విలయము
జనవరి 31, 2025 విలయము ( vilayamu ) అర్థము ( విశేష్యము ) : ప్రళయము; వినాశనము; కల్పాంతము Meaning (noun) : destruction; annihilation వాడుక / Usage విధిగా తెగించేరా విధినే వధించేరా విలయం ధరించేరా విజయం వరించేరా. Be decisively audacious, extinguish destiny, let annihilation be your armour and victory be your choosing . మెదడుకు మేత / Food for thought స్త్రీని మురిపించి, మరిపించి దగా చేయడం అనేది అనాదిగా నడుస్తున్న జీవలీల. అయితే ఆ స్త్రీ పరిస్థితులను ఎదురుకొని విజ్ఞానవతి అయ్యి వృత్తి రీత్యా ఉన్నత స్థాయిలో ఉండి, తన వృత్తి ధర్మ నిర్వహణలో ఆ వంచించిన వ్యక్తి ఎదుట సాక్షాత్కరించినపుడు ఆ స్త్రీ ఏమి చేస్తుంది? -- సద్యోగం, మాలతీ చందూర్ (1928 - 2013)