Posts

Showing posts from September, 2022

తొత్తు

  సెప్టెంబర్ 30, 2022 తొత్తు  ( tottu )       అర్థము      (విశేష్యము ): దాసి; బానిస; తైనాతీ; వేశ్య     Meaning     (noun) : slave/servant girl; prostitute; concubine    వాడుక / Usage   బ్రిటీష్‌కు నువ్వు తొత్తువు; తొత్తు కింద తొత్తులుగా మేము బతకదల్చుకోలేదు అని కాళోజి నిజాంను ఎదిరించారు.  Kaloji opposed Nizam, refusing to be a slave under a slave of the British.     మెదడుకు మేత / Food for thought రాట్నం వడుకుతూ, ఆ ఝంకారమే తంబూరా శ్రుతిగా తనకు తెలిసిన పాట పాడుతున్నది ఒక పండు ముత్తయిదువు. ‘‘ఉసికాల ఆడేటీ కుసుమా సిరిబాలా మా బాలా వచ్చిందా మిమ్ము కూడంగ’’ ముంగిట్లో నుంచుని వింటున్న నేను ముగ్ధుణ్నయిపోయాను. తీగసాగినట్టున్న ఆ రాగానికే కాదు, అమాయక హృదయం నుంచి పొంగి వచ్చిన ఆ ఆత్మీయతకు, ఆ నిసర్గ రసవద్గీతకు. ఒక తల్లి ఒక పాప నడుగుతున్నది తన పాప గూర్చి. ఆ పాప యెవరు? ‘ఉసికాల ఆడేటి కుసుమా సిరిబాల’ – ఇసుక ఉసికగా మిసిమి పెంచుకుంది. మరి ‘కుసుమా సిరిబాలా!’ ఇది వ్యాకరణం దృష్టిలో వైరిసమాసం. కానీ ఎంత వింత పదమైత్ర...

వేకి

  సెప్టెంబర్ 29, 2022 వేకి  ( veyki )       అర్థము      (విశేష్యము ): జ్వరము; వేడి; కాక     Meaning     (noun) : fever    వాడుక / Usage  పిల్లల ఆకలి తీర్చాలంటే  అంత వేకిలో కూడ ఆమెకు పనిలోకి పోక తప్పదు .  To feed her hungry children she had to work despite the high fever.     మెదడుకు మేత / Food for thought వాని నుద్ధరించు భగవంతుడే లేదు మనుజెడెట్లు వాని గనికరించు వాడు జేసికొన్నపాపకారణ మేమో యింతవరకు వాని కెరుకలేదు కులమతాల గీచుకున్న గీతలను జొచ్చి పంజరాన కట్టువడను నేను నిఖిలలోక మెట్లు నిర్ణయించిన నాకు తిరుగు లేదు విశ్వ నరుడను నేను -- గుఱ్ఱం జాషువా (సెప్టెంబర్ 28, 1895 - 1971)

సింగిడి

  సెప్టెంబర్ 28, 2022 సింగిడి  ( singidi )       అర్థము      (విశేష్యము ): ఇంద్ర ధనస్సు; హరివిల్లు     Meaning     (noun) : rainbow    వాడుక / Usage   పూల సింగిడి నేలకు దిగిందా అన్నట్టుగా గ్రేటర్‌ అంతా తీరొక్క పువ్వులతో మురిసిపోతున్నది .  Greater Hyderabad glowed with flowers that looked as if rainbow of flowers descended from the heavens.     మెదడుకు మేత / Food for thought నల్లని వాడు పద్మ నయనంబుల వాడు కృపా రసంబు పై జల్లెడు వాడు మౌళి పరిసర్పిత పింఛము వాడు, నవ్వు రా జిల్లెడు మోము వాడొకడు చెల్వల మానధనంబుఁదెచ్చె, నో మల్లియ లార ! మీ పొదల మాటున లేడు గదమ్మ తెల్పరే (నల్లని వాడు. పద్మాల వంటి కళ్ళు కల వాడు. దయా పూరితములైన చూపుల వాడు, తల మీద నెమలి పింఛం ధరించిన వాడు, నవ్వులు చిందించే ముఖంకలిగిన వాడు, చెలుల మాన ధనాన్ని దోచుకుని పోయాడు. ఓ మల్లియలారా ! ఆ తుంటరి మీ పొదల మాటున కాని ఉన్నాడా, చెప్పరూ?) -- మహాభాగవతం , పోతన (1450 - 1510)

అలబలము

  సెప్టెంబర్ 27, 2022 అలబలము  ( ala-balamu )       అర్థము      (విశేష్యము ): కలకలం; సద్దు; చప్పుడు; రొద; గొల్లు మను ధ్వని     Meaning     (noun) : outcry; noise; clamour; uproar    వాడుక / Usage  సభలోకి ఆమె ప్రవేశించగానే ప్రతిపక్షంలో అలాబలం మొదలయ్యింది .  As she entered the house there was an uproar in the Opposition.     మెదడుకు మేత / Food for thought కనుగొనగదోయి భావలోచనము దెఱచి మామకీన ప్రచండ తేజోమహత్త్వ మీ విషానలకీలా ప్రభావ దగ్దమై సమస్తము నడగు సృష్ట్యాది నుండి! ఈ మదీయ కరాళ జిహ్వికలయందు జీవసముదయమెపుడైన జిక్కవలయు ఈ విషానల ధూమరేఖావృతమయి కుందు జీవాళికదియె వైకుంఠపథము -- మృత్యువుకీ జీవజాలానికీ అనుబంధం , శ్రీశ్రీ (ఏప్రిల్ 30, 1910 - 1983)

మంగిడీ

  సెప్టెంబర్ 26, 2022 మంగిడీ  ( mangidi )       అర్థము      (విశేష్యము ): నమస్కారం; దండము; అభివాదన     Meaning     (noun) : bow; salutation; obeisance    వాడుక / Usage  తెలుగు భాషాభిమానులకు మంగిడీలు .  Salutations to the lovers of Telugu language.     మెదడుకు మేత / Food for thought కాలము నిల్వబోదు క్షణకాలము; మృత్యువు చేతిలోనికూ జాలము; నిల్వజాలని నిజాలము; ఎప్పటి కేమొ చెప్పగా జాలము; గాన ఎందు కిక జాలము? బాలకురంగనేత్ర! నీ వాలుగనుల్ తళుక్కుమన వంచుము శీధువు పానపాత్రలో -- అమర్ ఖయాం , కరుణశ్రీ జంధ్యాల పాపయ్య శాస్త్రి (ఆగష్టు 04, 1912 - 1992)

సరసిజము

  సెప్టెంబర్ 23, 2022 సరసిజము  ( sarasi-jamu )       అర్థము      (విశేష్యము ): సరస్సులో పుట్టినది; కమలము; పద్మము; తామర పువ్వు     Meaning     (noun) : lotus    వాడుక / Usage  తియ్యనైన తేనెలు కొరకై సరసిజములో తనను తాను మర్చిపోయిన భ్రమరము ముడుచుకుపోయిన ఆ కమలంలో చిక్కుకుపోయింది.  The bee lost in the sweetness of nectar was trapped in the lotus as it folded it's petals.     మెదడుకు మేత / Food for thought జాగ్రత్త! నేను భయం యెరగను; అందుకే నేను మహా శక్తిమంతుడను...ప్రేమను చిగురింప చేయలేకపోతే భీతి పుట్టిస్తాను...నేను ఒంటరిని,  దౌర్భాగ్యుడిని ; నాలాగా వికారి అయినవాళ్లే నాపై మరులు కురిపించగలరు. -- ఫ్రాంకెన్‌స్టైయిన్ , మేరీ షెల్లీ (ఆగష్టు 30, 1797 - 1851)

లోలుడు

  సెప్టెంబర్ 22, 2022 లోలుడు  ( lōluḍu )       అర్థము      (విశేష్యము ): చంచలం చెందేవాడు; కామించు వాడు; ఇచ్ఛ/వాంఛ కలవాడు     Meaning     (noun) : one who loves/desires/enamoured    వాడుక / Usage   గొప్ప వస్తువులు ఎన్నో అందుబాటులో ఉన్నా కలాం ఇంద్రియ  లోలుడు కాలేదు .  Despite having access to much Kalam was not desirous of sensual pleasures.     మెదడుకు మేత / Food for thought విశ్వాస ఘాతుకం, దౌర్జన్యం - రెండు ప్రక్కలా పదునైన మొనలున్న బల్లెం లాంటివి; శత్రువులకన్నా, ప్రయోగించిన వారినే ఎక్కువగా గాయపరుస్తాయి...నువ్వు ఒక్కసారి, నాకు నీలో ఉందని తెలిసిన, అనురాగంతో నన్ను చూస్తే సదా నీ బానిసనైపోతాను. -- వూథరింగ్ హైట్స్ , ఎమిలీ బ్రోంటే (జులై 30, 1818 - 1848)

సలలితము

  సెప్టెంబర్ 21, 2022 సలలితము  ( sa- lalitamu )       అర్థము      (విశేషణము ): సుందరము; మనోజ్ఞము; అందమైనది     Meaning     (adj) : beautiful; amorous; elegant    వాడుక / Usage  వసంత కోకిలలు పాడు వేళ, నెమలులు పురివిప్పిన ఆ దృశ్యం సలలితమై మైమరపించింది.  Cuckoos singing and peacocks dancing - I was lost in the beauty of it.     మెదడుకు మేత / Food for thought మగవాళ్ళు తమ భావాల్ని వ్యక్తపరచడానికి సృష్టించిన భాషలో, తనలో అంతర్లీనమైన భావాలను తెలియచేయడానికి స్త్రీ కష్టపడుతుంది...వారిద్దరి మధ్య పరస్పర వేదన గురించి వారు అసలు మాట్లాడలేదు. అందమైన మాటలు కమ్మనైన పదాలు గాఢ మిత్రులు మధ్య అనవసరమేమో కదా! --ఫార్ ఫ్రొమ్ ది మాడ్డింగ్ క్రౌడ్, థామస్ హార్డీ (జూన్ 2, 1840 - 1928)

విరహితము

  సెప్టెంబర్ 20, 2022 విరహితము  ( vi- rahitamu )       అర్థము      (విశేషణము ): విడువబడినది; లేనిది; మినహాయింపబడినది     Meaning     (adj) : separated; abandoned; bereft; without; left    వాడుక / Usage  రంతిదేవుడు మిక్కిలి కష్టాలలో కూడా ధర్మ విరహితమైన మార్గము అనుసరించలేదు.  Rantideva never left the path of Dharma despite all his travails.     మెదడుకు మేత / Food for thought మనుషులు నెప్పి కన్నా ఎక్కువగా మృత్యువుకి భయపడతారు. మృత్యువు గురించి భయపడడం విచిత్రం. జీవనం మృత్యువు కన్నా ఎక్కువ బాధకలిగిస్తుంది. మరణించిన క్షణాన నొప్పి మటుమాయం అయిపోతుంది. --ది డోర్స్ బ్యాండ్ గాయకుడు, జిమ్ మొర్రిసన్  (డిసెంబర్ 8, 1943 - 1971)

విహితులు

  సెప్టెంబర్ 19, 2022 విహితులు  ( vi-hitulu )       అర్థము      (విశేష్యము ): స్నేహితులు; బంధువులు; ఆప్తులు     Meaning     (noun) : friends; relatives; someone very close    వాడుక / Usage  దౌత్య సంబంధాల్లో విహితులు ఎవరో విరోధులు ఎవరో తెలుసుకోవడం కత్తి మీద సాము లాంటిది.  In diplomacy knowing friends from enemies is like walking on a razor's edge.     మెదడుకు మేత / Food for thought నీ శత్రువు శక్తి సామర్ధ్యాలు, నీ శక్తీ సామర్ధ్యాలు తెలిసి ఉంటే, నూరు యుద్ధాల పోరాడినా వాటి ఫలితం గురించి భయ పడక్కర్లేదు. నీ గురించి తెలిసి, శత్రువు గురించి అవగాహన లేదో, గెలిచిన ప్రతీ పోరుకీ ఒకటి ఓడతావు. నీ గురించీ అవపోసన లేక శత్రువు గురించీ తెలియలేదో ప్రతీ సమరంలో ఓటమి తథ్యం.  --ది ఆర్ట్ ఆఫ్ వార్, సన్ జూ (క్రీపూ 544 - 496)

కైవారము

  సెప్టెంబర్ 16, 2022 కైవారము  ( kai-vāramu )       అర్థము      (విశేష్యము ): పొలంలో మళ్ల అంచు; చుట్టుకొలత; నమస్కారం; స్తోత్రం; పొగడ్త     Meaning     (noun) : circumference; circle; border around a field; praise; flattery    వాడుక / Usage  ప్రక్కనున్న బల్లమీద రంగారావుగారి ఛాయాపటము దంతపు కైవారము నం దిముడ్చబడి యుండెను.  On the table next to her Rangarao's picture sat in a round ivory frame.     మెదడుకు మేత / Food for thought తలదించుకు  బతుకుతావ తలఎత్తుకు తిరగలేవ తలరాతను మార్చుకోవ... సిగ్గనేది లేదా? ఒకడిగ నువు పుట్టలేద ఒకడిగ నువు చచ్చిపోవ ఒకడిగ పోరాడలేవ... నిద్రలేచి రారా నీ ఓటుని  నీ వేటుకె  వాడుతుంటె వింతగా జుట్టుపట్టి రచ్చకీడ్చి నిలదీయవనేరుగా? ఉడుకెత్తిన  నెత్తురె ఒక   నిప్పుటేరులాగ కదలిరా...కదలిరా...కదలిరా పనైపోద్ది...పనైపోద్ది..పనైపోద్ది ...రారా నీ ఇంటి చూరువిరిగి మీదపడక ముందే నీ గుండెల చప్పుడు నిను ఛీ కొట్టకముందే కదల్రా....కదల్రా...కదల్రా...ఒరేయ్ దేహానికి ...

నెరియ

  సెప్టెంబర్ 15, 2022 నెరియ  ( neriya )       అర్థము      (విశేష్యము ): నేల పగులు; బీటిక; పూర్తిగా; బొత్తిగా     Meaning     (noun) : crack; fissure; totally; not at all    వాడుక / Usage  మాగాని కోసిన పొలము లన్నియు నెఱియలు పడి వెచ్చని యావిరి వదులుచుండెను.  Cracks in the fields, where the crop was harvested, were steaming.     మెదడుకు మేత / Food for thought ఎవరో వస్తారని ఏదో చేస్తారని ఎదురు చూసి మోసపోకుమా నిజం మరచి నిదురపోకుమా బడులే లేని పల్లెటూళ్ళలో బడులే లేని పల్లెటూళ్ళలో చదువే రాని పిల్లలకు చదువు రాని చదువుల బడిలో జీతాలు రాని పంతుళ్ళకు ఎవరో తోడు వస్తారని ఏదో మేలు చేస్తారని ఎదురు చూసి మోసపోకుమా చాలీ చాలని పూరి గుడిసెలో చాలీ చాలని పూరి గుడిసెలో కాలే కడుపుల పేదలకు మందులు లేని ఆసుపత్రిలో పడిగాపులు పడు రోగులకు ఎవరో తోడు వస్తారని ఏదో మేలు చేస్తారని ఎదురు చూసి మోసపోకుమా తరతరాలుగా మూఢాచారపు వలలో చిక్కిన వనితలకు అజ్ఞానానికి అన్యాయానికి బలి అయిపోయిన పడతులకు ఎవరో తోడు వస్తారని ఏదో మేలు చేస్తారని ...

సకృత్తు

  సెప్టెంబర్ 14, 2022 సకృత్తు  ( sakṛittu )       అర్థము      (విశేషణము ): ఎప్పుడైనా ఒకసారి; అరుదుగా; అపురూపముగా; ఒక పర్యాయము     Meaning     (adverb) : rarely; seldom; scarcely    వాడుక / Usage  గణాచారి ఎప్పుడునూ బయటికే రాదు. ఇట్టి సంఘటనలు జరిగినపుడే వచ్చును. అవి సకృత్తుగా జరుగును .  Ganachari never comes out. He comes only when such incidents happen. And they are rare.     మెదడుకు మేత / Food for thought మందార మకరంద మాధుర్యమున దేలు మధుపంబు వోవునే మదనములకు నిర్మల మందాకినీవీచికల దూగు రాయంచ చనునే తరంగిణులకు లలిత రసాల పల్లవ ఖాదియై సొక్కు కోయిల జేరునే కుటజములకు పూర్ణేందు చంద్రికాస్ఫురిత చకోరక మరుగునే సాంద్ర నీహారములకు అంబుజోదర దివ్య పాదారవింద  చింతనా మృత పాన విశేషమత్త  చిత్త మేరీతి నితరంబు జేరనేర్తు? వినుత గుణసీల ! మాటలు వేయునేల ? ( మందార పువ్వుల తేనెల మాధుర్యానికి అలవాటు పడ్డ తుమ్మెద ఉమ్మేత్తు చెట్ల వైపుకు పోవునా? స్వచ్చమయిన నిర్మల మయిన గంగానదిలో తేలియాడు రాజ హంసలు వాగులకు వంకలకు ...

దీధితి

  సెప్టెంబర్ 13, 2022 దీధితి  ( dīdhiti )       అర్థము      (విశేష్యము ): కిరణము; కాంతి; వెలుగు; దీప్తి     Meaning     (noun) : ray of light; brightness; splendour    వాడుక / Usage  ఒకానొకని మొగమందు సునిశితములై దిధీతి మయమైన నేత్రములుండును. అట్లే కృష్ణదేవరాయల గొప్పదనమంతయు ఆయన వర్ణనలలో నున్నది. Someone's eyes might be the splendour of their face. Similarly Krishnadevaraya's greatness lies in painting pictures with words.     మెదడుకు మేత / Food for thought చెలియ లేదు చెలిమి లేదు వెలుతురే లేదు చెలియ లేదు చెలిమి లేదు వెలుతురే లేదు ఉన్నదంతా చీకటైతే వుంది నీవేనే ఏ ఉన్నదంతా చీకటైతే వుంది నీవేనే మిగిలింది నీవేలే చెలియ లేదు చెలిమి లేదు వెలుతురే లేదు చెలిమి పోయే చెలువు పోయే నెలవే వేరాయే చెలిమి పోయే చెలువు పోయే నెలవే వేరాయే చేరదీసి సేవచేసే తీరు కరువాయే చేరదీసి సేవచేసే తీరు కరువాయే నీ దారే వేరాయే చెలిమి పోయే చెలువు పోయే నెలవే వేరాయే మరుపురాని బాధ కన్నా మధురమే లేదు మరుపురాని బాధ కన్నా మధురమే లేదు గతము తలచి...

పొత్తము

  సెప్టెంబర్ 12, 2022 పొత్తము  ( pottamu )       అర్థము      (విశేష్యము ): పుస్తకం; కావ్యం; ప్రబంధం; సమూలము     Meaning     (noun) : book; poem; treatise    వాడుక / Usage  ధర్మారావు చెవి యొగ్గి వినెను. మూడు కొట్టెను. దీపము తగ్గించి పొత్తము దూరము నందుంచి చూచెను .   Dharma Rao listened keenly. Clock struck three. He turned the lamp down, put the book away and gazed.     మెదడుకు మేత / Food for thought ముందు తెలిసెనా ప్రభూ ఈ మందిరమిటులుంచేనా మందమతిని నీవు వచ్చుమధుర క్షణమేదో..కాస్త ముందు తెలిసెనా ప్రభూ ఈ మందిరమిటులుంచేనా మందమతిని నీవు వచ్చుమధుర క్షణమేదో..కాస్త ముందు తెలిసెనా ప్రభూ అందముగా నీ కనులకు విందులుగా వాకిటనే అందముగా నీ కనులకు విందులుగా వాకిటనే సుందర మందార కుంద సుమదళములు పరువనా సుందర మందార కుంద సుమదళములు పరువనా దారి పొడుగునా తడిచిన పారిజాతములపై నీ అడుగుల గురుతులే నిలిచినా చాలును ముందు తెలిసెనా ప్రభూ ఈ మందిరమిటులుంచేనా మందమతిని నీవు వచ్చుమధుర క్షణమేదో..కాస్త ముందు తెలిసెనా ప్రభూ బ్ర...

సంస్థాగత నడవడిక

  సెప్టెంబర్ 09, 2022 సంస్థాగత నడవడిక  ( samsthagatha-nadavadika )       అర్థము      (విశేష్యము ):  సంస్థల్లో వ్యక్తుల వ్యవహారము; దానిపై క్రమబద్ధ అధ్యయనం     Meaning     (noun) : organisational behaviour or study there of    వాడుక / Usage  ఆడమ్ స్మిత్ శ్రమ విభజన ఆధారంగా   సంస్థాగత నడవడిక గురించి చర్చించాడు.   Adam Smith discussed organisational behaviour from a labour division perspective.     మెదడుకు మేత / Food for thought ఆకాశం విరిగినట్టు కాకూడనిదేదో జరిగినట్టు కిం కర్తవ్యం అని కలవరపడడం కొందరి తరహా అవకాశం చూసుకుంటూ ఆటంకాలొడుపుగ దాటుకుంటూ వాటంగా దూసుకుపొతే మేలని కొందరి సలహా ఏదో తలవడం వేరే జరగడం సర్లే అనడమే వేదాంతం దేన్నొ వెతకడం ఎన్నో అడగటం ఎపుడూ తెమలని రాద్ధాంతం ఏం చేద్దాం అనుకుంటె మాత్రం ఏం పొడిచేస్తాం ఏం చూద్దాం మునుముందేముందో తెలియని చిత్రం ఏమౌతాం మననెవరడిగారని ఏమని అంటాం -- సిరివెన్నెల సీతారామ శాస్త్రి (మే 20, 1955 - 2021)

వ్యవస్థాపకత

  సెప్టెంబర్ 08, 2022 వ్యవస్థాపకత  ( vyavasthapakatha )       అర్థము      (విశేష్యము ):  కొత్త వ్యవస్థ లేక  సంస్థను నిర్మించటం     Meaning     (noun) : entrepreneurship    వాడుక / Usage   దేశ ఆర్థిక వ్యవస్థలో గ్రామీణ వ్యవస్థాపకత కీలక పాత్ర పోషిస్తోంది .  Entrepreneurship in villages is a key part of the country's economy.     మెదడుకు మేత / Food for thought ఎవడారగించు నమృత భోజనంబున గలిసెనో యీ లేమ గంజిబువ్వ ఎవడు వాసము సేయు శృంగార సౌధాన మునిగెనో యిన్నారి పూరిగుడిసె ఎవని దేహము మీది ధవళాంబరములలో నొదిగెనో యిన్నారి ముదుక పంచె ఎవడు దేహము సేర్చు మృదు తల్పములలోన నక్కెనో యీ యమ్మ కుక్కిపడక వసుధపైనున్న భోగ సర్వస్వమునకు స్వామిత వహించి మనుజుండు ప్రభవమందు నెవడపహరించె నేమయ్యె నీమె సుఖము కలుషమెఱుగని దీని కొడుకుల సుఖము -- గుఱ్ఱం జాషువా (సెప్టెంబర్ 28, 1895 - 1971)

ప్రామాణీకరణ

  సెప్టెంబర్ 07, 2022 ప్రామాణీకరణ  ( prāmāṇikarana )       అర్థము      (విశేష్యము ):  ప్రామాణికము=యథార్థమైన, సత్యమైన;  యథార్థము అవునో కాదో తెలుసుకునే ప్రక్రియ     Meaning     (noun) : authentication    వాడుక / Usage  పటిష్టమైన  ప్రామాణీకరణ లేనిదే ప్రభుత్వం అంతర్జాలం ద్వారా సేవలు అందించలేదు.  Strong authentication is a prerequisite for delivering services over internet.     మెదడుకు మేత / Food for thought ఎవరేమీ అనుకున్నా నువ్వుండే రాజ్యాన రాజు నువ్వే బంటూ నువ్వే మంత్రీ నువ్వే సైన్యం నువ్వే ఏమైనా ఏదైనా నువ్వేళ్ళే బడి లోన పలకా నువ్వే బలపం నువ్వే ప్రశ్నా నువ్వే బదులూ నువ్వే.. అన్నీ నువ్వే కావాలి అనునిత్యం పోరాడాలీ.. అనుకున్నది సాధించాలీ... అవమానాలే ఆభరణాలు.. అనుమానాలే అనుకూలాలు.. సందేహాలే సందేశాలు.. ఛీత్కారాలే సత్కారాలూ... అనుకోవాలీ.. అడుగేయాలీ ముళ్ళ మార్గాన్ని అణ్వేషించాలీ.. అలుపొస్తున్నా కలలే కన్నాపూల స్వర్గాన్ని అధిరోహించాలీ.. ఎవరికి వారే లోకంలో.. ఎవరికి పట్టని శోకం లో.. నీ...

అనువర్తనము

  సెప్టెంబర్ 06, 2022 అనువర్తనము  ( anuvartanamu )       అర్థము      (విశేష్యము ): అనుసరించుట; వెంట నడవడం; అన్వయించు     Meaning     (noun) : applied; following; complying    వాడుక / Usage   అనువర్తిత నిర్వహణ మీద పీటర్  డ్రకర్  అనేక పుస్తకాలు ప్రచురించాడు.  Peter Drucker published many books on Applied Management.     మెదడుకు మేత / Food for thought   రాయినైనా కాకపోతిని రామపాదము సోకగా బోయనైనా కాకపోతిని పుణ్యచరితము పాడగా రాయినైనా కాకపోతిని రామపాదము సోకగా బోయనైనా కాకపోతిని పుణ్యచరితము పాడగా పడవనైనా కాకపోతిని స్వామికార్యము తీర్చగా పాదుకైనా కాకపోతిని భక్తిరాజ్యము నేలగా అడవిలోపల పక్షినైతే అతివ సీతను కాచనా అందువలన రామచంద్రుని అమిత కరుణను నోచనా అడవిలోపల పక్షినైతే అతివ సీతను కాచనా అందువలన రామచంద్రుని అమిత కరుణను నోచనా కడలి గట్టున ఉడతనైతే బుడత సాయము చేయనా కాలమెల్లా రామభద్రుని వేలిగురుతులు మోయనా రాయినైనా కాకపోతిని రామపాదము సోకగా బోయనైనా కాకపోతిని పుణ్యచరితము పాడగా కాకినైనా కాకపోతిని ...

విపణీకరణ

  సెప్టెంబర్ 05, 2022 విపణీకరణ  ( vipanikarana )       అర్థము      (క్రియ/విశేష్యము ): విపణి = అంగడి, వర్తకుడు; కరణ=హేతువు, కారణం;  వ్యక్తులు మరియు సంఘములు, వాటి యొక్క ప్రస్తుత మరియు ఆవిష్కృత అవసరాలను మరియు కోరికలను తృప్తి పరచుకోగలిగే, ఇతరుల ఉత్పత్తి చేయబడే ఉత్పత్తులు మరియు అందించబడే సేవలను కనుగొనే సమీకృత సమాచార ఆధారిత పద్ధతి     Meaning     (verb/noun) : marketing    వాడుక / Usage  " విపణీకరణ ఒక మహాసముద్రం వంటిది. "అమ్మకాలు" అందులో ఏర్పడిన మంచుముద్ద యొక్క మొన మాత్రమే!"  "Selling is only the tip of the marketing iceberg." - Philip Kotler     మెదడుకు మేత / Food for thought          మనకి అన్నీ తెలుసు అనుకున్న క్షణాన నేర్చుకునే దృక్పథం తెర మరుగవుతుంది. నిజమైన గురువు మనం స్వయంగా ఆలోచించుకునేట్లు చేస్తాడు.  విద్య యొక్క లక్ష్యం స్వేచ్చగా అలోచించి చారిత్రపు నేపథ్యం కట్టుబాటు అధిరోహించి, ప్రకృతి యొక్క అవరోధాలను జయించడమే. -- డా. సర్వేపల్లి రాధాకృష్ణన్ (సెప్టెంబర్...

ఎరగలిచిచ్చు

  సెప్టెంబర్ 02, 2022 ఎరగలిచిచ్చు  ( eragalichicchu )       అర్థము      (సమాసము ): ఎరగలి = ఎండిన మ్రాను రాసుకుని అడవిలో పుట్టే అగ్ని; చిచ్చు = మంట; దావాగ్ని; కారు చిచ్చు     Meaning     (Compound) : forest fire    వాడుక / Usage   ఎరగలిచిచ్చులో చిక్కుకున్న ఎలుక  కలుగు త్రవ్వి ప్రాణం కాపుడుకుంటుందని విదురుడు గుర్తుచేశాడు.  Mouse hides underground to escape the forest fire, reminded Vidura.     మెదడుకు మేత / Food for thought         ఏనుంగు నెక్కి పెక్కేనుంగు లిరుగడ             రా పురవీధుల గ్రాలగలదె       మణిమయంబగు భూషణ జాలములనొప్పి             ఒడ్డోలగంబున నుండగలదె       అతి మనోహరలగు చతురాంగనల తోడి             సంగతి వేడ్కలు సలుపగలదె    ...

నలుగడలు

  సెప్టెంబర్ 01, 2022 నలుగడలు  ( nalugadalu )       అర్థము      (సమాసము ): నలు =నాలుగు; కడలు =దిక్కులు; నాలుగు ప్రక్కలు/వైపులు/దిక్కులు     Meaning     (Compound) : all sides; all around; surrounded by    వాడుక / Usage  కౌరవ సైన్యం నలుగడలు రక్షింపగా జయద్రధుడు పద్మవ్యూహంలో సూర్యాస్తమయం కొరకు ఎదురు చూసాడు.  Protected by Kauravas on all sides, Jayadratha hidden in Padmavyuha, waited for Sun set.     మెదడుకు మేత / Food for thought ఆత్మసుఖమ్ము కోసమయి అన్యుల గొంతుల కోసితెచ్చు పుణ్యాత్ముడా! నీకు మోక్ష మెటులబ్బును? నెత్తురు చేతి పూజ విశ్వాత్ముడు స్వీకరించునే? చరాచరవర్తి ప్రభుడు మా పవిత్రాత్మల నందుకోడే! నడమంత్రపు నీ తగులాటంవేటికిన్? ఊలు దారాలతో గొంతుకురి బిగించి గుండెలో నుండి సూదులు గ్రుచ్చి కూర్చి ముడుచుకొందురు ముచ్చట ముడులమమ్ము అకటా! దయలేనివారు మీ ఆడువారు -- పుష్ప విలాపం, కరుణ శ్రీ జంధ్యాల పాపయ్య శాస్త్రి (ఆగష్టు 4, 1912, 1992)