Posts

Showing posts from October, 2024

చోద్యము

  అక్టోబర్ 31, 2024 చోద్యము  ( chōdyamu )     అర్థము      (విశేష్యము ) : వేడుక; వినోదము; ఆశ్చర్యం; ప్రశ్నించదగ్గది; వింత    Meaning     (noun) : wonder; marvel; questionable; astonishment    వాడుక / Usage       గుంటూరు జిల్లాలో రెచ్చిపోతున్న రౌడీ షీటర్లు - చోద్యం చూస్తున్న పోలీసులు.     Anti social elements terrorize Guntur - police silent spectators in astonishment.     మెదడుకు మేత / Food for thought     మ్రాను కాలవేసి మహిమీద నొకజాణ     పూని తిరుగుచుండు బొందుగాను     కాలవేయు మ్రాను కడు రమ్యముగనుండు      విశ్వదాభిరామ వినురవేమ     (Burning the tree of earthly ties, the wise man engaging himself in wisdom proceeds with propriety. The tree thus burnt will be very delightful.)     -- వేమన (~ 1652), ఆంగ్ల అనువాదం - సి పి బ్రౌన్ (1798 - 1884)

గరిడి

  అక్టోబర్ 30, 2024 గరిడి  ( gariḍi )     అర్థము      (విశేష్యము ) : కత్తి సాము; చోటు; సమీపము; ఒక జానపద కళ    Meaning     (noun) : fencing; a place; nearby; a folk art    వాడుక / Usage       ఆరు నెలలు గరిడి సాము నేర్చుకొని మూల ముక్కుతున్న ముసలమ్మని ఒకే ఒక్క పెట్టుతో      పడగొట్టేసాన్ననాడుట  వెనకటికెవడో .     Its akin to an expert swordsman striking down a decrepit woman and boasting about it.     మెదడుకు మేత / Food for thought     శిలలు జూచి నరులు శివుడిని మెత్తురు     శిలలు శిలలుగాని శివుడు గాదు     తనదులోని శివుని దానేల దెలియడో     విశ్వదాభిరామ వినురవేమ     (Men imagine stones to be Siva and magnify them. Stones are stones and not Siva. Why is it that we cannot discern Siva who dwells within us?)     -- వేమన (~ 1652), ఆంగ్ల అనువాదం - సి పి బ్రౌన్ (1798 - 1884)

ఇడుము

  అక్టోబర్ 29, 2024 ఇడుము  ( idumu )     అర్థము      (విశేష్యము ) : దారిద్ర్యము; లేమి; కష్టం    Meaning     (noun) : poverty; hardship    వాడుక / Usage       పసిబాలునిగా ఎన్నో ఇడుముల గరళము గళమున దాల్చాడు .     As a child he had to bear many a hardship.     మెదడుకు మేత / Food for thought     కనకమృగము భూమి కలదు లేదనుటయ్యె     రాము నంత వెర్రి రాజు గలడె     పురముదప్పి పోషబుద్ధులు నిలువవు     విశ్వదాభిరామ వినురవేమ     (Rama did not consider whether there were golden deer in the world or not? What a naive king he is! If you leave your town and roam, your senses will take leave of you!!)     -- వేమన (~ 1652), ఆంగ్ల అనువాదం - సి పి బ్రౌన్ (1798 - 1884)

ఇహము

  అక్టోబర్ 28, 2024 ఇహము  ( ihamu )     అర్థము      (విశేష్యము ) : ఈ లోకము; భూలోకము    Meaning     (noun) : here; this world; earth    వాడుక / Usage       ఆచారం లేనివాడికి ఇహం లోనూ, పరంలోనూ సుఖం లేదు .     One who follows no customs is happy neither here nor in the beyond.     మెదడుకు మేత / Food for thought     దూరబుద్ధి జేయు దూరమౌ దైవంబు     తనువు బుద్ధిజేయు తగులునపుడు     జీవబుద్ధి జేయ దేవుడై నిల్చురా     విశ్వదాభిరామ వినురవేమ     (If you consider the deity far removed from you, He shall be far from you. If you consider the body as His dwelling He shall dwell therein. If you hold that life is His vehicle then you shall remain unaffected/unattached as Him.)     -- వేమన (~ 1652)

అభ్యుత్థానము

  అక్టోబర్ 25, 2024 అభ్యుత్థానము  ( abhy-uthhānamu )     అర్థము      (విశేష్యము ) : అభి=ఎదురు,ఉత్థానము=లేచుట;   పెద్దలు వచ్చినప్పుడు లేచి ఎదురు వెళ్లడం; మర్యాద చేయడం    Meaning     (noun) : rising to welcome a person    వాడుక / Usage       ధర్మానికి నాశనం, అధర్మానికి అభ్యుత్థానం కలిగినప్పుడు పరాక్రమాన్ని  పుట్టిస్తాను.     According to our tradition a guest who arrives for dinner is considered Vishnu himself.     మెదడుకు మేత / Food for thought     నాలుగు కాగితాలున్న చిన్న పుస్తకం గాలికి రెపరెపలాడుతూ విర్ర వీగుతుంది. సర్వస్వాన్నీ తనలో ఇముడ్చుకున్న మహాద్గ్రంథం నమృతగా వొత్తిగిల్లి ఉంటుంది. నీ దయవల్ల ప్రపంచాన్ని మరో కోణంలో చూసి మహాద్గ్రంథాన్ని అయ్యానని పొరబడ్డాను. ప్రణవి కలిసి అతి ముఖ్యమైన పదాన్ని ఆఖరి పేజీలో చూపించింది. ఓ తథాగతా ఆ పదం ... .....      -- అంతర్ముఖం, యండమూరి వీరేంద్రనాథ్

అభ్యాగతుడు

  అక్టోబర్ 24, 2024 అభ్యాగతుడు  ( abhy-āgatuḍu )     అర్థము      (విశేష్యము ) : భోజనంకి వచ్చిన అతిథి; ఎదురుగా వచ్చినవాడు    Meaning     (noun) : one who comes for dinner; guest    వాడుక / Usage       అభ్యాగతుడు స్వయంగా విష్ణుమూర్తి వంటివాడని పెద్దలంటారు.     According to our tradition a guest who arrives for dinner is considered Vishnu himself.     మెదడుకు మేత / Food for thought     "ఏమిటి చాలా దిగులుగా ఉన్నావు" అని అడిగాడు. నేను సమాధానం చెప్పలేదు.    "పది రోజులవరకు అలాగే ఉంటుంది. 'కర్మ' అయిపోగానే మనకి ఇక భూమ్మీద సంగతులేమీ గుర్తుండవు" అన్నాడు.    "నీకెలా తెలుసు?" అని అడిగాను.    "ఊహించాను".    "నువ్వు మత ప్రవక్తవా? కేవలం మత ప్రవక్తలు, రాజకీయ నాయకులు మాత్రమే తమ భావాల్ని వాస్తవంగా కల్పించి చెపుతారు."     -- అంతర్ముఖం, యండమూరి వీరేంద్రనాథ్

అభ్యాసము

  అక్టోబర్ 23, 2024 అభ్యాసము  ( abhyāsamu )     అర్థము      (విశేష్యము ) : మరల మరల చేయుట; సాధన; సమీపము    Meaning     (noun) : practice; continued use/repetition; near    వాడుక / Usage       నిరంతర అభ్యాసంతోనే ఉజ్వల భవిత .     Continuous learning and practice enables a bright future.     మెదడుకు మేత / Food for thought     మీరెవరైనా ఎపుడైనా చావుని అనుభవించారా? చచ్చు ప్రశ్న. నిజంగానే చావుకు ముందు నా మతి పోతోంది. లేకపోతే చావుని అనుభవించడమేంటి? అదేమీ నెలకీ, సంవత్సరానికీ ఒకసారి వచ్చే అనుభవం కాదుగదా! నేనీ ప్రశ్న ఎందుకడుగుతున్నానంటే, ఇప్పుడు నేను చావుని అనుభవిస్తున్నాను కాబట్టి. నిజంగా ఇంత దుర్భరమైన స్థితి పగవాడికి కూడా వద్దు.     -- అంతర్ముఖం, యండమూరి వీరేంద్రనాథ్

అభ్యంగనము

  అక్టోబర్ 22, 2024 అభ్యంగనము  ( abhyanganamu )     అర్థము      (విశేష్యము ) : వంటికి నూనె రాసుకొనుట; తలంటు    Meaning     (noun) : rubbing the body with oil; head bath    వాడుక / Usage       పిచ్చి పీక్స్.. బీరుతో అభ్యంగన స్నానాలు.. ఈ సమస్యలొస్తాయ్ .     Heights of madness..beer baths..causes these problems.     మెదడుకు మేత / Food for thought     నాడి చూస్తాడు. నాన్న పోయారని చెపుతాడు. అందరూ ఏడవటం ప్రారంభిస్తారు. ఒక ప్రాణి ఈ లోకం నుంచి నిష్క్రమించటాన్ని అంత వేదనా భరితం చేయటం ఎందుకనిపించింది. నిశ్శబ్దంగా, నిర్వేదంగా ఒక వేదాంత భావంతో అలా కూర్చుని వున్నాను. ఆయన యెంత కష్టపడి చదివి పైకి వచ్చిందీ, ఎక్కడో కోనసీమలో ఒక బీదకుటుంబంలో పుట్టి మమ్మల్ని ఎలా వృద్ధిలోకి తెచ్చిందీ ఆలోచిస్తూ మధ్య మధ్యలో ఆ పెదవుల మధ్య తులసి తీర్థం పోస్తూ కూర్చునే ఉన్నాను.     -- అంతర్ముఖం ముందుమాట, యండమూరి వీరేంద్రనాథ్

అభ్యంతరము

  అక్టోబర్ 21, 2024 అభ్యంతరము  ( abhyantaramu )     అర్థము      (విశేష్యము ) : అన్ని దిక్కులకు మధ్య స్థలం; లోపల; విఘ్నము; అడ్డు    Meaning     (noun) : central/included place; obstacle; objection    వాడుక / Usage       సన్నరకం ధాన్యంపై మిల్లర్ల అభ్యంతరాలు .     Millers raise objections to small grains.     మెదడుకు మేత / Food for thought     పెర్సనాలిటీ అన్న పదం 'పెర్సొనే' అన్న లాటిన్ పదం నుంచి వచ్చింది. పెర్సొనే అంటే ముసుగు. అదే వ్యక్తిత్వం. మొహం మీదా మనసు మీదా వున్న పొర.     -- అంతర్ముఖం, యండమూరి వీరేంద్రనాథ్

పరారుణ

  అక్టోబర్ 18, 2024 పరారుణ  ( paraaruna )     అర్థము      (విశేష్యము ) : పర + అరుణ  ( ఎరుపు );   వర్ణపటంలో  మానవ కంటికి కనిపించని ఎరుపుకంటే తక్కువ పౌనఃపున్య కిరణాలు    Meaning     (noun) : infrared    వాడుక / Usage       చీకటిలో చూడాలన్నా, ఛానెళ్లు మారాలన్నా పరారుణ కిరణాల సాయం కావాల్సిందే .     To see in the dark or to change channels we need infrared rays.     మెదడుకు మేత / Food for thought     అంతరిక్షనౌకలో కాంతి వేగంతో ప్రయాణం చేస్తూ హెడ్ లైట్స్ వేస్తే, ఏమన్నా అవుతుందా ?     -- స్టీవెన్ రైట్ (స్టాండ్ అప్ కమెడియన్ ) 

పౌనఃపున్యము

  అక్టోబర్ 17, 2024 పౌనఃపున్యము  ( paunah-punyamu )     అర్థము      (విశేష్యము ) : మరలమరల చెప్పుట; ఒక కాల పరిమితిలో కంపనాల సంఖ్య    Meaning     (noun) : constant repetition; frequency    వాడుక / Usage       ఇది మొదటి A-ప్రాసెసర్, దీని పౌనఃపున్యము  3 గిగా హెర్ట్జ్ కంటే ఎక్కువ.     This is the first A-processor with a frequency upwards of 3 GHz.     మెదడుకు మేత / Food for thought     భగవంతుడు ఒక  పౌనఃపున్యము. ఎల్లప్పుడూ సుతికూర్చియుండు - అలాన్ కోహెన్     యంత్రాలు మిక్కిలి తరచుగా నన్ను అబ్బురపరుస్తాయి - అలాన్ టూరింగ్ (జూన్ 23, 1912 - 1954)

సరితూనిక

  అక్టోబర్ 16, 2024 సరితూనిక  ( sari-tūnika )     అర్థము      (విశేష్యము ) : సరి = సమానము, తూనిక = తూచుట, పోలిక; సమముగా తూచుట;  సమతౌల్యం    Meaning     (noun) : equilibrium; balance    వాడుక / Usage      వ్యర్థాలను పరిగ్రహించి, రక్తప్రసరణకు తోడ్పడే మూత్రపిండాలు శరీర సరితూనికను కాపాడతాయి .     Kidneys maintain the equilibrium of the body by extracting waste and aiding circulation.     మెదడుకు మేత / Food for thought      మానవాళి మొత్తం లేకుండా పోతే ప్రపంచం పది వేల ఏళ్ళు క్రితం ఉన్న ఉన్నతమైన సమతుల్యం మళ్ళీ పొందుతుంది. కానీ అదే పురుగులు లేకుండాపోతే పర్యావరణం మొత్తం అస్తవ్యస్తం అయిపోతుంది.     -- ఎడ్వర్డ్ విల్సన్   (జూన్ 10, 1929 - 2021)

తాపగతి

  అక్టోబర్ 15, 2024 తాపగతి శాస్త్రం   ( taapagathi )     అర్థము      (విశేష్యము ) : ఉష్ణ గతిక శాస్త్రం;  విభిన్న వస్తువుల మధ్య ఉష్ణ కదలికను అధ్యయనం చేసే భౌతిక శాస్త్ర విభాగం    Meaning     (noun) : thermodynamics     వాడుక / Usage       తాపగతి శాస్త్రపు సూత్రాలకి తల ఒగ్గుతూ, ప్రాణి పుట్టుకొచ్చిందని నమ్మకం.     It is believed that life originated following the laws of thermodynamics.     మెదడుకు మేత / Food for thought      తాపగతీ శాస్త్రం చిత్రమైన అంశం. మొదటి సరి చదివినపుడు ఏమీ అర్థం కాదు. రెండో సారి, ఒకటీ రెండు అంశాలు తప్ప అంతా అర్థం అయినట్లు అనిపిస్తుంది. మూడో సారి చూసినపుడు మనకి అర్థం కాలేదు అన్న విషయం స్పష్టంగా తెలుస్తుంది కానీ ఆ తెలియనితనానికి అలవాటు పడిపోయి అది మనల్ని ఇబ్బంది పెట్టడం మానేస్తుంది.     -- ఆర్నాల్డ్ సోమెర్‌ఫెల్డ్  (1868 - 1951)

సేంద్రియ

  అక్టోబర్ 14, 2024 సేంద్రియ    ( sendriya )     అర్థము      (విశేషణము ) :  మొక్కల, జంతువుల ఇంద్రియ / అంగ సంబంధమైన, సహజమైన    Meaning     (adj) : organic     వాడుక / Usage       చెత్త సేకరణ సరే.. సేంద్రియ ఎరువు ఏది?     Garbage collection is a good step..but where is organic fertilizer?     మెదడుకు మేత / Food for thought      రంగు ఉంది అని మనం అనుకుంటాం. అలాగే ఇది తియ్యగా ఉంది అది చేదుగా ఉంది అని భావిస్తాం. కానీ వాస్తవానికి ఉన్నది కేవలం అణువులు మరియు శూన్యం.     -- డెమోక్రిటస్ (క్రీ.పూ 460 - 370 )

ప్రాశనము

  అక్టోబర్ 11, 2024 ప్రాశనము    ( prāṣanamu )     అర్థము      (విశేష్యము/క్రియ ) : భోజనము; తినిపించుట    Meaning     (noun/verb) : food; feed; tasting; eating     వాడుక / Usage       కర్నూలులో 15 ఏళ్ల బాలుడికి అన్న ప్రాశన .. ఆసక్తికర కారణం .     Fifteen year old from Kurnool tastes solid food for the first time.     మెదడుకు మేత / Food for thought       ”మీరేమో పరమ శుచిమంతులు, మంచి ఇంట్లో వాసం చేయక శ్మశానం లో ఉన్నారేమి   స్వామీ?” ”భయంకరమైన భూతాలు, ప్రజలను చంపుతూ బాధలు పెట్టేవి. అప్పుడు బ్రహ్మగారు నా దగ్గరకొచ్చి ’శివా! జీవులను కాపాడే మార్గం చూడవయ్యా’ అని అడిగితే భూతాల నివాసమైన శ్మశానం లో నివాసం ఏర్పాటు చేసుకున్నా, అవి నా కనుసన్నలలో ఉండటంతో లోకాలు రక్షింపబడ్డాయి. మోక్షపరులు ఇది శుచిస్థానం అంటారు, జనం తిరగరు, అందుకు ఇక్కడనుంచి లోకాలను రక్షించాలనుకున్నా”. ”ఈ బూడిద రాసుకోడం, పాములు ధరించడం, శూలం,పరశువులు ఆయుధాలు, భీకరమైన రూపం ఏమి స్వామీ?.” ”లోక స్వరూపం రె...

బాలెంత

  అక్టోబర్ 10, 2024 బాలెంత    ( bālinta )     అర్థము      (విశేష్యము ) : క్రొత్తగా ప్రసవించిన స్త్రీ; ప్రసూత    Meaning     (noun) : a woman who has given birth     వాడుక / Usage       బాలింతలు త్వరగా కోలుకోవాలా? ఈ పోషకాలు ఉండే ఆహారం తప్పనిసరి .     Want to quickly regain postpartum health? This nutritious diet is a must.     మెదడుకు మేత / Food for thought      గోజిలలో ఆవకాయ పెట్టడంలో వైవిధ్యం ఎక్కువ. చెప్పుకోవాలంటే పులిహోర ఆవకాయ,పెసరావకాయ,శనగల ఆవకాయ, నూపిండి ఆవకాయ ఇలా ఎన్నో, ఎన్నో రకాలు. ఈ రకాల ఆవకాయలకి అన్నిటికి ఒక ప్రత్యేకత, ముక్కలు చిన్న చిన్నవిగా ఉండాలి. డొక్క ఉంటే సరి,లేకున్నా ఫరవాలేదు.. ఎంత చిన్నవైతే ముక్కలు, అంత మంచిది. ఈ ఆవకాయలు నిలవ ఉండేది తక్కువ. ఊరగాయల కాలంకి మూడు నాలుగు నెలల్లో అవకొట్టేయాలి, లేకపోతే బూజెక్కిపోతాయి .  పులిహోర ఆవకాయకి ముక్కలు చిన్నవిగా ఉంటాయి,మెంతి,కారం,ఉప్పు పోస్తారు, నూనెతో గుచ్చెత్తుతారు. ఆపై ఎండు మిర్చి ముక్కలు చేసుకుని, ...

బారసాల

  అక్టోబర్ 09, 2024 బారసాల    ( bārasāla )     అర్థము      (విశేష్యము ) : శిశువు పుట్టిన పదకొండవ రోజు చేసే సంస్కారం; బాలసారె; నామకరణం; తొట్టెల    Meaning     (noun) : a ceremony, typically on 11th day after birth, to name the child     వాడుక / Usage      బాలశౌరి కృష్ణుడికి, బాలసారె  కావాలెనా! గర్గి మహర్షి కృష్ణుడు అని పిలవమన్నాడు.     Krishna the brave boy, does he need a naming ceremony! Sage Gargi called him Krishna.      మెదడుకు మేత / Food for thought      సముద్రంలో భూమి ఉందా,భూమి మీద సముద్రం ఉందా? వికట ప్రశ్న. పంచభూతాల సృష్టి క్రమం చూస్తే ముందు పుట్టినది, ఆకాశం, దానినుంచి పుట్టినది వాయువు, వాయువునుంచి అగ్ని పుట్టింది, అగ్ని నుంచి నీరు పుట్టింది,నీటి నుంచి భూమి పుట్టింది. ఇప్పుడు చెప్పండి నీటిలో భూమి ఉందా? భూమి మీద నీరు ఉందా? అదే సముద్రే వసనే దేవీ, పర్వతే స్తన మండలే, భూమిపైనున్న పర్వతాలని స్తనాలతో పోల్చారు. ఎందుకు? బిడ్డ పుట్టినప్పటినుంచి తల్లి ఆ...

పువ్వుముడుపు

  అక్టోబర్ 08, 2024 పువ్వుముడుపు    ( puvvu-muḍup u )     అర్థము      (విశేష్యము ) :  గర్భిణీ స్త్రీకి సీమంత సమయములో కొప్పులో పూలు ముడుచుట; సీమంతము    Meaning     (noun) : p lacing flowers in the hair, a ceremony for pregnant woman    వాడుక / Usage      ఆమె పువ్వుముడుపు సంబరం రంగరంగ వైభవంగా జరిగింది.     Her baby shower was celebrated with pomp and gaiety.     మెదడుకు మేత / Food for thought      పెళ్ళికి తాళి కట్టేటపుడు రెండు గట్టిముడులు ఒక జారు ముడీ వేయాలంటారు. ఇలా రెండు మంగళ సూత్రాలూ రెండు సార్లు కట్టిస్తారు.పెళ్ళి తరవాత బ్రహ్మగారు ఇద్దరి చెంగులూ కలిపి ముడేస్తారు దీనిని ‘బ్రహ్మ ముడి’ అంటారు. అది మళ్ళీ ఆయనే విప్పాలి, మనం విప్పుకోకూడదు.మన మనసులు ముడేసుకోవాలి, ఆ ముడి రోజురోజుకీ బిగవాలి. పై బ్రహ్మగారు ఎవరితో ముడేస్తే వారితో జీవితాంతం గడపాలి, తనువులెలాగా ముడిపడతాయి, మనసులు ముడిపడటమే ముఖ్యం.. పితృ కార్యాలలో దర్భతో ‘పవిత్ర’మని ఒక ముడి వేసి ఉంగరం వేలుకి పెడతా...

చీరచిక్కు

  అక్టోబర్ 07, 2024 చీరచిక్కు    ( cheera-chikku )     అర్థము      (క్రియ ) : చీర చాలకపోవడం; గర్భవతి అవ్వడం    Meaning     (verb) : becoming pregnant    వాడుక / Usage      కొద్ది కాలానికి వారి ప్రార్థనలు సాకారముకాగా ఆమె చీరచిక్కెను .     In due course their prayers were answered and she became pregnant.     మెదడుకు మేత / Food for thought      గోదారమ్మంటే మాకు ప్రాణం. అమ్మకి చెరొకపక్కా ఉంటాం కనక మమ్మల్ని తూ.గో.జి, ప.గో.జి అంటారు తప్పించి మేంమంతా ఒకటే. కోస్తాలో ఉత్తర దక్షణాలను కలుపుతూ అమ్మ మీద ఒక వంతెన నిర్మించాడో తెల్లవాడు, వాడిపేరు హేవ్ లక్, ఆ పేరే పెట్టేరు వంతెనకి కూడా. తెల్లవాడు వాడి తాతముల్లె తెచ్చి కట్టించలేదు, మన సొమ్ముతోనే కట్టించేడు, గట్టిగానే కట్టించేడు, నాటి రోజులకి నలభై వేలకి,మూడేళ్ళలోపు, వందేళ్ళు మన్నింది. వంతెనకి రంగెయ్యడానికయిన ఖర్చు ఆరు రూపాయలు అక్షరాలా,ఆ రోజులలో. వంతెనకంత చరిత్ర వుంది. -- " గోదావరి వంతెన –  తెలుగువారి గుండె చప్పుడు, ఆయ్!." (htt...

జేగీయమానము

  అక్టోబర్ 04, 2024 జేగీయమానము    ( je-geeya-manamu )     అర్థము      (విశేష్యము ) :  మిక్కిలి కొనియాడదగినది; జేజేలు పాడ తగినది    Meaning     (noun) : singing praise worthy    వాడుక / Usage       సహస్రాబ్దాల సంస్కృతీ వారస త్వం, మరే భాషకూ లేని తలకట్టు ధీమత్వంతో జేగీయమానమై తరతరాలుగా తెలుగువారి విజ్ఞాన దాహార్తిని తీరుస్తూ వచ్చింది మన మాతృ భాషే.       With millennia of cultural heritage, heady confidence (in lettering) worthy of lofty praise, our mother tongue has been the eternal spring quenching our thirst for knowledge.     మెదడుకు మేత / Food for thought     ఇంద్రియావళి మనస్సులో విలీనం చేసి మనస్సహంకారంలో అణగించి, అహంకారం బుద్ధితో మేళవించి, బుద్ధి ప్రకృతిలో అణగించిన యెడల క్రమక్రమంగా నిర్గుణ ధ్యాన తత్పరత అలవరుపడుతున్నది. అట్టి నిశ్చల ధ్యాన నిష్ఠ వల్ల క్రమశః అజరామరము, నిర్వికల్పము, విమలము అయిన పరబ్రహ్మ సాక్షాకృతి లభిస్తున్నది. అట్టి మహాయోగి నివాత నిశ్చల దీపకళి...

లవలేశము

  అక్టోబర్ 03, 2024 లవలేశము    ( lava-lēṣamu )     అర్థము      (విశేష్యము ) : చాలా తక్కువ; అత్యంత అల్పము    Meaning     (noun) : very little    వాడుక / Usage       ఎవరి శ్రమ భారమైనా ఉచితంగా లవలేశమైనా తీసుకోకూడదు .       Don't use anyone's effort, even if very little, for free .     మెదడుకు మేత / Food for thought     మిక్కుటమైన భోగలోభం విపరీత మోహావేశం కలిగిస్తుంది. దానివల్ల మనస్సు ఆవసమైన యెడల దైనందిన ధర్మ విఘాతం సంఘటిల్లుతున్నది. పాపాలు ఆచరించవలెనన్న సంకల్పం ఉద్భవిస్తున్నది. అవి పరిశీలించి, నిగ్రహించి సజ్జన సాంగత్యంతో కాలం వెళ్లబుచ్చిన యెడల విషయాసక్తి సడలగలదు, ధార్మికబుద్ధి పుడుతుంది. ఆ ధర్మాచరణతో సంతృప్తి చెందక ద్వంద్వాతీతుడైన మానవునికి అపాయ విరహితమైన ఉపాయం గోచరిస్తుంది. దానివల్ల అనతికాలంలో మోక్షం కరతలామలకం కాగలదు. -- భీష్ముడు ధర్మరాజుతో, శాంతి పర్వం - శ్రీ మహాభారతం