Posts

Showing posts from November, 2024

భుజగము

  డిసెంబర్ 03, 2024 భుజగము  ( bhujagamu )     అర్థము      ( విశేష్యము ) : వంకర టింకరగా పోవునది;   పాము    Meaning     (noun) : that which moves in curves; snake    వాడుక / Usage       గౌరీప్రియాయ రజనీశ కళాధరాయ కాలాంతకాయ భుజగా ధిప కంకణాయ .      One who is dear to Gowri; and adorned by a phase of the lord of the night (moon); who ends time (by granting Moksha); and wears the Lord of snakes as an arm band .     మెదడుకు మేత / Food for thought నటనకు కొత్త అర్థాన్ని చెప్పిన అసమాన నటుడు బళ్ళారి, రాఘవ. “మా బెంగాలీ నటులు బెంగాల్‌కు మాత్రమే గొప్ప నటులుగానీ, యావద్భారత దేశంలోనూ అతి గొప్ప నటుడు ఆంధ్రదేశానికి చెందిన బళ్ళారి రాఘవే”నని విశ్వకవి రవీంద్రనాథ టాగోర్‌ చేత కీర్తింపబడిన నటుడు బళ్ళారి రాఘవ, తెలుగు రంగస్థల నటనలో సుదీర్భ మైన రాగాలాపనకూ ఆతి నాటకీయతకూ స్వస్తి చెప్పి, చక్కని హావభావ ప్రకటనకు పట్టంగట్టిన బళ్ళారి రాఘవ  నాటకరంగాన్నే ఒక్క ఊపు ఊపారనడం అతిశయక్తి కాజాలదు. “రామరాజ చరి...

జటాధర

  డిసెంబర్ 02, 2024 జటాధర  ( jataadhara )     అర్థము      (విశేష్యము ) : జట (జడ) లను ధరించువాడు; సన్యాసి; శివుడు    Meaning     (noun) : one who wears matted locks; monk; Shiva    వాడుక / Usage       కర్పూరకాంతి ధవళాయ జటాధరాయ దారిద్ర్యదుఃఖ దహనాయ నమశ్శివాయ .      One with radiant splendour as camphor and sporting matted locks; salutations to Shiva, who incinerates the sorrow caused by lack of Gnyana .     మెదడుకు మేత / Food for thought      ఛలోక్తులు విసరడంలో రఘుపతి వెంకటరత్నం నాయుడు గారు సిద్ధహస్తులు. ప్రసిద్ద మైన ఆయన ఛలోక్తులలో ఇదిగో ఇది ఒకటి: ఆయన బందరు నోబుల్‌ కాలేజీలో కొంతకాలం లెక్చరర్‌గా పనిచేశారు. ఆ రోజుల్లో ఆయన హైస్కూలు పాఠాలు కూడా చెప్పేవారు. ఒకరోజు ఆయన కాంపో జిషన్‌ పుస్తకాలు (40) పట్టుకొని ఇంటికి బయల్టేరారు. ఎదురుగా ఓ విద్యార్థి వచ్చాడు, గురువుగారిని చూసి నవ్వుకొని. “అయ్యో! మాస్టారుగారు గాడిద బరువు మోస్తున్నారు” అన్నాడు. దానికి నాయుడుగారు నవ్వుతూ-...

జఘనము

  నవంబర్ 29, 2024 జఘనము  ( jaghanamu )     అర్థము      (విశేష్యము ) : మొల; కటి స్థలము; పిరుదులు    Meaning     (noun) : haunches; hips; loin    వాడుక / Usage      ఎంత సుందరము శిల్ప బంధురము ఈ జఘన మండలము సృష్టి నంతటిని దాచుకున్న పృథివీ మండలము .      How beautiful are the fulsome hips that behold the whole creation fecund like earth .     మెదడుకు మేత / Food for thought     భుజాలపై ఎండ యొక్క పసుపుపచ్చ శాలువా కప్పుకుని     రహదారి పక్కనే చడీ చప్పుడు లేకుండా నుంచున్న     మనిషిలా ఆనుతున్న ఒక చెట్టుని నేను అడిగాను     సత్రానికి దారి ఏదని..     అది బదులు ఇవ్వలేదు,     మళ్ళీ అడిగాను అయినా మాటలాడలేదు     ముందుకు సాగడానికి సిద్ధమవుతుంటే     ఎదో అన్నది కదా అనిపించింది...     నేనే కాబోలు దాని భాషని     అర్థం చేసుకోలేదు, ఆ భాష     ఓ నీడ లాగా వినమ్రంగా     ఒక రెపరెప లాగా సహృదయ...

అధరము

  నవంబర్ 28, 2024 అధరము  ( adharamu )     అర్థము      (విశేష్యము/విశేషణము ) : (క్రింద)  పెదవి; క్రిందది; తక్కువైనది    Meaning     (noun/adj) : (lower) lip; lowest; inferior    వాడుక / Usage      అరుణారుణమీ అధరము తరుణ మందార పల్లవము .      Redder than red are your lips; they are the tender bud of a Mandara flower .     మెదడుకు మేత / Food for thought     మొదటి దెబ్బ పడుతూనే     రాయి నుంచి ఆర్తనాదం వినపడింది ...ఆ అని     అప్పుడు తెలిసింది రాళ్ళల్లో కూడా     ఉంటుంది ప్రాణం అని     ఆ ప్రాణం ఎక్కడ దాగుందో     తెలుసుకోడానికి     పోట్లు పొడుస్తూనే ఉన్నాడు     చురుకైన చేతులతో ఆ మూర్తికారుడు     పరిపూర్ణమైన శిల్పాన్ని ఒకే రాయి నుంచి     చెక్కి బయటకి వెలికితీసాడు     అప్పుడు తెలిసింది రాతి గుండె     గాయం మానని చోటే ఉందని     ఆ శిల్పి చూస్తూ ఉండిపోయాడు ...

ముంగురులు

  నవంబర్ 27, 2024 ముంగురులు   ( mun-gurulu )     అర్థము      (విశేష్యము ) : ముందు కురులు; నొసటిపై పడే ఉంగరపు వెంట్రుకలు    Meaning     (noun) : curls on forehead; front locks    వాడుక / Usage      ఈ నీలి నీలి ముంగురులు ఇంద్ర నీలాల మంజరులు .      These black curls on your forehead are the emeralds adorning you .     మెదడుకు మేత / Food for thought     పుట్టుకతోనే ఈశ్వర సాక్షిగా ప్రతిజ్ఞ చేసాను     రణం తలపెట్టనని, ఎందుకంటే     తండ్రీ - కొడుకులం గాబట్టి     అన్నా - తమ్ములం గాబట్టి     బంధువులు - చుట్టాలు గాబట్టి     స్నేహితులు - ప్రియ సఖులు గాబట్టి     తిరిగి ప్రతిజ్ఞ పట్టాను     రణాల యుద్ధ భూమిలో ఈశ్వర సాక్షిగా     మనలో ఎవ్వరూ వెనుకంజ వెయ్యరని      ఎందుకంటే ఇక్కడ ఎవ్వరికీ ఎవ్వరూ ఏమీ కాదు     అందరూ అందరికీ శత్రువులే     ప్రతీ మనిషికి తన యుద్ధం వేరే   ...

తమి

  నవంబర్ 26, 2024 తమి  ( tami )     అర్థము      (విశేష్యము ) : త్వర; ఆపేక్ష; మోహము; వలపు; రాతిరి; చీకటి    Meaning     (noun) : eagerness; passion; lust; desire; darkness     వాడుక / Usage      ఎవరూ పొందని ఏకాంత సేవలో ఈ వేళ తమి దీరగా నిన్నె అలరించె .      Not to everyone, away from prying eyes, is this attention; desires, pleasure  I will  yours.     మెదడుకు మేత / Food for thought     కొన్ని పదాలు     అవమానించబడినపుడు     వాటంతటవి బ్రతుకునుంచి భాషనుంచి     వైదొలిగి పోతాయి     'పవిత్రత' అలాంటి ఒక పదమే     ఇప్పుడు వాడుకలోనే లేదు     దాని జాతిలోని శబ్ధాలు     ఇప్పుడు వెతికినా కనపడవు     గాలిలో నీళ్లలో ఆఖరికి మట్టిలో కూడా     -- శబ్ద్ జో ఖో జాతే హైం, కువర్ నారాయణ్ (సెప్టెంబర్ 19, 1927 - 2017)

వేగు

  నవంబర్ 25, 2024 వేగు  ( vegu )     అర్థము      (క్రియ/విశేష్యము ) : తపించు; దుఃఖపడు; క్షీణించు; ఉదయమగు; చారుడు; రాజ్య సమాచారం    Meaning     (verb/noun) : to be fried; to grieve; sorrow; to dawn; spy; espionage     వాడుక / Usage      ఇన్ని నాళ్ళు నేనెటుల వేచితినొ, ఇన్ని రేలు ఎంతెంత వేగి తినొ .      Alas! days forever how did I bide? nights long and lonely how much I pined!     మెదడుకు మేత / Food for thought     నేను ఇప్పటికి కూడా ఇంకా     ఆ లోతులలోనే నుంచున్నానా     ఆ ఎత్తుల ఏలిక కట్టడి చేస్తున్న ఈ చోటున?     ఈ మెట్లు నన్ను తీసుకెళ్లేనా     అన్నింటికీ శిఖరాగ్రమైన మహోన్నత ఆ జగానకి     ఎక్కడైతే ఆకాశాన్నంటే స్తంభాలు సమసిపోతాయో     పునీతమైన మస్తిష్కానికి బావుటా ఎగరేసే ఆ చోటుకి     -- కుతుబ్ మినార్, కువర్ నారాయణ్ (సెప్టెంబర్ 19, 1927 - 2017)

పథము

  నవంబర్ 22, 2024 పథము  ( pathamu )     అర్థము      (విశేష్యము ) : మార్గము; త్రోవ; దారి    Meaning     (noun) : a path/road/way    వాడుక / Usage       స్వాగతించెను ప్రేమ పథం సాగినది ఇరువురి బ్రతుకు రథం .      As the path of love welcomes our chariot of life glides on .     మెదడుకు మేత / Food for thought      సా ర పు ధర్మమున్ విమల స త్యముఁ బాపముచేత బొంకుచేఁ      బా ర ముఁ బొందలేక చెడఁ బా ఱినదైన యవస్థదక్షు లె      వ్వా ర   లుపేక్షచేసి రది   వా రలచేటగుఁ గాని ధర్మ ని      స్తా ర కమయ్యు సత్య శుభ దా యక మయ్యును దైవ ముండెడున్ ( ధర్మం అధర్మం చేత ,  సత్యం అసత్యం చేత ఫలితాన్ని పొందలేని దుస్థితి కలిగినప్పుడు సమర్థులు ఉపేక్షించ కూడదు. అలా చేస్తే వారికే చేటు కలుగుతుంది, అంతేగాని ధర్మాన్ని రక్షించే, సత్యాన్ని స్థాపించి, మంచిని చేయుటకు దైవం ఉన్నది. )      -- మహాభారత ఉద్యోగపర్వం , తిక్కన (1205 - 1288)

పవనము

  నవంబర్ 21, 2024 పవనము  ( pavanamu )     అర్థము      (విశేష్యము ) : గాలి; తూర్పార చేయుట; దూగర పోగొట్టుట; చెరుగుట    Meaning     (noun) : wind; air; winnowing    వాడుక / Usage       కాలి మువ్వగ నిలిచెను కాలము పూల పవనము వేసెను తాళము .      Time turned into the jingling of anklets, the breeze of scented flowers counted the beat  .     మెదడుకు మేత / Food for thought      అ లు గుటయే యెరుంగని మ హా   మహితాత్ముడజాత శత్రుడే      య లి గిన నాడు సాగరము   ల న్నియునేకము కాక పోవు క      ర్ణు లు   పది వేవురైన నని   నొ త్తురు చత్తురు రాజ రాజ నా      ప లు కుల విశ్వసింపుము వి ప న్నుల నార్తుల గావుమెల్లెడన్ ( ఓ రారాజా !  ధర్మరాజుకు కోపమే తెలియదు. చాలా మంచివాడు. అతనికి శత్రువులు లేరు. అలాంటి ధర్మరాజుకు కోపమొస్తే సముద్రాలన్నీ పొంగి కలసిపోయి గొప్ప ప్రళయం వస్తుంది. కర్ణులు లాంటి వారు పదివేల మంది వచ్చినా ఓడిపోతారు...

జిలిబిలి

  నవంబర్ 20, 2024 జిలిబిలి  ( jili-bili )     అర్థము      (విశేషణము ) : శృంగారమైనది; జడకొప్పులో పెట్టుకునేది; ఇంపైనది; మనోహరమైనది; అల్పమైనది    Meaning     (adj) : pleasing; fine; charming; delicate; petty    వాడుక / Usage       మేని మలుపుల చెలువపు గమనము వీణ పలికిన జిలిబిలి గమకము .      Beautiful gait of  the  curvaceous body, charming melody plucks the Veena.     మెదడుకు మేత / Food for thought      కురువృద్ధుల్ గురువృద్ధబాంధవు లనేకుల్ సూచుచుండన్ మదో      ద్ధరుడై ద్రౌపది నిట్లు చేసిన ఖలున్ దుశ్శాసనున్ లోకభీ      కరలీలన్ వధియించి తద్విపుల వక్షశ్శైలరక్తౌఘనిర్ఝర      ముర్వీపతి సూచుచుండ నని నాస్వాదింతు నుగ్రాకృతిన్ (వృద్ధులైన కురువంశీయులు, ద్రోణాచార్యాది గురువులు, పెద్దలనేకులు చూస్తుండగా మదముచే నిరంకుశుడై ద్రౌపది నీ విధంగా చేసిన క్రూరదుశ్శాసనుని లోకమునకు భయం కల్గించే విధంగా యుద్ధమున చంపి రాజైన దుర్యోధనుడు చూస్తుం...

కుసుమము

  నవంబర్ 19, 2024 కుసుమము  ( kusumamu )     అర్థము      (విశేష్యము ) : పువ్వు; ఒక కంటి జబ్బు; ఎర్ర రంగు    Meaning     (noun) : flower; safflower; rose colour    వాడుక / Usage       కాదా మమకారం నీ పూజా కుసుమం .      Isn't my affection, a flower of devotion to you?!   మెదడుకు మేత / Food for thought      ధారుణి  రాజ్యసంపద మదంబున కోమలి కృష్ణజూచి, రం     భోరు నిజోరుదేశమున నుండగ బిల్చిన యిద్దురాత్ముదు     ర్వార మదీయబాహుపరివర్తిత చండ గదాభిఘాత భ     గ్నోరుతరోరు జేయుదు సుయోధను నుగ్రరణాంతరంబునన్     ( భూమి మీద తన రాచరికం చెల్లుతున్నదనే గర్వంతో దుర్యోధనుడు ద్రౌపదిని చూచి తన తొడల మీద కూర్చొన రమ్మని పిల్చినాడు. ఆ దుర్మార్గున్ని యుద్ధంలో నా చేతులతో గదను తిప్పుతూ దాంతో వాడి తొడలు నుగ్గు చేస్తాను)      -- మహాభారతం , ఆది కవి నన్నయ్య (~ పదకొండవ శతాబ్దము)

ధూపము

  నవంబర్ 18, 2024 ధూపము  ( dhūpamu )     అర్థము      (విశేష్యము ) : పొగ వేయునది; సాంబ్రాణి; సుగంధం గల పొగ    Meaning     (noun) : incense; aromatic vapour or smoke    వాడుక / Usage       తీసే శ్వాసే ధూపం చూసే చూపే దీపం .      In your presence, the air I exhale is perfumed and my eyes light up as a lamp.     మెదడుకు మేత / Food for thought      కష్టభరితంబు బహుళ దుఃఖ ప్రదంబు      సార రహితంబునైన సంసార మందు      భార్య యను స్వర్గ మొకటి కల్పనము జేసె      పురుషుల నిమిత్తము పురాణ పూరుషుండు           -- చింతామణి  నాటకం, కాళ్లకూరి నారాయణరావు (ఏప్రిల్ 28, 1871 - 1927)

కోవెల

  నవంబర్ 15, 2024 కోవెల  ( kōvela )     అర్థము      (విశేష్యము ) : గుడి; కోకిల    Meaning     (noun) : temple; cuckoo    వాడుక / Usage       కోరే కోవెల ద్వారం నీవై చేరుకోగా కాదా నీకై మ్రోగే ప్రాణం ప్రణవం .      You are the threshold to the temple of my prayers; nearing you the air I breathe resonates - isn't it the sacred Om!     మెదడుకు మేత / Food for thought      ఏమి తెలిసి నను మోహిస్తివి      దేహమేలాంటిదని నీవాలోచిస్తివి      అచ్చమైన తోలు తిత్తి      అందున గుమ్మాలు తొమ్మిది      హేయమైన ఘటము కాయము      ఆయువైన క్షణము మాయము      ఏ ఫలము వుందని ఇందు చేరితివి      నిజ మర్మమెరుగక నీలవేణి పొందు కోరితివి           -- రంగస్థల ‘సరస్వతి’-శ్రీ కోడూరిపాటి సరస్వతీ రామారావు (1909-1982), 'సాని-సంసారి' నాటకం

దరహాసము

  నవంబర్ 14, 2024 దరహాసము  ( dara-hasamu )     అర్థము      (విశేష్యము ) : చిరునవ్వు    Meaning     (noun) : a gentle/slight smile    వాడుక / Usage       వేల మధుమాసముల పూల దరహాసముల మనసులు మురిసెను.      Hearts revelled in the smiling blossoming buds of infinite intoxicating springs.     మెదడుకు మేత / Food for thought      నిండు పున్నమేళ మబ్బు కమ్ముకొచ్చి సిమ్మ సీకటల్లిపోతుంటే      నీ గమ్యం గందరగోళం      దిక్కు తోచకుండ తల్లడిల్లి పోతు పల్లటిల్లిపోయి నీవుంటే      తీరేనా నీ ఆరాటం      ఏ హేతువు నుదుటి రాతల్ని మార్చిందో నిశితంగా తెలిసేదెలా      రేపేటౌనో తేలాలంటే, నీ ఉనికి ఉండాలిగా      ఓ...' ఆటు పోటు గుండె మాటుల్లోన... సాగేనా      ఆశ పాశం బందీ సేసేలే      సాగే కాలం ఆడే ఆటేలే      తీరా తీరం సేరేలోగానే ఏ తీరౌనో      ఏ జాడలో...

కులుకు

   నవంబర్ 13, 2024 కులుకు  ( kuluku )     అర్థము      (క్రియ ) : శృంగారంగా కదులు; సొగసుగా    Meaning     (verb) : to move gracefully; to be melodious    వాడుక / Usage       తూగుతున్నది మధుర వని లేత విరి కులుకుల నటన గని .      Flowers intoxicated sway; seeing of yours the charming sashay.     మెదడుకు మేత / Food for thought      తెలుసు ఇది నీటి మూటని ...      తెలుసులే ఇది గాలి మేడని ...      తెలుసు ఈ బుడగ టప్పని పగిలిపోతదని ....      తెలుసు ఉట్టి పై ఉన్నదంతా ఉష్కాకాకియనీ ...      అన్నీ తెలిసి అడుసులొ పడి దొర్లుతుంటాము దేనికని      మాయ ... మాయా... మాయా      తేలిపోయింది ... తెలిసిపోయింది ...      తెలియనిదేదో ఉందని మనసా ...      తెలుసని ఎందరు చెబుతున్నా అది ... ఉందో లేదో తేలని హంసా ....      కళ్ళు రెండూ మూసెయ్యలంటా .... మూడో కంటిన...

రవళి

  నవంబర్ 12, 2024 రవళి  ( ravali )     అర్థము      (విశేష్యము ) :  ధ్వని    Meaning     (noun) : sound; noise    వాడుక / Usage       పాడుతున్నది ఎదమురళి, రాగఝరి తరగల మృదు రవళి .      The heart beats to the song, waves of cascading notes making a tender music.     మెదడుకు మేత / Food for thought      ఏ కన్ను చూడదనా     నీ విచ్చలవిడి మిడిసిపాటు    ఏ చెయ్యి ఆపదనా    తప్పటడుగే నీ అలవాటు    అదృశ్య దృష్టిగా సకల సృష్టి    నిన్ను గమనిస్తున్నది లెక్క గట్టి    ఎంత బ్రతుకు నీదెంత బ్రతుకు    ఓ గుప్పెడు మెతుకుల కడుపు కొరకు    ఇన్నాటలు వేటలు అవసరమా    మనుజా.... మనుజా.....    ఏమారితే నిన్ను కబళిస్తుందిరా    మాయదారి పంజా.....    కోరి కొని తెచ్చుకోమాకు కర్మ    దాన్ని విడిపించుకోలేదు జన్మ.....    సత్కర్మ భిశ్చ సత్ఫలితం    దుష్కర్మ...

తొణకు

  నవంబర్ 11, 2024 తొణకు  ( toṇaku )     అర్థము      (క్రియ ) : పొంగు; ఒలుకు; ద్రవం అటూ ఇటూ కదిలి పైకి చిందడం    Meaning     (verb) : to spill; overflow    వాడుక / Usage       వలచిన ఆమని కూరిమి మీరగ చేరిన తరుణం  తీగ సొగసుల తొణికిన మిలమిల .      Love abounds in the spring of desire, elegance of your curves overflowing in a dazzle!     మెదడుకు మేత / Food for thought      హేయ్ కృష్ణా.....ఓ పార్థ      ఎదలోన భయమైందయ్యా.... నేనుండ బెంగేలయా      ఈ కర్మ నాకేలయా???....ధర్మాన్ని కాపాడయా...      పగవాళ్ళు మావాళ్ళే, చుట్టాలులే....సమరాన చుట్టరికమే చెల్లదే....నారీ సారించరా...      వద్దులే మాధవా...      స్నేహితులు... కావచ్చు...      సమరమున....చావొచ్చు      ఓ దేవ దయ చూపయా...నీలోన క్షత్రమ్ము, నీ బ్రతుకు క్షణికమ్ము, ఓ నరుడా భ్రమ వీడయా...      ఈ బాధ పడలేను - బం...

తేట

  నవంబర్ 08, 2024 తేట  ( tēṭa )     అర్థము      (విశేష్యము ) : నిర్మలము; విశదము; ద్రవం పైకి ఉండి మిగతా అంతా క్రింద చేరిన మజ్జిగ    Meaning     (noun) : clearness; purity; transparency; whey    వాడుక / Usage       తేటి స్వరముల మధువులు చిలికెను తీపి పలుకుల చిలుకల కిలకిల .     The sweet singsong of parrots churns the honey of pure resonance.     మెదడుకు మేత / Food for thought     భౌగోళ శాస్త్రజ్ఞులు ఆంత్రోపోసీన్ యుగం, మనుషులు పర్యావరణాన్ని విధ్వంసం చేయడం, మొదలు అయ్యింది అని ప్రకటించినప్పుడు వాళ్ళు ముఖ్యంగా చూపించినది ప్లాస్టిక్ వాడకం.      --  నోమ్ చోమ్స్కీ, అమెరికన్ తత్వవేత్త, భాషా శాస్త్రవేత్త, తార్కికుడు, రాజకీయ వ్యాఖ్యాత, "ఆధునిక భాషా శాస్త్ర పితామహుడు"

ఆమని

  నవంబర్ 07, 2024 ఆమని  ( āmani )     అర్థము      (విశేష్యము ) :  వసంతఋతువు; అధికము; తృప్తికరం    Meaning     (noun) : spring; season of plenty; satisfaction    వాడుక / Usage       వలచిన ఆమని కూరిమి మీరగ చేరిన తరుణం,  కోటి తలపుల చివురులు తొడిగెను .     The spring of desires in love abound, a million wishes sprout in this moment!     మెదడుకు మేత / Food for thought     భూకంపం వచ్చిన మర్నాడు భౌగోళ శాస్త్రం మన ముందుంటుంది.     --  రాల్ఫ్ వాల్డో ఎమెర్సన్ (మే 25, 1803 - 1882)

కళ

  నవంబర్ 06, 2024 కళ  ( kaḷa )     అర్థము      (విశేష్యము ) : చంద్రుడిలో పదహారవ భాగము; కామోద్రేకం కలిగించు స్థలము; మూర్ఛ; శిల్పం    Meaning     (noun) : phase of moon; swoon; art; potency    వాడుక / Usage       కళ ల విరుల వనం మన హృదయం .     Our heart is the garden that blossoms love's arousal!     మెదడుకు మేత / Food for thought     పురాతత్వవేత్తలు చరిత్ర గురించి ఎక్కడ దాకా వెళ్లి ఆగుతారో అక్కడ నుంచి భౌగోళిక శాస్త్రవేత్తలు అందుకుని అతి పురాతన కాలంలోకి భూమి యొక్క చరిత్రని త్రవ్వుతారు.     -- బాల గంగాధర్ తిలక్  (జులై 23, 1856 - 1920)

పరువము

  నవంబర్ 05, 2024 పరువము  ( paruvamu )     అర్థము      (విశేష్యము ) :  యౌవనము; పక్వము; ప్రాయము    Meaning     (noun) : youth; ripeness; maturity    వాడుక / Usage       నేల నింగి కలిపే బంధం ఇంధ్రచాపం,  కాదా మన స్నేహం ముడివేసే పరువం .     The rainbow joins earth and sky; doesn't our friendship unite our nubile youth!     మెదడుకు మేత / Food for thought     నాగరికత మనుగడ భౌగోళిక సమ్మతిపైనే ఆధారపడి ఉంటుంది. ఆ సమ్మతి సూచన లేకుండానే ఎప్పుడైనా ఎలాగైనా మారచ్చు.     --  విలియం జేమ్స్ డురాంట్ (నవంబర్ 5, 1885 - 1981)