Posts

Showing posts from March, 2023

ఆచ్ఛాదనము

  మార్చ్ 31, 2023 ఆచ్ఛాదనము      ( āchchādanamu )       అర్థము      (విశేష్యము ): కప్పుట; తప్పులను కప్పిపుచ్చడం; వస్త్రము       Meaning     (noun) : cover; covering; cloak; clothes     వాడుక / Usage సర్వ జగత్తును ‘వసనం’ లేక ఆచ్ఛాదనం చేసి ఆక్రమించి ఉండేవాడు  ‘ వాసుదేవుడు ’. He who covers or encompasses the whole universe is Vasudeva.     మెదడుకు మేత / Food for thought ప్రేమించు...కానీ దేనికోసమో ప్రేమించే ప్రేమ కాదు, ఎదో ఆశించే ప్రేమ కాదు, దేనివలనో ప్రేమించే ప్రేమ కాదు...నా ఆఖరి క్షణాల్లో మొదటిసారిగా నేను అనుభవించిన ప్రేమ ప్రేమించు, శత్రువుని చూసాను కానీ ప్రేమించాను, అలా ప్రేమించు. ఆత్మపరమైన ఆ ప్రేమకి ఏ వస్తువు ఏ లక్షణం అవసరం లేదు. ఆ సచ్చిదానందం నాకు ఇప్పటికీ గుర్తు ఉంది. నీ చుట్టు పక్కన వాళ్ళని ప్రేమించడం, నీ శత్రువులను ప్రేమించడం, అందరినీ అంతటినీ ప్రేమించడం - దైవ స్వరూపాలైన సర్వప్రాణకోటిని ప్రేమించడం. మనకు ఇష్టమైన వాళ్ళని మానవీయంగా ప్రేమించగలం. కానీ శత్రువుని కేవలం దై...

ఉద్విగ్నము

  మార్చ్ 30, 2023 ఉద్విగ్నము      ( ud-vignamu )       అర్థము      (విశేషణము ): భయమొందినది; వ్యాకుల చిత్తము; మనసు కుదురులేనిది; కలవరము;       Meaning     (adj) : disturbed; anxious; sorrowful     వాడుక / Usage " సోమవారం ఉదయం మన భారతావని కొద్ది సేపు చాలా ఉద్విగ్నంగా గడిపింది ." Monday morning India was gripped with anxiety for some time.     మెదడుకు మేత / Food for thought జీవితం యొక్క చిక్కుముడులు గురించి ఆలోచించావా? వింటానంటే ఇప్పుడే చెప్తా. మాయాభరితమైన వాటి వెంట పడకు - అంటే సంపత్తి మరియు హోదా కోసం ప్రాకులాడకు. నువ్వు ప్రతి కణం ధారపోసి వాటిని పోగేసినా ఒక్క గొడ్డలివేటుతో అవి నీ నుంచి దూరం చేయబడతాయి. జీవితం మీద ఒక నిశ్చల ఆధిక్యతతో జీవించు. కష్టాలకు భయపడకు, సుఖాలను ఆశించకు. అవి రెండూ చివరకి ఒకటే కదా! చేదు అంతులేకుండా నిల్చిపోదు, తీపి సదా పొంగేలా ఉండిపోదు. చలిలో గడ్డకట్టకుండా, ఆకలి దప్పికలు పొట్టని ఉండలు చుట్టకుండా ఉంటే అది చాలు. నడుము విరగకుండా, పాదాలు నడుస్తుండగా, చేతులు వంచ...

ఆయత్తము

  మార్చ్ 29, 2023 ఆయత్తము      ( āyattamu )       అర్థము      (విశేషణము ): సిద్ధము; జాగురూకము; ప్రయత్నించు; ఆధీనము; వశ్యము      Meaning     (adj) : ready; preparation; submitted to     వాడుక / Usage కృత్రిమ మేధ వల్ల వచ్చే అనూహ్య మార్పులకు మనమందరం ఆయత్తమవ్వాలి . We should be prepared for the transformational effects of Artificial Intelligence.     మెదడుకు మేత / Food for thought కోరికలు పాతిపెట్టడం కోసం జీవించాను కలలు తుప్పుతో మకిలబడటం చూసాను ఇప్పుడు మిగిలిందంతా ఫలించని జ్వాలలు ఎడారి వంటి హృదయాన్ని కాల్చే నిప్పు రవ్వలు పెనుతుఫానులోని కారుమబ్బులా విధి ఢీకొంది మధుమాసపు నా ఆశా కిరీటాన్ని ఎండగట్టింది ఒంటరినై నిస్పృహతో వీక్షించాను వేచాను తుదిపిలుపు కోసం ఎదురుతెన్నులు కాచాను వెన్నెముకలో వణుకు తెచ్చే ఆ చివరాఖరి చల్లని గాలిగా శీతాకాలం వీచే పవనంలో ఈల వేయగా మోడుపోయిన చిటారు క్రొమ్మపై ఒంటరిగా కంపిస్తూ మిగిలిపోయింది ఒక ఆకు కొనకు వ్రేళ్ళాడగా -- అలెగ్జాండర్ సెర్గెయెవిచ్ పుష్కిన్ (జూన్ 6, 1799 -...

పార్శ్వము

  మార్చ్ 28, 2023 పార్శ్వము      ( pārṣvamu )       అర్థము      (విశేష్యము ): ప్రక్క; సమీపం; వస్తువు/శరీరం యొక్క (పక్కనుండే) భాగము;      Meaning     (noun) : a side/part; flank; nearby    వాడుక / Usage జీవితపు చీకటి పార్శ్వము తనని నీడలాగా వెంటాడుతూనే ఉంది. The dark side of life shadowed him constantly.     మెదడుకు మేత / Food for thought ఎందుకు మనం క్షిణించిపోతాం? ఎంతో ఉత్సాహంగా, ధైర్యంగా, నైతికంగా, నమ్మకంతో బయలుదేరిన మనం ఎందుకు ముప్పై లేక ముప్పై అయిదు వచ్చేప్పటికి అన్నీ కోల్పోయి విహీనంగా తయారు అవుతాము? ఒకళ్ళు మితిమీరిన ధనార్జనలో సమిసిపోతే, మరొకరు తన తలలో తానే తూటా దింపుకుంటే, ఇంకొకరు మద్యం మత్తులో ముగిసిపోతే, వేరొకరు భయాందోళనలు కప్పిపుచ్చడానికి తన మునుపటి అందమైన వ్యక్తిత్వాన్ని వికృతంగా కాళ్ళకింద తొక్కి వేస్తున్నారు. ఎందుకు? ఎందుకు ఒకసారి దిగజారి పోయాక, మళ్ళీ నిలబడడానికి ప్రయత్నించం? ఒకటి పోగొట్టుకున్నాక మరొకటి సాధించడానికి యత్నించం? ఎందుకు? -- అంటోన్ చెఖోవ్  (జనవరి 29, 1860 -...

నిబద్ది

  మార్చ్ 27, 2023 నిబద్ది      ( nibaddi )       అర్థము      (విశేష్యము/విశేషణము ): నిజం; సత్యం; పరమార్థం     Meaning     (noun/adj) : truth; certainty; reality    వాడుక / Usage సామజిక మాధ్యమాల్లో వచ్చే అబద్ధపు వార్తల వల్ల నిబద్దమైన సమాచారం కనుమరుగైంది. Truth has become buried under the tsunami of falsities on Social Media.     మెదడుకు మేత / Food for thought అన్నిటికన్నా ముఖ్యం - నిన్ను నువ్వు అబద్దాలతో మోసపుచ్చుకోకు. తనకు తాను అసత్యాలు చెప్పుకుని వాటినే నమ్మే వారు తమలోని నిజాన్ని కానీ చుట్టుపక్కల ఉన్న నిజాన్ని కానీ గుర్తించే సామర్థ్యం కోల్పోతారు. దానితో తనమీద తానే గౌరవం కోల్పోడమేగాక మిగతావారినీ గౌరవించలేరు. గౌరవం లేని చోట ఆ కారణంగా ప్రేమ వాత్సల్యం కూడా లోపిస్తాయి. -- బ్రదర్స్ కరంజోవ్, ఫయోడోర్ దస్తయేవస్కీ (నవంబర్ 11, 1821 - 1881)

జీమూతము

  మార్చ్ 24, 2023 జీమూతము      ( jī-mūtamu )       అర్థము      (విశేష్యము ): మబ్బు; కొండ;  డావరడంగి (విషమునకు విరుగుడు)     Meaning     (noun) : cloud; hill; a poison antidote    వాడుక / Usage నల్లని జీమూతములు ఆ మహా జీమూతాన్ని ఢీకొని ఆకాశానికి చిల్లుపడినట్లుగా కురిసింది. Dark clouds collided with the mountain and rained cats and dogs.     మెదడుకు మేత / Food for thought పిల్లలకీ మేస్టార్లకీ మా అమ్మమ్మ నెత్తిమీద దేవత. వాళ్ళు గౌరవిస్తున్న కొద్దీ చనువు ఎక్కువయింది. అన్నిటా తలదూర్చడం ప్రారంభించింది. ఒకరోజు దక్షిణం వైపు కూర్చుని అరటి దూట తరుక్కుంటోంది. పక్కన స్కూల్లో సోషల్‌మాస్టారు రామతారకంగారు పాఠం చెబుతున్నారు. "మనదేశమును ఎందరో రాజులు పాలించిరి. అశోకుడు పాలిచ్చెను, హర్షవర్ధనుడు పాలిచ్చెను, చించిసారుడు పాలిచ్చెను" అంటూ దీక్షగా చెప్పుకుపోతుంటే అమ్మమ్మ "రామతారకంగారూ, ఇట్రండి. ఇందాకటి నుంచి వింటున్నాను. ఆ రాజు పాలిచ్చాడు, ఈ రాజు పాలిచ్చాడు అంటున్నారు. పాలివ్వడానికి వారేమయినా పాడిపశువులా?" ...

పటీరము

  మార్చ్ 23, 2023 పటీరము      ( paṭīramu )       అర్థము      (విశేష్యము ): చందనము; గంధము; మేఘము     Meaning     (noun) : sandalwood; cloud    వాడుక / Usage ఇసుకతో కూడిన ఎర్రమట్టి నేలలు పటీరం సాగుకు అనుకూలమైనవి. Sandy red soil is needed for cultivating sandalwood.     మెదడుకు మేత / Food for thought మనిషి నడుస్తున్న చెట్టు కనుకనే చెట్లు చిగిరించే వేళల్లోనే తనకీ కొత్త ఏడు మొదలవుతున్నది. మనిషి మాట్లాడే పక్షి కనుకనే కోకిల ప్రవేశించే కాలంలోనే కొత్త ఏడు కనిపిస్తున్నది. మనిషికి అప్రయత్నంగా తెలిసిందిదొక్కటే అనుకుంటాను: కాలం మొదలయ్యే కొత్త రోజుని గుర్తుపట్టడం ప్రముఖ సాహితీవేత్త వాడ్రేవు చిన వీరభద్రుడు ( https://chinaveerabhadrudu.in/2023/03/22/)

ప్రత్యగ్రము

  మార్చ్ 22, 2023 ప్రత్యగ్రము      ( praty-agramu )       అర్థము      (విశేషణము ): నూతనము; పరిశుద్ధము; క్రొత్త     Meaning     (adj) : new; pure; fresh; recent    వాడుక / Usage ప్రతి క్షణం ప్రత్యేకం, ప్రతి దినం ప్రత్యగ్రం , నిన్నటి హద్దులు దాటి నేటి సరిహద్దులు మీరి నవయుగానికి నాంది పలుకు. Every moment is special, every day is new; break the confines of yesterday, cross the boundaries of today and herald a new era.     మెదడుకు మేత / Food for thought తెలకపిండి యెట్లా వస్తుందో అందరికీ తెలుసు. నువ్వులు అట్టే నాగరికత లేని సరుకు. అది పొలాల్లో కష్టజీవుల చేతుల్లో పెరిగి మధ్యతరగతి వాళ్ళకు అమ్ముడుపోయి బస్తీ చేరుతుంది. అక్కడ దాన్ని గానుగ ఆడి నూనె తీస్తారు. ఆ నూనె అందమైన సీసాలకూ, డబ్బాలకూ యెక్కి అనేక వంటిళ్ళను అలంకరిస్తుంది. తెలకపిండి చెక్కను నువ్వులొకవేళ చూసినా పోల్చుకోలేవు. అది గొడ్లకూ, పేదవాళ్ళకూ ఆహారమవుతుంది. నువ్వులు గానుగాడటం యేమంత గొప్ప విషయం కాదు. నేను మనుషుల్ని గానుగాడగా చూసాను. ఎందుకనో నాకా...

అభ్రము

  మార్చ్ 21, 2023 అభ్రము      ( abhramu )       అర్థము      (విశేష్యము ): ఆకాశం; మబ్బు; బంగారం; అభ్రకం; హారతి కర్పూరం; సున్నా     Meaning     (noun) : sky; cloud; gold; mica; camphor; zero    వాడుక / Usage ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై నల్లని అభ్రమాలు కమ్ముకుంటున్నాయి. Dark clouds are gathering over the global financial systems.     మెదడుకు మేత / Food for thought వగలమారి గాలి ఉన్నట్టుంద్డి వాటం మార్చుకుంటుంది. నీళ్ళ గుప్పిళ్ళను దాచుకున్న తెమ్మెరలు జివ్వున ముఖాలను తాకి ఆటగా నవ్వుతుంటాయి. తుమ్మెదలన్నీ ఎగిరి సంతోషకరమైన కబురేదో పంచుకోవడాని కన్నట్టు దగ్గరగా కూడుతాయి. ఆకాశాన ఒక నల్లటి మేఘం రూపుగట్టి ఆశీస్సులై కురవడానికి నేలకు దగ్గరగా జరుగుతుంది. జగత్తంతా పరవశించే ఆ క్షణాన ప్రకృతి మురిపెంగా ఒక పాటను ప్రసవిస్తుంది. ఠండి హవా కాలి ఘటా ఆహి గయీ ఝూమ్ కే ప్యార్ లియే డోలె హసీ నాచ్ జియా ఘూమ్ కే హిందీ సినిమా సంగీతంలోకి గీతారాయ్ ఠండీ హవాలాగా, కాలీ ఘటాలాగా ప్రవేశించింది. పలుచటి ముఖం, దయగా నవ్వే పెదాలు, కరుణ కురి...

ఉదాత్తము

  మార్చ్ 20, 2023 ఉదాత్తము      ( udāttamu )       అర్థము      (విశేష్యము/విశేషణము ):  ఎత్తైనది; గౌరవము కలది; దానము; వేదములో ఊర్ధ్వ స్వరం; అలంకారాల్లో ఒకటి     Meaning     (noun/adj) : glorious; great; elevated; quaver in Veda chanting; high or sharp tone    వాడుక / Usage హాస్యకథా రచయత మునిమాణిక్యం నరసింహారావు మానవతా విలువలతో ఉదాత్తమైన కథలు వ్రాసారు. Munimanikyam Narasimha Rao penned humorous stories with great human values.     మెదడుకు మేత / Food for thought ఓరి గాడిద, నేను సన్యాసం పుచ్చుకోటానికి వెళ్తున్నానురా! నేను పుచ్చుకుంటాను నాన్న అన్నాడు మా అయిదేళ్ల వెధవ. నేనో నాన్న అంటూ బిక్కమొహం వేసింది సుశీ. ఈ చిన్న వెధవలంతా నాతో సన్యాసం పుచ్చుకోడానికి బయలుదేరారు. బుద్ధ దేవుడికే, ఒక్క కొడుకే కాబట్టి తెంచుకుని పారిపోయినాడు. అదీ నిద్రపోతున్నప్పుడు. అదీ అర్థరాత్రి! అసుర సంధ్య వేళ అర డజను పిల్లల్ని వదిలించుకు వెళ్ళ వలిసి వచ్చినట్లైతే తెలిసేది - ఈ సంసారానికి మానవుడు ఎలా కట్టుబడి ఉన్నాడో!....సు...

నిగళము

  మార్చ్ 17, 2023 నిగళము      ( nigaḷamu )       అర్థము      (విశేష్యము ): సంకెల; ఏనుగు కాలి సంకెల; అన్నవాహికలో గళము తరువాతది     Meaning     (noun) : confine; chain; elephant fetter; oesophagus    వాడుక / Usage "శంకర గళ నిగళము ... శ్రీహరి పద కమలమూ రాగరత్న మాలికా తరళమూ.. శంకరాభరణమూ". (Emanating) from the confines of Shiva's throat; being the lotus feet (a symbol of pure consciousness) of Vishnu - the dazzling centre piece of the pearled garland of Ragas is the Raga Sankarabharanam.     మెదడుకు మేత / Food for thought రవి వర్మకే అందని ఒకే ఒక అందానివో రవి వర్మకే అందని ఒకే ఒక అందానివో రవి చూడని పాడని నవ్య రాగానివో రవి వర్మకే అందని ఒకే ఒక అందానివో ఏ రాగమో తీగదాటి ఒంటిగా నిలిచే ఎ యోగమో నన్ను దాటి జంటగా పిలిచే ఏ మూగ భావాలో అనురాగ యోగాలై ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ నీ పాటనే పాడనీ రవి వర్మకే అందని ఒకే ఒక అందానివో ఏ గగనమో కురుల జారి నీలిమై పోయే ఏ ఉదయమో నుదుట చేరి కుంకుమై పోయే ఆ కావ్య కల్పనలే నీ దివ్య శిల్పాలై ...

రేడు

  మార్చ్ 16, 2023 రేడు       ( rēḍu )       అర్థము      (విశేష్యము ): రాజు; దొర; భర్త; అధిపతి     Meaning     (noun) : master;  king;  husband    వాడుక / Usage "మా రేడు నీవని ఏరేరి తేనా మారేడు దళములు నీ పూజకూ". Our lord you are, the choicest leafs picked have I in worship.     మెదడుకు మేత / Food for thought సప్తాబ్దంబుల బాలుఁడై నిజభుజాస్తంభంబునన్ లీలమై సప్తాహంబులు శైలరాజము లసచ్ఛత్త్రంబుగాఁ దాల్చి, సం గుప్తప్రాణులఁ జేసె మాధవుఁడు గోగోపాలకవ్రాతమున్ సప్తాంభోధి పరీతభూధరున కాశ్చర్యంబె చింతింపఁగన్ ( అర్థాంతరన్యాసము : శ్రీకృష్ణుడు ఏడేళ్ళ బాలుడై ఉన్నా ఏడు రోజుల పాటు స్తంభములాంటి తన భుజముపై అలవోకగా శ్రేష్ఠమైన శైలము గోవర్థనగిరిని ఓ ప్రకాశించే గొడుగులాగ ఎత్తి పట్టుకున్నాడు. గోవులను గోపాలకులను దాని మరుగున దాచి అందరి ప్రాణాలను రక్షించాడు. సప్తసముద్రాలతో చుట్టబడి ఉండే భూమి నంతటిని ధరించిన ఆ పరమపురుషునికి ఇది వింత పనేం కాదు) -- ఆంధ్ర మహాభాగవతం, బమ్మెర పోతన (1450 - 1510)

ఉచ్చు

  మార్చ్ 15, 2023 ఉచ్చు       ( ucchu )       అర్థము      (విశేష్యము ): ఉరి త్రాడు; నవారు మంచంలో పట్టికీ కొడుకి వేసే ముడి; అంకురించు; చీల్చుకుని రావడం; పుర్రె     Meaning     (noun) : noose; knot; pierce; emerge; penetrate; skull    వాడుక / Usage "నీ జడకుచ్చులు నా మెడకి ఉచ్చులు కనుక నీ వెనుక నా నడక నీ కెందుకులే కినుక". Your tassels are nooses around my neck; am vassal knotted behind, mind you not.     మెదడుకు మేత / Food for thought వాగర్థావివ సంపృక్తౌ, వాగర్థప్రతిపత్తయే జగతఃపితరౌ వందే, పార్వతీపరమేశ్వరౌ ( ఉపమాలంకారం : ఇక్కడ వాక్ మరియు అర్థాలకు, పార్వతీ పరమేశ్వరులకు సామ్యం చెప్పబడింది. శబ్దం లేకుండా అర్థం లేదు, అర్థం లేకపోతే శబ్దానికి విలువలేదు - ఇవి రెండూ ఎప్పుడూ కలిసే ఉంటాయి. అలాగే ఆ పార్వతీపరమేశ్వరులు కూడా కలిసే ఉంటారు. ఇది ఈ రెండు విషయాల మధ్యనా ఉన్న సామ్యం) -- రఘువంశం, మహాకవి కాళీదాసు (~ నాలుగవ శతాబ్ధము)

చుక్కాని

  మార్చ్ 14, 2023 చుక్కాని       ( chukkāni )       అర్థము      (విశేష్యము ): తెడ్డు; పడవను నడిపే లేక దిక్కు మరలించే పరికరం     Meaning     (noun) : oar; rudder; helm    వాడుక / Usage "ఓ... చుక్కా నవ్వవే.. నావకు చుక్కాన వ్వవే". O mademoiselle ! dear give me a smile..steer me a nautical mile.     మెదడుకు మేత / Food for thought కన్నీటికి కలువలు పూసేనా... కాలానికి ఋతువులు మారేనా... మబ్బులెంతగ కురిసినా ఆకాశం తడిసెనా మాటలతో మరపించినా.. మనసున వేదన తీరెనా.. విధి శోధన ఆగెనా... కన్నీటికి కలువలు పూసేనా... కాలానికి ఋతువులు మారేనా... తనువే గాయాల గానమురళీ.. ఐనా మది మౌనరాగ రవళి ఉరిమే మేఘాలు చూసి కదిలి మెరిసే ఫించాలు విప్పె నెమలి పాటలెన్ని పలికించినా కంటికి జోలగ మారేనా.. ఎదగోలలు ఆగేనా.. కన్నీటికి కలువలు పూసేనా... కాలానికి ఋతువులు మారేనా... మృతిలో తలదాచుకున్న బ్రతుకు శ్రుతిలో కలిపింది నిన్ను జతకు గుడిలో దైవాలు ఎందుకొరకు విధితో పొరాడు జంటకొరకు పొద్ధులెన్ని ఉదయించిన రేపటి చీకటి తీరేనా ఎడబాటిక ఇంతేనా.....

లేమ

  మార్చ్ 13, 2023 లేమ       ( lēma )       అర్థము      (విశేష్యము/విశేషణము ): మగువ; స్త్రీ; వనిత; లేత     Meaning     (noun/adj) : a woman; tender; young    వాడుక / Usage లేముల యందు గౌరవ లేమి ఉన్న  సంఘము పురోగమించదు. A society which lacks respect for women cannot progress.     మెదడుకు మేత / Food for thought లేమా ! దనుజుల గెలువఁగ లేమా ? నీ వేల కడఁగి లేచితి? విటు రా లే మా ను మాన వేనిన్ లే మా విల్లందికొనుము లీలం గేలన్ ( భామా! మేము రాక్షసులను గెలువలేమా? నీ వెందుకు యుద్ధానికి సిద్ధపడ్డావు? ఇలా రా! యుద్ధ ప్రయత్నం మానుకో. మాననంటావా, అయితే విలాసంగా నీ చేత్తో ఈ విల్లందుకో!) (యమకాలంకారం) -- ఆంధ్ర మహాభాగవతం, పోతన (1450 - 1510)

మడిగె

  మార్చ్ 10, 2023 మడిగె       ( madige )       అర్థము      (విశేష్యము ): దుకాణము; కొట్టు; అంగడి;      Meaning     (noun) : shop; room set aside for commerce    వాడుక / Usage కార్పొరేట్ సూపర్ మార్కెట్ల ధాటికి చిన్న చిన్న మడిగెలు తట్టుకోగలవా? Can the small mom-and-pop shops withstand the advance of Supermarkets?     మెదడుకు మేత / Food for thought చేట్టుకేమో విత్తుకు ఋణమున్నది..తెలియలేదు నాకేమో నాన్న విలువ ఎంతన్నది.. తెలియలేదు నాన్న నాకు చొక్కా తొడగటమే తెలిసింది గానీ… కనిపించని కవచమొకటి కడుతున్నది తెలియలేదు ముద్దులాడి నన్ను పైకి ఎగరేయుట తెలుసు గానీ.. తనకన్నా ఎత్తున నిలపెడుతున్నది తెలియలేదు చేయి పట్టి నాన్న నడిపించుట తెలుసు గాని.. నా యాత్రకు శ్రీకారం చుడుతున్నది తెలియలేదు ఈతకొరకు నన్ను నీట నెట్టడమే తెలుసు గానీ నా తెగువకు ఉగ్గు పాలు పడుతున్నది తెలియలేదు ఏమి తండ్రి రెంటాల..కన్నీళ్లను కూడ దాచి.. నాకై చెమటగా ఖర్చుపెడుతున్నది తెలియలేదు… నా జీవం నా సారం చీల్చి చూసుకొంటే గాని.. నాన్న ఇలా ...

భిషక్కు

  మార్చ్ 09, 2023 భిషక్కు       ( bhishakku )       అర్థము      (విశేష్యము ): వైద్యుడు     Meaning     (noun) : doctor; physician    వాడుక / Usage 'ఆంధ్ర పండిత భిషక్కుల భాషా భేషజము'  వ్యావహారిక భాషోద్యమంలో గిడుగుగారి రచన. "Telugu doctor of letters' bluster" is a book written by Gidugu Ramamurthy.     మెదడుకు మేత / Food for thought నీ గురుతులే వచ్చెనే రాతిరి అంతా నీరోడిన కళ్ళే నవ్వెనే రాతిరి అంతా రేతిరి అంతా విరహాగ్ని మండుతూనే ఉన్నదే వ్యథల జ్వాల చెలరేగిందే రాతిరి అంతా మురళీ గానం మధురమై మనోహరమైనే సదా జ్ఞాపకాలు గునపాలై గుచ్చెనే రాతిరి అంతా తలపుల చందమామ మనసున వెలిసెనే వెన్నెల విరజిమ్మేనే రాతిరి అంతా ప్రేమపిపాసి ఎవరో వీధులలో తిరిగేనే విరహ గీతం వినవడెనే రాతిరి అంతా -- ఆప్ కీ యాద్ ఆతి రహీ రాత్ భర్, మగ్దూం మొహియుద్దీన్ (ఫిబ్రవరి 04, 1908 - 1969)

భేషజము

  మార్చ్ 08, 2023 భేషజము       ( bhēshajamu )       అర్థము      (విశేష్యము ): మందు; ఔషధము; మోసము; డంబము; ఆర్భాటము     Meaning     (noun) : medicine; treatment; deceit; show off     వాడుక / Usage   మనసులోని ఆలోచనలను ఎటువంటి  భేషజం  లేకుండా చెప్పేవారు అరుదు.  Rare indeed are those who express their unvarnished opinions.          మెదడుకు మేత / Food for thought ప్రతిది సులభముగా సాధ్యపడదు లెమ్ము, నరుడు నరుడౌట యెంతో దుష్కరమ్ము సుమ్ము వేరులోనుండి కొమ్మలు వెలసినట్లు అన్నిశబ్దాలు నిశ్శబ్దమందె పుట్టె స్వీయలోపమ్ము లెరుగుట పెద్ద విద్దె లోప మెరిగినవాడె పూర్ణుడగు నరుడు పత్రమున నగ్ని శిఖ భద్రపరుచవచ్చు, హృదయమున దుఃఖబాధ భరించలేము ఈ జగత్తు స్వభావమ్ము నేమియందు! మంచి చేసిన వానిని ముంచు నౌర! సింధువునుజేరి బిందువు సింధువగును ధ్యేయమునుబట్టి ప్రతిపని దివ్యమగును -- గాలిబ్ గీతాలు, దాశరథి కృష్ణమాచారి (జులై 22, 1927 - 1987)

అంకణము

  మార్చ్ 07, 2023 అంకణము       ( ankaṇamu )       అర్థము      (విశేష్యము ): నలుచదరపు చోట (12 x 6 అడుగులు); రెండు స్తంభముల మధ్య ప్రదేశం; కక్ష్య; ప్రాంగణం; పెరడు     Meaning     (noun) : apartment; courtyard; place between two pillars/beams      వాడుక / Usage  లంకంత అంకణం ఉంటేనేమి రవ్వంత మానవత్వం లేని చోట .  Of what use is a palatial apartment when a grain of humanity is not found.          మెదడుకు మేత / Food for thought ఎంత చీకటి కాల్చెనో ఇంత చల్లని తారక ఎంత వెలుగును పంచెనో ఇంత సన్నని దీపిక కాలమేమో బరువు బరువు కంటికేమో నిదుర కరువు ఎంత చేదుని మింగెనో ఇంత తీయని కోరిక సూది పోట్లకు గుండె సాచి బాధలకు భాష్యాలు వ్రాసి ఎంత కీర్తిని మోసెనో ఇంత మెత్తని మాలిక కాంక్షలేమో కదలి పోగా ఆంక్షలెన్నో ఎదురు రాగా ఎంత ఓర్పును వహించెనో ఇంత తీరని వేడుక మంచు దాడులు జరుగుతున్నా మండుట్టెండలు రగులుతున్నా ఎంత మట్టిని పీల్చెనో ఇంత పచ్చని వాటిక ఏరు దాటితే ఎవరు వారే ఏమి లోకం ఓ సినా...

బణువు

  మార్చ్ 06, 2023 బణువు       ( banuvu )       అర్థము      (విశేష్యము ): బహుళమైన/బృహత్ అణువు; అణువుల సమూహానికి ~1968లో వాడుకలోకి వచ్చిన పదం     Meaning     (noun) : molecule     వాడుక / Usage   రెండు ఉదజని అణువులు, ఒక ఆమ్లజని అణువు సంయోగం చెందితే వచ్చేది నీటి బణువు .  Two hydrogen atoms and one oxygen atom combine to form a water molecule.          మెదడుకు మేత / Food for thought దరికి చేరినపుడే నా జీవితం నీ చెంత ధరణి మైమరిపించెనే  అందాల నెలవంక ముద్ద మందారాల ముగ్ధ సువాసనతో మది చెలరేగెనే  మలి సంజె వేళలో నీ గళ సెలయేటి పిలుపులే ఘాడమైన గురుతులు ఇపుడు, నిగూఢమైన సంగతులు అపుడూ ఝాము రాతిరి నిదుర పట్టనీయవే నాకింకెపుడూ కలిసిన ప్రతిసారీ ఎడబాటి కాటు ఎందులకే విరిసిన ప్రతి నిమీషం నీ విరహం దహిస్తోంది అందులకే -- జిందగీ జబ్ భీ తేరి బజ్మ్ మే లాతి హై హమే, శహర్యార్, (జూన్ 16, 1936 - 2012)

కలితము

  మార్చ్ 03, 2023 కలితము       ( kali-tamu )       అర్థము      (విశేషణము ): కలిగిన; పొందబడినది; కూడినది     Meaning     (adj) : having; possessed of     వాడుక / Usage  పదోన్మత్త కలితమై ప్రభుత్వం ప్రవర్తించగా ప్రశ్నించే విలేఖరి లేక ప్రజాస్వామ్యం మట్టుపట్టింది.  Government drunk on power, questioning journalist disappearing, democracy demolished.          మెదడుకు మేత / Food for thought ఓయీ బ్రహ్మదేవుడా! దివ్యస్థలంబగు తిరుపతి కొండను  కోతి మూకను బాదు కొలిపినావు తత హంసతూలికా తల్పంబునందును  చెడు నల్లులను సృష్టి చేసినావు ప్రీతి నింపేడు గులాబీ చెట్టునకు  వాడి మించెడి ముండ్లు సృజించినావు ప్రభువుల మందిర ప్రాంగణంబుల  మూర్ఖవేత్ర హ్రస్తులను కల్పించినావు సౌఖ్యముల కాకరములైన సాని యిండ్ల  విటుల నెత్తురు పీల్చెడు  వేశ్యమాతలను మహా పిశాచముల  గావుంచినావు గదరా వృథగాను నీ తెల్వి కాలిపోను -- భవానీ పద్యాలు, చింతామణి నాటకం, కాళ్ళకూరి నారాయణ రావ...

సముద్యతము

  మార్చ్ 02, 2023 సముద్యతము       ( samudyatamu )       అర్థము      (విశేషణము ): ఎక్కువైనది; మిక్కిలిగా; భయంకరమైనది; పొడవైనది; పెద్ద దండము/కర్ర     Meaning     (noun/adj) : great/big; formidable; terrific; fierce; hot     వాడుక / Usage  " దళమౌ పయ్యదలోన్ అడంగియు సముద్యత్ కాంతుల్ ఈరెండాలన్ మలయింపన్ దిశలన్ ."  Necklace hidden on chest emitting great sunshine in all directions.          మెదడుకు మేత / Food for thought చూశారా వదినా! మొదట్నుంచీ విధవావివాహం కూడదు కూడదు అని తప్పు అభిప్రాయంలో పడిపోయి ఉన్న అత్తగారూ మావఁగారూలాంటి పెద్దవాళ్ళకి ఎన్ని శాస్త్రాలూ మనం చెప్పినా, వాళ్ళ నెత్తి కెక్కవు. ఇలాంటి మాటలు మనం వాళ్ళతో చెప్పినట్టాయనా.. కర్రుచ్చుకుంటారు. మావఁగారు వేదం మట్టుకే చదువుకున్నారు గానీ.. నేను శాస్త్రాలు అన్నీ చదువుకొన్నాను. ఆబ్బో.. నేను మన శాస్త్రాల్లో వుడ్డోలుణ్ణి. శాస్త్రకారుడు ఏవఁన్నాడూ? 'బాలాదపి సుభాషితం' అన్నాడు. అనగా మంచిమాట చంటిపిల్లడు చెప్పినా విని ...