Posts

Showing posts from December, 2022

ఉప్పరిగ

  డిసెంబర్ 30, 2022 ఉప్పరిగ  ( uppariga )       అర్థము      (విశేష్యము ): మేడ; పై అంతస్తు     Meaning     (noun) : upper floor of a building    వాడుక / Usage హంపీ నగరం అనేక సుందరమైన ఉప్పరిగలతో శోభాయమానంగా ఉండేది. Hampi shone with a plethora of beautiful buildings.     మెదడుకు మేత / Food for thought ఎంత సన్నగా చీల్చినా దానికి రెండు ప్రక్కలు ఉంటాయి...అర్థంచేసుకోడానికి ప్రయత్నించడమే శీలానికి మొదటి మెట్టు మరియు పునాది. పాల్ గురించి పీటర్ ఏమి చెప్పాడు అనేది మనకి పీటర్ గురించి చెప్తుంది కానీ పాల్ గురించి కాదు. -- ఎథిక్స్, స్పినోజా  (నవంబర్ 24, 1632 - 1677)

సుభగ

  డిసెంబర్ 29, 2022 సుభగ  ( su-bhaga )       అర్థము      (విశేషణము ): సుందరము; భాగ్యవంతము; మనోహరి; భాగ్యవతి     Meaning     (noun) : a beautiful, happy or fortunate woman    వాడుక / Usage ప్రణయానుభూతులను ఎంకి పాటల్లో నండూరి సుబ్బారావు ఎంతో సుభగ సుందరంగా తీర్చిదిద్దారు. Nanduri Subbarao depicted romance beautifully in Yenki songs.     మెదడుకు మేత / Food for thought గ్రీకు తత్వవేత్త ఎపిక్యూరస్ అడిగిన ఆనాటి ప్రశ్నలకు ఇంకా సమాధానం లేదు. దేవుడు చెడు ఆపాలని ఉన్నా ఆపలేకపోతున్నాడా?అయితే దేవుడు నిర్వీర్యుడు. చెడు ఆపగలడు కానీ ఆపాలని అనుకోవట్లేదా? అయితే దేవుడు కపటి. చెడు ఆపగల్గి, ఆపుదామనే సదుద్దేశం ఉన్నవాడా? అయితే మరి లోకంలో ఇన్ని దురాగతాలు ఏల? -- స్కాటిష్ జ్ఞానోదయ తత్వవేత్త, డేవిడ్ హ్యూమ్  (ఏప్రిల్ 26, 1711 - 1776 )

గరగ

  డిసెంబర్ 28, 2022 గరగ  ( garaga )       అర్థము      (విశేష్యము ): చిన్న కుండ; కమండలం; గ్రామదేవతగా పూజించే ఘటము     Meaning     (noun) : a small pot; funnel; pot symbolising the village deity    వాడుక / Usage గరగ నృత్యాన్ని తెలంగాణలో బోనాలు, దేవీనవరాత్రుల్లోను, గ్రామదేవతల జాతరలో ప్రదర్శిస్తారు. In Telangana, pot (on the head) dance, is performed during Bonalu and other festivals.     మెదడుకు మేత / Food for thought తల్లిదండ్రులు యేరులు చేదుగా ఎందుకున్నాయా అని మదనపడుతుంటారు. కానీ చిమ్మన గ్రోవిని (ఊట) విషమయం చేసింది వారే అని మర్చిపోతుంటారు...పెద్దలు వల్లె వేసే నీతి వాక్యాల కంటే పిల్లలు అడిగే ఊహించలేని ప్రశ్నలనుంచి మనం ఎక్కువ నేర్చుకోవచ్చు....కోరికలకు పగ్గాలు వెయ్యడమే శీలానికి పునాది. -- ఫాథర్ ఆఫ్ లిబరలిజం, జాన్ లాక్  (ఆగష్టు 29, 1632 - 1704 )

రిపూరగ

  డిసెంబర్ 27, 2022 రిపూరగ  ( ripooraga )       అర్థము      (విశేష్యము ): రిపు = శత్రువు; ఉరగ = పాము; శత్రువు అనే పాము     Meaning     (noun) : a snake-like enemy    వాడుక / Usage మనతో తిరుగే రెండు నాలుకల రిపూరగులు నుంచి సావధానంగా ఉండాలి. Beware of the fork tongued enemies milling about around us.     మెదడుకు మేత / Food for thought చరిత్ర నుంచి ప్రపంచంలోని ఏ ప్రభుత్వం కూడా ఎప్పుడూ ఏమీ నేర్చుకోలేదు. కనీసం వాటిలోని నైతిక విలువలు నేర్చుకునే ప్రయత్నం కూడా చేయలేదు. చరిత్ర న్యాయస్థానం వంటిది. స్వేచ్చా సాధనే చరిత్రలో ఏకైక నిరవధిక అంశము. -- హేగెల్   (ఆగష్టు 27, 1770 - 1831)

ఇదమిత్థంగా

  డిసెంబర్ 26, 2022 ఇదమిత్థంగా  ( idamitthamga )       అర్థము      (క్రియా విశేషణము ): ఖచ్చితంగా, స్పష్టంగా, అనుమానం లేకుండా     Meaning     (adverb) : surely; definitely; precisely    వాడుక / Usage ఓటు విలువను ధర కట్టడం ఎన్నడు మొదలైందో ఇదమిత్థంగా తేల్చి చెప్పడం కష్టం. It is difficult to precisely say when votes started to be bought.     మెదడుకు మేత / Food for thought మన విద్య సర్వమూ ఇంద్రియాలతో మొదలయ్యి, అర్థం చేసుకోవడంతో సాగి జ్ఞానంతో ముగుస్తుంది. జ్ఞానానికి మించినది ఏదీ లేదు.... నమ్మకానికి తావు ఇవ్వాలి అంటే జ్ఞానాన్ని తొలగించాలి. -- క్రిటీక్ ఆఫ్ ప్యూర్ రీజన్,  ఇమ్మాన్యుయేల్ కాంట్ (ఏప్రిల్ 22, 1724 - 1804)

సినీవాలి

  డిసెంబర్ 23, 2022 సినీవాలి  ( sineewaali )       అర్థము      (విశేష్యము ): సినీ=తెలుపు; కొద్దిగా చంద్రుడు కనపడే అమావాస్య; పార్వతి      Meaning     (noun) : a new moon day with faint moonlight    వాడుక / Usage శీతాకాలపు సినీవాలిలో పొగమంచు మాటున దురాక్రమణ మొదలయ్యింది. On a faintly lit fog filled winter new moon night the attack unfolded.     మెదడుకు మేత / Food for thought ప్ర) పెళ్ళానికీ పక్కింటావిడకీ తేడా ఏవిటండీ ? స) పెళ్ళం యేం చేసినా బావుండదు. పక్కింటావిడ యేం చేసినా బావుంటుంది. ప్ర) భీముడు, అర్జునుడు, నకులుడు, సహదేవుడు వీళ్ళందరి పేర్ల చివరా డు ఉంది, ధర్మరాజు కి లేదు..ఎందుకు? స) ఆయన అరణ్యవాసం లోనూ, అజ్ఞాతవాసంలోనూ, కూర్చుని యింగ్లీషులో ఆజ్ఞలు జారీ చేసేవాడట (అన్నగారు కదా, అందుకని) భీమా..డు, అర్జునా..డు, నకులా..డు, సహదేవా..డు..అంటూ…అందుకే వాళ్ళ పేర్లకి చివర డు వచ్చి చేరింది ప్ర) ఈ మధ్యన టీ వీ లో అనౌన్సర్లెవరూ వత్తులు పలకట్లేదు ఏంచెయ్యమంటారు స) లక్ష వత్తుల నోము చేయిస్తే సరి !! 3) తల్లి కడుపు చూ...

అబ్జము

  డిసెంబర్ 23, 2022 అబ్జము  ( abjamu )       అర్థము      (విశేష్యము ): నీట పుట్టినది; తామర; వంద కోట్లు; ఉప్పు; హారతి కర్పూరము; శంఖము;      Meaning     (noun) : water born; lotus; salt; conch; billion    వాడుక / Usage దమయంతి మెడ అబ్జ వోలె యున్నది. Damayanthi's neck was shaped like a conch.     మెదడుకు మేత / Food for thought దత్తపది (డాక్టర్‌ బి. కె. మోహన్‌గారు) ఇచ్చిన పదాలు క్షేత్రం, గాత్రం, సూత్రం, క్షాత్రం అడిగిన అంశం కురుక్షేత్ర యుద్ధం అవధాని చెప్పిన పద్యం : క్షేత్రము ధర్మ బంధుర విశిష్టము శ్రీహరి గీతికా వచో గాత్రము తోడ, యర్జునుని కమ్రబలోన్నతి పెంపుజేయ తత్‌ సూత్రము ధర్మ దిగ్విజయ శోభనమై కురు సంగరంబులో క్షాత్రము సార్థకంబుగ ప్రశస్తత పాండవులందిరెంతయున్‌ -- అవధాని డా. మేడసాని చంద్రమోహన్

కువలయము

  డిసెంబర్ 21, 2022 కువలయము  ( ku-valayamu )       అర్థము      (విశేష్యము ): భూమి; కలువ     Meaning     (noun) : earth; water lily    వాడుక / Usage రాజు కువలయా నందకరుడు అనే వాక్యంలో శ్లేష గుర్తించారా? The King (moon) makes earth (lily) happy.     మెదడుకు మేత / Food for thought ' సన్న్యాసి 'కీ సన్నాసికీ' తేడా ఏమిటి? (అప్రస్తుత ప్రసంగి) అవధాని సమాధానం:- సన్న్యాసికీ సన్నాసికీ 'య'వత్తే తేడా అనుకుంటున్నారా? కాదు యావత్తూ తేడాయే, సన్న్యాసి అంటే లోకాన్ని విడిచి పెట్టినవాడు అని అర్థం. యింక సన్నాసి అంటే లోకం చేత విడువ బడినవాడు అని అర్థం. విషస్య విషయా ణాం చే దృశ్యతే మహదంతరం ఉప భుక్తం విషం హంతి విషయః స్మరణా దపి (విషమునకు ,విషయములకు యెంత యో భేద మున్నది.మనకు 'య' అను అక్షరము మాత్రమె ఎక్కువ అనిపిస్తుంది కానీ విషము తినినచో చంపు చున్నది. విషయ సుఖములు స్మరించిన మాత్రముననే చంపుచున్నవి.ఒక అక్షరము,లేక ,ఒక వత్తు తేడా తో అర్థమే మారిపోతుంది.) --  ద్విశతావధానంలో డా. మాడుగుల నాగఫణి శర్మ గారు

శరధి

  డిసెంబర్ 20, 2022 శరధి  ( ṣara-dhi )       అర్థము      (విశేష్యము ): సముద్రం; విల్లు; అమ్ముల పొది      Meaning     (noun) : ocean; bow; quiver    వాడుక / Usage తెలంగాణ విమోచన కోసం ‘రుద్రవీణ’ను మీటి ‘అగ్నిధార’ను శరధిగా కురిపించారు దాశరథి.  Dasaradhi wrote Rudraveena & Agnidhara raining arrows for the cause of Telangana.     మెదడుకు మేత / Food for thought సెనగపిండి యుల్లిపాయ చిన్నిమిర్పకాయలుం జొనిపి యందు నల్లమింత చొనిపి ముద్దచేసియున్ అనలతప్తమైన నేతియందు వైచి వేచినం జనుఁ బకోడి యనెడు పేరఁ జక్కనైన ఖాద్యమై -- అవధానంలో పకోడీ వర్ణం,  తిరుపతి వేంకట కవులు 

చంచరీకము

  డిసెంబర్ 19, 2022 చంచరీకము  ( chancharīkamu )       అర్థము      (విశేష్యము ): తుమ్మెద; భృంగము     Meaning     (noun) : carpenter bee    వాడుక / Usage శకుంతల ముఖపద్మాన్ని ఆశించి ఒక  చంచరీకము  కలవరపరిచింది. A bee taken in by the lotus faced Shakuntala hovered around her.     మెదడుకు మేత / Food for thought మలినంబుబాపి నిర్మలతజూపుటజేసి యల్ల గంగాదేవి యనగవచ్చు నఖిలప్రదేశంబు లందుదోచుటచేసి యల పరమాత్మయే యనగవచ్చు నిత్యాభిషేకమ్ము నెమ్మిగాంచుటజేసి యల జలస్థిత లింగమనవచ్చు స్త్రీకర గ్రహణంబు జెలిమినందుటజేసి యల పురుషోత్తముడనగవచ్చు ననుచునెట్లెట్లో పొగడగా నయ్యెగాదె యదియు సింగారపుంగట్ట యనుటజేసి కాక నద్దాని జీపురుగట్ట యనిన నింతగా వర్ణనముసేయు నెవడుదలచు? -- అవధానులు  కొప్పరపు సోదర కవులు 

పవళించు

  డిసెంబర్ 16, 2022 పవళించు  ( pavaḷinchu )       అర్థము      (క్రియ ): పడుకొను; శయనించు; మేను వాల్చు     Meaning     (verb) : sleep; recline; lie down    వాడుక / Usage " పలుకు దేనెల తల్లి పవళించెను కలికితనముల విభుని కలసినది గాన " " Mother of honeyed speech sleeps, because with maidenly charms, she had united with her Lord "     మెదడుకు మేత / Food for thought మట్ట్టి మట్టిని ప్రేమిస్తుంది మట్టిలో నేను భాగమన్న స్పృహ నాకు జ్ఞానాన్ని ప్రసాదిస్తుంది. చెప్పులు లేకుండా నేల మీద తిరుగుతున్నప్పుడల్లా కాళ్ళలోంచి పద్యాలు పాకుతాయి. అంతెందుకు కొంచెం మట్టిని తెచ్చి కాగితం పై చల్లాను అవే ఈ అక్షరాలు చేతులు వొట్టి తోలు కట్టెలు కావు అగ్గువగా అమ్ముడౌతున్నంత మాత్ర్రాన ఎవరికి గులాం గిరి చేయవు బతుకు తుఫానులో శరీరం పడవను తెరచాపల్లా నిలబెడతాయి తెడ్లై ముందుకు తోస్తాయి కండ్లలోంచి నదులు ధారలుగా కారుతుంటే చేతులు ఆనకట్ట వేస్తాయి చెయ్యి చెయ్యి కలిపితే కుటిల మేఘాలు మెరుపు పగుళ్లతో ముక్కలౌతాయి -- సాహిత్య అకాడెమీ అవార్డు గ్రహీత,...

అధిపుడు

  డిసెంబర్ 15, 2022 అధిపుడు  ( adhipuḍu )       అర్థము      (విశేష్యము ): అధిపతి; ప్రభువు; ఏలిక     Meaning     (noun) : ruler; Lord    వాడుక / Usage " తిరు వేంకటాచ లాధిపుని గౌగిట గలసి అరవిరై యూరుల జెమట యంటినది గాన " " embracing the overlord of the auspicious Venkata hills gave her a hot flush, sweating her thighs "     మెదడుకు మేత / Food for thought ఏ దేశమేగినా ఎందుకాలిడినా ఏ పీఠమెక్కినా ఎవ్వరేమనిన పొగడరా నీ తల్లి భూమి భారతిని నిలుపరా నీ జాతి నిండు గౌరవము శ్రీలు పొంగిన జీవగడ్డయి పాలు పారిన భాగ్యసీమయి వ్రాలినది ఈ భరతఖండము భక్తిపాడర తమ్ముడా! వేదశాఖలు పెరిగె నిచ్చట ఆదికావ్యం బందె నిచ్చట -- రాయప్రోలు సుబ్బారావు (మార్చ్ 17, 1892 - 1984)

జట్టి

  డిసెంబర్ 14, 2022 జట్టి  ( jatti )       అర్థము      (విశేష్యము ): వెల; అమ్మకం; ఒప్పందం; పరిపూర్ణమైన అజమాయిషీ     Meaning     (noun) : price; sale; contract; total ownership    వాడుక / Usage " తెగని పరిణతులతో తెల్లవారిన దాక జగదేక పతి మనసు జట్టి గొనె గాన " "T ill past dawn, with unending fulfillment, she bought out the heart of the Lord of the world "     మెదడుకు మేత / Food for thought ప్రేమ ప్రతిపాదన సుమ గుచ్ఛంతోనో పెళ్లి కామన పూలమాలతోనో నా ఎదుట నిలిచిన నిన్ను నిర్ద్వంద్వంగా తిరస్కరించినపుడు నిర్దాక్షిణ్యంగా నాపై దాడి చేసి ఆమ్ల వర్షం కురిపించినపుడు నా దేహ దేశ సార్వభౌమాధికార హక్కు నాకు భ్రమగానే మిగిలినపుడు శత్రు రాజ్యాలను జయించినప్పటికన్నా వారి స్త్రీల శరీర రాజ్యాలను  జయించిన సందర్భంలోనే నీ అహంకారం తృప్తి పడినపుడు ఎదురుపడిన వ్యక్తిని వైదొలగమన్న శంకరాచార్యునితో దేహాన్నా ఆత్మనా అని సందేహ బాణం సంధించినట్లు సర్వావయవాల ఈ దేహం సకలానుభూతులు ఈ శరీరం నాది కాదా అని / తీరని సందేహం నిజంగా / ఈ దేహం ఎవరిది...

నెరులు

  డిసెంబర్ 13, 2022 నెరులు  ( nerulu )       అర్థము      (విశేష్యము ): తల వెంట్రుకలు; కురులు     Meaning     (noun) : hair; tresses    వాడుక / Usage "నిగనిగని మోముపై నెరులు గెలకుల జెదర పగలైన దాక జెలి పవళించెను " "Strands of hair scattered on all sides of her glowing face, the dear girl slept till late in the morning"     మెదడుకు మేత / Food for thought కామాన్ని ప్రేమ గానో, దానితో పాటు వచ్చే అసూయ గానో, త్యాగం గానో, మరో ఆదర్శవంతమైన ఆవేశంగానో మారనిచ్చావో జీవితంలో సుఖం ఉండదు. సుఖం దానంతట అది రాదు. సుఖం నువ్వు చేసుకునేది. అది అదృష్టం వల్లో, మరో సదుపాయం వల్లో వచ్చే వొస్తువు కాదు. ఆలోచనల వల్ల, లౌక్యం వల్ల, చాకచక్యం వల్ల మాత్రమే సౌఖ్యం సాధ్యం. నీతి, స్నేహం, న్యాయం, ధర్మం ఇవి నిజాలు కావు. కాని ఇవి ఉన్నాయని తెలివితక్కువ వాళ్ళు నమ్ముతారు. కాబట్టి వాటికి అస్తిత్వం ఉంది. వాళ్ళు నమ్ముతారు కాబట్టి, వాళ్ళే లోకంలో ఎక్కువ మంది కాబట్టి, నువ్వు వాటిని నీ సుఖం కోసం వాడుకోవచ్చు. కాని అవి నిజంగా ఉన్నాయని నువ్వు నమ్...

గుబ్బ

  డిసెంబర్ 12, 2022 గుబ్బ  ( gubba )       అర్థము      (విశేష్యము ): గుండ్రని; స్తనము; తలుపు తెరవడానికి అమర్చే గుండ్రటిది; పర్వతం     Meaning     (noun) : woman's breast; door knob; spherical; hill    వాడుక / Usage "కొంగు జారిన మెరుగు గుబ్బ లొలయగ దరుణి బంగారు మేడపై పవళించెను" "The displaced garment lay her shining breasts exposed, so the nubile lady slept in her golden chamber."     మెదడుకు మేత / Food for thought ‘ఆలయాలపైన అల మసీదులపైన చెర్చిపైన సేరి సేదతీరు పావురాలకేది పరమత ద్వేషంబు మలినపడెను మనిషి మతము కతన’ -- సాహితీవేత్త  షేక్ మహమ్మద్ ముస్తాఫా (1939 – 2020)

ముప్పిరి

  డిసెంబర్ 09, 2022 ముప్పిరి  ( mup-piri )       అర్థము      (విశేష్యము ):  మూడు పిరులు; పిరి=మెలి, త్రాడు, దారం; మూడింతలు; అతిశయమవ్వు; పెనవేసుకును     Meaning     (noun) : threefold weave; three twists or strands/threads; triple; swell; increase    వాడుక / Usage "ప్రేమ ముప్పిరి గొను వేళ నామము దలచువారు రామభక్తుఁడైన త్యాగ రాజనుతుని నిజదాసులైన.." As bhakti swells those that take your name; devotee of Rama Tyagaraja's (salutations to) them the real Gnanis.     మెదడుకు మేత / Food for thought మాసిన తలల్ని కుంకుళ్ళతో అంటుకునేముందు మూసుకున్న తలపులకీ వాటివెనుకనున్న అభ్యంతరాలకీ అభ్యంగనం చేయించామా? అప్పో సొప్పో చేసి కొత్త బట్టలు కుట్టించుకునే ముందు చిరుగులుపడ్డ జీవన వాస్తవాలకి కుట్టు వేసుకోగలిగామా? మన కళ్ళెదుట కదుల్తున్న పగటి వాస్తవాలని మనవికావులే అని కళ్ళుమూసుకున్నా అవే వాస్తవాలు రాత్రి పూట పీడకలల్లో మనముఖాలే తగిలించుకుని ఎదురౌతూ ఉంటే ఆ కలవరింతల్నుంచి మేలుకోగలుగుతున్నామా? ఆశయాల్నీ, ఆదర్శాల్నీ ఆశల అంబర...

తాపత్రయము

  డిసెంబర్ 08, 2022 తాపత్రయము  ( tāpa-trayamu )       అర్థము      (విశేష్యము ):  మూడు విధములైన తాపములు/కష్టాలు - ఆధ్యాత్మికము, ఆధిదైవికము, ఆధిభౌతికము; ఆరాటం; తొందరపాటు     Meaning     (noun) : three kinds of sufferings in the world - from ourselves, others, divine; anxious; overzealous    వాడుక / Usage అంతరించిపోతున్న పిచ్చుకల కోసం యవకుడి తాపత్రయం . Young man's fervent efforts to save the Sparrow.     మెదడుకు మేత / Food for thought తలదాచుకొనుటకు నెలవు జానెడు లేదు ఆనయంబు నా దేశమనుట యేల? కడుపు గాలుచునుండ కనికరించారుగాని నా జాతియను భ్రాంతి నాకు ఏల? మనిషిగా తలయెత్తి మసలనీయరుగాని నాదు సంస్కృతియని మిన్నంట నేల? నా భాష గ్రామ్యమై నగుబాటు పాలాయె నా భాష యన్న యానంద మేల? నన్ను బోలిన యావదాపన్న జనులు నాదు జాతిగా భావింతు నాదరమున నంతియేగాని ఏ దేశ మేదైన నేమి? దాసుడనుగాను మూఢ విశ్వాసములకు -- గుంటూరు శేషేంద్ర శర్మ (అక్టోబర్ 20, 1927 - 2007)

ముయ్యంచు

  డిసెంబర్ 07, 2022 ముయ్యంచు  ( muyyanchu )       అర్థము      (విశేష్యము ): మూడు అంచులు కలది; త్రికోణము     Meaning     (noun) : three edged; triangle    వాడుక / Usage " అయ్యో పోయెం బ్రాయము కాలము  ముయ్యంచు మనసున నే మోహమతినైతి" Alas! age and time lost, enamoured and trapped in the three edges (Dharma, Artha, Kaama) of mind.     మెదడుకు మేత / Food for thought బలవంతంగా విద్యార్థుల్ని పుస్తకాలకి శిలువేసి సంవత్సరాల మేకులు దిగేసి వొదిలేస్తే ఈ విద్యా వ్యాపార వ్యవస్థలో నెత్తురోడుతూ యింకెందరు నిరుద్యోగ క్రీస్తులో --ఈ తరం క్రీస్తు, అలిశెట్టి ప్రభాకర్ (జనవరి 12, 1956 - 1993)

అంబకము

  డిసెంబర్ 06, 2022 అంబకము  ( ambakamu )       అర్థము      (విశేష్యము ): కన్ను; నేత్రము; బాణము;      Meaning     (noun) : eye; arrow    వాడుక / Usage గోదావరి జన్మస్థానం నాసిక్ లోని త్రయంబకం క్షేత్రం. Godavari originates in Nasik's Trayambakam (three eyed one) shrine.     మెదడుకు మేత / Food for thought సెలయేరా సెలయేరా గలగలమంటో నిత్యం ఎలా పాడ గలుగుతున్నావు? చూడు, నా బతుకునిండా రాళ్లు పాడకుంటే ఎలా?.... నేను డబ్బు సంపాదించలేదని మా ఆవిడ సణుగుతుంది. డబ్బెందుకు? కిటికీ లోంచి వాలి టేబుల్ పై పుస్తకాన్ని, పెన్నుని ఇంకు స్టాండుని మంత్రించే సూర్యకిరణం ఖరీదెంత! ఎంత డబ్బు పెడితే దొరుకుతుంది.... మా ఆవిడ ఒక చేత్తో ఆకాశాన్ని ఎత్తిపట్టుకొంటుంది ఒక చేత్తో భూమిని బుజ్జగిస్తుంది. ఒక పిట్టచేత్తో కన్నీటి బీజాల్ని ఏరుకుంటుంది. ఒక సెలయేటి చేత్తో బండల్ని నిమిరి ఓదారుస్తుంది..... -- ఇస్మాయిల్ (మే 26, 1928 - 2003)

నిటలము

  డిసెంబర్ 05, 2022 నిటలము  ( niṭalamu )       అర్థము      (విశేష్యము ): నుదురు; నొసలు; ఫాలము; లలాటము     Meaning     (noun) : forehead    వాడుక / Usage నిటలాక్షుని కోపాగ్నికి మరుడు మసై పోయాడు. Manmadha was burnt to ashes by Shiva's fiery anger.     మెదడుకు మేత / Food for thought     నీ వొడిలో నా తల పెట్టుకుని అభ్యంగనావిష్కృత త్వదీయ     వినీల శిరోజ తమస్స ముద్రాలు పొంగి నీ బుజాలు దాటి నా     ముఖాన్ని కప్పి ఒక్కటే ఒక స్వప్నాన్ని కంటున్న వేళ     చంద్రికాస్నపిత సంగీతాన్ని వింటున్నవేళ     ఆకుపచ్చని భూమికీ గిరులకీ ఝరులకీ సమస్త సృష్టికీ     ఒకే అర్ధం కనుక్కున్నవేళ     నీ పాట హాయిగా గాలిలో తేలి మునిమాపు జేగురులతో కలసి     దిక్కులను చుట్టి నీ మ-దు చలాంగుళిచ్ఛవిలో కరిగి     నా వొంటిని నిమిరి నన్ను నిర్ణిద్ర నిద్రలో పడవేసి నీ ఎర్రని     పెదాలు నా నొసటిమీద ఆనందపు నెల...

సోయగము

  డిసెంబర్ 02, 2022 సోయగము  ( sōyagamu )       అర్థము      (విశేష్యము ): అందము; జిలుగు; చక్కదనం; శోభనము     Meaning     (noun) : beauty; elegance; splendour    వాడుక / Usage గోదారి సోయగాలు పాపికొండల నడుమ ఒంపులు తిరిగేటపుడే చూడాలి. Godavari's beauty is a sight to behold in it's undulations at Papikondalu.     మెదడుకు మేత / Food for thought గోరంత దీపం కొండంత వెలుగు.. చిగురంత ఆశ జగమంత వెలుగు.. గోరంత దీపం కొండంత వెలుగు.. చిగురంత ఆశ జగమంత వెలుగు.. కరిమబ్బులు కమ్మే వేళ..మెరుపు తీగే వెలుగూ.. కారు చీకటి ముసిరే వేళ..వేగు చుక్కే వెలుగు.. కరిమబ్బులు కమ్మే వేళ..మెరుపు తీగే వెలుగూ.. కారు చీకటి ముసిరే వేళ..వేగు చుక్కే వెలుగు.. మతి తప్పిన కాకుల రొదలో మౌనమే వెలుగు.. మతి తప్పిన కాకుల రొదలో మౌనమే వెలుగు.. దహియించే బాధల మద్యన సహనమే వెలుగు!! గోరంత దీపం కొండంత వెలుగు.. చిగురంత ఆశ జగమంత వెలుగు.. కడలి నడుమ పడవ మునిగితే.కడదాకా ఈదాలి.. కడలి నడుమ పడవ మునిగితే.కడదాకా ఈదాలి.. నీళ్ళు లేని ఎడారిలో..నీళ్ళు లేని ఎడారిలో.. కన్నీళ...