Posts

Showing posts from December, 2025

నేపథ్యము

  జనవరి 01, 2025 నేపథ్యము   ( nēpathyamu )     అర్థము      (విశేషము)  : వేషము; రంగస్థలం; తెర వెనుక నటులుండే చోట; ఒక సంఘటనకు పూర్వ వృత్తాంతం    Meaning     (noun)  : dress of an actor; a stage; curtain behind which actors retire; context; background      వాడుక / Usage     అలంటి వాన నేపథ్యం లో తెలుగులో అనేకానేక కథలు వచ్చాయి .     With a backdrop of such rain there have been many Telugu stories.    మెదడుకు మేత / Food for thought     క్షయ సంవత్సరంలో వానలు కురసవు అని చెప్పేవాళ్ళు కొంతమంది. అది క్షయ కాదు. అక్షయ. సంవత్సరంలో వానలు దండిగా కురిసి తీరల్ల అని ఆశను లెబెట్టేవాళ్ళు కొంతమంది. ఎవరి మాటను ఇనేది? ఎవరి మాటను ఇడిసి పెట్టేది? ఊర్లో వాళ్ళకేమో శానామందికి ధైర్యం సాలలే ఇత్తనం ఏసేదానికి. అప్పటికే ఒక సంవత్సరం వర్షాలు పడక సేద్యంలో దెబ్బ తినిండిరి మల్ల పాపం! ఊర్లో చానామంది రైతులు ఎనకడుగు ఏస్తంటే పెన్నప్ప ముందడుగు యేసే.     -- వాన రాలే, బండి  నారాయణ  స్వామి...

శాసనము

  డిసెంబర్ 31, 2025 శాసనము   ( ṣāsanamu )     అర్థము      (విశేషము)  : ఆజ్ఞ; అధికారం; రాజ్యపాలనం; శాస్త్రం    Meaning     (noun) : command; edict; rule; science      వాడుక / Usage     కళ్ళకు కనిపించే ప్రాణులతో పాటు, కనిపించని కోట్లాది జీవరాశుల బతుకులు శాసించేదే వాన .     Not just the organisms that we see, the plethora of invisible microorganisms are governed by rain.    మెదడుకు మేత / Food for thought     అంత గొప్ప ప్రవాహంలో సంతత ధారగా వాన పడిపోతోంది. నీళ్లలో నీళ్లు. ధారలో ధార. ప్రవాహంలో ప్రవాహం. వాన చినుకులు కృష్ణలో పడుతుంటే పెద్దక్క ప్రేమగా హత్తుకుంటే వొళ్ళు జలదరించినట్లు ఆ ప్రవాహం మీద ఓ జలదరింపు. సిగ్గుతో నవ్వినప్పుడు బుగ్గమీద సొట్టలా చినుకుపడ్డ చోట చిన్న గుంట. కృష్ణ అంతా చినుకులు. ఇసక నిండా, నేల నిండా - రెండు గంగాలు కలిసిపోయినట్లు, నింగి నేల ఒకటే అన్నట్లు. ఈ జగత్తులో నీళ్లు తప్ప ఇంకేవీ లేనట్టు అన్నిటికీ నీళ్ళే ఆధారమన్నట్లు వాన, వర్షం, గంగమ్మ, కిష్టమ్మ, సంద్రం - అ...

విషాదము

  డిసెంబర్ 30, 2025 విషాదము   ( vishadamu )     అర్థము      (విశేషము)  : దుఃఖము; నిరాశ; దౌర్బల్యము    Meaning     (noun) :  grief; sorrow; dejection      వాడుక / Usage     ఆనందం, ఆశ్చర్యం, భయం, బీభత్సం, విషాదం , దుఃఖం వానకున్న అనేక ముఖాలు .     Joy, surprise, fear, horror, dejection, sorrow are all the different facets of Rain.    మెదడుకు మేత / Food for thought     అప్పుడు కూడా ఇలాగే వాన . షామియానా వేసి వీధిలో శవాన్ని పడుకోబెడితే వాన పెరిగి పెద్దదయ్యి శవం ముద్దముద్దగా తడిసిపోయింది. అప్పుడు వాడు చిన్నవాడు. లోకం మంచి చెడ్డలు తెలియనివాడు. హఠాత్తుగా తండ్రి చనిపోతే దిక్కుతోచక ఉన్నవాడు. అలంటి వాడు తండ్రి శవం దగ్గర నిలబడి వీధిలోంచి పారుతున్న వర్షం నీటికి శవం ఉన్న బల్ల కదిలిపోతుందేమోనని అది కదలకుండా గట్టిగా పట్టుకుని గుండెలవిసేలా ఏడ్చాడు. ఆ తర్వాత శాశ్వతంగా వాడు ఆ రోజులోనే ఉండిపోయాడు.     -- ఒక సాయంత్రపు అదృష్టం, మహమ్మద్ ఖదీర్ బాబు

నిర్దాక్షిణ్యము

  డిసెంబర్ 29, 2025 నిర్దాక్షిణ్యము   ( nir-dākshiṇyamu )     అర్థము      (విశేషము)  : దయ/కనికరం లేకపోవడం    Meaning     (noun) : paucity of kindness/feeling      వాడుక / Usage     ప్రకృతి పసి పాపాయై చేసే అల్లరి చప్పుళ్లే కాదు, కోపంతో ముఖం చాటేసి నిర్దాక్షిణ్యంగా జీవితాల్ని చిదిమి పారేసే మృత్యువు కూడా వానే .     It is not just the toddler, of nature, that makes raucous noises; rain is also death incarnate that can turn its face away in anger and end lives without an iota of kindness.    మెదడుకు మేత / Food for thought     నదులు ఎండిపోయాయి. అడుగున ఉన్న చేపలు పొట్ట నీలుక్కుని బురద మీద పైకి తేలాయి. అడవులు చాలా మటుకు తగలబడ్డాయి. సముద్రాలు పొర్లుకొచ్చి నేలను చేతులతో కమ్ముకున్నాయి. అదుపు చేయలేని క్రిమి ఏదో సోకి మనుషులు కుప్పలు తెప్పలుగా రాలిపోయారు. ఏ కారణం చేతనో ఒక తల్లి తన బిడ్డల గొంతు నులిమి ఆత్మహత్య చేసుకుంది. ప్రాణస్నేహితుడొకడు చెప్పా పెట్టకుండా ఆ పూట యాక్సిడెంట్ లో...

ఏలు

  డిసెంబర్ 26, 2025 ఏలు   ( ēlu )     అర్థము      (క్రియ)  : పాలించు; రక్షించు; శాసించు    Meaning     (verb) : rule; govern; protect      వాడుక / Usage      యిన్నిటా శ్రీవేంకటేశ యేలి తివి మమ్ము నిట్టె, నిన్ను నన్ను నెంచుకుంటే నీకే తెలియునయ్యా .     Sri Venkateshwara, you are our master and protector in all of these; weigh deeds of mine and yours and it will become apparent.       మెదడుకు మేత / Food for thought      మగువ మనసు మంచు కడిగిన మంచి ముత్యము వంటిది      చెలిమి పంచి మసలుకుంటే ఆమె దేవత వంటిది      అందమైన ఆ నడకలు అగరు ధూపపు లతికలు      మమతలొలికే ఆ పలుకులు కస్తూరీ శ్రీ గంధం      చల్లనైన చూపు లాలన పునుగు జవ్వాజి      పెదవి దాటని మిసిమి నవ్వులే అత్తరు పన్నీరు      ముచ్చటైన మురిపెమ్ముల అష్ట గంధపు భరిణ అతివ      మెట్టినింట తిరుగు వేళల ఆమె గృహ ర...

భ్రమత

  డిసెంబర్ 25, 2025 భ్రమత   ( bhramatha )     అర్థము      (విశేష్యము)  : ప్రేమ    Meaning     (noun) : love; fondness      వాడుక / Usage      వున్నారు ప్రాణులెల్లా నొక్కనీగర్భములోనే కన్నకన్న భ్రమత లే కల్పించి .     All life forms are enshrined in you but you make us susceptible to the love of kin.       మెదడుకు మేత / Food for thought      మనవి సేయవే మనసార చెలికి నాదు ప్రేమ      మనవి సేయవే మనసార చెలికి నాదు ప్రేమ మనవి సేయవే      సందెవేళ సుందరాంగి చిందువేయు వెన్నెలలో      సందెవేళ సుందరాంగి చిందువేయు వెన్నెలలో      సందు చేసుకొని నీవు చందమామ చల్లగా      ఆమె కురులు కదిపి నీవు ఆడువేళ మారుతమా      ఆమె కురులు కదిపి నీవు ఆడువేళ మారుతమా      చెలియ మనసు తీరు తెలిసి చెవిలోన మెల్లగా     -- రేచుక్క పగటి చుక్క, సముద్రాల జూనియర్

చవి

   డిసెంబర్ 24, 2025 చవి   ( chavi )     అర్థము      (విశేష్యము)  : రుచి; ప్రేమ; ఆశ     Meaning     (noun) : taste; love;       వాడుక / Usage      మనసు చూడవలసి మాయలు నీవే కప్పి, జనులకు విషయాలు చవులు చూపి; కనుగొంటే మోక్షమిచ్చి కానకుంటె కర్మమిచ్చి, ఘనము సేసేవిందు కర్తలెవ్వరయ్యా .     You  ensconce  Self behind a veneer of illusions, ensnare us in sweet sensory pleasures; if we look past these you liberate us, else saddle us with the fruits of action; and then you stand tall - but who dear Lord is the doer?      మెదడుకు మేత / Food for thought      మనసు మనసుతో ముడివేసి      మౌన ప్రేమతో పెనవేసి      ఒకరినొకరిగా తోడును చేస్తావూ      ఒకరి నీడలో ఒకరిని చూస్తావూ      వలపు దీపాలు వెలిగించి      వేల వెన్నెలలు కురిపించీ      కలల కాలాన్ని కరిగించేస్...

శరణాగతుడు

  డిసెంబర్ 23, 2025 శరణాగతుడు   ( ṣaran-āgatudu )     అర్థము      (విశేష్యము)  : శరణు (రక్ష, ఆశ్రయం) కోరువాడు     Meaning     (noun) : one who comes for refuge, shelter or protection      వాడుక / Usage      సర్వాంతరాత్ముడవు శరణాగతుడ నేను, సర్వాపరాధినైతి చాలుజాలునయ్యా .     You are the Supreme Consciousness that animates everything; I am the one seeking refuge in you having committed sins galore - enough is enough.      మెదడుకు మేత / Food for thought      మనసే అందాల బృందావనం      వేణు మాధవుని పేరే మధురామృతం      మనసే అందాల బృందావనం      వేణు మాధవుని పేరే మధురామృతం      కమ్మని నగుమోము కాంచుటె తొలినోము      కడగంటి చూపైన కడుపావనం      మనసే అందాల బృందావనం      వేణు మాధవుని పేరే మధురామృతం      రాధను ఒక వంక లాలించునే    ...

దూరు

  డిసెంబర్ 22, 2025 దూరు   ( dūru )     అర్థము      (విశేష్యము/క్రియ)  : నిందించు; తిట్టు; ప్రవేశించు; తూర్పు    Meaning     (noun/verb) : rebuke; censure; enter; east      వాడుక / Usage      నేరకుంటే నరకము నేరిచితే స్వర్గమంటూ, దూరు వేసేవింతేకాక దోషమెవ్వరిదయ్యా .     Heaven if you know, hell if you don't - this you say and accuse us - but whose fault is it?!     మెదడుకు మేత / Food for thought      మనసున మల్లెల మాలలూగెనే      కన్నుల వెన్నెల డోలలూగెనే      ఎంతహాయి యీ రేయి నిండెనో      ఎన్నినాళ్లకీ బతుకు పండెనో      కొమ్మల గువ్వలు గుసగుసమనినా      రెమ్మల గాలులు ఉసురుసురనినా      అలలు కొలనులో గలగలమనినా      దవ్వుల వేణువు సవ్వడి వినినా      నీవు వచ్చేవని నీ పిలుపే విని      కన్నుల నీరిడి కలయజూచితిని      గడియ యే...

ఇగురుబోడి

  డిసెంబర్ 19, 2025 ఇగురుబోడి   ( iguru-bōḍi )     అర్థము      (విశేష్యము)  : చిగురువలే అందంగా ఉండే యువతి; స్త్రీ    Meaning     (noun) : woman; a blossoming tender lady      వాడుక / Usage      పొగరు శ్రీవేంకటేశు పొందుల కప్రము పూచె ఇగురుబోండ్ల మింక నేమి సేసేదే .     Radiating pride in her union with Sri Venkatesha she adorns th e  stifling camphor; alas what can we tender ladi e s do?!    మెదడుకు మేత / Food for thought      మరుమల్లెల్లో ఈ జగమంతా విరియగా      ప్రతి ఉదయంలో శాంతి కోసమే తపనగా      పారాణేదో భుమికి వెలుగుగా      మందారాలే మత్తును వదలగా      కనుల తడి తుడిచే ఒడిలో పసి పాపాయి      చిలికే చిరునగవే చీకటితల్లికి వేకువ      గాలిపాటల జడివాన జావళి, అది మౌనంలా మధురం ఔనా?      వేలమాటలే వివరించ లేనిది, తడి కన్నుల్లా అర్థం ఔనా?      లేతపా...

మగువ

  డిసెంబర్ 18, 2025 మగువ   ( maguva )     అర్థము      (విశేష్యము)  : స్త్రీ; అతివ; భార్య; ప్రియురాలు    Meaning     (noun) : woman      వాడుక / Usage      మగువ రతుల లోన మంకెన పువ్వులు పూచె మొగికొనగోళ్ళానే మొగలి పూచె .     Blushed is the woman, her desires budding scarlet hues; bashful she moves her toes exuding fragrant Ketaki.    మెదడుకు మేత / Food for thought      యెట్టా గయ్య శివ శివ నీవన్ని వింత ఆటలే      పుట్టుక చావు యాతన నువ్వు రాసే నుదుటి రాత్రలే      నింగీ నేల అందరికొకటే వందాలోచనలు ఎందుకు      బంధియే ప్రతి మనిషి బంధాలలోనే బాధకు      మొదమొక్కటే వేదనొక్కటే జనులకు జగతిలో      యెట్టా గయ్య శివ శివ నీవన్ని వింత ఆటలే      పుట్టుక చావు నడుములో మావన్ని ఎదురుఈతలే      దయ చూడు శివ శివ లీల శివ శివ భోలా శంకరుడా      నీవే శంభో శివ శివ సాంబా శివ శివ...

తొయ్యలి

  డిసెంబర్ 17, 2025 తొయ్యలి   ( toyyali )     అర్థము      (విశేష్యము)  : స్త్రీ; ఇంతి    Meaning     (noun) : woman      వాడుక / Usage      తొయ్యలి చెమటనీట దొంతితామెరలు పూచె కొయ్యచూపు కోపముల కుంకుమ పూచె .     Flushed the woman is, her beads of perspiration dotted like lotuses; eyes fixed in (fake) anger bloomed flowers of vermilion.    మెదడుకు మేత / Food for thought      ఒక్కడై రావడం ఒక్కడై పోవడం      నడుమ ఈ నాటకం విధిలీల      వెంట ఏ బంధమూ రక్త సంబంధమూ      తోడుగా రాదుగా తుదివేళ      మరణమనేది ఖాయమనీ మిగిలెను కీర్తి కాయమనీ      నీ బరువూ నీ పరువూ మోసేదీ      ఆ నలుగురూ ఆ నలుగురూ ఆ నలుగురూ ఆ నలుగురూ      నలుగురూ మెచ్చినా నలుగురూ తిట్టినా      విలువలే శిలువగా మోశావూ      అందరూ సుఖపడే సంఘమే కోరుతూ      మందిలో మార్గమే ...

సతి

  డిసెంబర్ 16, 2025 సతి   ( sati )     అర్థము      (విశేష్యము)  : స్త్రీ; మంచి ఇల్లాలు; పార్వతి    Meaning     (noun) : woman; virtuous woman; Parvathi      వాడుక / Usage      సతి చింతాలతలో సంపెంగపూవులు పూచె మతివిరహపు మేన మల్లెలు పూచె .     The woman's thoughts undulating like creepers flowered Champaks; her longing blossomed as jasmines on her body.    మెదడుకు మేత / Food for thought       ఎంతవరకు ఎందుకొరకు ఇంత పరుగు అని అడక్కు      గమనమే నీ గమ్యమైతే బాటలోనే బ్రతుకు దొరుకు      ప్రశ్నలోనే బదులు ఉంది గుర్తుపట్టే గుండెనడుగు      ప్రపంచం నీలో ఉన్నదని చెప్పేదాక ఆ నిజం తెలుసుకోవా      తెలిస్తే ప్రతీ చోట నిన్ను నువ్వే కలుసుకుని పలకరించుకోవా      మనసులో నీవైన భావాలే బయట కనిపిస్తాయి దృశ్యాలై      నీడలు నిజాల సాక్ష్యాలే శతృవులు నీలోని లోపాలే      స్నేహితులు నీకున్న...

పొలతి

  డిసెంబర్ 15, 2025 పొలతి   ( polati )     అర్థము      (విశేష్యము)  : స్త్రీ    Meaning     (noun) : woman; lady      వాడుక / Usage      పొలతి జవ్వనామున పూవక పూచె యెలమి నిందుకు మనమేమి సేసేదే .     The nubile damsel brimming with joy, blossoms flowers; what can one do?!    మెదడుకు మేత / Food for thought       ఇ ది చేతులు మారి రాతలు మార్చే కాగితమోయ్      తన జేబుల నుంచి జేబులలోకి దూకేసి ఎగిరే ఎగిరే      రూపాయి రు రూపాయి ఇది రూపాయి హే రూపాయి      రుప్పి రుప్పి రుపి రూపాయి రుప్పి రుప్పి రుపి రూపాయి      కోటలు మేడలు కట్టాలన్న కాటికి నలుగురు మోయాలన్న      గుప్పెడు మెతుకులు పుట్టాలన్న ప్రాణం తీయాలన్న ఒకటే రూపాయి      ఈ ఊసరవిల్లికి రంగులు రెండే బ్లాకు అండ్ వైట్      ఈ కాసుల తల్లిని కొలిచే వాడి రాంగ్ ఇస్ రైట్      తన హుండీ నిండాలంటే దేవుడికైన మరి అవస...

తురీయము

  డిసెంబర్ 12, 2025 తురీయము   ( turīyamu )     అర్థము      (విశేష్యము)  : బ్రహ్మము; నాలుగవ అవస్థ; నాల్గవది    Meaning     (noun) : Supreme consciousness; fourth state of experience; fourth; quadrant      వాడుక / Usage      x-అక్షం మరియు y-అక్షం ఖండించుకోవడం వల్ల నాలుగు తురీయాలు ఏర్పడతాయి.     The intersection of x and y axes creates the four quadrants.    మెదడుకు మేత / Food for thought       యూక్లిడ్ ఎంతో ఇష్టపడే రెడక్టియో యాడ్ అబ్సర్డమ్ (అసంబద్ధతకు కుదించడం), ఒక గణిత శాస్త్రజ్ఞుడి అత్యుత్తమ ఆయుధాలలో ఒకటి. ఇది చదరంగంలో వేసే ఎత్తులన్నిటికన్నా చాలా సూక్ష్మమైన ఎత్తు: ఒక చదరంగం ఆటగాడు ఒక బంటు లేదా ఇంకో పావు త్యాగం చేయవచ్చు, కానీ ఒక గణిత శాస్త్రజ్ఞుడు ఆటనే పణంగా పెడతాడు. -- జి.హెచ్.హార్డీ

ఘాతము

  డిసెంబర్ 11, 2025 ఘాతము   ( ghātamu )     అర్థము      (విశేష్యము)  : దెబ్బ; హత్య; బాణము; ఒక సంఖ్యను అదే సంఖ్యతో ఎన్నిసార్లు గుణించాలో సూచించేది    Meaning     (noun) : denominator; necklace; power/exponent of a number      వాడుక / Usage     పెద్ద సంఖ్యలను సరళమైన రీతిలో చదవడం రాయడం కోసం ఘాతములు  వాడతారు .     Exponents are used to express large numbers in a simple manner.    మెదడుకు మేత / Food for thought       కవికి, గణిత శాస్త్రజ్ఞుడికి మధ్య ఉన్న తేడా ఏమిటంటే, కవి తన మెదడుని విశ్వంలో ఐక్యం చేయడానికి ప్రయత్నిస్తాడు, గణిత శాస్త్రజ్ఞుడు విశ్వాన్ని తన మెదడులో ఇముడిస్తాడు.     -- జి.కె. చెస్టర్టన్

హారము

  డిసెంబర్ 10, 2025 హారము   ( haaramu )     అర్థము      (విశేష్యము)  : భిన్నములో క్రింద సంఖ్య; మాల    Meaning     (noun) : denominator; necklace      వాడుక / Usage      నిష్ప సంఖ్యలు అంటే లవము, హారము ఉండి నిష్పత్తి ని తెలియజేసేవి.     Rational numbers can be expressed as a ratio with a numerator and denominator.    మెదడుకు మేత / Food for thought       గణిత శాస్త్రవేత్తలు కొన్నిసార్లు అతి పెద్ద సంఖ్యలతో వ్యవహరిస్తారు, కానీ వారి ఆదాయంలో విషయంలో మాత్రం ఆ అవసరం రాదు.     -- ఐజాక్ అసిమోవ్

వర్గము

  డిసెంబర్ 09, 2025 వర్గము   ( vargamu )     అర్థము      (విశేష్యము)  : ఒక రాశి/సంఖ్య అదే దానితో గుణిస్తే వచ్చేది; ఒకే రకం సమూహం; అధ్యాయము    Meaning     (noun) : a collection of similar things; the square of a number/quantity; chapter      వాడుక / Usage     " ఒక సంఖ్య యొక్క వర్గాన్ని ఎనిమిదింతలు చేసి, దానికి ఒకటి కలిపితే వచ్చే సంఖ్య కూడా మరో వర్గసంఖ్యే అయినపుడు, మొదటి సంఖ్య ఎంతో చెప్పు" - భాస్కరుడు (ఏడవ శతాబ్దము) .     If eight times the square of a number, plus one, is another square, what is the first number?    మెదడుకు మేత / Food for thought       గణిత శాస్త్రజ్ఞులు సాపేక్షత సిద్ధాంతాన్ని ఆక్రమించినప్పటినుంచి, నేను ఇంక దానిని అర్థం చేసుకోలేకుండా ఉన్నాను.     -- ఆల్బర్ట్ ఐన్‌స్టీన్

భిన్నము

  డిసెంబర్ 08, 2025 భిన్నము   ( bhinnamu )     అర్థము      (విశేష్యము/విశేషణము)  : పగిలినది; వేరుపడినది; ఒక రాశిలో భాగము; భాగహారము    Meaning     (noun/adj) : split; broken; fraction      వాడుక / Usage      సజాతి భిన్నాల ఆరోహణ లేదా అవరోహణ క్రమం వాటి లవాల ఆరోహణ లేదా అవరోహణక్రమంపై ఆధారపడి ఉంటుంది.     The ascending or descending order of like fractions depends on the order of their numerators.    మెదడుకు మేత / Food for thought       శ॒తాయ॒ స్వాహా॑ స॒హస్రా॑య॒ స్వాహా॒ ఽయుతా॑య॒ స్వాహా॑ ని॒యుతా॑య॒ స్వాహా᳚ ప్ర॒యుతా॑య॒ స్వాహా ఽర్బు॑దాయ॒ స్వాహా॒ న్య॑ర్బుదాయ॒ స్వాహా॑ సము॒ద్రాయ॒ స్వాహా॒ మద్ధ్యా॑య॒ స్వాహా ఽన్తా॑య॒ స్వాహా॑ పరా॒ర్ధాయ॒ స్వాహో॒షసే॒ స్వాహా॒ వ్యు॑ష్ట్యై॒ స్వాహో॑దేష్య॒తే స్వాహో᳚ద్య॒తే స్వాహోది॑తాయ॒ స్వాహా॑ సువ॒ర్గాయ॒ స్వాహా॑ లో॒కాయ॒ స్వాహా॒ సర్వ॑స్మై॒ స్వాహా᳚ ( “Hail to a hundred, hail to a thousand, hail to ayuta [ten thousand], hail to niyuta [hundred thousa...

కాష్ఠము

  డిసెంబర్ 05, 2025 కాష్ఠము   ( kāsṭhamu )     అర్థము      (విశేష్యము)  : కట్టె; దిక్కు; పదిహేను (లేక పద్దెనిమిది) రెప్పపాట్ల కాలం    Meaning     (noun) : wood; funeral log/pyre; quarter/direction; a measure of time (15 or 18 blinks)      వాడుక / Usage     సమస్య రగులుతూనే ఉంది అనే అర్థంలో రావణ కాష్టం అనే వాడుక వచ్చింది .     The phrase Ravana's pyre is used to describe a festering problem.    మెదడుకు మేత / Food for thought       ఎదయు పిడికిలి పూవులై      ముదముతో కొన్ని వేళల – మురిసిపోవు      నెదయు పిడికిలి పూవులై     వ్యధలతో కొన్ని వేళల – వాడిపోవు     --  జెజ్జాల కృష్ణ మోహన రావు (eemata)

ముహూర్తము

  డిసెంబర్ 04, 2025 ముహూర్తము   ( muhūrtamu )     అర్థము      (విశేష్యము)  : నలభై ఎనిమిది నిమిషాల కాలం; నిమేష కాలం; త్రుటి; శుభకార్యాలు చేసే కాలం    Meaning     (noun) : 48 minutes; a moment or instant; auspicious time      వాడుక / Usage     మూడో విడతకు ముహూర్తం - నేటి నుంచి నామపత్రాల స్వీకరణ.     Date fixed for third phase - nominations from today.    మెదడుకు మేత / Food for thought       మరువకను నీ దివ్య నామస్మరణ మెప్పుడు చేయుచుంటిని      సత్కృపను ఇక వరము లిచ్చెడి స్వామి వనుచును ఎంచు నను మీ      సరిగ వేల్పులు లేరటంచును మరిగ నే చాటుచును నుంటిని      రాతి నాతిగ చేసినావు అజామిళునిపై కృప గలిగి ని-      ర్హేతుకంబుగ బ్రోచితివి ప్రహ్లాదు గాచితి వట సభను ద్రౌ-      పతికి చీరల నొసగితివి సుంతైన నాపై దయను జూపవు     -- రామదాసు