Posts

Showing posts from September, 2024

కుఠారము

  అక్టోబర్ 02, 2024 కుఠారము    ( kuṭhāramu )     అర్థము      (విశేష్యము ) : గొడ్డలి    Meaning     (noun) : an axe    వాడుక / Usage       భవకాననశాత కుఠార ధార , సజ్జనపరిపాలశీల .       O protector of the good! you are the axe that cuts the dense forest of Samsara .     మెదడుకు మేత / Food for thought     రాజు, కేవలం అసూయా దృష్టితో ధనవంతుల సిరిసంపదలు అపహరించరాదు. పులి తన కూనలను ఆకలితో కబళించినట్లు విత్తాకర్షణకు ఉపక్రమించిన యెడల అంతంతమాత్రమే సొమ్ము లభించగలదు. ఇందువల్ల జలగ నెత్తురు పీల్చినట్లు ఏలిక వేదన కలిగించని సుఖోపాయాలతో ప్రజలనుండి పన్నుల రూపంలో విత్తం స్వీకరించవలెను. అదీ కేవలం ప్రజాపరిపాలన కోసమే. -- భీష్ముడు ధర్మరాజుతో, శాంతి పర్వం - శ్రీ మహాభారతం

దైన్యము

  అక్టోబర్ 01, 2024 దైన్యము    ( dainyamu )     అర్థము      (విశేష్యము ) : పేదరికం,  బలహీనత వల్ల కలిగే అవస్థ; దీనత్వము    Meaning     (noun) : state of poverty, weakness    వాడుక / Usage      ప్రభుత్వ వైద్యం అందని వైనం - వయోవృద్ధుల దైన్యం.       Inaccessible government medical aid - aged citizens in misery .     మెదడుకు మేత / Food for thought     జన్మజన్మాంతరాల నుండి కొనసాగుతున్న నిరంతర సంసార సాగర ప్రయాణాలలో వేల కొలది తల్లిదండ్రులు, భార్యాపుత్రులు, అన్నదమ్ములు, ఆత్మీయులు ఆదిగాగల వారితో సంయోగ వియోగాలు ఏర్పడుతున్నవి . మానవుడు ఇన్ని వేలమందిలో ఎవ్వరికోసమై పలవించగలడు? తన శరీరమే ఎరువు సొమ్ము అయిన మానవునికి ఇక బంధు సమూహం శాశ్వతం కాగలదా? -- వ్యాసమహర్షి ధర్మరాజుతో, శాంతి పర్వం - శ్రీ మహాభారతం

ఔదల

  సెప్టెంబర్ 30, 2024 ఔదల    ( audala )     అర్థము      (విశేష్యము ) : నడి తల; నడి నెత్తి    Meaning     (noun) : the middle/crown of the head    వాడుక / Usage       ఎదురు చెప్పడానికి వీల్లేకుండా ఉన్నతాధికారి మాటను ఔదల దాల్చవలసిన కానిస్టేబుళ్ళు.     Constables are expected to treat the words of their superiors as paramount .     మెదడుకు మేత / Food for thought     మనుగడ అనిత్యమన్న నిశ్చయమొక్కటే సర్వదా క్షేమకారికాగలదు. జగత్తు యావత్తు జన్మ జరా మరణాలన్న పెను మొసళ్ళతో నిండిన కాలమన్న మహాబ్ధిలో మునిగి ఉన్నాడని గుర్తెరిగిన వివేకి సర్వదా ధర్మతత్పరుడై చింతా విహీనుడై సుఖిస్తున్నాడు. -- వ్యాసమహర్షి ధర్మరాజుతో, శాంతి పర్వం - శ్రీ మహాభారతం

స్ఫురదీప్తి

  సెప్టెంబర్ 27, 2024 స్ఫురదీప్తి    ( sphuradeepthi )     అర్థము      (విశేష్యము ) : తక్కువ తరంగదైర్ఘ్యం ఉన్న కాంతికి గురై, ఆ కాంతి తీసివేసినాకూడా చాలాకాలం ప్రకాశించడం    Meaning     (noun) :  phosphorescence    వాడుక / Usage      గోడ గడియారంలో గంటలు ప్రకాశించడం కోసం  స్ఫురదీప్తిక రమైన పూత పూస్తారు .     Clocks use  phosphorescent coating on their dials .     మెదడుకు మేత / Food for thought        హృషీకేశ్, అబూ పర్వత ప్రాంతాలలో తీవ్రమైన తపస్సు చేశారు. అక్కడే శరత్ చంద్రసేన్ అనే మహాత్ముడు వీరికి దీక్షనిచ్చారు. నాటి నుండి స్వామి జ్ఞానానంద వీరి ఆశ్రమ నామమైనది. 1927లో "పూర్ణ సూత్రాలు" రచించి ఆ గ్రంథాన్ని జర్మనీలో ముద్రించాలని సంకల్పించి ఐరోపా వెళ్ళి అక్కడ గొప్ప విజ్ఞాన శాస్త్రవేత్తగా రూపొందారు. చెకోస్లవేకియా దేశపు ప్రాగ్ విశ్వవిద్యాలయంలో డి.ఎస్.సి. పట్టాను, బ్రిటన్ లోని లివర్ పూల్ విశ్వవిద్యాలయంలో పి.హెచ్.డి. పట్టాను పొందారు. భౌత...

ప్రతిదీప్తి

  సెప్టెంబర్ 26, 2024 ప్రతిదీప్తి    ( prathideepthi )     అర్థము      (విశేష్యము ) :  కాంతి లేదా ఇతర విద్యుదయస్కాంత వికిరణాన్ని గ్రహించిన పదార్ధం కాంతిని ప్రకాశించడం    Meaning     (noun) :  fluorescence    వాడుక / Usage       ప్రతిదీప్తి దీపాలని ఐరోపా నిషేధించాలని ప్రతిపాదించింది .     Europe is phasing out fluorescent lamps.     మెదడుకు మేత / Food for thought      సీఎల్‌ఆర్ఐ డైరెక్టర్‌గా, సీఎస్ఐఆర్ డైరెక్టర్‌ జనరల్‌గా ఇరవై ఏళ్లపాటు పనిచేసిన నాయుడమ్మ.. ఒక శాస్త్రవేత్తగా తన సలహాలు, సూచనలు, పనితీరు, పరిశోధనలతో భారతదేశానికే కాక 50కి పైగా అభివృద్ధి చెందుతున్న దేశాలకు సేవలు అందించారు. ఐక్యరాజ్య సమితి విభాగాలైన ఎఫ్ఏఓ (తర్వాత యూఎన్‌డీపీ అయ్యింది), యూఎన్ఐడీఓ, యునెస్కో వంటి సంస్థలకు కూడా సీనియర్ సలహాదారుగా పనిచేశారు. అభివృద్ధి చెందుతున్న దేశాల్లో శాస్త్ర, సాంకేతికతపై కమిటీ (కమిటీ ఆన్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఇన్ డెవలపింగ్ కంట్రీస్ - సీఎస్‌టీడీ)కి అధ్యక్షుడిగా కూడ...

ఉద్గారము

  సెప్టెంబర్ 25, 2024 ఉద్గారము    ( ud-gāramu )     అర్థము      (విశేష్యము ) : వాంతి; బయటకు పంపుట; ప్రసరణ    Meaning     (noun) : throwing up; emission    వాడుక / Usage       పంకవాయువు  ఉద్గారాలను తగ్గించడానికి 3-మార్గం భాగస్వామ్యం .     Three way partnership for reducing methane emissions.     మెదడుకు మేత / Food for thought      1957లో IISc డైరెక్టర్ అయ్యారు, 5సంవత్సరాలు ఆ సంస్థ కి సేవలందించారు ఆ తర్వాత భారత ప్రభుత్వ శాస్త్రీయ సలహాదారుగా సేవలందించారు. 1962లో DRDO డైరెక్టర్ గా బాధ్యతలు స్వీకరించారు. 1969లో పదవీ విరమణ పొందారు. అయితే భౌతిక శాస్త్రంలో సుమారు 300 ల పత్రాలు ప్రచురించారు మరియు అనేక పుస్తకాలు రాసారు. ఆయన గొప్ప మేధావి మాత్రమే కాదు పరిపాలన దక్షుడు, వక్త. మరియు ఆయనకి తెలుగు సంస్కృత భాషలలో అపారమైన పాండిత్యం ఉండేది. దేశ విజ్ఞాన శాస్త్ర అభివృద్ధికై అనేక ప్రాంతాలలో మరియు ఇతర ప్రాంతాలలో ఉపన్యాసాలు ఇచ్చారు. -- సూరి భగవంతం గురించి https://www.manatelugukath...

వికిరణము

  సెప్టెంబర్ 24, 2024 వికిరణము    ( vikiranamu )     అర్థము      (విశేష్యము ) : అంతటా వ్యాపింప చేయుట; జ్ఞానము; కిరణ పుంజము;  అంతరిక్షం ద్వారా లేదా పదార్థ మాధ్యమం ద్వారా తరంగాలు లేదా కణాల రూపంలో శక్తిని విడుదల చేయడం    Meaning     (noun) : radiation    వాడుక / Usage       సూర్యుడి నుంచి వెలువడే వికిరణాలను భూమి అయస్కాంత శక్తి అడ్డుకోవడంతో రంగురంగుల కాంతులు .     An explosion of colours when solar radiation meets earth's magnetic field.     మెదడుకు మేత / Food for thought      రెండో ప్రపంచయుద్ధ సమయంలో ఆయన చేసిన పరిశోధన తొలి టెట్రాసైక్లిన్‌ యాంటీ బయాటిక్‌- అరియోమైసిన్‌ ఆవిష్కారానికి దారితీసింది. ఫైలేరియా గురించి పరిశోధన చేసి, హెట్రజన్‌ ఔషధాన్ని సుబ్బారావు కనిపెట్టారు. క్షయ కట్టడికి ఐసోనికోటినిక్‌ ఆసిడ్‌ హైడ్రాజైడ్‌ను రూపొందించారు. క్యాన్సర్‌కు వాడే కీమోథెరపీ ఔషధాల్లో తొలితరం డ్రగ్‌ మెథోట్రెస్సేట్‌ను సిడ్నీ ఫార్బర్‌ అనే శాస్త్రవేత్తతో కలిసి అభివృద్ధి చేశారు....

తరంగదైర్ఘ్యము

  సెప్టెంబర్ 23, 2024 తరంగదైర్ఘ్యము    ( taranga-dairghyamu )     అర్థము      (విశేష్యము ) : తరంగ = వస్తువు చలించుటచే గాలిలో ఏర్పడే చలనము; దైర్ఘ్యము = నిడువు , పొడుగు;  తరంగం యొక్క నిడువు    Meaning     (noun) : wave length    వాడుక / Usage       కాంతి యొక్క  తరంగదైర్ఘ్యం  దాని రంగును నిర్ణయిస్తుంది.     Wavelength of the light determines its colour.     మెదడుకు మేత / Food for thought      ఓ గొప్ప శాస్త్రవేత్త, హేతువాది, ఒక మానవతామూర్తి ఈ దేశం కోసం ఆఖరి వరకు నీతి నిజాయితీగా శ్రమించి, ఎలక్ట్రానిక్స్ రంగంలో దేశానికి స్వావలంబనకు కృషి చేసి చరిత్రలో నిలిచిపోయిన మహనీయుడు అయ్యగారి సాంబశివరావు గారు. పశ్చిమగోదావరి జిల్లా మోగల్లులో జన్మించినాయన బెనారస్ హిందూ విశ్వ విద్యాలయంలో అలాగే అమెరికాలో స్టాన్ఫోర్డ్, అనేక ప్రఖ్యాత విశ్వవిద్యాలయములో విద్య అభ్యసించి టాటా ఫండమెంటల్ రీసెర్చ్, తరువాత బాబా ఆటమిక్ సెంటర్లో హోమి జే బాభా గారి దగ్గరి పనిచేశారు. ఆయన అనేక ఆవిష్కరణలు...

అలవి

  సెప్టెంబర్ 20, 2024 అలవి    ( alavi )     అర్థము      (విశేష్యము ) : సామర్థ్యం; శక్యం; విధము; సత్తువ; పరిమితి    Meaning     (noun) : ability; energy/power; measure/extent    వాడుక / Usage      అవును. అలవి తప్పకూడదు. తన పెనిమిటి చచ్చినా, తను చచ్చినా, పసికందు చచ్చినా.     Yes. I should not cut back on the extent of my work. Even if my husband dies. Even if my infant dies. Even if I die.     మెదడుకు మేత / Food for thought     ఈ కళకళమని జలజలమని హోరాహోరున గోల చేసే, అమ్మ ఒడికన్నా మెత్తగా నెమ్మదించే వాన కథలలోకి గొడుగూ తొడుగూ లేకుండా ప్రవేశించండి . ముగిసే సమయానికి ఖచ్చితంగా మీరు మునుపటి మనిషిలా మాత్రం ఉండరు. సంస్కారాల ఉన్నతీకరణ కోసం కురిసిన ఈ కథలలోకి నలుపెక్కిన మేఘాలతో స్వాగతం. -- ఉత్తమ తెలుగు వాన కథలు, మహమ్మద్ ఖదీర్ బాబు

ముసురు

  సెప్టెంబర్ 19, 2024 ముసురు    ( musuru )     అర్థము      (విశేష్యము/క్రియ ) : నానుడు వాన; జడి వాన; పడుతూ ఉండే వాన; చుట్టుకొను    Meaning     (noun/verb) : continued rain; to swarm or surround    వాడుక / Usage      బయటకు చూసింది. అదే ముసురు . ఆకలిలాంటి ముసురు. పాపం లాంటి ముసురు.     She saw outside. It was the same incessant rain. Like hunger that covers you. Like moral decadence that surrounds you.     మెదడుకు మేత / Food for thought     ఎన్నో వాన కథలు . కాని వాన నీటిలో కాగితపు పడవను తయారు చేసుకుని ప్రయాణించాలనే మనిషిని ఇక్కడే చూస్తారు. వాన నీటిపై కాగితపు పడవ ప్రయాణం! ఏమిటి అర్థం? జీవితంలో కష్టం తప్పనిసరి. వాన తప్పనిసరి. ఆశ తప్ప మరే ఆదరువు లేనివారికి కాగితపు పడవే పడవ. ఆ పడవ గమ్యం చేరదు. కాని అలాంటి పడవైనా ఉందని అనుకోడం ఎంత ఓదార్పు. తెలుగు కథ ఇలాంటి వంద సెంటీమీటర్ల వాన కథలతో బలాన్ని సమకూర్చుకుంది. -- ఉత్తమ తెలుగు వాన కథలు, మహమ్మద్ ఖదీర్ బాబు

కపోలము

  సెప్టెంబర్ 18, 2024 కపోలము    ( kapōlamu )     అర్థము      (విశేష్యము ) : చెక్కిలి; బుగ్గ    Meaning     (noun) : the cheek    వాడుక / Usage      ఆమె కపోలాల మీద అశ్రుధారలు ప్రవహిస్తున్నాయి .     Tears flowed on her cheeks.     మెదడుకు మేత / Food for thought     పాత విశ్వాసాలను కూల్చి కొత్త నమ్మకాలను నిలబెట్టే వానను, స్థిరపడ్డ మానసిక ప్రతిబంధకాలను తుడిచి పారేసి ధైర్యాన్ని నూరిపోసే వానను, నగరాన్ని పద చిత్రాలుగా మలచిన వాననూ చూస్తారు . ఒక వాన ఒకణ్ణి తను వదిలిపెట్టిన ఇంటిని జ్ఞాపకం చేసి అతణ్ణి ఆ ఇంటి దాకా తీసుకెళ్లేందుకు ప్రయత్నం చేస్తే ఒక వాన అలా పారిపోయినవాడు ఇల్లు చేరుకుంటే ఏమవుతుందో చూపిస్తుంది. -- ఉత్తమ తెలుగు వాన కథలు, మహమ్మద్ ఖదీర్ బాబు

సానువు

  సెప్టెంబర్ 17, 2024 సానువు    ( sānuvu )     అర్థము      (విశేష్యము ) : కొండనెత్తము; కొన; అడవి; సుడిగాలి    Meaning     (noun) : table land on top of a mountain; summit; forest; gale    వాడుక / Usage      అగాధాలు నిండిన సముద్రాల మీద, నిర్జీవమైన పర్వత సానువుల మీద, వాన కురుస్తూనే ఉంది .     On oceans that fill abysses, on lifeless mountain tops, the rain keeps falling.     మెదడుకు మేత / Food for thought     ఒక బిచ్చగత్తె మీద కురిసిన వాన, ఒక వెలయాలి విటుని ఎదురు చూపుల ఇంటిపై కురిసిన వాన. ఒక రోడ్డువార కాకహోటల్ కబుర్లపై కురిసే వాన. చెమ్మగిల్లి వేళ్ళు కొంకర్లు తిరగగా పాలగ్లాసు ఓదార్పు వేడికి కూడా నోచని ఒక దీనురాలిపై కురిసిన వాన . ఒక దొంగపై కురిసిన వాన. ఒక ఆడపిల్ల తండ్రిపై కురిసే వానను మీరు చూస్తారు.   -- ఉత్తమ తెలుగు వాన కథలు, మహమ్మద్ ఖదీర్ బాబు

పొత్తి

  సెప్టెంబర్ 16, 2024 పొత్తి    ( potthi )     అర్థము      (విశేష్యము ) : మెత్తటి / సన్నని పాత వస్త్రం; చెట్టు నార; దివిటీ; ధాన్యపు రాశి    Meaning     (noun) : thin/soft old cloth; soft fiber of coconut tree; torch; heap of grains    వాడుక / Usage       విత్తనం బొజ్జలో నుంచి మొక్క పాపాయిని నేల పొత్తిళ్ళలోకి తెచ్చి పెంచి పెద్ద చేసే దేవతే కదా వానంటే .     Isn't rain the God that delivers the sapling from the womb of the seed into the soft cloth of earth and nurtures it into a tree?     మెదడుకు మేత / Food for thought     ఏదో పురా శాసనాన్ని అమలు చేస్తున్నట్లుగా కురుస్తోంది వాన - అని ఉంటుంది ఏదో కథలో. అవును. ఈ వాన ఆదిమకాలం నుంచి, మానవుని రాక కోసం ఎదురు చూస్తూ, మానవుని ఆవిర్భావానికి ముందే సిద్ధమయ్యి, మానవునితో పాటు కలిసి ప్రయాణించడానికి కురుస్తూనే ఉంది.   -- ఉత్తమ తెలుగు వాన కథలు, మహమ్మద్ ఖదీర్ బాబు

వాఙ్మూలం

  సెప్టెంబర్ 13, 2024 వాఙ్మూలం    ( vaangmoolam )     అర్థము      (విశేష్యము ) : న్యాయస్థానంలో చెప్పే సాక్షం; మాట / వ్రాత పూర్వకమైన సాక్ష్యం    Meaning     (noun) : deposition; oral statement; testimony    వాడుక / Usage       17 ఆగస్ట్, 1909 న “సవాలు’’ అనే పేరుతో భారత విప్లవకారులు ఒక కరపత్రాన్ని విడుదల చేశారు. ఉరికంబం ఎక్కేముందు మదన్ లాల్ ఢింగ్రా చివరి వాఙ్మూలం ఇది.     On 17/8/1909 Indian revolutionaries released a pamphlet of the last testimony of Madan Lal Dhingra before he was hanged.     మెదడుకు మేత / Food for thought      గొప్పగా మాట్లాడేవారంతా గొప్ప వక్తలు కారు. అలాగే గొప్ప వక్తలంతా గొప్ప విషయాలను మాట్లా డనక్కరలేదు. రెండో నిజానికి గొప్ప ఉదాహరణ -మన రాజకీయ నాయకులు. మరో అనర్థమైన ఉదాహరణ హిట్లర్‌. జాతిని ఊపి ఉర్రూతలూగించి -తన దౌష్ట్యాన్ని అంత గొప్పగా సబబనిపించేలాగ మాట్లాడే వక్త బహు శా మానవ చరిత్రలో మరొకరు లేరేమో. మరి గొప్ప విషయాలను బొత్తిగా నేలబారుగా ...

అమీనా

  సెప్టెంబర్ 12, 2024 అమీనా    ( amīnā )     అర్థము      (విశేష్యము ) : అధికారి; తీర్పులను అమలు చేసేవాడు; కోర్టు ఉద్యోగి     Meaning     (noun) : officer of civil court; revenue officer    వాడుక / Usage       అమీనా ఇచ్చిన నోటీసు ఇంట్లో అల్లకల్లోలం రేపింది.     The notice served by the court clerk sent shock waves through the house.     మెదడుకు మేత / Food for thought      విద్యా వ్యాపారం ఒక విషవృక్షం. దీనికి మూలాలు ఎక్కడో ఎప్పుడో పడ్డాయి. ఈ తరంలో ఉపాధికీ, మంచి జీవనానికీ, సంపాదనకీ, కులాల వికాసానికీ, భాష సర్వ నాశనం కావడానికీ, అన్నిటికీ మించి చదువులు కార్పొరేట్‌ వ్యాపారం కావడానికీ -అన్నిటికీ పునాదులు ఏర్పడి తేలికగా నూటపాతిక సంవత్సరాలయింది. చరిత్ర గోత్రాలు సాహిత్యంలో దొరుకుతాయి. 1897లో ప్రచురితమయిన గురజాడ 'కన్యాశుల్కం' -ఈనాటి పరిణా మాలకు ప్రారంభ సూచికలని అందజేస్తుంది. గిరీశం వెంకటేశంతో కలిసి వాళ్ల ఊరు వచ్చినప్పుడు అగ్నిహోత్రా వధాన్లు భార్య వెంకమ్మ ''బాబూ -యే...

అర్జీ

  సెప్టెంబర్ 11, 2024 అర్జీ    ( arjī )     అర్థము      (విశేష్యము ) : ఒక విషయం గురించి విన్నవించుకుంటూ న్యాయం చేకూర్చమని పెట్టుకొనే  మనవి    Meaning     (noun) : a petition; representation    వాడుక / Usage       అర్జీల పరిశీలన నామమాత్రమే..?     Petition reviews only a tick box exercise?     మెదడుకు మేత / Food for thought      వృద్ధాప్యం ఒక మజిలీ. ప్రతీ వ్యక్తీ కోరుకు న్నా కోరుకోక పోయినా తప్పనిసరిగా చేరుకునే మజిలీ. వయస్సులోని కోరికలన్నింటికీ సెలవిచ్చి, అలసిపోయిన అనుభవాలనీ, ఆరిపోయిన అనుభూతులనూ నెమరువేసుకునే చలివేంద్రం. వృద్ధాప్యం ఒక అవకాశం. వెనక్కి తిరిగి చూసుకుని చేసిన తప్పిదాలకు నవ్వుకుని, దాటిన అడ్డంకులను పరామర్శించి, ఇక దాటనక్కరలేని స్థితికి వచ్చినందుకు ప్రశాంతంగా నిట్టూర్చే ఆటవిడుపు. -- గొల్లపూడి మారుతీ రావు (ఏప్రిల్ 14, 1939 - 2019)

ఫిర్యాదు

  సెప్టెంబర్ 10, 2024 ఫిర్యాదు    ( piryādu )     అర్థము      (విశేష్యము ) : విన్నపము; మోర; నేరము మోపుట        Meaning     (noun) : a complaint; a charge    వాడుక / Usage       కుట్ర కోణం ఉందా..? బ్యారేజీని బోట్లు ఢీకొట్టిన ఘటనపై ఇరిగేషన్ శాఖ ఫిర్యాదు .     Conspiracy angle? Irrigation department complains about boats damaging the barrage.     మెదడుకు మేత / Food for thought     ఏమైనా మానవుడు తెలివయిన వాడు. తాను దిగవలిసిన గోతిని తానే తవ్వుకున్నాడు. ఇది స్వయంకృతం. పేరాశతో తెచ్చిపెట్టుకున్న విపత్తు. కాలగమనాన్ని ఋతువులతో పలకరిస్తూ తరతరాలుగా మానవ కల్యాణానికి మన్నికయిన గొడుగును పట్టిన ప్రకృతి శక్తిని గుర్తించిన వారికి ఆనాడు - తల్లి. ఇప్పుడు నిశ్శబ్దంగా మీదపడి కబళించనున్న పెనుభూతం. -- గొల్లపూడి మారుతీ రావు (ఏప్రిల్ 14, 1939 - 2019)

దరఖాస్తు

  సెప్టెంబర్ 09, 2024 దరఖాస్తు    ( darakhastu )     అర్థము      (విశేష్యము ) : వినతి / అభ్యర్ధన / నివేదన చేస్తూ వ్రాతపూర్వకంగా ఇచ్చే పత్రం      Meaning     (noun) : application; petition    వాడుక / Usage       కాస్తందుకో, దరఖాస్తందుకో , ప్రేమ ధర కాస్తందుకో!     Come, accept this - petition (written on your lips); it is the dues of love.     మెదడుకు మేత / Food for thought      ఇంటిలోన పోరంటే ఇంటింట కాదయ్య అన్నాడు ఆ యొగి వేమనా      నాతరమా భవసాగరమీదను అన్నాడు కంచర్ల గోపన్న      పరమేశా గంగనిడుము పార్వతి చాలును      ఆ మాటలు విని ముంచకు స్వామి గంగను      ఇంతులిద్దరైనప్పుడు ఇంతేగతిలే      సవతుల సంగ్రామంలో పతులది వెనకడుగే      ఇంతులిద్దరైనప్పుడు ఇంతేగతిలే      సవతుల సంగ్రామంలో పతులది వెనకడుగే      ఇరువురు భామల కౌగిలిలిలో స్వామి ఇరుకునపడి నీవు నలిగి...

శూర్పకర్ణుడు

  సెప్టెంబర్ 06, 2024 శూర్పకర్ణుడు    ( ṣūrpa-karn udu )     అర్థము      (విశేష్యము ) : శూర్ప=చేట, రెండు ముంతల కొలత; కర్ణ=చెవి; చేట చెవులవాడు; వినాయకుడు      Meaning     (noun) : large ear-ed man; Ganesha     వాడుక / Usage       చేట గింజల నుంచుకొని పొట్టును చెరిగి వేసినట్లు, అన్నీ విన్నా చెడుని వదిలి మంచినే ఉంచుకునేవాడు శూర్పకర్ణుడు .     Just as a winnow sifts husk from grain, one who despite hearing everything ignores the bad and retains the good is called Shoorpakarna.     మెదడుకు మేత / Food for thought      నిజానికి అక్షరాలంటే ...      నా బతుకు ... నా మెతుకు....      నా మొదలు... నా తుది ..      అవి కలసికట్టుగా మహా కావ్యాలనే విరచించాయి కదా ...      అక్షరాలు ఏకతా సూత్రాన్నే వల్లె వేస్తాయి ...      అవున్నిజం ...      రాజమహేంద్రి గోదారి నీట్లో తలారా స్నానించిన ...

గురుపుంగవుడు

  సెప్టెంబర్ 05, 2024 గురుపుంగవుడు    ( guru-pum-gavudu )     అర్థము      (విశేష్యము ) : పుం-గవుడు = ఎద్దు వలే శ్రేష్ఠమైనవాడు; ఉపాధ్యాయులలో ఉత్తముడు      Meaning     (noun) : best among teachers    వాడుక / Usage      మనను తీర్చిదిద్దిన ఎందరో గురుపుంగవులకు పాదాభివందనము .     Salutations to all the great teachers who moulded us.     మెదడుకు మేత / Food for thought      పగటిచుక్క      వాడికోరల నోరు తెరచిన      వన్యమృగమును పోలు చీకటి      మనిషిమీదకి దుముకుచున్నది      మధ్యాహ్నవేళ!      పగలుమాసిన ఇరులమూకను      పట్టి చీల్చగ పొడిచె నింగిని      పదను పట్టిన కత్తిమాదిరి      పగటిచుక్క      పట్టపగలే కారుచీకటి      ముట్టడిస్తే మూగవోయిన      పెద్దలంతా చుక్కపొడుపుకి      బొబ్బలు పెట్టిరి  ...

హయగ్రీవుడు

  సెప్టెంబర్ 04, 2024 హయగ్రీవుడు    ( haya-grivuḍu )     అర్థము      (విశేష్యము ) : హయ ( గుర్రం ) గ్రీవ (మెడ);   గుర్రం మొహం కలవాడు; విష్ణువు అవతారం      Meaning     (noun) : horse head and human body; Vishnu's avatara    వాడుక / Usage      మధుకైటభులు నుంచి వేదములను కాపాడి    హయగ్రీవుడు బ్రహ్మకి ఇచ్చెను .     Hayagreeva rescued Vedas from the demons Madhu & Kaitabha.     మెదడుకు మేత / Food for thought      మనసు తెలుపని భాష      మంచి పెంచని భాష      ఉత్త సంద్రపు ఘోష       ఓ కూనలమ్మ      తాగుచుండే బుడ్డి      తరుగుచుండే కొద్ది      మెదడు మేయును గడ్డి      ఓ కూనలమ్మ     -- ఆరుద్ర (ఆగష్టు 31, 1925 - 1998)

హృషీకేశుడు

  సెప్టెంబర్ 03, 2024 హృషీకేశుడు    ( hrishīk-ēṣuḍu )     అర్థము      (విశేష్యము ) : హృషీక  (ఇంద్రియము )  + ఈశుడు; ఇంద్రియములను  జయించినవాడు; విష్ణువు; కృష్ణుడు      Meaning     (noun) : one who has conquered senses; Vishnu; Krishna    వాడుక / Usage       హృషీకేశుడు పాంచజన్యమనే తనయొక్క శంఖాన్ని పూరించాడు .     Krishna blew his conch called Panchajanya.     మెదడుకు మేత / Food for thought      తావత్సత్యం జగద్భాతి శుక్తికా రజతం యథా     యావన్న జ్ఞాయతే బ్రహ్మ సర్వాధిష్ఠాన మద్వయం      ( సర్వసృష్టికి ఆధారమైన ఏకైక పర బ్రహ్మ స్వరూపం ఎంతవరకు తెలియకుండా ఉంటుందో అంతవరకు, ముత్యపు చిప్ప వెండి అనిపించినట్లు,  ప్రపంచం  సత్యమైందిగా ప్రకాశిస్తుంది. )     -- ఆత్మబోధ , శ్రీ ఆది శంకరాచార్యులు

గుడాకేశడు

  సెప్టెంబర్ 02, 2024 గుడాకేశడు    ( gudaakesudu )     అర్థము      (విశేష్యము ) : గుడాక+ఈశుడు; గుడాక (నిద్ర ) ను జయించినవాడు; అర్జునుడు;  శివుడు      Meaning     (noun) : one who has conquered sleep; Arjuna; Shiva    వాడుక / Usage       గుడాకేశుడు , ‘గోవిందా, నేను యుద్ధం చేయను’ అంటూ మౌనముగా ఉండిపోయాడు .     Arjuna said, "Govinda, I will not fight", and stayed silent.     మెదడుకు మేత / Food for thought      అజ్ఞాన కలుషం జీవం  జ్ఞానాభ్యాసాత్‌ వినిర్మలం      కృత్వా జ్ఞానం స్వయం నశ్యేత్‌  జలం కతకరేణువత్‌     ( చిల్లగింజపొడి మురికి నీటిని పరిశుభ్రం చేసి నీటిలోనే కలిసిపోతూ ఉన్నట్లుగా అజ్ఞానం చేత కలుషితమైన జీవుని జ్ఞానాభ్యాసం అనేటటువంటిది బాగా పరిశుద్ధునిగా చేసి గురువు ఇచ్చిన జ్ఞానం అనేది తనంతట తానుగానే లీనమైపోతూ ఉంది)     -- ఆత్మబోధ , శ్రీ ఆది శంకరాచార్యులు