Posts

Showing posts from April, 2024

తవ్వ

  మే 01, 2024 తవ్వ    ( tavva )     అర్థము       (విశేష్యము ): ధాన్యపు కొలత; రెండు సోలలు    Meaning     (noun) : a dry measure; gallon; two 'solas'     వాడుక / Usage     ఇంటికి అవ్వ, కొలతకు తవ్వ .     Mother is heartthrob of home, measure is key to home.      మెదడుకు మేత / Food for thought         న జాయతే మ్రియతే వా కదాచిత్ నాయం భూత్వా భవితా వా న భూయః      అజో నిత్యః శాశ్వతోఽయం పురాణో న హన్యతే హన్యమానే శరీరే     ( ఆత్మకి పుట్టుక లేదు, ఎన్నటికీ మరణం కూడా ఉండదు. ఒకప్పుడు ఉండి, ఇకముందు ఎప్పుడైనా అంతమైపోదు. ఆత్మ జన్మ లేనిది, నిత్యమైనది, శాశ్వతమైనది, మరియు వయోరహితమైనది. శరీరం నశించిపోయినప్పుడు అది నశించదు.)     -- భగవద్గీత, సాంఖ్య యోగం (రెండవ అధ్యాయం), 20వ శ్లోకం

గిద్ద

  ఏప్రిల్ 30, 2024 గిద్ద    ( gidda )     అర్థము       (విశేష్యము ): సోలలో నాల్గవ భాగం; ఎనిమిది కుంచలు; చిన్న కొడవలి    Meaning     (noun) : a measure; measuring vessel of height 4 stacked coins and holding 225 grains     వాడుక / Usage     మా ఊరి సంతలో గిద్ద బియ్యానికి రెండు గిద్దలు దుద్ది పళ్ళు వచ్చేవి .     A measure of rice fetched 2 measures of cherries at our village market.      మెదడుకు మేత / Food for thought        అత్యంత దారుణ, కఠిన పరిస్థితుల మధ్య ఎనిమిదేండ్లు జైలు జీవితం గడిపాను. వీల్‌ఛైర్‌ నుంచి బయటకు కదలలేకపోయా. సొంతగా టాయిలెట్‌కీ వెళ్లలేకపోయా. కనీసం పైకి లేచే పరిస్థితి లేదు. అక్కడ పరిస్థితులు దారుణంగా ఉన్నాయి. జీవితం ముందుకు సాగడం కష్టమనిపించింది. కానీ, ఈరోజు సజీవంగా బయటకు రావడం నిజంగా ఆశ్చర్యమే. --  మావోయిస్టులతో సంబంధమున్న కేసులో నిర్దోషిగా తేలి, జైలు నుంచి విడుదలైన అనంతరం మీడియాతో  దిల్లీ యూనివర్సిటీ మాజీ ప్రొఫెసర్‌ జి.ఎన్...

సోల

  ఏప్రిల్ 29, 2024 సోల    ( sōla )     అర్థము       (విశేష్యము ): ఒక కొలత; కొల పాత్ర; పదహారు నాణేల ఎత్తుగల పాత్ర; తొమ్మిది వందల గింజలు పట్టే పాత్ర    Meaning     (noun) : a measure; measuring vessel of height 16 stacked coins and holding 900 grains     వాడుక / Usage     నా మరదలా ఎం మరియాదలే కుంచడు కులుకులుతో సోలడు సోకులతో కంచి దాటి రాకే పిల్లా కవ్వించేలా .     My darling, entreaties of yours in a chalice of charm and unmeasured titillation; cross not tease not no more.      మెదడుకు మేత / Food for thought       సత్యమేవ జయతే నానృతం      సత్యోన పంథా వితతో దేవయానః      యేనాక్రమన్తి ఋషయో హ్యాప్తకామా      యత్ర తత్ సత్యస్య పరమం నిధానం     ( సత్యమే జయిస్తుంది. అసత్యము కాదు. సత్యము చేతనే దేవయానము ఏర్పడియున్నది. ఆప్తకాములైన ఋషులు ఈ మార్గము ద్వారానే సత్యనిలయమైన పరంధామము చేరుతారు.)     --  ముండకో...

నగము

  ఏప్రిల్ 26, 2024 నగము    ( nagamu )     అర్థము       (విశేష్యము ): కొండ; చెట్టు; పాము; ఏడు (సంఖ్య)    Meaning     (noun) : hill; tree; immovable; snake;     వాడుక / Usage     శివుని శిరము జేరి చిందు లేసె; శీత నగము విడచి క్షితిని జేరె.     You prance on Shiva's head; having left the snowy hills you rampage your way down to earth.      మెదడుకు మేత / Food for thought       తెల్లావారక ముందే పల్లె లేచింది      తనవారినందరినీ తట్టీ లేపింది      ఆదమరచి నిద్ర పోతున్న తొలి కోడి      అదిరిపడి మేల్కోంది... అదే పనిగ కూసింది ||      వెలుగు దుస్తులేసుకొని సూరీడు      తూర్పు తలపు తోసుకొని వచ్చాడు      పాడు చీకటికి ఎంత భయమేసిందో      పక్కదులుపుకొని ఒకే పరుగుతీసింది      అది చూసి... లతలన్నీ... ఫక్కున నవ్వాయి      ఆ నవ్వులే ఇంటింట పువ్వు...

ఉత్తుంగము

  ఏప్రిల్ 25, 2024 ఉత్తుంగము    ( uttungamu )     అర్థము       (విశేషణము ): పొడవైనది; ఎత్తైనది; ఉన్నతమైనది    Meaning     (adj) : high; tall; lofty    వాడుక / Usage       ఆకాశం బద్దలైందా.. నేల ఈనిందా... ఇది సముద్ర కెరటమా? జన ఉత్తుంగ తరంగమా?     Have the heavens opened up? The earth bounteous? Waves of ocean? Or a mighty sea of people?     మెదడుకు మేత / Food for thought       హృదయము లేని లోకము సుమీ యిది మాపుల పశ్చిమంబుగా      ఉదయము తూర్పుగా నడచుచుండు సనాతన ధర్మ ధేనువుల్‌      పిదికిన పాలు పేదకు లభింపవు శ్రీగలవాని యాజ్ఞలో      పెదవి మెదల్ప జాల రరవిందభవ ప్రముఖామృతాంధసుల్‌      ప్రతిమల పెండ్లి సేయుటకు వందలు వేలు వ్యయించు గాని దుః      ఖితమతులైన పేదల ఫకీరుల శూన్యములైన పాత్రలన్‌      మెతుకు విదల్ప దీ భరతమేదిని ముప్పదిమూడు కోట్ల దే     వత లెగవడ్డ దేశమున భాగ్యవిహ...

మ్రోల

  ఏప్రిల్ 24, 2024 మ్రోల    ( mrōla )     అర్థము       (విశేష్యము ): ఎదుట; ముందర; ముందు భాగం    Meaning     (noun/adj) : before; in front; presence of    వాడుక / Usage      "భూపాల నీ మ్రోల ఈ బేల గానాలు.. నీ రాజసానికవి నీరాజనాలు".     O lord of the world! these earnest songs before you are salutations to your magnificence.     మెదడుకు మేత / Food for thought       ఎదలోపలి యెదలో, నె      మ్మదిలో, జీవిత రహస్యమార్గమ్ములలో      వదలని కోరిక వై, నా      బ్రదుకుబరువు లెల్ల పాట పాడింతు సఖీ!      చలువపిసాళిగాలి నునుచక్కిలిగింతల కౌగిలింతలన్      నిలువున పాటగా కరగనేర్చునొ నీరవ వేణువీథి! నీ      వలపుతలంపు సోకిననె, ప్రాణసఖీ! బ్రతు కెల్ల కోటి గొం      తుల విడి సోనలై పొరలు నూతన గీత సుధాపథాలలో!      నీ యాజ్ఞ కూడెనా, గొంతుముడి వీడెనా      హాయిగ...

నికుంజము

  ఏప్రిల్ 23, 2024 నికుంజము    ( nikunjamu )     అర్థము       (విశేష్యము ): పొదరిల్లు; గుహ    Meaning     (noun) : thicket; arbour; den    వాడుక / Usage     నికుంజములో ప్రణయసల్లాపాలతో అలసిన ప్రేయసీప్రియులకు నిద్రాభంగం కలుగుతుందేమో అని తోలుకోడి కూయలేదు.     The rooster didn't crow at dawn lest it disturbs the love birds resting from the exertions of their amorous night.     మెదడుకు మేత / Food for thought       “అవును. జంతుధర్మాలు ఆహారనిద్రాభయాదులు. ఆహారం బ్రతకటానికి, నిద్ర శ్రమ తీర్చుకోడానికి, భయం జాతినీ వ్యక్తినీ రక్షించడానికీ, నాల్గవది జాతిని వృద్ధి చేయడానికి. ఈ జంతుధర్మాలు ఎవ్వరూ మానలేరు. ఏదో ఉగ్రమైన తపస్సుచేసేవారే మానగలుగుతారు. నిష్కామకర్మ అంటే ఈ నాలుగు ధర్మాలు నిష్కామంగా ఆచరించగలగడమే.” “ఈ జంతుధర్మాలు నెరవేరుస్తూ వాని ఫలం ఎలా వదులుకోగలడు మానవుడు?” “ఆత్మజ్ఞానం సంపాదించుకొని కర్మఫలాన్ని దహించుతూ మనుష్యుడు జీవితమార్గం నడవాలి.” “ఆకలివేస్తే అన్నం తింటాడు.” “అవును.”...

తరంగిణి

  ఏప్రిల్ 22, 2024 తరంగిణి    ( tarangiṇi )     అర్థము       (విశేష్యము ): నది; యేరు; ప్రవాహము    Meaning     (noun) : river; stream    వాడుక / Usage      తరంగిణీ ఓ తరంగిణీ ఏ ఒడిలో నీ జననం ఏ కడలికో నీ పయనం.     River! O perennial flow! whither do you come from, thither do you go?     మెదడుకు మేత / Food for thought       ఇసుక తిన్నెలెదురైనా..ఏ గిరులు తిరిగిపొమన్నా     లోయల్లో దిగిపోయినా..పాయలుగా విడిపోయినా     లోయల్లో దిగిపోయినా..పాయలుగా విడిపోయినా           ఇసుక తిన్నెలెదురైనా..ఏ గిరులు తిరిగిపొమన్నా     లోయల్లో దిగిపోయినా..పాయలుగా విడిపోయినా     లోయల్లో దిగిపోయినా..పాయలుగా విడిపోయినా     గుండె ముక్కలయిపోయి..సుడిగుండాలే చెలరేగి     కల్లోలం విషమించినా..ఆ..ఆ..ఆ..ఆ..ఆ     కాలమే వంచించినా..ఆ..ఆ..      ఆగిపోదు నీ నడకా..ఆ..ఆ....

గుమ్మ

  ఏప్రిల్ 19, 2024 గుమ్మ    ( gumma )     అర్థము       (విశేష్యము ): పాలు పిండినప్పుడు వచ్చే ధార; స్త్రీ    Meaning     (noun) : gush of milk; darling/damsel    వాడుక / Usage      పసి తుమ్మెదొచ్చి వాలింది గుమ్మ తేనెకి సిరితీగ పాప ఊగేది తీపి కాటుకే.     The young bee is here to taste the flow of honey; the creeper sways for that sweet sting.     మెదడుకు మేత / Food for thought        చాలా సార్లు నువ్వొక గుహలాంటి చీకటి      లేదూ, చీకటిలాంటి గుహ.      కళ్ళు చికిలించుకొని అన్ని చూపుల్నీ వొక్క చోటే గుచ్చుకొని      ఎంత సేపని చూస్తానో      నీలోకి వొకింత కూడా రాలేను, నువ్వూ రానివ్వవు      నీ ఎత్తాటి గోడల మధ్యకు-      వొక్క చినుకయ్యీ రాలలేను, నువ్వూ రాలవు      ఎవరి ఎడారిలో వాళ్ళం!     అయినా గానీ     ఎంత ఆశగా చూస్తూ వుంటానో పసి కళ్...

సయ్యాట

  ఏప్రిల్ 18, 2024 సయ్యాట    ( sayyāṭa )     అర్థము       (విశేష్యము ): స్త్రీ పురుషుల పరిహాస క్రీడ; లీల; సల్లాపము     Meaning     (noun) : joke; sport; dalliance    వాడుక / Usage      నింగి నేలా వంగి పొంగి సయ్యాటాడే ఎందుకోసమో ?     Why do Earth and sky swell and bend in playful dalliance?     మెదడుకు మేత / Food for thought        ఎన్ని దూరాలు కలిపితే     వొక అస్థిర బైరాగినవుతానో     ఎన్ని తీరాలు గాయాలై సలిపితే     వొక నిర్లక్ష్య సూఫీనవుతానో!     ఇదీ వొక ఆటే కదా నీ చుట్టూ     నేను బొంగరమయి తిరగడానికి .       కొలమానాలన్నీ గాల్లోకి       చిలిపిగా విసిరేసి      నీ లోపల శిధిలమయిపోనీ నిబ్బరంగా!     -- ఫనా, అఫ్సర్

గిల్లికజ్జా

  ఏప్రిల్ 17, 2024 గిల్లికజ్జా    ( gillikajjā )     అర్థము       (విశేష్యము ): కోరి పెట్టుకున్న కజ్జాలు (కయ్యాలు); కొట్లాట     Meaning     (noun) : quarrel typically initiated by irritating/troubling others    వాడుక / Usage      మరుమల్లెల్లోన పుట్టింది కొత్త ఆవిరి మసకేసే ముందే సాగింది గుండె దోపిడి ఈ గిల్లికజ్జా ఏనాటిది .     The jasmines are steamy and the hearts' lost even before dark! Ageless is this lovers' squabble.     మెదడుకు మేత / Food for thought       మంచి కవిత్వమంటే మనకు బాగా తెలిసిన ప్రపంచాన్నే కొత్తగా చూపించడమో, లేదా అసలెన్నడూ చూడని లోకానికి తలుపు తీయడమో చెయ్యాలని నేననుకుంటాను. ఇతర దేశాల కవులనూ వాళ్ళ కవిత్వాలనూ చదువుతున్నప్పుడు మనం చాలా సందర్భాల్లో మనకు తెలియని లోకాన్నే చూస్తాం. వాళ్ళ సిద్ధాంతాలు వేరు. సంస్కృతీసంప్రదాయాలు వేరు. ఆ లోకపు తత్వాలూ భావాలూ, వాళ్ళ ఋతువులూ రంగులూ, సమస్యలూ స్పందనలూ అన్నీ మన కవితాప్రకటనకు ఎంతోకొంత భిన్నంగానే ఉంటాయి. ...

లావాదేవీ

  ఏప్రిల్ 16, 2024 లావాదేవీ    ( laavadevi )     అర్థము       (విశేష్యము ): వ్యాపార బేరసారాలు; ఇచ్చిపుచ్చుకొనుట    Meaning     (noun) : commercial transactions; give and take dealings    వాడుక / Usage      ఈ లావాదేవి ఏనాటిది ఓ ఓ హో ఓసి వయసా ఇంత అలుసా నీకు తగునా ఈ గుస గుస .     O youthful age! why do you take a chance on me with those tingling whispers?! Since when is this playful exchange!     మెదడుకు మేత / Food for thought       రెండో ఝాము ఎండ నదిమీద ఆవిరి, దూరపు కొండల్లో నిప్పు     నక్కల బొరియల మూతుల్లో గుప్పెడుగుప్పెడు రాళ్ళ ముక్కలు.      అక్కడ పల్లెలో కాబోలు రాతిరి నిశ్శబ్దం. ఒక్క చిన్నపిట్ట,     క్రొత్త గుడిసె కప్పు మీద పాకిన బీరతీగె     సగం తెరిచిన తలుపు ఇంటిలో రోలు రోకలి చప్పుడు     బార్లగా తెరిచిపడి ఉంది ఆలోచనలు లేని పిల్లమనసు,     గుమ్మడి పూలలో అటూఇటూ తిరుగుతూ సీతాకోకచిలుక   ...

తాకిడి

  ఏప్రిల్ 15, 2024 తాకిడి    ( taakidi )     అర్థము       (విశేష్యము ): స్పర్శ; ఒత్తిడి    Meaning     (noun) : touch; pressure; trouble; pain    వాడుక / Usage     ఎద లోయల్లోన సాగింది కొత్త తాకిడి తనువంతా వేణువూదింది కన్నె ఊపిరి .     In the depths of my heart there is a sweet pain, my body resonates with nubile sighs .     మెదడుకు మేత / Food for thought         కిమస్థిమాలాం కిము కౌస్తుభం వా       పరిష్క్రియాయాం బహుమన్యసే త్వం?       కిం కాలకూటః కిము వా యశోదా       స్తన్యం తవ స్వాదు వద ప్రభో మే!     (భగవంతుడికి ఎముకల దండ అంటే ఇష్టమా? కౌస్తుభమణి అంటే ఇష్టమా? కాలకూటవిషం రుచా? లేక యశోదా చనుబాలు తీపా? ఇదీ ప్రశ్న. తేడాలున్నది వస్తువులలో కాదు, వస్తువులను చూసే దృష్టిలో. ఒక వ్యక్తి తలచుకుంటే, మణిమరకతమాణిక్యాల వంటి ఐశ్వర్యం నడుమ ఎంత ఆనందంగా ఉండగలడో, స్మశానంలో, బూడిద పూసుకుని ఎముకల దండలు ధరించి కూడా అంత సంత...

యాతము

  ఏప్రిల్ 12, 2024 యాతము    ( yathamu )     అర్థము       (విశేష్యము ): పోయినది; గతము; ఏతం;  నీళ్లుతోడే యంత్రం    Meaning     (noun) : gone; past; device to draw water    వాడుక / Usage     ప్రజాస్వామ్యం అంతరించిపోయాక యాతంలోకి చూసి మనం అప్పుడు నోరు విప్పలేదే అనుకుంటే ఉపయోగం లేదు.     It is futile to look into the past and regret not raising our voice after democracy  has ceased to exist.     మెదడుకు మేత / Food for thought       భిన్నాభిప్రాయాలు మరియు అసమ్మతి చేతనమైన ప్రజాతంత్రం యొక్క చిహ్నాలు.     -- సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డి. వై చంద్రచూడ్

తాయము

  ఏప్రిల్ 11, 2024 తాయము    ( tāyamu )     అర్థము       (విశేష్యము ): అరుదైన వస్తువు; తాయిలం    Meaning     (noun) : a rare thing; rarity; treats    వాడుక / Usage     పంచిన తాయములు తీసుకుందాం, అడగాల్సిన ప్రశ్నలు మర్చిపోదాం.     Accept the treats, ignore the questions that need to be asked.     మెదడుకు మేత / Food for thought      ఒకసారి ప్రభుత్వం విపక్షాల గొంతుని అణచాలని నడుం కట్టుకుందో, ఇక ఆ ప్రభుత్వానికి ఒకటే మార్గం - మరింత అణచివేత కొనసాగించడమే.     -- హారి ట్రూమాన్   (మే 08, 1884 - 1972)

తాప

  ఏప్రిల్ 10, 2024 తాప    ( tāpa )     అర్థము       (విశేష్యము ): నిచ్చెన; మెట్టు; గడప; వేడి    Meaning     (noun) : step; stairs; ladder; threshold; heat    వాడుక / Usage     మా పార్టీ  తాప ఎక్కండి, మీ పాపాలు ప్రక్షాళన చేసుకోండి.     Step into our party and be cleansed of your evil deeds.     మెదడుకు మేత / Food for thought      ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షాలకు అడ్డు గోడలు కట్టకపోవడం కేవలం రాజ్యాంగనిబద్ధత కోసమే కాదు, విపక్షం  అవశ్యము కనుక.     -- ది ఇండిస్పెంసిబిల్ అప్పోజిషన్, వాల్టర్ లిప్ప్మన్  (సెప్టెంబర్ 23, 1889 - 1975)

యావత్తు

  ఏప్రిల్ 09, 2024 యావత్తు    ( yāvattu )     అర్థము       (విశేష్యము ): సమస్తము; సర్వము    Meaning     (noun) : the whole; entire    వాడుక / Usage     దృష్టి యావత్తు రోజుకో కల్పిత వివాదంపై, రోజువారీ సమస్యలు దేవుడికే ఎరుక.     Focus entirely on fabricated controversies, to hell with real issues.     మెదడుకు మేత / Food for thought      బలమైన విపక్షం లేనిదే ఏ ప్రభుత్వం ఎక్కువ కాలం పదిలంగా ఉండ లేదు.     -- బ్రిటన్ మాజీ ప్రధాని, బెంజమిన్ డిస్రేలీ  (డిసెంబర్ 21, 1804 - 1881)

యావ

  ఏప్రిల్ 08, 2024 యావ    ( yaava )     అర్థము       (విశేష్యము ): ధ్యానము; దృష్టి; అధికాసక్తి; తపన    Meaning     (noun) : focus; excessive desire or clamour    వాడుక / Usage     నాలుగొందలు మీద యావ ప్రజలను తప్పు ద్రోవ.     Clamour for four hundred, enamour people to paths blundered.     మెదడుకు మేత / Food for thought      ప్రజాస్వామ్యం యొక్క ఉత్తమ కొలమానం ప్రతిపక్షాల యొక్క ఉనికి.     -- డానిష్ రచయత/విమర్శకుడు,  పౌల్ హెన్నింగ్సన్ (సెప్టెంబర్ 9, 1894 - 1967)

ముగుద

  ఏప్రిల్ 05, 2024 ముగుద    ( muguda )     అర్థము       (విశేష్యము ): ముగ్ధ; స్త్రీ; మహిళ    Meaning     (noun) : maid; damsel; lady    వాడుక / Usage     " ముగుద ! నీదు సహజమూర్తి చూడక యుండ వలచుటెట్లు ప్రేమకలుగుటెట్లు?     O maiden! how can I fall in love with you without seeing your true form?     మెదడుకు మేత / Food for thought       విశ్రమ్య విశ్రమ్య వనే ద్రుమాణాం      ఛాయాసు తన్వీ విచచార కాచిత్‌ ।      స్తనోత్తరీయేణ కరోద్ధృతేన      నివారయంతీ శశినో మయూఖాన్‌॥ (ఒక స్త్రీ తన ప్రియుని విరహవేదనా భారాన్ని భరించలేక శరీరం కృశించి, ఒక తోటలో రోజంతా గడిపి, రాత్రి కాగానే ఏర్పడిన పండువెన్నెల చల్లదనం కూడా తాపం నివారించలేక పోవడంతో తన పైట కొంగును పైకెత్తి పట్టుకొని ఆ వెన్నెలలు తన వక్షముల మీద పడకుండా చూసుకుంటూ, మాటిమాటికీ దట్టమైన చెట్లనీడకు చేరి అలసట తీర్చుకుంటోంది. ఆ స్త్రీకి వెన్నెలలే ఎండను మించిన తాపాన్ని కలిగిస్తున్నాయని అతిశ...

కజ్జలము

  ఏప్రిల్ 04, 2024 కజ్జలము    ( kajjalamu )     అర్థము       (విశేష్యము ): కాటుక; సిరా; చీకటి; మబ్బు    Meaning     (noun) : collyrium; lampblack; dark cloud    వాడుక / Usage     విప్పారిన ఆమె కనులు, చుట్టూ దిద్దిన కజ్జలము కొలనులో కలువని తలపిస్తున్నాయి.     Her bright eyes lined with mascara looked like a lily in a pond .     మెదడుకు మేత / Food for thought       ఎప్పుడు దప్పులు వెదకెడు      నప్పురుషుని గొల్వగూడ దది యెట్లన్నన్‌      సర్పంబు పడగ నీడను     గప్ప వసించిన విధంబు గదరా సుమతీ! (నల్లత్రాచుయొక్క పడగనీడను వసించు కప్ప బ్రతుకెంత అస్థిరమైనదో ఆ విధముగనే ఎల్లప్పుడు దోషములను వెదకు యజమానుని సేవించువాడి బ్రతుకును ప్రాణభయముతో కూడినది.)     -- సుమతీ శతకం

కాంచి

  ఏప్రిల్ 03, 2024 కాంచి    ( kānchi )     అర్థము       (విశేష్యము ): స్త్రీలు ధరించే ఒంటిపేట మొలనూలు; వడ్డాణం    Meaning     (noun) : woman's girdle    వాడుక / Usage     రుండమాలా కాంచి ధరించి భీకరంగా ఉన్న శూర్పణఖని చూసిన జానకి భయవిహ్వలమయ్యింది.     Seeing Soorpanakha adorned with a girdle of skulls Sita froze with fear .     మెదడుకు మేత / Food for thought       "విషాన్ని విషంగా  గుర్తించడానికి ఇష్టపడని వాళ్ళకి అది విషం అని చెప్పడం వృధా."  నార్వేకి చెందిన నాటకాల రచయిత హెన్రిక్ ఇబ్సెన్ 1882 లో రచించిన నాటిక "యాన్ ఎనిమి అఫ్ ది పీపుల్ " ని పంతొమ్మిది వందల అరవైల్లో గొల్లపూడి మారుతీ రావుగారు తెలుగు రంగస్థలం కోసం "సత్యంగారిల్లెక్కడ" గా అనువర్తించారు. సత్యజిత్ రాయ్ ఇబ్సెన్ నాటికని ఘనశత్రు పేరుతో 1990 లో సినిమాగా తీశారు.  గొల్లపూడి గారి నాటికని ఈరోజు మళ్ళీ చదివాను. ఆ నాటికలో ముఖ్య పాత్ర అయిన డా:సత్యం సత్యం కోసం తన జీవితం మొత్తం పణంగా పెట్టి అన్నీ కోల్ప...

కైశికము

  ఏప్రిల్ 02, 2024 కైశికము    ( kaiṣikamu )     అర్థము       (విశేష్యము ): వెంట్రుకల సమూహము; జుట్టు ముడి    Meaning     (noun) : tresses; locks of hair    వాడుక / Usage     కరవాలం చేబట్టి, కైశికములు బిగించి ఆమె బరిలోకి దూకింది .     Sword in hand and tresses tucked away she jumped into the fray .     మెదడుకు మేత / Food for thought      నిజం చెప్పాలంటే పంజాబీ కుటుంబంలో పుట్టినా నేను పంజాబీను ఎంతో బెంగాలీను కూడా అంతే. ఎనిమిదో  తరగతిలో ఉండగా ఠాగోర్ నన్ను ఆవహించాడు, కాదు కాదు నేనే ఆయన్ని పెనవేసుకున్నాను. అప్పటినుంచి ఖచ్చితంగా చెప్పలేను బెంగాలీ నాలో ఇమిడిపోయిందో లేక నేను బెంగాలీలో మునిగిపోయానో. పదోతరగతి అయ్యేప్పటికి ఠాగోర్, శరత్ చంద్ర చట్టోపాధ్యాయ, బంకించంద్ర చట్టోపాధ్యాయ సాహిత్యం ఉర్దూ అనువాదంలో పరిచయం అయ్యింది.  బెంగాలీ స్నేహితులు బడిలో సంభాషించుకోవడం విని నేనూ నేర్చుకోవాలని ఉవ్విళ్లూరాను. నేర్చుకున్నాను. తోడుగా సాహిత్య పఠనంలో అడుగులు వేస్తూవచ్చాను. ష...