Posts

Showing posts from March, 2024

తామ్రము

  ఏప్రిల్ 01, 2024 తామ్రము    ( tāmramu )     అర్థము       (విశేష్యము/విశేషణము ): రాగి; ఎరుపు; ఎర్రనిది    Meaning     (noun/adj) : copper; red; redness    వాడుక / Usage     శ్రీశైలం  పంచ మఠాల్లో ఒకటైన ఘంటా మఠం పనుల్లో పలు తామ్ర పత్రాలు లభ్యమయ్యాయి.     Copper plate inscriptions have been unearthed in Srisailam mutt renovations .     మెదడుకు మేత / Food for thought      మనసా నందమా నంద మాయే      కడతేరగా గగనాన ఘనాంధకారం      విప్పారిన కనుల సూరీడాయే      మనసా నందమా నంద మాయే      ఎగిసే అలల అందాల కిరణాలు      గంగమ్మ ఒడిలోని పవిత్ర జలాలు      అర్పించు వేళ ప్రతి సింగారం తేనెలొలుకు      సింధూర గీతమై పాడెనే      మనసా నందమా నంద మాయే      మనసున పేరుకున్న పుట్టెడంత చింతలు      కరిగి కన్నీళ్ళై చేతిన వర్షించగా    ...

రయము

  మార్చి 29, 2024 రయము    ( rayamu )     అర్థము       (విశేష్యము ): వేగం; (నదీ) ప్రవాహం    Meaning     (noun) : speed; fast flowing water    వాడుక / Usage     చేసి చేసి అవినీతి కార్యముల్ కొనుడి కొనుడి ఎన్నికల బాండ్లు రయము గాను .     Indulge in malpractices galore, invest in electoral bonds at gallop .     మెదడుకు మేత / Food for thought      ఎర్లీ మార్నింగులో నిద్ర లేవంగనే      పాచి పళ్ళైనయున్ తోమకన్ త్రాగు బెడ్ కాఫీ      కోసంబు పెండ్లాముపై రంకెలేయించకే బెస్టు టేస్టీశ్వరీ..      ఫ్రెష్షు కాఫీశ్వరీ నెస్సు కేఫీశ్వరీ జిహ్వకున్      సిద్ధి చేకూర్చవే బ్రూకు బాండేశ్వరీ...      లోక ప్రాణేశ్వరి ప్రాణ దానేశ్వరి గంటగంటా      ప్రతీ ఇంట ఉప్పొంగవే ఉష్ణ పానేశ్వరీ..      స్టీలు ఫిల్టర్ల పళ్ళెంబులోనున్న రంధ్రాలలో నుండి      నీ సారమంతా సుతారంగా జారంగ నోరూర  ...

మందానిలము

  మార్చి 28, 2024 మందానిలము    ( mandaanilamu )     అర్థము       (విశేష్యము ): మంద=మెల్ల, అనిలము=గాలి; మెల్లగా వీచు గాలి; పిల్ల గాలి    Meaning     (noun) : breeze; gentle wind    వాడుక / Usage      ఒక మందానిలం వీచింది. ఒక వెన్నెల కాచింది. ఒక పరిమళము వ్యాపించింది.     A gentle wind caressed . A full moon bloomed. A fragrance wafted.     మెదడుకు మేత / Food for thought     గుత్తివంకాయ కూర కలుపుకొని పాతిక ముద్దలు పీకుమురా      గుమ్మడికాయ పులుసుందంటే ఆకులు సైతం నాకునురా      పనసకాయనే కొన్న రోజునే పెద్దలు తద్దినమన్నారు      పనసకాయనే కొన్న రోజునే పెద్దలు తద్దినమన్నారు      పసనపొట్టులో ఆవ పెట్టుకొని తరతరాలుగా తిన్నారు      తిండి గలిగితే కండ గలదని గురజాడ వారు అన్నారు     అప్పదాసు ఆ ముక్క పట్టుకొని ముప్పూటలు తెగ తిన్నారు     -- మిథునం, తనికెళ్ళ భరణి

ఆపుకోరా

  మార్చి 27, 2024 ఆపుకోరా    ( aapukora )     అర్థము       (విశేష్యము ): నీటి పాత్ర; ఉర్దూ అబ్ (నీరు) ఖోర్ (త్రాగు) నుంచి;  కింద లావుగా పైకి పోను పోను సన్నంగా ఉండి పెదవులు వంపు తిరిగి ఉన్న చెంబు    Meaning     (noun) : tumbler    వాడుక / Usage     ఒకప్పుడు గ్రామాల్లో విందుకి ఎవరి  ఆపుకోరా వాళ్ళు తెచ్చుకునేవాళ్ళు .పెళ్ళిల్లలో ప్లాస్టిక్ బాటిల్ తగ్గాలంటే అదే చేయాలేమో!     People used to carry their own tumblers to feasts . May be that's the solution to plastic bottles in weddings.     మెదడుకు మేత / Food for thought     చిత్తంబునున్నట్టి శివుని గాంచగలేక     గుడిగోపురంబులంచు దిరుగనేల?     వెఱ్ఱి వగుచు నీవు వెతల జెందగనేల?      మంచి మాట వినుర మానవుండ!      ఎక్కువ ధనమున్న, ఎట్లుగాతునను ఏడ్పు,      లేకయున్న, ధనము లేదనేడ్పు      ఏడ్పులేని మనుజులెందును లేరురా     మంచి మాట వి...

తురగము

  మార్చి 26, 2024 తురగము    ( turagamu )     అర్థము       (విశేష్యము ): గుఱ్ఱము; మనస్సు    Meaning     (noun) : horse; mind; thought    వాడుక / Usage      యుద్ధంలో పాల్గొనే రథ, గజ, తురగ , పదాతి దళాలను కలిపి చతురంగదళాలు అంటారు .     Chariots, elephants, horse cavalry and foot soldiers are the four regiments in army .     మెదడుకు మేత / Food for thought      వయమిహ పరితుష్టా వల్కలైస్త్వం దుకూలైః      సమ ఇహ పరితోషో నిర్విశేషో విశేషః ।      స తు భవతు దరిద్రో యస్య తృష్ణా విశాలా     మనసి చ పరితుష్టే కోఽర్థవాన్‌ కో దరిద్రః ॥     ( మాకు నారచీరలతోనే తృప్తి.; నీకు పట్టు వస్త్రములు కావలెను. తృప్తి యన్నది యిరువురకూ సమానమే. కానీ దానిలో తారతమ్య మేమీ లేదు. ఇక విశేషమేమన తృప్తి ఎవరికి లేదో ఎవని ఆశకు అంతము లేదో యాతడే దరిద్రుడు. మనసు సంతుష్టి చెందిన దై యుండగా ఇక ధనికుడెవ్వడు?దరిద్రుడెవ్వడు?)     --వైరాగ్య శతకం,  భర్...

కంతు

  మార్చి 25, 2024 కంతు    ( kanthu )     అర్థము       (విశేష్యము ): గడువు; వాయిదా; వ్యవధి; మన్మథుడు    Meaning     (noun) : period of time; instalments; Cupid    వాడుక / Usage      కంతులు కట్టకుంటే కార్లు సీజ్‌! లబ్ధిదారులకు నోటీసులు .     Cars to be seized, if instalments not paid! notices to beneficiaries .     మెదడుకు మేత / Food for thought      అడియాస కొలువు గొలువకు     గుడి మణియము సేయబోకు, కుజనుల తోడన్‌     విడువక కూరిమి సేయకు     మడవిని దో డరయ కొంటి నరుగకు సుమతీ     ( వృధా ప్రయాసయగు సేవను చేయకుము. గుడి ధర్మకర్తుత్వము చేయకుము. చెడ్డవారితో స్నేహము చేయకుము. అడవిలో సహాయము లేక ఒంటరిగా పోకుము)     -- బద్దెన

రుజ

  మార్చి 22, 2024 రుజ    ( ruja )     అర్థము       (విశేష్యము ): రోగము; బాధ; ముసలితనం; మృత్యువు    Meaning     (noun) : disease; sickness; destruction     వాడుక / Usage     రాజకీయం చెదలుపట్టింది ప్రజాతంత్రం రుజ గ్రస్తమయ్యింది .     Politics is rotten, democracy is on sick bed .     మెదడుకు మేత / Food for thought ఓటు వేసే వాళ్ళు ఏమీ నిర్ణయించరు . ఓట్లు లెక్క వేసే వాళ్లే మొత్తం నిర్ణయిస్తారు.    -- జోసఫ్ విస్సారినోవిక్ స్టాలిన్ (డిసెంబర్ 18, 1878 - 1953)

ముంగిలి

  మార్చి 21, 2024 ముంగిలి    ( mungili )     అర్థము       (విశేష్యము ): గృహ ద్వారమునకు ఎదుటి ప్రదేశం; చాలా దగ్గర; అంగణము    Meaning     (noun) : courtyard    వాడుక / Usage     ' చుక్కలన్ని ముగ్గులై పక్కుమన్న ముంగిలి కళ్ళ ముందు కదిలి చూపించె మంచి మజిలి' .     Stars turned to a smiling rangoli in the courtyard and unveiled a beautiful vista .     మెదడుకు మేత / Food for thought మేధావర్గాన్ని వ్యతిరేకించడం అనేది మన రాజకీయ మరియు సాంస్కృతిక జీవనంలో సదా ఉన్న అంశం . దీనికి కారణం ప్రజాస్వామ్యంలో "నా అజ్ఞానానికి నీ వివేకానికి ఉన్న విలువ ఒకటే" అన్న తప్పుడు భావం.    -- ఐజాక్ అసిమోవ్ (జనవరి 02, 1920 - 1992)

అవాక్కు

  మార్చి 20, 2024 అవాక్కు    ( avaakku )     అర్థము       (విశేషణము ): వాక్కు లేనిది; మూగది    Meaning     (adj) : speechless    వాడుక / Usage     దేవుడి హుండీలో బయటపడిన లేఖ.. భక్తుడి కోరిక తెలిసి అందరూ అవాక్కు .     Letter found in temple donation box - public left speechless at devotee's wish .     మెదడుకు మేత / Food for thought ప్రజాస్వామ్యాన్ని వ్యతిరేకించడానికి మంచి వాదన కావాలంటే, సగటు ఓటరుతో అయిదు నిమిషాలు మాట్లాడితే చాలు .   -- విన్స్టన్ చర్చిల్ (నవంబర్ 30, 1874 - 1965)

తిరిపము

  మార్చి 19, 2024 తిరిపము    ( tiripamu )     అర్థము       (విశేష్యము ): భిక్షము; ముష్టి     Meaning     (noun) : begging; alms    వాడుక / Usage     ఎన్నికల ముందు తిరిపము  తర్వాత తస్కరము - భళా భళా నాయకా.     Begging before elections and robbing after - hail leader .     మెదడుకు మేత / Food for thought మనం ఓటు వెయ్యడం వల్ల ఎమన్నా మార్పు  వస్తుందంటే అసలు మనల్ని ఓటు వేయనిచ్చే వాళ్ళు కాదు.   -- మార్క్ ట్వేయిన్ (నవంబర్ 30, 1835 - 1910)

రసాభాసము

  మార్చి 18, 2024 రసాభాసము    ( ras-ābhāsamu )     అర్థము       (విశేష్యము ): గందరగోళము; ధ్వంసము; అనుచితము;     Meaning     (noun) : commotion; disgusting; in bad taste    వాడుక / Usage     జోరుగా హామీలు, ఘాటుగా మాటలు, పోటుగా నోట్లు - ఎన్నికల రసాభాస షురూ.     Promises galore, sharp words, flooding notes - election circus starts .     మెదడుకు మేత / Food for thought ఎన్నికలు వస్తున్నాయి. ప్రపంచ శాంతి ఘోషించబడింది మరియు నక్కలు కోళ్ల యొక్క జీవనాన్ని పెంపొందించడానికి తమ ప్రగాఢ మద్దతు తెలియచేశాయి.   -- జార్జ్ ఎలియట్ (నవంబర్ 22, 1819 - 1880)

తర్జనము

  మార్చి 15, 2024 తర్జనము    ( tarjanamu )     అర్థము       (విశేష్యము ): భయపెట్టుట; బెదిరించడానికి చూపుడు వేలు ఆడించడం    Meaning     (noun) : threaten; bully; finger-wagging    వాడుక / Usage     ఆ రక్కసులు ( మన నాయకులు?! ) వెక్కసంబులగు మొక్కలంబుల సజ్జనుల (మనం కాదు కదూ!) పజ్జలం బడి తర్జన గర్జన భర్జనాది దౌర్జన్యంబులం జేసి నిర్జించి పాపంబు లార్జించిరి . -- పోతన భాగవతం     The demons ( our politicians?! ) with excessive obstinacy chased behind good people (surely not us!), threatening and beating them loudly, earning bad Karma.     మెదడుకు మేత / Food for thought యధాస్థితిని నిలబెట్టడంలో నాకు ఎటువంటి ఆసక్తి లేదు; దానిని ఉన్మీలించడమే నా ఉద్దేశం.   -- మాకియవెలి (మే 3, 1469 - 1527)

పజ్జ

  మార్చి 14, 2024 పజ్జ    ( pajja )     అర్థము       (విశేష్యము ): దగ్గర; వెనుక; వెంబడి    Meaning     (noun) : behind; close by; nearness    వాడుక / Usage     నాయకులు ప్రజల పజ్జలంబడి ప్రలోభపెట్టే పంచవర్ష మహోత్సవం రానుంది .     The five yearly festival of leaders seducing after people is upon us.     మెదడుకు మేత / Food for thought ప్రతీ బాలుడు ఒక కళాకారుడే. సమస్యల్లా పెద్దయ్యాక కూడా కళాకారుడిగా ఎలా ఉండటం అనేదే!   -- పాబ్లో పికాసో (అక్టోబర్ 25, 1881 - 1973)

మొక్కలము

  మార్చి 13, 2024 మొక్కలము    ( mokkalamu )     అర్థము       (విశేష్యము ): మొండితనం; మూర్ఖం; మిడిసిపాటు; ధైర్యం;  ఉత్సాహం    Meaning     (noun) : stubborn; valour; joy; obstinate    వాడుక / Usage     రాజకీయ పరిభాష నేటి నాయకుల  మొక్కలమునకు ప్రతీక .     Political discourse is a reflection of the obstinacy of today's leaders.     మెదడుకు మేత / Food for thought యుక్తిగలవారు తమని తాము ప్రపంచానికి అనుగుణంగా మలుచుకోడానికి ప్రయత్నిస్తారు. యుక్తిహీనులు ప్రపంచాన్ని తమకి అనుగుణంగా మలచడానికి ప్రయత్నిస్తారు. అందువలన సమాజ పురోగతి కేవలం యుక్తిహీనుల మీదనే ఆధార పడి ఉంది.   -- జార్జి బెర్నార్డ్ షా (జులై 26, 1856 - 1950)

వెక్కసము

  మార్చి 12, 2024 వెక్కసము    ( vekkasamu )     అర్థము       (విశేష్యము/విశేషణము ): అసహ్యము; విసుగు; అధికము; దుర్లభము     Meaning     (noun/adj) : excessive; glut; disgust; unbearable    వాడుక / Usage     మల్లెపూలలోని మకరంద బిందువుల్ని త్రాగుట మానలేక - త్రాగలేక వెక్కస పడుతున్నాయి తుమ్మెదలు .     The bees cloyed having feasted on the nectar of jasmines.     మెదడుకు మేత / Food for thought చరిత్ర రాయడానికి వాడే సిరా కేవలం ద్రవ్యరూపంలో ఉన్న పక్షపాతం.   -- మార్క్ ట్వేయిన్ (నవంబర్ 30, 1835 - 1910)

కటాహము

  మార్చి 11, 2024 కటాహము    ( kaṭahamu )     అర్థము       (విశేష్యము ): నూనె కాచే పెద్ద కడవ/బాన/మూకుడు; తాబేటి చిప్ప; అప్పుడే కొమ్ములు వచ్చే దూడ; ఒక నరకం    Meaning     (noun) : large vessel; frying pan; turtle shell; calf whose horns are sprouting    వాడుక / Usage     తాబేలు కటాహంలోనికి ముడుచుకొనునట్లు, ఎవరు పంచేద్రియములను సర్వ విషయ సుఖముల నుండి వెనుకకు మరల్పగల్గునో అట్టివాడు స్థితప్రజ్ఞుడు.     He who can withdraw himself from sensual pleasures, just as a turtle retracts into its shell, is Sthithapragna.     మెదడుకు మేత / Food for thought యుద్ధం అనేది భూగోళ  శాస్త్రం మనకు నేర్పించడానికి దేవుడి పన్నాగం అని నా ఉద్దేశం.   -- పాల్ రోడ్రిగీజ్ (మెక్సికన్ హాస్యకారుడు)

ముక్తాయించు

  మార్చి 08, 2024 ముక్తాయించు    ( mukthayinchu )     అర్థము       (క్రియ ): పూర్తి చేయు; ముగించు     Meaning     (verb) : finish; conclude (a sentence/thought)     వాడుక / Usage     "'ఔనండి... ఎన్నాళ్ళయింది ఇలాంటి వానపడి..' అని ముక్తాయించాడు " - అద్దేపల్లి ప్రభు      "Yes sir...it has been long since it has rained like this" he concluded.     మెదడుకు మేత / Food for thought యెప్పుడో ఒకప్పుడు అంతా ఒంటరితనంలో కొట్టుకుపోతూనే ఉంటాం. ఆ దిగులు, బెంగ యెందుకో తెలిసినా మనం మన ఇష్టాలని, కోరికలని, ప్రేమలని నిర్భయంగా, స్వేచ్ఛగా వ్యక్తపరిచే స్థితి మన చుట్టూ లేదుకదా. యెవ్వరి లైఫ్ స్టైల్ వాళ్ళది అనుకోరు కదా! మనముందు వో వ్యవస్థని ఉంచారు. మనక్కి ఇరుగ్గా ఉన్నా అందులోనే ఉండాలా? బయటకి రావాలా? బయటికి వస్తే మనమీద విసిరే బాణాలని మనం యెదుర్కోగలమా...మన చుట్టూ వున్న గోడలని మనం బద్దలు కొట్టగలమా...అసలు కొట్టాలా వద్దా..కొట్టటం వల్ల మనకి కావాల్సింది మనకి దొరుకుతుందా...లోపల యేమి లేదని తెల్సింది...

మడక

  మార్చి 07, 2024 మడక    ( maḍaka )     అర్థము       (విశేష్యము ): నాగటికి ఎడ్లను పూన్చిన అరక; స్థలం; పరిసరం; నాగలి     Meaning     (noun) : plough with bullocks yoked; place; surroundings; plough     వాడుక / Usage     "నాయనా! మద్దినేళ మడక లిప్పే పొద్దులో పెళయకావేట్లో నడవబాకండ్రా " - స. వెం. రమేశ్      Dear son! Don't walk in Pulicat lake in the afternoon around the time bullocks are unyoked from ploughs.     మెదడుకు మేత / Food for thought అంతా విన్న కుమ్మరోళ్ల రమణన్న లేచి 'అయ్యా! సుధాకరయ్య...ఆ పంటరంగ సామే మీ బిడ్డల్ని కాపాడినాడు. రెట్టమూల్లో ఇన్ని తరంతాలుగా నరమానవుడునట్లు ఎరగం. ఆ సోమే పెద్దాయన మాదిరి వొచ్చి బిడ్డల్ని ఉత్తరపొద్దు నించి కాపాడినాడు. శివురేత్తిరికి కూటిపొరువు (అన్నదానం) జేస్తానని మొక్కు' అన్నాడు. మా మామ పంటరంగం వైపు తిరిగి చేతులెత్తి మొక్కి, మమ్మల్ని గట్టిగా గుండెల కదుముకున్నాడు. ప్రళయ కావేరమ్మతో కూడడానికి సూరయ్య చరచరా పైకి లేస్తున్నాడు. -- ఉత్తరపొద్...

ఉపశమనము

  మార్చి 06, 2024 ఉపశమనము    ( upa-ṣamanamu )     అర్థము       (విశేష్యము ): శాంతి; ఓర్పు; ఓదార్పు    Meaning     (noun) : calmness; tranquillity; patience; relief (from pain/sorrow)     వాడుక / Usage     "అనంతపురపు అంతులేని జీవన వేదన ఈ రచయిత (బండి నారాయణ స్వామి) కథల్లో చోటు చేసుకుని కొద్దోగొప్పో ఉపశమనం పొందగలిగింది  " - ఖదీర్      Anantpur's life struggles got some relief in this writer's stories.     మెదడుకు మేత / Food for thought తెల్లవారింది. నదులు ఎప్పటిలాగే తుళ్లుకుంటూ పరుగులు తీస్తూనే ఉన్నాయి. ఎండిన చోట వాన పడి  తిరిగి ప్రాణం పోసుకుంటూనే ఉన్నాయి. సముద్రాలు ఆదిమ ఆజ్ఞకు లోబడి చెలియలికట్ట దాటకుండా వెనక్కు మరలుతూనే ఉన్నాయి. అవి పొర్లివచ్చిన చోట కూడా ఒక తల్లి ఎంతో సురక్షితంగా చోటు చూసుకుని ఒక బిడ్డకు జన్మనిచ్చింది. తగలబడిన అరణ్యాలలో ఆ రాత్రి రహస్యంగా కొన్ని తీగలు కొత్త చిగుళ్లు తొడిగి అవి పాకిన చెట్లను మరింత బలంగా పెనవేసుకున్నాయి. ఈ సృష్టిలోని అనంత చైతన్యం...

కరవాలము

  మార్చి 05, 2024 కరవాలము    ( karavālamu )     అర్థము       (విశేష్యము ): ఖడ్గము; కత్తి    Meaning     (noun) : a sword    వాడుక / Usage     "సమాజంలో సాగిన జబర్దస్తీల మీద కలాన్ని కరవాలంలా తిప్పిన వీరుడు (రావిశాస్త్రి) " - ఖదీర్      Raavisastri was a hero who wielded his pen like a sword against the injustices in society.     మెదడుకు మేత / Food for thought అంత గొప్ప ప్రవాహంలో సంతత ధారగా వాన పడిపోతోంది. నీళ్లలో నీళ్లు. ధారలో ధార. వాన చినుకులు కృష్ణలో పడుతుంటే పెద్దక్క ప్రేమగా హత్తుకుంటే వొళ్ళు జలదరించినట్లు ఆ ప్రవాహం మీద ఒక జలదరింపు. సిగ్గుతో నవ్వినప్పుడు బుగ్గ మీద సొట్టలా చినుకు పడ్డ చోట చిన్న గుంట. అంతలో మాయమై మళ్ళీ మళ్ళీ గుంటలు. కృష్ణంతా పులకరింతలు. ఇసక మీద చినుకులు. కసకస చినుకులు. విసవిస సరసర చినుకులు. రివ్వుమని రయ్యమని చినుకులు. ఛళ్లుమని ఫెళ్ళుమని దభిల్లుమని పెఠిళ్లుమని చినుకులు. కృష్ణ నిండా, ఇసక నిండా, నేల నిండా - రెండు గంగలు కలిసిపోయినట్లు నింగి నేల ఒకటైనట్లు. ఈ జగత...

గునుగు

  మార్చి 04, 2024 గునుగు    ( gunugu )     అర్థము       (విశేష్యము/క్రియ ): పశువుల మేతకు వాడే ఒక రకం గడ్డి; గొణుగు    Meaning     (noun/verb) : a type of grass fed to cattle; mutter    వాడుక / Usage     "వాన చింత మనుషులకే కాదు గడ్డికి గునుగుకి రెక్కలకూ పిట్టలకూ ఉంటుంది " - ఖదీర్      Its not just humans who are concerned of rain; shrubs, grass, feathers, birds are too.     మెదడుకు మేత / Food for thought రావుగారు అకస్మాత్తుగా చిన్నపిల్లాడివలె ఏడుపు ప్రారంభించారు. తనకు ఆత్మ స్థైర్యాన్నీ, శాంతినీ, గాలివానకు తట్టుకోగల శక్తినీ చేకూర్చిన ఆ మూర్తి అక్కడ పడిపోయి ఉంది. ఆ గాలివానకు ఆమె బలి అయిపొయింది. ఆయనలో లోతుగా మాటుపడిపోయున్న మానవత్వాన్ని ఈ జీవి వికసింపచేసింది. ఆయన భార్యగానీ ఆయన పిల్లల్లో ఎవరూగానీ ఈమె వచ్చినంత దగ్గరగా రాలేదు. ఆయన విలువలు, నియమాలు, ధర్మ చింత వేదాంతం అన్నీ త్యజిస్తాడాయన ఈ వ్యక్తికీ ప్రాణం పోయగలిగితే. -- గాలి వాన (1951లో ప్రపంచ కథల పోటీలో రెండవ బహుమతి), పాలగుమ్మి పద...