Posts

Showing posts from November, 2023

వీనులు

  డిసెంబర్ 01, 2023 వీనులు     ( veenulu )       అర్థము      (విశేష్యము ): చెవులు     Meaning     (noun) : ear    వాడుక / Usage    హరికథా కాలక్షేపం వీనుల విందుగా ఆబాలగోపాలాన్ని ఆకట్టుకుంది.    The Harikatha was a feast to the ears and attracted everyone.     మెదడుకు మేత / Food for thought నాది సనాతనత్వం. దానికో ధర్మం ఉంది. అర్థం ఉంది. అహం కూడా ఉంది అని స్వీకరించినవాడు విశ్వనాథ. ఓరి సనాతనుల్లారా...మీ యుగం ముగిసింది..మీ పండు ఇలా పుచ్చిపోయింది...ఇక రాలక తప్పదు అని గ్రహించి హెచ్చరించిన వాడు శ్రీపాద. అభ్యుదయం, సంస్కరణ, అస్తిత్వం అని ముందుకూ వెనుకకూ అగమ్యంగానే గమ్యం వైపు నడిచినవాడు గోపీచంద్. -- కథలు ఇలాకూడా రాస్తారు, మహమ్మద్ ఖదీర్ బాబు

ఖద్యోత

  నవంబర్ 30, 2023 ఖద్యోత     ( kha-dyōta )       అర్థము      (విశేష్యము ): మిణుగురు పురుగు; సూర్యుడు     Meaning     (noun) : firefly; Sun    వాడుక / Usage     " దిశలం బగళ్ళ నిశలన్ ఖద్యోత చంద్రాత్మలం  గలఁ ".    He is in (all) directions, in the days, in nights, in Sun, in moon and in (Atma) Self .     మెదడుకు మేత / Food for thought ఎదో ఒక స్పాట్కు వెళ్లి కూచుని అక్కడ కనిపించేదంతా వాక్యాల్లోకి తర్జుమా చేయాలి. గుడికి వెళితే....మెట్ల మీద కూచుని కొబ్బరి తింటున్నాడొక పెద్దమనిషి... ఇది ప్లాట్ రికార్డింగ్. కొబ్బరి ముక్క నోట్లో పెట్టుకోడంవల్ల బుగ్గ వచినట్లయ్యి ,మెట్ల మీద కూచుని ఉన్నాడొక పెద్ద మనిషి....పిల్లలు ఆడుకుంటున్నారు...ప్లాట్...లావుగా ఉన్న ఒక పట్టు పావడా పిల్ల బక్కగా ఉన్న ఇంకో ఇద్దరు ముగ్గురు పిల్లల మీద అథారిటీ చెలాయిస్తూ తాను చెప్పిన ఆటే ఆడమని బలవంతం చేస్తూ ఉంది...ప్రసాదం పంచుతున్నాడు పూజారి...ప్లాట్. -- కథలు ఇలాకూడా రాస్తారు, మహమ్మద్ ఖదీర్ బాబు

కుంభిని

  నవంబర్ 29, 2023 కుంభిని     ( kumbhini )       అర్థము      (విశేష్యము ): భూమి; నేల      Meaning     (noun) : earth; land    వాడుక / Usage     " క లఁ   డంభోధిఁ, గలండు గాలిఁ, గలఁ డా కా శంబునం, గుంభినిం గ లఁ డగ్నిన్ ".    He is in ocean, he is in air, in space, in earth and in fire.     మెదడుకు మేత / Food for thought 'రచయితగా ఉండకు. రాస్తూ ఉండు' అన్నాడొకాయన. రచయితగా ఉండటం అంటే? అంటే - రచయిత అనే స్టాంప్ వేయించుకుని ఉబుసుపోనట్టుగా అటూ ఇటూ తిరుగుతూ అభిప్రాయాలు చెబుతూ పెద్దరికం వహిస్తూ పీఠాధిపతిగా అవతారమెత్తుతూ ఉత్త రచయితగా ఉండటం. అంతే తప్ప రాస్తూ ఉండటం మాత్రం కాదు. మరి నిజమైన రచయిత ఎవరు? తాను రచయితగా చెలామణి అయ్యే ప్రమాదం నుంచి తప్పించుకుని రాస్తూ ఉండే పనిలో ఉండేవాడు. -- కథలు ఇలాకూడా రాస్తారు, మహమ్మద్ ఖదీర్ బాబు

కుటజము

  నవంబర్ 28, 2023 కుటజము     ( kuṭajamu )       అర్థము      (విశేష్యము ): కొండమల్లె      Meaning     (noun) : a kind of wild flower    వాడుక / Usage     " లలిత రసాల పల్లవ ఖాదియై సొక్కు  కోయిల జేరునే కుటజములకు ".    Will the cuckoo that relishes the nectar of tender leafs, reach out to wild flowers.     మెదడుకు మేత / Food for thought మొదటి భార్య చితాగ్ని నుంచే రెండో పెళ్లి హోమానికి నిప్పు తీసుకొచ్చాడన్న నిందను హనుమంతరావు నిబ్బరంగా భరించాడు...అని మొదలవుతుంది జలసూత్రం రుక్మిణీనాథ శాస్త్రి కథ - హోమగుండం. ఒక ప్రారంభంలో కథ పట్ల కుతూహలంతో పాటు కథ తాలూకు ఉద్దేశాన్ని కూడా సూచిస్తూ పాఠకుణ్ణి ప్రవేశపెట్టడం సమర్థుడైన రచయిత చేయదగ్గ పని. చేయవలసిన పని కూడా. -- కథలు ఇలాకూడా రాస్తారు, మహమ్మద్ ఖదీర్ బాబు

మిటారి

  నవంబర్ 27, 2023 మిటారి     ( miṭāri )       అర్థము      (విశేష్యము/విశేషణము ): సొగసుకత్తె; మదముగలది; చమత్కారంగా మాట్లాడే అమ్మాయి; ఒయ్యారమైన;      Meaning     (noun/adj) : a belle; pretty woman; attractive; charming    వాడుక / Usage     "ఆగ్రహం కూడా నీ అందాన్ని అతిశయింప చేస్తోంది కోమలి.  మరులు రేకెత్తించే వలపు మిటారి . సరసాలు కురిపించే సొగసు జవరాలివి. "    Anger is enhancing your beauty, O dainty one! your seductive charm enamours as a mist of love.     మెదడుకు మేత / Food for thought వ్యాసుడు గొప్పవాడా...వాల్మీకి గొప్పవాడా...అదేం ప్రశ్న? హిమపన్నాగాలు గొప్పవా, గంగా ప్రవాహం గొప్పదా అన్నట్లు ఉంది. దేని గొప్ప దానిదే. ఎవరి గొప్ప వారిదే. వాల్మీకి వర్ణన, ఆ మహాకావ్యంలో అయన పొందు పరిచిన రమణీయత, అందులోని కరుణ, ఆ మానవోద్వేగాలు...మరొకరి కంఠానికిగానీ గంటానికిగానీ అందేవిగావు. దుస్సాధ్యం. కాని - ఒట్టి పాత్రల విషయానికి వస్తే వ్యాసుని విశ్వరూపం ముందు మరే కల్పనా శక్తి కళ్ళు ...

అక్కటికము

  నవంబర్ 24, 2023 అక్కటికము     ( akkaṭikamu )       అర్థము      (విశేషణము ): దయ; జాలి; కరుణ     Meaning     (noun) : pity; mercy; compassion    వాడుక / Usage     " అక్కటికమెటు గల్గు ఆది వేంకటేశ నీకు " .    How will you show compassion on me, Venkateshwara?!     మెదడుకు మేత / Food for thought అయినా నీ మాటలు వింటే పిల్లి ఏమనుకుంటుంది? -- 'ఈ మానవులకు ఎంత స్వార్థం?! ఆవుల్ని మేకల్ని కట్టేసి, వాళ్ళేదో హక్కుదార్లాగా సిగ్గు లేకుండా పాలన్నీ పిండుకుని తాగుతారు.ఎప్పుడైనా మనం కాసిన్ని పాలు రుచి చుస్తే కొంపలంటుకు పోయినట్లు గోల చేస్తారు. పుట్టిళ్లలో ఉన్న పెళ్ళాలకు కూడా రాసుకుంటారు, రాయడానికింకేమీ లేనట్లు!హి హి ఏం మనుషులు అని నవ్వుకోదూ దాని ప్రియుడికి చెప్పి? ఛీ మానవజాతిని ఎంత అల్పం చేసావు పిల్లి దృష్టిలో! -- పెళ్ళానికి ప్రేమలేఖ, ముప్పాళ్ల రంగనాయకమ్మ

మిక్కిలి

  నవంబర్ 23, 2023 మిక్కిలి     ( mikkili )       అర్థము      (విశేషణము ): అధికము; శ్రేష్ఠము     Meaning     (verb/noun) : great; abundance; very much    వాడుక / Usage     " మిక్కిలి సైన్యమివ్వ మర్కటేంద్రుడ గాను " .    I cannot give you a large army; for I am not Sugriva, the lord of the monkeys.     మెదడుకు మేత / Food for thought నా మీద లైంగిక దాడి జరుగుతున్న క్షణాన నేను తుమ్మ ముల్లునై వాళ్లకు గుచ్చుకోవాలని అనుకున్నాను విషకన్యను కానందుకు చింతించాను నా వెజైనా మీద హింస పరాకాష్ఠకు చేరుకున్న ఆ అవాంఛిత విషాద సమయంలో నేను అస్తిత్వం కోసం ప్రయత్నించాను పోరాడి గాయపడి చివరకు ముగిసిపోయాను ఈ వ్యవస్థ ముఖం మీద నా సిగ్గుబిళ్లను విసిరేసి వెళ్తున్నాను అత్యాచారాల చరిత్ర పేజీ లేని నేల మీద మళ్ళీ వెజైనాతోనే పుట్టాలని ఉంది మళ్ళీ ...మళ్ళీ ...మళ్ళీ స్త్రీ గానే !! -- మహజబీన్

ఒసగు

  నవంబర్ 22, 2023 ఒసగు     ( osagu )       అర్థము      (క్రియ/విశేష్యము ): ఇచ్చు; అందించు; త్యాగము     Meaning     (verb/noun) : to give; a gift    వాడుక / Usage     " చక్కని చెలిని యొసగ జనకరాజును గాను " .    I cannot give you a beautiful consort (in marriage); for I am not Janaka.     మెదడుకు మేత / Food for thought     రచన అంటే అక్షరాలని ఇష్టం వచ్చినట్లు బస్తాల కొద్దీ తెల్ల కాయితాల మీద విసర్జించడం కాదు. సాధనా, శోధనా కావాలి. ప్రతి మనసు తలుపు తట్టగలగాలి. పేజీకి ఎన్ని అక్షరాలని అమ్మగలను...అవి ప్రింట్ వేయడానికి ఎవడికి ఎలా ఎర వేయగలను అని ఆలోచించడం మానుకోవాలి.... అదొక తపస్సు. ఒక వరం...గుండెకు అయిన గాయంనుంచి వాల్మీకికి వచ్చిన ఆర్తవం. పోతన మనసుతో పరమాత్ముని సంగమించి వ్రాసిన వాఙ్మయం. -- బలభద్రపాత్రుని రమణి

రొక్కము

  నవంబర్ 21, 2023 రొక్కము     ( rokkamu )       అర్థము      (విశేష్యము ): ధనము; సమూహము     Meaning     (noun) : money; crowd    వాడుక / Usage     " రొక్కమి చ్చుటకునే ముక్కంటి చెలికాను " .    I am not Shiva's friend, Kubera, to be able to give you money.     మెదడుకు మేత / Food for thought      తెన్నేటి హేమలత వంశీకుంజం కథలో కృష్టుడు, గోపకాంత అయిన నీరజ మధ్య ఉన్న బంధాన్ని అలౌకికంగా చిత్రీకరించారు. ప్రేమికుడైన కృష్ణుడికోసం వడలిన వయసులో, ఎండిన వెదురులాంటి శరీరంతో నీరజ ఆయనతో గడిపిన రోజులను గుర్తు చేసుకుంటూ ఎదురు చూస్తూ ఉంటుంది. మధుర ఉద్యానవనంలో ఒకప్పుడు కృష్ణుడుతో గడిపిన జ్ఞాపకాలను తలపోస్తూ...  ప్రేమతో ఆర్థ్రమైన హృదయమూ, కన్నీటితో నిండిన కన్నులూ, ఆరాధనతో పరవశమైన బతుకూ వెలలేనివి అన్నావు. ఈ పారిజాత సుమమాలు అపూర్వమైనది. అది వాడిపోక మునుపే వస్తానన్నావు.... కానీ రాలేదు. నన్ను మర్చిపోయావా... అని అసుర సంధ్యలో వంశీకుంజం ఎదుట ఒక్కతే గత జ్ఞాపకాలలోని కృష్ణుడిని గుర్తు...

పరిదానము

  నవంబర్ 20, 2023 పరిదానము     ( pari-dānamu )       అర్థము      (విశేష్యము ): వస్తువులను మార్చుకొనుట; లంచము     Meaning     (noun) : barter; bribe    వాడుక / Usage    " పరిదానమి చ్చితే పాలింతువేమో; పరమపురుష శ్రీపతి నాపై నీకు కరుణగల్గకయున్న కారణమేమయ్యా" .    May be you will take care of me if I give you something; O consummate SriPathi, what is the reason for not showing compassion to me?     మెదడుకు మేత / Food for thought      మనిషికి మనిషికి మధ్య మమత తీగలా పెరగకూడదేమో, అలా పెరిగితే పిల్లలైతే పెకలించి వేయగలరు. తల్లికి అల్లుకపోవడమేతెలుసు . -- అబ్బూరి ఛాయాదేవి (అక్టోబర్ 13, 1933 - 2019)

కీరము

  నవంబర్ 17, 2023 కీరము     ( kīramu )       అర్థము      (విశేష్యము ): చిలుక     Meaning     (noun) : parrot    వాడుక / Usage    కిలకిలారావాలతో కీరములు ఆ వనానికి వన్నె తెచ్చాయి .    The chirping of parrots made the garden beautiful.     మెదడుకు మేత / Food for thought     ప్రేమించడం నేరం కాదు. ప్రేమని అర్హత లేని వ్యక్తికి అర్పించడమే నేరం. దానికి వచ్చే శిక్ష ఎవ్వరూ తప్పించుకోలేరు. -- యద్దనపూడి సులోచనారాణి (1940 - 2018)

అఖిలము

  నవంబర్ 16, 2023 అఖిలము     ( a-khilamu )       అర్థము      (విశేషణము ): ఖిలము(లోపము/ఖాళీ) కానిది; సమస్తము; అశేషము     Meaning     (adj) : whole; entire    వాడుక / Usage    ఆ పర్వతపుటంచులలో నిర్మలమైన అఖిలమైన ఆకాశం క్రింద నన్ను నేను కోల్పోయాను .    On the peaks of those mountains surrounded by the entire sky I was lost in myself.     మెదడుకు మేత / Food for thought     నేను మానవత్వం కోసం వేటకు వెళ్ళాను. స్వార్ధపరులు, చెడ్డవాళ్ళు అనే భయంకర మృగాలు నన్ను తరిమికొట్టాయి. -- యద్దనపూడి సులోచనారాణి (1940 - 2018)

శమన

  నవంబర్ 15, 2023 శమన     ( Samana )       అర్థము      (విశేష్యము ): కాలుడు; యముడు; శాంతి     Meaning     (noun) : Yama; peace    వాడుక / Usage     శరత్కాల  పవనాలకు ఆకులు రెపరెపలాడి కదలాడుచుండగా మనస్సుకు ఎంతో శమనముగా ఉంది .    The fluttering of leafs in autumnal breeze soothes the heart.     మెదడుకు మేత / Food for thought      మా పిల్లల్ని చాలా పెద్ద చదువులు చదివించాం అంటారు తల్లిదండ్రులు గర్వంగా. "మీ పిల్లలకు ఎంత పెద్ద మనసు నేర్పావు?" అని అడిగాలి. -- యద్దనపూడి సులోచనారాణి (1940 - 2018)

నత

  నవంబర్ 14, 2023 నత     ( natha )       అర్థము      (విశేష్యము ): లత; తీగ; వంగినది; వినమ్రుడు     Meaning     (noun) : creeper; bent (person/plant/thing) ; deep; humble    వాడుక / Usage    ఆ నతలు వెదజల్లే సుగంధం నన్ను ఉక్కిరిబిక్కిరి చేసింది .    The fragrance of the creepers overwhelmed me.     మెదడుకు మేత / Food for thought      ఈ ప్రపంచంలో డబ్బు లేకపోతే చనిపోతారుగానీ, మగవాడి ప్రేమ లేకపోతే చచ్చిపోరని, ప్రతీ స్త్రీ తెలుసుకోవాలి. -- యద్దనపూడి సులోచనారాణి (1940 - 2018)

నిచయము

  నవంబర్ 13, 2023 నిచయము     ( nichayamu )       అర్థము      (విశేష్యము ): సమూహము     Meaning     (noun) : an assembly    వాడుక / Usage    తారల నిచయములో నిండు నెలరేడు చెలిమిలో నిర్భయముగా సాగిపోయాను .    I travelled fearlessly in the company of the full moon amidst assembly of stars.     మెదడుకు మేత / Food for thought      నువ్వు భయపడేది ఎదుటివారిని చూసి కాదు, నీలో ఉన్న పిరికితనానికి. -- యద్దనపూడి సులోచనారాణి (1940 - 2018)

సన్నిభము

  నవంబర్ 10, 2023 సన్నిభము     ( san-nibhamu )       అర్థము      (విశేషణము ): సమానము; సాటి     Meaning     (adj) : similar; like    వాడుక / Usage    ప్రపంచ కప్పులో ప్రస్తుతం భారత్ తో సన్నిభమైన జట్టు మరొకటి కనపడట్లేదు .    There seems to be no other team matching India in the World Cup.     మెదడుకు మేత / Food for thought      తడ వోర్వక యొడలోర్వక కడువేగం బడచిపడినఁ గార్యంబగునే తడవోర్చిన నొడలోర్చినఁ జెడిపోయిన కార్యమెల్ల జేకురు సుమతీ! (ఆలస్యాన్ని, శరీర శ్రమను సహించకుండా తొందరపడితే పనులు అవ్వవు. ఆలస్యాన్ని, శరీర శ్రమను ఓర్చుకొన్నప్పుడే చెడిపోయిన కార్యం కూడా నెరువేరుతుంది) - సుమతీ శతకం, బద్దెన (~ 1260)

అంబుధి

  నవంబర్ 09, 2023 అంబుధి     ( ambudhi )       అర్థము      (విశేష్యము ): సముద్రము; నాలుగు     Meaning     (noun) : ocean; four    వాడుక / Usage     అగచరులే తనసేనలట  అంబుధి  కొండల గట్టెనట .    Monkeys his army, rock bridge on the ocean did they build.     మెదడుకు మేత / Food for thought     రూపించి పలికి బొంకకు,     ప్రాపగు చుట్టంబు నెగ్గు పలుకకు మదిలో,     గోపించు రాజు గొల్వకు,     పాపపు దేశంబు సొఱకు పదిలము సుమతీ!   ( ఒకప్పుడు నువ్వు చెప్పినవి నిజమని నిరూపించుటకు అబద్ధాలను నిజఆలుగా మార్చకు. ఆప్తబంధువులకు ఎన్నడూ హాని చేయకు. కోపిష్ఠి వాడి దగ్గర పని చేయకు. పాపపు భూమికి వెళ్ళకు. అటువంటి ప్రదేశాలకు వెళ్ళినా, ఆ ప్రభావం నీ మీద పడి, మనసులో పాపపు ఆలోచనలు కలువచ్చు ) - సుమతీ శతకం, బద్దెన (~ 1260)

అనఘము

  నవంబర్ 08, 2023 అనఘము     ( an-aghamu )       అర్థము      (విశేష్యము ): నిర్మలము; దోషము లేనిది;      Meaning     (noun) : sinless; pure    వాడుక / Usage    రాజకీయనాయకుల్లో అనఘులను వెతకడం గడ్డివాములో సూది వెదికినట్లే.    Finding a blemish-less politician is like finding a needle in a haystack.     మెదడుకు మేత / Food for thought పరనారీ సోదరుడై పరధనముల కాసపడక పరులకు హితుడై పరుల దనుబొగడ నెగడక పరులలిగిన నలుగనతడు పరముడు సుమతీ!   ( పరస్త్రీలపట్ల సోదరుడిలా మెలగాలి. ఇతరుల ధనానికి ఎంతమాత్రం ఆశపడకూడదు. తోటివారంతా తనను ఇష్టపడేలా ప్రవర్తించాలి. ఎదుటివారు పొగుడుతుంటే ఉప్పొంగిపోకూడదు. ఎవరైనా కోపగించుకొన్నప్పుడు తాను కూడా అదే పంథాలో ఆగ్రహాన్ని ప్రదర్శించరాదు. ఇలాంటి ఉత్తమగుణాలను కలిగివున్నవాడే శ్రేష్ఠుడుగా గుర్తింపబడతాడు) - సుమతీ శతకం, బద్దెన (~ 1260)

తురంగము

  నవంబర్ 07, 2023 తురంగము     ( turangamu )       అర్థము      (విశేష్యము ):  గుర్రము; వాహనము; మనసు     Meaning     (noun) : horse; vehicle; mind    వాడుక / Usage      వేయి గజంబులుండ పదివేల తురంగము లుండ.    Having a thousand elephants and ten thousand horses.      మెదడుకు మేత / Food for thought నీరే ప్రాణాధారము నోరే రసభరితమైన నుడువులకెల్లన్‌ నారియె నరులకు రత్నము చీరయె శృంగారమండ్రు సిద్ధము సుమతీ!   ( అందరూ బ్రతుకుటకు ఆధారమైనది నీరే. నవరసముల తోడను నిండునట్టి మాటలన్నింటీని ఆధారమైనది నోరే. నరులకు స్త్రీయే రత్నమువంటిది. స్త్రీల సింగారంలో చీరే ప్రధాన శృంగార వస్తువు ) - సుమతీ శతకం, బద్దెన (~ 1260)

దనుజుడు

  నవంబర్ 06, 2023 దనుజుడు     ( danujuḍu )       అర్థము      (విశేష్యము ):  రాక్షసుడు; అసురుడు     Meaning     (noun) : a demon    వాడుక / Usage     మతం పేరుతో ఓట్లు కొనుక్కునే దనుజులు మన నాయకలు.     Our leaders are demons who buy votes in the name of religion.      మెదడుకు మేత / Food for thought స్త్రీల ఎడ వాదులాడక బాలురతో జెలిమిచేసి భాషింపకుమీ మేలైన గుణము విడువకు ఏలిన పతి నిందసేయ కెన్నడు సుమతీ!   (స్త్రీలతో ఎప్పుడూ గొడవపడద్దు. చిన్నపిల్లలతో స్నేహం చేసి మాట్లాడవద్దు. మంచి గుణాలను వదలవద్దు. యజమానిని దూషించవద్దు) - సుమతీ శతకం, బద్దెన (~ 1260)

ఎడ

  నవంబర్ 03, 2023 ఎడ     ( eḍa )       అర్థము      (విశేష్యము ):  స్థానము; అవకాశము; దూరము; గడువు; సంధి/రాయబారం     Meaning     (noun) : place; space; interval of time; distance; peace/armistice    వాడుక / Usage     ఎడ తెరిపిలేని వానలతో కూలుతున్న పాత ఇండ్లు.     Incessant rains destroy old houses.      మెదడుకు మేత / Food for thought కిటికీకి తల ఆనిచ్చి అటువైపు చూస్తున్నాడు. క్రింద నది...వెన్నెల్లో కెరటాలు...శబ్దం చేసుకుంటూ రైలు గోదావరిని దాటుతూంది. అతడు కనురెప్పల్ని కూడా కదపటం లేదు. కళ్ళ నిండా నీళ్లు ఉన్నవి. "కన్నీరా క్రిందకి జారకే!! ఋతువు కాని ఋతువులో గోదావరికి వరదొచ్చిందేమిటా అని ప్రజలు భయపడతారే!!!" ...అతడు గట్టిగా కళ్ళు మూసుకున్నాడు. -- ఆనందోబ్రహ్మ (1985), యండమూరి వీరేంద్రనాథ్

కడ

  నవంబర్ 02, 2023 కడ     ( kaḍa )       అర్థము      (విశేష్యము ):  దిక్కు; అంతము; సమీపము     Meaning     (noun) : direction; proximity; distance; end    వాడుక / Usage     "నేనొక పూలమొక్క కడ నిల్చి చివాలున కొమ్మవంచి..."     As I stood near a flowering plant and bent it's branch...      మెదడుకు మేత / Food for thought మళ్ళీ ఎప్పుడో...ఎక్కడో - నా మనసు నా వయసుని గెలవగలిగిందన్న నమ్మకం కుదిరాక నా కోరిక పునీతమయ్యాక ఆ వేదాంతపుటంచు చివర, జీవితం పశ్చిమాద్రిన కృంగిపోయే తరుణాన నిన్ను కలుసుకుంటాను. నువ్వు వెలిగించిన చిరుజ్యోతి ఎంత అఖండమై వెలుగుతుందో చూపించటానికి మాత్రమే కలుసుకుంటాను. కృతజ్ఞత తప్ప మరేదీ లేని నిండు మనసుతో నీకు అంజలి అర్పిస్తాను. -- ఆనందోబ్రహ్మ (1985), యండమూరి వీరేంద్రనాథ్