Posts

Showing posts from November, 2022

వేసారు

  నవంబర్ 30, 2022 వేసారు  ( vesaaru )       అర్థము      (క్రియ ): శ్రమపడు; దుఃఖించు; విసుగు చెందడం     Meaning     (verb) : fatigued; suffer/troubled; end of tether    వాడుక / Usage అధికారుల చుట్టూ తిరిగి తిరిగి వేసారి పోయి అసహనంతో సతమతమవుతున్న రైతులు. Farmers fatigued and impatient chasing truant officials.     మెదడుకు మేత / Food for thought పదిమంది కోసం నిలబడ్డ నీకు ఫలితం ఏమిటి? యమపాశం ...ఫలితం ఏమిటి యమపాశం ఎవరికి వారే ఈలోకం రారు ఎవ్వరూ నీకోసం ఎవరికి వారే ఈలోకం రారు ఎవ్వరూ నీకోసం నిజము నిప్పులాంటిదెప్పుడు... నిన్ను దహించకా తప్పదు నిజము నిప్పులాంటిదెప్పుడు... నిన్ను దహించకా తప్పదు లేదూ లేదురా న్యాయము... లేదూ లేదురా న్యాయము నీకు చావు ఒక్కటే సాయము.... నిట్టూర్చే భూమి... నిదురించే గాలి... నిను చూసి నవ్వింది ఆకాశం ఎవరికి వారే ఈ లోకం రారు ఎవ్వరూ నీ కోసం వేసిన తలుపులు తియ్యరు... మూసిన కన్నులు తెరవరు వేసిన తలుపులు తియ్యరు... మూసిన కన్నులు తెరవరు ఎంత పిలచినా పలకరు.. ఎంత పిలచినా పలకరు నీకై రవంత కన్నీరు వి...

తప్తము

  నవంబర్ 29, 2022 తప్తము  ( taptamu )       అర్థము      (విశేషణము ): తపింప చేయబడినది; వేడి/కాచ బడిన; అగ్నిచే పునీతం చేయబడిన     Meaning     (adj/adv) : heated; burnt; purified by fire; penance; distressed; afflicted    వాడుక / Usage బాధా తప్త హృదయం భగ్న ప్రేమికులకు విధి విధించిన శిక్ష. Pain in the jilted lovers hearts is a curse of fate.        మెదడుకు మేత / Food for thought ఎవరో జ్వాలను రగిలించారు ! వేరెవరో దానికి బలియైనారు వేరెవరో దానికి బలియైనారు         ||ఎవరో|| అడుగు అడుగునా అపజయములతో అలసి సొలసిన నా హృదయానికి సుధ వై జీవన సుధవై ఉపశాంతి నివ్వగా ఓర్వని వారలు       ||ఎవరో|| అనురాగానికి ప్రతి రూపాలై ఆది దంపతుల వలె మీరుంటె ఆనందముతో మురిశానే ఆత్మీయులుగా తలచా నే అందుకు ఫలితం అపనిన్దెనా      ||ఎవరో|| మనిషి మనిషికి మమత కూడదా ? మనసు తెలుసుకొను మమతే లేదా ? ఇది తీరని శాపం ! ఇది మారని లోకం మానవుడే దానవుడై మస లే చీకటి నరకం  ||ఎవరో|| --డా.చక్రవర...

ఆంగికము

  నవంబర్ 28, 2022 ఆంగికము  ( āngikamu )       అర్థము      (విశేషణము ): అంగముతో చేయబడినది; హస్తములతో చేయు అభినయము; కనుబొమలు ఎగురవేయుట; స్త్రీల హావభావము     Meaning     (adj/adv) : bodily actions; gesticulations with hands or raising eyebrows used in classical dance    వాడుక / Usage వెంపటి చినసత్యం నృత్యాలలో అభినయం, ఆంగికం , ముఖభావాలు అత్యధ్బుతంగా ఉంటాయి. Vempati Chinasatyam's dance incorporates beautiful actions, gesticulations and expressions.        మెదడుకు మేత / Food for thought పిలిచిన మురళికి,వలచిన మువ్వకి, ఎదలో ఒకటే రాగం.. అది ఆనంద భైరవి రాగం!! మురిసిన మురళికి, మెరిసిన మువ్వకి, ఎదలో ప్రేమ పరాగం.. మది ఆనంద భైరవి రాగం!! కులికే మువ్వల అలికిడి వింటే కళలే నిద్దుర లేచే.. కులికే మువ్వల అలికిడి వింటే కళలే నిద్దుర లేచే.. మనసే మురళి ఆలాపనలో మధురానగరిగ తోచే.. యమునా నదిలా పొంగినది స్వరమే వరమై..సంగమమై!! మురిసిన మురళికి, మెరిసిన మువ్వకి, ఎదలో ప్రేమ పరాగం.. మది ఆనంద భైరవి రాగం!! పిలిచిన మురళికి,వలచ...

మణిపూస

  నవంబర్ 25, 2022 మణిపూస  ( manipoosa )       అర్థము      (విశేష్యము ): అందరిలో శ్రేష్ఠమైన వ్యక్తి;  అతి ప్రాముఖ్యమైనది     Meaning     (noun) : exemplary; the best     వాడుక / Usage అల్లూరి సీతారామరాజు కృష్ణ సినిమాలలో మణిపూస . Alluri Seetaramaraju is an exemplary movie in Krishna's films.        మెదడుకు మేత / Food for thought मिरे दिल, मिरे मुसाफ़िर हुआ फिर से हुक्म सादिर कि वतन-बदर हों हम तुम दें गली गली सदाएँ करें रुख़ नगर नगर, का कि सुराग़ कोई पाएँ किसी यार-ए-नामा-बर का हर इक अजनबी से पूछें जो पता था अपने घर का सर-ए-कू-ए-ना-शनायाँ हमें दिन से रात करना कभी इस से बात करना कभी उस से बात करना तुम्हें क्या कहूँ कि क्या है शब-ए-ग़म बुरी बला है हमें ये भी था ग़नीमत जो कोई शुमार होता हमें क्या बुरा था मरना अगर एक बार होता! నా హృదయమా, నా సహవర్తి వచ్చింది మరోసారి ఫర్మానా మనిద్దరికీ తప్పదు బహిష్కరణ వీధి వీధిన ఎలుగెత్తుతూ ప్రతి పట్టణం తిరుగుతూ. వెతకాలి జాడ ప్రియురాలి దూత కోసం. అడగాలి ప్...

తార్కాణము

  నవంబర్ 24, 2022 తార్కాణము  ( tārkāṇamu )       అర్థము      (విశేష్యము ): నిదర్శనము; ప్రామాణ్యము; ఉదాహరణ     Meaning     (noun) : example; proof; evidence     వాడుక / Usage వ్యంగ్య వ్యక్తీకరణకు తార్కాణం   మువ్వా శ్రీనివాసరావు దీర్ఘ కవితా సంపుటి "వైరాయణం ." Srinivasa Rao's poem Vyrayanam is a good example of satire.        మెదడుకు మేత / Food for thought थोड़ी देर ज़रा-सा और वहीं रुकतीं तो... सूरज झांक के देख रहा था खिड़की से  एक किरण झुमके पर आकर बैठी थी, और रुख़सार को चूमने वाली थी कि तुम मुंह मोड़कर चल दीं और बेचारी किरण फ़र्श पर गिरके चूर हुईं थोड़ी देर, ज़रा सा और वहीं रूकतीं तो... ఇంకాసేపు ఇంకొంచం సేపు నువ్వు అక్కడే ఉండి ఉంటే.. సూర్యుడు తొంగి చూస్తూ ఉన్నాడు కిటికీలోంచి కిరణం ఒకటి జూకా మీదకి వచ్చి కూచుంది, వంగి అది బుగ్గమీద ముద్దు పెట్టబోతూ ఉంటే నువ్వు మొహం తిప్పుకుని వెళ్ళిపోయావు, పాపం పిచ్చి కిరణం నేల మీద పడి ఛిన్నాభిన్నం అయిపొయింది ఇంకాసేపు ఇంకొంచం సేపు నువ్వు అ...

మచ్చుతునక

  నవంబర్ 23, 2022 మచ్చుతునక  ( macchutunaka )       అర్థము      (విశేష్యము ): మచ్చు=వన్నె చూడటానికి వాడే రాయి/పలక; తునక=ముక్క; మంచి ఉదాహరణ; కొలమానం     Meaning     (noun) : touchstone    వాడుక / Usage సత్యజిత్ రాయ్ దర్శకత్వం వహించిన  చారులత, చలనచిత్రాలకే మచ్చుతునక . Satyajit Ray's Charulatha is a touchstone for good films.       మెదడుకు మేత / Food for thought ये चमन-ज़ार ये जमुना का किनारा ये महल ये मुनक़्क़श दर ओ दीवार ये मेहराब ये ताक़ इक शहंशाह ने दौलत का सहारा ले कर हम ग़रीबों की मोहब्बत का उड़ाया है मज़ाक़ मेरी महबूब कहीं और मिला कर मुझ से ఈ ఉద్యానవనం ఈ యమునాతటి ఈ మహల్ ఈ నగిషీ చెక్కిన తలుపులు ఆ ప్రహారాలు ఈ తోరణాలు ఈ గూడులు ఒక షహెన్షా ధనోన్మత్తుడై  భాండార వృష్టితో మాబోటి పేదల ప్రేమను చేసాడు పరిహాసం  ఓ నా ప్రియతమా నన్ను వేరే ఇంకెక్కడైనా కలుస్తూ ఉండు -- సాహిర్ లుధియాన్వీ  (మార్చ్ 8, 1921 - 1980)

కలికితురాయి

  నవంబర్ 22, 2022 కలికితురాయి  ( kaliki turāyi )       అర్థము      (విశేష్యము ): కలికి=కొంగ ఈక; తురాయి=తల మీద పెట్టుకునే ఆభరణం; కొంగయీకలతో చేసినశిరోభూషణం;      Meaning     (noun) : feather in the cap    వాడుక / Usage తెలుగు చలనచిత్ర రంగానికే కాక సాహిత్య మరియు కళారంగాలకి కలికితురాయి కే. విశ్వనాథ్. K.Viswanath is a feather in the cap of Telugu cinema and literary spheres.       మెదడుకు మేత / Food for thought बुरा जो देखन मैं चला, बुरा न मिलिया कोय, जो दिल खोजा आपना, मुझसे बुरा न कोय బురా జో దేఖన్ మై చలా, బురా న మిలియా కోయ, జో దిల్ ఖోజా ఆపనా, ముజ్సే బురా న కోయ  వెతికాను చెడు కోసం ప్రపంచంలో, దొరకలేదు ఏడ, లోతుగా గాలిస్తే నా  మనసులో , నన్ను మించిన చెడు లేదింకేడ -- కబీర్ దాస్ (1398 - 1518)

ఆపాదమస్తకము

  నవంబర్ 21, 2022 ఆపాదమస్తకము  ( aapaadamastakamu )       అర్థము      (విశేషణము ): పాదాల నుంచి తల వరకు; క్రింద నుంచి పై దాకా; నిశితంగా పరీక్షించడం     Meaning     (adj/adv) : from head to feet; examine closely    వాడుక / Usage అర్ధరాత్రి స్మశానంలోంచి వచ్చిన అతన్ని కాపరి ఆపాదమస్తకం చూసాడు. The keeper examined head to toe the man who stepped out of the cemetery.       మెదడుకు మేత / Food for thought అజ్ఞాన తిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా । చక్షురున్మీలితం యేన తస్మై శ్రీగురవే నమః ॥ (అజ్ఞానం అనే అంధకారమునుండి, ఆ చీకటితో మూసుకుపోయిన కళ్ళని, జ్ఞానం అనే కాటుక లేదా లేపనముచే, సరియైన మార్గదర్శకుడై జ్ఞానం దిశగా నడిపేటటువంటి గురువుకు నమస్కరించుచున్నాను.) --నరసింహ సుభాషితం

రజ్జుసర్ప

  నవంబర్ 18, 2022 రజ్జుసర్ప  ( rajjusarpa )       అర్థము      (న్యాయం ): రజ్జు=త్రాడు; త్రాడు చూసి పాము అనుకున్నట్లు     Meaning     (logic) : (mis)taking rope for a snake and fearing    వాడుక / Usage మనం రజ్జుసర్ప భ్రాంతి అన్న భావాన్నే భౌతిక శాస్త్రంలో “ష్రోడింగర్ పిల్లి” అంటారు .  తలుపు తెరచి చూడు: పిల్లి బతికి ఉందొ చచ్చిపోయిందో తేలుతుంది. దీపం వేసి చూడు: కాలికి తగిలినది తాడో, పామో తేలిపోతుంది. Serpent and rope logic is akin to Schrodinger's cat in Physics. As long as you don't open the door the cat is still alive. Unless you shine the light you don't know if its a rope or snake.       మెదడుకు మేత / Food for thought   స్వేచ్ఛ ఎవరో ఇచ్చేది కాదు. ఎవరినుండి సాధించుకునేది కాదు. మన అవసరాలను, మన ఉనికికి అత్యవసర విషయాలను మనం గుర్తించడమే స్వేచ్ఛ. నిజానికి అది సాధించడం చాలా కష్టం....మొత్తం సమాజాన్ని మార్చను నాకు చేతకాదని ౼ నాకు చేతనైంది కూడా నేను చెయ్యొద్దా? అలా చేయకుండా నేను బతకలేనని నాకు...

శలభ

  నవంబర్ 17, 2022 శలభ  ( salabha )       అర్థము      (న్యాయం ): మిడుత; దీపానికి ఆకర్షణ చెంది, దానిలో పడి, తన నాశనానికి తానే కారణమైన మిడత లాగా     Meaning     (logic) : locust; falling victim to one's own sensory gratifications    వాడుక / Usage ఇంద్రియలోలత్వంతో మొహానికి చిక్కి అగ్నిని చూసి భ్రమపడిన  శలభం లాగ మనం కొట్టుమిట్టాడుతున్నాం. Enamoured by sensory pleasures, like a locust attracted to fire, we suffer incessantly.       మెదడుకు మేత / Food for thought   అబలయన్న బిరుదమంటించి కాంతల స్వీయశక్తులదిమి చిదిమినారు సబలయన్న బిరుదు సాధించి హక్కులు గడన చేసికొమ్ము కష్టచరిత --వంచిత, గుఱ్ఱం జాషువా  (సెప్టెంబర్ 28 , 1895 - 1971)

సైంధవోదక

  నవంబర్ 16, 2022 సైంధవోదక  ( saindhavodaka )       అర్థము      (న్యాయం ):  సముద్రపునీరు సూర్యరశ్మిచే ఆవిరియై మేఘరూపాన్ని పొంది వర్షించి ఏరుగా పారి తిరిగి సముద్రంలో కలిసినట్లు     Meaning     (logic) : like the water in the ocean evaporating, coming down to form streams/rivers only to join the seas again    వాడుక / Usage పరమాత్మస్వరూపము,  సైంధవోదక న్యాయముగా,  బ్రహ్మాండమంతా అనేక రూపములను ధరించి తిరిగి పరమాత్మలో ఐక్యమవును . Brahman takes shape of various life forms only to merge back into Him, just like the water in various streams reaches the ocean again.      మెదడుకు మేత / Food for thought   నీ దేహపు దుర్గం నేనై... నా బాహువు ఖడ్గం నీవై పరాంకోటి జనబాహుళ్యం... చలాయించు రధ సౌరభ్యం సమరంగా సముజ్వలిస్తే... ప్రళయంగా పరిప్లవిస్తే నిశాంధ్యముల నిర్మూలిస్తాం... మహాంధ్రమని తీర్మానిస్తాం --శ్రీశ్రీ   (ఏప్రిల్ 30 , 1910 - 1983)

శ్వానమకర

  నవంబర్ 15, 2022 శ్వానమకర  ( svaanamakara )       అర్థము      (న్యాయం ): శ్వాన=కుక్క, మకర=మొసలి;  మొసలి నీటిలో ఉండి ఏనుగును లాగగలిగినా పైకి వచ్చి కుక్కచే భంగపడినట్లు; స్థాన బలం     Meaning     (logic) : crocodile in water dominates an elephant but on land is troubled by a dog; home advantage    వాడుక / Usage స్థానబలిమికాని తనబలిమి కాదయా అన్నాడు వేమన  శ్వానమకర న్యాయాన్ని తనదైన శైలిలో. Vemana in his inimitable style says it's the home ground advantage and not one's own strength.      మెదడుకు మేత / Food for thought   బుద్ధిని ఆడించడానికి మనసు చేసే గారడీనే ప్రేమ....ప్రేమలో విశాలత్వం కాదు, వెరైటీ కాదు, తీవ్రత ఉండాలి. అలాంటి ప్రేమ దొరకడం కష్టం, దొరికిందో అది ఒక అగ్ని, ఒక తపస్సు. -- చలం  (మే 18 , 1894 - 1979)

హంసక్షీర న్యాయం

  నవంబర్ 14, 2022 హంసక్షీర  ( hamsa kshīra )       అర్థము      (న్యాయం ): క్షిరనీర;  హంసకి పాలని,నీరుని వేరుచేసే నైపుణ్యం ఉంది . ఒక విషయం చెప్పినపుడు కాని మాట్లాడేటప్పుడుకాని అందులోని మంచి చెడు విషయాలలో ,మంచిని గ్రహించి చెడుని విడిచిపెట్టాలి     Meaning     (logic) : swan is said to separate milk and water; similarly one should take the good and leave the bad from any one/thing    వాడుక / Usage నిత్యజీవితములో హంసక్షీర న్యాయమనుసరించడం కష్టమైనను మిక్కిలి మిన్న. Whilst it's difficult to absorb good and be untainted by bad, it is the best way.      మెదడుకు మేత / Food for thought  పిల్లలకు భౌతిక మరియు ఇతర శాస్త్రాలు మాతృభాషలో కాకుండా పరాయి భాషలో నేర్పించడం అసహజమే కాదు అనైతికం కూడా. వాళ్ళకి విషయాలు తెలుస్తాయిగానీ దాని యొక్క ఊపిరి సారము తెలియవు.    -- సి. వి. రామన్   (నవంబర్ 07 , 1888 - 1970)

కబ్బము

  నవంబర్ 11, 2022 కబ్బము  ( kabbamu )       అర్థము      (విశేష్యము ): కావ్యము; ప్రబంధము; గ్రంథము; కృతి      Meaning     (noun) : literary composition; poetry/prose    వాడుక / Usage "ఈ చిరు కబ్బము 'గాయపడిన కవి గుండెలలో వ్రాయబడిన కావ్యము'". This small poem overflows from the heart of a wounded poet.      మెదడుకు మేత / Food for thought   సంపూర్ణమైన రూఢీ, సంపూర్ణమైన ఖరారు, అంతిమ లేక పరమ సత్యం మొదలగునవి ఊహా కల్పనలే. వాటికి  భౌతిక శాస్త్రంలో చోటు లేదు. ఈ ఆలోచనా దృక్పథంలో మార్పు నవీన విజ్ఞాన శాస్త్రం మనకిచ్చిన గొప్పదైన వరం. ఏకమైనా పరమ సత్యం ఉందని అది తను నమ్మినదే అనేదే ప్రపంచంలో అన్ని సమస్యలకు మూలం.   -- (క్వాంటమ్ తరంగ సమీకరణ ప్రతిపాదికుడు)  మాక్స్ బార్న్ ( డిసెంబర్ 11, 1882 - 1970)

దుబాసి

  నవంబర్ 10, 2022 దుబాసి  ( dubāsi )       అర్థము      (విశేష్యము ): ద్విభాషి; భాషలు అనువదించగలవాడు; వ్యవహారం నడిపే వాడు      Meaning     (noun) : interpreter; an agent    వాడుక / Usage హసన్ అలీ ఆంధ్రప్రదేశ్ శాసనసభలో  ఏడుగురు స్పీకర్‌ల వద్ద దుబాసిగా వ్యవహరించాడు. Hasan Ali was an interpreter for 7 Speakers of AP assembly.      మెదడుకు మేత / Food for thought  చేతనని భౌతిక రీతిలో మనం అభివర్ణించలేము. అది అన్నిటికన్నా మూలం కనుక దానిని ఇంకో వనరుతో నిర్ధారించలేము. పాశ్చాత్య శాస్త్రం చేతన గురించి అర్థం చేసుకోడం నుంచి తనను తాను దూరం చేసుకుంది. అందుకే మన దృక్పథం మారాలంటే తూర్పున ఉన్న  సిద్ధాంతాల నుంచి అభిప్రాయాలు మన నాడులలోకి ఎక్కించుకుని అవసరం ఉంది. -- (ష్రోడింగర్ సమీకరణ ప్రతిపాదికుడు) ఎర్విన్ ష్రోడింగర్ (ఆగష్టు 12, 1887 - 1961)

విలోలము

  నవంబర్ 09, 2022 విలోలము  ( vi lōlamu )       అర్థము      (విశేష్యము/విశేషణము ): చలనము; కదులునది; కంపించునది; ఆశ ఉండడం      Meaning     (noun/adj) : trembling; desiring; fickle; shaking    వాడుక / Usage నిండు పున్నమి వెన్నెలలో చల్లని సమీరాలు తాకగా అతని మనసు విలోలమైంది . The full moon and cool breeze kindled desires in him.      మెదడుకు మేత / Food for thought  గణితవేత్తలు తామే పొందుపరిచిన నియమాలతో గణితం అనే ఆట ఆడతారు. కానీ భౌతిక శాస్త్రవేత్త ఆడే ఆటలో నియమాలు ప్రకృతి నిర్ధారించింది. కానీ చూడగా చూడగా గణితవేత్తలకు ఆసక్తి కలిగించే నియమాలు ప్రకృతిలో ఉన్న లెక్కలే. భగవంతుడు గణితంలో పరమ నిష్ణాతుడే! లేకపోతే విశ్వ నిర్మాణంలో మహోన్నతమైన గణితాన్ని వాడగలడా? -- ( యాంటీమాటర్   ప్రతిపాదికుడు) పాల్ డిరాక్ (ఆగష్టు 08, 1902 - 1984)

ఆలంబనము

  నవంబర్ 08, 2022 ఆలంబనము  ( alambanamu )       అర్థము      (విశేష్యము ): ఆధారము ; ఆశ్రయము; ఊత; పట్టుకొమ్మ; వ్రేలాడుట     Meaning     (noun) : support; prop; patronage; aid    వాడుక / Usage అందాల విశాఖ తీరం.. కానుంది శ్రమ జీవుల ఉపాధికి ఆలంబనం . Beautiful Visakha coastline - set to support workers livelihood.      మెదడుకు మేత / Food for thought  విశ్వం మనం అనుకునే దానికంటే విచిత్రమైనదే కాదు,  మనం ఊహించగలిగే దానికంటే కూడా విచిత్రమైనది. మనం చూసి కొలిచి  తెలుసుకోగలిగేది ప్రకృతి నిజస్వరూపం కాదు, కేవలం మన పరీక్షా విధానాలకు బహిర్గతమయ్యే గుణాలు మాత్రమే, భౌతిక శాస్త్రం అనే చెంబులో మొదటి గుటక మనల్ని నాస్తికుల్ని చేస్తుంది, కానీ చెంబు అడుగులో దేవుడు మనకోసం ఎదురు చూస్తూ ఉంటాడు. -- ( అస్థిరత్వ నియమ ప్రతిపాదికుడు) వెర్నర్ హైసెన్బర్గ్ (డిసెంబర్ 05, 1901 - 1976)

గుంభనము

  నవంబర్ 07, 2022 గుంభనము  ( gumbhanamu )       అర్థము      (విశేష్యము ):  గుంఫనము;  అనుసంధానము; మాటలు ఒకదానికి ఒకటి అల్లుట/కూర్చుట; రహస్యము; అందరికీ అర్థం కానిది     Meaning     (noun) : compound phrases in verse or prose; mysterious; secrecy    వాడుక / Usage తటస్థ ఓటర్ల అంతరంగం గుంభనం - నాయకుల గుండెల్లో గుబులు. Secrecy shrouds undecided voters - contestants anxious.      మెదడుకు మేత / Food for thought   మనం యథార్థం అనుకునే ప్రతీదీ, యథార్థం అనలేని వాటితో చేయబడ్డాయి. క్వాంటమ్ (గుళిక వాదం) మెకానిక్స్ నిన్ను నిర్ఘాంత పరచకపోతే, నీకు అది ఇంకా సరిగ్గా అర్థం కాలేదు అన్నమాట. భౌతికి శాస్త్రం అంటే ప్రపంచం ఎలా ఉంది అన్న దాని గురించి కాదు, మనం ప్రపంచం గురించి ఏమి చెప్పగలం అన్న దాని గురించి మాత్రమే. -- (ఫాదర్ ఆఫ్ క్వాంటమ్ మెకానిక్స్) నీల్స్ బోర్ (అక్టోబర్ 07, 1885 - 1962)

కప్పదాటు

  నవంబర్ 04, 2022 కప్పదాటు  ( kappa-ḍaatu )       అర్థము      (విశేష్యము ):  చేసిన నేరం చేయలేదని నమ్మించటానికి చెప్పే తప్పుడు కారణాలు; పని మధ్యలో వదిలి వేరొక పని మొదలుపెట్టడం; కప్ప దూకుతూనే పక్కకు తప్పుకునేట్లుగా     Meaning     (noun) : sidestep; give excuses to cover up; skip over tasks     వాడుక / Usage యంత్రాంగ లోపాల్ని కప్పిపుచ్చుకునే కప్పదాటు వైఖరిని నిగ్గతీసి అడగాల్సిన విధాన సభలు బూతులు తిట్టుకోవడానికే పరిమితం అయ్యాయి. Legislatures, whose role is to prevent Executive sidestepping responsibility, have been reduced to name calling.      మెదడుకు మేత / Food for thought   త్యాగానికి ఒక పరిమితి ఉంది అనే వాదం వెంకయ్య విషయంలో ఓడిపోయిందనే చెప్పాలి. అన్ని విధాలా తగిన ఇల్లాలు రుద్రమ్మ. బహుశా వాల్మీకి గానం చేసిన సీతమ్మ త్యాగం కూడా ఈమెతో సరితూగకపోవచ్చు. ఆమె రాణిగనుక వనవాసం చేసిన ఘట్టాన్ని తలచుకుని జాలిపడింది మానవ హృదయం. పైగా ఆమె ఎక్కడా కూలి చేయలేదుగా! రుద్రమ్మ అలా కాదు. మగనితో పాటు వ...

ఉడుతాభక్తి

  నవంబర్ 03, 2022 ఉడుతాభక్తి  ( uḍuta-bhakti )       అర్థము      (విశేష్యము ): చేతనైనంత; ఎవరి శక్తీ సామర్ధ్యాల బట్టి అంత సహాయం చేయడం; సేవాభావంతో చేసే సహాయం చిన్నదైనా సరే; రాముడికి సేతు నిర్మాణంలో సహాయం చేసిన ఉడుతలాగా     Meaning     (noun) : help accorded as per one's ability    వాడుక / Usage మనం ఉడుతాభక్తిగా తెలుగులో మాట్లాడితే, రాస్తే, అనువాదిస్తే, పుస్తకాలు కొంటే, చదివితే. పాత పదాలు వాడుతో, కొత్త పదాలు/అర్ధాలు అన్వయిస్తే మన భాష మృత భాష అవ్వకుండా ఉంటుంది. As per each of our abilities, if we converse, write, translate, buy and read books, use old words whilst inventing new, then Telugu will live on.     మెదడుకు మేత / Food for thought   నీళ్ళలో నిప్పుమాదిరి, నిప్పులోన  నీళ్ళమాదిరి, కష్టాల నీడలందు  సుఖము నివసించునంట! ఉస్సు రను వేడి  ఊర్పులోన పరీమళా లున్నవంట!  నవభారత యువకులారా!  కవులారా! కథకులారా!  భవితవ్యపు హవనానికి  హోతలు; నూతన  భూతల నిర్మాతలు  మీర...

కాకిలెక్కలు

  నవంబర్ 02, 2022 కాకిలెక్కలు  ( kaaki-lekkalu )       అర్థము      (విశేష్యము ): అబద్ధపు లెక్కలు; కాకి=అల్పము, తక్కువ రకం     Meaning     (noun) : doctored/false accounts    వాడుక / Usage కల్లి బొల్లి కబుర్లు,  కాకిలెక్కలు చెప్తే వాటిని విశ్లేషించి ప్రశ్నించే పౌరులు లేకపోతే ప్రజాస్వామ్యానికి దిక్కులేని చావు తప్పదు. If there is no informed citizenry to analyse and question duplicitous narratives and accounts, democracy is bound to perish.     మెదడుకు మేత / Food for thought ఉభయమధ్యావస్థయందే మనుజజాతికి సర్వ ప్రపంచమునకు సౌఖ్యమున్నది. అందు చేత సుఖము, బాధ యనునవి ప్రకృతిస్థితులుగాని స్వతంత్రత్త్వములు గావు. ఒక్క  ​ ప్రకృతినన్ని భోవోమువంకబోయి కష్టమైనది. అమితత్వమువంకఁ బోయి కష్టమైనది. అందుచేత సుఖము, బాధ యనునవి వస్తుతత్త్వమున నొక్కటే యని స్పష్టపడుటలేదా? బుద్ధభగవానుఁ డేమి సెలవిచ్చినాఁడు? ఉభయదిశల గష్ట ముండు సౌఖ్యమునకు నదియె నడుమ జేరి యగును సుఖము బాధ సుఖము నొకటి వస్తుత్త్వమునను గతినిబట్టి భేదకలన కలిగె....

కొంగజపము

  నవంబర్ 01, 2022 కొంగజపము  ( konga japamu )       అర్థము      (విశేష్యము ): పైకి మంచిగా కనిపిస్తూ లోపల దుర్బుద్ధి ఉండడం; కొంగ ఒంటికాలి మీద జపం చేస్తున్నట్లు నుంచుని చేపలను మాయచేసినట్లుగా!     Meaning     (noun) : wolf in a sheep's skin    వాడుక / Usage నాయకుల కొంగజపాన్ని అర్ధం చేసుకోలేని ప్రజలున్నంతవరకు కట్టడాలు కూలుతూనే ఉంటాయి. As long as people don't realise the duplicity of leaders, accidents will keep recurring.     మెదడుకు మేత / Food for thought చరణాలు చరణాలు ముక్తి సోపానాలు శరణన్న వారికవి మోక్షభవనాలు ధరణిసిరి హృదయాల తనరారు చరణాలు గిరిజేశ్వరాకృతిని కీర్తించు చరణాలు గిరిచూపు గలవాని నిరసించు చరణాలు సరయూ నదీ తటిని విహరించుచరణాలు అజ్ఞాన తిమిరాన విజ్ఞాన కిరణాలు సుజ్ఞానులకు సకల సౌవర్ణాభరణాలు శాంతి కవి నిలయాలు సౌందర్యవలయాలు సంతోష ద్వారాలు సకల స్మృతి తీరాలు -- దేవులపల్లి కృష్ణ శాస్త్రి (నవంబర్ 1, 1897 - 1980)