Posts

Showing posts from May, 2024

కొండుక

  మే 31, 2024 కొండుక    ( konduka )     అర్థము       (విశేష్యము ): కన్య; నగ్నిక    Meaning     (noun) : nubile woman in a state of undress    వాడుక / Usage     మెండుగ మేలుకొంటివి మించిన కౌఁగిటిలోన కొండుక పాయపుసిరి కోపించంగా.     In the tight embrace of your consort you awake, pleased she is not.     మెదడుకు మేత / Food for thought        ఒక నవల పాఠకుడిపై ఎంత ప్రభావం పట్టు చూపిస్తుందో తెలియచేసే నవల ' ది షాడో ఆఫ్ ది విండ్' . పాఠకుడు పుస్తకం మధ్య ఉండే బలమైన బంధం చూపిస్తూ, సాహిత్యం యొక్క స్వరూపం తెలుసుకోడం ఎంత దుర్లభమో చిత్రిస్తుంది. ఇది చదివి జూలియన్ కారస్ మరియు అతని అభిమానుల యొక్క వెలుగునీడల ప్రపంచంలో మిమ్మల్ని మీరు కోలుపోండి. భావితరాలకి ఏ పుస్తకం దాచుదామా అని మీరు తప్పక ఆలోచిస్తారు.         -- 'ది షాడో ఆఫ్ ది విండ్' గురించి ది టైమ్స్ లో సమీక్ష

ఉప్పవడము

  మే 30, 2024 ఉప్పవడము    ( uppavadamu )     అర్థము       (విశేష్యము ): మేలుకోలు; మేలుకోవడం;  ఉపవడము    Meaning     (noun) : to awake; rouse from sleep    వాడుక / Usage     ఉప్పవడము గావయ్యా ఉయ్యాలమంచముమీఁద గొప్పగొప్ప కన్నుల గోవిందరాజా.     The hammock swings gently, open your big beautiful eyes Lord Govinda.     మెదడుకు మేత / Food for thought        విధి ఎప్పుడూ వీధి చివరే ఉంటుంది. దొంగలాగా, వేశ్యలాగా లేక లాటరీ లాగా - అవి దాని సంకేతాలు. కానీ విధి చెయ్యనిది ఏంటంటే ఇంటి తలుపు తట్టడం. మనమే దానిని కలవడానికి వీధిలోకి వెళ్ళాలి.         -- ది షాడో ఆఫ్ ది విండ్, కార్లోస్ రుయిజ్ జఫోన్

ఉవిద

  మే 29, 2024 ఉవిద    ( uvida )     అర్థము       (విశేష్యము ): జవ్వని; స్త్రీ; భార్య    Meaning     (noun) : woman; damsel; wife    వాడుక / Usage      ఉవిద కు వొకటైతే వొకటిగాదు వివరించి చూడవయ్య విరసముగాదు.     Its not what it appears with a damsel, see through it's not reticence.     మెదడుకు మేత / Food for thought        పని చేస్తున్నంత సేపు జీవితం యొక్క కళ్ళలోకి చూడక్కరలేదు. చచ్చిపోయిన వాళ్ళు తమ అంత్యక్రియలకు ఎన్నడూ వెళ్ళరు.         -- ది షాడో ఆఫ్ ది విండ్, కార్లోస్ రుయిజ్ జఫోన్

సుద్దులు

  మే 28, 2024 సుద్దులు    ( suddulu )     అర్థము       (విశేష్యము ): మంచి మాటలు; సూక్తులు; డంబాలు;  (నిందార్థంలో వాడుక)    Meaning     (noun) : good word; parable; pretentious words    వాడుక / Usage     అంగన సుద్దులు నీ వేమడిగేవయ్యా  చెంగట నుండి నీవే చిత్తగించవయ్యా     What do you ask of the damsel's words, stay close and hear yourself.     మెదడుకు మేత / Food for thought        పిచ్చి వాడికి తెలుసా తనకి పిచ్చి ఉందని? లేక తమ మనసులోని వాస్తవికతని కాపాడుకోడానికి "నువ్వు అవివేకివి అని 'పిచ్చి' వాడిని" నమ్మిదామనుకునే వాళ్ళు పిచ్చి వాళ్ళా?         -- ది షాడో ఆఫ్ ది విండ్, కార్లోస్ రుయిజ్ జఫోన్

లంపటము

  మే 27, 2024 లంపటము    ( lampaṭamu )     అర్థము       (విశేష్యము ): బాధ; ఆయాసము; తొందర; ఆపద; గొడ్డు పారిపోకుండా ఉండటానికి మెడలో కట్టిన కర్ర      Meaning     (noun) : object of attachment; trouble; bother; impediment    వాడుక / Usage     జుట్టెఁడు గడుపుకై చొరనిచోట్లు చొచ్చి      పట్టెఁడుగూటికై బతిమాలి     పుట్టిన చోటికే పొరలి మనసు పెట్టి     వట్టి లంపటము వదలనేరఁడుగాన.     Dark corners having gone for this tiny stomach     blithely entreating for a morsel of food     craving lustfully whence one has come     painful attachment one leaves not! Alas!     మెదడుకు మేత / Food for thought        ఆడవాళ్ళ గురించి ఎవరికీ ఎక్కువగా తెలియదు. ఫ్రాయిడ్ కూడా. స్త్రీలకు కూడా తమ గురించి తెలియదు. కానీ విద్యుత్తు లాగా; ఎలా పని చేస్తుందో తెలియక్కరలేదు, వేళ్ళకి షాక్ తగలడానికి.     ...

విజ్ఞత

  మే 24, 2024 విజ్ఞత    ( vignatha )     అర్థము       (విశేష్యము ): వివేకము; లోకజ్ఞానం      Meaning     (noun) : wisdom; experience    వాడుక / Usage     మత రాజకీయాలు సమర్ధించాలో లేదో మీ విజ్ఞతకే వదిలేస్తున్నాను.     I will leave to your wisdom the supporting or opposing of religious politics.      మెదడుకు మేత / Food for thought      Kabhi to aasman se chand utre jam ho jaye    tumhare naam ke ik khubasurat sham ho jaye    कभी तो आसमाँ से चाँद उतरे जाम हो जाए    तुम्हारे नाम की इक ख़ूब-सूरत शाम हो जाए    నెల రాజు నేల పైకి దిగి వచ్చి ఎపుడు మధిర  అవునో    నీ తలపులో ఒక అందమైన రేతిరి అవునో     -- బషీర్ బద్ర్

విస్ఫోటము

  మే 23, 2024 విస్ఫోటము    ( visphotamu )     అర్థము       (విశేష్యము ): పొక్కు; బోబ్బ; పేలుడు     Meaning     (noun) : swelling; boil; explosion    వాడుక / Usage     విస్ఫోటంతో పుట్టిన బ్రహ్మాండం.     Universe was born out of an explosion.      మెదడుకు మేత / Food for thought      kuchh to majbūriyāñ rahī hoñgī    yuuñ koī bevafā nahīñ hotā    कुछ तो मजबूरियां रही होंगी    यूं कोई बेवफ़ा नहीं होता    ఏదో ఒక నిర్బంధము ఉండే ఉంటుంది    ఎవరూ ఊరికినే నమ్మకద్రోహి అవ్వరు     -- బషీర్ బద్ర్

విశదీకరించు

  మే 22, 2024 విశదీకరించు    ( visadeekarinchu )     అర్థము       (క్రియ ): స్పష్టము చేయు; వివరించు     Meaning     (verb) : explain; clarify    వాడుక / Usage      డార్విన్ ఈ పరిణామ క్రమానికి 'సహజ ఎంపిక' అనే ఒక పద్ధతి ఉందనే విషయాన్ని విశదీకరించారు .     Darwin explained the natural selection process of evolution.      మెదడుకు మేత / Food for thought      hamārā dil savere kā sunahrā jaam ho jaa.e    charāġhoñ kī tarah āñkheñ jaleñ jab shaam ho jaa.e     हमारा दिल सवेरे का सुनहरा जाम हो जाए     चराग़ों की तरह आँखें जलें जब शाम हो जाए    నా హృదయం ప్రభాత కిరణాల మధువు అవ్వనీ     కాగడాల వలే కళ్ళని నిశి రాత్రి నల్లని నీడలలో కాలనీ      -- బషీర్ బద్ర్

నిబిడీకృతము

  మే 21, 2024 నిబిడీకృతము    ( nibiḍīkṛitamu )     అర్థము       (విశేషణము ): నిబిడము=సాంద్రత; దట్టముగా; ఘనమైన;     Meaning     (adj) : thickened; densely covered or embedded    వాడుక / Usage      మీ అనంతమైన నిబిడీకృత సృజనాత్మక సామర్థ్యాన్ని వెలికి తీయండి.     Unleash the infinite creativity embedded within you.      మెదడుకు మేత / Food for thought    ujāle apnī yādoñ ke hamāre saath rahne do    na jaane kis galī meñ zindagī kī shaam ho jaa.e     उजाले अपनी यादों के हमारे साथ रहने दो    न जाने किस गली में ज़िंदगी की शाम हो जाए    నీ జ్ఞాపకాల వెలుతురు నా దగ్గరే ఉండనీ     ఎప్పుడు  ఏ వీధిలో ఈ జీవితాస్తమం వస్తుందో     -- బషీర్ బద్ర్

అతలాకుతలము

  మే 20, 2024 అతలాకుతలము    ( athalaakuthalamu )     అర్థము       (విశేష్యము ): కల్లోలం; తారుమారు; చిందర వందర; అతల=అగాధము, కుతల=ఎగుడుదిగుడు    Meaning     (noun) : disorder; confusion; disturbance    వాడుక / Usage     చిన్న వర్షానికి నగరంలో జనజీవనం అతలాకుతలం .     Life in the city was thrown to doldrums following the downpour.      మెదడుకు మేత / Food for thought     baḌe logoñ se milne meñ hamesha fāsla rakhnā     jahāñ dariyā samundar se milā dariyā nahīñ rahtā     बड़े लोगों से मिलने में हमेशा फ़ासला रखना    जहाँ दरिया समुंदर से मिला दरिया नहीं रहता    గొప్ప వాళ్ళ సంపర్కంలో ఎప్పుడూ అంతరం ఉంచు    నది సముద్రంలో కలిసాక ఇక నది ఉండదని గుర్తించు     -- బషీర్ బద్ర్

బహుపరాకు

  మే 17, 2024 బహుపరాకు    ( bahuparāku )     అర్థము       (విశేష్యము ): పరాకు=హెచ్చరిక, ప్రమాదం, ఏక దృష్టి; బహు=మిక్కిలి; రాజులు సభలోకి ప్రవేశించేప్పుడు సేవకులు చేసే హెచ్చరిక; ప్రశంస    Meaning     (noun) : call to attention in a court when the king arrives; praises    వాడుక / Usage      తలిరాకు బహుపరాకులు విని దొరలని దొరనగవు దొంతరని తరలని దారి తొలగి రాతిరిని.     Listen to the praises of leaves and let your radiant white smile banish the dark night.      మెదడుకు మేత / Food for thought     కాఫ్కాలూ, కామూలూ, ఇలియాస్ కానెట్టీలూ, పదే పదే చదివే షేక్స్పియర్ మాక్బెత్ లూ, బైరాగి కవిత్వాలలోంచి    మళ్ళీ రాస్కల్నికోవ్, హామ్లెట్లూ, డాలీ రేఖలలో కూడా దాక్కున్న అసంబద్ధ వాక్యాలూ, త్రిపుర అనే దేశంలో వొంటరి    సంచారాలూ తెగ సందడి చేసే ఆ పందొమ్మిదేళ్ళ అమాయకత్వపు అంతిమ దినాల్లో- బెజవాడ గాంధి నగర్     “ప్రబోధ”  బుక్ సెంటర్లో అనుకోకుండా దొర...

తలయూచు

  మే 16, 2024 తలయూచు    ( talayoochu )     అర్థము       (క్రియ ): సంతోషము లేక అంగీకారం సూచించు; మెచ్చుకొను    Meaning     (verb) : show happiness or agreement; praise    వాడుక / Usage      పసిడి కిరణాలు పడి పదునుదేరిన చాలు తలయూర్చు  తలిరాకు .    Dazzling in the golden rays brimming with joy are the budding leaves.      మెదడుకు మేత / Food for thought       కళ్లలోనే వుండిపోయాడు కానీ      గుండెల్లోకి ఎప్పుడూ చూడలేదు.      నౌక మీదనే బహు దూరాలు వెళ్ళాడేమో      కానీ, సముద్రాన్ని ఎన్నడూ చూడలేదు.      ఎక్కడయినా చుక్కలా రాలిపడ్డానా      ఎగాదిగా చూస్తారు అందరూ      పగటి బతుకులోనే గడిచిపోయింది కాలమంతా      కాసింత నీడ ఎలా వుంటుందో తెలియలేదు.      నడుస్తూనే వున్నాను అనంతంగా      మైలు రాయి వొక్కటయినా ఇందాకా చూడలేదు.    ...

పసరు

  మే 15, 2024 పసరు    ( pasaru )     అర్థము       (విశేష్యము ): ఆకురసము; ఆకుపచ్చన; వ్యాపించు; పైత్య రసం    Meaning     (noun) : juice of leaves; green colour; spreading; bilious vomit    వాడుక / Usage      పసరు పవనాలలో పసికూన రాగాలు.    The lilting tender songs of the wind swaying in the green leaves.      మెదడుకు మేత / Food for thought       కైలాసశిఖర మల గడగి ఫక్కున నవ్వ      నీలిమాకాశంబు నిటలంబుపై నిల్వ      నందికేశ్వర మృదంగ ధ్వానములు బొదల      తుందిలా కూపార తోయపూరము దెరల      చదలెల్ల కనువిచ్చి సంభ్రమత దిలకింప      నదులెల్ల మదిబొంగి నాట్యములు వెలయింప      వన కన్యకలు సుమాభరణములు ధరియింప      వసుధ యెల్లను జీవవంతంబై బులకింప     ఆడెనమ్మా శివుడు ! పాడెనమ్మా భవుడు!     -- శివతాండవం, పుట్టపర్తి నారాయణాచార్యులు (మార్చ్ 28...

కృతి

  మే 14, 2024 కృతి    ( kṛiti )     అర్థము       (విశేష్యము ): చేయుట; ప్రబంధము; పండితుడు    Meaning     (noun) : an act; musical composition; literary work; a learned person    వాడుక / Usage      పాడని ప్రకృతిని ప్రథమ కృతిని .    Let nature sing the first composition in your praise.      మెదడుకు మేత / Food for thought       తుంగభద్రా నముత్తుంగ వీచీ ఘటా      గంభీర ఘుమఘుమల యందూ    కవిసార్వభౌము జయములు పల్కు నందూ అచ్చోట నిలిచివర్షింవరా ! జలదమా! నీ నీరు    తులలేని తుంగమ్మ ద్రాక్షా రసముసేయు     -- మేఘదూతము, పుట్టపర్తి నారాయణాచార్యులు (మార్చ్ 28, 1914 - 1990)

ప్రణతి

  మే 13, 2024 ప్రణతి    ( pra-ṇati )     అర్థము       (విశేష్యము ): నమస్కారము; వినమ్రత    Meaning     (noun) : salutation; bow in reverence    వాడుక / Usage      నీ ప్రాణ కీర్తన విని పలుకని ప్రణతులని ప్రణవ శ్రుతిని.    Listening to your life affirming celestial song let the world salute with life giving sound Om.      మెదడుకు మేత / Food for thought       ఒక రెండు కిరణములు ముఖముపై బడినవో!    కను వ్రాల్చి నా యినువ కమ్మిపై నపరాధి -      అతని దుఃఖమ్మునకు నదిగూడ గఱగెనో!      తన యతివ యంగమ్ము దడవి నటులే యయ్యె;      వాని కన్నీర పుడు వ్రాసె నా కమ్మిపై భావిదేశ చరిత్ర!     -- మేఘదూతము, పుట్టపర్తి నారాయణాచార్యులు (మార్చ్ 28, 1914 - 1990)

పల్లవము

  మే 10, 2024 పల్లవము    ( pallavamu )     అర్థము       (విశేష్యము ): చిగురు; చిగురించిన కొమ్మ; విరివి; శృంగారము    Meaning     (noun) : sprout; tender leaf    వాడుక / Usage      నీ చరణ కిరణాలు పలుకరించిన చాలు పల్లవించును ప్రభు పవళించు భువనాలు భానుమూర్తి.    O dazzling Sun! the mere caress of your rays and the sleeping worlds sprout life.      మెదడుకు మేత / Food for thought       ఉత్సజ్షేవామలినవసనేసామ్య నిక్షిప్య వీణాం మధ్గోత్రాజ్కం విరచితపదం గేయముద్దాతుకామా | తస్తీమార్హాం నయనసలిలైః సారయిత్వాకథంచి ద్భుయోభూయః స్వయమపి కృతాంమూర్భనాం విస్త్రరన్తీ ॥     ( వియోగారంభం నుండ వియోగాంతం వరకు మిగిలిన నెలలను ద్వారము నందుంచిన పూలచే లెక్కించి వానిని భూమి మీద ఉంచుతూ కాని, లేదా మనసులో ఊహిస్తున్న నా ఆలింగనచుంబనాదులతో కూడిన రతి క్రీడానుభూతి చెందుతూ కాని నీ కంటబడవచ్చు. సాధారణంగా ప్రియుల వియోగంలో (స్త్రీలు ఇటువంటి వినోదాలతోనే ప్రొద్దుపుచ్చుతూ ఉంటారు...

గారాబు

  మే 09, 2024 గారాబు    ( gārābu )     అర్థము       (విశేష్యము ): గారాబము; మిక్కిలి ప్రియము    Meaning     (noun) : affection; indulgence    వాడుక / Usage      గారాబు కవనాల గాలి సంగతులు ఈ పూల రాగాల పులకింత గమకాలు.    Endearing poem is the whistling of wind; swaying flowers in a musical ecstasy.      మెదడుకు మేత / Food for thought       తన్వీశ్యామాశిఖరిదశనా పక్వబిమ్బాధరోష్టీ    మధ్యేక్షామాచకితహరిణీ ప్రేక్షణా నిమ్న నాభిః |      థ్రోణీ భారాదలసగమనాస్తోక నమాస్తనాభ్యాం    యాత త్రస్యాద్యువతివిషయే సృష్టిరాద్యెవధాతుః ॥     (సన్నని, నడియౌవనవతి, కోణములు తేలిన పళ్ల వరుసతో దొండపండు వంటి క్రింది పెదవితో, సన్నని నడుముతో, భయముతో ఉన్న జింక కళ్ళవలె పెద్ద కళ్ళు కలిగి, లోతైన బొడ్డుతో, పీరుదుల భారంతో నిమ్మదిగా నడిచే, వక్షోజముల వల్ల వంగినట్లయ్యి స్త్రీ విషయకమైన బ్రహ్మ తొలి శిల్వమువలె ఉన్న స్త్రీ)     -- మేఘద...

కువకువ

  మే 08, 2024 కువకువ    ( kuva-kuva )     అర్థము       (విశేషణము ): కోకిల కూత; పావురాల కూత; పసి బిడ్డ ఏడ్పు వంటి    Meaning     (adv) : warbling of pigeons or cuckoos; cry of a new born child    వాడుక / Usage      నీ దోవ పొడవునా కువకువల స్వాగతం.    Your arrival is welcomed by the cooing songs of the cuckoo.      మెదడుకు మేత / Food for thought       అనాదిగా జరుగుతున్న      అన్యాయం ఇది లే        అదేమిటో - ఆడ దంటే      మగ వాడికి అలుసులే        అనాదిగా జరుగుతున్న      అన్యాయం ఇది లే        ఎవడో ఒకడన్నా డని -      అదియె ప్రజా వాక్యమని        అగ్ని వంటి అర్ధాంగిని      అడవి కంపె రాముడు - శ్రీ రాముడు      జూదమాడి ఒకరాజు      ఆలి నోడినాడు    ...

ఇల

  మే 07, 2024 ఇల    ( ila )     అర్థము       (విశేష్యము ): నేల; ఆవు; మాట    Meaning     (noun) : the Earth; cow; spoken word    వాడుక / Usage      ఇల గొంతు వణికింది పిలుపునీయనా.. ప్రభూ.    The earth's voice is trembling; Shall I give the wake up call, dear Lord!      మెదడుకు మేత / Food for thought       తస్మిన్నద్రౌ – కతిచిదబలా -విప్రయుక్తః స కామీ      నీత్వా మాసాన్ – కనకవలయ – భ్రంశరిక్తప్రకోష్ఠః      ఆషాఢస్య – ప్రథమదివసే – మేఘమాశ్లిష్టసానుం     వప్రక్రీడా – పరిణతగజ – ప్రేక్షణీయం దదర్శ     ( ఎప్పుడూ భార్యను తలుస్తూ ఆ విరహ వ్యధలను అనుభవిస్తూ యక్షుడు చిక్కిపోయాడు. ధరించిన బంగారు కడియాలేమో అతని చిక్కిపోయిన చేతులనుండి జారిపోతున్నాయి. (శృంగారము రెండు విధాలు – సంభోగము, విప్రలంభము. వియోగశృంగారానికి పరాకాష్ఠ మేఘదూతము.) ఏనుగులు ఒక గోడను లేక భూమిని ఢీకొన్నట్లు  కొండ చుట్టూ ఆషాఢమేఘాలు ఆవరించుకొన్నాయి . ) ...

తెలి

  మే 06, 2024 తెలి    ( teli )     అర్థము       (విశేషణము ): తెల్లనిది; నిర్మలము; కాచిన నేయి    Meaning     (adj) : white; pure; clear; bright    వాడుక / Usage      తెలి మంచు కరిగింది  తలుపు తీయనా ప్రభూ.    The morning fog has cleared; Shall I open the door, dear Lord!      మెదడుకు మేత / Food for thought       సంతప్తానాం త్వమసి శరణం తత్పయోద ప్రియాయాః     సందేశం మే హర ధనపతిక్రోధ విశ్లేషితస్య ,     గన్తవ్యా తే వసతి రలకా నామ యక్షేశ్వరాణాం     బాహ్యోద్యాన స్థితహరశిరశ్చంద్రికాధౌత హర్మ్యా     (సంతప్తులకు (వేగిపోతున్నవారికి – ప్రవాసం చేతనో, ఎండ బాధతోనో) నువ్వే రక్షకుడివి (ప్రవాసం వెళ్ళిన వాళ్లు వర్షాకాలానికి తిరిగి ఇంటికి వస్తారు. ఎండల నుండీ మేఘుడి వర్షం రక్షిస్తుంది). కాబట్టి శాపం వల్ల భార్యకి దూరమైన నాకు నువ్వే రక్ష. నా సందేశం నువ్వే తీసుకెళ్లాలి. నువ్వు తప్పనిసరిగా అలకా నగరానికి వెళ్లాలి. కైలాసంలో ...

పుట్టి

  మే 03, 2024 పుట్టి    ( puṭṭi )     అర్థము       (విశేష్యము ): ధాన్యపు కొలత; ఇరవై కుంచాలు; యేరు దాటడానికి వాడే పెద్ద గంపలాంటి పడవ    Meaning     (noun) : a dry measure; ~500 pounds weight; circular basket weight     వాడుక / Usage     శ్రీశైలం పాతాళ గంగలో పుట్టి మీద ప్రయాణం ఆహ్లదకరం ప్రమాదకరం కూడాను .    Sailing on a wicker basket in Srisaliam's Patalaganga is both beautiful and dangerous.      మెదడుకు మేత / Food for thought         తోటలో నా రాజు తొంగి చూసెను నాడు       నీటిలో ఆ రాజు నీడ నవ్వెను నేడు            నవ్వులా అవి కావు.. నవ పారిజాతాలు      రవ్వంత సడిలేని.. రసరమ్య గీతాలు      ఆ రాజు ఈ రోజు అరుదెంచునా      అపరంజి కలలన్నీ చిగురించునా      చాటుగా పొదరింటి మాటుగా ఉన్నాను      పాటలాధర రాగ భావనలు కన్నాను     ఎలనా...

మానిక

  మే 02, 2024 మానిక    ( mānika )     అర్థము       (విశేష్యము ): ధాన్యపు కొలత; నాలుగు సోలలు; సేరు    Meaning     (noun) : a dry measure; four 'solas'     వాడుక / Usage      మానికతో ఉప్పు అమ్మే శివ భక్తుడు పూజకు శివలింగం దొరకక మానిక నే శివలింగంగా భక్తితో పూజించాడు.     Unable to find a Shivalinga a trader worshiped his measuring jar with devotion.      మెదడుకు మేత / Food for thought         లలిత సంగీతం అలా కాదు. ఇందులో సాహిత్యమే ముఖ్యం. సాహిత్యపు భావానికి, రాగ భావం తోడైనప్పుడు పాట ఇంకా రాణిస్తుంది. ఇందుకు ఎన్నో ఉదాహరణలున్నాయి. ఎస్‌ రాజేశ్వర రావు ఖమాస్‌ రాగంలో జావళీల ఫక్కీలో ఎన్నో పాటలు చేసారు. కాని, విప్రనారాయణలో భానుమతి పాడిన ” నను విడనాడకురా ” అనే పాటకన్నా, చరణదాసిలో సుశీల పాడిన జావళీ కన్నా, మల్లీశ్వరిలోని ” ఎందుకే నీకింత తొందరా ” అనేపాటే జనాదరణ పొందింది. ఇందుకు కారణం దేవులపల్లి వారి రచనే! --  కొడవటిగంటి రోహిణీప్రసాద్