన్యవాదాలు నిషణ్ణుడు  ( nishaṇṇudu )       అర్థము      (విశేష్యము): కూర్చున్నవాడు; స్థిర చిత్తం ఉన్నవాడు; నిశ్చలంగా ఉండేవాడు;     Meaning     (noun) :  man of firm will; firmly seated person        వాడుక / Usage     వట వృక్షం కింద  నిషణ్ణుడైన దక్షిణామూర్తికి నా వందనములు.     I salute to Dakshinamurthy who is firmly seated under the banyan tree.      మెదడుకు మేత / Food for thought " "కొన్నిసార్లు తప్పటడుగులు వేస్తే తప్ప సరైన మార్గం కనుక్కోలేము '' --  అభిజిత్ నస్కర్, న్యూరో సైంటిస్ట్

యతి

  ఏప్రిల్ 19, 2021 ఈ వారం, వ్యక్తిత్వాలు వర్ణించే పదాలు,  శ్రీలేఖ సంకలనం! ధన్యవాదాలు యతి  ( yati )       అర్థము      (విశేష్యము): సన్యాసి, ఇంద్రియములు జయించినవాడు; పద్యం/ఛందస్సు లో విరామ స్థానం     Meaning     (adjective) :  hermit, mendicant, sage whose passions are in control; pause in a telugu poem        వాడుక / Usage     యతి రూపంలో ఉన్న అర్జునుడికి సుభద్ర సేవలు చేసింది.     Subhadra attended to  Arjuna who was disguised as a sage.      మెదడుకు మేత / Food for thought " " సొమ్ము లియ్యవచ్చు సోమ్మంద మీయవచ్చు నియ్యరాని ప్రాణ మియ్యవచ్చు తనదు విభుని వేరె తరుణి చేతికి నిచ్చి తాళ వశమె యెట్టిదాని కైన? '' --ద్రౌపది 'సుభద్రా కళ్యాణం' లో, తాళ్ళపాక తిమ్మక్క (పదిహేనవ శతాబ్ధం)

అస్ఖలితము

  ఏప్రిల్ 16, 2021 అస్ఖలితము  ( a-skhalitamu )       అర్థము      (విశేషణము): భంగము కానిది; చెడనిది; తొట్రుపాటు లేనిది; స్ఖలితం( చలించడం) లేనిది     Meaning     (adjective) :  unshaken; firm; undeviating; chaste        వాడుక / Usage     శ్రీ కృష్ణుని  అస్ఖలిత బ్రహ్మచారి అని ఎందుకు అంటారు?     Why is Sri Krishna called an undeviating and firm celibate?      మెదడుకు మేత / Food for thought " " మతం అనేది అణచివేయబడే జీవి యొక్క నిట్టూర్పు. అది హృదయం లేని ప్రపంచంలో హృదయం లాంటిది. స్ఫూర్తి లేని పరిస్థితులలో స్ఫూర్తినిచ్చేది. కాబట్టే అది ప్రజలపాలిట మత్తుమందు. కాల్పనిక సుఖాన్నిచ్చే మతాన్ని నిర్ములించడం అంటే, నిజమైన సుఖాన్ని కోరడమే.'' --కార్ల్ మార్క్స్ (మే 5, 1818 - 1883)

అనన్యము

  ఏప్రిల్ 15, 2021 అనన్యము  ( an-anyamu )       అర్థము      (విశేషణము): మరి ఒకటి లేనిది; సాటిలేనిది; ఏకమైనది; అన్యము (ఇంకోటి) లేనిది     Meaning     (adjective) :  without any other; unique; exclusive        వాడుక / Usage      చలం రచనలలో ఇతివృత్తమూ, తాత్వికతా, రచనాశైలీ ఆధునిక తెలుగు రచనలలో అనన్యమైన స్థానాన్ని పొందాయి.     The themes, philosophy and style in Chalam's writings are unique in modern Telugu literature.      మెదడుకు మేత / Food for thought " " విడిచితి బంధువర్గమును వీడితి బ్రాణము లొగ్గు మిత్రులన్   విడిచితి నిల్లు వాకిలియు వీడితి భార్యను ప్రాత చెప్పుగా   విడిచితి నెగ్గు సిగ్గు లర వింద దళేక్షణ నీ నిమిత్తమై   విడువనే దేహ మీవు నను వీడు నవస్థ తటస్థమైనచో " --చింతామణి, కాళ్ళకూరి నారాయణరావు (ఏప్రిల్ 28, 1871 - 1927)

అగమ్యగోచరం

  ఏప్రిల్ 14, 2021 అగమ్యగోచరం  ( a- gamya gōcharamu )       అర్థము      (విశేషణము): అంతు చిక్కనిది; ఏమాత్రం తెలియనిది; పొంద లేనిది; గమ్యం(పొందేది)/గోచరం(తెలిసేది) బోధ పడక పోవడం     Meaning     (adjective) :  not knowing/perceiving the destination/solution; confused state        వాడుక / Usage     ఆంధ్ర, తెలంగాణ మధ్య సరిహద్దు వివాదం - సరిహద్దువాసుల భవితవ్యం అగమ్యగోచరం .     Border dispute between Andhra, Telangana - uncertain future for border residents.      మెదడుకు మేత / Food for thought " "రాజ్యాంగం దుర్వినియోగం చేయబడుతుంటే, దానిని ముందుగా నేను తగలపెడతాను " --డా. బి. ఆర్ అంబేద్కర్ (ఏప్రిల్ 14, 1891 - 1956)

అసమంజసం

  ఏప్రిల్ 13, 2021 అసమంజసం  ( a-samanjasamu )       అర్థము     (విశేషణము): తగనిది; సరైనది కానిది; సమంజసం (న్యాయం) కానిది     Meaning     (adjective) :  unbecoming; bad; inconsistent; unjust        వాడుక / Usage   ఉద్యోగుల అంగీకారం లేకుండా వేతనంలో కోత  అసమంజసం .  It's inappropriate to cut salaries without the agreement of employees.      మెదడుకు మేత / Food for thought " "కాల ప్రయాణం సాధ్యమైతే భవిష్యత్తు నుండి పర్యాటకులు ఏరి? " --'ఏ బ్రీఫ్ హిస్టరీ ఆఫ్ టైమ్',   స్టీఫెన్ హాకింగ్ (జనవరి 8, 1942 - 2018)

అనర్గళం

  ఏప్రిల్ 12, 2021 అనర్గళం  ( an-argaḷamu )       అర్థము     (విశేషణము): అడ్డు లేకుండా; ధారాళంగా; అర్గళం (గడియ) లేకుండా     Meaning     (adjective) :  unimpeded, free, unrestrained;         వాడుక / Usage  ఆమె   అనర్గళమైన వాగ్ధాటికి సభ్యులు నివ్వెరపోయారు.  Members were spellbound by her eloquent oratory.      మెదడుకు మేత / Food for thought " " భూతాన్ని, యజ్ఞోపవీతాన్ని, వైప్లవ్యగీతాన్ని నేను! స్మరిస్తే పద్యం, అరిస్తే వాద్యం, అనల వేదిక ముందు అస్త్రనైవేద్యం! లోకాలు, భవభూతి శ్లోకాలు, పరమేష్టి జూకాలు నా మహోద్రేకాలు! నా ఊహ చాంపేయమాల!  రసరాజ్యడోల! నా ఊల కేదార గౌళ! గిరులు, సాగరులు, కంకేళికా మంజరులు, ఝరులు నా సోదరులు! నేనొక దుర్గం!  నాదొక స్వర్గం! అనర్గళం, అనితరసాధ్యం నా మార్గం!" --శ్రీశ్రీ మహాప్రస్థానం (ఏప్రిల్ 30, 1910 - 1983)

గమేళా

  ఏప్రిల్ 9, 2021 గమేళా  ( gamela )       అర్థము     (విశేషణము): ఇనప గంప; అర్ధ గోళాకారంలో ఉండే పాత్ర; తాపీ సామాను మోయడానికి వాడుతుంటారు     Meaning     (noun) :  (iron) utensil, with a spherical segment; used to hold construction materials        వాడుక / Usage   నూతన రాజధాని శంకుస్థాపనకి బంగారు గమేళా చేయించారు.   A golden utensil holding cement was used for the capital's ground breaking ceremony.      మెదడుకు మేత / Food for thought " " న జాయతే మ్రియతే వా కదాచిత్ నాయం భూత్వా భవితా వా న భూయః అజో నిత్యః శాశ్వతోఽయం పురాణో న హన్యతే హన్యమానే శరీరే " ( ఆత్మకి పుట్టుక లేదు, ఎన్నటికీ మరణం కూడా ఉండదు. ఒకప్పుడు ఉండి, ఇకముందు ఎప్పుడైనా ఉండకుండా ఉండదు. ఆత్మ జన్మ లేనిది, నిత్యమైనది, శాశ్వతమైనది మరియు వయోరహితమైనది. శరీరం నశించిపోయినప్పుడు అది నశించదు.) --భగవద్గీత రెండవ అధ్యాయం, ఇరవయ్యో శ్లోకం

రంపం

  ఏప్రిల్ 8, 2021 రంపం  ( rampamu )       అర్థము     (విశేషణము): చెక్క, కలప కోసే పనిముట్టు; కోత యంత్రము; నొక్కులతో కూడిన పదునైన కత్తి     Meaning     (noun) :  chain saw        వాడుక / Usage    ప్లైవుడ్, ఎలక్ట్రిక్ రంపం , స్పానర్ మాత్రమే వాడి  వడ్రంగి ధనిరామ్ సాగు సైకిల్ నిర్మించారు.   Carpenter Dhaniram built a cycle using plywood, chain saw and spanner.      మెదడుకు మేత / Food for thought " " భూమి నాది యనిన భూమి ఫక్కున నవ్వు  దాన హీనుఁ జూచి ధనము నవ్వు  కదన భీతుఁ జూచి కాలుఁడు నవ్వును  విశ్వదాభిరామ వినురవేమ " -- వేమన (1652 - 1730)

గునపం

   ఏప్రిల్ 7, 2021 గునపం  ( gunapamu )       అర్థము     (విశేషణము): మట్టి తవ్వే పొడుగాటి ఇనుప ఉపకరణం; గడ్డ పార; పలుగు     Meaning     (noun) :  iron crow bar        వాడుక / Usage    నేటికీ మహాద్వారం చెంత అనంతాళ్వారు స్వామివారిపై విసిరిన గునపం భక్తులు చూడవచ్చు.   The crow bar thrown by Ananthalvaar at Venkateswara can be seen at the entrance.      మెదడుకు మేత / Food for thought " " పడమటి ఉరికంబం పై వేలాడిన వెలుతురు నీవు నిద్రలేవక ముందే తూర్పు కొండలపై కూనిరాగం తీస్తుంది గతం గుర్తులు గగనానికే వదిలేసి తన గమ్యాన్ని వెతుక్కుంటూ వెలుతురులు విరజిమ్ముతూ వేగంగా వడివడిగా రానే వచ్చింది రాత్రికి మళ్ళీ పోతుంది మరణం… జననం మళ్ళీ మరణం… మళ్ళీ జననం నీవే జననం నీవే మరణం " -- హనుమంత రావు చుండూరు, కవి, పాత్రికేయడు

దిమ్మిస

  ఏప్రిల్ 6, 2021 దిమ్మిస  ( dimmisa )       అర్థము     (విశేషణము): నేలను అణిచి చదును చేసే పనిముట్టు     Meaning     (noun) :  paviour's rammer        వాడుక / Usage    మీద సిమెంటు ఇసుక కలిపిన మిశ్రమం పోశి దిమ్మిస వేశారు.   They laid a mixture of cement and sand and paved with a rammer.      మెదడుకు మేత / Food for thought " " కుర్రాళ్లొస్తున్నారు జాగ్రత్త కొత్త గొంతు లెగరేసుకుంటూ పరమ వృద్ధులూ తప్పుకోండి పాతకీర్తిని నెమరేసుకుంటూ.. రాసూ రాస్తూ పోతాను సి రా ఇంకే వరకు, పోతూ పోతూ రాస్తాను పువ్వు వాడేవరకు " -- డా. సి నారాయణ్ రెడ్డి (జులై 19, 1931 - 2017)

ఉలి

  ఏప్రిల్ 5, 2021 ఉలి  ( uli )       అర్థము     (విశేషణము): రాళ్లను లేక చెక్కను చెక్కే ఒక పనిముట్టు; శిల్పులు మరియు వడ్రంగి పని చేసేవారు వాడేది     Meaning     (noun) : chisel        వాడుక / Usage    ‘‘నగరాల్లో  అత్యద్భుతంగా  అస్థిపంజరాల్ని  చెక్కే ఉలి   ఆకలి’’   Hunger chisels skeletons in cities.      మెదడుకు మేత / Food for thought " " అగ్ని పద్యం నేను, దగ్ధగీతం నేను అక్షర క్షిపణి నేను  ఆయుధాలుగా రూపాంతరం చెందే ఆకలి నేపథ్యం నేను  అడవి నేను - కడలి నేను  ఉప్పొంగే మానవ సమూహాల సంఘర్షణ నేను  అజ్ఞాత౦గా అంతర్లీనంగా  మట్టి పొరల్లోంచి పరీవ్యాప్తమవుతున్న పోరాట పరిమళం నేను... " -- అలిశెట్టి ప్రభాకర్ (జనవరి 12, 1954 - 1993)

సంక్షిప్తం

  ఏప్రిల్ 2, 2021 సంక్షిప్తం  ( san-kshiptamu )       అర్థము     (విశేషణము): క్లుప్తము; తగ్గించబడినది; టూకీ; సంగ్రహించబడినది;      Meaning     (adjective) : abbreviated; abridged; concise        వాడుక / Usage    మనసుకు హత్తుకునే విధముగా సూటిగా సంక్షిప్తముగా సిరిమంజరి కవితలుండును.   Sirimanjari poems are simple, concise and heart warming.      మెదడుకు మేత / Food for thought " "ఆలోచనలు విత్తనాలు. మీకు దక్కే పంట మీరు నాటే విత్తనాల మీద ఆధార పడి ఉంటుంది. మీ ఆలోచనలు దేనిమీద కేంద్రీకరించుకొన్నారో అవే ప్రతిఫలించి మీ దగ్గరకి వస్తాయి. " -- అడవి బాపిరాజు (అక్టోబర్ 8, 1895 - 1952)

సంక్షోభం

  ఏప్రిల్ 1, 2021 సంక్షోభం  ( san-kshōbhamu )       అర్థము     (విశేష్యము): కలత, వ్యాకులత,ఆందోళన; అనర్థం, వనరుల కొరత వలన ఇబ్బంది      Meaning     (noun) : agitation, alarm, grief; disturbance, crisis        వాడుక / Usage    రాజధాని మీద కాలం వృధా చేయడం వల్ల రాష్ట్రం ఆర్థిక సంక్షోభంలో పడింది.    Undue focus on the capital has pushed the state into a financial crisis.      మెదడుకు మేత / Food for thought " " సీతారామారావు జీవితం విచిత్రమైంది. ఉన్నత శిఖరాగ్రం నుంచి స్వచ్ఛమైన జలంతో భూమి మీద పడి మలినాన్ని కలుపుకొని, మురికికూపంలోకి ప్రవహించే సెలయేటిని జ్ఞప్తికి తెస్తుంది. తనలో వచ్చిన మార్పు ఆ సెలయేటికి తెలుసో తెలియదో మనకు తెలియదు. ఒకవేళ తెలిస్తే, తనలో వచ్చిన మార్పుకి ఆ సెలయేరు బాధపడుతూ ఉందో లేదో మనకు తెలియదు." -- అసమర్ధుని జీవయాత్ర, త్రిపురనేని గోపీచంద్ (సెప్టెంబర్ 8, 1910 - 1962)