Posts

Showing posts from December, 2023

ఉర్వటము

  జనవరి 01, 2024 ఉర్వటము     ( urvatamu )     అర్థము       (విశేష్యము ): బాగా తిరుగునది - ఏడాది; సంవత్సరము    Meaning      (noun) : year    వాడుక / Usage      దొర్లుతున్నాయి ఉర్వటాలు కానీ లేవు మన రాష్ట్రానికింకా కర్వటాలు .      Years are rolling by but alas the state still has no capital city(cities!).     మెదడుకు మేత / Food for thought     ప్రతీ రాత్రి నిన్న నుంచి రేపటికి!     రాత్రి అల సొలసిన మేనులకు సల్లని నిదురుల రేయి!     ప్రతి ఉదయం నిజమైన నూతన సంవత్సరోదయం,     నిఖిలమైన పండగల ఆర్ణవం.     ప్రతి రేత్రి చేయాలి పవిత్ర ధాత్రి     అహము బాసి దీక్షబూని భక్తి శ్రద్ధలతో;     ప్రతి దినం మహోన్నత ముహూర్తమే కన్ను తెరిచి కదిలి పోడానికి     సరికొత్త ఆహ్లాదం ఈ వెచ్చని గాలిలో ఆ పచ్చికపైరులో.     కేవలం ఒక రాత్రి పాత నుంచి కొత్తకి;     కేవలం ఒకే నిద్దర నెలరాజు నుండి సూరీడుకు...

తలారి

  డిసెంబర్ 29, 2023 తలారి     ( talāri )     అర్థము       (విశేష్యము ): కావాలి వాడు; మరణదండణ అమలు చేసేవాడు; తాటాకుతో చేసిన చిన్న గొడుగు; గిడుగు    Meaning      (noun) : watchman; executioner; small umbrella without a handle    వాడుక / Usage     తలారి కన్ను కప్పి సభలో చొరబడ్డ అగంతకులు .     Intruders managed to enter the hall after hoodwinking the guard.     మెదడుకు మేత / Food for thought    ఏ స్వాతంత్ర్యం నిమిత్తం ఎవరెవరెవరో ఎందరో దేశసేవా     భాస్వంతుల్ బాలవృద్ధుల్ పతితులధికు లప్రాజ్ఞులున్ ప్రజ్ఞులంతా     అస్వాశల్ వీడి లాఠీహతులయి ఉరికొయ్యల్ కవుంగిట చేర్చా     రా స్వాతంత్ర్యం లభించిందని విని హృదయం హ్లాద సంపుష్టమైతే -- స్వాతంత్ర్యం వచ్చినప్పుడు శ్రీశ్రీ  (ఏప్రిల్ 30, 1910 - 1983)

కడగొట్టు

  డిసెంబర్ 28, 2023 కడగొట్టు     ( kaḍa-goṭṭu )       అర్థము      (క్రియ/విశేషణము ): చచ్చు; చివరి/ఆఖరి      Meaning     (verb/noun) : to die; youngest; last    వాడుక / Usage        కడగొట్టు బిడ్డల గొంతుక , గొప్ప మానవతావాది, ప్రజల నాల్కలపై సజీవంగా నిలిచిపోయిన మహాకవి జాషువా .      Jashua, voice of the downtrodden; great humanist, a poet immortalised in the memory of people.     మెదడుకు మేత / Food for thought అనుక్షణం మరణభయం జీవన సంభ్రమణ భయం అంధకారం అయోమయం ఆర్తనాద సంకులం మనిషికి మనిషన్న భయం మనసంటే మనకు భయం సత్యమన్నచో సచ్చే భయం చచ్చు దాకా చావు భయం'. -- భయం (నాటకం), ఆత్రేయ (మే 07, 1921 - 1989)

సమిధ

  డిసెంబర్ 27, 2023 సమిధ     ( samidha )       అర్థము      (విశేష్యము ): వంట చెరకు; ఇంధనము; బాగా మండునది;      Meaning     (noun) : firewood; wood for sacrificial fire    వాడుక / Usage       నేటి అసత్య యజ్ఞంలో వాస్తవాలే సమిధలు .      At the altar of today's untruths, truth is the sacrificial firewood.     మెదడుకు మేత / Food for thought ఎదగడానికెందుకురా తొందరా ఎదర బతుకంతా చిందర వందర ఎదిగేవో బడిలోను ఎన్నెన్నో చదవాలి పనికిరాని పాఠాలు బట్టీయం పెట్టాలి చదవకుంటే పరీక్షలో కాపీలు కొట్టాలి పట్టుబడితె ఫెయిలైతే బిక్కమొహం వెయ్యాలి కాలేజీ సీట్లు అగచాట్లురా అవి కొనడానికి ఉండాలి నోట్లురా చదువు పూర్తయితే మొదలవ్వును పాట్లురా ..అందుకే... ఉద్యోగం వేటలోన ఊరంతా తిరగాలి అడ్డమైనవాళ్లకీ గుడ్మార్నింగ్ కొట్టాలి ఆమ్యామ్యా అర్పించి హస్తాలు తడపాలి ఇంటర్వ్యూ అంటూ క్యూ అంటూ పొద్దంతా నిలవాలి పిలుపు రాకుంటే నీ ఆశ వేస్టురా మళ్లా పెట్టాలి ఇంకో దరఖాస్తురా ఎండమావి నీకెపుడూ దోస్తురా ..అ...

ఈవి

  డిసెంబర్ 26, 2023 ఈవి     ( eevi )       అర్థము      (విశేష్యము ): ఈయ బడినది; దానము; బహుమానము     Meaning     (noun) : giving liberally; a gift    వాడుక / Usage       సద్గుణాల్లో ఉద్గుణం దాతృత్వం లేదా ఈవి .      Of all good characters the highest is to give liberally.     మెదడుకు మేత / Food for thought       దేశమా! చూసుకో నిన్ను నువ్వు అంతరంగం అద్దంలో. నువ్వు పదిలంగా ప్రదర్శించే  చిరునవ్వు వెనక ఎన్ని విషాదవలయాలో. ఏటా రెండుసార్లెత్తే నీ జెండా వెనక ఎన్ని అదృశ్య కృపాణాలో. ఎన్ని సార్లు హైజాక్ చేశారు నీ మానాన్ని! ఎన్ని సార్లు తూట్లు పొడిచారు నీ సహనాన్ని! ప్రపంచ విపణి వీధిలో నీ పరువును వేలం వేసేముందు మాతృదేశమా! తడిమి చూసుకో మూతపడ్డ  నీ మూడో కన్ను. -- కాలం అంచు మీద, డా. సి. నారాయణ రెడ్డి (జులై 29, 1931 - 2017)

మిరాశీ

  డిసెంబర్ 25, 2023 మిరాశీ     ( miraasi )       అర్థము      (విశేష్యము ): వంశ పారంపర్యంగా వచ్చిన హక్కు/సొత్తు/భూమి     Meaning     (noun) : inherited estate/right     వాడుక / Usage       అటవీ హక్కుల చట్టంలో మిరాశీ హక్కులు గుర్తించాలి .      Ancestral rights should be recognised in the Tribal rights act.     మెదడుకు మేత / Food for thought       అంజలిదే గొనుమా ప్రియతమా.. మంజుల బృందా నికుంజ నిరంజన... గుజ్జురూపమున  కమిలిన కుబ్జను.. బుజ్జగించి లాలించి సొగసిడి... ముజ్జగాలకే ముద్దబంతిగా.. మలచిన దేవా... మహానుభావ... నిండు కొలువులో పాండవ కాంతకు.. వలువలూడ్చుతరి వనిత మొరవిని... మానము గాచి...  మానిని బ్రోచిన..  మాధవ దేవా... మహానుభావా...   బృందావనిలో చందమామవై ..చెలువల కలువల జేసి రమించి... బిసజపత్ర జల బిందువువై...  ఇల మసలిన దేవా... మహానుభావా .. అంజలిదే గొనుమా -- ప్రేమ బంధం (1976), వేటూరి

సజ్జ

  డిసెంబర్ 21, 2023 సజ్జ     ( sajja )       అర్థము      (విశేష్యము ): ఒక రకం ధాన్యం; గంటె; బుట్ట; మంచం; పై అంతస్తు; అలంకరణము; కవచము     Meaning     (noun) : kind of (pearl) millet; basket; cot; upper floor; adornment; armour     వాడుక / Usage        సజ్జ పంట భూసారం లేక నీటి నిల్వ తక్కువ ఉన్న ప్రాంతాల్లో కూడా సాగు చేయవచ్చు .      Pearl millet can be cultivated even in areas with less water and nutrients in the soil.     మెదడుకు మేత / Food for thought       ఆరంభింపరు నీచ మానవులు విఘ్నాయాస సంత్రస్తులై       యారంభించి పరిత్యజించుదురు విఘ్నాయత్తులై మధ్యముల్       ధీరుల్ విఘనిహన్య మానులగుచు ధ్రుత్యున్నతొత్సాహులై       ప్రారబ్ధార్ధము లుజ్జగింపరు సుమీ ప్రజ్ఞానిధలల్ గావునన్      ( ఏదైనా పని మొదలు పెట్టినపుడు ఎన్ని అడ్డంకులు ఎదురయినా వెరువక తుదికంటా లక్ష్యం కోసం శ్రమించడమే కార్య సాధక...

కంకి

  డిసెంబర్ 22, 2023 కంకి     ( kanki )       అర్థము      (విశేష్యము ):  జొన్న, సజ్జ, రాగి మొదలగు వాటి వెన్ను; గింజల గుత్తి; పశువులకు వచ్చే రోగం     Meaning     (noun) : ear/head of corn; type of animal disease     వాడుక / Usage        స్వీట్ కార్న్ తో పోల్చుకుంటే, దేశీ బుట్టా జాతి కంకు లతో శరీరానికి మాత్రమే కాకుండా పర్యావరణానికి కూడా మేలు కలుగుతుంది.     Compared to sweetcorn the native maize ear is good for both the environment and body.     మెదడుకు మేత / Food for thought       తమ కార్యంబు పరిత్యజించియు పరార్థ ప్రాపకుల్ సజ్జనుల్       తమ కార్యంబు ఘటించుచున్ పరహితార్థ వ్యాపృతుల్ మధ్యముల్       తమకై అన్యహితార్థ ఘాతుకజనుల్ దైత్యుల్, వృథాన్యార్థ భం      గము గావించెడు వారలెవ్వరొ యెఱుంగన్ శక్యమే యేరికిన్?     ( ఇతరులకు మంచి జరుగుతుందంటే వారికి ఉపకారం చెయ్యడం కోసం అవసరమైతే తమ పనులను కూడ...

చోళ్లు

  డిసెంబర్ 20, 2023 చోళ్లు     ( chollu )       అర్థము      (విశేష్యము ): ఒక రకం చిరు ధాన్యం; రాగులు     Meaning     (noun) : finger millet    వాడుక / Usage       సాధారణంగా  చోళ్లను   వేరుశెనగ, కంది వంటి పప్పుదినుసులతో పాటు అంతర పంటగా సాగుచేస్తారు.      Finger millet are typically grown as an inter crop along with ground nuts and lentils.     మెదడుకు మేత / Food for thought      విద్య నిగూఢ గుప్తమగు విత్తము రూపము పూరుషాళికిన్      విద్య యశస్సు భోగకరి విద్య గురుండు విదేశబంధుడున్      విద్య విశిష్ట దైవతము విద్యకు సాటి ధనంబు లే దిలన్      విద్య నృపాల పూజితము విద్య నేరుంగనివాడు మర్త్యుడే.     ( పురుషునికి విద్యయే రూపము. విద్యయె రహస్యముగా దాచి పెట్టబడిన ధనము,విద్యయే సకల       భోగములను,కీర్తిని, సుఖమును కలుగజేయును. విద్యయే గురువువలె అన్నింటిని బోధించును. పరదేశమునందు ...

మొలకొలుకులు

  డిసెంబర్ 19, 2023 మొలకొలుకులు     ( molakolukulu )       అర్థము      (విశేష్యము ): ఒక రకం బియ్యం/ధాన్యం; నెల్లూరు, రాయలసీమలో పండించే వడ్లు     Meaning     (noun) : a kind of rice grown in Nellore and Rayalaseema    వాడుక / Usage     గుంటూరు జిల్లా కొల్లిపర మండలం అత్తోట గ్రామ రైతులు  మొలకొలుకులు వంటి దేశవాళీ వరి విత్తన నిధి ఏర్పాటు చేసారు.      The farmers of Atthota village in Kollipara Mandal of Guntur district have started a seed bank of native rice varieties like MolaKoluku.     మెదడుకు మేత / Food for thought      మకర ముఖాంతరస్థ మగుమానికమున్ బెకలింపవచ్చుఁ బా     యక దలదూర్మి కానికరమైన మహోదధి దాటవచ్చు మ     స్తకమునఁ బూవుదండవలె సర్పమునైన భరింపవచ్చు మ     చ్చిక ఘటియించి మూర్ఖజన చిత్తముఁ దెల్ప నసాధ్య మేరికిన్     (మొసలినోట్లోని రత్నాన్ని బయటకుతీయవచ్చు, నిరంతము పెద్దపెద్ద అలల...

దినుసు

  డిసెంబర్ 18, 2023 దినుసు     ( dinusu )       అర్థము      (విశేష్యము ): వస్తువు; రకము; రీతి;      Meaning     (noun) : an article; thing; variety; a kind    వాడుక / Usage      జాజికాయ  అనేక ఔషధ గుణాలు ఉన్న  ఒక శక్తివంతమైన మసాలా దినుసు .     Nutmeg is a kind of spice with powerful medicinal properties.     మెదడుకు మేత / Food for thought   తివిరి యిసుమున తైలంబు దీయవచ్చు   దవిలి మృగతృష్ణలో నీరు ద్రావవచ్చు   తిరిగి కుందేటి కొమ్మ్ము సాధింపవచ్చు   చేరి మూర్ఖుల మనసు రంజింపరాదు.  (ప్రయత్నము చేత ఇసుక నుంచి చమురు తీయవచ్చును.ఎండమావి యందును నీరు త్రాగవచ్చును.తిరిగి తిరిగి కుందేటి కొమ్ము నైనను సాధింపవచ్చును. కాని మూర్ఖుని మనస్సును మాత్రం సమాధాన పెట్టుట సాధ్యము కాదు)  -- ఏనుగు లక్ష్మణ కవి (~ 18వ శతాబ్దము)

మసలు

  డిసెంబర్ 15, 2023 మసలు     ( masalu )       అర్థము      (క్రియ ): తిరుగు; విహరించు; సందేహించు; ఆలస్యం చేయడం; నీళ్లు బాగా కాగడం     Meaning     (verb) : wander; hesitate; delay; water boiling     వాడుక / Usage      ఆకాశమంటూ ఈ కొండా శిఖరమ్ము పై మనుజులకు దూరంగా మసలు తున్నావా, ఏడుకొండల సామి!     On this sky high peak, far from humans wandering are you, O lord of Seven hills!     మెదడుకు మేత / Food for thought     మా అమ్మ తుది శ్వాస విడిచిన మంచం మీదే ఇప్పుడు నేను పడుకున్నాను. అదే పరుపు మీద, చిన్నప్పుడు నిద్రబుచ్చడానికి నా మీద కప్పిన అదే నల్లటి దుప్పటి కింద. చిన్న పిల్లగా అమ్మ ప్రక్కనే పడుకున్నాను, నా కోసం ప్రత్యేకంగా అమ్మ చేసిన వడిలో. ఇంకా లయబద్దమైన అమ్మ ఊపిరి నాకు అనుభూతి కలుగుతోంది. ఆ గుండె చప్పుళ్లు, నన్ను నిద్రబుచ్చిన ఆ నిట్టూర్పులు...అమ్మ మరణం యొక్క బాధ నా నరనరాలలో తెలుస్తోంది. ఇక్కడ పడుకుని, ఆ విషయాలను నెమరు వేసుకుంటూ నా ఒంటరితనాన్ని మర్చిపోవాలని...

భాసురము

  డిసెంబర్ 14, 2023 భాసురము     ( bhāsuramu )       అర్థము      (విశేష్యము/విశేషణము ): పటికపురాయి; ప్రకాశించునది; స్ఫటికము     Meaning     (noun/adj) : bright; shining; alum     వాడుక / Usage    గంగా గౌరి హృదయ విహారి, లీలా కల్పిత సంసారి, భళిరే భాసుర బ్రహ్మచారి.   Pervading the hearts of Ganga & Gauri;  a householder in an illusory play of your own; kudos O shining celibate.     మెదడుకు మేత / Food for thought     అక్కడ నాకు ప్రపంచంలో అన్నిటికన్నా ఇష్టమైన చోటు కనపడుతుంది. కలలుకంటూ నేను చిక్కి శల్యమైన చోటు అది. మైదానం మధ్యలో నా గ్రామం తారస పడుతుంది.  డబ్బులు దాచుకునే భరణిలో నిఘుడమైనా జ్ఞాపకాలలాగా చెట్లు, ఆకులు నీడ ఇస్తూ ఉంటాయి. ఎవరైనా ఎందుకు అక్కడ జీవితాంతం ఉండాలని అనుకుంటారో నీకు తెలుస్తుంది. తెలవారు, ఉదయం, మధ్యాన్నం, రాత్రి; అన్నీ ఒకటే, గాలిలోని మార్పులు తప్ప. గాలి అక్కడ వస్తువుల రంగు మార్చేస్తూ ఉంటుంది. జీవితం సాఫీగా సాగిపోతూ ఉంటుంది సన్నటి మంద...

సంచాలక

  డిసెంబర్ 13, 2023 సంచాలక     ( samchaalaka )       అర్థము      (విశేషణము ): కార్య నిర్వాహణ చేసేవారు; నడుపువారు     Meaning     (adj) : presiding officer; manager; one who runs/organises     వాడుక / Usage   సకల భువన సంచాలక , అఖిల దనుజ సంహారక .    O one who runs the world; one who slays all evil!     మెదడుకు మేత / Food for thought     ఆ నగరం భూమి యొక్క నిప్పుల కుంపటి మీద కూచుని ఉంది. సలసలా మరిగే నరక కూపపు ద్వారాల దగ్గరలో ఉంది. అక్కడ నుంచి నరకం వెళ్లిన వారు, కంబళి కోసం వెనక్కి వస్తారుట. -- పెడ్రో పారామో, యువాన్ రూల్ఫో (మే 16, 1917 - 1986)

నాతి

  డిసెంబర్ 12, 2023 నాతి     ( nāti )       అర్థము      (విశేష్యము ): స్త్రీ     Meaning     (noun) : woman    వాడుక / Usage   కౌశికు యాగం కాచితివయ్యా, రాతిని నాతిగా చేసితివయ్యా .    You protected Vishwamitra's yagna; and turned a stone into a woman!     మెదడుకు మేత / Food for thought     ఈ నగరం ప్రతిధ్వనులతో నిండి ఉంది. మూసిన తలుపుల వెనుక, పొడవైన గోడలను ఆనుకొని, బాటసారుల కాలిబాట రాళ్ల క్రింద బంధింపబడి ఉన్నాయేమో. నడుస్తుంటే నీ వెనకే ఎవరో ఉన్నట్లు, నీ అడుగులో అడుగు వేస్తున్నట్లు ఉంటుంది. -- పెడ్రో పారామో, యువాన్ రూల్ఫో (మే 16, 1917 - 1986)

కంధరము

  డిసెంబర్ 11, 2023 కంధరము     ( kandharamu )       అర్థము      (విశేష్యము ): మెడ; కంఠము; మబ్బు     Meaning     (noun) : neck; throat; cloud    వాడుక / Usage   నీల కంథరా దేవా దీనబాంధవా రారా నను గావరా.    O dark throat-ed Shiva! friend of the suffering! come save me!     మెదడుకు మేత / Food for thought     అక్కడ గాలి లేదు; కేవలం  ఆగష్టు పగటిలో మండిపోయి మగ్గిపోయి నిశ్చేష్టమైన రాత్రి మాత్రమే ఉంది.  రవ్వంతైనా ఊపిరి ఆడట్లేదు. శ్వాస వదిలిన గాలినే చేతులతో ఒడిసి పట్టుకుని, చేజారి పోయేలోపు తిరిగి ఎగబీల్చాను. ఆ ఉచ్ఛ్వాస నిశ్వాసాలు మెలమెల్లగా తక్కువ అవ్వుతూ వచ్చింది...ఆ గాలి ఎంత పల్చబడిందంటే అది నా వేళ్ళ అంచులలోంచి అందకుండా జారిపోయింది. మళ్ళీ ఇంకెప్పటికీ అందకుండా ఆవిరయ్యింది. -- పెడ్రో పారామో, యువాన్ రూల్ఫో (మే 16, 1917 - 1986)

హుటాహుటి

  డిసెంబర్ 08, 2023 హుటాహుటి     ( huṭā-huṭi )       అర్థము      (విశేష్యము/విశేషణము ): వేగము; వేగవంతము; త్వరగా     Meaning     (noun/adj) : swiftness; quickly; haste; rapidly    వాడుక / Usage    దుర్ఘటనా స్థలికి అగ్నిమాపక దళాలు హుటాహుటిగా చేరుకున్నాయి .    Fire brigades reached the disaster zone rapidly.     మెదడుకు మేత / Food for thought మధువనిలో రాధికవో మధువొలికే గీతికవో మధురం ఈ జీవనం మధురం ఈ జవ్వనం మనోహరం... మనోహరం... మధువనిలో రాధికనో మదిపలికే గీతికనో మధురం ఈ జీవనం మధురం ఈ యవ్వనం మనోహరం... మనోహరం... కార్తీకాన కళలే చిలికి వెలిగే జాబిలి ఎదలో మల్లెల పొదలో వెలిగెను నేడీ జాబిలి నీలాకాశ వీధుల్లోన వెలిగే సూర్యుడు వెతలే మాసిన కథలో వెలిగెను నేడీ సూర్యుడు తొలి తొలి వలపులే... తొలకరి మెరుపులై... విరిసే వేళలో... హేళలో... డోలలో... బృందావనికి మురళీధరుడు ఒకడే కృష్ణుడు ఎదిగిన బాలిక ఎదగల గోపికకతడే దేవుడు మధురాపురికి యమునా నదికి ఒకటే రాధిక మరువై పోయిన మనసున వెలసెను నేడీ దేవత వెలుగుల...

బొటాబొటి

  డిసెంబర్ 07, 2023 బొటాబొటి     ( botaboti )       అర్థము      (విశేష్యము ): చాలీ చాలకుండా ఉండటం; ఇంచుమించు; సుమారు; తూచినట్లు సరిగాఉండటం     Meaning     (noun) : marginal; just about enough; rough estimate    వాడుక / Usage    పోటాపోటీగా జరిగిన ఎన్నికలు, బొటాబొటిగా గెలిచిన అభ్యర్ధులు .    Competitive elections, marginal victories.     మెదడుకు మేత / Food for thought అసుర సంధ్య వేళ ఉసురు తగలనీకు స్వామి ఆడ ఉసురు తగలనీకు స్వామీ! ముసురుకున్న మమతలతో కొసరిన అపరాధమేమి? స్వామీ స్వామీ!   అసుర సంధ్య వేళ ఉసురు తగలనీకు దేవీ స్వామి ఉసురు తగలనీకు దేవీ మరులుకొన్న హరిని వీడి మరలిన నరజన్మమేమి దేవి దేవీ!   హరిహర సుర జేష్టాదులు, కౌశిక శుక వ్యాసాదులు నిజ తత్వములను దెలిసి, నియమ నిష్టలకి అలసి పూనిన శృంగార యోగమిది కాదని నను కాదని జడధారీ ! ఆ ఆ ఆ ఆ పడకు పెడ దారి --అమరజీవి, వేటూరి (జనవరి 29, 1936 - 2010)

దిగదుడుపు

  డిసెంబర్ 06, 2023 దిగదుడుపు     ( diga-duḍupu )       అర్థము      (విశేష్యము ): సరితూగక పోవడం; పనికి రాని పని; దృష్టి దోషం తీసివేయడం     Meaning     (noun) : incomparable; to come down; breaking a spell    వాడుక / Usage    మౌళిక సదుపాయాల్లో ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఆంధ్ర దిగదుడుపే .    Andhra's infrastructure does not match up to other states.     మెదడుకు మేత / Food for thought చినుకులన్నీ కలిసి చిత్రకావేరి చివరికా కావేరి కడలి దేవేరి కడలిలో వెతకొద్దు కావేరి నీరు కడుపులో వెతకొద్ది కన్నీరు కారు గుండెలోనే ఉంది గుట్టుగా గంగ, నీ గంగ ఎండమావుల మీద ఎందుకా బెంగ? రేవుతో నావమ్మ కెన్ని ఊగిసలో నీవుతో నాకన్ని నీటి (కన్నీటి) ఊయలలు -- శుభసంకల్పం, వేటూరి (జనవరి 29, 1936 - 2010)

తటపటాయించు

  డిసెంబర్ 05, 2023 తటపటాయించు     ( thatapataayinchu )       అర్థము      (క్రియ ): ముందు వెనక ఆలోచించు; సందేహించు     Meaning     (verb) : to hesitate    వాడుక / Usage     చల్లటి నీళ్లలో అడుగు పెట్టేముందు క్షణకాలం  తటపటాయించాడు .    He hesitated for a brief moment before stepping into the cold water.     మెదడుకు మేత / Food for thought సొగసు చూడ తరమా.. సొగసు చూడ తరమా ఆ ఆ నీ సొగసు చూడ తరమా ఆ ఆ నీ సొగసు చూడ తరమా ఆ ఆ నీ ఆపసోపాలు నీ తీపిశాపాలు ఎర్రన్ని కోపాలు ఎన్నెన్నో దీపాలు అందమే సుమా సొగసు చూడ తరామా ... నీ సొగసు చూడ తరమా ఆ ఆ అరుగు మీద నిలబడి ... నీ కురులను దువ్వే వేళ చేజారిన దువ్వెన్నకు బేజారుగ వంగినపుడు చిరుకోపం చీరకట్టి సిగ్గును చెంగున దాచి ఫక్కుమన్న చక్కదనం పరుగో పరుగెత్తినపుడు ఆ సొగసు చూడ తరమా...  నీ సొగసు చూడ తరమా ఆ ఆ పెట్టి పెట్టని ముద్దును .. ఇట్టే విదిలించికొట్టి గుమ్మెత్తే సోయగాన గుమ్మాలను దాటువేళ చెంగుపట్టు పట్టి రారమ్మని చెలగాటకు దిగుతుంటే తడిబారిన ...

పటాపంచలు

  డిసెంబర్ 04, 2023 పటాపంచలు     ( paṭāpanchalu )       అర్థము      (విశేష్యము ): చెల్లాచెదరు; కకావికలు     Meaning     (noun) : dispersion; annihilation; scattered    వాడుక / Usage    నాయకుల కుట్రలను కుతంత్రాలను పటాపంచలు చేసే ఓటర్లు ఉన్నారా?    Is there an electorate that can annihilate the Machiavellian designs of politicians?     మెదడుకు మేత / Food for thought ఓ సందుగొందుల సార్వభౌములారా! వీధిలో రసికులారా!  చాటుమాటుగ చాటు మా సందేశమిదే! వారెవా! ముసుగు వేసుకుని, మసక చూసుకుని, ముద్దులబేరాలాడాలోయ్! ముడుపులు మాకే కట్టాలోయ్! మా ఒడుపులు మీరే చూడాలోయ్! వంటింటి పొయ్యిలో తమ ఇల్లాలు పిల్లిని దాచేసి  సాని కొంపలు జేరు చవటలకు శాస్తి కాగ!  మంచాల మల్లెల కూనిరాగాల మా పేరు తలచుకుని విటులు భయపడగ! గుళ్ళో పూజలు చేసే విటుడు ఒళ్లో హారతి పట్టాలోయ్! ముష్టి ఎత్తుకును యాచకుడైనా ముద్దుల బిచ్చాలడగోయ్! రాజ్యాలేలే నాయకులైనా రాత్రికి హాజరు కావాలోయ్! సాని ఇంటికి వల్లకాటికి చేరిన...