Posts

Showing posts from July, 2024

విడత

  ఆగష్టు 09, 2024 విడత    ( vidatha )     అర్థము      (విశేష్యము ) : మొత్తము కార్యక్రమంలో ఒక విడి దశ      Meaning     (noun) :  phase     వాడుక / Usage      రెండో విడత రుణమాఫీ నిధుల జమ నేడే .     Second round of loan waiver disbursement today.     మెదడుకు మేత / Food for thought      గిడుగు వెంకట రామమూర్తి తెలుగు వాడుక భాషా ఉద్యమ పితామహుడు . గ్రాంథికభాషలో ఉన్న తెలుగు వచనాన్ని ప్రజల వాడుకభాషలోకి తీసుకు వచ్చి, నిత్య వ్యవహారంలోని భాషలో ఉన్న అందాన్నీ, వీలునూ తెలియజెప్పిన మహనీయుడు. ఆంధ్రదేశంలో వ్యావహారిక భాషోద్యమానికి మూలపురుషుడు. బహుభాషా శాస్త్రవేత్త, చరిత్రకారుడు, సంఘసంస్కర్త, హేతువాది. శిష్టజన వ్యవహారికభాషను గ్రంథరచనకు స్వీకరింపజేయడానికి చిత్తశుద్ధితో కృషిచేసిన అచ్చతెలుగు చిచ్చర పిడుగు గిడుగు. గిడుగు ఉద్యమం వల్ల ఏ కొద్దిమందికో పరిమితమైన చదువు వ్యావహారికభాషలో సాగి, అందరికీ అందుబాటులోకి వచ్చింది. పండితులకే పరిమితమైన సాహిత్యసృష్టి, సృజనాత్...

నిరంతరము

  ఆగష్టు 08, 2024 నిరంతరము    ( nir-antaramu )     అర్థము      (విశేషణము ) : ఎడతెగనిది; ఎల్లపుడూ ఉండేది/జరిగేది; దట్టము      Meaning     (adj/adv) :  always; constantly; continuously; thick; dense     వాడుక / Usage       నిరంతరంగా గోదావరి జలాల తరలింపు .     Godavari waters are being diverted constantly.     మెదడుకు మేత / Food for thought      కన్యాశుల్కం నాటకానికి సాటి రాగల రచన భారతీయ సాహిత్యంలో మృచ్చకటికం తప్ప మరోటి లేదు. కన్యాశుల్కము బీభత్స రస ప్రధానమైన విషాదాంత నాటకం. కవిత్రయమంటే తిక్కన, వేమన, గురజాడ. -- గురజాడ అప్పారావు గురించి శ్రీశ్రీ

తీర్మానము

  ఆగష్టు 07, 2024 తీర్మానము    ( tīru-mānamu )     అర్థము      (విశేష్యము ) : నిర్ణయం; చర్చించి తీసుకునే నిర్ణయం; తీరిక      Meaning     (noun) :  decision; resolution; leisure    వాడుక / Usage      సిఎం పై సభా హక్కుల ఉల్లంఘన తీర్మానం ఇస్తాం .     We will move privilege motion against CM.     మెదడుకు మేత / Food for thought      ఒక వ్యక్తిగా, సంఘసంస్కర్తగా, రచయితగా వీరేశలింగానికి అనేక విశిష్టతలు ఉన్నాయి. అనేక విషయాలలో ఆంధ్రులకు ఆయన ఆద్యుడు, ఆరాధ్యుడు. ఆధునికాంధ్ర సమాజ పితామహుడిగా కీర్తి గడించిన వ్యక్తి కందుకూరి. ఆయనకున్న ఇతర విశిష్టతలు: మొట్టమొదటి వితంతు వివాహం జరిపించిన వ్యక్తి మొట్టమొదటి సహవిద్యా పాఠశాలను ప్రారంభించాడు తెలుగులో మొదటి స్వీయ చరిత్ర ఆయనదే తెలుగులో తొలి నవల వ్రాసింది ఆయనే తెలుగులో తొలి ప్రహసనం వ్రాసింది కందుకూ ఆధునిక తెలుగు నాటకరంగంలో తొలి నాటకకర్త, తొలి దర్శకుడు, తొలి ప్రదర్శనకారుడైన కందుకూరి జన్మదినాన్ని తెలుగు నాటకరంగ దినోత్సవ...

అమానుషము

  ఆగష్టు 06, 2024 అమానుషము    ( a-mānushamu )     అర్థము      (విశేషణము ) : మనుషులు చేయనిది; క్రూరమైనది;       Meaning     (adj) :  beyond humans; inhuman; cruel    వాడుక / Usage      అడవిలో అమెరికా మహిళపై అమానుషం .     American woman found in inhuman conditions in the forest.     మెదడుకు మేత / Food for thought      21 అధ్యాయాల్లో రాసిన స్వీయ చరిత్రములో, ఆయన జీవిత కృషి మొత్తం వివరించబడింది. బాల్యం, నర్సాపురంలో చదువు, రాజమండ్రిలో విద్యాభ్యాసం, ఉద్యోగం. గ్రంథంరచన, నాటకసమాజం, వివాహం, మండలసభల్లో పాల్గొనడం, రామమోహన పాఠశాల ఏర్పాటు, నిర్వహణ, ఉన్నతపాఠశాల ప్రారంభం, కుటుంబ సమస్యలు, కష్టాలు, టంగుటూరి ప్రకాశం ఇంగ్లండ్‌ యాత్ర, హితకారిణి సమాజస్థాపన, అచ్చు యంత్రాన్ని నెలకొల్పడం, భారత జాతీయ కాంగ్రెస్ సభకు హాజరవడం, పత్రికాసంపాదకత్వం, నిర్వహణ – యివన్నీ సవివరంగా రాశాడు. చిలకమర్తి ఏకసంధాగ్రాహి మాత్రమే కాద...

కుంభకోణము

  ఆగష్టు 05, 2024 కుంభకోణము    ( kumbhakonamu )     అర్థము      (విశేష్యము ) : మోసం; అవినీతి కార్యకలాపం; 1960లలో కుంభకోణం అనే ఊరులో జరిగిన అవినీతి నుండి వచ్చింది అని కొందరు; కుంభ(కుండ) లో కోణాలు లేనట్లే మోసం జాడ లేకుండా చేయడం అని కొందరు అంటారు      Meaning     (noun) :  scandal; fraud; scam    వాడుక / Usage      విద్యుత్ ప్లాంట్ల నిర్మాణంలో కుంభకోణం .     Scam in the construction of power plants.     మెదడుకు మేత / Food for thought      దేనికి వెరవని తనం, అనుకున్నది సాధించటానికి తనదైన శైలిని విడనాడకపోవటం, తన కున్నదంతా ప్రజల అభిమానధనం అని నమ్మిన ప్రకాశం పంతులు గారు నిజంగా మన తరానికి మార్గదర్శి. చివరకు ఏమీ మిగిల్చుకోకపోఇనా, రాష్త్ర ప్రజల అభిమానం మాత్రం పుష్కలంగా మిగిల్చుకున్న ఆ అభిమానం కూడా కాలక్రమేనా కరిగి ఆవిరైపోతుంటే, మళ్ళీ ఆయన త్యాగాలు, ఆయన పని విధానం,ఆయన తెంపరి తనం, ఆయన తెగువ తెలియాలంటే, భాషాభిమానులంతా చదవాల్సింది ” నా జీవిత యాత్ర “.     -- m...

గిరాకి

  ఆగష్టు 02, 2024 గిరాకి    ( girāki )     అర్థము      (విశేషణము ) : ఎక్కువ వెల; ప్రియమైన; వస్తువు కొనుగోలుపై ఆసక్తి      Meaning     (adj) :  dear in price; demand    వాడుక / Usage       జాతీయ టోకు మార్కెట్లలో దొడ్డు బియ్యానికే ఎక్కువ గిరాకి .     National wholesale markets see demand for thick rice.     మెదడుకు మేత / Food for thought      సంజవెలుంగులో పసిడిచాయల ఖద్దరు చీరగట్టి నా      రింజకు నీరువోయు శశిరేఖవె నీవు; సుభద్రసూతినై      రంజిత పాణిపల్లవము రాయుదునా – నిను మౌళి దాల్చి మృ      త్యుంజయమూర్తినై యమునితో తొడగొట్టి సవాలుచేతునా!     -- కరుణశ్రీ జంధ్యాల పాపయ్య శాస్త్రి (ఆగష్టు 4, 1912 - 1992)

వ్యతిరేకము

  ఆగష్టు 01, 2024 వ్యతిరేకము    ( vyathirekamu )     అర్థము      (విశేష్యము ) : విరుద్ధము; వేరు; భిన్నము; ఎదురుచుక్క      Meaning     (noun) :  opposition; disagreement; Anti    వాడుక / Usage       ప్రజా వ్యతిరేక బడ్జెట్‌ పై … రైతన్నల ఆగ్రహం.     Anti people budget...farmers angry.     మెదడుకు మేత / Food for thought      అంజన రేఖ వాల్గనుల యంచులు దాట, మనోజ్ఞ మల్లికా      కుంజములో సుధా మధుర కోమల గీతిక లాలపించు ఓ      కంజదళాక్షి! నీ ప్రణయ గానమ్ములో పులకింతునా – మనో      రంజని! పుష్పవృష్టి పయి రాల్చి నినున్ పులకింపజేతునా!     -- కరుణశ్రీ జంధ్యాల పాపయ్య శాస్త్రి (ఆగష్టు 4, 1912 - 1992)

పుష్కలము

  జులై 31, 2024 పుష్కలము    ( pushkalamu )     అర్థము      (విశేషణము ) : అధికము; సమృద్ధము; 64 ముష్టుల బిచ్చము      Meaning     (adj) :  much; abundant; excellent    వాడుక / Usage       పనసలో పోషకాలు పుష్కలం .. తింటే ఆరోగ్యం!     Abundant nutrients in jack fruit...eat for health!     మెదడుకు మేత / Food for thought      చూచెదవేల నో ప్రణయసుందరి! కాటుక కళ్లలోని ఆ      లోచన లేమిటో హరిణలోచనీ! నీ చిరునవ్వులోని సం      కోచము లెందుకో కుసుమకోమలి! నీ మధురాధరమ్ములో      దాచుకొనంగనేటికి సుధామయసూక్తి కళావిలాసినీ!     -- కరుణశ్రీ జంధ్యాల పాపయ్య శాస్త్రి (ఆగష్టు 4, 1912 - 1992)

రోదనము

  జులై 30, 2024 రోదనము    ( rōdanamu )     అర్థము      (విశేష్యము ) : ఏడ్పు; కన్నీరు; శోకము; ఆక్రందనము; విలాపము      Meaning     (noun) :  weeping; lamentation    వాడుక / Usage       హిందీలో బోధన..గిరిజన విద్యార్థులకు రోదన .     Tribal students lament being taught in Hindi.     మెదడుకు మేత / Food for thought      తీరికే లేని విశ్వ సంసారమందు      అలిసిపోయితివేమో దేవాదిదేవ!      ఒక నిమేషము కన్నుమూయుదువు గాని      రమ్ము! తెరచితి నా కుటీరమ్ము తలుపు!!     -- కరుణశ్రీ జంధ్యాల పాపయ్య శాస్త్రి (ఆగష్టు 4, 1912 - 1992)

తిరస్కారము

  జులై 29, 2024 తిరస్కారము    ( tiraskāramu )     అర్థము      (విశేష్యము ) : అనాదరము; నిరాకరణము; ధిక్కారము      Meaning     (noun) :  rejection; scorn; insult    వాడుక / Usage      మొన్నటి ఎన్నికలలో ప్రజలు మత రాజకీయాలని తిరస్కరించారనే చెప్పాలి.     It has to be said that the electorate rejected religious politics in the recent elections.     మెదడుకు మేత / Food for thought      కూర్చుండ మా యింట కురిచీలు లేవు, ప్రణయాంకమే సిద్ధపరుచుచుంటి ,      పాద్యమ్ము నిడ మాకు పన్నీరు లేదు , నా కన్నీళ్లతో కాళ్ళు కడగనుంటి,      పూజకు మావిట పుష్పాలు లేవు, నా ప్రేమాంజలులే సమర్పింపనుంటి,      నైవేద్యము ఇడ మాకు నారికేళము లేదు, హృదయమే చేతి కందియనుంటి,      లోటు రానీయ నున్నంతలోనా నీకు రమ్ము దయసేయు మాత్మ పీఠమ్ము పైకి,     అమృత ఝరి చిందు నీ పాదాంకముల యందు కోటి స్వర్గాలు మొలిపించు కొనుచు తండ్రీ   ...

హేతువు

  జులై 26, 2024 హేతువు    ( hētuvu )     అర్థము      (విశేష్యము ) : కారణము; ఉపకరణము; ఉద్దేశము       Meaning     (noun) :  cause; reason; purpose    వాడుక / Usage      సోమరితనం వినాశ హేతువు .     Laziness causes destruction.     మెదడుకు మేత / Food for thought      సామెత లేని మాట, ఆమెత లేని ఇల్లు      ( ఒకే భాషలో, ఆ మనుషుల మాటలలో, సాహిత్యంలో సామెతలు, నానుడిలు, చమత్కారాలు లేకపోతే అది విందుభోజనం లేని ఇల్లు లాంటిది. మన తెలుగుకి ఆ దౌర్భాగ్యం లేదు!! సామెతలు, పాటలు, జానపద గేయాలు, యాసలు, మాండలికాలు, కావ్యాలు, పద్యాలు, కథలు, నవలలు ఇంకా ఎన్నెన్నో ఉన్నాయి. కానీ ఉంటే సరిపోదుగా మన రోజువారీ వాడుకలో అవి బ్రతకాలి. లేకపోతే మ్యూసియం లో ఉన్న అవశేషం లాగా పుస్తకాల్లో ఉండిపోతాయి )     -- సామెత

అధ్యాస

  జులై 25, 2024 అధ్యాస    ( adhyasa )     అర్థము      (విశేష్యము ) : ఆసనము; (అద్వైతం)  ఒక వస్తువును చూసినప్పుడు, అది తనకు తెలిసిన మరేదో వస్తువనే భ్రమ కలగడం      Meaning     (noun) :  seat; super impose a known thing on something which is not that    వాడుక / Usage      రజ్జు సర్ప భ్రాంతి అనగా తాడును చూసి దానిని పాముగా  అధ్యాస చేసుకోడం.     Superimposing a serpent on a rope (and experiencing fear) is Adhyasa.     మెదడుకు మేత / Food for thought        అడ్డాల నాడు బిడ్డలు కానీ గడ్డాల నాడు కాదు      ( పెద్దయ్యాక, మాట వినని కొడుకులని గురించి ఇలా అంటారు. )     -- సామెత

తర్కము

  జులై 24, 2024 తర్కము    ( tarkamu )     అర్థము      (విశేష్యము ) :  ఊహ; వాదము; ఒక శాస్త్రము; న్యాయశాస్త్రం      Meaning     (noun) :  science of logic; reasoning; conjecture; discussion    వాడుక / Usage       తర్కాన్ని వాదానికి ఉపయోగపడే శాస్త్రంగానే చుడాలిగాని అదే పరమ సత్యం అనుకోకూడదు.     Logic should be seen as an important tool in reasoning but not as an end in itself.     మెదడుకు మేత / Food for thought        చేతిలో ఉంటే అర్థం, చేరువలో ఉంటే పెళ్ళాం      ( చేతిలో ఉన్న డబ్బే మనడబ్బు.ఎందుకంటే ఈ కాలంలో బ్యాంకులో పెట్టినా అవి కూడా దివాళా తీస్తున్నాయిగదా. అలాగే పెళ్ళాం పక్కనే సహధర్మచారిణి వలె ఉంటూ 24/7ఒక మంచి మిత్రుడు, సలహాదారుగా ఉండాలి.ఎక్కడో ఉంటే ప్రయోజనం శూన్యం.దూరం పెరిగి న కొద్ది ఎలాంటి అనర్ధాలు అయినా కలుగుతాయి అని సున్నితమైన హెచ్చరిక. అందుకే దీనినే సంస్కృతంలో ఇలా చెప్పారు. పుస్తకం వనితా విత్తం పరహస్తం గతం గతం.)   ...

జల్పము

  జులై 23, 2024 జల్పము    ( jalpamu )     అర్థము      (విశేష్యము ) :  ఉపయోగం లేని మాటలు; గొప్పలు; తర్కంలో ఎదుటివారి మాటను ఖండించే పద్ధతి - దీని ఉద్దేశం నిజం తెలుసుకోడం కాదు. కేవలం మనం నమ్మినది నిజం అని చెప్పడమే      Meaning     (noun) :  idle talk; bombast; an argument where an overbearing rejoinder is given    వాడుక / Usage     నేటి చర్చలలో వేడి పుట్టించే జల్పమే కానీ వెలుగు చూపించే సత్యాన్వేషణ లేదు .     Today's discussions are temperature raising bombast rather than finding truth.     మెదడుకు మేత / Food for thought        తిండికి తిమ్మరాజు పనికి పోతరాజు      ( వేల్పులతోకూడిన వెటకారం. తిమ్మరాజు = తిరుమలదేవుడు. ఈయనకు ప్రసాదాలే ప్రసాదాలు. తిన్నంత తిండి. పోతరాజు = నాంచారమ్మ, నూకాలమ్మ, మావూళ్ళమ్మ ఇలాంటి గ్రామదేవతలకు ఒక్కడే తమ్ముడు అవటంవల్ల గారాబంతో ఏపనీ చేయడు. ఒట్టిగా తింటూ ఏపనీ చేయనివారికి వాడతారు)     -- సామెత

వితండము

  జులై 22, 2024 వితండము    ( vithandamu )     అర్థము      (విశేష్యము ) :  ఔననునది కాదని వాదించడం; తలుపు గడియ      Meaning     (noun) :  frivolous argument; lock attached to door    వాడుక / Usage      రాముడు తెలుగులో లే పక్షి ! అన్నాడా? అని ఒక వితండ వాదం లేవదీశారు.     A frivolous argument was raised about the origin story of Lepakshi!     మెదడుకు మేత / Food for thought      నింద లేనిదే బొందె పోదు     ( పూర్వం ఎవరు పోయినా, జనాలు ఎలా పోయాడు అంటే, యముడు తీసుకుని పోయాడు అనే వారట. ప్రతిసారి ఇది విని యముడు వెళ్లి ఈశ్వరుని తో నీ ఆజ్ఞ ప్రకారం కదా నేను వాళ్ళను తీసుకొచ్చేది మరి అందరూ నన్ను నిందిస్తున్నారు ఏంది నాకు ఈ శిక్ష అంటే,  అప్పుడు త్రిమూర్తులు ఆలోచించి,  ఇక నుంచి జీవి ఎదో ఒక రోగము తో పోతాడు, దాంతో నీ పేరు ఎవరు వాడరు అని చెప్పారట.  అప్పటినుంచి, జీవులు ఎదో ఒక కారణంగా పోవడం లేదా పోయిందానిక ఒక కారణం చెప్పుకోడం మొదలు పెట్టారట.) ...

సమయుగ్మజము

  జులై 19, 2024 సమయుగ్మజము    ( samayugmajamu )     అర్థము      (విశేష్యము ) :  యుగ్మ=జత;  జన్యురూపంలో రెండు ఒకే రకమయిన లక్షణాలు ఉండటం      Meaning     (noun) :  two identical versions of same gene; homozygous    వాడుక / Usage      సమయుగ్మజం ఎక్కువగా ఉండే జన శాఖలలో జన్యు వ్యాధులు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది .     In populations with increased levels of homozygosity, there is greater risk of genetic diseases .     మెదడుకు మేత / Food for thought      పరా హి సా గతిః పార్థ యత్తద్బ్రహ్మ సనాతనం  ।      యత్రామృతత్వం ప్రాప్నోతి త్యక్త్వా దుఃఖం సదా సుఖీ  ॥      ( అర్జునా! అవ్యయమైన పరబ్రహ్మ ప్రాణులకి పరమమార్గం. జ్ఞానులు శరీరమే తాము అనుకోకుండా ఆ పరబ్రహ్మతో ఏకమై జీవన్మరణ విముక్తులు అయ్యి సుఖులు అవుతారు. )     -- అనుగీత, అశ్వమేధ పర్వం, మహాభారతం

అనువంశికము

  జులై 18, 2024 అనువంశికము    ( anuvamsikamu )     అర్థము      (విశేష్యము ) :  వంశపారంపర్యము      Meaning     (noun) :  heredity    వాడుక / Usage     అనువంశికంగా సంక్రమించే వ్యాధులను గుర్తించడంలో వైద్యరంగం ముందడుగులు .     Medical science has made strides in detecting hereditary diseases.     మెదడుకు మేత / Food for thought       కుర్యాత్ సర్వాణి కర్మాణి మదర్థం శనకైః స్మరన్ ।     మయి అర్పిత మనః చిత్తః మత్ ధర్మ ఆత్మమనోరతిః ॥          ( నన్ను స్మరిస్తూ, చేసిన కర్మలన్ని భగవతార్పణ బుద్ధితో చేస్తూ, మనస్సు, చిత్తం నా మీద ఉంచి నాపై భక్తితో ఆనందించవలెను )     -- ఉద్ధవ గీత

శిలీంధ్రము

  జులై 17, 2024 శిలీంధ్రము    ( ṣilīndhramu )     అర్థము      (విశేష్యము ) :  అరటిపువ్వు; పుట్టగొడుగు      Meaning     (noun) :  flower of plantain tree; mushroom; fungus    వాడుక / Usage      రాష్ట్రంలో  వేపచెట్లకు   శిలీంధ్రాల వైరస్‌ సోకి ఎండిపోతున్నాయి..     Neem trees in the state are rotting away due to fungal infestation.     మెదడుకు మేత / Food for thought       యదా నాహం తదా మోక్షో యదాహం బంధనం తదా |       మత్వేతి హేలయా కించిత్ మా గృహాణ విముంచ మా ||         ( అహంకారము లేనిచో – అప్పుడు మోక్షము. అహంకారము ఉన్నచో – అప్పుడు బంధము. ఇది నిశ్చయించి – విలాసముగా – దేనిని పట్టుకొనక, వదలక ఉండుము. )     -- అష్టావక్ర  గీత

క్షీరదము

  జులై 16, 2024 క్షీరదము    ( ksheeradamu )     అర్థము      (విశేష్యము ) :  క్షీరగ్రంథులుగల జంతువు, పాలిచ్చు జంతువు      Meaning     (noun) :  mammal    వాడుక / Usage      అరుదైన క్షీరదము : అంతరించి పోతున్న అలుగు.     Rare mammal : dwindling numbers of pangolin.     మెదడుకు మేత / Food for thought       యథేంద్రియైః పృథగ్ద్వారైరర్థో బహుగుణాశ్రయః |      ఏకో నానేయతే తద్వద్భగవాన్ శాస్త్రవర్త్మభిః ॥         ( శబ్ద, స్పర్శ, రూప, రస, గంధాది గుణములకు ఆశ్రయమైన ఒకే పదార్థము వేర్వేఱు ఇంద్రియముల ద్వారా వేర్వేరు రూపములలో గోచరించునట్లు, శాస్త్రముల యొక్క వేర్వేరు మార్గముల ద్వారా ఒకే భగవంతుడు అనేక విధములుగా గోచరించును. )     -- కపిల గీత, భాగవతం మూడవ స్కంధం

జన్యుశాస్త్రం

  జులై 15, 2024 జన్యుశాస్త్రం    ( janyusaastram )     అర్థము      (విశేష్యము ) :  వారసత్వ గుణాలను అధ్యయనం చేసే శాస్త్రం      Meaning     (noun) :  genetics    వాడుక / Usage      మనిషి మాట్లాడింది ఎప్పుడు అన్న అంశంలో శిలాజాలు, జన్యుశాస్త్రం మంచి ఫలితాలను ఇస్తోంది.     The key to origin of language is being answered by fossils and genetics.     మెదడుకు మేత / Food for thought       సర్వకర్మాణి మనసా సన్న్యస్యాస్తే సుఖం వశీ       నవద్వారే పురే దేహీ నైవ కుర్వన్న కారయన్          ( నవ రంధ్రాలు గల శరీరమును, తొమ్మిది ద్వారాలు గల పట్టణంతో పోల్చుతున్నాడు శ్రీ కృష్ణుడు. జీవాత్మ ఆ పట్టణానికి రాజు, దాని పరిపాలన అంతా అహంకారము, బుద్ధి, మనస్సు, ఇంద్రియములు మరియు జీవ-శక్తి అనే మంత్రిత్వ శాఖల ద్వారా నడిపింపబడుతాయి. కాలము, మృత్యు రూపంలో, శరీరాన్ని తీసివేసే వరకూ, ఈ శరీరంపై రాజ్యపాలన కొనసాగుతుంది. కానీ, పాలన కొనసాగుతున్నప్పుడ...

భత్యము

  జులై 12, 2024 భత్యము    ( bhatyamu )     అర్థము      (విశేష్యము ) : ప్రయాణం/భోజనం ఖర్చులకు చెల్లించే సొమ్ము      Meaning     (noun) :  allowance    వాడుక / Usage      ప్రభుత్వ పాఠశాలల్లో కాంట్రాక్టు ఉద్యోగులకు బాధ్యత ఎక్కువ భత్యం తక్కువ .     Contract workers in government schools have lot of duties but get meagre allowance.     మెదడుకు మేత / Food for thought      అశోకవనమున సీతా      శోకించె వియోగము చేతా      కంటికి మంటికి ఏకధారగా      కారేను వేడి కన్నీరు కారెను వేడి కన్నీరు      ఆ కన్నీరే లంకాపురమున      ఐనది పెద్ద కోనేరు      పతినీ తననూ విడదీసె      చెరపెట్టెను క్రూర రావణుడు      చెరపెట్టెను క్రూర రావణుడు      భరించలేని నరకమది      విడిపించను రాడా రాముడు      శీలవతి ఆ సీత గతి చూచిన ...

ప్రవాళము

  జులై 11, 2024 ప్రవాళము    ( pra-vāḷamu )     అర్థము      (విశేష్యము ) : పగడము; చిగురు; వీణ యొక్క దండము      Meaning     (noun) :  coral; sprout; neck of Veena    వాడుక / Usage     ప్రవాళలు సముద్ర మట్టముకన్న ఎక్కువ ఎత్తుకు వచ్చినప్పుడు జీవించలేవు .     Corals don't survive when they are too higher than the seabed.     మెదడుకు మేత / Food for thought        నీలగగన ఘనశ్యామా!      హాని కలిగితే - అవతారాలను      పూని బ్రోచునదీ - నీవేకావా      చదువులు హరించి - అసురం డేగిన      జలచరమైతివి - ఆగమరూపా      వేద నిదులనే - విధాత కొసగిన      ఆదిదేవుడవు - నీవే కావా      కడలి మదించగ - కదిలే నగమును      వెడలి కూర్మమై - వీపున మోసి      అతివ రూపమున - అమృతం గాచిన      ఆదిదేవుడవు -  నీవే కావా      సుజనుల కో...